🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 96*
*****
*శ్లో:- నరత్వం దుర్లభం లోకే ౹*
*విద్యా తత్ర సుదుర్లభా ౹*
*వివేకో దుర్లభ స్తత్ర ౹*
*దాతృత్వం చ విశేషతః ౹౹*
*****
*భా:- లోకంలో మిక్కిలి దుర్లభములు అని చెప్పదగినవి 4 ఉన్నాయి.1."నరత్వం" :- 84 లక్షల జీవరాసులలో నరజన్మ దుర్లభమని , శ్రేష్ఠమైనదని చెబుతున్నారు*. *మానవీయ,మాననీయ విలువల పరీమళాలతో దాన్ని సార్థకం చేసుకోవాలి. సమసమాజంలో మనీషిగా జీవించాలి. 2."విద్య":- నరునిగా పుట్టగానే సరిపోదు*. *అర్థము,పరమార్థము నివ్వగల విద్య నార్జించడం చాల కష్టము. దీక్ష-దక్షత; శ్రద్ధ-ఆసక్తి; నయము-భయము;* *వినయము-విధేయత;నిష్ఠ-నీమము లేనిదే చదువు వీసమైనా అబ్బదు. విద్యలేనివాడు* *వింతపశువే గదా! 3."వివేకము":- మనిషిగా పుట్టవచ్చు. అనేక విద్యలు నేర్వవచ్చు. కాని అట్టి వానికి "వివేకము" ఉండడం మిక్కిలి కష్టము. పశుత్వము నుండి మనిషిని వేరుచేసేది*వివేకము -విచక్షణ" అని గమనించాలి.అది లేని వ్యక్తి వాసన లేని పుష్పమే*.
*4."దాతృత్వము":- నరునిగా పుట్టాడు. విద్యావంతుడైనాడు. వివేకం తోడైనది. కాని అతనికి "దానగుణం" అబ్బడం కుదరని పని. ఒక వేళ అబ్బితే విశేషాతిశయమే. కాన ఉత్తమ నరునిగా పుట్టి, విద్యాప్రావీణ్యంతో, వివేకవర్తనుడై , దానగుణంతో మానవసేవయే మాధవసేవగా, పరోపకారమే పరమార్థముగా, సేవలందిస్తూ, సుఖ జీవన యానం చేయాలని సారాంశము*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి