29, మే 2024, బుధవారం

భారతీయ సంస్కృతీ

 పుట్టుకతో ఆంగ్లేయురాలైనా, నలుగురు పిల్లల తల్లి అయి ఉండి, చంకలో ఉన్న  అల్లరి చేస్తున్న  కూతురుని ముద్దుగా, సహనంతో సముదాయిస్తూ, ఎక్కడ విసుగు, చిరాకు, కోపం లేకుండా చక్కగా, అందంగా నవ్వుతూ, తన భావాలను చాలా సున్నితంగా, హిందీలో అలవోకగా చెప్తూ, part time సంస్కృతం నేర్పుతున్నానని చెపుతుంటే, అసలు ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుందీ, అంతేగాక బోధించే స్థాయికి ఎలా ఎదిగిందీ అంతా అద్భుతమే....అయినా చాలా సాదాసీదాగా మామూలు భారతీయ గృహిణిలా  వ్యవహరిస్తున్న తీరు అమోఘం....భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను తనవిగా చేసుకుని ఆచరిస్తున్న స్త్రీమూర్తి ఎందరికో స్ఫూర్తి...🙏

ఇలాంటి సంప్రదాయాన్ని జాతి,కుల,మత భేదం లేకుండా అందరూ పాటించేలా చేసినా iskcon సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదుల వారికి కృతజ్ఞతలు🙇‍♀️🙇‍♀️🙇‍♀️



కామెంట్‌లు లేవు: