12, నవంబర్ 2020, గురువారం

అసలు విషయం

 .భార్యాభర్తలు ఇద్దరూ ఒక హోటల్లో కూర్చోని టిఫిను తింటున్నారు. 


 ..భార్య భర్తను ఇలా అడిగింది

" ఏమండీ! మిమ్మల్ని ఒక విషయం అడగనా? "


భర్త; అడుగు....దానికి పెర్మిషను అవసరమా?

భార్య; అదేంలేదండీ ఒక నెల నుంచి మీరు ఆఫీసునుండి లేటుగా రాకుండా మమ్మల్ని తరచుగా

బయటికి తీసుకుని వెళ్తూ.. పిల్లలతో హోం వర్కు చేయిస్తూ

  ....వారితో గడుపుతూ......నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసుకుందామని

అంటూ కాస్త భయంగానే అడిగింది

భర్త; అదేంలేదే! నేను మామూలుగానే ముందులాగానే ఉన్నానే! నీకెందుకు అలా

అనిపిస్తోందో అర్థం కావడం లేదు మరి.

భార్య; నిజం చెప్పండి. మీ మొహంలో తేడా కనిపిస్తోంది. కొంపతీసి చిన్న ఇల్లు కానీ

  పెట్టలేదుకదా!

భర్త; అమ్మొయ్......నీకు దండం పెడతానే అలాంటి ఆలోచనకూడా రానివ్వకు.

భార్య; అయితే నాకు నిజం తెలిసి తీరాల్సిందే! చెప్పండి.

భర్త; విషయం ఉంది కానీ నువ్వు అనుకున్నట్లు కాదు...అంటూ

 తన డైరీ నుంచి ఒక ఉత్తరాన్ని తీసి భార్య చేతిలో పెట్టాడు.

ఆ ఉత్తరాన్ని వణుకుతున్న చేతులతో తెరిచి చదవసాగింది భార్య.


ఆ ఉత్తరం తన అత్తగారు కొడుకుకు వ్రాసిన ఉత్తరం....


 చదివేకొద్దీ .కన్నీళ్ళు


ప్రియమైన కుమారునికి......

ఎప్పుడో ఏదో ఒకరోజు ఈ ఉత్తరం నీ చేతికి దొరుకుతుందని ఆశతో వ్రాస్తున్నాను.

కాస్త ఓపిగ్గా పూర్తిగా ఈ ఉత్తరాన్ని చదువు చిన్నా! ఈ తల్లి మనసును

అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను......

మీ నాన్న ను పెళ్ళి చేసుకునేదానికి ముందు నేనో లెక్చరరుని.....పెళ్ళైన 

తరువాత నువ్వు పుట్టావు...మీ నాన్నకు అదృష్టం కలిసి వచ్చింది.

బాగా సంపాదించసాగారు. నీకో చెల్లి పుట్టాక నేను ఉద్యోగం చేయడం

మానేసాను.మీ నాన్న చాలా బిజీ అయ్యారు.

వివాహం అయిన ఒక్క సంవత్సరం ఎలాంటి బాధలేకుండా ఉన్నది.

తరువాత అన్నీ ఎదురుచూపులే!

మీ నాన్నకోసం ఎదురుచూపులు......ఆయనకు ఆదాయంపై మోజుతో

సమయానికి ఇంటికి రారు. మీరే నాకు దిక్కు......మీతోనే నా సంతోషం.

ఉదయం లేవగానే మీరు తయారై స్కూలుకు వెళ్తారు......

మీ రాక కోసం ఎదురుచూపు.........

ఇలా మీరు పెద్దవారైపోయారు.......నాతో మాట్లాడటానికి కూడా

సమయం ఉండేది కాదు...అవసరానికో మాట అంతే,,,,,,

ఉద్యోగాలు వచ్చేశాయి మీకు.......మీ హడావిడి మీది... పిల్లలైనా

నాతో మాట్లాడుతారేమో అని ఎదురుచూపు.........

మీరు తిరిగి ఇంటికి వచ్చేదాకా ఎదురుచూపు........రాగానే అలసిపోయి

భోంచేసి పడుకుంటారు......వంట బాగుందనికానీ బాగలేదనికానీ

చెప్పడానికి కూడా మీకు టైం ఉండదు..... మీ నాన్న వ్యాపారాన్ని

నీకు అప్పచెప్పారు.......నువ్వుకూడా బిజీ అయిపోయావు.

నీ చెల్లెలికి పెళ్ళి చేశాము......తను హాయిగా విదేశాలకు వె్ళ్ళిపోయింది.

ఆమె సంసారం ఆమె జీవితం.......వారానికి ఒకసారి 2 నిమిషాలు

మాత్రమే పోనులో మాట్లాడేది......ఆమె ఫోనుకోసం ఎదురుచూపు......

మీ నాన్నకు ఆరోగ్యం పాడై ఇంట్లో ఉంటే ఆయనకు సమయానికి ఆహారాన్ని

అందివ్వడానికి........మాత్రలు అందించడానికి ఎదురుచూస్తూ గడిపేదాన్ని.

చూశావా నా బ్రతుకంతా ఎదురుచూపులోనే ముగిసిపోయింది.

నీకు భార్య......కూతురు , కొడుకు వున్నారు. బ్రతికి ఉన్నప్పుడు

చెప్పలేకపోయాను......చనిపోయేముందు ఈ ఉత్తరం వ్రాస్తున్నాను.

మీ నాన్న గారు ఆరోగ్యం బాగలేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా

మాత్రలు ఇస్తావా.......అన్నం పెడతావా.......అవసరానికో మాట అంతే

పేపరు చదవడానికి టైం ఉంటుంది....నాతో మాట్లాడటానికి టైం

ఉండదు మీ నాన్నకు....మీ సంగతి సరే సరి....

వయస్సులో సంపాదన మోజులో పడి నాతో ,మాట్లాడటానికే టైం లేదు మీ నాన్నగారికి.......ఇక ఈ వయస్సులో మాట్లాడటానికి ఏముంటుంది?

ఎదురుచూపు..........ఎదురుచూపు.........ఎదురుచూపు......

ఇప్పుడు చావుకోసం ఎదురుచూపు........

నాలా నీ కూతురో .కొడుకో ఇలా ఉత్తరం వ్రాయకూడదనే ఉద్దేశ్యంతో

ఈ ఉత్తరం వ్రాస్తున్నాను...

ఇంట్లో ఉండే ఆడవారికి కూడా మనసు ఉంటుందని....మనకోసమే

బ్రతుకుకుందనీ గ్రహించు........నేను ఎదురుచూసినట్లు నీ భార్యను

బాధపెట్టవద్దు......మనసువిప్పి తనతో అన్నింటినీ షేర్ చేసుకో!

నిన్ను నమ్ముకుని నీవే లోకంగా వచ్చిన నీ భార్యతో.......నీ పిల్లలతో కొద్ది గంటలైనా  గడుపు .  ధనార్జనతో వారిని నిర్లక్ష్యము చేయకు..ఇదే నా చివరి   కోరిక ....కోడలు........మనవడు......మనవరాలు జాగ్రత్త......

నా పరిస్థితి నాకోడలికి రాకుండా చూసుకో! తనకూ ఒకమనసు ఉంటుందనీ అందులో మీరే ఉంటారనీ.....తననే శ్రద్ధగా చూసుకోవాలని ప్రేమను అందించాలని కోరుకుంటుందనీ అర్థం చేసుకో! మనిషిగా ముందు గుర్తించు యాంత్రికంగా జీవించి

నాలా బాధపడుతూ ఎదురు చూపులతో కాలాన్ని వెళ్ళ దీయనీయకు

.........నీవు ఎప్పూడూ సంతోషంగా ఉండాలనే

ఈ తల్లి కోరుకుంటుంది..........ఉంటాను.


ఇట్లు 

మీ మంచికోసమే ఎదురుచూసే

 నీ తల్లి,.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏


దయచేసి మీ కుటుంబంతో గడపండి......వారి మనస్సును బ్రతికి ఉన్నప్పుడే

గెలుచుకోండి........యాంత్రిక జీవనానికి అలవాటు పడకండి..మీ సంసారమే

మీకు అన్నింట్లో తోడుంటారని మరువ వద్దని ప్రార్థిస్తూ.........

తిరుపతి మ్రొక్కులు🔔

 🔔తిరుపతి మ్రొక్కులు🔔

        🚩🦚🚩


ఆనంద నిలయంలో  లక్ష్మీ పద్మావతీ సమేతుడై శ్రీనివాసుడు  నివసిస్తున్న కాలంలో ఒకనాడు లక్ష్మీ దేవి

" స్వామీ! , కుబేరుని వద్ద పుచ్చుకున్న అప్పుకి వడ్డీ

పెరిగిపోతున్నది. 

మన వద్ద అనంతమైన 

సిరి సందలు వున్నాయి కదా , ఇప్పుడే  అప్పు తీర్చేయవచ్చును కదా, అని అడిగింది. 

పురుషోత్తముడు చిరునవ్వు

నవ్వాడు.  " దేవీ, అప్పు

ఆవిధంగా తీర్చడానికి 

తీసుకోలేదు.  నేను అప్పు తీసుకోవడమే లోకంలోని

మానవులకు  ధర్మాధర్మాలు బోధించడానికి , భక్తి మార్గం ప్రచారం కోసమే అని అన్నాడు. 


ఇద్దరు సతులకు  పురుషోత్తముని

మాటలకి అర్ధం తెలియలేదు. 

భగవంతుడే మరల ఆరంభించాడు. 

కలియుగంలోని ప్రజలు

నిష్కామ భక్తి 

(ప్రతిఫలం

ఆశించని భక్తి)   తో వుండడం

అపూర్వమైన విషయం. 

తమకోరికలు నెరవేర్చుకుందుకి ప్రార్ధించి

మ్రొక్కుకునే భక్తే గోచరిస్తుంది.

ఆవిధంగా తమ భక్తి ని

ఆలయాలకి వచ్చి మ్రొక్కులు

తీర్చుకుంటారు. ఆవిధంగా

కలియుగంలో భక్తి  నిలిచి

వుంటుంది.

అందుకనే  వారి  భక్తి కి మెచ్చి వరాలిచ్చే స్వామిగా, నన్ను

తలచినంత మాత్రముననే

వారి కష్టాలు తీర్చే స్వామిగా

కలియుగాంతము వరకు యీతిరుమలపై  నివసిస్తాను. 

" స్వామి!.మీ  దయాగుణము

మాకు తెలుసు. 

భక్తులను అనుగ్రహిస్తూ, 

కుబేరునికి  అప్పు ఎలా తీర్చగలరు ?  అని లక్ష్మీ దేవి ప్రశ్నించినది.  


" దేవీ! కలియుగంలో మానవులకి సిరిసంపదలు

ఒక్కటే ముఖ్యంగా  కనిపిస్తున్నాయి.  అందువలన అనేక పాపాలు చేసి ధనం చేరుస్తారు. ఆ పాపాల ఫలితమే కఠోర వ్యాధులుగాను, కష్టాలుగాను, 

మరణాలుగాను వచ్చినప్పుడు , బాధపడడం

మొదలెడతారు. 

' గోవిందా! నన్ను రక్షించు" అంటూ గోలపెడతారు. 

వారి కష్టాలు తీరితే కానుకలను సమర్పిస్తామని

మ్రొక్కులు మ్రొక్కుకుంటారు.

నేను వారి పాపాలను ఆ కానుకల మీద ఆవాహన చేసి , నా వద్దకు చేరేటట్టు

చేసుకుంటాను.   అన్నాడు స్వామి. 

పాపపు మచ్చ పడిన ధనం వలన మంచి కార్యాలు చేయగలమా? అని దేవి అడిగింది.

" దేవీ దానిలో  కూడా

భావార్ధం యిమిడి వున్నది.

పాపులు సమర్పించిన కానుకలు  అజ్ఞానము వలన బంగారాన్ని యిష్టపడిన వారికి

నన్ను స్తుతించిన వారికి 

అనుగ్రహిస్తాను. పవిత్రమైన

భక్తులు సమర్పించే కానుకలలో ఒక భాగం  నేను తీసుకుని ఒక భాగం కుబేరునికి అప్పు తీరుస్తాను. "

" దీనిలో మా భాగం  ఏమిటి 

స్వామీ ?  

' నన్ను  స్తుతించిన  భక్తులకు

నీవు సిరిసంపదలు  యివ్వాలి. వారు మంచి వారా ,చెడ్డవారా అని చూడకూడదు." అన్నాడు

భగవంతుడు.

" స్వామి! మీ చిత్తానుసారమే

చేస్తాను. కాని ధనం పెరిగిన కొద్దీ వారు గర్వమధాంధులుగా మారకుండా మీరే కాపాడాలి 

అని అన్నది శ్రీదేవి. 

యీ తిరుమల కొండ మీద దానధర్మాలు చేసే వారికి ఒకటికి పదింతలుగా  పుణ్యఫలాలు లభిస్తాయి. 

ఇక్కడ ఏకాగ్రతగా నన్ను పూజించి ధ్యానించిన

ఉత్తములకు ,  పవిత్ర భావాలను,  పుణ్య ఫలాలను కటాక్షిస్తాను. భక్తులకు నీవు

అనుగ్రహించే సంపదల వలన దుర్మార్గం  పెరుగుతుందని

నీవు సందేహించవద్దు." 

అని భగవంతుడు  అన్నాడు.

ఈ సంభాషణము పద్మ పురాణంలో

వివరించబడివున్నది.  కలియుగ

దైవమైన వేంకటేశ్వరుని అనుగ్రహానికి  గల రహస్యాన్ని

యీ విధంగా తెలుపుతున్నది.

ఈ రహస్యం తెలుసుకుని

తిరుమల దేవుని దర్శించిన వారి జీవితం   మంచి మలుపులు తిరిగి సుఖ

సంతోషాలతో వుంటారని

మన పూర్వీకులు 

చెప్పినమాట.


మనం శ్రధ్ధాభక్తులతో  తిరుమలవాసుని సేవించుకుందాము. 

సర్వశుభాలు పొందుదాము.

తాంబూలం ఇచ్చాం

 తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండి.

.....................................................


కరండసేవకులనే మాట వినేవుంటారు. కరండమంటే పెట్టె. తాంబూలసేవనం  ఒకపుడు హోదాకు చిహ్నం. రాజులు జమిందారులు భూస్వాములు తాము వేసుకోనే తాంబూలపు సరంజామా మోయటానికి ఒక సేవకుడినే వినియోగించేవారు. వారికి మాన్యాలు కూడా ఇచ్చేవారు.


ఇనాటికి కూడా శుభకార్యసమయాలలో తాంబూలం ఇచ్చిపుచ్చుకోవడం ఒక ఆచారం.ఎందుకంటే బంధాలు అనుబంధాలు సంబంధాలు బంధుత్వాలు బలపడతాయి.


ఓమంచి పనికి పురమాయించటానికి తాంబూలం ఇచ్చి మొదలుపెట్టించే సత్సాంప్రదాయం భారతీయులదే.


ఒక కావ్యం అంకితం తీసుకోవాలని ఆశించినా కవికి తాంబూలం ఇచ్చి అందులో కానుకలు సమర్పంచి ఇచ్చేవారు. యుద్ధం చేయమని ప్రోత్సహించటానికి కూడా తాంబూలం ఇవ్వడం అప్పటి రాజుల సాంప్రదాయం.


ఇక కవులు కూడా మంచి పద్యం రాయాలంటే మంచి తాంబూలం ఉండాలని ఆశించేవారు.

ఉదాll క్రింది పద్యంలో చూడండి.



నిరుపహతిస్థలంబు రమణీప్రియదూతిక తెచ్చి యిచ్చు క

ప్పురవిడె మాత్మకింపయిన భోజన మూయలమంచ మొప్పు త

ప్పరయు రసజ్ఞు  లూహ తెలియంగల లేఖకపాఠకోత్తముల్

దొరికినగాని యూరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే!


ఇది పెద్దనామాత్యులువారు కోరినట్లున్న చాటువు.


ఓ కావ్యం వ్రాయాలంటే రమణీయమైన స్థలం, అందమైన యువతిచేతి కప్పురవిడెం, అంటే కర్పూరం కలిపిన తాంబూలం, తృప్తిని కలిగించే ఇంపైన భోజనం, ఊయలమంచం, కావ్యంలో తప్పొప్పులు చూపగల లేఖకపాఠకొత్తములు, అనగా

 చెపుతుంటే వ్రాసేవారేకాదు, అందులోని తప్పొప్పులు చూపగల  వ్రాయసగాండ్రు, కావ్యరసాన్ని ఆశ్వాదించగల పాఠకులు వుండాలట.


ఇకముందు చెప్పినట్టుగా తాంబూలం ఇచ్చాం తన్నుకు చావండంటే యుద్ధానికి వెళ్ళేముందు ఇరువర్గాల సైనికనాయకులకు తాంబూలం ఇచ్చిపంపేవారు. తన్నుకు చావండంటే యుద్ధంలో గెలిచి విజయలక్ష్మితో తిరిగిరండి, లేదా చచ్చి వీరస్వర్గం చేరండని అర్థం.


ఇక తాంబూలం ఘుమఘుమలాడటానికి రుచిగా వుండటానికి అందులో తమలపాకులు, వక్కలు, సున్నంతోపాటు పచ్చకర్పూరం,జాజికాయ, జాపత్రి, , కస్తూరి, కుంకుమ పువ్వు, పుదీనా, కొబ్బరి తురుము, చెక్కర వంటి సుగంధద్రవ్యాలను ఉపయోగించేవారు.


ప్రాత:కాలే ఫలాదిక్యం తు మధ్యమే

పర్ణాధిక్యం భవే ద్రాత్రౌ తాంబూల మితి లక్షణం.

........... భావప్రకాశం


భావప్రకాశం ప్రకారం తాంబూల సేవనంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వక్కలు ఎక్కువగా వుండేటట్టు,మధ్యాహ్న సమయంలో సున్నం ఎక్కువగా వుండేటట్టు, రాత్రిపూట తమలపాకులు ఎక్కువగా ఉంటేటట్టు చూచుకోవాలట. అలా చేస్తే ఆరోగ్యానికి మంచిదట.

హిందూ ధర్మం - 43**

 **దశిక రాము**


**హిందూ ధర్మం - 43**


పాపపుణ్యాలు అన్నవి అసలు ఉండవు, అన్నీ మన భావనలే, భగవంతుడే అన్నిటికి ప్రేరణం చేయిస్తున్నాడు అన్న భావన ఉంటే, మనం ఏం చేసినా పాపపుణ్యాలు అంటవు అంటూ ఎవరైనా చెప్తే అది తప్పు. ఈ లోకంలో అన్ని భగవత్ సంకల్పం వల్ల జరుగుతున్న మాట వాస్తవమే అయినా, అది ఆత్మజ్ఞానంతో పరబ్రహ్మంతో సమన్వయం చెందినవారికి గోచరించే సత్యం. దాన్ని పట్టుకుని, నేనే ఈ శరీరం అని భ్రాంతిలో ఉన్నవారు, ఆత్మానుభూతి పొందనివారు తమకు నచ్చినవన్ని చేస్తూ, ఎలా కావాలంటే అలా బ్రతుకుతూ, అన్ని భగవంతుడి ప్రేరణ వల్లనే జరుగుతున్నాయి అనడంలో అర్దంలేదు. ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రావాలన్నా, పతనం కావాలన్నా, అది అతని బుద్ధిని ఉపయోగించడం మీదనే ఆధారపడి ఉంటుంది. నేను ఇచ్చిన బుద్ధిని సక్రమంగా వాడుకుని, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి అని గీతలో శ్రీ కృష్ణపరమాత్మ స్పష్టం చేశారు.


భగవంతుడిచ్చిన బుద్ధికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ఆ బుద్ధి విషయంలో మనం అడిగేవరకు, సంపూర్ణశరణాగతి చేసేవరకు ఆయన కలగజేసుకోడు. మనం వేడుకుంటే మనకు సహాయం మాత్రం చేస్తాడు. అంతవరకు మనం చేసే ప్రతి కర్మలకు మనమే బాధ్యులం. మీరు మంచి చేసినా, చెడు చేసినా దాని ఫలితం అనుభవించవలసిందే. మనమే ఎప్పుడు ఏం చేయాలో, ఎలా బ్రతకాలో మనకు చెప్పడానికి శాస్త్రం ఉంది. మనిషి తన బుద్ధిని ఎంత సక్రమంగా వాడుకుందామన్న దాని మీద మనసు, పూర్వజన్మ వాసనల ప్రభావం పడుతుంది. అందుకే మనం మన బుద్ధిని సక్రమంగా వాడుకునే శక్తిని ఇమ్మని పరమాత్మను ప్రార్ధిస్తాం.


మనం వేదాలు గమనించినా, అందులో భగవంతుడిని ప్రార్ధిస్తూ 'నువ్వు మా బుద్ధిని ప్రచోదనం చేయి, మంచి మార్గంలో మా బుద్ధి నడిచేలా అనుగ్రహించు, మేము మంచి పనులే చేయుదుముగాకా, నువ్వు మా బుద్ధులను ప్రేరేపించెదవు గాకా' ఇలా నడిచిపోతుంది వైదిక ప్రార్ధన. అంతేకానీ, ఓ దేవుడా! నేను పాపిని, దుర్మార్గుడిని అంటూ సాగదు. నాతో అన్నీ నువ్వే చేయిస్తున్నావు, నేను తప్పు చేసినా, దొంగతనం చేసినా, అదంతా నీ ప్రేరణే అని ఉండదు. మీరు చేస్తున్న ప్రతి పనికి మీరే బాధ్యులు. ఏ పని చేస్తున్న బుద్ధిని సక్రమంగా ఉపయోగించి చేయాలి. అలా చేయడమే ధర్మం.


తరువాయి భాగం రేపు.......

🙏🙏🙏

సేకరణ


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA


**ధర్మము - సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu

శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము

 **దశిక రాము**


🕉️🍂  #శ్రీమహావిష్ణు_సహస్రనామ_వైభవము-48 🍂🕉️

                     🍁 శ్లోకం42 🍁 


**వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః||**

**పరర్థిః పరమస్పష్టః తుష్టః పుష్టశ్శుభేక్షణః||**


384) వ్యవసాయ: - మానవాళి అభ్యున్నతికి తానే కృషిచేయువాడు.

385) వ్యవస్థాన: - సర్వవ్యవహారములను యధావిధిగ నడుపువాడు.

386) సంస్థాన: - జీవులకు గమ్యస్థానమైనవాడు.

387) స్థానద: - వారివారి కర్మానుసారముగా స్థానముల నందించువాడు.

388) ధ్రువ: - అవినాశియై, స్థిరమైనవాడు.

389) పరర్థి: - ఉత్కృష్టమైన వైభవముకలవాడు.

390) పరమస్పష్ట: - మిక్కిలి స్పష్టముగా తెలియువాడు.

391) తుష్ట: - సంతృప్తుడు.

392) పుష్ట: - పరిపూర్ణుడు

393) శుభేక్షణ: - శుభప్రధమైన దృష్టిగలవాడు


శ్లో. వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధృవః !


పరర్ధిః పరమస్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః !!42!!


(నామాలు 384 -393)


87. కృషి యనంగ నతడె, కృషికె నేత యతడు


స్థానమిచ్చు నతడె, స్థానమతడె


మార్పు లేనివాడె, మంగళ రూపుడూ


వందనాలు హరికి వంద వేలు !!


{ అర్థాలు : వ్యవసాయ ... కృషి, యోగ సాధన, వ్యవస్థాన ... సకల వ్యవహారాలు నిర్వహించు, సంస్థానం ,,, గమ్యస్థానం, స్థానద ... స్థానం కల్పించు, ధృవ ... స్థిరమైన, పరర్థి ... మంగళకరమైన.


భావము : వ్యవసాయానికి వాడుక భాషలో సేద్యం,కృషి అనే అర్థాలున్నాయి కదా. వాటి ఫలాలు సర్వజన శ్రేయస్సుకే కదా. యోగ సాధన అంతిమ లక్ష్యమూ సర్వజన శ్రేయస్సే గనుక అది సాధించేవాడే పరమేశ్వరుడని భావించవచ్చునేమో...కాగా, అట్టి వ్యవసాయాన్ని సజావుగా సాగించేదీ ఆయనే గనుక వ్యవస్థాన అన్నారనుకోవచ్చు, కర్మలను బట్టి ఊర్ధ్వ లోకాలలో తగిన స్థానము కల్పించువాడూ, ఆ స్థానమూ తానే అయినవాడు ఆయనే. ఎటువంటి మార్పులకూ, ఉద్వేగాలకూ లోనుగాకుండా స్థిరముగా ఉండేవాడు, మంగళకరమైన విభూతులూ(విభూతికి ఐశ్వర్యము, బలము, భస్మము వంటి నానార్థాలున్నాయి ... భస్మ ధారణ సర్వసంగ పరిత్యాగానికీ, నిర్వికారానికీ సూచిక కదా) , గుణాలతో ఉత్కృష్టమైన వైభవ సంపన్నుడూ అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}


88. స్పష్టమైన రూపు, తుష్టుడనగ వాడె,


పూర్ణకాముడైన పురుషుడతడు


సర్వశుభము లిచ్చు సాక్షాత్కరించిన


ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}


{ అర్థాలు : పరమస్పష్ట ... స్పషమైన, మంగళకరమైన రూపు, తుష్ట ... సంతుష్టుడు అనగా తృప్తి చెందినవాడు, పుష్ట ... పూర్ణ పురుషుడు, శుబేక్షణ ... శుభప్రదమైన వీక్షణము కలవాడు, చూపుతోనే సర్వశుభములిచ్చువాడు.


భావము : కేవలం ధర్మ వర్తన, ఆత్మ జ్ఞానము కలిగి సాధన చేసిన వానికే స్పష్టమైన రూపముతో గోచరించువాడు, సర్వమూ తనయుందే తను పొందవలసినది అంటూ లేనందను పూర్తిగా సంతృప్తి చెందినవాడు, పూర్ణపురుషుడు, తన సాక్షాత్కార మాత్ముననే కోరికలు నశింపజేయువాడు( ప్రాపంచికమైన కోరికలు నశిస్తే ఆధ్యాత్మిక శుభములు పొందినట్లే కదా...),దివ్య మంగళ స్వరూపుడూ అయిన ఆ శ్రీహరికే శత సహస్ర వందనాలు.}


**ఓం నమో నారాయణాయ**


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

https://t.me/SANAATANA


**ధర్మము - సంస్కృతి**

🙏🙏🙏

https://t.me/Dharmamu

వ్యక్తిత్వవికాసం

 వ్యక్తిత్వవికాసం


🍁🍁🍁🍁🍁


ఒక వ్యక్తిని గురించి చెప్పమంటే ఏమి చెప్తారు? అతడు ఎలా మాట్లాడతాడో, ఎలా ప్రవర్తిస్తాడో వివరిస్తారు. అంతే కదా! అంటే వ్యక్తిత్వం లో ఉండే ముఖ్యమైన అంశాలు మాటలు, చేతలు. 


ఇవి ఎక్కడ నుంచి పుడతాయి? 


ఇవి ఆలోచనలలో నుంచి పుడతాయి. కాబట్టి మీరు బహుశా అతడి ఆలోచనల గురించి కూడా కొంత వ్యాఖ్యానిస్తారేమో. కాబట్టి మొత్తం మీద ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు మనం అతడి మాటలు, చేతలు, ఆలోచనలను గురించి మాట్లాడతాం.


వ్యక్తిత్వంతోపాటు శీలం (స్వభావం) అనేది కూడా ఒక ముఖ్యమైన మాట. ఇవి రెండూ ఒకే అర్థాన్ని సూచించేవే అయినా ప్రస్తుతం మనం అర్థం చేసుకోవడానికి వ్యక్తిత్వం కంటే శీలం అనేది ఇంకొంచెం లోతైనది అని అనుకుందాం. 


వ్యక్తిత్వం ఒక మనిషిలో ప్రస్ఫుటంగా పైకి కనిపించేది అయితే శీలం మరింత లోతుగా ఉండి, మరింత లోతైన పరిశీలన వల్ల మాత్రమే బయటపడుతుంది. 

మరొకవైపు వ్యక్తిత్వం అంటే మనిషి ఎంత అందంగా ఉన్నాడో చెప్పేది కాదు


. బట్టలు ఎంత చక్కగా ఉన్నాయి, ఎంత చక్కగా తల దువ్వుకున్నాడు అన్నది కాదు. అవి కూడా ముఖ్యమే కానీ కేవలం అవే ముఖ్యం కావు. ఆడవారి కట్టూబొట్టూ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. 


వివేకానంద స్వామి పాశ్చాత్య దేశాలలో మాట్లాడుతూ, “మీ దేశంలో ఒక టైలర్ ఒక 'జెంటిల్ మేన్'ని తయారుచేస్తాడు. 


మా దేశంలో ఒక మనిషి వ్యక్తిత్వమే అతణ్ణి గౌరవనీయుడిగా చేస్తుంది” అని చెప్పారు.


 వ్యక్తిత్వం అంటే ఏమిటో, పరిపూర్ణమైన వ్యక్తి అనేవాడు ఎలా ఉంటాడో స్వామీజీ విస్తారంగా వివరించారు. వ్యక్తి స్థాయిలోనూ, సామాజిక స్థాయిలోనూ మాత్రమేకాక అణగారిన వర్గాల అభివృద్ధిని సాధించడంలోనూ, తద్వారా దేశప్రగతినీ, నిజమైన స్వాతంత్ర్యాన్ని సాధించడం కోసం, వివిధ స్థాయులలో మనుష్యుల వ్యక్తిత్వాన్ని ఎలా అభివృద్ధి చెయ్యాలో ఆయన గొప్ప ముందు చూపుతో వివరించారు.


 వ్యక్తిత్వం గురించి వివేకానంద స్వామి బోధనలన్నింటినీ క్రోడీకరించినట్లయితే మనం దానిని ఇలా ఒక సూత్రం రూపంలో వ్రాయవచ్చు.


చెప్పిన మాటలను (హారం) ఎంత వరకూ చేసి చూపిస్తున్నారన్న దానిని (లవం) ఒక నిష్పత్తి రూపంలో వ్రాశామనుకోండి. అప్పుడు ఒక మనిషి తాను ఆడిన మాటను తప్పకుండా ఎంతవరకూ చేతలలో చూపిస్తున్నాడో ఆ సూత్రం ద్వారా అంచనా వెయ్యవచ్చు.


                      వ్యక్తిత్వం

      చేతలు =  --------------

                       మాటలు 


ఈ సూత్రాన్ని మీరు దైనందిన జీవితంలో ప్రయోగించి చూసినప్పుడు అధికశాతం మనుష్యులలో ఆ నిష్పత్తి విలువలు ఎప్పుడూ ఒకటి కంటే తక్కువగానే ఉంటాయని గమనించవచ్చు.


మామూలు మనుష్యులందరూ ఈ స్థితిలోనే ఉంటారు.

ఆ విలువ ఒకటి కంటే తక్కువగా ఉంటే ఆ మనిషి మాట్లాడిన మాటల్ని తన చేతలలో పూర్తిగా నిలబెట్టుకోలేకపోతున్నాడని అర్థం. దుర్మార్గుల విషయంలో మాట్లాడేది ఎక్కువ, ఆచరించేది తక్కువ అనీ, లేకపోతే చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని అర్థం. 


తన మాటల్ని పూర్తిగా చేతలలో చూపేవాడికి అంటే "ఆడి తప్పనివాడికి” ఈ నిష్పత్తి ఒకటి అవుతుంది. అప్పుడు ఆ మనిషి ఒక పరిపూర్ణమైన వ్యక్తి - పూర్తి నిజాయితీ గలవాడు అవుతాడు.


దీనినే ఇంకా కొంచెం ముందుకు తీసుకువెళ్ళి ఒక వ్యక్తి శీలాన్ని కూడా ఒక సూత్రం రూపంలో రాస్తే


                 (చేతలు + మాటలు)

     శీలం =  -----------------------------

                       ఆలోచనలు


ఇలా చెప్పిన మాటలను చేతలలో చూపడమే కాక మనస్సులో ఏది ఆలోచిస్తాడో దానినే మాట్లాడి, దానినే చేతలలో చూపగలిగే వ్యక్తి ఎంత గొప్పవాడో ఊహించడానికి ప్రయత్నించండి.


అలా ఎవరైతే తన మాటల్ని, చేతల్ని తన ఆలోచనలతో

సమానం చెయ్యగలుగుతాడో అంటే ఏది ఆలోచిస్తే దానినే మాటలలో, చేతలలో చూపుతాడో అతడు అత్యున్నతుడైన

శీలవంతుడవుతాడు. 


మరొకవైపు నుంచి చూసినప్పుడు ఈ నిష్పత్తి విలువ కనుక ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఆ వ్యక్తి అతిగా ప్రవర్తించేవాడు, లేకపోతే పిచ్చివాడు అయివుంటాడు. (మహాత్ములైన మనుష్యుల విషయంలో ఈ సూత్రాలు కొన్ని సందర్భాలలో వర్తించవు. అయితే మనలాంటి మామూలు మనుష్యుల అవసరాలకు చాలావరకూ సరిపోతాయి.)


వివేకానంద...

“మీ ఆలోచనలను, మాటలను ఒకటిగా చేయగలిగితే, - నేను మరొక్కసారి ఘంటాపథంగా చెపుతున్నాను. మీ మాటలను, చేతలను సంపూర్ణంగా ఒకటిగా చెయ్యగలిగితే

మీ కాళ్ళ దగ్గరికి డబ్బు ధారాళంగా ప్రవహిస్తుంది” అని చెప్పిన మాటలను ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. 


ఆ మాటలకు అర్థం మీరు తలపెట్టిన పనులన్నింటినీ సాధించగలుగుతారనే. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే వ్యక్తికి ఎదురుండదు. 


వ్యక్తిత్వ నిర్మాణం గురించి, శీలనిర్మాణం గురించి వివేకానంద స్వామి ఇలా ఒక్క మాటలో తేల్చి చెప్పారని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.


🍁🍁🍁🍁

ఆదిశంకరాచార్యుల రచనలు సంబంధ 49

 *ఆదిశంకరాచార్యుల రచనలు సంబంధ 49  పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


49 పుస్తకాలు ఒకేచోట!   https://www.freegurukul.org/blog/adishankaracharya-pdf


               (OR)


శంకరాచార్య చరిత్రము www.freegurukul.org/g/AdiShankaracharya-1


శంకర భగవత్పాద గ్రంధ మాల www.freegurukul.org/g/AdiShankaracharya-2


వివేకచూడామణి(సర్వవిధానంద సరస్వతి స్వామి అనువాదం) www.freegurukul.org/g/AdiShankaracharya-3


శంకర గ్రంధ రత్నావళి www.freegurukul.org/g/AdiShankaracharya-4


శంకర హృదయము www.freegurukul.org/g/AdiShankaracharya-5


పంచీకరణ భాష్యము www.freegurukul.org/g/AdiShankaracharya-6


ప్రభోధ రత్నావళి www.freegurukul.org/g/AdiShankaracharya-7


ఆదిశంకరుల అపరోక్షానుభూతి www.freegurukul.org/g/AdiShankaracharya-8


సిద్ధాంత బిందు www.freegurukul.org/g/AdiShankaracharya-9


జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్య www.freegurukul.org/g/AdiShankaracharya-10


శంకర గ్రంధ రత్నావళి-1 www.freegurukul.org/g/AdiShankaracharya-11


శంకర గ్రంధ రత్నావళి-2 www.freegurukul.org/g/AdiShankaracharya-12


శంకర గ్రంధ రత్నావళి-7 www.freegurukul.org/g/AdiShankaracharya-13


శంకర గ్రంధ రత్నావళి-13 www.freegurukul.org/g/AdiShankaracharya-14


శంకర గ్రంధ రత్నావళి-16 www.freegurukul.org/g/AdiShankaracharya-15


ఆదిశంకరాచార్య దివ్యచరితామృతము www.freegurukul.org/g/AdiShankaracharya-16


ఆదిశంకరుల ఆత్మ బోధ www.freegurukul.org/g/AdiShankaracharya-17


బ్రహ్మ సూత్రాలు www.freegurukul.org/g/AdiShankaracharya-18


శివానందలహరి www.freegurukul.org/g/AdiShankaracharya-19


శివానందలహరి,బ్రమరాంబ అష్టకం www.freegurukul.org/g/AdiShankaracharya-20


సౌందర్యలహరి(వచన) www.freegurukul.org/g/AdiShankaracharya-21


శ్రీ విద్యా లహరి-సౌందర్యలహరికి విశేష వ్యాఖ్య www.freegurukul.org/g/AdiShankaracharya-22


సౌందర్యలహరి www.freegurukul.org/g/AdiShankaracharya-23


నిత్య సౌందర్య లహరి www.freegurukul.org/g/AdiShankaracharya-24


భవాని సౌందర్యలహరి www.freegurukul.org/g/AdiShankaracharya-25


వివేక చూడామణి www.freegurukul.org/g/AdiShankaracharya-26


వివేక చూడామణి(పుల్లెల శ్రీరామచంద్రుడు అనువాదం) www.freegurukul.org/g/AdiShankaracharya-27


భజ గోవిందం www.freegurukul.org/g/AdiShankaracharya-28


భజగోవిందం(విద్యాప్రకాశానందగిరి స్వామి అనువాదం) www.freegurukul.org/g/AdiShankaracharya-29


అవధూత గీత www.freegurukul.org/g/AdiShankaracharya-30


భజించు మనసా(పాటలు) www.freegurukul.org/g/AdiShankaracharya-31


భజగోవిందం(వచన) www.freegurukul.org/g/AdiShankaracharya-32


ఆదిశంకరుల అమృత గుళికలు www.freegurukul.org/g/AdiShankaracharya-33


ఆదిశంకరుల స్తోత్రాలు www.freegurukul.org/g/AdiShankaracharya-34


ఆదిశంకరుల ప్రకరణాలు www.freegurukul.org/g/AdiShankaracharya-35


మణిరత్నమాల స్తోత్రం www.freegurukul.org/g/AdiShankaracharya-36


శ్రీ శాంకర సూక్తం www.freegurukul.org/g/AdiShankaracharya-37


అష్టావక్ర గీత www.freegurukul.org/g/AdiShankaracharya-38


కనకధార స్తవం www.freegurukul.org/g/AdiShankaracharya-39


ప్రభోద సుధాకరం www.freegurukul.org/g/AdiShankaracharya-40


శంకర విజయం(వచన) www.freegurukul.org/g/AdiShankaracharya-41


ప్రశ్నోత్తరి మణిమాల www.freegurukul.org/g/AdiShankaracharya-42


షట్పదీ స్తోత్రం www.freegurukul.org/g/AdiShankaracharya-43


దక్షిణామూర్తి స్తోత్రం-వివరణ www.freegurukul.org/g/AdiShankaracharya-44


దక్షిణామూర్తి స్తోత్రం www.freegurukul.org/g/AdiShankaracharya-45


దక్షిణామూర్తి స్తోత్రం(వచన) www.freegurukul.org/g/AdiShankaracharya-46


శంకర గ్రంధ రత్నావళి లలితా త్రిశతి భాష్యం www.freegurukul.org/g/AdiShankaracharya-47


గాయత్రి మంత్ర శంకర భాష్యము www.freegurukul.org/g/AdiShankaracharya-48


శ్రీమద్భగవద్గీత -శ్రీ శంకర భాష్యం యధాతదం www.freegurukul.org/g/AdiShankaracharya-49


ఆదిశంకరాచార్యుల రచనలు పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link  www.freegurukul.org/join

అంతా ఒక్కటే

 *భార్య భర్తల మధ్య జరిగిన సంభాషణ*


భార్య: మీకు ఏమి పని లేదా? మొదట చాగంటి గారి మహా భాగవతం విన్నారు, అది అయిపోగానే మాడుగుల వారిది విన్నారు, తరువాత గరికిపాటి వారిది, ఇప్పుడు సుందర చైతన్యానంద స్వామి వారిది. 


ఎవరు చెప్పిన అదే మహా భాగవతం కధ కదా. ఒకరిది వింటే సరిపోదా?


భర్త: నువ్వు మినప్పిండి రుబ్బి మొదటి రోజు కొంచెం పిండిలో ఇడ్లీ రవ్వ కలిపి ఇడ్లీలు వేస్తావు, రెండో రోజు గారెలు, మూడో రోజు వడలు, నాలుగవ రోజు సాదా దోశలు, అయిదో రోజు కొంచెం ఉల్లిపాయముక్కలు వేసి ఉల్లి దోశ, ఆరో రోజు పొటాటో కూర వేసి మసాలా దోశ, ఏడో రోజు ఇంత టొమాటో, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఊతప్పమ్, ఎనిమిదో రోజు అదే పిండితో గుంట పునుగులు, తొమ్మిదో రోజు పుల్ల మజ్జిగ కలిపి పుల్లట్లు వేస్తూ ఉంటే నేను రేపు అనేది ఉందో లేదో అని ఆత్రంగా తినటం లేదా. 


వీటన్నిట్లో ఉన్నది మినప్పిండి అని తెలిసినా ఎంజాయ్ చేస్తున్నామా లేదా. మహా భాగవతం కూడా అంతే. 

😁😁😁😁😁

శ్రీమద్భాగవతం -45

 🕉శ్రీమద్భాగవతం -45🌷


🌷వృతాసుర వృత్తాంతము


ఒకానొక సమయంలో ఇంద్రుడు ఒక పెద్ద సభను తీర్చి ఉన్నాడు. ఆ సభకి అశ్వనీ దేవతలు వచ్చారు. యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులు వచ్చారు. ఎందఱో పెద్దలు వచ్చారు. వీరందరూ అక్కడ నిలబడి వుండగా అప్సరసలు సేవిస్తూ వుండగా ఇంద్రుడు సముచితమయిన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. అందరూ ఇంద్రుని సేవించేవారే తప్ప ఇంద్రుడి చేత సేవింపబడే వారు ఆ సభలో లేరు. గురువులకు ఒక వరుస ఏర్పాటు చేయబడింది. ఇటువంటి సభ నడుస్తూ ఉండగా ఇంద్రుడు కించిత్ అహంకారమును పొంది ఉన్నాడు. అంతమంది తనను సేవిస్తూ ఉండగా తాను చాలా గొప్పవాడినన్న భావన ఆయన మనస్సులో బయలుదేరింది. తానంత గొప్పవాడు అవడానికి కారణమయిన గురువు కనపడినా లేస్తాడా అన్నది అనుమానమే. అహంకారపు పొర కమ్మింది. మహాపురుషుడైన బృహస్పతి సభలోకి విజయం చేస్తున్నారు. ఇంద్రుడు చూశాడు. చూసి వస్తున్నవాడు బృహస్పతి అని తెలుసు. సాక్షాత్తుగా తన గురువని తెలుసు. కానీ ఒక మాట అనుకున్నాడు. ఇంతమంది నన్ను సేవిస్తున్నారు. నేను లేచి నిలబడి ఎదురు వెళ్ళి నమస్కారం చేసి తీసుకువచ్చి ఆసనం మీద కూర్చోబెట్టడం ఏమిటి? అనుకున్నాడు. గురువు వస్తుంటే చెయ్యవలసిన మర్యాద ఒకటి ఉన్నది. ఇంద్రుడు ఆ మర్యాద చెయ్యలేదు. గురువు వస్తూ సభామంటపంలోకి వచ్చి రెండడుగులు వేసి చూశాడు. ఇంద్రుడు ఎవరో వస్తున్నాడులే అన్నట్లుగా కూర్చొని ఉన్నాడు. వెంటనే బృహస్పతి అనుకున్నాడు –

బృహస్పతికి మనస్సులో కించిత్ బాధ కలిగింది. గురువు వస్తుంటే లేచి నిలబడని కారణం చేత ఇంద్రునికి కలిగిన మద వికారమును తొలగించాలని అనుకుని తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఇంద్రుడు సభ ఆపలేదు. సభ నడిపించాడు. సభ అంతా అయిపొయింది. అందరూ వెళ్ళిపోయారు. అపుడు ఇంద్రుడు అనుకున్నాడు మనసులో ‘అరెరే, ఇంతమంది నన్ను సేవించడానికి కారణం ఈశ్వరానుగ్రహం. అటువంటి ఈశ్వరానుగ్రహాన్ని నాకు తెచ్చి పెట్టినది గురువు బృహస్పతి. అటువంటి గురువు సభకు వస్తుండగా సింహాసనాధిష్టి తుడయిన రాజు లేవకూడదని చెప్పినవాడు, అధర్మంతో మాట్లాడిన వాడు, ఇంద్రుడనయిన నేనే చెయ్యకూడని పని చేశాను. నావలన ఘోరాపచారం జరిగింది. ఖచ్చితంగా ఇది నన్ను కట్టి కుదిపి తీరుతుంది. దీనిని మా గురువులే ఆపాలి’ అని గబగబా పరుగెత్తుకుంటూ గురువుగారి ఇంటికి వెళ్ళాడు.

తనపట్ల అమర్యాదగా ప్రవర్తించిన ఇంద్రుని మనస్సులో వస్తున్నా భావజాలమును బృహస్పతి తన గృహమునందు కూర్చుని తెలుసుకుంటున్నాడు. ఇంద్రుడు తన ఇంటికి వస్తున్నాడని తెలుసుకోగానే అతనికొక పాఠం చెప్పాలని, తన యోగశక్తితో ఇంద్రుడికి దొరకకుండ అంతర్హితుడయిపోయాడు. ఇంద్రుడు వచ్చాడు. కానీ ఎక్కడా గురువుగారి దర్శనం అవలేదు. ఖిన్నుడై ఐరావతం ఎక్కి వెళ్ళిపోతున్నాడు. ‘అయ్యో! గురువుగారు ఎక్కడా దొరకలేదు. గురువుగారి పట్ల అపచారం చేశాను. గురువులకు క్షమాపణ చెప్పాలని అనుకుంటున్నాను’ అని అనుకుంటున్నాడు. ఈ మాట వినవలసిన వాళ్ళు విననే విన్నారు. అదే ఉత్తర క్షణ ఫలితం అంటే. ఈయన మాటలను రాక్షసుల గూఢచారులు విన్నారు. వెంటనే పరుగుపరుగున వెళ్ళిపోయి రాక్షసులకు నివేదన చేశారు. ‘అయ్యా, ఇవాళ ఇంద్రునికి బృహస్పతి అనుగ్రహం తొలగిపోయింది. బృహస్పతికి ఆగ్రహం కలిగింది. గురువు ఆగ్రహం ఎవరిమీద కలిగిందో వాడిని పడగోట్టేయడం చాలా తేలిక. కాబట్టి ఇపుడు ఇంద్రుడు గడ్డిపోచ. మనం యుద్ధమునకు వెళ్ళడం కేవలం నిమిత్తం. ఇంద్రుడు ఓడిపోయి తీరుతాడు. అందుకని మనం యుద్ధానికి బయలుదేరుదాం’ అన్నారు. అంతే రాక్షస సైన్యం అంతా వచ్చేశారు. బ్రహ్మాండమయిన పోరు జరుగుతోంది. ఇంత బలవంతులయిన దేవతలు కూడా గడ్డిపోచల్లా ఎందుకూ పనికిరాకుండా ఓడిపోయి వెళ్ళిపోతున్నారు. రాక్షసులకు ఇప్పుడు గురుబలం ఉన్నది. వీళ్ళు దేవతలే కావచ్చు, గురుబలం లేదు. అందుచేత వీరు ఓడిపోయారు. అమరావతిని రాక్షసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇంద్రాదులు భయపడి బ్రహ్మగారి దగ్గరకు పరుగెత్తారు. “అయ్యా, కనీ వినీ ఎరుగని విడ్డూరం. కొన్ని సమ్వత్సరములు పోరాడాం. మాకు ఓటమి తెలియదు. అటువంటిది నిన్న బృహస్పతి గారికి కోపం వచ్చి సభలోంచి వెళ్ళిపోయారు. ఇవాళ అమరావతి పోయింది. ఉత్తర క్షణంలో నేను రాజ్య భ్రష్టుడను అయిపోయాను. దేనిమీద కూర్చుని వీళ్ళందరూ నావాళ్ళు అనుకోని గౌరవింపబడ్డానో వాళ్ళ ఎదుటనే ఇంద్రుడు చేతకాని వాడయి ఓడిపోయాడు అనిపించుకుని తిరిగి వచ్చేశాను. దీనికంతటికీ కారణం నేను బృహస్పతిని అవమానించడమే అని అనుకుంటున్నాను. ఇప్పుడు మాకు జీవితం ఎలా గట్టెక్కుతుంది’ అని అడిగాడు. బ్రహ్మగారు అన్నారు – మీరు అమృతం త్రాగామని, మరణం లేదని సంతోషపడుతున్నారు. మీరు పుట్టినప్పటి నుండి మహానుభావుడు బృహస్పతి బ్రహ్మవిద్యా నిపుణుడై అంతటా ఈశ్వరుడిని చూస్తూ తనకోసమని కాకుండా మహాత్యాగియై మీకందరికీ ఈ సుస్థిరమయిన స్థానములను కల్పించాడు. అటువంటి మహాపురుశుడిని ఎలా గౌరవించాలో మీకు చేతకాలేదంటే మీరు ఇవాళ మదించి ఉన్నారు. అందుకే మీరు సింహాసన భ్రష్టులయ్యారు’. బ్రహ్మగారే తలచుకుంటే ఒకసారి బృహస్పతిని ప్రార్థన చేసి పిలువగలరు. కానీ గురువుపట్ల ఆయన చూపించిన మర్యాద చూడండి. ‘మీకు దేనివల రాజ్యము పోయినది? మీకు బాగా ఎరుక కలిగిందా?” అని అడిగారు. అపుడు వాళ్ళు ‘అయ్యా, మాకు బుద్ధి వచ్చింది. మాకు ఇప్పుడు గురువుల అనుగ్రహం కావాలి’ అని చెప్పారు.

గురువు గారి అనుగ్రహం గురువుగారి నుంచే వస్తుంది.

బ్రహ్మగారు దేవతలతో ‘గురుస్థానం ఖాళీగా ఉండకూడదు. అందాకా మీకొక అభయం ఇస్తున్నాను. ఇప్పుడు మీరు ఒక గురువును ఆశ్రయించి గురువు అనుగ్రహమును పొందండి. ఆచార్య పురుషునిగా ఉండడానికి ఎవరు అర్హుడో వారి పాదములు పట్టుకోండి” అన్నారు. అంటే వాళ్ళు మాకేం తెలుసు. మీరే సెలవివ్వండి’ అని అడిగారు. అపుడు బ్రహ్మ గారు ‘త్వష్ట అనే ప్రజాపతికి ఒక కుమారుడు ఉన్నాడు. వరుసకి ఆయన మీకన్నా చాలా చిన్నవాడు. కానీ ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని. మీరు అటువంటి మహాపురుషుని సేవించి గురు పదవియందు కూర్చోపెడితే ఆయన అనుగ్రహం చేత ఆయన ఆశీర్వచనం చేత మరల రాజ్యసంపదలు పొందగలరు. అందుకని మీరు వెళ్ళి త్వష్ట ప్రజాపతి కుమారుడయిన విశ్వరూపుని ప్రార్థన చేయండి’ అన్నారు. అంతే వీళ్ళందరూ విశ్వరూపుని ఆశ్రయించారు.

విశ్వరూపుడిని ప్రార్థన చేశారు. ‘ఇప్పుడు మాకు గురువు అంటే ఎవరో తెలిసింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి, పరతత్త్వానికి, గురువుకి తేడా లేదు. ఒకటే అయి ఉంటాడు. బ్రహ్మగారి రూపమే తండ్రిగా ఉంటుంది. అందుకే తండ్రి ఉపదేశం చేస్తే బ్రహ్మోపదేశమే! సోదరుడు ఇంద్రుని రూపంలో ఉంటాడు. అన్నగారిని సేవిస్తే దేవేంద్రుని సేవించినట్లు. అమ్మ భూదేవి రూపం. తోడబుట్టిన అక్క చెల్లెళ్ళు సాక్షాత్తు రాశీభూతమయిన దయా స్వరూపములు. తన భావమే ధర్మ స్వరూపము. అభ్యాగతుడు అగ్నిదేవుని రూపం. సర్వభూతములు కేశవుని రూపములు. అందుకని నీకు మేము తండ్రుల వరుస అవుతాయి. ఎందుకంటే నువ్వు త్వష్ట ప్రజాపతి కుమారుడవు. కానీ ఇవాళ నీలో వున్న జ్ఞానమును మేము గుర్తించాము. నీయందు గురుత్వమును చూసి నిన్ను పరతత్త్వంగా చూసి నీ పాదములకు మా శిరస్సు తాటించి నమస్కరిస్తున్నాము. మాకు ఆచార్యత్వాన్ని వహించి మళ్ళీ దేవేంద్రాది పదవులు వచ్చేటట్లుగా అనుగ్రహాన్ని కటాక్షించు’ అన్నారు. 

ఆయన గురుపదవిని స్వీకరించి వచ్చాడు. వస్తూనే ఆయన ఒక మహోత్కృష్టమయిన పని చేశాడు. రాక్షసులకు ఇవాళ ఇంత శక్తి ఎక్కడ నుంచి వచ్చింది అని బేరీజు వేశాడు. వారు ఆ శక్తిని శుక్రాచార్యుల వారి అనుగ్రహం నుండి పొందారని గ్రహించాడు. ఇపుడు దేవతలకు ఎంత శక్తి వస్తే ద్విగుణీకృత ఐశ్వర్యమును ఇంద్రుడు పొంది రాక్షసులను చంపగలడో లెక్క గట్టాలి. ఇది లెక్క గట్టడానికి ఆ తేజస్సును గణించగల శక్తి ఇక్కడ ఉండాలి. అదీ ఆచార్యపదవి అంటే. అదీ గురుత్వం అంటే! ఇప్పుడు ఇంద్రుని కూర్చోబెట్టి నారాయణ కవచం ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసి ఒక మాట చెప్పాడు. ‘ఇంతకూ పూర్వం ఈ నారాయణ కవచమును ‘కౌశికుడు’ అనే బ్రాహ్మణుడు ఉపదేశం పొందాడు. ఆయన ఎడారిలో తిరుగుతూ ఉండగా నారాయణ కవచమునే ఉపదేశం తీసుకుని దానినే ధ్యానం చేస్తూ ప్రాణములను విడిచిపెట్టేశాడు. అపుడు ఆ నారాయణ కవచము తేజస్సు ఆయన అస్థికలకు పట్టేసింది. ఆయన ఆస్థి పంజరము ఆ ఎడారిలో ఇసుకలో పడిపోయి ఉండిపోయింది. చిత్రరథుడు అనే గంధర్వుడు ఆకాశమార్గంలో భార్యలతో కలిసి విమానంలో వెళ్ళిపోతున్నాడు. ఆ విమానం ఎడారిలో పడిపోయి ఉన్న అస్థిపంజరము దగ్గరకు వచ్చింది. రాగానే దానిని దాటడం మానేసి ఆ విమానం క్రింద పడిపోయింది. అందులోంచి గంధర్వుడు భార్యలతో బయట పడిపోయాడు. అకస్మాత్తుగా విమానం భూమిమీద పడి పోయిందేమిటని తెల్లబోయాడు. ఈ సమయంలో ఒక మహానుభావుడు వాలఖిల్యుడు అనే మహర్షి అక్కడికి వచ్చి ‘నీ విమానం పడిపోవడానికి కారణం ఏమిటో తెలుసా – నారాయణ కవచము ఉపదేశం తీసుకుని నారాయణ కవచమును సశాస్త్రీయంగా ఉపాసిన చేసిన ఒక మహాపురుషుడు కౌశికుడు అనే బ్రాహ్మణుడు, ఇక్కడ ధ్యానంలో శరీరం విడిచి పెట్టాడు. ఆ కవచ ప్రభావం అస్థికలకు ఉండిపోయింది. ఎవరూ ఆ అస్తికలను దాటి వెళ్ళలేరు. కాబట్టి నీవు ఆ అస్తికలను తీసి మూటగట్టి వాటిని దగ్గరలో ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి ఆ తదనంతరం నువ్వు స్నానం చేసి ఆచమనం చేసి మరల వచ్చి విమానం ఎక్కితే నీ విమానం కదులుతుంది’ అన్నాడు. ఆ చిత్రరథుడు ఎముకలనన్నిటిని ఏరి మూటగట్టి తీసుకువెళ్ళి సరస్వతీ నదిలో నిమజ్జనం చేసి, స్నానం చేసి, ఆచమనం చేసి వచ్చి విమానం ఎక్కాడు. అప్పుడు విమానం ఆ ప్రదేశమును దాటి వెళ్ళింది. ఈ నారాయణ కవచమునకు వున్న శక్తి అంత గొప్పది. నీకు ఉపదేశం చేస్తున్నాను స్వీకరించి అని ఆ నారాయణ కవచమును ఉపదేశం చేశాడు. ఇప్పుడు శుక్రాచార్యుల వారు రాక్షసులకు ఇచ్చిన శక్తి కన్నా ఇంద్రుడి శక్తి ఎక్కువయిపోయింది. గురువుల అనుగ్రహం కలిగింది. అంతే రాక్షసులను అందరినీ ఓడించి మరల అమరావతిని స్వాధీనం చేసుకుని ఎంతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు.


సశేషం....

💥💥💥

సుందరకాండ - పదమూడవ సర్గ*

 *సుందరకాండ - పదమూడవ సర్గ*


*(06)*

అయోనిజ, విదేహ రాజ్యానికి చెందిన, మిథిలను పుట్టినిల్లుగా చేసుకొన్న, జనకుని కుమార్తె అయిన సీత తన నిస్సహాయ స్థితిలో రావణునికి వశవర్తియై ఉంటుందని నమ్మకం కలగడం లేదు.


*(07)*

రాముడు ఏ క్షణంలో వస్తాడోనని రామబాణాలకు భయపడి రావణుడు సీతను తీసుకొని ఆకాశ మార్గాన వేగంగా ఎగిరి పోతున్నప్పుడు దారి మధ్యలో ఆమె క్రింద పడిపోయి ఉంటుందేమో.


*(08)*

లేకపోతే సిద్ధులు సంచరించే ఆకశమార్గంలో అపహరింపబడి తీసుకునిపోతుండగా క్రిందనున్న మహాసముద్రాన్ని చూడగానే భీతిచెంది పూజ్యురాలైన సీతకు గుండె ఆగిపోయి ఉండవచ్చునేమో.


*(09)*

సీతను ఆకాశమార్గంలో అపహరించి తీసుకొని వస్తున్నప్పుడు రావణుని ప్రచండ వేగానికీ, అతడి భుజాల ఒత్తిడికీ విశాలనేత్రాలు గల ఆ సాధ్వీమణి ప్రాణాలు విడిచి ఉంటుందేమో.


*(10)*

సముద్రం మీద ఎగురుతూ పోతున్నప్పుడు రావణుని బంధనం నుండి విడివడడానికి పెనుగులాడుతున్నప్పుడు సీత సముద్రంలో పడిపోయి ఉండడానికి కూడా ఆస్కారం లేకపోలేదు.


*జైశ్రీహనుమాన్*

జ్ఞానసంబంధ మూర్తి*

 *రమణాశ్రమ లేఖలు / జ్ఞానసంబంధ మూర్తి*


    


    భగవాన్ "ద్రవిడ శిశుః" అంటే సంబంధులేనని తమిళ్ భాషలో వ్రాసిన సౌందర్యలహరీ వ్యాఖ్యానంలో నిర్ణయించినట్లు చదివి చెప్పిన తరువాత హాల్లో ఒక దినం ఒక భక్తులు భగవాన్ నుద్దేశించి "వారికి 'ఆళుడ్య పిళ్లైయార్' అని గదా మొదటి పేరు. జ్ఞానసంబంధమూర్తి అన్న నామాంతరం కలిగింది? ఎందుకు కలిగింది?" అన్నారు. "అదా! దేవి అనుగ్రహించిన పాలు త్రాగగానే జ్ఞానసంబంధం ఏర్పడుటవల్ల  జ్ఞానసంబంధమూర్తి నాయనారనే పేరు కలిగింది. అంటే,గురుశిష్య సంబంధం లేకుండానే జ్ఞానోదయమైనది గదా? అందువల్ల. నాటినుండి ఆ ప్రాంతములందున్న వారంతా ఆ పేరుతో పిలవసాగారన్నమాట. అదే కారణం" అన్నారు భగవాన్.



    "భగవానుకువలెనే వారికీ సశరీర గురువు లేకుండానే జ్ఞానోదయమైనదన్నమాట?" అన్నారు."ఊ-ఊ అందుకే కృష్ణయ్య, వారికీ నాకు ఏమేమో సామ్యాలు చెప్పాడు" అన్నారు భగవాన్. "రమణలీలలో సంబంధులు తిరువణ్ణామలకు వస్తూ ఉంటే మార్గమధ్యంలో బోయలు సొత్తంతా దోచుకున్నారని" ఉన్నదే! వారు జ్ఞానదురంధరులు గదా? సొత్తేమున్నది వారికి?" అన్నాను. "అదా! వారు భక్తి మార్గావలంబకులు గదా, అందువల్ల ఈశ్వరాదేశానుసారం వారికి బంగారు తాళములు,ముత్యాలపల్లకీ మొదలైన చిహ్నములు లభించినవి. ఒక మఠమూ సిబ్బందీ అన్నీ ఉండేవి" అన్నారు భగవాన్. "అట్లాగా! అవన్నీ, ఎప్పుడు లభ్యమైనవి?" అన్నాను. 



     భగవాన్ ఉత్సాహపూరిత స్వరంతో "వారు జ్ఞానసంబంధ నామధారులైన తరువాత అంటే ఆ పసితనమందే అనర్గళ కవితాధారతో పాడుతూ క్షేత్రాటన మారంభించి ముందు 'తిరుక్కోలక్కా'అనే క్షేత్రానికి వెళ్లి స్వామిని దర్శించి తన చిన్ని చేతులతో తాళం వేస్తూ పద్యపదికం పాడారు. ఈశ్వరుడది చూచి మెచ్చి బంగారు తాళములు వారికిచ్చాడు. నాటి నుండి వారు ఏది పాడినా, ఎక్కడికి వెళ్ళినా, ఆ తాళములు వారి చేతులలోనే ఉండేవి. ఆ వెనుక వారు చిదంబరం మొదలైన కొన్ని కొన్ని క్షేత్రాలు చూచుకుని 'మారన్ పాడి' అనే క్షేత్రానికి వెళ్ళారు. అప్పటికి ఈ రైళ్ళు లేవుగదా! ఈ పసిబాలుడు కాలినడకనే క్షేత్రటన చేస్తూ రావటం గమనించి ఆ క్షేత్రాధిష్ఠాన దైవమగు ఈశ్వరుని హృదయం జాలితో కరిగిపోయినది. వెంటనే ఒక ముత్యాలపల్లకీ, ముత్యాలగొడుగూ, ముత్యాలతోకూర్చిన తదితరములుగు చిహ్నములన్నీ మఠాధిపతులకు తగినట్లుగా కల్పించి కోవెలయందుంచి అక్కడి బ్రాహ్మణులకూ, సంబంధాలకూ  స్వప్నమున తోచి 'అవి సంబంధువులకు సన్మానపురస్సరంగా ఈయవలసిన' దని బ్రాహ్మణులకూ, 'వారిస్తారు, తీసుకొమ్మ'ని  సంబంధాలకూ చెప్పి పల్లకి మొదలయినవి ఆ బ్రాహ్మణులచేతనే వారికిపిస్తే వారది భగవత్ప్రసాదమున లభ్యమైనది గనుక తిరస్కరింపనొల్లక గ్రహించి, ప్రదక్షిణ నమస్కృతి పూర్వకముగా దాని నారోహించారు. నాటినుండీ వారెక్కడికి వెళ్ళినా ఆ పల్లకిమీదనే వెళ్లేవారు. క్రమంగా కొంత సిబ్బంది మఠమూ అన్నీ ఏర్పడినవి. అయితే ఏ క్షేత్రానికి వెళ్ళినా గోపురదర్శనం అయ్యిందంటే, పల్లకీ దిగి కాలినడకనే పురప్రవేశం చేసేవారు ఆ నియమానుసారమే తిరుక్కోవిలూరు నుండి ఇక్కడికి నడచి వచ్చారు. అరుణగిరి శిఖరం అక్కడికే గోచరిస్తుంది కదా" అన్నారు భగవాన్.  (ఇంకా ఉంది )

      


 🍃  ఆత్మ  🍃


21.ప్ర:  ఆత్మజ్ఞానం సిద్ధించినపుడు;  తరువాత మరల నష్టమగుట వుండునా?


మ: కైవల్య నవనీతంలో అట్టి నష్టం సంభవమే అని ఉంది. వాసనలు నిశ్శేేషం  కాకుండా ప్రాప్తించిన జ్ఞానం స్థిరంగా ఉండదు. వానిని పూర్తిగాక్షయింప చేయాలి. లేకుంటే మరల జనింపక తప్పదు. గురుబోధ విన్నంతనే, ఆత్మసాక్షాత్కారం కలుగునని కొందరంటారు. ఇతరులు మననం అవసరమంటారు. చిత్తైకాగ్రత వల్లనే అని మరి కొందరు. ఇంకా కొందరు సమాధి మూలంగా అని అంటారు. ఇవన్నీ పైకి వేర్వేరుగా కనపడినా, నిజానికి అవన్నీ సమానార్థాలే! వాసనా క్షయం పూర్ణంగా అయితేనే జ్ఞానం సుస్థిర మవుతుంది. 


22.ప్ర: ఆత్మసాక్షాత్కారం కలిగినప్పుడెలా ఉంటుంది? 


మ: ప్రశ్నా తప్పు. కలగటానికి కొత్తగా ఏమీ లేదు. 


23.ప్ర: తెలియలేదు స్వామి!


మ:  ఏం లేదు. ఇప్పుడు ప్రపంచంలో నీవున్నావు. అప్పుడు ప్రపంచం నీలో ఉంటుంది.

                   


 శిష్యుడు - ఆత్మ సర్వవ్యాపి అనుచున్నారు . బ్రహ్మము ప్రతిచోట నిండియున్నది అనుచున్నారు . కానీ , వెలిగనున్నది - నాలోనున్నదియు నదియే అని కూడా చెప్పెదరు.



- నాలోనున్నదియు నదియే అని కూడా చెప్పేదరు . నాలోని యాత్మయే బ్రహ్మమైనచో , నేను సర్వవ్యాపినై యుండవలెను . కానీ , నేనీ దేహం లోపలనే యుండునట్లును ( ఇందులో నే బంధింపబడియున్నట్లు ) నాకు స్పురించుచున్నది . నా దేహముకంటే నేను వేరుగ నున్నప్పటికిని దానినుండి భేదించుటకు ( చీలిపోవుటకు ) వీలు లేనట్లున్నది . అదే రీతిగా నా మనస్సునుండి నేను వేరై నిలుచుట యసాధ్యముగనున్నది . ఇదిగాక ' నేను ' అను స్మృతికూడ మనస్సులోనిదే ( భాగమే ) ! మెదడు వినా మనస్సెక్కడ నున్నది ? వాస్తవములో నీ దేహములో నొకభాగమైన యీ మెదడును లేక మనస్సును విడిచి వేరుగ నిలువగలనని యూహించలేకున్నాను . 

మహర్షి - అయినదా ? సందేహముల కంతులేదు . ఒక సందేహము తీర్చగానే మరియొకటి యంకురించును . ఇది ఒక చెట్టు ఆకులను ఒకటొకటిగా గిల్లివేయ జూచుటవలె నుండును . అన్ని ఆకులును గిల్లి వేసినను  కొత్తగ చిగుర్చును గదా ! వేరుతో ( సమూలముగా ) ను నరికి వేయుటయే తగినపని .




 శిష్యుని ఆచారం


భగవాన్ స్కంద ఆశ్రమంలో నివసిస్తున్న రోజులవి. యాష్ పాణి అనే భక్తుడు స్కంద ఆశ్రమాన్ని నిత్యము ఊడ్చి శుభ్రపరిచే వాడు. అతడు యాష్ పాణి(శ్రీలంక) నగరం నుండి వచ్చాడు కాబట్టి , అతనిని అందరూ "యాష్ పాణి "అనిపిలిచేవారు. ఒకనాడు భగవాన్ దర్శనానికై భక్తులు వచ్చారు. వారితో భగవాన్ యథేచ్ఛగా "ఒక నోటు పుస్తకంలో కొన్ని పద్యాలను రాసు కొన్నాను. ఉత్తర కాశీ నుండి వచ్చిన భక్తుడు ఆ పుస్తకాన్ని చూడటానికి తీసుకున్నారు. ఆయన దానిని తిరిగి ఇవ్వకుండా ఉత్తర కాశీకి వెళ్లి పోయారు. వారు ఆ పుస్తకాన్ని తీసుకొని వెళ్లి కొన్ని మాసములు అయ్యింది."అని అన్నారు. "యాష్ పాణి"కొన్నాళ్ల నుండి ఆశ్రమంలో కనిపించ లేదు. హఠాత్తుగా ఒక నాడు భగవాన్ ముందు కనపడి పోయిన ఆ నోటు పుస్తకాన్ని వారి వద్ద పెట్టి నమస్కరించాడు. భగవాన్ చిరునవ్వుతో స్వీకరించారు. భగవాన్ ఆ పుస్తకాన్ని గురించి ప్రస్తావించే తప్పుడు అక్కడే పని చేస్తున్న యాష్ పాణి తన పని ముగించుకుని , వెంటనే ఉత్తర కాశీ బయలుదేరి వెళ్ళాడు. ఎన్నో రోజులు విశ్రాంతి లేకుండా తిరిగి ,ఉత్తర కాశీకి వెళ్లి, భగవాన్ చూపించిన స్వామిని వెదికి వెదికి పట్టుకుని ఆ నోటు పుస్తకాన్ని తిరిగి తీసుకొని వచ్చారు .!వెంటనే తిరువన్నామలై వచ్చి భగవాన్ కు సమర్పించారు.


“రమణ కరుణాసాగర తరంగాలు “ నుండి సేకరణ

అహల్య గాధ*

 *ఇంద్రుని వల్ల శాపగ్రస్తులైన అహల్య గాధ*


ప్రాచీన కాలంలో వున్న అస్పరసల పాత్ర ఎంతో అద్వితీయమైనది. సౌందర్యానికే ప్రతీకగా వర్ణిస్తూ ఎన్నో రకాల కథలు ప్రచురించబడ్డాయి. కేవలం అందగత్తెలే కాకుండా మంచితనం కలిగినటువంటివారి జీవిత చరిత్రలు.. మట్టిబొమ్మలు ప్రాణం పోసుకున్నట్టు అపురూపంగా వుంటాయి. ఇంద్రాది దేవతలందరూ కూడా ఆ స్త్రీలకు ముగ్ధులయిపోయేవారు. అటువంటి మహోన్నత పాత్రలను కలిగిన స్త్రీలలో అహల్య ఒకటి. ఆమె మంచిగుణాల గురించి ఒకసారి మనం కూడా తెలుసుకుందాం...


పూర్వం చతుర్ముఖుడు, గౌతమ మహర్షికి నిత్యం సేవలను అందించేందుకు, ఆయన ఆశ్రమ విధులను సక్రమంగా నిర్వహించేందుకు ఒక అప్సరసను ఏర్పాటు చేశాడు. ఆమె పేరు అహల్య. ఈమె సుగుణాలతో కూడిన సౌందర్యవంతమైన ఒక అందాల రాశి. ఈమె ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎంతో నిస్వార్థతతో, నిజాయితీగా నిత్యం గౌతమ మహిర్షికి సేవలను అందిస్తూ... ఎంతో అందంగా, సక్రమంగా నిర్వహించుకునేది. దాంతో ఈమె నిజాయితీని గమనించిన బ్రహ్మదేవుడు.. గౌతమునికి అహల్యే తగిన భార్య అని భావిస్తాడు.


అలా ఆలోచించిన మరుక్షణమే బ్రహ్మదేవుడు, ధ్యానం చేసుకుంటున్న గౌతమ మహర్షి ఎదుట ప్రత్యక్షమై ఇలా అంటాడు... "ఓ గౌతమా! నేను నీకు పెట్టిన అన్ని పరీక్షలలోనూ నువ్వు గెలిచావు. ప్రసవిస్తున్న గోవుకి ప్రదక్షిణ చేస్తూ నమస్కరిస్తే.. భూప్రదక్షిణతో సమానమైన పుణ్యం లభిస్తుంది. అటువంటి పుణ్యంతోపాటు ఎన్నో పుణ్యకారాలను సంపాదించుకున్నావు. అందుకు ప్రతిఫలంగా నేను నీకు అహల్యను భార్యగా ప్రసాదిస్తున్నాను. అహల్యను మనస్సుతో స్వీకరించి, ధన్యుడివి అవు" అని ఆశీర్వదిస్తాడు. అంతేకాకుండా.. బ్రహ్మదేవుడే దగ్గరుండి వనదేవతల సమక్షంలో వీరిద్దరి వివాహాన్ని (గౌతమ మహర్షి, అహల్య) జరిపిస్తాడు.


ఇలా జరిగిన వీరి వివాహనంతరం కొంతకాలానికి వీరిద్దరికి శతానందుకు అనే ఒక కొడుకు పుడతాడు. ఎంతో సంతోషంగా తమ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. కొన్నాళ్ల తరువాత గౌతమ మహర్షి తపో దీక్షను చేపడతాడు. ఆ దీక్ష ప్రభావం ఎంతగా వుంటుందంటే.. ఏకంగా స్వర్గాన్నే కదిలించేలా వుంటుంది. దాంతో స్వర్గలోకానికి అధిపతి అయిన ఇంద్రుడు ఒక్కసారిగా భయానికి గురవుతాడు. ఎక్కడ తన పదవి పోతుందేమోనన్న భయంతో.. అతని దీక్షను భంగం కలిగించాలని ఒక పన్నాగం పన్నుతాడు. దానికి దేవతలందరి సహాయాన్ని కూడా కోరుకుంటాడు.


అయితే అహల్య అందానికి ముగ్ధుడైన దేవేంద్రుడు ఆమెను ఎలాగైనా దక్కించుకోవాలని అనుకుంటాడు. ఒకవైపు తన స్వర్గలోకాన్ని - దేవతలను కాపాడుకునేందుకు, మరోవైపు అహల్యను పొందాలనుకునేందుకు దేవేంద్రుడు ఒక తనదైన ఒక పన్నాగం పన్నుతాడు. దానిప్రకారం ఒకరోజు దేవేంద్రుడు కోడి రూపంలో గౌతముని ఆశ్రమానికి చేరుకుంటాడు. ఇంకా తెల్లవారుజాము కాకముందే కోడిరూపంలో వచ్చిన దేవేంద్రుడు గట్టిగా కూస్తాడు. దాంతో గౌతముడు ఒక్కసారిగా ఉలిక్కపడి లేచి, బ్రహ్మముహూర్తం సమీక్షించిందని అనుకుని, సూర్యభగవానుని అర్ఘ్యం ఇచ్చేందుకు బయటకు వెళతాడు. పవిత్ర నదీజలాన్ని తెచ్చుకునేందుకు నదివైపుగా వెళుతుండగా చుట్టుపక్కల  కారు చీకటి కమ్మకుని వుంటుంది. అప్పుడు గౌతముడు తన మనసులో.. "కోడి కూసినప్పటికీ ఎక్కడా వెళుతురు జాడ కనిపించడం లేదు. ఇంకా తెల్లవారలేదులే" అని అర్థం చేసుకుని తిరిగి వెనక్కి ఆశ్రమానికి వెళతాడు.


గౌతముడు ఆశ్రమానికి చేరుకోగానే.. తన రూపంలో వున్న దేవేంద్రునిని అహల్యతో కలిసి వుండడాన్ని చూస్తాడు. దాంతో గౌతమ మహర్షికి ఎనలేని కోపం పొంగుకొని వస్తుంది. అవమానంతో కుంగిపోతున్న దేవేంద్రుడు, కోపంతో రగిలిపోతున్న మహర్షిని చూసి భయంతో తన అమరలోకానికి పరుగులు తీస్తాడు. అయితే ఇందులో అహల్య ఏ తప్పు లేకపోయినా.. ఇంద్రుని పక్కన వున్నందువల్ల గౌతమ మహర్షి కోపంతో ఆమెను శపిస్తాడు. "నువ్వు రాయిగా మారిపో" అంటూ క్షణికావేశంతో అంటాడు. అప్పుడు కూడా అహల్య తన భర్త మాటను శిరసావహిస్తూ ఏమీ అనుకోకుండా.. అతను విధించిన శాపాన్ని గౌరవంగా అంగీకరిస్తుంది.


ఇదంతా జరిగిపోయిన కొద్దిసేపటి తరువాత గౌతమ మహర్షి తన దివ్యదృష్టితో ఏం జరిగిందో మొత్తం తెలుసుకుంటాడు. అహల్య తప్పు ఏమీలేదని గ్రహిస్తాడు. దానికి ఎంతో పశ్చాత్తాపపడుతూ.. "రాయిగా వున్న నువ్వు రాముడి పాదాలు తాకినప్పుడు తిరిగి స్త్రీ రూపాన్ని పొందుతావు" అని శాపవిమోచనాన్ని ప్రసాదిస్తాడు. అలా రాయిగా మారిపోయిన అహల్య శాప విమోచన పొందేందుకు రాముని రాక కోసం ఎదురుచూస్తూ తన కాలాన్ని గడిపింది. చివరికి చాన్నాళ్ల తరువాత రాముని పాదాలతో పునీతురాలై.. మళ్లీ స్త్రీ రూపాన్ని పొందుతుంది.


అదీ అహల్య గాధ. అహల్య ఎంతో సాత్వికురాలు కాబట్టి.. తన భర్త రూపంలో వచ్చిన ఇంద్రుడు సల్లాపాలు ఆడినప్పుడు కూడా.. తన భర్తేనని అనుకుని మురిసిపోయింది. అంతేకాని.. ఆమెకు ఇతర పురుషుల మీద వ్యామోహం అనేది అస్సలు వుండేది కాదు. తొందరపాటుతో భర్త శాపించినప్పటికీ దానిని అంగీకరిస్తూ తన భర్త మాటను దాటేయకుండా శిరసావహించింది. ఇదే అహల్య గొప్పతనం.

ఆముక్తమాల్యద

 అహం అహంకారం పనికిరాదు.

..............................................

ఒక్కసారి చదివి చూడండి...!

ఆముక్తమాల్యద!

                  ➖➖➖


       పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి అడవుల్లోకి    పారిపోయాడు.    అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతు వున్నాడు. గెలిచినరాజు ఆఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు.   అనుకోకుండా, అక్కడ   యాగధేనువు  మరణించింది. అది  అశుభ సూచన!    యజ్ఞాన్ని ఎలా పూర్తిచేయాలోతెలియక ఆరాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రతిస్తే ఆ ధర్మసూక్ష్మం  తెలిసినవాడు, ఓడి పోయిన రాజేనని తేలింది. 


   ధర్మసంకటం నుంచి  గట్టెక్కించగల వాడు ఆయనేనని నిశ్చయమైంది.

గెలిచినరాజు ఏమాత్రం సందేహించ కుండా ఓడినరాజు వద్దకువెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు. 


  ఓడినరాజు శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందు కొచ్చాడు. శత్రువుకు సహకరించాడు.


    ఆఇద్దరురాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు. వారి కథే.శ్రీకృష్ణదేవరాయలు వ్రాసిన ‘ఆముక్తమాల్యద’  లోని  ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’       సారాంశం! 


 సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు.  భారతీయ    ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో,   ఈ ఉదాహరణచూస్తే ఇట్టే అర్థమౌతుంది. 


   ఈకథలో ఓడిన రాజు ఖాండిక్యుడు; గెలిచినవాడు కేశిధ్వజుడు.  కథ చివర గొప్ప మలుపు ఒకటుంది.


     తన యజ్ఞసంపూర్తికి సహకరించిన ఖాండిక్యుడికి   గురుదక్షిణగా ఏది కావాలన్నా ఇస్తానని కేశిధ్వజుడు ప్రకటిస్తాడు. అది సనాతన సంప్రదాయం! 


  ఓడిన రాజుకు ఓర్మి ఎంతప్రధానమో గెలిచిన రాజుకు సంయమనం,  ధర్మ సంప్రదాయపరిరక్షణ అంతే అవసరం. 


   ఈ అవకాశాన్ని   చేజిక్కించుకున్న ఖాండిక్యుడు   తాను కోల్పోయిన రాజ్యం తిరిగి  గురుదక్షిణగా కావాలని అడిగినా ఇచ్చేయడానికి    కేశిధ్వజుడు  సిద్ధపడతాడు. 


         ఇక్కడే ఓ చిత్రం  చోటుచేసుకుంటుంది.   రాజ్యసంపద  అయాచితంగా వచ్చిపడుతున్నా   ఖాండిక్యుడు  కాదనుకొంటాడు.


 తనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించాలని, అదే కేశిధ్వజుడి నుంచి తాను కోరుకునే గురుదక్షిణ అని ప్రకటిస్తాడు.


    ఖాండిక్యుడి నిర్ణయం   కేశిధ్వజుణ్ని విస్మయానికి    గురిచేస్తుంది ఆయన ఆలోచన ఏమిటో      తెలుసుకోవాలని అనిపిస్తుంది. అప్పుడు    ఖాండిక్యుడు అంటాడు'రాజ్యభోగాలు కేవలం భౌతిక సంపదలు!  వాటిని   కష్టంతో,   శారీరక శ్రమతో సాధించుకోవాలి.     అంతేగాని, అవి అయాచితంగా లభించాలని కోరుకో కూడదు!   


 కష్టపడి  సాధిస్తేనే వాటి విలువ తెలుస్తుంది!  నా కంటే   బలవంతుడి  చేతిలో  ఓడి పోయాను. 

అందులో  సిగ్గ పడాల్సింది     ఏమి వుంటుంది? తిరిగి పుంజుకొని   ధర్మ మార్గంలో,   క్షాత్రంతో నా రాజ్యాన్ని నేను తిరిగి చేజిక్కించుకోవాలి.   


 అది   ఒప్పుతుంది గాని,    దొడ్డిదారిన  పొందితే... పాపమవుతుంది!’ అని బదులిస్తాడు ఖాండిక్యుడు!


ఇలాంటి కథల్ని మన పిల్లలకు... పాఠ్యాంశాలుగా    నిర్ణయిస్తే, ఆపిల్లల బాల్యాన్ని    అవి  ధార్మికపథంలోకి నడిపిస్తాయి.వ్యక్తిత్వ      వికాసానికి దోహదం చేస్తాయి.        ఉచితాల కోసం తాపత్రయ పడకుండా ఆపుతాయి. ఉచితానుచిత జ్ఞానాన్ని   వారికి బాగా అలవరుస్తాయి.


      ఆముక్తమాల్యదలోని     'ఖాండిక్య-కేశిధ్వజోపాఖ్యానం' ఆ కావ్యానికి గుండెకాయ వంటిదని ఎంతోప్రశస్తి రావడానికి ముఖ్య కారణాలేమిటి?  ఆ కథలోని    ధార్మిక నేపథ్యం,ప్రబోధ గుణం. 


గెలుపు  ఓటముల    విషయంలో, కర్తవ్య నిర్వహణలో,   అయాచిత    అవ కాశాల తిరస్కరణలో...   ప్రతిఫలించిన ధర్మస్వరూపమే- మన భారతీయతకు వన్నెలద్దుతూ వచ్చింది!


    లోకంలో  ఇలాంటి కథలు   ఒళ్లు మరిపించడమే కాదు,    కళ్లు తెరుచు కొనేలా    చేస్తాయి. దీనికి మన ప్రాచీన సాహిత్యమే గొప్ప  ఆదరువు,       ఎంతో ఆలంబన!


*మన ఖర్మ .. నెహ్రు ఖాన్న్ పున్యామా అని, సెక్యూలర్ రాజ్యాంగ పరిధిలో ఇతర మతస్తుల విద్యా కమిటీ లు నిర్ణయించిన పాఠ్యఅంశాలు మన మీద రుద్ది, మన సంస్కృతిని గత 70 ఏళ్లుగా, నాశనం చేసేరు..*


 లోకా సమస్తా సుఖినోభవన్తు! రచయితకు వందనాలు🙏

--------------------------------------------------

పంచాయుధ_స్తోత్రం

 🎻🌹🙏పంచాయుధ_స్తోత్రం


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸


స్ఫురత్సహస్రారశిఖాతితీవ్రం 

సుదర్శనం భాస్కర కోటితుల్యం

సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః 

చక్రం సదాఽహం శరణం ప్రపద్యే 


విష్ణోర్ముఖోత్థానిల పూరితస్య 

యస్య ధ్వనిర్దానవదర్పహంతా

తం పాంచజన్యం శశికోటిశుభ్రం 

శంఖం సదాఽహం శరణం ప్రపద్యే 


హిరణ్మయీం మేరుసమానసారాం 

కౌమోదకీం దైత్యకులైక హంత్రీం

వైకుంఠవామాగ్రకరాభిమృష్టాం 

గదాం సదాఽహం శరణం ప్రపద్యే 


రక్షోఽసురాణాంకఠినోగ్రకంఠచ్ఛే

దక్షరత్‍క్షోణితదిగ్ధదారమ్

తం నందకం నామ హరేః ప్రదీప్తం 

ఖడ్గం సదాఽహం శరణం ప్రపద్యే 


యజ్జ్యానినాదశ్రవణాత్సురాణాం 

చేతాంసి నిర్ముక్తభయాని సద్యః

భవంతి దైత్యాశనిబాణవర్షైః 

శార్ఙ్గం సదాఽహం శరణం ప్రపద్యే 


ఇమం హరేః పంచమహాయుధానాం 

స్తవం పఠేద్యోఽనుదినం ప్రభాతే

సమస్త దుఃఖాని భయాని సద్యః 

పాపాని నశ్యంతి సుఖాని సంతి 


వనే రణే శత్రు జలాగ్నిమధ్యే 

యదృచ్ఛయాపత్సు మహాభయేషు

ఇదం పఠన్ స్తోత్రమనాకులాత్మా 

సుఖీభవేత్ తత్కృత సర్వరక్షః 


యచ్చక్రశంఖం గదఖడ్గశార్ఙ్గిణం 

పీతాంబరం కౌస్తుభవత్సలాంఛితం

శ్రియాసమేతోజ్జ్వలశోభితాంగం 

విష్ణుం సదాఽహం శరణం ప్రపద్యే 


జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః

అటవ్యాం నారసింహశ్చ సర్వతః పాతు కేశవః 

ఇతి పంచాయుధ స్తోత్రం


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🙏🌹🎻

సర్వమూ బ్రహ్మమే ]

 _*శ్రీశివానంద గురుభ్యోన్నమః : శివశ్రీ గెంటేల వెంకటరమణ గురుదేవుల బోధామృతమైన "ఋభుగీత " గ్రంథం నుండి (175)*_


_*12వ అధ్యాయము [సర్వమూ బ్రహ్మమే ]*_


_*ప్రతిసృష్టి చేయగలరు ! కానీ...  ప్రతిదీ సృష్టిచేయలేరు !!*_


_*మనిషి ఏది కొత్తగా కనుక్కున్నా... అది సృష్టిలో ఉన్నదాన్ని చూసే కనుక్కోవాలి తప్ప తాను కొత్తగా ఏదీ సృష్టించలేడు. ఎవరైనా ఈ సృష్టి రచనను అనుసరించాల్సిందే. మనలో ప్రాణంగా ఉన్నదే సృష్టిలో శక్తిగా ఉంది. సమస్త శక్తులు ఆ ప్రాణంలోనివే. ఎవరు ఎన్ని కనిపెట్టినా ప్రాణశక్తి వినియోగంతో జరగాల్సిందే. సైంటిస్ట్ ప్రాణాన్ని శక్తిగా చూస్తే, యోగి ప్రాణాన్నే చైతన్యంగా చూడగలడు. సృష్టిలో ప్రతి ఒక్కరూ దైవాంశ సంభూతులే ! కనుకనే సృష్టికి ప్రతిసృష్టి చేయగలుగుతున్నారు. విశ్వశక్తి యెడల వినయంగా ఉంటే  తాను ప్రతిదీ సృష్టి చేయలేనని గుర్తుంచుకుంటాడు. సృష్టితో సామరస్యంగా సహగమనం చేయగలుగుతాడు !!*_


_*శ్రీశివానందగురు ఎడ్యుకేషనల్ & కల్చరల్ ట్రస్ట్, శ్రీగురుధామ్ ధర్మక్షేత్రం, బలుసుపాడు, కృష్ణాజిల్లా, ఏపి, ది. 12.11.20.

శ్రీరమణీయం* *-(708)

 _*శ్రీరమణీయం* *-(708)*_

🕉🌞🌎🌳😷🇮🇳🚩


_*"దుఃఖాన్ని ఏ విధంగా రూపు మాపుకోవచ్చు !?"*_


_*మనసులో కలిగే వెలితి భావన బాధ అయితే ఆ వెలితి పదేపదే గుర్తుకు రావడం దుఃఖం. మనకు లభించాల్సిన ప్రయోజనం  పోతుందేమోనన్న 'భయం' దుఖానికి కారణం అవుతుంది. ఎవరికి ఏ దుఃఖం కలిగినా అందులో అర్థం కాని సత్యం ఏదో దాగి ఉంటుంది. పదార్థ స్వరూపం అర్థమైతే దుఃఖం రాదు. ఎందుకంటే మనసు ఒక పదార్థం. కోరిక ఒక పదార్థం. ఏదో ఒక స్థూల వస్తువు లేకుండా ఇవి రెండూ లేవు. మన దుఃఖానికి 'మనస్సు-కోరిక'లే కారణం. మనం కోరికకు రూపం లేదని అనుకుంటున్నాం. నిజానికి మనం కోరుకునే ప్రతి విషయం ఏదో ఒక రూపంతోనే ముడిపడి ఉంది. కాబట్టి కోరిక ఎప్పుడూ ఏదో ఒక వస్తువును ఆశ్రయించుకునే ఉంటుంది. వస్తువు అశాశ్వతం కనుక దాన్ని ఆశ్రయించుకున్న కోరిక కూడా అశాశ్వతమే. కోరిక అశాశ్వతమైనప్పుడు కోరికల సమూహంగా ఉన్న చిత్తం [మనసు] కూడా శాశ్వతమే !*_


_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం }"*_

_*"లేదనే భావనే బాధ - బాధ లేని స్థితే ఆనందం !''*- *(అధ్యాయం -87) {శ్రీరమణభాషణలు సత్సంగ ప్రవచన మాలిక }*_

_*రచన/బోధన : -తత్వదర్శి/శివశ్రీ గెంటేల వెంకటరమణ,*_ 

_*శ్రీగురుధామ్, బలుసుపాడు, కృష్ణాజిల్లా.*_

17-16-గీతా మకరందము

 17-16-గీతా మకరందము.

    శ్రద్ధాత్రయ విభాగయోగము

   

  -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - ఇక మానసిక తపస్సును గూర్చి వచించుచున్నారు –


మనః  ప్రసాదస్సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః | 

భావసంశుద్ధిరిత్యేతత్

తపో మానసముచ్యతే || 


తాత్పర్యము:- మనస్సును నిర్మలముగానుంచుట (కలతనొందనీయక స్వచ్ఛముగానుంచుట), ముఖప్రసన్నత్వము (క్రూరభావము లేకుండుట), పరమాత్మనుగూర్చిన మననము (దైవధ్యానము) గలిగియుండుట (లేక, దృశ్యసంకల్పము లెవ్వియు లేక ఆత్మయందే స్థితిగలిగియుండుట, అను వాఙ్మౌనసహిత మనోమౌనము), మనస్సును బాగుగ నిగ్రహించుట, పరిశుద్ధమగు భావము గలిగియుండుట (మోసము మున్నగునవి లేకుండుట) అనునివి మానసిక తపస్సని చెప్పబడుచున్నది.


వ్యాఖ్య:- “మనః ప్రసాదః”  మనస్సు తేటగా, నిర్మలముగా, కలతనొందకుండ నుండవలెను. మనస్సునందు, రజోగుణ, తమోగుణములయొక్క సంపర్కమున్నచో, అది చంచలముగానో, మత్తుగానో యుండును. కావున సత్త్వగుణమును, విశుద్ధసత్త్వగుణము నాశ్రయించి మనస్సును నిర్మలముగా నుంచుకొనవలెను. చిల్లగింజ అరగదీసి నీటిలో కలిపినచో మురికియంతయు క్రిందకు జని నీరు తేటగానుండునట్లు, భక్తి జ్ఞాన వైరాగ్యదులచే మనోమాలిన్యమును రహితమొనర్చి చిత్తమును వినిర్మలముగా జేయవలెను. ఇదియే మనఃప్రసాదము, మానసిక తపస్సు, ఇదియే మనఃప్రసాదమును స్వీకరించినవాడు మఱల బంధమును బొందనేరడు.


"సౌమ్యత్వమ్” - అంతఃకరణ వృత్తి సామాన్యముగ ముఖమునందు ప్రతిబింబించుచుండును. ముఖము సౌమ్యముగా, వికాసముగానున్నచో దానినిబట్టి చిత్తవృత్తియు నిర్మలముగా, నిశ్చలముగా, .నున్నదని ఊహించవచ్చును. అట్టి సౌమ్యస్థితి గలిగియుండుటయు మానసిక తపస్పేయగును. 


“మౌనమ్” - "వాఙ్మౌనము, మనోమౌనము" అని మౌనము రెండు విధములు. ఇచట మౌనమును మానసిక తపస్సునందు జెప్పుటవలన మానసిక మౌనమే ఇచటవివక్షితమని తెలియుచున్నది. అయితే వాఙ్మౌనము మనో మౌనమునకు సహాయకారిగా నుండగలదు. కాబట్టి అదియు నభ్యసించవలసినదే. అయితే మనోమౌనమునకై యత్నింపక కేవలము వాఙ్మౌనముమాత్రము గలిగియున్నచో అత్తఱి మనస్సు అనేక సంకల్పములతో గూడుకొని చంచలమైయుండుటవలన - ఆ మౌనమువలన ఎక్కువ ప్రయోజనము యుండదని ఈ సందర్భమున గ్రహించవలసియున్నది. మౌనమునకు ముఖ్యార్థము మనోవృత్తుల నిశ్చలత్వము, దృశ్యసంకల్పరాహిత్యమే యగును. కనుకనే మౌనమును భగవానుడు వాచికతపస్సులో చేర్చక మానసికతపస్సులో చేర్చుట సంభవించినది. కాబట్టి మనోమౌనమే సర్వులకును ముఖ్యమైనదనియు, వాఙ్మౌనము దానికి సహాయ భూతముగ నుండుననియు నెఱుంగవలెను.


“ఆత్మవినిగ్రహః” - ఇచట "ఆత్మ” అను పదమునకు మనస్సని, ఇంద్రియములని యర్థము. నిగ్రహమని చెప్పక వినిగ్రహమని చెప్పుటవలన సామాన్యనిగ్రహము చాలదనియు, ఇంద్రియ మనంబులను లెస్సగ నిగ్రహించవలెననియు తేలుచున్నది. అట్లే  " భావసంశుద్ధి” అను పదమునందును, శుద్ధి అని చెప్పక "సంశుద్ధి” అని చెప్పుటవలన భావమందు పరిపూర్ణమగు శుద్ధత్వము గలిగియుండవలెనని స్పష్టమగుచున్నది. జ్ఞానసిద్ధికి భావశుద్ధి అవసరము. అనగా ఆత్మానుభూతికి భావనిర్మలత్వము అత్యంతావశ్యకమైయున్నది. నిర్మలజలమందు సూర్యుడు దేదీప్యమానముగ ప్రకాశించునట్లు  శుద్ధహృదయమున ఆత్మభాస్కరుడు చక్కగ భాసించును. కాబట్టి మనస్సునందు, భావములందు ఏలాటి దృశ్యదోషము, అపవిత్రత చేరకుండ బహుజాగరూకతతో జూచుచుండవలెను.


ప్రశ్న:- మానసికతపస్సు అనగా నేమి?

ఉత్తరము:- (1) మనస్సు నిర్మలముగా నుండుట (2) ముఖమందు ప్రసన్నత్వము గలిగియుండుట (3) మౌనము (ఆత్మనుగూర్చిన మననము, లేక దృశ్యవృత్తిరాహిత్యపూర్వకమగు ఆత్మస్థితి) - అనునవి మానసిక తపస్సని చెప్పబడును.

ముహుర్తం

 ఒక పనిని ప్రారంభించడానికి నిర్ణయించుకున్న సమయాన్ని ముహుర్తం అంటారు. ఒక పని ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరగడానికి నిర్ణయించుకున్న మూహుర్తాన్ని మంచి ముహుర్తం అంటారు. ప్రతిరోజు సూర్యోదయానికి ముందు కాలాన్ని అనగా తెల్లవారుజామును మంచి ముహుర్తం అంటారు. అందువలనే తెల్లవారుజామున ప్రారంభించిన పని ఏటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగుతాయంటారు. తెల్లవారుజామును రెండు భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు రెండు ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించవలెనని అంటారు. బ్రహ్మ మూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేకమంది నూతన గృహప్రవేశంనకు ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంనందే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.. బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణామాయం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయడం చాలా మంచిది.


                      బ్రహ్మ ముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృథా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానకి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి ఆ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిమిషాలు ఏదైనా కీర్తన పాడటం వల్ల మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.

యద్భావం తద్భవతి

 *యద్భావం తద్భవతి ...*

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*



ఒక ఊరిలో ఒక ఆస్తికుడు, ఒక నాస్తికుడు ఎదురెదురు ఇళ్లల్లో ఉండేవారు. ఆస్తికుడు పరమ విష్ణు భక్తుడు. ఆ ఇద్దరూ కొద్దిరోజుల తేడాలో చనిపోయారు. ముందు నాస్తికుడు చనిపోగా.. ఆ తరువాత ఆస్తికుడు మరణించాడు.

విష్ణుదూతలు వచ్చి ఆస్తికుణ్ని వైకుంఠానికి తీసుకుని వెళ్లి అక్కడ సభలో విష్ణువును చూపించారు. ఆహా తన భక్తి పండింది అనుకున్నాడు ఆస్తికుడు. ఆ స్వామిని ఎన్నో స్తోత్రాలతో స్తుతి చేశాడు,ఇంతలో విష్ణు దూతలు వచ్చి అతణ్ని ‘‘పద.. పద’’ అని సభలోంచి తీసుకెళ్లడం ప్రారంభించారు.

దానికి అతడు అయోమయంతో.. ‘‘ఎక్కడికి తీసుకుపోతున్నారు?’’ అని వారిని అడిగాడు. ‘‘నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయింది. తిరిగి భూలోకానికి తీసుకుని పోతున్నాం’’ అని విష్ణుదూతలు చెప్పారు. ‘‘నా పుణ్యం అయిపోవడం ఏమిటి? నేను గొప్ప విష్ణు భక్తుణ్ని. నిత్యం ఆ స్వామిని కొలిచాను’’ అన్నాడు ఆస్తికుడు. ‘‘అది నిజమే. కానీ నువ్వు మూడు కారణాలవల్ల తొందరగా వెనక్కి భూలోకానికి వెళ్లిపోతున్నావు.

ఒకటి.. నీకు నీ జీవితంలో భక్తి ఒక భాగం మాత్రమే. అందుకే రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక విధినిర్వహణలా పూజచేస్తూ మిగిలిన సమయంలో విష్ణువును ఆలోచనలలోనికి కూడా రానిచ్చేవాడివి కాదు.

రెండో కారణం.. ‘స్వామీ! నన్ను వచ్చే జన్మలో గొప్ప ధనవంతుడిగా పుట్టించు.’ అని రోజూ ఆ దేవదేవుని కోరేవాడివి అంటే.. నీకు మళ్లీ పుట్టాలని, అదీ ధనవంతునిగా జన్మించాలని కోరిక ఉంది.

ఇక మూడో కారణం.. రోజూ పూజ పూర్తవగానే ‘ఒక్కసారి కనబడు తండ్రీ.. చాలు’ అని కోరేవాడివి. అందువల్ల నీకు కేవలం ఒక్కసారి మాత్రమే విష్ణు దర్శనం అయింది. మళ్లీ పుట్టాలనే కోరిక ఉన్నందున భూలోకానికి వెళ్తున్నావు’’ అని చెప్పారు. అదే సమయంలో.. ఆస్తికునికి విష్ణు సభలో నాస్తికుడు కనిపించడంతో అతడు నివ్వెరపోయాడు.

వీడెలా వచ్చాడిక్కడికి ? వీడు నాస్తికుడు కదా?’’ అని అతడు విష్ణు దూతలను అడిగాడు. దానికి వారు.. ‘‘అవును, నిజమే. అయితే, బతికి ఉన్నంతకాలం ఇతడు ‘దేవుడు లేడు. దేవుడు లేడు’ అంటూ.. తెలియక చేసినా నీకంటే ఎక్కువగా భగవన్నామ స్మరణ చేశాడు. ఎలాగైనా తప్పులు పట్టాలనే ఆలోచనతో పురాణ ఇతిహాసాలను, ఉపనిషత్తులను ఎన్నో మార్లు చదివాడు. వ్యతిరేకంగానైనా సరే.. నీకంటే ఎక్కువగా భగవంతుడి గురించి ఆలోచించాడు.

మరొక ముఖ్యకారణం. ఇతడి ఇంట్లో ఇతడు తప్ప అందరూ ఆస్తికులే. ఇతడి భార్య విష్ణుమూర్తి భక్తురాలు. కొడుక్కి నారాయణ అని పేరుపెట్టుకుంది. గడచిన నెలలో వైకుంఠ ఏకాదశి మరునాడు ఉదయం ఆమె పాయసం చేసింది.

వీడు ఇంటి అరుగు మీద కూర్చుని ఆ పాయసం తింటుండగా పొలమారింది. విపరీతంగా దగ్గుతూ ‘నారాయణా చచ్చిపోతున్నానురా!’ అంటూ కొడుకుని పిలిచి, అతడు మంచినీళ్లు తెచ్చేలోపునే మరణించాడు. ఏ కోరికా లేకుండా తన ప్రసాదం తిని, నారాయణ నామస్మరణ చేస్తూ మరణించినందున శ్రీమహావిష్ణువు వీడికి వైకుంఠంలో నివాసం కల్పించారు’’ అని చెప్పారు.

భక్తితో పాటు భావన కూడా చాలా ముఖ్యమని ఆస్తికుడు చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు. అయితే.. మరుజన్మలో అతడు తన పాత తప్పుల్ని పునరావృతం చేయలేదు.

మనసారా విష్ణువును కొలిచి, చేసిన కర్మల ఫలితాన్ని ఆ పరమాత్మకు ధారపోయడం ద్వారా పాప, పుణ్యాలు అంటని మహా యోగి అయ్యాడు. తెలియక చేసినా భగవన్నామ స్మరణతో నాస్తికుడు వైకుంఠంలో స్థానం పొందితే..

మరుజన్మలో స్వామిని త్రికరణశుద్ధిగా పూజించిన పుణ్యంతో ఆస్తికుడు చివరకు ఆ స్వామి హృదయంలోనే చోటు సంపాదించుకున్నాడు. జనన, మరణ చక్రం నుంచి విముక్తి పొందాడు.


🙏 *ఓం నమో నారాయణాయ*🙏


*సేకరణ :*

*వరలేఖరి.నరసింహశర్మ.*

శివానందలహరి

 శివానందలహరి

85_వ   శ్లోకం

 " జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ":


అవతారిక :


ఈశ్వరుని కి కావలసిన ఉపచారములు తాను సమకూర్చ లేక పోతున్నానని

శంకరులు ఈ శ్లోకము లో మఱోవిధంగా చెప్పారు "స్వామీ! నీకు ఉపచారాలు చేసే

 శక్తి యుక్తులు నా దగ్గఱ లేవు. కాబట్టి నన్ను మన్నింౘు ". అని శివుణ్ణి వేడుకున్నాడు.


శ్లోకము :


               జలధి మథన దక్షో నైవ పాతాళ భేదీ

               నచ వనమృగయాయాం  నైవ లుబ్ధః ప్రవీణః

               అశన కుసుమ భూషా వస్త్ర ముఖ్యాం సపర్యాం

               కథయ కథమహం తే కల్పయానీన్దు మౌళే !!


తాత్పర్యము :


 చంద్ర శేఖరుడవైన ಓ పరమేశ్వరా!  నేను పాలసముద్రాన్ని మథింౘగలసమర్థుడనుకాను. 

అందువల్ల నీకు ఆహారంగా కాలకూట విషాన్ని సమర్పింౘలేను. నేను పాతాళలోకాన్ని 

భేదింౘగలశక్తి కలవాణికూడా కాను.  అందువల్ల నీకు ఇష్టమైన సర్పమును తెచ్చి నీకు

అలంకారముగా సమర్పించలేను. నేను అడవులలో తిరిగి వేటాడేనేర్పుగల వేటగాణికాను. 

అందువల్ల వేటాడి తెచ్చి నీకు వస్త్రముగా గజచర్మాన్నికానీ, వ్యాఘ్ర చర్మాన్ని కానీ

సమర్పింపలేను. మఱి నీకు ఏవిధంగా ఆహారము, భూషణము, వస్త్రము సమర్పింౘ

గలనో చెప్పు. ( ఇటువంటివేవీ నేను ఇవ్వ లేక పోయినా నా యందు దయతో నీవు కరుణింౘు).


వివరణ:


దేవతలను పూజించేటప్పుడు వారికి షోడశోపచారాలు చెయ్యాలి.   అవి

1)  ఆవాహనం  2)  ఆసనం  3) పాద్యం  4) అర్ఘ్యం  5) ఆచమనీయం  6) స్నానం

7) వస్త్రం  8) యజ్ఞోపవీతం  9) గంధం  10) పుష్పాలంకరణం  11) ధూపం  12) దీపం

13) నైవేద్యం 14) తాంబూలం  15) నమస్కారం  16) ప్రదక్షిణం.      వీటిలో ముఖ్యంగా

నైవేద్యం,   పుష్పం   , వస్త్రం,  ఆభరణం   సమర్పింౘాలి.


కానీ శివుణి పూజించే వేళల్లో పై ఉపచారాలు సమర్పింౘడంలో తనకు చిక్కులు 

ఎదురవుతున్నాయని శంకర భగవత్పాదులు ఈ శ్లోకము లో ఈశ్వరుని కి నివేదించు

కున్నారు.


శివునికి నైవేద్యం పెట్టాలంటే ఆయనకిష్టమైన కాలకూట విషాన్ని ఆహారంగా 

సమర్పింౘాలి.  ఇక శివుడికి   పుష్పమును అలంకారంగా సమర్పింౘలి. ఈశ్వరునికి

ఇష్టమైన పుష్పాలు కల్ప వృక్ష పుష్పాలు.  కాలకూటవిషం, కల్పవృక్షం ఈరెండూ 

దేవదానవులు క్షీరసముద్రాన్ని మథించినప్పుడు పుట్టినవే కదా!  కాబట్టి నైవేద్యం గా

కాలకూటవిషాన్ని, అలంకరణ కు కల్పవృక్ష పుష్పాల్నితేవాలంటే తిరిగీ పాలసముద్రాన్న్

మథించి తేగల సమర్థతఉండాలి.  తనకాసమర్థత లేదని కనుక ఆహారము, అలంకారము

సమకూర్చలేనని శంకరులు తమ నిస్సహాయతను విన్నవింౘుకున్నారు.


ఇక భూషణములు సమర్పిద్దామనుకుంటే ఈశ్వరుని కిష్టమైన సర్పభూషణములు కావాలి

పాములు పాతాళంలో ఉంటాయి. వాటిని సమర్పింౘాలంటే పాతాళాన్ని భేదించి 

పాములను పట్టి తీసుకురావాలి. ఆ సమర్థత తనకు లేదని శంకరులు విన్నవింౘు

కున్నారు.


పోనీ శివునికి వస్త్రమనే ఉపచారమైనా చేద్దామంటే ఆయనకిష్టమైన గజచర్మాన్నో,

వ్యాఘ్ర చర్మాన్నో తేవాలి.  ఆపని చేయాలంటే వాటిని వేటాడి ౘంపి చర్మాలను

 సేకరింౘడానికి తానో మంచి వేటగాడై యుండాలి. తానలా వేటగాణి కాక పోవడం వల్ల

వస్త్రం గా గజచర్మాన్నో, వ్యాఘ్ర చర్మాన్నో తెచ్చి శివునకు ఈయలేనని శంకరులు

బాధపడ్డారు.


   " మహాదేవా !  మఱి నన్నేమి చేయమంటావో , నీవేచెప్పు ? "    అని శివుడినే 

శంకరులు అడిగారు. అయితే ఇక్కడ శంకరులు ఒక్కమాట అనగలరు. 

" స్వామీ !  పరమశివా!  నేను యథాశక్తి _ యావచ్ఛక్తి _ ధ్యానావాహనాది 

షోడశోపచార పూజాంకరిష్యే ". అని.   ఎందుకంటే భక్తులలోన్ సద్భావనకే,

దేవతలూ, సత్పురుషులూ, ద్విజులూ సంతోషపడతారట.  అదే ఇతరులైతే

తిని, త్రాగితేనే తృప్తి పడతారని స్మృతులు చెపుతున్నాయి.


            "  సద్భావనేన హి తుష్యంతి, దేవాః సత్పురుషాణి ద్విజాః, 

                ఇతరే  ఖాన పానేన "

            

              అన్నతి స్మృతివాక్యము.     నిజానికి ఈశ్వరుడు పరమ వాత్సల్య మూర్తి. 

కృపాంతరంగుడు,  భక్తుడు తనకేమి సమర్పిస్తున్నాడా!  అన్ ఎప్పుడూ ౘూడడు.  

ఇచ్చే ది భక్తి తో ఇస్తున్నాడా ?  లేదా ? అనేదే ౘూస్తాడు. ఆయనమాత్రం భక్తులకు

ఏమి కావాలో, అవే ఇస్తాడు. ఆయనలోని ఆమాతృత్వమే  భక్తులకు రక్ష.


ఈ శ్లోకము లోని  " కుసుమభూషా ". అనే దానికి కొందరు వ్యాఖ్యాత లు 

మఱోరకంగా అర్థం చెప్పారు.    ". కుసుమభూషా ". అంటే ఈశ్వరునికి తలపూవైన

 " చంద్రుడు". అని అర్థం చెప్పారు. అప్పుడు చంద్రుణ్ణి శివునికి అలంకారంగా 

ఇవ్వాలంటే పాలసముద్రాన్ని మథింౘాలి.  ఎందుకంటే చంద్రుడు పాలసముద్ర మథన

వేళలోనే పుట్టాడు.  కాబట్టి పాలసముద్రాన్ని మథింౘాల్సిఉంటుందనీ అందుకు తాను

 సమర్థుడను కాననీ అదే శంకరుల భావమని వారు చెప్పారు.


అలాగే దివాకర్ల వేంకటావధాని గారు ఇక్కడ మరోరకంగా వివరణ చెప్పారు. 

" కుసుమభూషా"  అనగా  " పుష్పాలంకారము" శివునికి విష్ణుమూర్తి పూజలో

ఒక పుష్పం తక్కువకాగా  తన నేత్రాన్ని తీసి  " సహస్ర" పుష్పం గా శివునికి

సమర్పించాడు. విష్ణుమూర్తి వరాహావతారాన్ని ఎత్తి నప్పుడు పాతాళాన్ని

భేదించి భూమండలాన్ని పైకి ఎత్తి తెచ్చాడు. ఇక్కడ శంకరులు తాను పాతాళాన్ని 

భేదింౘలేనని పాతాళాన్ని భేదించిన విష్ణుమూర్తి వలె నేత్ర పుష్పమును శివునకు

అలంకారంగా సమర్పింౘలేననీ శంకరులు చెప్పారని దివాకర్ల వేంకటావధానిగారు

వ్రాశారు.

పూర్వ జన్మ జ్ఞానం

 *మనిషి జీవితం దుఃఖమయం తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్వ జన్మ జ్ఞానం ఉండడంతో అయ్యో పుణ్యం సాధన చేయకుంటిని అని దుఃఖిస్తాడు.*


*ఈ గర్భస్తు నరకం నుండి ఎప్పుడు బయటపడితే మళ్ళీ పదార్థ ప్రపంచంలో పడతానని  దుఃఖిస్తాడు.*


*బయటకి రాగానే కన్నీళ్లు పెట్టుకుంటే పూర్వ జ్ఞానం పోయిందే అని  దుఃఖిస్తాడు.*


*తల్లి పాల కోసం ఆకలితో  దుఃఖిస్తాడు*

*శిశు ప్రాయంలో ఏది చెప్పాలన్నా  ఏడుపు తప్ప వేరే మార్గం లేదు.*


*బాల్యం వచ్చేసరికి విద్య బుద్ధులు నేర్పించడానికి పాఠశాలకు పంపుతారు విషయం పెరుగుతుందని దుఃఖిస్తాడు.*


*యవ్వనం రాగానే ఆకర్షణ మొదలవుతుంది ప్రేమ కోసం దుఃఖిస్తాడు.*


*ఉద్యోగం రాలేదని దుఃఖిస్తాడు.*


*ఇక్కడ విచారణ చేయాలి ఎందుకు ఎలా జరుగుతోందని అప్పుడే జ్ఞానం కలుగుతుంది  అంతేకాని ఆత్మ హత్య చేసుకోరాదు.*


*పెళ్లి చేస్తే స్వేచ్ఛ పోయినదనిదుఃఖిస్తాడు.*


*భార్య బిడ్డలు మాట వినలేదని దుఃఖిస్తాడు.*


*పక్క వాళ్ళ కంటే మనం తక్కువగా ఉమ్నమని దుఃఖిస్తాడు.*

*వ్రిద్ధాప్యం వచ్చాక నవారు నన్ను చూడలేదని దుఃఖిస్తాడు.*


*ఆఖరికి మరణ సమయంలో కూడా ఈ వదలడం ఇష్టం లేక అందరి మీద మమకారం పెంచుకుని అయ్యో వాళ్లకు ఓ దారి చూపించకుండా పోతున్నానని దుఃఖిస్తాడు.*


 *మనస్సు ఈ ప్రపంచంలో ఎన్నోజన్మలు  అనిత్యమైన సుఖాల  కోసం  తిరిగి తిరిగి అలసిపోయి చివరికి ఇవేవి నిత్యం కాదని పరమాత్మా వైపుకి తిరుగుతుంది మనస్సు అదే భక్తి అప్పుడు శాంతి తృప్తి లభిస్తాయి.*

*ఇన్నాళ్లు నేను నాది అని అహంకార మమకారాలు పెంచుకున్నాను ఇప్పుడు తెలిసింది నేను కాదు నాది కాదు*

*అంతా పరమాత్మే నేను కేవలం నిమిత్త మాత్రుడను అనే భావన కలుగుతుంది అదే శరణాగతి.*

*మన భక్తికి మెచ్చి భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.*


 *మనం బయట ప్రపంచాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని   వెతికి తెలుసుకుంటాము, కానీ బయట వెతకాల్సిన అవసరం లేదు.*

*మనలోనే ప్రపంచం ఉంది, పరమాత్మా ఉన్నాడు. కాబట్టి మన గురించి మనం తెలుసుకుంటే చాలు.  బంధం, మోక్షము  కూడా మనలోనే ఉన్నాయి. అంతర్ముఖత చెందాలి అప్పుడు విచారణ, అన్వేషణ మొదలవుతుంది.*

రామేశ్వర లింగము

 Sri Siva Maha Puranam -- 18 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


రామేశ్వర లింగము


రామేశ్వర లింగము చాలా గొప్ప లింగము. మహాబలసంపన్నుడయిన రావణాసురుని సంహారం అంత తేలికయినది కాదు.  పరమ మంగళప్రదుడయిన శంకరుని అనుగ్రహం కావాలి. ఈశ్వరా ! లంకా పట్టణమునందు ప్రవేశించి రావణుడే పది తలలతో నా కంటపడినా ధర్మము తప్పనంత సంయమనంతో కూడిన బుద్ధి నాయందు ప్రచోదనమయి యుద్ధం జరుగుగాక’ అని శ్రీరాముడు శంకరుని ప్రార్థించాడు. రాముడు ఎన్నడూ ధర్మము తప్పలేదు. శ్రీరాముడు శంభు లింగమును ఆరాధన చేశాడు. ఒక శివలింగమును పెట్టి దానిని ఆరాధన చేసి లేచి దాని ముందు నాట్యం చేశాడట.  రామచంద్ర మూర్తికి ఎన్ని విద్యలు వచ్చో అన్ని విద్యలతో శంకరుడు ప్రీతి చెందేటట్లుగా ప్రవర్తించాడు. తనకు ఏ విభూతి ఉంటే ఆ విభూతిని ఈశ్వర ప్రసాదం కొరకు వినియోగించాడు.

స్వామిన్ శంభో మహాదేవ సర్వదా భక్తవత్సలా

పాహిమాం శరణాపన్నం తద్భక్తం దీనమానసం!!

ఈశ్వరా! నేను నీ భక్తుడిని, దీనుడిని. ఎప్పుడయినా నానుండి కోపం బయటకు రావచ్చు. బాహ్యమునందు గొప్ప బలపరాక్రమములు గల రావణాసురుణ్ణి నేను నిగ్రహించాలి. నన్ను ఆశీర్వదించాలి. జయమును ఇవ్వాలి.   నన్ను అనుగ్రహించమని  అనేసరికి శంకరుడు ప్రత్యక్షం అయి శ్రీరాముని చేత పూజలు అందుకున్నాడు. శ్రీరాముడు నీవు ఇక్కడనే వసించు. ఇక్కడ వసించిన నిన్ను రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడిన లింగమనే పేరుతో లోకమంతా నిన్ను ఆరాధన చేస్తుంది అన్నాడు. శివుడే  శ్రీరాముడిగా వెళుతున్నాడు. శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః’ – లంకకు వెడుతున్న శ్రీరామునికి పరమశివుని ఆశీర్వచనం కలిగింది. ‘నీవు జయమును పొందుతావు అని పరమశివుడు ఆశీర్వదించాడు.  రామచంద్రమూర్తి కోరిక మేరకు ఒక శివలింగంగా కూడా ఆవిర్భవించారు. రావణుని సంహరించి తిరిగి పుష్పకవిమానంలో రామచంద్రమూర్తి సీతమ్మ తల్లితో కలిసి వెడుతూ కిందికి చూపించి ‘సీతా! ఇదిగో సేతువు. అక్కడే నాకు మహాదేవుడు సాక్షాత్కరించి నన్ను అనుగ్రహించాడు’ అని చెప్పారు. రామాయణంలో యుద్ధకాండలోని శ్లోకములలో ఈపాదం ఉన్నది. ఆయన శివపూజ చేశాడు అనడంలో ఏమీ సందేహం లేదు.

ఇక్కడ మనకి ఒక సందేహం కలగవచ్చు. సముద్రం దాటేముందు రామచంద్రమూర్తి పూజ చేసిన సందర్భంలో శివలింగం ఆవిర్భవించింది అని చెప్పుకున్నాము.  ఈవేళ రామేశ్వరం దీవియందున్న శివలింగమును రామచంద్రమూర్తి స్థాపిత లింగంగా పూజ చేస్తున్నాం. రెండూ ఒకటేనా? అలా అయితే స్థలపురాణంలో రావణ సంహారం అయిపోయిన తర్వాత రామచంద్ర మూర్తి ప్రతిష్ఠ చేయడం కోసం హనుమను కాశీ పట్టణం పంపించి విశ్వనాథ లింగము నొకదానిని తీసుకురమ్మంటే హనుమ కించిత్ ఆలస్యంగా వస్తే సీతాదేవి సైకత లింగము తయారుచేసిందని, దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేశారని రామేశ్వరంలో చెప్తుంటారు. పైగా అక్కడ సరస్వతీ బావి, సావిత్రీ బావి, గాయత్రీ బావి మున్నగు బావులు ఉన్నాయి. ఈ రెండు శివలింగములు ఒకటేనా? ఈవిషయమును మహానుభావుడు మల్లాది చంద్రశేఖరశాస్త్రి గారు ‘రామాయణమునందు ధర్మ సూక్ష్మములు’ అనే గ్రంథంలో పరిష్కారం చేశారు. ఆయన ఒకమాట చెప్పారు. కూర్మపురాణంలోంచి ఒక విషయమును ప్రతిపాదన చేస్తూ

‘యావస్సేతుశ్చతావశ్చ కాస్యాంయత్రతిరోహితః’ ‘నేను తిరోహితుడనై ఉంటాను. అందరికీ నేను కనపడను, కనపడకుండా ఉంటాను అని శంకరుడు అన్నాడు. కనపడకుండా ఉన్నాడు కాబట్టి రామచంద్రమూర్తి చేత ప్రతిష్ఠించబడి రామచంద్రమూర్తి చేత పూజలందుకున్న శంకరుడు సముద్రమునకు ఈవలి ఒడ్డున సాక్షాత్కరించాడు అని  ఒక నమస్కారం చేసి ద్వీపంలోకి వెడితే అక్కడ రామేశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సీతమ్మ తల్లి చేతులతో పోగుచేయబడిన మట్టితో ఏర్పడిన శివలింగ దర్శనం అవుతుంది. వ్యాసుడు స్కాందపురాణంలో నాగర ఖండమునందు ఈ శివలింగం ప్రతిష్ఠితం చేయబడడం యథార్థమే అని చెప్పి ఉన్నాడు.  అది రామేశ్వర లింగమే. హనుమ కూడా శివుని అవతారమే అని శివపురాణం చెప్తుంది. హనుమ కూడా రాక్షస సంహారమునందు ప్రధాన పాత్ర పోషించాడు. హనుమ చేతితో కూడా ఒక శివలింగం ప్రతిష్ఠ అవాలని విశ్వనాథుడు భావించి ఉంటాడు. అందుచేతనే కించిత్ ఆలస్యం అయితే ముహూర్తం అయిపోతుందని సీతమ్మ ప్రతిష్ఠించాలి. తన సంకల్ప ముహుర్తమై హనుమ ప్రతిష్ఠించాలి. ఈశ్వర సంకల్పముగా సీతమ్మ తల్లి అక్కడ ఇసుకను ప్రోగుచేస్తే అది శివలింగం అయింది.  దానిని రామచంద్రమూర్తి ప్రతిష్ట చేశాడు.  రామనాథ లింగము అని పిలుస్తారు. రెండవది హనుమ తీసుకు వచ్చిన లింగము. అది కాశీనుండి తేబడింది  దానిని విశ్వనాథ లింగము అని పిలుస్తారు. ఆ బావులలో ఉండే నీటియందు ఓషధీశక్తులు ఉంటాయి. ఆ బావుల నీటితో స్నానం చేయాలి.

రామేశ్వరంలో మనం సముద్రస్నానం చేస్తాము. రామేశ్వర దర్శనం అద్భుతమయిన దర్శనం. అక్కడ రైల్వేస్టేషన్లో ఒక గొప్పతనం ఉన్నది. కొత్త ప్లాట్ ఫారం కట్టడం కోసమని తవ్వితే అక్కడ పెద్ద దక్షిణామూర్తి విగ్రహం బయటపడింది. ఆ దక్షిణామూర్తిని భారతీయ రైల్వే వారు మరోచోట పెట్టకుండా రైల్వేస్టేషన్ ప్రాంగణంలోనే ఉన్న పెద్ద రావిచెట్టు క్రింద పెట్టారు.  రైల్వేస్టేషనులోనే దక్షిణామూర్తిని దర్శనం చేసుకోవచ్చు.

అక్కడే శంకరాచార్యుల వారు తీసుకు వచ్చిన శివలింగములలో ఒక శివలింగం ఉన్నది. అది స్ఫటికలింగం. దానిని సూర్యోదయం కాకుండా దర్శనం చెయ్యాలి. ఆ లింగం చాలా చిత్రంగా ఉంటుంది. అటువంటి స్ఫటికలింగం మరొకటి శ్రీకాళహస్తిలో ఉన్నది.  అక్కడ విన్యాసములేవీ కనపడవు. దాని వెనకాల ఒక లైటు వెలుగుతూ ఉంటుంది. కానీ రామేశ్వరంలోని స్ఫటికలింగం అలా కాదు. తెల్లవారుజామున ఆ శివలింగమునకు అర్చకులు పూజచేస్తారు. అలా మంత్రములు చదువుతూ పూజ చేస్తున్నప్పుడు ఒక ఎర్రని పువ్వు తెచ్చి ఆ స్ఫటిక లింగం ముందర పెడితే మొత్తం ఆ శివలింగం అంతా ఎర్రగా మారిపోతుంది. ఆ పువ్వును తీసేస్తే మరల  తెల్లటి లింగం కనపడుతుంది. అదీ స్ఫటికలింగ దర్శనం చేయవలసిన విధానం.  నిర్గుణమయిన పరబ్రహ్మము శుద్ధసత్వంతో ఉంటాడు. ఆయనయందు లోకము ప్రకాశిస్తూ ఉంటుంది.

ఎవరయినా ఈ రామేశ్వర లింగం దగ్గరకు వెళ్లి కాశీ పట్టణంలో ఉన్న గంగను తీసుకు వెళ్ళి ఆ రామేశ్వర లింగమును గంగధారలతో అభిషేకిస్తే అలా అభిషేకం చేసినవాడు కైలాసమును చేరుకుంటున్నారు. గంగ అనగా జ్ఞానము. కాశీ గంగతో అభిషేకం చేయడం వలన ఉన్నది ఒక్కటే పదార్ధం అన్న ఎరుక లోపల బాగా నిలబడాలి. ఇది నిలబడడం రామేశ్వర దర్శనం. అది చేసిన వారు  సంసార సముద్రమును దాటి ఈశ్వరుని పొందుతున్నారు.  అటువంటి స్థితిని పొందడానికి పరమయోగ్యమయిన క్షేత్రము రామేశ్వర క్షేత్రము. ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. కాశీ వెడతానని సంకల్పం చేసి వెళ్లకపోతే ఆర్తి పొందితే కాశీ వెళ్ళిన పుణ్యం ఇవ్వబడుతుంది.  రామేశ్వరం వెడతానని సంకల్పం చేసి వెళ్ళకపోతే మహాపాపమును ఖాతాలో వేస్తారు.  రామేశ్వరం వెడదాం అనుకున్నానని అనకూడదు. ‘ఈశ్వరుడు నన్ను రామేశ్వరం తీసుకు వెళ్లాలని ప్రార్థిస్తున్నాను’ అని అనాలి. ఆ బాధ్యతను ఆయన మీద పెడితే  ఆయనే  రామేశ్వరం తీసుకువెడతాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి

 *పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు?* 

-

ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదాని శాస్త్రం చెప్తుంది.


కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితి లో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత  ఔదార్యానికి తలవంచాలిగా? 


కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి, కన్యాదాత మీద పడి అరవాడనికి, విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది?దానం ఇస్తున్నవాడిని ఇంకా ఇంకా కట్నాలు, కానుకలు, లాంచనాలు అవీ ఇవీ అడగచ్చు అని ఎవరు చెఫ్ఫారు నీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా? కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని పుచ్చుకోవడమే. వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు.  అంతకన్నా ఇంకేం కావాలి?


"సీతారాములలా ఉండండి!" అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. నిజంగా సీతారామకళ్యాణ ఘట్టం చదివితే, మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది. జనక మహారాజు, దశరథ మహారాజుని అడుగుతారు "మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా?" అని. అప్పుడు దశరథ మహారాజు ఏమంటారో తెలుసా? "అయ్యా! ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది" అని. దశరథుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్ర ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు. అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు. 


అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు!


అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది.


తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? "పెళ్ళి బాగా గొప్పగా జరిపించండీ!" అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు. 


కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్ళి వాళ్ళ అరుపులు, కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచుల దబాయింపులు - ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు.👌 అందరికి పంపించండి🙏🏼🙏🏼

ఆర్జిత సేవ‌ల ఆన్‌లైన్

 *న‌వంబ‌రు 13న శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల ఆన్‌లైన్ టికెట్ల కోటా విడుదల*


         శ్రీవారి కళ్యాణోత్సవం, డోలోత్స‌వం, బ్ర‌హ్మోత్స‌వం, సహస్ర దీపాలంకరణ సేవలు న‌వంబ‌రు 13వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 11.00 గంట‌ల‌కు టిటిడి ఆన్ లైన్ (వ‌ర్చువ‌ల్‌) కోటాను విడుదల చేయ‌నుంది. 



          న‌వంబ‌రు 22 నుంచి 30వ తేదీ వరకు ఈ సేవ టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.


        కాగా, క‌ల్యాణోత్స‌వం, డోలోత్స‌వం, బ్ర‌హ్మోత్స‌వం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు బుక్ చేసుకున్న గృహ‌స్తులు  శ్రీ‌వారి ద‌ర్శ‌నం కొర‌కు వారికి ప్ర‌త్యేకంగా కేటాయించిన దర్శనం స్లాట్‌ల‌ల్లో ద‌ర్శ‌న టికెట్లు పొంద‌వ‌ల‌సి ఉంటుంది.  కల్యాణోత్సవం టికెట్లు పొందిన‌ గృహస్తులు(ఇద్దరికి) ఆ టికెట్‌పై ఉచితంగా శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. డోలోత్స‌వం, బ్ర‌హ్మోత్స‌వం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు బుక్ చేసుకున్న గృహ‌స్తులు వారికి కేటాయించిన ప్ర‌త్యేక స్లాట్‌ల‌ల్లో రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టికెట్లు పొంద‌వల‌సి ఉంటుంది. టికెట్లు బుక్‌ చేసుకున్నతేదీ నుండి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని గృహ‌స్తులకు టిటిడి కల్పించింది.


ప్ర‌తి నెల చివ‌రి వారంలో శ్రీవారి ఆర్జిత సేవ‌ ఆన్‌లైన్ (వ‌ర్చువ‌ల్‌) కోటా విడుద‌ల :‌‌‌  


       తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల ఆన్‌లైన్ కోటాను ప్ర‌తి నెల చివ‌రి వారంలో టిటిడి విడుద‌ల చేస్తుంది.      

ఇందుకు అనుగుణంగా శ్రీ‌వారి దర్శనం కోటాను, దర్శనం స్లాట్‌లను క్రమబద్ధీకరిస్తూ రోజువారి దర్శనం టోకెన్ల‌ను భ‌క్తుల‌కు మంజారు చేయ‌బ‌డుతుంది. కోవిడ్ లాక్‌డౌన్  తరువాత, ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసే మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పరిగణనలోకి తీసుకుని టిటిడి శ్రీ‌వారి ఆర్జిత సేవల కోటాను ఖరారు చేస్తున్న‌ది. కావున‌ ఈ విష‌యాన్ని భ‌క్తులు గ‌మ‌నించ‌గ‌ల‌రు.


🚩🚩🚩🚩🚩🚩🚩🚩

*హిందూ వైభవమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక*

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

ధన త్రయోదశి

 *ధన త్రయోదశి* 

*దీపావళి*   *నరక చతుర్దశి*

*కార్తీక మాసారంభం*


 13 తేదీ నవంబర్,  శుక్రవారం రోజున కుబేరపూజ ధన్వంతరి జయంతి ధంతేరస్ దానినే ధన త్రయోదశి అంటారు.... ఆరోజు ధన్వంతరి జయంతి కూడా చేస్తారు....


 నరక చతుర్దశి  మరియు దీపావళి శ్రీ శార్వరి నామ సంవత్సర నిజ ఆశ్వీయుజ మాస  నవంబర్ 14 తేదీన,  శనివారం రోజున వస్తున్నది.   నరకచతుర్దశి నివాళి మంగళ స్నానము,  మంగళహారతులు ఉదయం పూర్తి చేసుకోవాలి.                 


 అదే రోజు మధ్యాహ్నం తర్వాత అమావాస్య వస్తుంది కాబట్టి ఆరోజు అంటే శనివారం సాయంత్రం మహాలక్ష్మి పూజలు చేసుకోవాలి,   మరియు కేదారేశ్వర వ్రతములు కూడా చేసుకోవచ్చు.... 


తెల్లవారి 15 నవంబర్ ఆదివారం రోజున  అమావాస్య ఉదయం 11 గంటల దాకా ఉన్నది.... అయితే పెద్దలు సిద్ధాంతులు చెప్పిన మాట సూర్యోదయానికి తిథి ఆ రోజు మొత్తం కూడా ఉంటుంది కాబట్టి ఆరోజు కూడా కేదార వ్రతములు చేసుకోవచ్చు........


సోమవారం బలిపాడ్యమి కార్తీక మాసం అభిషేకాలు ప్రారంభం.... మంగళవారం విదియ ఈ రోజు యమద్వితీయ... లేదా భగినీహస్తభోజనం...  దీనినే భయ్యా దూజ్ అని కూడా అంటారు.     అంటే యమున తన అగ్రజుడు యమధర్మరాజుకు వచ్చి స్వయంగా వండి పెట్టింది అంటే భోజనం తయారు చేసి పెట్టింది అందువల్ల ఆ రోజు అక్కచెల్లెళ్ళు తమ సోదరులకు భోజనం వారి చేతుల మీదుగా స్వీకరించాలి అని మనకు ఈ పండుగ చెబుతుంది.... దీపావళి పండుగ నెల రోజుల పండుగ ప్రతిరోజూ దీపారాధన చేయాల్సిందే ఉదయము సాయంత్రము కూడా.


🙏ఓం శ్రీ మాత్రే నమః🙏

వాక్_సామర్ధ్యం

 వాక్_సామర్ధ్యం 


వారధి  నిర్మించి రామచంద్ర  ప్రభువు  వానర  సేనతో  లంకా  నగరం  చేరుకున్నారు.  


యుద్ధ  నీతి  ననుసరించి  శాంతి  కోసం  చివరి  ప్రయత్నంగా  అంగదుడిని  రావణుని  వద్దకి   రాయబారిగా  పంపారు.  


 యుద్ధం  నివారించడానికి  ప్రయత్నించమన్నారు. 


 అంగదుడు  రావణ  సభకి  చేరుకున్నాడు.   


అంగదుని  తండ్రి  వాలి  రావణుని జయించినవాడు.  అతన్ని  ఓడించలేక  అతనితో  స్నేహం  చేసుకున్నాడు  రావణుడు. 


 అంతటి   బలశాలిని  ఒక్క  బాణంతో  సంహరించాడు  రాముడు.  


ఈ  విషయం  రావణుడికి  తెలుసు.   


తన  తండ్రిని  చంపిన  రాముడి  తరఫున  దూతగా  వచ్చిన  అంగదుడిని  మానసికంగా  దెబ్బ  తీయాలనుకొన్నాడు.  


 ‘రావోయ్  అంగదా!  నీ  తండ్రి  వాలి  నాకు  మంచి  మిత్రుడు.  ఆయన  కుశలమేనా?’  అంటూ  పలకరించాడు. 


 అప్పుడు  తన  తండ్రి  రాముడి  చేతిలో  హతమయ్యాడని  అంగదుడు  చెప్పవలసి  వస్తుంది.


  ఆ  తర్వాత  అదే  రాముడి  తరఫున  రాయబారానికి  వచ్చావా? అంటూ  అతనిని  పరిహసించ వచ్చు.  


ఎంతటి  మనో  స్థైర్యం  కలవా డైనా  దీనివల్ల  బలహీన  పడటం  ఖాయం.  అప్పుడు  తను  వచ్చిన  పని  సరిగా  చెయ్యలేడు.   ఇదీ  రావణుని  పన్నాగం.  


కానీ  రావణుని  ప్రశ్నకి  అంగదుడి  సమాధానం  చూడండి....


  ‘రావణా! ఇప్పుడు  నా  హిత  వచనాలు  వినకుంటే  నువ్వే  వెళ్లి  నా  తండ్రి  క్షేమ సమాచారాలు  స్వయంగా తెలుసుకోవచ్చు. ఆ  పరిస్థితి  రాకూడదనే  నీ  మంచి  కోరి  రామునితో  శత్రుత్వం  పెట్టుకొని  చావు  కొని  తెచ్చుకోవద్దని  చెప్పడానికి  వచ్చాను’  అన్నాడు.  


అతని  పన్నాగాన్ని  సమర్ధంగా  తిప్పి  కొట్టడమే  కాకుండా  అదే  సమయంలో   తను  ఏమి  చెప్ప్దదలుచుకోన్నాడో  అది  కూడా  స్పష్టంగా  చెప్పాడు  అంగదుడు. 


అతని  ఈ  జవాబు  విని  మనోస్థైర్యం  కోల్పోవడం  రావణుని  వంతయ్యింది.  


ఈ  రోజు  వ్యక్తిత్వ  వికాసం  కోసం  చెప్పే   పాఠాల్ని  మించిన  పాఠాలు  మన  పురాణాల్లో  వున్నాయి. 


 అవి  తెలుసుకుంటే  మన  విద్యార్ధులతో  పోటీ  పడటం  ప్రపంచంలో  ఎవ్వరి  వల్లా  కాదు.

బాణాసంచాపై నిషేధం

 *రాష్ట్రంలో బాణాసంచాపై నిషేధం విధిస్తూ హైకోర్టు ఆదేశాలు*


 దీపావళి సందర్భంగా తెలంగాణలో బాణసంచా అమ్మకాలు, కాల్చడంపై హైకోర్టు నిషేధం విధించింది. కొవిడ్‌ నేపథ్యంలో రాష్ట్రంలో నిషేధం విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. 


ఈ మేరకు బాణసంచా నిషేధంపై విస్తృత ప్రచారం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.దీపావళి సందర్భంగా బాణాసంచా నిషేధించాలని న్యాయవాది ఇంద్ర ప్రకాశ్​ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 


కరోనా పరిస్థితుల్లో కాలుష్యం పెరిగి తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషనర్ కోరారు. సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు రాష్ట్రాల్లో నిషేధించాయని చెప్పారు. దీనికి నిర్దిష్ట పాలసీ రూపొందించలేదని, ఎన్​జీటీ ఇతర మార్గదర్శకాలు పాటిస్తామన్న ప్రభుత్వం తెలిపింది. వాదనలు విన్న న్యాయస్థానం.... బాణసంచా విక్రయాలు, కాల్చడాన్ని నిషేధించాలని ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీచేసింది.


 మరోవైపు ఇప్పటికే పలురాష్ట్రాలు బాణసంచాపై నిషేధం విధించాయి. దిల్లీ సహా కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్‌ ప్రభుత్వాలు నిషేధం విధిస్తూ ప్రకటన చేశాయి

క్యాన్సర్_ఒక_వ్యాధి_కాదు

 *బట్టబయలైన_రహస్యం..*

*క్యాన్సర్_ఒక_వ్యాధి_కాదు....*.

*ఒక_విటమిన్_లోపం......*


*కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ నందితా డిసౌజా చెప్పిన దాని ప్రకారం క్యాన్సర్ అనే పదమే ఒక_పెద్ద_అబద్ధం*. క్యాన్సర్ భూతం పేరు చెప్పి ప్రపంచాన్ని ఎలా బయపెడుతున్నారో అందరికి తెలిసిందే. ఈ భూతం వెనుక దాగున్న నిజాన్ని బట్టబయలు చేయడమే ఈ పోస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం..


మిమ్మల్ని అభ్యర్దించే ఒక విషయం ఏమిటంటే.... ఇప్పుడు మీరు తెలుసుకుంటున్న ఈ విషయాన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా మీ శత్రువులతో కూడా షేర్ చేయండి. ఇది మేము సొంతంగా రీసెర్చ్ చేసి చెబుతున్న విషయం కాకపోవచ్చు. కాని ఇందులో ఉన్న విషయాలు క్యాన్సర్ నుండి 

*ఓ_నలుగురినైనా_కాపాడితే_అంతే_చాలు...*.


క్యాన్సర్ అనే దానికి నివారణ లేదని డాక్టర్స్ చెబుతారు. కానీ అది శుద్ధ అబద్ధం. క్యాన్సర్ అనేది నివారణ లేని జబ్బు కాదు... ఇది ఒక భయంకరమైన బిజినెస్ చాలా మంది అంటుంటారు.

   ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది పిల్లల నుండి పెద్దల వరకు అందరికి వస్తుందని.... అందరిని భయపెడుతున్న మరియు భయపడుతున్న వాళ్ళకి


*అర్ధం_కావాలనే_ఈ_పోస్ట్ ఉద్దేశ్యం....*


*వరల్డ్_వితౌట్_క్యాన్సర్- World without CANCER అనే ఒక బుక్ ఉందని, దాన్ని అన్ని భాషలలో తర్జుమా చెయ్యకుండా ఎందుకు, ఎవరు అడ్డు పడుతున్నారో చూద్దాం.*

*క్యాన్సర్ అనేది B17 లోపమే గాని జబ్బు కాదు.*

👌👍ఈ లోపాన్ని అణచడానికి కీమోథెరపీ అని, సర్జరీ అని, హై డోస్ మెడిసిన్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ తో మనిషిని చంపకుండా చంపేస్తున్నారు.


మీకు గుర్తుందా? గతంలో అనే అంతుపట్టని వ్యాధితో ఎంతో మంది నావికులు చచ్చిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యాధికి స్కర్వీ (scurvy) అని పేరు పెట్టారు. విటమిన్ లోపం వల్ల ఎంతో మంది చనిపోయారు.


 *అది విటమిన్ లోపం వల్ల వచ్చిన రోగం అని చెప్పకుండా... అంతుపట్టని రోగం అని చెప్పి ప్రజల నుండి డబ్బులు హాస్పిటల్స్ వాళ్ళు దోచుకున్నారు*


 అది కేవలం విటమిన్ C వల్ల వచ్చిన రోగం.

*క్యాన్సర్_కూడా_ఇలాంటిదే...అంటే విటమిన్ లోపమే క్యాన్సర్_అని_అర్ధం. క్యాన్సర్ సెల్స్ ఎక్కడో ఉండవు మన బాడీ లోనే ఉంటాయని చాల మంది డాక్టర్స్ కూడా చెపుతారు.* అసలు లోపల ఉన్న క్యాన్సర్ బయటకు ఎందుకు వస్తుంది? 


*మనం దానికి సంబంధించిన విటమిన్లు సరిగ్గా తీసుకోకపోవడం వలన.*


మానవత్వం లేని మనుషుల వల్ల, కాంక్రీట్ జంగల్ లో బ్రతుకుతున్న జీవితాల వల్ల, క్యాన్సర్ అనే ఒక పదం సృష్టించి... దాన్ని బిజినెస్ చేసారు కొంతమంది డాక్టర్స్.

*మనుషుల భయాన్ని ఆసరా చేసుకొని కొన్ని కోట్ల కోట్లు సంపాదిస్తున్నారు. ఈ విషయం ఇప్పటిది కాదు... వరల్డ్ వార్ 2 తర్వాత క్యాన్సర్ అనే దాన్ని ఒక బిజినెస్ చేసి దాని ద్వారా బాగా సంపాదిస్తున్నారు. ఆ కాలంలో, ఈ కాలంలో బాగా ఖర్చు పెట్టి కూడా వీళ్ళు సాధించింది ఏంటో తెలుసా? రాకుండా_చూసుకోవడమట, నివారణట.* అసలు రాకుండా చెయ్యడం కాదు, అలా చేస్తే హాస్పిటల్స్ కి డబ్బులు రావు కదా.


