వివాహము విధాలు - వివాహ లగ్నము
వివాహము అంటే సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే ఒక చట్టబద్ధమైన ఒప్పందం. యువతీ-యువకుడు పెద్దల సమక్షంలో.. అగ్నిసాక్షిగా వేద మంత్రాల నడుమ పెళ్లాడటమన్నది సంప్రదాయం. పెండ్లి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, కళ్యాణము, సప్తాపది అనే పలు విధములుగా అర్థాలు ఉన్నాయి.
వివాహము అనేది మన శాస్త్ర, పురాణాల్లో 8 రకాలుగా ఉన్నాయి. అందులో.. బ్రహ్మం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, అసురం, గాంధర్వం, రాక్షసం, పైశాచం అని పేర్లు ఉన్నాయి.
వీటిలో మొదటిది బ్రహ్మ వివాహం. వేదం చదివిన సచ్ఛీలవంతునికి పూజించి ఇచ్చే కన్యాదానాన్ని బ్రహ్మ వివాహం అంటారు. కన్యను అలంకరించి వరునికి ఇచ్చి జరిపించే వివాహం ఇది.
2వది దైవ వివాహం. యజ్ఞంలో రుత్విక్‌కు అలంకరించిన కన్యాదానంగా చెబుతారు. గోమిధునాన్ని వరుని నుంచి స్వీకరించి కన్యాదానం చేస్తే దాన్ని అర్ష (అర్షం) వివాహంగా చెబుతారు. మీరిద్దరు కలిసి ధర్మాచరణ చేయండి అని వరుడుని పూజించి కన్యాదానం చేస్తే దాన్ని ప్రాజాపత్య వివాహం అని పిలుస్తారు.
అదేవిధంగా.. జ్ఞానులు కన్యకు తన శక్తిమేరకు డబ్బిచ్చి వివాహం చేసుకుంటే దాన్ని అసుర వివాహంగా చెబుతారు. వధూవరులు పరస్పరం ఇష్టపడి స్వయంగా వివాహం చేసుకుంటే దాన్ని గాంధర్వ వివాహంగా చెబుతారు. బలవంతంగా తనంటే ఇష్టం లేని కన్యను అపహరించి వివాహం చేసుకుంటే అది రాక్షస వివాహం. నిద్రిస్తున్న మత్తులో ఉన్న స్త్రీని రహస్యంగా సంగమించుట ద్వారా వివాహమాడినట్లయితే అది పైశాచిక వివాహం.
వివాహ లగ్నము - వైవాహిక జీవితం
కుండలి స్థితిలో ఉన్న గ్రహములు వైవాహిక జీవితాన్ని సుఖమయంగా, కలహపూర్ణంగా చేయగలదని శాస్త్రం చెబుతోంది. అయితే ఈ తత్వములు ప్రమాణికమైనవి. యది వైవాహిక లగ్నమును సరైన రీతిలో విచారణ చేస్తే, వివాహం తర్వాత దాంపత్య జీవితంలో కలిగే సమస్యలు తగ్గుతాయి. వైవాహిక జీవితం సుఖమయమవుతుంది.
వివాహ సంస్కారములను వ్యక్తి రెండవ జీవితంగా గుర్తిస్తారు. దీని ప్రకారం వివాహ సమయములో శుభ లగ్నము.. మహత్యం కలిగి ఉండును, జన్మ కుండలిలో లగ్న స్థానములో శుభ గ్రహములు స్థితిలో ఉండును. వివాహం కొరకు లగ్నమును నిశ్చయించు సమయములో వధువు, వరుని కుండలిని గమనించి వివాహ లగ్నమును నిశ్చయించవలసి ఉంటుంది. కుండలి లేకపోతే గనక వరుడు, కన్య పేరులో ఉన్న రాశికి అనుగుణంగా లగ్నమును గుర్తించాలి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. జన్మ లగ్నము, రాశి నుంచి అష్టమ లగ్నం అశుభ ఫలదాయకముగా ఉండును. అంటే ఈ లగ్నంలో వివాహము గురించి ఆలోచించరాదు.
జన్మ లగ్నం, జన్మరాశి నుంచి 4వ, 12 వ రాశి గుణములను లెక్కించుటలో శ్రేష్టంగా ఉంటే గనక ఈ లగ్నంలో వివాహం సంభవము. అన్యతా జన్మ లగ్నము నుంచి చతుర్ధ, ద్వాదశ రాశితో లగ్నంలో వివాహం దోష పూరితంగా ఉండును. ఎవరి కుండలిలో లగ్నం నుంచి కేంద్ర స్థానములో శుభ గ్రహములు ఉండునో వారికి వివాహ లగ్న దోషం కలుగదు.
కుజ లగ్నం నుంచి బుధుడు, గురువు, శుక్రుడు యది కేంద్రంలో లేదా త్రికోణంలో ఉంటే గనక వివాహ లగ్నములో అనేక విధాలైన దోషములు.. అంటే దగ్దతిధి, గుడ్డి, చెవిడు కలుగవు. వివాహ లగ్నము సందర్భంను లెక్కించు సమయంలో రాహువు శనికి సరిసమమైన ప్రభావకారిగా ఉండును. ఇంకా కుజుడు కేతువుకు సమానంగా ఉండునని చెప్పదగ్గది.....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్:- 9866193557