3, జనవరి 2026, శనివారం

దేవుని పూజించుపతి(సతి)ని

 *2320*

*కం*

దేవుని పూజించుపతి(సతి)ని

జేవురమునగాంచు పడతి (మగని) జీవన సుఖముల్

దేవుని పూజాఫలమను

పావన సత్యమ్ము మరువ వలదిల సుజనా.

*భావం*:-- ఓ సుజనా! దేవునిపూజించే భర్త(భార్య) ను కన్నెర్ర చేసి చూసే(జేవురము/జేగురము = ఎర్రదనము,కాంచు= చూచు అంటే కన్నెర్రచేసి చూచు అనగా కోపగించుకునే) స్త్రీ(పురుషుని) యొక్క జీవన సౌఖ్యములన్నియూ ఆ దేవుని పూజించడం వలన లభించిన ఫలములే అనే పవిత్రమైన సత్యాన్ని మరువవద్దు.

*సందేశం*:-- కొన్నిచోట్ల భర్త దైవభక్తి భార్యకు, మరి కొన్ని చోట్ల భార్య దైవభక్తి భర్త కు నచ్చడం లేదు, కానీ వారి సౌఖ్యములు దైవభక్తి వలన దైవానుగ్రహం చేత మాత్రమే లభిస్తున్నాయనే సత్యం మరచిపోతుంటారు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: