3, జనవరి 2026, శనివారం

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత:పదునెనిమిదవ అధ్యాయము

మోక్షసన్న్యాసయోగం:శ్రీ భగవానువాచ


మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి 

అథ చేత్ త్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి (58)


యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే 

మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి (59)


అర్జునా.. నామీద మనసు నిలిపితే నా అనుగ్రహంవల్ల సంసారసంబంధమైన ప్రతిఒక్క ప్రతిబంధకాన్నీ అతిక్రమిస్తావు. అలాకాకుండా అహంకారంతో నా ఉపదేశాన్ని పెడచెవిని పెడితే చెడిపోతావు. అహంకారంవల్ల యుద్ధం చేయకూడదని నీవు భావించినా ఆ ప్రయత్నం ఫలించదు. ఎందువల్లనంటే నీ స్వభావమే నీ చేత యుద్ధం చేయించి తీరుతుంది.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన

  🚩🚩 #శృంగార_నైషధం_శ్రీనాథుని_అద్భుత_రచన!!


#శ్రీనాథుడు అంటేనే తెలుగు సాహిత్యంలో ఒక అధ్యాయం.

ఆయన రచించిన శృంగార నైషధం అనే కావ్యం తెలుగు సాహిత్యానికి ఒక అపురమైన ఆభరణం. శ్రీహర్షుని సంస్కృత నైషధీయ చరిత్రను ఆధారంగా చేసుకుని శ్రీనాథుడు రచించిన ఈ కావ్యం, #నల_దమయంతిల ప్రేమ కథను అద్భుతంగా వర్ణించింది.


#శృంగార_నైషధం_ఎందుకు_ప్రత్యేకం?


#శృంగార_రసానికి_అద్దం:

శృంగార నైషధం అనే పేరును బట్టి తెలుస్తుంది, ఈ కావ్యం ప్రధానంగా శృంగార రసాన్ని చిత్రిస్తుంది. నల-దమయంతిల మధ్య ప్రేమ, విరహం, మళ్ళీ కలయిక వంటి భావాలను కవి అద్భుతంగా వర్ణించాడు.


#భాషా_సౌందర్యం:

శ్రీనాథుడు తెలుగు భాషకు చేసిన సేవ అంతా ఇందులో కనిపిస్తుంది. అతను తెలుగు భాషను ఎంత అందంగా, వైవిధ్యంగా వాడాడో ఈ కావ్యంలో చూడవచ్చు.


#వర్ణనల_అద్భుతం:

ప్రకృతి వర్ణనలు, నాయక-నాయికల అందాల వర్ణనలు, భావోద్వేగాల వర్ణనలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి.


#సంస్కృతం_తెలుగు_సంయోగం:

సంస్కృత పదాలను తెలుగులో అద్భుతంగా విలీనం చేసి ఒక అద్భుతమైన భాషా శైలిని సృష్టించాడు శ్రీనాథుడు.


#కథాంశం

నల-దమయంతిల ప్రేమ కథ మనకు తెలిసినదే. శ్రీనాథుడు ఈ కథను తనదైన శైలిలో మరింత అందంగా వర్ణించాడు. వారి ప్రేమ, విరహం, పరీక్షలు, మళ్ళీ కలయిక వంటి అన్ని అంశాలను కవి అద్భుతంగా చిత్రించాడు.


#శృంగారనైషధం_యొక్క_ప్రాముఖ్యత


#తెలుగు_సాహిత్య_చరిత్రలో_స్థానం:

శృంగార నైషధం తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మారుపు తీసుకువచ్చింది. శ్రీనాథుడు తర్వాత వచ్చిన కవులందరికీ ఒక ఆదర్శంగా నిలిచాడు.


#సాంస్కృతిక_ప్రాధాన్యత:

ఈ కావ్యం తెలుగు సంస్కృతి, ఆచారాలను ప్రతిబింబిస్తుంది.


#ప్రజాదరణ:

నేటికీ శృంగార నైషధం ప్రజలలో చాలా ప్రాచుర్యంలో ఉంది.


#కొన్ని_శ్రీనాథుని_కావ్యంలోనిపద్యాలు


నలచక్రవర్తి ఉపవన విహారానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గొప్ప సరస్సును చూచాడు. ఆ సరస్సు సమీపంలోనే నిద్రిస్తున్న ఒక అందమైన హంసను నలమహారాజు మెల్లమెల్లగా వంగి వంగి నడుస్తూ వామనుని వలె చప్పుడు కాకుండ పోయి తన రెండుచేతులతో పట్టుకున్నాడు. నిషధరాజు చేత పట్టుబడి మేల్కొన్న ఆ బంగారుహంస కంచుగీసినట్లుగా అరుస్తూ ఎగరడానికి ప్రయత్నిస్తూ మానవ భాషలో ఆ రాజుతో ఇలా పలికింది.


#ఱెక్కలకొనలం_గలిగిన

యిక్కాంచన మాసపడియెదే నృపనీకే

యక్కఱ దీనం దీరెడు

నక్కట! నీహారలేశమబ్ధికి బోలెన్.


ఓ రాజా! నా ఱెక్కల కొసలందున్న బంగారానికి ఆశపడుతున్నావా? దీనివల్ల నీకు ఏ అవసరం తీరుతుంది. సముద్రానికి మంచుచుక్క వలె ఈ స్వల్పమైన బంగారం నీకెందుకూ పనికిరాదు. అంతేకాదు నీవు నాకు సమీపంలోనే తిరుగుతున్నావని తెలియదు. తెలిస్తే ఇంత ఏమరపాటుగా ఉండేదాన్ని కాదు. నీవు లోకంలో అందరిచేత గౌరవింపబడేవాడవనీ ఈ దేశంలో ఎవరికీ ఆపద కలుగనీయవనీ నీయందు నమ్మకంతో ఇలా నిద్రించాను. గొప్పవారు తనను నమ్మినవారిని శత్రువైననూ నాశనం చేయడానికి ప్రయత్నించరు కదా! అని కింది విధంగా తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.


#ఎఱుగనె_నీవుప్రాంతమున

నింతటనంతట నున్కియింత యే

మఱదునె నిన్ను విశ్వజన మాన్యుడవంచును విశ్వసించి యి

త్తఱి సుఖనిద్ర బొందితి వృథామతి నెట్టన యాత్మ నమ్మినం

జెఱుపదలంతురే ఘనులు చిత్తమునం బగవారి నేనియున్.


అయినా నీకు హింస చేయడమే వేడుక అనుకుంటే దయ చూపదగిన ఈ సరోవర హంసను చంపడానికి ప్రయత్నించడమెందుకు? భుజగర్వం చేత అతి సాహసకృత్యాలు చేస్తూ మిక్కిలి మదించి యున్న శత్రురాజులు ఎంతోమంది ఉన్నారు కదా! వారిని చంపరాదా? ఫలపుష్ప కందమూలాదులు తింటూ నీటిలో మునులవలె తపస్సు చేసుకుంటున్న మామీద దండనీతిని ప్రయోగించడం నీకు తగునా? అంటూ నల చక్రవర్తికి తనపై జాలి కలిగే విధంగా మాట్లాడింది.


#హింసయు_నీకు_వేడ్కయగు

నేని కృపాశ్రయమైన యీసరో

హంసము జంపనేల కఱవా తరవాత వసుంధరాధిపో

త్తంస! విజృంభమాణ భుజదర్పనిరంకుశ సాహసక్రియా

మాంసలచి త్తవృత్తులయి మ త్తిలియుండు నరాతిభూపతుల్.


తనను రక్షంచి వదిలిపెట్టమని ఎంతో దయనీయంగా వేడుకున్న తీరుని ఈ కింది పద్యంలో శ్రీనాథుడు వర్ణించన తీరు సందర్భోచితంగా ఉంటుంది.


#తల్లి_మదేకపుత్త్రక

పెద్ద కన్నులు

గాన దిప్పుడు మూడు కాళ్లముసలి

యిల్లాలు గడుసాధ్వి యేమియు నెఱుగదు

పరమపాతివ్రత్య భవ్యచరిత

వెనుకముందర లేదు నెనరైనచుట్టంబు

లేవడి యెంతేని జీవనంబు

గానక కన్న సంతానంబు శిశువులు

జీవనస్థితి కేన తావలంబు

కృప దలంపగదయ్య యో నృపవరేణ్య

యభయ మీవయ్య యో తుహినాంశువంశ

కావ గదవయ్య యర్థార్థి కల్పశాఖి

నిగ్రహింపకు మయ్య యో నిషధరాజ.


నా తల్లికి నేనొక్కడనే కొడుకునని, ఆమె చూపు కూడా లేని మూడు కాళ్ళ ముసలితల్లి అనీ, నా ఇల్లాలు అమాయకురాలు, ఉత్తమురాలనీ, ముఖ్యంగా ఏమి తెలియని అమాయకురాలు, పరమపతివ్రత, ప్రశస్తమైన చరిత్ర కలిగిందనీ, నాకు వెనక ముందు దయగల చుట్టం లేదు. పేదరికమే నా జీవనం. లేకలేక కలిగిన సంతానం. వారు పసిపిల్లలు. వారికి జీవనాధారం నేనే. కనుక దయదలచి నాకు అభయం ఇచ్చి కాపాడు. కోరిన వారికి కల్పవృక్షంవంటివాడా! చంద్రవంశీయుడవైన ఓ నిషధ రాజా నన్ను చంపవద్దని ఆ హంస చేత శ్రీనాథుడు ఎంత స్వభావసిద్ధంగా దయనీయంగా చెప్పించాడో చూడండి. అలతి పదాలూ, చక్కని వాడుక పలుకుబడులు, తెలుగు జాతీయలూ, వీటన్నిటితో పద్యం ఎంత కాంతివంతంగా ఉందో చూడండి. పైగా సీస పద్యం శ్రీనాథునికి ప్రత్యేకమైనది కూడా.


       🌺🌺🌺#సర్వంశివసంకల్పం🌺🌺🌺

జీవితం ఒక ప్రయాణం

  *నేటి సూక్తి* 


*జీవితం ఒక ప్రయాణంలాంటిది… వేగం కాదు, దిశ ముఖ్యము. ఎన్ని మలుపులు వచ్చినా మన విలువలు వదలకుండా, నమ్మకంతో ముందుకు సాగితే గమ్యం తానే దగ్గరవుతుంది.ఈ కొత్తసంవత్సరం మన జీవితప్రయాణానికిస్పష్టమైన దిశను ఇవ్వాలి*

 💐✨


*క్రాంతి కిరణాలు* 


*కం. రమ్యంబగు జీవితమును*

*సౌమ్యముగా నడుచుకొనుము సంతోషంతో* 

*కామ్యార్థము తీర్చుకొనుచు*

*గమ్యంబును చేరుకొనుము కష్టంబైనన్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

*అతి పెద్ద సంక్షోభం

*అతి పెద్ద సంక్షోభం!* 


20 ఏళ్లకే పిల్లలు పెళ్లి చేసుకుంటే — 100 ఏళ్లలో 5 తరాలు

( ఒక వర్గం వారు ఫాలో అవుతున్నారు ☝️)


 25 ఏళ్లకే పెళ్లి అయితే 100 ఏళ్లలో 4 తరాలు --

 33 సంవత్సరాల వయసులో పెళ్లి అంటే 100 ఏళ్లలో 3 తరాలు --

( హిందువులు ఫాలో అవుతున్నారు) 

☹️☹️☹️☹️☹️☹️☹️☹️☹️


సాధారణ గణన చూస్తే, హిందూ సమాజ జనాభా వృద్ధి ఏ దిశలో సాగుతోందో తెలుస్తోంది.




ఇది ఆలోచించాల్సిన నిజం, ఇదే నిజం.

మన సమాజం మరో శతాబ్దం కూడా నిలవదా?


 *హిందూ సమాజం లోతుగా ఆత్మపరిశీలన చేయాల్సిన సమయం వచ్చింది* 

ఈ రోజు ఒక విచిత్రమైన చీకటి అన్ని వైపులా వ్యాపించింది.

 గ్రామాలు వెలవెలబోతున్నాయి, పల్లెలు ఖాళీ అవుతున్నాయి, ఇళ్లు నిశ్శబ్దంగా మారుతున్నాయి.

అమ్మాయిలు 30–35 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడం లేదు.

అబ్బాయిలు 35 దాటినా పెళ్లి కాలేదు.

పెళ్లి చాలా ఆలస్యంగా జరుగుతోంది…

ఒక్క పిల్లవాడే పుడుతున్నాడు…

తర్వాత విడాకులు… విడిపోయిన కుటుంబాలు…

తల్లిదండ్రులు ఒంటరిగా…

మరొక తరం పూర్తిగా బలహీనపడుతోంది.

ఇలా ఉంటే దీన్ని “విద్యావంతమైన సమాజం” అని చెప్పాలా?

లేక “ఆత్మహత్య చేసుకుంటున్న సమాజం” అని చెప్పాలా?

 జనాభా తగ్గించడానికి నిశ్శబ్ద కుట్ర?

ఉదాహరణకు 100 మంది అంటే 50 దాంపత్యజంటలు.

ప్రతి జంట ఒక్క పిల్లవాడు మాత్రమే పెంచితే

తరవాత తరంలో 45–46 మంది మాత్రమే మిగులుతారు.

ఇదే విధానం కొనసాగితే, మూడో తరానికి సమాజం దాదాపు కనుమరుగవుతుంది.

ఇది భయం కాదు — ఇది గణితం.


ఇది ఇప్పటికే పలు ప్రదేశాల్లో జరిగింది!

గ్రామాలు ఖాళీ అయ్యాయి,

పట్టణాల్లో ఉన్న ఎత్తైన భవనాలు ఉన్నా, సంయుక్త కుటుంబాలు మాత్రం లేవు.


❗కొత్త కోడళ్లు ఎందుకు “ఒక్కడే పిల్లవాడు” అని అంటున్నారు?

• జీవితం “ఎంజాయ్” చేయడానికి

• కెరీర్ దెబ్బతినకూడదనడానికి

• శరీరం మారిపోతుందనే భయంతో

• సమాజంలో “మోడెర్న్” అని కనిపించడానికి

ఇది మతమా?

ఇది మన సంస్కృతినా?

ఇది మన పూర్వీకుల సంప్రదాయమా?

 నిజం ఏమిటంటే…

ఇప్పుడే పిల్లలు ప్రేమ ఫలితంగా పుట్టడం కాదు,

“మనకూ ఒక పిల్లాడు ఉన్నాడు చూడండి…” అనే సామాజిక ప్రదర్శనగా మారిపోయింది.

ఈ ఆలోచన మతవిరుద్ధమే కాక భవిష్యత్ లేనిది కూడా.


 అతి పెద్ద తప్పు — అమ్మాయి తండ్రిదే!

ఎప్పుడో తన కుమార్తెను 22–25 ఏళ్లకే పెళ్లి చేసి కుటుంబం ఏర్పాటు చేసిన తండ్రి,

ఇప్పుడు అదే కుమార్తెను 30 ఏళ్ల వరకు “ప్రిన్సెస్” లాగా ఉంచేస్తున్నాడు.

కొన్నిసార్లు కెరీర్ పేరిట,

కొన్నిసార్లు “మంచి అబ్బాయి దొరకలేదు” అని,

మరికొన్నిసార్లు కట్నం–ప్రతిష్ట భయంతో.

ఫలితం — అమ్మాయిలలో డిప్రెషన్, IVF, విడాకులు పెరుగుతున్నాయి.

మరియు సమాజం — మెల్లగా కూలిపోతోంది.

 హిందూ సమాజం యొక్క భయంకర వాస్తవ చిత్రం

• అబ్బాయిల సగటు పెళ్లి వయసు — 32

• అమ్మాయిల సగటు — 29

• ప్రతి జంటకు పిల్లలు — 1 లేదా 0.5

• ప్రతి 4 జంటల్లో 1 జంట — సంతాన సమస్యలతో

• విడాకుల రేటు — వేగంగా పెరుగుతోంది

• వేలాది యువకులు–యువతులు — పెళ్లి వయసులో ఉన్నా పెళ్లి కాలేదు

 సమాజంలోని “తెలివైన వారు” ఏమి చేస్తున్నారు?

నిశ్శబ్దం.

పెళ్లి, కుటుంబం, పిల్లలు — ఇవన్నీ త్యజించాల్సిన విషయాల్లా భావిస్తున్నారు.

కానీ ఇది మతం కాదు — ఇది పారిపోవడం.

 పెళ్లి అనేది ప్రపంచ బంధం కాదు — అది ధర్మ స్తంభం,

వంశ పరంపర, సంస్కృతి కొనసాగింపుకు మార్గం.

 స్వీయ అవగాహనకు సమయం

కుమార్తెను “ప్రిన్సెస్” చేస్తూ

ఆమె సహజ జీవితాన్ని తీసేశారు.

కుమారుడిని బాధ్యతల నుండి విముక్తి చేశారు.

పెళ్లి వాయిదా వేస్తూ వేస్తూ,

చివరికి ఆలస్యంగా చేసుకున్నారు.

ఒక్క పిల్లవాడు —

మళ్లీ అదే ఒంటరితనం, అదే విభజన.


👨‍👩‍👧‍👦 ఇప్పుడు ఏమి చేయాలి?

 కుమారుడు 22 తర్వాత, కుమార్తె 20 తర్వాత — పెళ్లి ప్రాధాన్యం ఇవ్వాలి.

 ఒక్క పిల్లవాడు కాదు — కనీసం ముగ్గురు పిల్లలు — సమాజానికి అవసరం.

 సమాజ పెద్దలు, సంతులు, పండితులు — ఈ విషయాలను బహిరంగంగా చెప్పాలి.

 అమ్మాయి తండ్రి — కుమార్తె వయస్సు, భావాలు, భవిష్యత్తు అర్థం చేసుకోవాలి.

 ఆశలు తగ్గించాలి, అర్థం పెంచాలి — కుమార్తె జీవితాన్ని రక్షించాలి.


చివరి హెచ్చరిక

ఇప్పుడే మేలుకోకపోతే 

యువకులు ఉండరు, యువతులు ఉండరు

 పిల్లలు ఉండరు, సంస్కృతి ఉండదు

సమాజం ఉండదు, దేవాలయాలు ఉండవు

అప్పుడు చరిత్ర ఇలా రాసుకుంటుంది —

హిందూ సమాజం — నిశ్శబ్దంగా తాను తానే నాశనం చేసుకున్న సమాజం.


 *ఆలోచించండి*

శ్రీల ప్రభుపాద ఉవాచ!

  శ్రీల ప్రభుపాద ఉవాచ!

🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿

భౌతిక శరీరం ఉన్నంత కాలం, ఆహారం, నిద్ర, రక్షణ మరియు సంభోగం వంటి శరీర అవసరాలను తీర్చాలి. 

కానీ స్వచ్ఛమైన భక్తి-యోగంలో లేదా కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తి, శరీరం యొక్క అవసరాలను తీర్చేటప్పుడు ఇంద్రియాలను ప్రేరేపించడు. 


బదులుగా, అతను జీవితంలోని కనీస అవసరాలను అంగీకరిస్తాడు, చెడు బేరాన్ని ఉత్తమంగా ఉపయోగించుకుంటాడు మరియు కృష్ణ చైతన్యంలో అతీంద్రియ ఆనందాన్ని అనుభవిస్తాడు. 

అతను ప్రమాదాలు, వ్యాధి, కొరత మరియు అత్యంత ప్రియమైన బంధువు మరణం వంటి యాదృచ్ఛిక సంఘటనల పట్ల నిర్లక్ష్యంగా ఉంటాడు - కానీ అతను కృష్ణ చైతన్యం లేదా భక్తి-యోగంలో తన విధులను నిర్వర్తించడానికి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటాడు. 


ప్రమాదాలు అతనిని తన కర్తవ్యం నుండి ఎన్నడూ తప్పుకోనివ్వవు. 

భగవద్గీత (2.14)లో చెప్పబడినట్లుగా, ఆగమపాయినో 'నిత్యాస్ తాంస్ తితిక్షస్వ భారత. 

ఇలాంటి యాదృచ్ఛిక సంఘటనలన్నిటినీ భరిస్తూనే ఉంటాడు, ఎందుకంటే అవి వచ్చి పోతాయని మరియు తన విధులను ప్రభావితం చేయవని అతనికి తెలుసు. 

ఈ విధంగా అతను యోగాభ్యాసంలో అత్యున్నత పరిపూర్ణతను సాధిస్తాడు.


(భగవద్గీత అధ్యాయం.6

వచనం.20-23)


హరే కృష్ణ 

ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషి

నేటి సూక్తి*

 *నేటి సూక్తి*


*ఎంత బాధ పడితే అంత బలపడతారు అవమానాల నుంచే అద్భుతాలు పుట్టుకొస్తాయి*


 *క్రాంతి కిరణాలు* 


*కం. తలవని బాధలు మదిలో* 

*బలమై పోయి నవమాన బాధలు‌ పడినన్*

*కలవైనను చింతించకు*

*తెలియక నద్భుతము జరుగు తేలికగానే*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

చ‌లికాలంలో డ్రై ఫ్రూట్స్‌*

  31f8;

🍀🌺🍀🌺🍀🩺🍀🌺🍀🌺🍀🍇M.A.151.

*మన ఆరోగ్యం…!



        *చ‌లికాలంలో డ్రై ఫ్రూట్స్‌*

               ➖➖➖✍️



*చ‌లికాలంలో డ్రై ఫ్రూట్స్‌ను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.* 


*వీటిని అన్నీ క‌లిపి రోజుకు గుప్పెడు మోతాదులో తినాలి.*


*రోజూ సాయంత్రం స‌మ‌యంలో స్నాక్స్‌కు బ‌దులుగా గుప్పెడు డ్రై ఫ్రూట్స్‌ను తినాలి. దీంతో శ‌రీరం వెచ్చ‌గా ఉంటుంది.* 



*డ్రై ఫ్రూట్స్ విష‌యానికి వ‌స్తే ముందుగా చెప్పుకోద‌గిన‌వి వాల్‌న‌ట్స్‌.*

*ఇవి మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అనేక వ్యాధుల‌ను న‌యం చేస్తాయి. క్యాన్స‌ర్‌, స్థూలకాయం, డ‌యాబెటిస్‌, అధిక బ‌రువు వంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పురుషుల్లో వ‌చ్చే శృంగార స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అలాగే అనేక జీవ‌న‌శైలి వ్యాధులు రాకుండా చూస్తాయి. పోష‌కాల‌ను అందిస్తాయి. దీంతో కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. చ‌ర్మం, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి. క‌నుక రోజూ ఐదారు వాల్‌న‌ట్స్‌ను తినాలి.*



*ఇక చ‌లికాలంలో స‌హ‌జంగానే చాలా మందికి చ‌ర్మం పొడిగా మారుతుంది.*


*శిరోజాలు, గోర్లు బ‌ల‌హీనంగా మారి విరిగిపోతాయి. అంద‌విహీనంగా క‌నిపిస్తాయి.*


*అలాంటి వారు రోజూ గుప్పెడు న‌ల్ల కిస్మిస్‌ల‌ను తినాలి. వీటిల్లో ఉండే విట‌మిన్ సి జుట్టును, చ‌ర్మాన్ని, గోళ్ల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి సీజ‌న‌ల్ వ్యాధుల‌ను రాకుండా చూస్తుంది.* 


*ఇక చలికాలంలో తిన‌ద‌గిన ఆహారాల్లో జీడిప‌ప్పు కూడా ఒక‌టి.*

*వీటిల్లో అధిక మోతాదులో పాలీ అన్‌శాచురేటెడ్‌, మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి.*

*ఇవి ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. ఇవి మ‌న శ‌రీరాన్ని వెచ్చ‌గా ఉంచుతాయి.*

*అలాగే జీడిప‌ప్పులో ఉండే మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.*


*దీంతో చ‌లికాలంలో హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చే ముప్పు త‌గ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.*



*చ‌లికాలంలో బాదంప‌ప్పును తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి గ‌ణ‌నీయంగా పెరుగుతుంది.*


*ఇది జీర్ణ వ్య‌వ‌స్థ‌ను బ‌ల‌ప‌రుస్తుంది.*

*చ‌లికాలంలో మ‌న జీర్ణ‌శ‌క్తి త‌గ్గి మ‌ల‌బ‌ద్ద‌కం వ‌స్తుంది. క‌నుక బాదంప‌ప్పును తింటే ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.*

*దీంతోపాటు శ‌రీరం వెచ్చ‌గా కూడా ఉంటుంది.*



*అలాగే పిస్తా ప‌ప్పు కూడా మ‌న‌కు ఈ సీజ‌న్‌లో అనేక లాభాల‌ను అందిస్తుంది.*


*వీటిల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. దీంతోపాటు బ‌రువును త‌గ్గిస్తాయి. జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డేస్తాయి.*


*క‌నుక ఈ సీజ‌న్‌లో డ్రై ఫ్రూట్స్‌, న‌ట్స్‌ను తిన‌డం అల‌వాటు చేసుకోండి.*


*రోజూ గుప్పెడు తిన్నా చాలు.. అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.*✍️-సేకరణ. ఇవి..

గ్రూప్ సభ్యుల అవగాహన కోసం మాత్రమే!  మీ డాక్టర్ కు ప్రత్యామ్నాయం కాదు.🙏

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏```

🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇతరుల పనికై

🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *స్వమర్థం యః పరిత్యజ్య* 

           *పరార్థ మనుతిష్ఠతి* 

           *మిథ్యాచరతి మిత్రార్థే* 

           *యశ్చ మూఢః స ఉచ్యతే* 


తా𝕝𝕝 *తన పని మానుకుని ఇతరుల పనికై తిరుగువాడు* 

*అలాగే మిత్రుని కార్యమును పాడుచేయువాడు అవివేకి అంటారు....*

         

✍💐🌹🌸🙏

దేవుని పూజించుపతి(సతి)ని

 *2320*

*కం*

దేవుని పూజించుపతి(సతి)ని

జేవురమునగాంచు పడతి (మగని) జీవన సుఖముల్

దేవుని పూజాఫలమను

పావన సత్యమ్ము మరువ వలదిల సుజనా.

*భావం*:-- ఓ సుజనా! దేవునిపూజించే భర్త(భార్య) ను కన్నెర్ర చేసి చూసే(జేవురము/జేగురము = ఎర్రదనము,కాంచు= చూచు అంటే కన్నెర్రచేసి చూచు అనగా కోపగించుకునే) స్త్రీ(పురుషుని) యొక్క జీవన సౌఖ్యములన్నియూ ఆ దేవుని పూజించడం వలన లభించిన ఫలములే అనే పవిత్రమైన సత్యాన్ని మరువవద్దు.

*సందేశం*:-- కొన్నిచోట్ల భర్త దైవభక్తి భార్యకు, మరి కొన్ని చోట్ల భార్య దైవభక్తి భర్త కు నచ్చడం లేదు, కానీ వారి సౌఖ్యములు దైవభక్తి వలన దైవానుగ్రహం చేత మాత్రమే లభిస్తున్నాయనే సత్యం మరచిపోతుంటారు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

ಸುಭಾಷಿತ . ೩೦೦ .

  ಸುಭಾಷಿತ . ೩೦೦ .


ಯಜ್ಜೀವ್ಯತೇ ಕ್ಷಣಮಪಿ ಪ್ರಥಿತಂ ಮನುಷ್ಯೈಃ ವಿಜ್ಞಾನಶೌರ್ಯವಿಭವಾರ್ಯಗುಣೈಃ ಸಮೇತಂ | ತನ್ನಾಮ ಜೀವಿತಮಿಹ ಪ್ರವದಂತಿ ತಜ್ಞಾಃ ಕಾಕೋಪಿ ಜೀವತಿ ಚಿರಾಯ ಬಲಿಂ ಚ ಭುಂಕ್ತೇ || 


ಜ್ಞಾನ , ಪರಾಕ್ರಮ , ವೈಭವ ಮೊದಲಾದ ಸದ್ಗುಣಗಳಿಂಧ ಕೂಡಿ ಮನುಷ್ಯರು ಪ್ರಖ್ಯಾತರಾಗಿ ಒಂದು ಕ್ಷಣ ಬದುಕಿದರೂ ಅದು ನಿಜವಾದ ಜೀವನ ಎಂದು ತಿಳಿದವರು ಹೇಳುತ್ತಾರೆ . ಕಾಗೆಯೂ ಸಹ ಬಹಳ ಕಾಲ ಬದುಕಿರುತ್ತೆ : ಇತರರು ಇಟ್ಟ ಅನ್ನವನ್ನು ತಿನ್ನುತ್ತದೆ .


ಪಂಚತಂತ್ರ .


ಆಂಗ್ಲ ನೂತನ ಸಂವತ್ಸರದ ಶುಭಾಶಯಗಳು .

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*608 వ రోజు*

అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము

గరుత్మంతుడు కశ్యపుడు


నేను నా తండ్రి కశ్యపుడి వద్దకు వెళ్ళి ఈ విషయం తెలియజేయగా నా తండ్రి నాతో " కుమారా ఆమహానుభావుడెవరో కాదు అతడే నారాయణుడు. నీ మీద కలిగిన దయవలన నీకు దర్శనమిచ్చాడు. నేను ఆయనను దర్శించవలెనన్న కోరికతో ఆయనను ఆరాధిస్తూ యోగసమాధిలో ఉండి తపమాచరించాను. ఆయన నాకు అనేక శరీరాలతో ఉన్న తన విశ్వరూపము చూపి " కశ్యపా ! నీలో ఇంకా కోరికలు చావలేదు. మనసులో కోరికలు పెట్టుకుని నన్ను చూడడం జరగని పని. నీ వు నిస్సంగుడవైనప్పుడు నన్ను దర్శించగలవు " అన్నాడు. అటువంటి దివ్యమూర్తికి సేవలు చేసే భాగ్యము లభించిన నీవు అదృష్టవంతుడవు నీ జన్మ ధన్యమైంది. నీవు వెంటనే బదరికాశ్రముకు వెళ్ళి అక్కడ ఆ దివ్యమూర్తిని సేవింపుము " అని చెప్పాడు. నేను వెంటనే బదరికాశ్రము వెళ్ళి అక్కడ అచ్యుతుడు, పుండరీకాక్షుడు, గోవిందుడు, లోకజనకుడు, నారాయణుడు అను దివ్యమూర్తిని దర్శించి అతడికి భక్తితో నమస్కరించాను. ఆ పీతాంబరధారి శంఖు చక్ర గదా ధారి అయి అష్ట భుజములతో ఉన్న నారాయణుడు " వచ్చావా ! మంచి పని చేసావు నా వెంట రా " అంటూ ఉత్తర దిక్కుకు వెళ్ళాడు.

గరుత్మంతుడు నారాయణుడిని వెంటవెళ్ళుట


నేను ఆయనను అనుసరిస్తూ ఎన్నో యోజనములు పయనించాను. అక్కడ ఏ విధమైన ఇంధనము లేకుండా మండుతున్న అగ్నిలో ఆ పీతాంబరధారి ప్రవేశించాడు. నేను ఆయనను అనుసరించాను. అక్కడ పార్వతీ సహితుడైన శివుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు వారిని దాటి వెళ్ళాడు. నేను ఆయనను అనుసరించాను క్రమంగా గాంఢాంధకారం అలుముకుంది నాకు ఏమీ కనిపించ లేదు. " ఈ దిక్కుకు రా " అన్న శబ్ధము వినిపించింది. నేను దిక్కు తోచక అటువై వెళ్ళాను. క్రమక్రమంగా చీకట్లు అంతరించి అక్కడ ప్రకాశవంతమైన వెలుగు ప్రసరించింది. అక్కడ సూర్యుడు పట్టపగలు మాదిరి ప్రకాశవంతంగా వెలుగుతున్నాడు. కమ్మని సంగీతము వినవస్తుంది. తామర కొలనులు ఉన్నాయి. అందమైన మగవారు ఆడవారు నారాయణ మూర్తిని పూజిస్తుండగా ఆయన అలా వెళుతుండగా నేను ఆయనను అనుసరించాను. నేను ఆ వెలుగును తట్టుకోలేక స్వామీ అని అరిచాను. ఆయన వాత్సల్యంతో " వినతాకుమారా ! నేను నిన్ను మరచిపోతానా ! నా వెంట రా ! నీవు నన్ను చూడలేదని బాధపడకు. మమతలు, అహంకారం మనసున రానీక నిశ్చల మనసుతో ఏకాగ్రచిత్తులైన వారు మాత్రమే నన్ను చూడగలరు. నీకు నా మీద కలిగిన భక్తిప్రత్తులు కారణంగా నీవు కేవలం నా స్థూల శరీరము మాత్రమే చూడగలుగుతున్నావు " అని స్వామి నాతో అన్నాడు. అప్పటికి అమితమైన వేడి తేజస్సు చల్లబడింది. నేని తిరిగి స్వామిని అనుసరించాను. నారాయణుడు ఆకాశానికి ఎగిరాడు నేను కూడా ఆయన వెంట ఎగిరాను. అక్కడ స్వామి అంతర్ధానం అయ్యాడు. ఇటురా ! అన్న శబ్దం వినిపించి నేను అటుగా వెళ్ళాను. అక్కడ తెల్లటి హంసలు విహరిస్తున్న తామర కొలను కనిపించింది. అక్కడ నారాయణుడు స్నానం చేస్తుండగా నేను ఆయన వద్దకు చేరబోయాను. ఆయన నాకు కనిపించ లేదు బదులుగా వెలుగుతున్న కొన్ని వందల అగ్నులు కనిపించి వేధ ఘోషలు వినవచ్చాయి. అప్పుడు కొన్ని వందల గరుడపక్షులు నన్ను చుట్టుముట్టగా నేను భయ భ్రాంతుడనయ్యాను. నేను అచ్యుతా, శివా, సహస్రాక్షా, వేదమయా, అనాది నిధనా, త్రిభువనైక నాధా, త్రినైనా, గోవిందా, పద్మనాభా, హరా, కృపా విధేయా అని పెద్దగా స్వామిని స్తోత్రం చేసాను. అప్పుడు స్వామి నా ఎదుట ప్రత్యక్షమై " వినతా పుత్రా ! భయపడకు " అని నా భుజం తట్టాడు. నేను కళ్ళు తెరిచి చూడగా బదరికాశ్రమంలో ఉన్నాను. అది చూసి ఆశ్చర్యచకితుడనై ఇదంతా విష్ణుమాయ అని తెలుసుకుని పులకించిపోయాను. అప్పుడు నాముందు ఎనిమిది భుజములతో ప్రత్యక్షమైన నారాయణుడిని చూసి స్వామి ముందు మోకరిల్లి " మహానుభావా ! నేను నీ పాదసేవకుడను అయితే, నేను నీ దయకు పాత్రుడనైతే, నేను వినడానికి అర్హుడనైతే నీ మహిమ నాకు తెలిసేలా చెప్పు " అని అడిగాను.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

⚜ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం

  🕉 మన గుడి : నెం 1345


⚜  తమిళనాడు : సింగిరికుడి - కడలూరు


⚜  శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం



💠 సింగిరికుడి క్షేత్రం నందు ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ ఆలయం ఉంది. మూడు పవిత్ర క్షేత్రాలలో సింగిరికుడి ఒకటి. 

మిగిలనవి పూవరసన్ కుప్పం మరియు పరిక్కల్ క్షేత్రం.  

ఈ ప్రాంతము వారు ఒకే రోజులో మూడు క్షేత్రాలు సందర్శించుట శుభకరంగా భావిస్తారు. 


🔆 స్ధలపురాణం


💠 ఇక్ష్వాకు వంశమునకు చెందిన నిమి చక్రవర్తి గొప్ప ధర్మాతుడు, సత్యవంతుడు, నీతిమంతుడు. అతడు అనేక యజ్ఞాలు నిర్వహించి, దేవతల నుండి అనేక వరాలను పొందాడు. 

మానవాళి క్షేమం కోసం పరాశక్తి యజ్ఞం చేయాలనుకున్నాడు.


💠 నిమి చక్రవర్తి, తన గురువైన వశిష్టుని వద్దకు వెళ్లి యజ్ఞం గురించి తెలియజేసి, యజ్ఞాన్ని నిర్వహించమని అభ్యర్థించాడు. 

అంతకు ముందే వశిష్టుడు స్వర్గములో ఇంద్రుడు నిర్వహించు యజ్ఞంలో పాల్గొనటకు వాగ్దానం చేసియున్నాడు. వశిష్టుడు ఈ విషయం  నిమి చక్రవర్తికి వివరించి, ఇంద్రుడు తలపెట్టిన యజ్ఞాన్ని ముగించి, తిరిగి వచ్చిన తర్వాత పరాశక్తి యజ్ఞం నిర్వహించుటకు హామీ ఇచ్చాడు. 


💠 వశిష్టుడు కోసం నిమి చక్రవర్తి వేచి ఉండకుండా, గౌతముడు, కౌశిక ఋషి మొదలగు వారి సహాయంతో యజ్ఞాన్ని ప్రారభించాడు. 

స్వర్గములో ఇంద్రుడు నిర్వహించిన యజ్ఞాన్ని పూర్తిచేసిన వశిష్టుడు తిరిగి నిమి చక్రవర్తి రాజ్యంకు వస్తాడు. 

యజ్ఞ కార్యాక్రమాలలో అలసిన రాజు విశ్రాంతి కోసం రాజభవనములో నిద్రించు చుంటాడు.


💠 రాజభవనంలోని కాపలాదారులు వశిష్టుని అడ్డుకొంటారు.

రక్షక భటులు చర్యతో కోపోద్రిక్తుడైన వశిష్టుడు,రాజును శపించాడు. మరణం పొంది, శరీరం లేకుండా ఆత్మతో వాతావరణంలో సంచరించమని శపించాడు. 

నిద్ర నుంచి మేల్కొన రాజు కలత చెందాడు. 


💠 నిమి చక్రవర్తి కూడ వశిష్టునికి ప్రతి శాపం ఇస్తాడు. 

ఆ ఇద్దరూ ఒకరి శాపంతో ఒకరు చనిపోవడంతో, యజ్ఞం అసంపూర్తిగా నిలిచిపోయింది. 

యజ్ఞ పురుషులు, దేవతలు, బ్రహ్మ దేవుడు మొదలగువారు నిమి చక్రవర్తి యజ్ఞాన్ని పూర్తి చేయడానికి శరీరం లేని ఆత్మగా నిమికి జీవితాన్ని ప్రసాదిస్తారు.  


💠 విదేహ రూపాన్ని (శరీరం తక్కువ రూపం) ధరించి యజ్ఞాన్ని నిమి చక్రవర్తి పూర్తి చేశాడు. 

యజ్ఞ దేవత అయిన అంబికా దేవి, నిమి చక్రవర్తి ఒక వరం ప్రసాదించుతుంది. 

చక్రవర్తి లోకములో గుర్తుండిపోయే పేరు కావాలని అభ్యర్థించాడు. 

పరాశక్తి రాజు కోరిక మన్నించింది.  


💠 సకల జీవుల కనురెప్పలల్లో స్ధానం కల్పించింది.  

జీవుల కనురెప్పలను తెరవడానికి మరియు మూసుకునేలా చేయడాని పట్టు సమయం "నిమిషం" అంటారు.  ఆ విధముగా నిమి చక్రవర్తి వరం నెరవేరింది. 

బ్రహ్మ ఆదేశం ప్రకారము వశిష్టుడు సింగర్కుడి (సింగిరికుడి) క్షేతం నందు తపస్సు చేసి మోక్షాన్ని పొందాడు. 


💠 అతని భక్తికి మెచ్చిన నరసింహుడు దర్శనం ఇచ్చాడు. సింగపెరుమాళ్ (నరసింహుడు) దర్శనమిచ్చిన ప్రదేశాన్ని "సింగర్కుడి" అని పిలుస్తారు. 


💠 ఆలయం రాజరాజ చోళుడు మరియు విజయనగర రాజులచే పునర్నిర్మాణం జరిగింది. 

ఐదు అంతస్ధుల రాజగోపురం, ఏడు కలశాలతో పశ్చిమాభిముఖంగా ఉంది. ఆలయ ప్రాంగణములో ప్రధానాలయంతో పాటు ఎత్తైన ధ్వజస్తంభం ఉంది. 


💠 శ్రీ కనకవల్లి అమ్మవారు తూర్పు ముఖంగా ప్రత్యేక మందిరంలో కొలువై ఉన్నారు. 

శ్రీ ఆండాళ్, గరుడ, విశ్వక్సేన, మంగళ స్తోత్రాలు పాడిన ప్రముఖ 12 మంది ఆళ్వార్లు, మణవాళ మామునిగల్, తుంబిక్కై ఆళ్వార్, విష్ణు, దుర్గ మరియు శ్రీ ఆంజనేయ స్వామి వారి సన్నిధిలు ఉన్నాయి. 


💠 సింగర్‌కుడి కోయిల్ నందలి నరసింహుడు 16 చేతులతో ఉగ్రరూపంగా కనిపిస్తాడు.  

నరసింహ స్వామికి ఎడమవైపు హిరణ్యడు భార్య లీలావతి, కుడివైపున ప్రహ్లాదుడు, శుక్రుడు మరియు వశిష్టుడు, ఉత్తరం వైపున యోగ నరసింహుడు మరియు బాల నరసింహుని చిన్న విగ్రహాలు ఉన్నాయి. 

ఒకే క్షేత్రంలో ముగ్గురు నరసింహులు కొలువై ఉండడం చాలా అరుదు.  


💠 ఉత్సవ ముర్తిని శ్రీ ప్రహ్లాద వరదన్ గా సేవించుతారు. 

దేవేరి శ్రీ కనకవల్లి తాయార్, శ్రీ ఆండాళ్, శ్రీరామ మరియు ఆళ్వార్లకు ప్రత్యేక సన్నధిలు ఉన్నాయి. 

ఆలయ శిఖరమును "పావన విమానం" గా పిలుస్తారు. 

జమదగ్ని తీర్థం, ఇంద్ర తీర్థం, భార్గవ తీర్థం, వామన తీర్థం మరియు గరుడ తీర్థం అను ఐదు తీర్థాలు కలవు. 


💠 ఆలయంనందు ప్రతి నిత్యం అర్చనలు ఆగమం పద్ధతిలో జరుగుతాయి. 

స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భముగా విశేష అర్చనలు ఉంటాయి. 

నరసింహ జయంతికి బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు వైభవంగా జరుగుతాయి.


💠 తమిళ మాఘ మాసములో తీర్థవరి వైభవంగా నిర్వహిస్తారు. తమిళ ఐపాసి (ఆశ్వీయుజం) మాసములో పవిత్ర ఉత్సవం జరుగుతుంది. 

వైకుండ ఏకాదశి రోజు సాయంత్రం గరుడ సేవ మరియు మట్టుపొంగల్ (భోగీ) రోజున తీర్థవరి జరుగుతాయి. 


💠 మానసికంగా బాధపడేవారు, అప్పుల బాధలు, శత్రువుల బెదిరింపులు, వివాహ ప్రతిపాదనలలో ఆటంకాలు, గ్రహాల ప్రతికూల ప్రభావంతో బాధపడేవారు సింగిరికుడి క్షేత్రంలోని నరసింహ స్వామిని ప్రార్థిస్తారు. 

మంగళవారాల్లో నెయ్యి దీపాలు వెలిగించి, తులసి ఆకులతో అర్చన కూడా చేస్తారు. 


💠 ఈ ఆలయం కడలూర్ నుండి 16 కి.మీ


రచన

©️ Santosh Kumar

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత:పదునెనిమిదవ అధ్యాయము

మోక్షసన్న్యాసయోగం:శ్రీ భగవానువాచ


బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి 

సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ (54)


భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః 

తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్ (55)


అర్జునా.. అలా బ్రహ్మస్వరూపం పొందినవాడు ప్రశాంతమైన మనసుతో దేనినీ ఆశించడు; దేనికీ దుఃఖించడు. సమస్త భూతాలనూ సమభావంతో చూస్తూ నాపట్ల పరమభక్తి కలిగివుంటాడు.భక్తివల్ల అతను నేను ఎంతటివాడినో, ఎలాంటివాడినో యథార్థంగా తెలుసుకుంటాడు. నా స్వరూపస్వభావాలను గ్రహించిన అనంతరం నాలో ప్రవేశిస్తాడు.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

అవగాహన

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀



*డా|| నీలం పూర్ణమోహన్ గారి సౌజన్యంతో.... వారు వ్రాసిన చిరు వ్యాసం ఇంగ్లీష్ నెలలు మరియు మన తెలుగు పంచాంగం మధ్య అవగాహన.*

             ➖➖➖✍️


*జనవరి ఒకటి కొత్త సంవత్సరం కాదు, ఇది మానవ నిర్మిత అంశం మాత్రమే.*


*1582 అక్టోబర్ 5వ తారీఖు నుంచి అక్టోబర్ 14 వ తారీకు దాకా కనపడదు.*


*ఇది ఎందుకు జరిగింది అంటే జూలియన్ క్యాలెండర్ 365.25 రోజుల గణితంతో జరిగేది. దాని తర్వాత వచ్చిన న గ్రగోరియన్ 365.2422 గా గమనించారు.* 


*ఇంత చిన్న డిఫరెన్స్ ఏమవుతుంది అని అనుకోవచ్చు. కానీ 1600 సంవత్సరాలలో పది రోజులు తేడా వస్తుంది.*


*జూనియర్ క్యాలెండర్ నుంచి గ్రెగోరియన్ క్యాలెండర్ కి మనం మారుతున్నప్పుడు పది రోజులు అక్కడ 1582లో తీసివేయడం జరిగింది. ఒక బల్ల మీద స్కేల్ పెట్టి కొలుచుకుంటూ వెళుతూ ఉన్నట్టు ఉంటుంది ఈ ఆంగ్లమాన క్యాలెండర్. కానీ అది ఒక సరళరేఖ కాదు అని గుర్తించాలి. కారణం కాలం అనేది ఒక వృత్తం లాగా ఉండేది. దీనిని గుర్తిరెగినటువంటిది మన పంచాంగం.* 


*తిథి అంటే చంద్రుడి యొక్క భ్రమణం, చంద్రుడు యొక్క పెరుగుదల తరగతులను నిర్ణయించేది. మాసం అంటే చంద్రుడికి సూర్యుడికి మధ్య అనుసంధానతను తెలియచెప్పేది. పండగ అనేది సీజన్ ను సింక్ చేసి చెప్పేది. ఖగోళ విన్యాస లక్షణ సమన్వితమైనటువంటిది. దీన్ని ఆస్ట్రాలిమికల్ ట్రాకింగ్ సిస్టం అంటారు. అంతరిక్షమును పట్టి ఉండేది. ఇందులో అమావాస్య, పౌర్ణమిలు ఉంటాయి ఇది భూమి మీద ఉన్న సముద్ర జలాల మీద అధికంగా ప్రభావితం అవుతుంది, అలాగే ఇక్కడ జల పదార్థం ఉంటుందో అక్కడ ప్రభావితం చేస్తుంది. మన శరీరంలో ఉన్న నీరు కూడా దీనికి ప్రభావితం అవుతుంది. మన నిద్ర మన ఆలోచన మన మూడ్ అన్ని కూడా దీని మీద ఆధారపడి ఉంటాయి. ఇలా ఉన్న వాటి మీద మన జీవన ఆధారపడి ఉంటుంది. అందుకే జ్యోతిష్యంలో చంద్రుని ప్రధానమైన గ్రహం కింద తీసుకుంటారు*. 


*నీవు ఏ రకంగా ఆలోచిస్తావో ఆ రకంగా మరల్చబడతావు అని శాస్త్రము తెలియజెప్తుంది. "నీ జీవనగమనాన్ని శాసించేది తెలుగు పంచాంగం ఉగాది. అదే మన కొత్త సంవత్సరం." అదే మన జీవన గమనం. అది మన నిర్దేశక సమయం. మనం మార్పు చెందే సమయం. అది ఒక బయోలోజికల్ క్లాక్. ఇప్పుడు ఈ జనవరి ఫస్ట్ అనేది మానవ నిర్మితమైనటువంటిది. మనం తయారు చేసుకున్న వాచ్ లాంటిది. ఇందులో ఏ మార్పు లేదు. మనకు ఒక పద్ధతిని ఏర్పాటు చేశారు. ఒకటో తారీకు సాలరీ వస్తుంది. అదే మన జీవితాన్ని నిర్మిస్తుంది. జీతం బతుకులు మాదిరి, గుమస్తా గిరి చేస్తూ ఉన్నాం జనవరి ఒకటి జరుపుకుంటూ. ఆంగ్లేయులు మనలను అలా తయారు చేశారు*. 


*మన ఇంట్లో ఒక పని మనిషి కావాలి, అప్పుడు మనం ఏం చేస్తాం... బాగా పని చేసే వాడిని కోరుకుంటాము. ఎదురు తిరగకుండా ఉండేటట్లుగా చూసుకుంటాం. వాడికి పూర్తి స్వతంత్రత లేకుండా చేస్తాం. డబ్బు కోసం మన మీద ఆధారపడేటట్లుగా, ఉండేటట్లుగా చూసుకుంటాం. ఈ విధంగా పైన చెప్పిన క్వాలిటీస్ అన్ని ఉంటే అమెరికా వాడు ఉద్యోగం ఇస్తాడు. మనం దీనికి విదేశీ ప్రయాణం అని మాట్లాడుతున్నాము. బానిస సంకెళ్లు అనలేక. వెళ్లే వాళ్లందరూ మేధావులై వెళ్లడం లేదు... మంచి పనివాడిగా మంచి సేవకుడిగా వెళ్తున్నారు.* 


*దీనికి మనం జాతకంలో 12వ భావాన్ని జోడిస్తాం. కారణం ఏమిటంటే... రోగిష్టివారికి సేవ చేసేవాడు అవసరం. ఆరు రోగమైతే అక్కడినుంచి ఏడు సేవ చేసేవాడు లభ్యత. అది 12. ఇది విదేశీ ప్రయాణం మనకి.* 


*ఇక పండగల గురించి ఎందుకు ఇంత రభస జరుగుతుంది అంటే... ఇక్కడ సీజన్ గురించి తెలియకపోవటం సింక్రనైజేషన్ గురించి తెలియకపోవటం. ప్రకృతితో ఎప్పుడు మమేకమవుతామో తెలియకపోవడం. ప్రకృతిని అబ్జర్వ్ చేసి వ్రాసేది పంచాంగం. కానీ ఈ మధ్యకాలంలో అడ్జస్ట్మెంట్ పంచాంగాలు వస్తున్నాయి. పూర్వాదృక్.... వివాదాలతో... ప్రకృతి ఎప్పుడు మమేకమై మన పంచాంగం మరలా వస్తుందో తెలియటం లేదు*. ✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏

అనంతపద్మనాభుడు

 


 ❤️ *అనంతపద్మనాభుడు*    


✅ *3000 సంవత్సరాలకు పైగా, నాటి అనంత పద్మ నాభస్వామి విగ్రహం 7800 కిలోల స్వచ్ఛమైన బంగారం, 780,000 వజ్రాలు మరియు 780 క్యారెట్ల వజ్రాలతో తయారు చేయబడింది. దీని ప్రస్తుత విలువ ట్రిలియన్‌ లలో ఉంటుందని అంచనా వేయబడింది, అయితే నిపు ణులు మరియు న్యాయ మూర్తులు దాని నిజమైన విలువను అంచనా వేయడం అసాధ్యం అని పేర్కొన్నారు. విగ్రహాన్ని అంచనా వేయడా నికి ఫ్రాన్స్‌కు చెందిన నిపుణు ల బృందాన్నిఆహ్వానించారు. కానీ,దాని విలువను అంచ నా వేయలేక ఆశ్చర్యపోయి తిరిగి వెళ్ళారు*.  


✅ *ఈ విగ్రహాన్ని చూడటం ఒక గొప్ప విశేషం, వ్యక్తిగతం గా దర్శించలేని వారు ఈ వీడియో చూసి ఇంకా ప్రయో జనం పొందవచ్చు. మనం దేవుళ్ల విగ్రహాలను లేదా చిత్రాలను నేరుగా చూడలే నందున వాటిని పూజించి నట్లే, ఈ వీడియో కూడా అదే ప్రయోజనాన్ని అందిస్తుంది*.  


✅ *ముఖ్య అంశాలు*: 👇 - *7800 కిలోల స్వచ్ఛమైన బంగారం - 780,000 వజ్రాలు - 780 క్యారెట్ల వజ్రాలు* - *3000 సంవత్సరాల కంటే పాతది - అంచనా విలువ: ట్రిలియన్లు - నిజమైన విలు వను అంచనా వేయడం అసాధ్యం-అని తేల్చారు*. 


*హరిః ఓమ్*.

జీవన రీతి

  *రోగాలు ఎందుకు రావు, ఎవరెరికి రావు??* 




హిమాలయం నుంచి బయలుదేరిన రెండు పక్షులు ‘కోరుక్’- కః అరుక్- ఎవరు రోగికాదు??- అని అరచుకుంటూ కేరళ వరకు విహరించాయట! వందలాది ప్రదేశాలలో వైద్యుల ఇళ్లవద్ద, విజ్ఞుల ఇళ్లవద్ద, ప్రముఖుల ప్రాంగణాలవద్ద, సామాన్యుల ముంగిళ్లవద్ద ఈ జంట పక్షులు ఆగాయి... ‘కోరుక్?’’-అని అరిచాయి. అర్థంకాని అందరూ ఆ పక్షులను తరిమివేశారు, కేరళ ప్రాంతంలోని ఒక నదీతీర గ్రామంలో ఒక వైద్యుడు ఇంటి బయట చెట్లమధ్య పువ్వుల పరిమళాల మధ్య కూచుని ‘కల్వం’లో మందులను నూరుతున్నాడు! అక్కడికెల్లి ఈ పక్షులు కూచున్నాయి! మళ్లీ యధావిధిగా అరిచాయి! ‘‘కోరుక్?’’అన్న పక్షులకు సమాధానంగా ఆ వైద్యుడు ‘‘హితభుక్’’- మంచి పదార్థాలను తినేవాడు రోగికాడు- అని అరిచాడట! ఆ పక్షులు రెండవసారి కూడ ‘‘కోరుక్’’అని అరిచాయి! సమాధానం ‘‘మితభుక్’’- మితముగా తినేవాడు-అన్నది......ఆ పక్షులు మళ్లీ ‘‘కోరుక్’’అని అరిచాయట! ‘‘సమయభుక్’’ అని వైద్యుడు సమాధానం చెప్పాడు. ప్రతిరోజు నిర్దిష్ట సమయంలో భోజనం చేసేవాడు రోగగ్రస్తుడుకాడు....పక్షులు ఇంకొకసారి కూడ ‘‘కోరుక్’’ అని అరిచాయట! ‘‘హితమిత సమయభుక్’’అని వైద్యుడు ముక్తాయించాడు! హితంగా, మితంగా, సమయానికి తినేవాడు రోగగ్రస్తుడు కాడు... సంతృప్తిచెందిన పక్షులు మళ్లీ హిమాలయంల వైపు పయనం సాగించాయి. ఆ పక్షులు అశ్వనీ దేవతలు అన్నది ఆ వైద్యుల నిర్ధారణ!! ప్రముఖ వైద్య శాస్తజ్ఞ్రుడు స్వర్గీయ ఇటికాలపాటి సంజీవరావుచెప్పిన సనాతన జీవనరీతి ఇది!

ఈ రీతి భ్రష్టుపట్టిపోవడంవల్లనే ఆధునిక సమాజాన్ని రోగాలు అలముకుంటున్నాయి. ఈ రోగాలను నయంచేసే ‘ప్రక్రి య’ బహుళజాతీయ వాణిజ్యసంస్థల దోపిడీకి ఆలవాలమైపోయింది! ఈ ప్రక్రియ కూడ ‘కల్తీ’అయిపోయింది! ‘రుక్కు’అని అంటే ‘రోగం’, ‘ఋక్కు’అని అంటే వేదం! ‘‘ఋగ్వేదాన్ని’’ ‘‘రుగ్వేదం’’గాను, ‘‘ఋత్విక్కుల’’ను ‘‘రుత్విక్కులు’’గాను వ్రాసి భాష ను ‘సైతం’‘కల్తీ’ చేయడం భావదాస్యగ్రస్తుమైన జీవన నీతికి పరాకాష్ఠ... తిండి కల్తీకావడానికి ప్రాతిపదిక మన సమష్టి స్వభావం ‘కల్తీ’కావడం!! పిల్లలు వృద్ధులు రోగులు కాయకష్టంచే శ్రమ సౌందర్య జీవనులు ఎక్కువసార్లు తినవచ్చు... కానీ ఆరోగ్యవంతులైన మిగిలినవారు రోజునకు రెండుసార్లు మాత్రమే భోజనం చేయాలన్నది భారతీయ సనాతన జీవన రీతి! కానీ ఎక్కువసార్లు ఇలా తినకూడని వారు ‘‘మేము సంపాదిస్తున్నాం... మేము తింటున్నాం’’ అన్న అహంకారంతో రోజంతా తింటూనే ఉన్నారు. ఎన్నిసార్లు తిన్నప్పటికీ జీర్ణించుకోగలిగిన శరీర శ్రమజీవులకు మాత్రం రెండుపూటల తిండి కూడ దొరకని వికృత జీవనరీతి విస్తరించిపోతోంది....

ఆర్జించేవారు ఆరగించడం ‘ప్రకృతి’! ప్రకృతిలోని సమస్త జీవజాలం ఈ పనిచేస్తోంది! ఇతరుల నోరు కొట్టి తినేయడం మానవులకు పరిమితమైన ‘వికృతి’! ఆర్జించేవారు ఇతరులను ఆదరించడం మానవులకు సాధ్యమైన ‘సంస్కృతి!’ ‘‘తినడం’’ ఇలా ప్రకృతి, ఇతరుల తిండిని దోచుకోవడం వికృతి, ‘‘తినిపించడం’’ సంస్కృతి! 


మన జీవన రీతి ఏది??

ప్రయాణంలాంటిది

  *నేటి సూక్తి* 


*జీవితం ఒక ప్రయాణంలాంటిది… వేగం కాదు, దిశ ముఖ్యము. ఎన్ని మలుపులు వచ్చినా మన విలువలు వదలకుండా, నమ్మకంతో ముందుకు సాగితే గమ్యం తానే దగ్గరవుతుంది.ఈ కొత్తసంవత్సరం మన జీవితప్రయాణానికిస్పష్టమైన దిశను ఇవ్వాలి*

 💐✨


*క్రాంతి కిరణాలు* 


*కం. రమ్యంబగు జీవితమును*

*సౌమ్యముగా నడుచుకొనుము సంతోషంతో* 

*కామ్యార్థము తీర్చుకొనుచు*

*గమ్యంబును చేరుకొనుము కష్టంబైనన్*


*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*

చతుర్వేద సంస్కృత వేదపాఠశాలలో

  ఉచితం

ఎవరైనా హిందూ సోదరుడు తన కొడుకును హరిద్వార్ గురుకుల్‌లో చదువు కోసం చేర్చాలనుకుంటే, మార్చి 15, నుండి జూలై 15, వరకు హరిద్వార్‌లోని ఆచార్య పాణిగ్రహి చతుర్వేద సంస్కృత వేదపాఠశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి.


"ఆ పిల్లవాడు 6వ తరగతి ఉత్తీర్ణుడై ఉండాలి."


గురుకులంలో వసతి, ఆహారం మరియు అన్ని ఇతర సౌకర్యాలు పూర్తిగా ఉచితం. అదనంగా, నెలకు ₹8,000 స్కాలర్‌షిప్ అందించబడుతుంది. పిల్లవాడు నాలుగు వేదాలు, వ్యాకరణం, సాహిత్యం, ఇంగ్లీష్ మరియు ఇతర ఆధునిక విషయాలలో విద్యను పొందుతాడు. గురుకుల్ వేదాలలో నిపుణుడిగా మారడానికి మరియు M.A వరకు ఉన్నత చదువులకు మార్గదర్శకత్వం అందించడానికి కూడా సహాయపడుతుంది.


ఈ సందేశాన్ని మీ అన్ని హిందూ సమూహాలలో పోస్ట్ చేయండి.

మీ మతం యొక్క గొప్ప విద్యా సంప్రదాయానికి మద్దతు ఇవ్వడానికి వీలైనంత ఎక్కువ మంది హిందువులకు ఈ సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నించండి.


వెంటనే సంప్రదించండి!

హీరాలాల్ జీ – 9654009263


(ఈ సందేశం హిందువుల కోసం మాత్రమే ఉద్దేశించబడింది మరియు అందరు హిందువులకు చేరాలి.)

దుఃఖము కలిగించరాదు"....

 🍀🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐 *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


  శ్లో𝕝𝕝 *దుఃఖం దదాతి యోఽన్యస్య*

         *ధ్రువం దుఃఖం స విన్దతి l*

         *తస్మాన్న కస్యచిత్ దుఃఖం*

         *దాతవ్యం దుఃఖభీరుణా ll*


*... మహాభారతమ్ - అనుశాసనపర్వమ్ …*


తా𝕝𝕝 *"ఒరునికి దుఃఖము కలిగించువాడు తప్పక తానూ దుఃఖమును పొంది తీరును. అందుచే దుఃఖభీరువైనవాడు ఇతరులకు దుఃఖము కలిగించరాదు"....*

         

✍️💐🌸🌹🙏

నక్షత్రం: అశ్విని (Ashwini)*

  🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷


*నక్షత్ర స్తోత్ర మాలిక - రోజు 1*


*నక్షత్రం: అశ్విని (Ashwini)*


*అధిపతి: కేతువు*


*ఆరాధించాల్సిన దైవం. వినాయకుడు (గణపతి)*


*అశ్విని నక్షత్ర జాతకులు లేదా ఈ నక్షత్రం ఉన్న రోజున ఎవరైనా సరే, విఘ్నాలు తొలగి పనులు జరగడానికి పఠించాల్సిన శక్తివంతమైన స్తోత్రం.*


🌻 *"సంకట నాశన గణేశ స్తోత్రం"*.🌻

                       

🍀 *శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం* 🍀


*ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ ।*

*భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయే ॥ 1 ॥*


*ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ ।*

*తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ ॥ 2 ॥*


*లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ ।*

*సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్ ॥ 3 ॥*


*నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకమ్ ।*

*ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ ॥ 4 ॥*


*ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః ।*

*న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో ॥ 5 ॥*


*విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ ।*

*పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిమ్ ॥ 6 ॥*


*జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ ।*

*సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః ॥ 7 ॥*


*అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ ।*

*తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః ॥ 8 ॥*


॥ *ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణమ్* ॥


🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

నక్షత్రం: భరణి (Bharani)*

  --------------------------

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷


*నక్షత్ర స్తోత్ర మాలిక* - 2 వ రోజు 


*నక్షత్రం: భరణి (Bharani)*


*అధిపతి: శుక్రుడు (Venus)*


*ఆరాధించాల్సిన దైవం: శ్రీ మహాలక్ష్మి / దుర్గా దేవి*


*భరణి నక్షత్ర జాతకులు లేదా శుక్ర గ్రహ అనుగ్రహం కోసం, ఐశ్వర్యం మరియు సుఖసంతోషాల కోసం పఠించాల్సిన అత్యంత శక్తివంతమైన స్తోత్రం*.


"*శ్రీ మహాలక్ష్మీ అష్టకం*".


*నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ।*

*శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1 ॥*


*నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి।*

*సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 2 ॥*


*సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి ।*

*సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 3 ॥*


*సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయని ।*

*మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 4 ॥*


*ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి ।*

*యోగజే యోగసంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 5 ॥*


*స్థూలసూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే ।*

*మహాపాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 6 ॥*


*పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి ।*

*పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 7 ॥*


*శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే।*

*జగత్స్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 8 ॥*


*మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః ।*

*సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥*


*ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ ।*

*ద్వికాలే యః పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితః ॥*


*త్రికాలే యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ ।*

*మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ॥*


॥ *ఇతి ఇంద్రకృత శ్రీ మహాలక్ష్మీ--------------------------

🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷


*నక్షత్ర స్తోత్ర మాలిక* - 2 వ రోజు 


*నక్షత్రం: భరణి (Bharani)*


*అధిపతి: శుక్రుడు (Venus)*


*ఆరాధించాల్సిన దైవం: శ్రీ మహాలక్ష్మి / దుర్గా దేవి*


*భరణి నక్షత్ర జాతకులు లేదా శుక్ర గ్రహ అనుగ్రహం కోసం, ఐశ్వర్యం మరియు సుఖసంతోషాల కోసం పఠించాల్సిన అత్యంత శక్తివంతమైన స్తోత్రం*.


"*శ్రీ మహాలక్ష్మీ అష్టకం*".


*నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే ।*

*శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1 ॥*


*నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి।*

*సర్వపాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 2 ॥*


*సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి ।*

*సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 3 ॥*


*సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తిముక్తి ప్రదాయని ।*

*మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 4 ॥*


*ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి ।*

*యోగజే యోగసంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 5 ॥*


*స్థూలసూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే ।*

*మహాపాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 6 ॥*


*పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి ।*

*పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 7 ॥*


*శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే।*

*జగత్స్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 8 ॥*


*మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః ।*

*సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥*


*ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ ।*

*ద్వికాలే యః పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితః ॥*


*త్రికాలే యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ ।*

*మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ॥*


॥ *ఇతి ఇంద్రకృత శ్రీ మహాలక్ష్మీ అష్టకం సంపూర్ణమ్* ॥


🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷 అష్టకం సంపూర్ణమ్* ॥


🌿🌴🥀🍀🌹🍁🌻🏵️🍂🪷

శ్రీ దండాయుతపాణి దేవాలయం

  🕉 మన గుడి : నెం 1346


⚜  తమిళనాడు : కుమారగిరి - సేలం 


⚜  శ్రీ దండాయుతపాణి దేవాలయం



💠 ఈ ఆలయం ఒక కొండపై ఉంది మరియు మురుగన్ కు అంకితం చేయబడింది. 

కరణ మరియు కామీక ఆగమాల ప్రకారం పూజలు జరుగుతాయి. అరుణగిరినాథర్ తన తిరుపుగళ శ్లోకాలలో ఈ ఆలయాన్ని ప్రశంసించారు.


💠 గణపతికి అనుకూలంగా మామిడి పండు విషయంలో శివుడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, మురుగన్ తన తల్లిదండ్రులను విడిచిపెట్టి పళనిలో స్థిరపడ్డాడు. 

పళనికి వెళ్ళేటప్పుడు, అతను తన నెమలి వాహనంతో ఈ ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాడు. 


💠 పళనికి వెళ్ళే భక్తుడు కూడా ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు, "నేను దందాయుతపాణిగా ఇక్కడ ఉన్నాను" అని ఒక స్వరం చెప్పింది. 

భక్తుడు ఆ స్వరాన్ని అర్థం చేసుకోలేదు మరియు పళనికి వెళ్ళాడు.

మురుగన్ ఒక భక్తుడిగా ఆయన వద్దకు వచ్చి, ఆ భక్తుడికి ఒక భిక్షాటన పాత్రను ఇచ్చి, ఈ ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించమని అడిగాడు.

ఆ గిన్నె ద్వారా సేకరించిన డబ్బుతో, ఆయన ఇక్కడ ఈ ఆలయాన్ని నిర్మించాడు. 


💠 మురుగన్ మామిడి సమస్యపై కోపంగా ఉన్నందున, ఈ పండును ఇక్కడ స్వామికి నివేదనగా సమర్పిస్తారు.

మురుగన్ కృప వల్లే సేలం మామిడి పంటకు ప్రసిద్ధి చెందిందని కూడా నమ్ముతారు. 


💠 భక్తులు స్వామిని మాంబళ మురుగన్ (తమిళంలో మాంబళ - మామిడి పండు - మాంబళహం) అని స్తుతిస్తారు.


🔆 ఆలయ గొప్పతనం


💠 ప్రమాదాలలో గాయపడిన వారికి మరియు అత్యవసర పరిస్థితుల్లో ఆలయంలో త్రిషాడ అర్చన చేస్తారు. 

ఈ అర్చనను పన్నీరు మరియు చెప్పులలో కలిపిన అరిచి పువ్వులతో త్వరగా కోలుకోవాలని చేస్తారు. అలాగే, ప్రజలు ఏదైనా ప్రమాదాన్ని నివారించడానికి ప్రయాణం ప్రారంభించే ముందు స్వామిని ప్రార్థిస్తారు. 


💠 సంపదలకు అధిపతి అయిన కుబేరుడికి చెందిన ఉత్తరం వైపు ఉన్న దండాయుధపాణిని ప్రజలు ప్రార్థిస్తారు మరియు దీర్ఘాయుష్షు కోసం కొండ ఆలయ గర్భగుడిలోకి వెళ్ళే మెట్లకు పడి పూజ చేస్తారు.


💠 ఈ ఆలయం ఒక కొండపై ఉంది మరియు మురుగన్ కు అంకితం చేయబడింది. 

అరుణగిరినాథర్ ఈ మురుగన్ పై తిరుపుగళ్ పాడారు. 

మురుగన్ తన ముందు ప్రత్యక్షమై ఈ పర్వతం పైన తన పాదాలు కనిపించే విధంగా ఆలయాన్ని నిర్మించమని కోరినప్పుడు ఈ ఆలయాన్ని సాధువు కరుపన్న స్వామి స్థాపించారు.


💠 మురుగన్ ఆలయంలో బాల దండాయుధపాణి (చేతిలో దండం) రూపంలో ఉంటాడు, ఉత్తరం వైపు దండా శ్రేయస్సు దిశకు (సంపద దేవుడు కుబేరుడికి చెందిన దిశ) ఎదురుగా ఉంటుంది. 

వల్లి మరియు దేవసేన దేవతలు ఉత్సవర్‌గా మురుగన్ తో పాటు షణ్ముగర్ గా మాత్రమే కనిపిస్తారు.


💠 కుమారగిరికి మురుగన్ అనే మరో పేరు కుమారన్ పేరు పెట్టారు. ధందాయుధపాణికి స్వచ్ఛమైన బియ్యం మరియు మామిడి పండ్లు నివేదనగా అర్పిస్తారు.


💠 ప్రాకారంలో దుర్గామాత, నవగ్రహాలు, తొమ్మిది గ్రహాలు, అయ్యప్ప స్వామికి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని తీర్థం కుమార తీర్థం. 


💠 "కుమారగిరి" కొండ దిగువన ఉన్నందున దీనిని కుమారగిరి సరస్సు అని పిలుస్తారు. 

కుమారగిరి కొండపై "మురుగ" స్వామికి ఆలయాన్ని నిర్మించిన సాధువు "శ్రీల శ్రీ కరుపన్న స్వామిగళ్"తో ఈ సరస్సుకు చాలా పురాతన చరిత్ర ఉంది.


💠 ఆలయం ఉదయం 6.00 నుండి ఉదయం 11.00 వరకు మరియు సాయంత్రం 5.00 నుండి రాత్రి 8.00 వరకు ఆలయం తెరిచి ఉంటుంది.


💠 పండుగలు : అక్టోబర్-నవంబర్‌లో స్కంద షష్టి; 

జనవరి-ఫిబ్రవరిలో థాయ్ పూసం; మార్చి-ఏప్రిల్‌లో పంగుని ఉత్తిరం అనే పండుగలు ఆలయంలో జరుపుకుంటారు.


💠 భక్తులు వివాహం మరియు సంతాన వరాల కోసం మామిడి పండ్ల నివేదనతో దంధాయుతపాణి స్వామిని ప్రార్థిస్తారు. 

ప్రజలు ప్రార్థనా నిబద్ధతగా పాల కుండలు తీసుకువెళతారు, కోడిగుడ్లు మరియు తల వెంట్రుకలు ధారణ చేస్తారు.


💠 కుమారగిరి సేలం నుండి 6 కి.మీ దూరంలో ఉంది. 

సేలం పాత బస్ స్టాండ్ నుండి సన్యాసిగుండుకు బస్సులు ఈ ప్రదేశం గుండా వెళతాయి.


రచన

©️ Santosh Kumar

రాత్రిళ్ళు త్వరగా భోజనం..*

  


        *రాత్రిళ్ళు త్వరగా భోజనం..*

                 ➖➖➖✍️


రాత్రి పూట త్వ‌ర‌గా భోజ‌నం చేస్తే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?```


మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో ఆ ఆహారాన్ని ‘త‌గిన స‌మ‌యానికి’ తీసుకోవ‌డం కూడా అంతే అవ‌స‌రం. 


వేళ త‌ప్పి భోజ‌నం చేస్తే అది మ‌న ఆరోగ్యంపై ప్ర‌భావం చూపిస్తుంది. అందువ‌ల్ల ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి స‌రైన స‌మ‌యాల‌కు భోజ‌నం చేయాలి.


ఇక రాత్రి పూట కొంద‌రు ఆల‌స్యంగా భోజ‌నం చేస్తుంటారు. దీని వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక రాత్రి పూట ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా భోజనం చేసేయాలి. దీంతో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.


*1.) రాత్రి 7.30 గంట‌ల లోపు భోజ‌నం ముగించ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త‌గ్గుతారు. మనం తిన్న ఆహారం నుంచి వ‌చ్చే శ‌క్తిని ఖ‌ర్చు పెట్టేందుకు శ‌రీరానికి త‌గిన స‌మ‌యం ల‌భిస్తుంది. దీంతో క్యాల‌రీలు ఖ‌ర్చ‌యి కొవ్వు క‌రుగుతుంది.


*2.) రాత్రి పూట త్వ‌ర‌గా భోజ‌నం చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దీంతో స్థూల‌కాయం బారిన ప‌డ‌కుండా ఉంటారు.


*3.) రాత్రి పూట త్వ‌ర‌గా భోజ‌నం చేసే వారికి క్యాన్స‌ర్లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు త‌మ ప‌రిశోధ‌న‌ల్లో తేల్చారు. త్వ‌ర‌గా భోజ‌నం ముగించే పురుషుల‌కు 26 శాతం, మ‌హిళ‌ల‌కు 16 శాతం వ‌ర‌కు క్యాన్స‌ర్లు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి.


*4.) రాత్రి త్వ‌ర‌గా భోజ‌నం చేసి త్వ‌ర‌గా నిద్రించ‌డం వ‌ల్ల ఉద‌యాన్నే శ‌క్తివంతంగా ఫీల‌వుతారు. కొంద‌రికి ఉద‌యం నిద్ర‌లేవ‌గానే బ‌ద్ద‌కంగా ఉంటుంది. ఏ ప‌నీ చేయ‌బుద్దికాదు. అలాంటి వారు ముందు రోజు త్వ‌ర‌గా భోజ‌నం చేసి త్వ‌ర‌గా నిద్రిస్తే మ‌రుస‌టి రోజు త్వ‌ర‌గా నిద్ర లేస్తారు. దీంతో ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా ప‌నిచేయ‌గ‌లుగుతారు.


*5.) రాత్రిపూట త్వ‌ర‌గా భోజ‌నం చేయ‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. మ‌నం తిన్న ఆహారాన్ని స‌రిగ్గా జీర్ణం చేసేందుకు కావ‌ల్సినంత స‌మ‌యం ల‌భిస్తుంది. అలాగే మ‌రుస‌టి రోజు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసే వ‌ర‌కు చాలా స‌మ‌యం ఉంటుంది క‌నుక జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు మ‌ర‌మ్మత్తులు చేసుకునేందుకు కావ‌ల్సినంత స‌మ‌యం ల‌భిస్తుంది. దీంతో జీర్ణ‌వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది.


*6.) రాత్రి త్వ‌ర‌గా భోజ‌నం చేయ‌డం వ‌ల్ల నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. భోజనానికి, నిద్ర‌కు 3 గంట‌ల వ్య‌వ‌ధి ఉంటే నిద్ర చ‌క్క‌గా వ‌స్తుంది. లేదంటే నిద్ర‌లేమి స‌మ‌స్య వ‌స్తుంది. కనుక రాత్రి చ‌క్క‌గా నిద్ర ప‌ట్టాలంటే త్వ‌ర‌గా భోజ‌నం చేసేయాలి.


*7.) రాత్రి త్వ‌ర‌గా భోజ‌నం చేసే వారికి గుండె జ‌బ్బులు, హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. క‌నుక రాత్రి భోజ‌నాన్ని త్వ‌ర‌గా ముగించాలి.✍️```

-సేకరణ.

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷```

 🙏

శ్రీమద్భగవద్గీత

  శ్రీమద్భగవద్గీత:పదునెనిమిదవ అధ్యాయము

మోక్షసన్న్యాసయోగం:శ్రీ భగవానువాచ


సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః 

మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ (56)


చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః 

బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ (57)


కర్మలన్నిటినీ ఎప్పుడూ ఆచరిస్తున్నప్పటికీ నన్ను ఆశ్రయించేవాడు నా అనుగ్రహంవల్ల శాశ్వతమూ, నాశరహితమూ అయిన మోక్షం పొందుతాడు. హృధయపూర్వకంగా అన్నికర్మలూ నాకే అర్పించి, నన్నే పరమగతిగా భావించి, ధ్యానయోగాన్ని అవలంబించి, నీ మనసు నిరంతరం నామీదే వుంచు.


కృష్ణం వందే జగద్గురుమ్..🙏

నఖదీధితి

  🌹నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణా🌹


ఇప్పుడు ఆ పరాశక్తి కాలివేళ్ళ గోళ్ళ గురించి తలచుకుందాం. 

ఒక మహా జ్ఞాన ప్రకాశము, గొప్ప విద్యుత్కాంతి ఆ గోళ్లను కప్పి వుంది. 

ఒక చక్కని రశ్మి, ఆభ, వెలుగు, ద్యుతి ఆ నఖములను ఆచ్ఛాదించి వున్నది.  

ఆ కాలి గోటి కాంతి ప్రవాహములో సమస్త జగత్తూ ఓలలాడుతోంది. 

ఆ పాదాలకు నమస్కరించిన వారి అజ్ఞానమనే తమస్సు, ఈ నఖ కాంతుల వలన 

నశించి పోతున్నది. అజ్ఞానము నశింపబడిన తరువాత, 

వారు కూడా ఆ మహా ప్రకాశంలో లీనమయి, ధన్యులవుతున్నారు. 

వారి అజ్ఞానపు పొర తొలగించబడి, జ్ఞానము బహిర్గతమవుతోంది.

ఆ హైమావతీ పాద పద్మములు ఎవరి హృదయములో కైనా చేరగలవు.  

తమ నఖ కాంతులతో వారి లోపల ఉన్న తమోగుణాన్ని తొలగించి ఉద్ధరించగలవు.  

తనకు పాద నమస్కారం చేసిన వారి తమోగుణాన్ని, తన కాలి గోటి ప్రభలతో తొలగిస్తున్న 

ఆ పరమేశ్వరి, ఆ నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణ కు వందనం🌹. 


45. 🌹పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా🌹


ఇక మొత్తంగా ఆ రాజరాజేశ్వరి పాదపద్మాల గురించి చెప్పుకుందాం. 

ఆ పాదద్వయ తేజస్సుకు, ప్రభావానికి ముందు మరేవీ సాటి రాలేవు. 

సాధారణంగా పాద పద్మాలు అంటాం. 

ఇక్కడ అమ్మవారి పాదాలు ఆ పద్మాలనే పరాకృతం చేస్తూ తేజరిల్లుతున్నాయి. 

సరోరుహములైన పద్మములు ఎంతో స్వచ్ఛంగా, అతి మృదువుగా, చక్కని ప్రకాశంతో,

తాకితే మాసిపోతాయా, నలిగిపోతాయా అన్నట్లుంటాయి. 

ఆ పద్మాల కన్నా మృదువైనవి, స్వచ్ఛమైనవి, రాజరాజేశ్వరి పాదాలు. 

ఆ పాదాలు భక్తులకు తరుణోపాయాలు. ఉపాసకులకు స్మరణోపాయాలు. 

సిద్ధులకు శరణోపాయాలు. యోగులకు ధన్యోపాయాలు.   

తన పాద ప్రభాజాలంతో, నిజమైన పద్మాలను కూడా ధిక్కరించగల 

ఆ త్రిపురసుందరి, ఆ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ కు వందనం. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

హిందూ ధర్మం

  🌹హిందూ ధర్మం 🌹


మనం చేసే కర్మలు కాయిక, వాచిక, మానసిక కర్మలుగా విభజించబడ్డాయి. కాయిక అంటే నోటితో చేసే కర్మలు, మానసికం అంటే మనస్సుతో చేసేవి, వాచిక అంటే మాటల ద్వారా చేయబడేవి. భౌతిక శరీరంతో జీవుడు కర్మ చేస్తాడు. ఆ కర్మలకు కారణం త్రిగుణాత్మకమైన ప్రకృతి. అంటే త్రిగుణాలతో కూడిన ప్రకృతి. ఆ మూ డు గుణాలే సత్త్వ, రజో, తమో గుణాలు. నిజానికి జీవుడు (ఆత్మ) కళ్ళకు కనిపించే స్థూల శరీరం కాదు, కనిపించని సూక్ష్మ, కారణ శరీరాదులు కూడా కాదు. 'బ్రహ్మం యొక్క ప్రతిబింబమై ఉండీ (సూక్ష్మ శరీరంలో), తాను స్థూలశరీరమని భ్రమపడేవాడు జీవుడు. కానీ ఈ జీవుడు ఈశ్వరుని నుంచి వేరు కాదు' అని ఆదిశంకరులు తత్త్వబోధలో చెప్తారు.

ఈ ప్రపంచం పంచభూతాత్మకం. పంచభూతాలైన ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, పృధ్వీల పంచీకరణం అనే ప్రక్రియ ద్వారా ఏర్పడింది.


3 గుణాలు ఇవి.

సత్త్వగుణం - శుద్ధత్వం మరియు జ్ఞానం దీని లక్షణాలు; ఉదాహరణ - సాత్త్వికమైన వ్యక్తి ఎవరిని బాధించడు. ఇతరులు తనకు అపకారం చేసినా, కోపగించుకోకుండా, ప్రతీకారానికి వెళ్ళకుండా, ఏ విధమైన భావావేశానికి లోనుకాకుండా, నిశ్చలంగా, కరుణాపూరితుడై ఉంటాడు. తన స్వార్ధం చూడకుండా, అందరి మేలు తలుస్తాడు.

రజో గుణం - క్రియ (కార్యము) మరియు కోరిక దీని లక్షణాలు; ఉదాహరణ - రజోగుణం ఉంటేనే పని చేయగలుగుతాము. మనస్సులో సంకల్పాలు కలిగించేది ఈ గుణమే. రజోగుణం గలవాడు కూడా ఎవరి జోలికి వెళ్లడు. కానీ తన జోలికి ఎవరైనా వస్తే ఊరుకోడు. తన స్వార్ధం చూసుకుంటూనే ఇతరులకు మేలు చేయాలని చూస్తాడు.

తమో గుణం - అజ్ఞానం మరియు జడత్వం దీని లక్షణాలు; ఉదాహరణ - తమోగుణం కలిగిన వ్యక్తి అందరిని బాధిస్తాడు. ఇతరులకు ఉపకారం చేయడమన్నమాటే ఉండదు. ఎప్పుడూ హానీ చేయాలనే తలుస్తాడు. తన స్వార్ధం గురించి ఆలోచిస్తూనే, ఇతరులు సుఖంగా ఉండకూడదని తలుస్తాడు. తన జోలికి రాకున్నా, ఇతరులను పీడించి, అందులో ఆనందం పొందుతాడు. దురాశ, ప్రతీకారం మొదలైన దుర్గుణాలు దీని లక్షణాలు.

పంచభూతాల సత్త్వగుణ అంశ నుంచి అంతఃకరణాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉద్భవించాయి. రజోగుణ అంశ నుంచి పంచకర్మేంద్రియాలు, పంచవాయువులు ఉద్భవించాయి. తమోగుణ అంశ నుంచి స్థూలమైన పంచభూతాలు, స్థూల శరీరము ఏర్పడ్డాయి.

ఇవన్నీ పంచీకరణం అనే ప్రక్రియలో ఏర్పడ్డాయి. పంచభూతాల్లో, ప్రతి భూతంలోనూ, దాని తత్వం 1/2 వంతు, తక్కిన 4 భూతాల తత్వాలు ఒక్కొక్కటి 1/8 వంతుగా ఉంటాయి. ఉదాహరణకు భూమి- అందులో 1/2 భూతత్వం అయితే, 1/8 జలం, 1/8 అగ్ని, 1/8 వాయువు, 1/8 ఆకాశం ఉంటాయి. దీన్నే 'పంచీకరణం' అంటారు.

విశ్వం ఏర్పడటానికి కారణమైన పంచీకరణమే ఈ శరీరం ఏర్పడాటానికి కారణమైంది. జీవుడి స్థూల శరీరం పిండాండమైతే, కనిపించే ఈ విశ్వం బ్రహ్మాండం. ఈ పిండాండం దేనితో ఏర్పడింది, ఈ బ్రహ్మాండం కూడా దానితోనే ఏర్పడింది. కాబట్టి పిండాండాన్ని అర్ధం చేసుకుంటే, బ్రహ్మాండాన్ని అర్ధం చేసుకోవచ్చని చెప్పారు ఋషులు.🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

మహాభారతము

  *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

* 607వ రోజు*

అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము


అధ్యాత్మము అదిభూతము అధిదైవతములు

చెవి అధ్యాత్మము అయితే శబ్ధము అదిభూతము. దిక్కులు అధిదైవతములు. చర్మము అధ్యాత్మము అయితే స్పర్శ అదిభూతము, గాలి దానికి అదిదైవతము. కళ్ళు అధ్యాత్మము అయితే రూపము అది భూతము సూర్యుడు దానికి అదిదైవతము. నాలుక ఆధ్యాత్మము అయితే రుచి దానికి అదిభూతము నీరు దానికి అదిదైవతము. ముక్కు అధ్యాత్మము అయితే వాసన దానికి అదిభూతము భూమి దానికి అదిదైవతము. వీటిని బుద్ధి ఇంద్రియత్రయము అంటారు. పాదములు, విసర్జకావయవము, జననేంద్రియము, చేతులు, నోరు కర్మేంద్రియములు అనునవి అధ్యాత్మికములు. పైన చెప్పిన అవయవములకు వరుసగా నడక, విసర్జనము, ఆనందము, పని, మాట అధిభూతములు. వాటికి వరుసగా విష్ణువు, సూర్యుడు, బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని అధిదైవతములు. అహంకారము, మనసు, బుద్ధి ఆధ్యాత్మకములు, వీటికి అభిమానము, సంకల్పము, నిశ్చయము అధిభూతములు. వాటికి మేధస్సు, చంద్రుడు, బ్రహ్మ అధిదైవతములు. ఇవన్నీ విష్ణువు నుండి పుట్టి లయమౌతాయి. అవ్యక్తము అంటే మూల ప్రకృతి. అందులో పురుష చైతన్యము చేరితే ఆ ప్రకృతి చైతన్యవంతమౌతుంది. అప్పుడు ఈ ప్రపంచమంతా అంతా వైభవంతో నడుస్తుంది. ఈ సృష్టికంతా ఆధారం విష్ణువు. పరమశివుడి అనుమతితో బ్రహ్మ జననమరణములు నిర్వహిస్తూ ఉంటాడు " అని సనత్సుజాతుడు నారదుడికి చెప్పాడు " అని చెప్పి భీష్ముడు " ధర్మజా ! ఈ సృష్టికంతకూ మూలము 25వ తత్వము అయిన పరమాత్మ. వేద వేదాంత పురాణ వేద్యుడైన ఆ పురుషుడు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటాడు. అతడే కాలాంతకుడైన అచ్యుతుడు, అనంతుడు, యోగి జనముల హృదయములలో నివసించే వాడు, విష్ణువు, అద్వయుడు, అసంగుడు. అతడే పరమాత్మ " అని భీష్ముడు పలికాడు.

విష్ణుస్వరూపము

ధర్మరాజు " పితామహా ! మహానుభావులు అగ్నులను తమయందు సమాహితం చేసుకుంటారు కదా ! అటువంటి వారు విష్ణుమూర్తిని ఎటువంటి వాడిగా భావిస్తారు ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! క్షీరసాగరమధనంలో అమృతం పుట్టగానే దేవతలు దానవులకు యుద్ధం జరిగింది అందులో దానవులు దేవతలను జయించి అమృతము కైవశము చేసుకున్నారు. దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. అప్పుడు ఆకాశము నుండి " దేవతలారా ! నేను మిమ్ము గెలిపించడానికి వస్తున్నాను " అన్న మాటలు వినిపించాయి. అంతలో విష్ణుమూర్తి గరుఢారూడుడై శంఖ చక్ర గధా సహితుడై అసురుల మీదకు యుద్ధానికి వచ్చి వారిని జయించి వెంటనే అంతర్ధానం అయ్యాడు. అది చూసి ఆశ్చర్యచకితులైన దేవతలు " ఈ మహానుభావుడు ఎవరు ? " అని బ్రహ్మదేవుడిని అడిగారు. బ్రహ్మదేవుడు " దేవతలారా ! ఆయన విష్ణుమూర్తి వైకుంఠములో ఉంటాడు. ఆయన ఇలా ఉంటాడు అని నాకు వర్ణించడానికి శక్తిచాలదు. అయినా ఆయన రూపము తెలుసుకోవడానికి నేను ఒకకథ చెప్తాను.

మునులతో గరుత్మంతుడు

హిమాలయాలలో మునులు, సిద్ధులు తపసు చేసుకుంటున్న తరుణంలో అక్కడకు గరుడుడు వచ్చి వారికి నమస్కరించాడు. వారు అతడిని సుఖాసీనులను చేసి " గరుడా ! నిన్ను ఒక విషయం అడగాలని ఉంది " అని అడిగారు. అందుకు గరుడుడు " ధన్యుడను అడగండి చెప్తాను " అని అన్నాడు. మునులు సిద్ధులు " గరుడా ! విష్ణు భక్తుడవై సదా విష్ణువుకు సమీపంలో ఉండే నీవు మాకు విష్ణుతత్వము ఎరిగించగల సమర్ధుడవు. కనుక భక్త సులభుడైన విష్ణుతత్వము గురించి మాకు వివరించు " అని అడిగారు. మహానుభావులారా ! ఈ మూడు లోకములను విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు అని మాత్రమే నాకు తెలుసు. అంతమాత్రాన నాకు అన్ని తెలుసునని అనుకోవడం కష్టం. మీకు నాకే కాదు ఎవరికైనా విష్ణుతత్వము గురించి చెప్పడము కష్టమే. నేను విన్న ఆయన కథలను కావాలంటే చెప్తాను. నేను దేంద్రుడిని జయించి అమృతభాంఢమును తీసుకు వెడుతున్న తరుణంలో ఆకాశం నుండి " గరుడా ! నీ పరాక్రమానికి మెచ్చాను ఏదైనా వరం కోరుకో " అనే మాటలు వినిపించాయి. అప్పుడు నేను " అయ్యా ! మీరెవరో నాకు తెలియదు మీరెవరో నాకు తెలిపి వరాలను ఇవ్వండి " అన్నాను. ఆ మాటలకు బదులుగా ఒక నవ్వు వినిపించి తరువాత " కాలక్రమేణా నీకు నేనెవరో తెలుస్తుంది. నీవు నా వాహనముగా ఉండు. నీకు వ్యాధులు సోకవు మరణం ఉండదు. అసురులను జయిస్తావు " అన్న మాటాలు చెప్తూ ఒక కాంతిపుంజము నా ఎదుట నిలిచింది. నేను ఆకాంతి స్వరూపానికి చేతులెత్తి నమస్కరించి " మహానుభావా ! నేను నీకు వాహనమౌతాను. నీవు ఎక్కిన రధముకు నన్ను ధ్వజముగా నియమించమని నేను కోరుకుంటున్నాను " అని అడిగాను. " అలాగే జరుగుతుంది " అని చెప్పి ఆ కాంతి స్వరూపం మాయమయ్యింది. ఆ మాటలకు ఆశ్చర్యానందాలు కలిగాయి.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

భగవద్గీత

  -------------------- భగవద్గీత. -------------------

ద్వితీయోధ్యాయ: సాంఖ్య యోగము.


అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి ।

తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి ।। 33 ।।


ప్రతిపదార్థ:


అథ చేత్ — కానీ ఒకవేళ; త్వం — నీవు; ఇమం — ఈ; ధర్మ్యం సంగ్రామం — ధర్మ యుద్ధం; న కరిష్యసి — చేయక పొతే; తతః — ఆ తరువాత; స్వ-ధర్మం — వేద విహిత కర్తవ్యము; కీర్తిం — పేరు ప్రఖ్యాతులు; చ — మరియు; హిత్వా — వదిలివేసి; పాపం — పాపము; అవాప్స్యసి — పొందుదువు.


  తాత్పర్యము :


కానీ, ఒకవేళ నీవు స్వధర్మాన్ని, కీర్తిని విడిచి, ఈ ధర్మ యుద్ధాన్ని చేయటానికి నిరాకరిస్తే, తప్పకుండా పాపాన్ని చేసినవాడివవుతావు.


 వివరణ:


యుద్ధభూమిలో ఒక యోధుడు అహింసా వాదుడు అయితే, అది కర్తవ్య ఉపేక్ష అవుతుంది, అంచేత ఒక పాపపు పనిగా పరిగణించబడుతుంది. సమస్యాత్మకమైనదిగా, చికాకుగా భావించి తన కర్తవ్యాన్ని విడిచిపెడితే, అర్జునుడు పాపానికి పాల్పడినట్టే అని శ్రీ కృష్ణుడు అంటున్నాడు. పరాశర స్మృతి ఇలా పేర్కొంటున్నది:


క్షత్రియోః హి ప్రజా రక్షాంశస్త్రపాణిః ప్రదండవాన్

నిర్జిత్య పరసైన్యాది క్షితిమ్ ధర్మేణ పాలయేత్ (1.61)


‘అన్యాయము, హింస నుండి దేశ ప్రజలను కాపాడటం క్షత్రియుడి కర్తవ్యం. శాంతిభద్రతల నిర్వహణ కోసం తగిన సందర్భాల్లో హింస అవసరం. అందుకే, అతను శత్రురాజుల సైన్యాన్ని ఓడించి రాజ్యాన్ని ధర్మ బద్దంగా పాలించటానికి తోడ్పడాలి’

కలియుగంలో

  *కలియుగం ఎలా ఉంటుంది..!*




ఒకసారి ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుని కలియుగం ఎలా ఉంటుంది అని అడిగారు.


శ్రీకృష్ణుడు నవ్వి చూపిస్తాను చూడండి అన్నాడు. నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు వేసి తలో దిక్కు వెళ్లి ఆ బాణాలను తెమ్మన్నాడు. నలుగురు పాండవులు తలో దిక్కుగా ఆ బాణాలను వెదుక్కుంటూ వెళ్లారు.


👉అర్జునుడికి బాణం దొరికింది. ఇంతలోనే ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు. ఒక కోయిల మధురంగా పాడుతూ బ్రతికున్న ఒక కుందేలును పొడచుకు తింటోంది. అర్జునుడు నివ్వెర పోయాడు. తిరిగి కృష్ణుడి దగ్గరకు బయలు దేరాడు.


👉భీముడికి బాణం దొరికిన చోట నిండుగా నీళ్లున్న నాలుగు బావుల మధ్య ఒక ఎండి పోయిన బావి కనిపించింది. ఆశ్చర్య పోయాడు. కృష్ణుడి దగ్గరకు బయలుదేరాడు.


👉నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన తన లేగ దూడను గాయాలయ్యేంత విపరీతంగా నాకుతోంది. చుట్టూ వున్న జనం అతి కష్టమ్మీద ఆవు దూడలను విడదీశారు. నకులుడికి ఆశ్చర్యమేసింది. వెనుదిరిగాడు.


👉ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతం పైనుండి ఒక పెద్ద గుండు దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను పడవేస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగిపోయింది. సహదేవుడికి అర్థం కాలేదు.


నలుగురూ కలిసి శ్రీకృష్ణుని తమ సందేహాలు అడిగారు.


*👉ఆయన చెప్పనారంభించాడు.*


*🌿కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కుందేలును కోయిల పొడుచుకు తిన్న రీతిగా భక్తులను దోచుకుంటారు.*


*🌿కలియుగంలో అత్యంత ధనికులు కూడా పేదలకు పైసా సాయం చేయరు.*


*కలియుగంలో ఎలాగైతే ఆవు దూడకు గాయాలయ్యేంతగా నాకిందో తలిదండ్రులు తమ పిల్లలను గారం చేసి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తారు.*


*కలియుగంలో జనులు మంచి నడవడి కోల్పోయి కొండ మీద నుంచి గుండు దొర్లినట్లుగా పతనం అవుతారు. భగవన్నామమనే చిన్న మొక్క తప్ప ఎవరూ కాపాడ లేరు.🍁.*

పిల్లల నవ్వులు, చిన్నపాదాల శబ్ధం

  ⭐ 1. ఇది హెచ్చరిక కాదు… ప్రేమతో చెప్పే హృదయ పిలుపు దయచేసి అందరూ చదవండి


ఈరోజు ఇళ్లలో దీపాలు వెలుగుతున్నాయి


కానీ పిల్లల నవ్వులు, చిన్నపాదాల శబ్ధం — కనబడడం లేదు


జీవితం పరుగెడుతోంది… కుటుంబాలు తగ్గుతున్నాయి


కాలం మారింది కానీ మన ఇళ్ల ఖాళీ అవుతున్నాయి అనే నిజం మాత్రం నిలిచిపోయింది

⭐ 2. కుటుంబం అంటే బంధం కాదు — మనసులు కలవడం


పాత తరం 20–25లో పెళ్లి చేసుకునేవారు


ఇళ్లు నవ్వులతో, ఉత్సాహంతో నిండేవి


ఇప్పుడు "సెటిల్ అయాక" అన్న ఆలోచనలు


ఫలితం: ఒంటరితనం, విభేదాలు, భయాలు


⭐ 3. పెళ్లి ఆలస్యం పెద్ద నష్టం


యువత పెళ్లిని వాయిదా వేస్తే:

⭐ అవకాశాలు తగ్గిపోతాయి

⭐ మంచి సంబంధాలు పోతాయి

⭐ మనసు ఒంటరితనంలో చిక్కుకుంటుంది


25 ఏళ్లలోపు పెళ్లి — శాస్త్రీయంగా, శారీరకంగా, భావోద్వేగంగా సరైన సమయం

⭐ 4. పిల్లలు 


ఒక పిల్లవాడు → ఆశ


ఇద్దరు పిల్లలు → ఆనందం


ముగ్గురు పిల్లలు → కుటుంబ బలం, పెద్దలకు ఆశ్రయం, వంశానికి రక్షణ


పిల్లలు ఖర్చు కాదు — మన భవిష్యత్తుపై పెట్టుబడి

⭐ 5. తల్లిదండ్రులకు అత్యంత ముఖ్యమైన ప్రేమ మనవి


పెళ్లి కోసం ఎక్కువ ఆశలు వేయొద్దు:

✔️ పెద్ద ఇల్లు కావాలి

✔️ పెద్ద ప్యాకేజ్ కావాలి

✔️ స్టేటస్‌కు సరిపోవాలి

✔️ కోట్లలో సంపాదించాలి


ఇవి పెరిగే కొద్దీ:

⭐ పిల్లల వయసు పెరుగుతుంది

⭐ మంచి సంబంధాలు పోతాయి

⭐ తర్వాత పశ్చాత్తాపమే మిగిలిపోతుంది

⭐ 6. సంబంధం నిలబెట్టేది డబ్బు కాదు — మనసు


✔️ ప్రవర్తన

✔️ మంచితనం

✔️ గౌరవం

✔️ అర్థం చేసుకోవడం


—ఇల్లు, కారు, డబ్బు కొన్నాళ్ళకే 

⭐ 7. అమ్మలకు ప్రత్యేక ప్రేమ మనవి


అమ్మ మాటింట్లో దేవుని మాట


మీరు చెప్పేది వెంటనే వినబడుతుంది


దయచేసి:

✔️ పిల్లలపై ఒత్తిడి తగ్గించండి

✔️ పెళ్లి తర్వాత వారి జీవితాల్లో ఎక్కువ జోక్యం చేయొద్దు

✔️ సర్దుకుపోవడం నేర్పండి

✔️ అర్థం చేసుకోవడం నేర్పండి

✔️ కోపం తగ్గించి ప్రేమ మాటలు 

⭐ 8. యువతకు ప్రత్యేక సందేశం


"సెటిల్ అయ్యాక పెళ్లి" కాదు


ఇద్దరూ కలిసి సెటిల్ అవ్వాలి


నిజంగా ప్రేమించే మనిషి వెంట ఉంటే:

⭐ జీవితం అందంగా మారుతుంది

⭐ కష్టాలు చిన్నవైపోతాయి

⭐ ఇల్లు ఆనందం

⭐ 9. కుటుంబం కూలిపోకుండా ఉండేందుకు తప్పనిసరి విలువలు

✔️ ఓపిక

✔️ సర్దుకుపోవడం

✔️ గౌరవం

✔️ కలిసి నిలబడే మనసు

ఇవి ఉంటే ఏ ఇల్లు అయినా నిలబడుతుంది.

⭐ 10. ముగ్గురు పిల్లలు — కుటుంబాన్ని నిలబెట్టే రహస్యం


వంశం నిలుస్తుంది


పెద్దల ఒంటరితనం పోతుంది


ఇంటిలో జీవం పెరుగుతుంది⭐ 11. మనమంతా కలిసి మారితే — సమాజం నిలుస్తుంది

ఇది ఎవరిని తప్పుపట్టడం కాదు

మన కుటుంబాలు మళ్లీ బలపడాలని చేసే పిలుపు

⭐ 12. చివరి హృదయ పిలుపు

👉 25 ఏళ్లలోపు పెళ్లి

👉 కనీసం ముగ్గురు పిల్లలు

👉 ప్రేమ, అర్థం చేసుకోవడం, ఓపికతో ఉండడం ఇల్లు నిలబెట్టడం


ఇవి మూడు కలిస్తే —

మన కుటుంబాలు నిలుస్తాయి,

మన వంశం నిలుస్తుంది,

మన సంస్కృతి నిలుస్తుంది


❤️ దయచేసి ఈ సందేశాన్ని హిందూ బంధుమిత్రులందరికీ, ప్రతి గ్రూపుకి పంపండి.

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ    చాంద్రమాన  విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము  - హేమంత ఋతువు - పుష్య మాసం - శుక్ల పక్షం - పూర్ణిమ - ఆర్ద్ర -‌‌  స్థిర వాసరే* (03.01.2026)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

పంచాంగం

  


పూర్వ పద్ధతి పంచాంగం.

  *-*-*-*-*-*-

*శుభోదయం*

**********  

 సంధ్యావందనం మరియు ఇతర పూజాకార్యక్రమాల సంకల్పము.

పూర్వ పద్ధతి పంచాంగం. 

తేది.03.01.2026 

శని వారం (స్థిర వాసరే)  

--------------------------- 

గమనిక:-

ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. __________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే

హేమంత ఋతౌ పౌష్య మాసే శుక్ల పక్షే పౌర్ణిమాశ్యాం

(సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

స్థిర వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

_________________________

*ఇతర పూజలకు*

 శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతౌ పౌష్య మాసే శుక్ల పక్షే పౌర్ణిమాశ్యాం

స్థిర వాసరే అని చెప్పుకోవాలి. _________________________

*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.36

సూ.అ.5.34

శాలివాహనశకం 1947 వ సంవత్సరం.    

విక్రమార్క శతాబ్దం లో 2082 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5126 వ సంవత్సరం. 

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం 

దక్షిణాయన పుణ్యకాలం  

హేమంత ఋతువు 

పుష్య మాసం

శుక్ల పక్షం 

పూర్ణిమ సా.4.23 వరకు.

శని వారం

నక్షత్రం ఆర్ద్ర సా.6.53 వరకు.

వర్జ్యం తె.6.17 ల మరునాడు ఉ .7.48 వరకు.

అమృతం ఉ.9.29 ల 10.59 వరకు. వరకు.

దుర్ముహూర్తం ఉ.6.35 ల 8.03 వరకు.

యోగం బ్రాహ్మం ఉ.10.26 వరకు.

కరణం బవ సా.4.23 వరకు. 

కరణం బాలువ తె.3.26 వరకు.

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం ఉ.9.00 ల 10.30 వరకు.

గుళిక కాలం ఉ.6.00 ల 7.30 వరకు. 

యమగండ కాలం మ.1.30 ల 3.00 వరకు. 

************-*****   

పుణ్యతిథి పుష్య శుద్ధ పూర్ణిమ.

************

*ప్రభల విశ్వనాధం* 

*శ్రీ పద్మావతీ శ్రీనివాస బ్రాహ్మణ వివాహా సమాచార సంస్థ*, వనస్థలిపురం, హైదరాబాద్. 500070.

801-956-6579,

739-686-7592,

984-875-1577.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.


ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

03-01-2026 శనివారం రాశి ఫలితాలు

 శ్రీ గురుభ్యోనమః 🙏

03-01-2026 శనివారం రాశి ఫలితాలు


మేషం


వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు అదుపుచేయడం కష్టంగా మారుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మాటలు వివాదాస్పదంగా మారుతాయి. 

---------------------------------------


వృషభం


ధనాదాయ విషయాలలో లోటుపాట్లు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు దర్శనం చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఉద్యోగమున స్థానచలన సూచనలున్నవి. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది.

---------------------------------------


మిధునం


నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. సమాజంలో ప్రముఖ వ్యక్తుల ఆదరణ పెరుగుతుంది. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగమున హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

---------------------------------------


కర్కాటకం


చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. సంతాన ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. వృత్తి, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాల వలన ధనవ్యయం కలుగుతుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటాబయట ప్రతికూల వాతావరణం ఉంటుంది.

---------------------------------------


సింహం


ఉద్యోగాలలో అధికారులతో ఉన్న సమస్యలు రాజీ చేసుకుంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది.

---------------------------------------


కన్య


నిరుద్యోగ ప్రయత్నాలు వాయిదా పడుతాయి. ధనపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబమున అనిశ్చిత కలుగుతుంది. ఉద్యోగ వ్యాపారములలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యలేరు.

---------------------------------------


తుల


వ్యాపారంలో ఆశించిన ఫలితాలుంటాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్య సిద్ది కలుగుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న సమయానికి పనులు పూర్తి అవుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. మొండి బాకీలు వసూలు అవుతాయి.

---------------------------------------


వృశ్చికం


వ్యాపార పరంగా అభివృద్ధి సాధిస్తారు. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

---------------------------------------


ధనస్సు


ఉద్యోగస్థులకు ఊహించని స్థాన చలనాలుంటాయి. ఇతరులతో నిదానంగా వ్యవహరించడం మంచిది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి.

---------------------------------------


మకరం


బంధుమిత్రులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యుల మాటలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపారపరంగా ఆశించిన ఫలితాలు ఉండవు. ఉద్యోగమున సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

---------------------------------------


కుంభం


సమాజంలో ప్రముఖుల పరిచయాలు పెరుగుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అధికారుల నుండి అనుకూలత పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తికి సంభందిత వివాదాలలో విజయం సాధిస్తారు. 

---------------------------------------


మీనం


కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులతో దీర్ఘకాలిక వివాదాలను రాజి చేసుకుంటారు. ధనాదాయం బాగుంటుంది. వ్యాపారాలను విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది.

---------------------------------------