   మీకు గాని.. మీకు తెలిసిన వాళ్లకు గాని క్యాన్సర్ అని లోపం

*ఉంటె_కంగారు_పడాల్సిన_అవసరం లేదు మీరు చేయాల్సింది ఒకటే...*


   ఈ రోజుల్లో ఎవరైనా స్కర్వీ (scurvy) వ్యాధితో చనిపోతున్నారా? లేదు.... ఎందుకంటే దానికి కారణం విటమిన్ C లోపం అని తెలుసుకొని ఆ లోపాన్ని సరిద్దికోవడం వల్ల.

   మరి క్యాన్సర్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం.  *ఆ_లోపాన్ని_కూడా_B17_తో_పోగొట్టుకోవచ్చు.*


#క్యాన్సర్_రాకుండా_చేసుకోవడం_చాలసులువు!!


★15 నుండి 20 నేరెడు కాయలు..

★ క్రాన్బెరి/ఆపిల్ సీడ్స్.

★ ఎండు ద్రాక్ష.

★ బాదాం పప్పు.

★ బ్లాక్ మల్బెర్రి, బ్లూ మల్బెర్రి, కోరిందకాయ స్ట్రాబెర్రి.

★ నువ్వులు, అవిసె గింజలు. 

★ ఓట్స్, బార్లీ, గోధుమ బియ్యం, నల్ల గోధుమలు.

★ బీర్ ఈస్ట్, వరి, తీపి గుమ్మడికాయ. తెల్ల ఆపిల్ ★ (పియర్ ఆపిల్)

★ నిమ్మ, ఉసిరి, చిక్కుడు, గోధుమ గడ్డి, 

★ జీడీపప్పు,పిస్తా.......      పైన చెప్పినవన్నీ 


*అధిక_శాతంలో_విటమిన్_B17_కలిగిఉన్నవి.*


ఈ లోపాన్ని సరిదిద్దు కోవడానికి ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి.


*గోధుమ_మొలకలు (Wheat Sprouts )* 


ఒక అద్భుతమైన క్యాన్సర్ నిరోధక మందు.


*రోజూ_ఒక_తులసి_ఆకు_తింటే_జీవితంలో ఎలాంటి క్యాన్సర్ లు దరిచేరవు..*


Wheat Sprouts bud is a Rich Source of Liquid Oxygen and the strongest anti-cancer matter in the name of "laetrile", and this matter is present in the fruit stone of ఆపిల్ (ఆపిల్ గింజలు). Laetrile is the extract form of vitamin B17 (Amygdalin)


అమెరికన్ మెడిసినల్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏంచేస్తుందో తెలుసా, నిషేధించబడిన -  *LAETRILE- ప్రొడక్షన్ ని రహస్యంగా ఇంప్లీమెంట్ చేస్తుంది (ఈ మందుని మెక్సికో లో తయారుచేయించి అమెరికాలోకి రహస్యంగా తరలిస్తున్నారు)*

Dr. హారొల్ద్ W.మన్నెర్ తన -డెత్ అఫ్ క్యాన్సర్- బుక్ లో క్యాన్సర్ ని -laetrile- ట్రీట్మెంట్ తో 90 శాతం వరకు నయం చేసారని వివరించారు.


*క్యాన్సర్_రావడానికి_ముఖ్యకారణం_ఏంటో తెలిస్తే అవాక్కవుతారు* అవేంటంటే

1) #వాష్_చెయ్యడానికి_వాడే_రసాయనాలు.

2) వాషబేసిన్ కడగడానికి ఉపయోగించే రసాయనాలు.

3) టాయిలెట్స్ శుభ్రపరచడానికి వాడే 

రసాయనాలు పీలచడం.


మేము వాటిని తినడం లేదు కదా అని అనవచ్చు. కానీ మీరు పీలుస్తున్నారంటే అది ఒకరకంగా తినడం లాంటిదే. మీరు మీ ప్లేట్స్ ని లిక్విడ్స్ తోనే వాష్ చేస్తున్నారు కదా? అలా ఎంత క్లీన్ చేసిన సరే.. ఆ కెమికల్స్ కొంత మీ ప్లేట్స్ లో అలానే ఉంటాయి. ఆ ప్లేట్ లోని ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్ కి కెమికల్స్ అంటుకొని మీ శరీరంలోకి చేరతాయి. (పూర్వ కాలంలో ఆకులలో తినేది అందుకే కదా)


*దీనికి_విరుగుడు_ఏంటో_తెలుసా ???*

మీరు వెనిగర్ తో మీ పాత్రలను క్లీన్ చేసుకోవచ్చు.


*మీరు కొన్న కూరగాయల్ని ఒక అరగంట పాటు ఉప్పు నీళ్లలో నానబెట్టండి, తరువాత మంచి నీటి తో కడగండి మరియు దానికి వెనిగర్ ని ఆడ్ చెయ్యండి. దీనివల్ల క్యాన్సర్ ను వ్యాపింపజేసే కెమికల్స్ దూరంగా ఉంటాయి.*


దయచేసి ఈ పోస్టుని అందరితో షేర్ చేయండి..!! 

ఈ విషయాన్నీ కేవలం మీ మిత్రులకే కాకుండా 

మీ శత్రువులతో కూడా షేర్ చేయండి...! 


*క్యాన్సర్_బారిన_పడకుండా_అందరిని_కాపాడండి.

నిజాయితీ

 నిజాయితీ


🍁🍁🍁🍁




ఒకతను ఒకరోజు ఒక పెళ్ళికేళితే అక్కడ తన ప్రాధమిక పాఠశాలలో విద్య నేర్పించిన గురువు గారు తటస్థ పడ్డారు.


ఆయనను చూడగానే ఈ యువకుడు ఆనందంతో ఉబ్బితబ్బియి , ఆయన పాదాలకు నమస్కరించి, నన్ను గుర్తు పట్టారా మాస్టారూ అని గద్గద స్వరంతో అడిగాడు. 


మాస్టారు అన్నారు " నేను గుర్తు పట్టలేదు నాయనా, కొద్దిగా నీ పరిచయం చేసుకో" అన్నారు.


ఆ యువుకుడన్నాడు తన పూర్వ మాష్టారితో " నేనండి, స్వరూప్ ను, నేను మీ దగ్గర మూడవ తరగతిలో ఉండగా నేను తరగతిలో ఇంకో అబ్బాయి వాచ్ దొంగలించాను, మీకు ఆ వుందంతం గుర్తున్నదా, నేను అవమానాలపాలు కాకుండా మీరు కాపాడిన రోజు, నా జీవితాంతం గుర్తుండిపోయే రోజు,మీకు గుర్తు లేకపోతే నేను మీకు విపులంగా చెప్తాను " అన్నాడు.


"ఆ రోజు ఒక అబ్బాయి చాలా అందమైన వాచ్ పెట్టుకొచ్చాడు, నాకు కొనే తహతు లేక , అలాంటి వాచ్ నాకు కావాలి అని ఆ అబ్బాయికి తెలియకుండా నేను దొంగలించాను"


"ఆ అబ్బాయి కొద్దిసేపటి తర్వాత తన వాచ్ పోయిన సంగతి గుర్తించి ఏడుస్తూ మీకు పిర్యాదు చేసాడు"


"మీరు తరగతిలో ఉన్న విద్యార్థులనందరిని బెంచి మీద కళ్ళు మూసుకుని నిలబడమన్నారు.మా జేబులు వెతికి దొంగను పట్టుకొని, ఆ అబ్బాయి వాచ్ అతనికి ఇద్దామని"


అందరితో పాటు నేనుకూడా బెంచి మీద నిలబడ్డాను సన్నగా వణుకుతూ, నాకు వాచ్ దాచడానికి సమయం లేదు, జేబులోంచి తీస్తే నా స్నేహితులు చూస్తారు, నా జేబులో వుండకూడని వాచ్ ఉంది, నాకు "దొంగ" "అబద్దాలకోరు" అన్న ముద్రపడుతుంది కాసేపట్లో, ఎందుకిలా చేసాను అని మనసులో అనుకుంటూ బెంచి మీద నిలబడ్డాను గట్టిగా కళ్ళుమూసుకుని.


మీరు మా వెనకాలనుంచి వచ్చి ఒక్కొక్కరి ఒళ్ళంతా తడిమి, జేబులు వెతకడం ప్రారంభించారు. నా దగ్గరకు వచ్చి అందరిలా నన్ను కూడా వెతికి నా జేబులోని వాచ్ తీసుకున్నారు.అక్కడితో ఆగకుండా నా తరువాత మిగిలిన విద్యార్థులను కూడా వెతికారు. మీరు అందరిని వెతకడం అయిన తరువాత అందరిని కళ్ళు తెరిచి మా మా స్థానంలో కూర్చోమన్నారు. నన్ను పిలిచి క్లాసులో అందరికి చూపిస్తూ నేనే దొంగతనం చేసాను అని పిలుస్తారేమో అని భయపడుతూ కూర్చున్నాను"


"కానీ మీరు, పిల్లలందరికీ వాచ్ చూపించి, ఆ అబ్బాయిని పిలిచి వాచ్ ఇచ్చారు. నన్ను ఒక్కమాట కూడా అనలేదు, నేనే దొంగతనం చేసాను అని క్లాసులో ప్రకటించలేదు.ఆ ఉదంతం ఎవరికి చెప్పలేదు"


ఆ తరువాత నేను అదే పాఠశాలలో పదో తరగతి వరకు చదివాను. ఒక్క మాస్టారు కానీ, నా సహా విద్యార్థులు కానీ ఎప్పుడూ నేను వాచ్ దొంగలిచ్చినట్టు మాట్లాడుకోలేదు, ఎన్నోసార్లు అనుకున్నాను మీరు నా పేరు ఆ రోజు క్లాసులో ప్రకటించి ఉంటే ఆ దొంగతనానికి నెనేంత క్షోభ పడేవాడినో, ఎన్ని అవమానాలు ఎదుర్కొనే వాడినో, ఆ రోజు నా గౌరవం మీరు కాపాడారు"

అని ఎప్పుడో తన చిన్ననాటి సంఘటన గుర్తుచేశాడు మాష్టారుకి,



మాస్టారు అతనికేసి చూస్తే ఆ యువకుడి కళ్ళలో సన్నటి కన్నీటితెర.


"ఇప్పుడు నన్ను గుర్తు పట్టారా? పట్టకుండా ఎలా వుంటారు మాస్టారు?, నేను, మీ విద్యార్థిని, మీకు ఆ రోజు జ్ఞాపకం ఉంది కదా?"


"నేను జీవితంలో మర్చిపోలేని రోజు, మళ్ళీ అలాంటి తప్పు ఎప్పుడూ చెయ్యకూడదు అని తెలుకున్న రోజు మాస్టారు"


ఆ ఉపాధ్యాయుడు జవాబిచ్చారు ఆ యువకుడికి

" బాబు, ఆ రోజు ఆ వాచ్ ఎవరు దొంగలించారో నాకు గుర్తులేదు, నీతోపాటు నేను అందరి జేబులు నా కళ్ళుమూసుకుని వెతికాను"



🙏🙏🙏🙏🙏🙏🙏

ధన్వంతరి జయంతి*

 *🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 🙏* 

 🚩🚩నమః శుభోదయం 🚩🚩


బొడ్ల మల్లికార్జున్ రాష్ట్రకార్యదర్శి హిందూధర్మ ప్రచారసమితి, తెలంగాణ 


*కలి యుగాబ్దీ 5122*

*శ్రీ శాలివాహన శకం 1942*

ఆంగ్ల మానం *12-11-2020, గురువారం* 

శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం, శరదృతువు; నిజ ఆశ్వయుజ మాసం;బహుళ పక్షం ద్వాదశి: సా.6-24 తదుపరి త్రయోదశి; హస్త: రా.12-04 తదుపరి చిత్త; వర్జ్యం: ఉ.9-25 నుంచి 10-56 వరకు; అమృత ఘడియలు: సా.6-26 నుంచి 7-56 వరకు; దుర్ముహూర్తం: ఉ.9-51 నుంచి 10-36 వరకు, తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు; రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.6-06 సూర్యాస్తమయం: సా.5-21


 *ఈరోజు ధన్వంతరి జయంతి* 


దేవతల ప్రార్థన మేరకు శ్రీహరి వారికి అమృతము అందించాలని సంకల్పముతో క్షీరసాగర మదనం జరింపించగా క్షీరసాగరమున అమృతభాండము తీసుకుని ధన్వంతరి ఆవిర్భవించెను. ధన్వంతరిని అమృత పురుషుడు అని అంటారు. *‘ధను’* అనగా చికిత్సకు అందని వ్యాధి, *‘అంత’* అనగా నాశము *‘రి’* అనగా కలిగించువాడు. చికిత్సకు లొంగని వ్యాధులను నశింపచేయువాడు అని ధన్వంతరి శబ్ధానికి అర్థము. సకల లోకాలలో చికిత్సకు అందని వ్యాధి మరణమే కావున దానిని తొలగించి అమృతాన్ని ఇచ్చి అంతర్థానం అయినట్లు భాగవతాది పురాణాలలో చెప్పబడింది. అలా వచ్చిన స్వామి వృక్షశాస్త్రమును, ఔషధ శాస్త్రమును చికిత్సా విధానాన్ని వివరించే 18 మహా గంథ్రాలను అందించారు. వాటిని ఆధారంగా చేసుకుని చ్యవన, అత్రి, బృహస్పతి, కవి, చంద్ర, వరుణ, మను, ఇక్ష్వాకు మొదలగువారు వైద్య శాస్త్ర గ్రంథాలను అందించారు. ఇలా ధన్వంతరి వైద్య శాస్త్రాన్ని ఆరోగ్య సూత్రాలను అందించారు.


 *ఆశాచ పరమా వ్యాధి: తతో ద్వేష: తతో మను: |* 

 *తేషాం వినాశనే వైద్యం నారాయణ పరాస్మృతి: ||* 


ధన్వంతరి అను గ్రంథానుసారం అన్ని వ్యాధుల కంటే పెద్ద వ్యాధి *‘ఆశ’* తర్వాత *‘ద్వేషం’* ఆ తర్వాత ‘కోపం’ ఈ మూడు వ్యాధులకు చికిత్స నారాయణ మంత్రం. ఇటువంటి ఆధ్యాత్మిక వ్యాధి నివారణ, ఆది భౌతిక వ్యాధి నివారణ, ఆది దైవిక వ్యాధి నివారుణలకు వైద్య శాస్త్రాన్ని ప్రవర్తింపచేసిన వాడు ధన్వంతరి.


జై గురుదేవ్...

అజీర్తికి- చక్కటి ఆయుర్వేద మందు

 అజీర్తికి- చక్కటి ఆయుర్వేద మందు 

అజీర్తి అనేది చాలా మందికి వుండే ఒక సాధారణ సమస్య. దీనికి ఆయుర్వేద మందు ఒకటి వున్నది. ఎటువంటి సైడ్ అఫక్ట్స్ లేని ఈ మందు చిన్న పిల్లల దగ్గరనుండి వృద్ధుల వరకు అందరు సురక్షితంగా ఉపయోగించవచ్చు. 

లవణ భాస్కర చూర్ణం. 

ఇది పంచ లవణాలు, మరియు చేజీలకర్ర లాంటి ఇతర దినుసులతో చేసిన పొడి. దీనిని భోజనము చేసిన తారువాట్ కొద్దిగా తీసుకొని మంచి నీళ్లు తాగితే చక్కగా తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. ఇది ఉప్పుప్పగా మంచి రుచి కలిగి ఉంటుంది. చాలా కాలంగా అజీర్తితో బాధపడుతున్నవారు ఈ మందు చాప్పరించిన తరువాత గోరు వెచ్చని నీటిని తీసుకుంటే మంచిగా పని చేస్తుంది. 

ఈ మందు రక్త పోటు వున్నవాళ్లు వైద్యుని సలహాతో మాత్రమే వాడాలి. ఎందుకంటె ఇందులో 5 రకాల లవణాలు వున్నాయి అవి రక్త పోటుని పెంచుతాయి. గమనించగలరు. 

ఈ మందు శరీరానికి సరి పడని యెడల విరోచనాలు కాగలవు. మీకు విరోచనాలు అయితే మందు వాడటం మానండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ మందు రోజు వాడవచ్చు. 

అజీర్తి సమస్య నిజానికి చాలా మంది బాధపడుతున్నారు. వారందరు ఈ మందు వాడి ఊరట చెందాలని ఇక్కడ వ్రాస్తున్నాను. 

చాలా కంపెనీలు ఈ మందుని తయారుచేస్తున్నారు. కానీ జాన్దు కంపెనీ మందుని వాడటానికి నేను సూచిస్తాను. ఎందుకంటె ఈ కంపెనీ వారు ఈ మిశ్రమాన్ని చాలా మెత్తగా నూరి ప్యాకు చేస్తారు. దానివల్ల మందు మంచిగా పనిచేస్తుంది. డాబర్ కంపెనీ మందు అంత మెత్తగా ఉండదు అని నా అభిప్రాయం. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి అజీర్తినుండి విముక్తులు కండి 

మందు డబ్బా మీద పేర్కొన్న విధంగా మోతాదు తీసుకోండి. 

పైన పేర్కొన్న మందు ఎప్పుడు ఇంట్లో ఉంచుకోవటం మంచిదని నా అభిప్రాయం. తక్కువ ఖర్చుతో మీరు అజీర్తినుండి  సత్వరంగా నివారించుకోవచ్చు. మరొక ఆయుర్వేద మందుతో మళ్ళి కలుద్దాము. 

మీ భార్గవ శర్మ. 

ఓం తత్సత్ 

సర్వే జానా సుఖినోభవందు. 


ఆర్ఎస్ఎస్

 🕉️🕉️ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా పోరాడటానికి ముందు ఆర్ఎస్ఎస్ గూర్చి ముఖ్యంగా తెలుసుకోవాలి.


🔥🔥రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), కేంబ్రిడ్జ్, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్, ఐఐఎం, ఐఐటి, బిఐటి, ఎన్ఐటి మరియు ప్రపంచ వ్యాప్తంగా RSS నెట్‌వర్క్ చూస్తే షాక్ అవుతారు. 


🔥🔥RSS యొక్క నెట్‌వర్క్

అధ్యక్షుడు,

ఉపాధ్యక్షుడు,

ప్రధాన మంత్రి,

హోం మంత్రి,

ఆర్థిక మంత్రి,

లోక్సభ స్పీకర్

మరియు

18 ముఖ్యమంత్రులు,

29 గవర్నర్,

1 లక్ష శాఖలు,

150 మిలియన్ వాలంటీర్లు,

1 లక్ష సరస్వతి విద్యామందిరంలు

5 లక్షల ఆచార్యులు

పది మిలియన్ల విద్యార్థులు,

భారత కార్మిక సంఘంలో 2 కోట్ల మంది సభ్యులు,

1 కోట్ల ఎబివిపి కార్మికులు,

15 కోట్ల మంది బిజెపి సభ్యులు,

1200 ప్రచురణ సమూహం,

9 వేల మంది పుల్ టైమర్స్,

7 లక్షల మంది మాజీ సైనికుల మండలి,

1 కోటి మంది విశ్వ హిందూ పరిషత్ సభ్యులు (ప్రపంచవ్యాప్తంగా),

30 లక్షల బజరంగ్ దళ్ హిందుత్వ సేవకులు,

1.5 లక్షల సేవకులు,

18 రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు,

303 లోక్‌సభ ఎంపి,

68 రాజ్యసభ ఎంపీలు,

1460 మంది ఎమ్మెల్యేలు,


🔥🔥వనవాసి కళ్యాణ్ ఆశ్రమం,

వనబంధు కౌన్సిల్,

సంస్కార్ భారతి,

విజ్ఞన్ భారతి,

స్మాల్ స్కేల్ భారతి,

సేవా సహకారం,

సేవా ఇంటర్నేషనల్,

నేషనల్ కౌన్సిల్ కమిటీ,

ఆరోగ్య భారతి,

దుర్గా వాహిని,

సామాజిక సామరస్యం వేదిక,

విశ్లేషణాత్మక సామర్థ్య అభివృద్ధి మరియు పరిశోధన బోర్డు,

సమర్థుడు,

నిర్వాహకుడు,

పాంచజన్య,

శ్రీరామ్ జన్మభూమి ఆలయ నిర్మాణ ట్రస్ట్,

దీన్‌దయాల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్,

భారతీయ ధ్యాన సాధన,

సంస్కృత భారతి,

డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా,

జమ్మూ కాశ్మీర్ స్టడీ సర్కిల్,

విజన్ ఇన్స్టిట్యూట్,

హిందూ హెల్ప్‌లైన్,

హిందూ సెల్ఫ్ సర్వీస్ అసోసియేషన్,

హిందూ మున్నాని,

ఆల్ ఇండియా లిటరేచర్ కౌన్సిల్,

ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్,

వివేకానంద కేంద్ర,

తరుణ్ ఇండియా,

ఆల్ ఇండియా కస్టమర్ పంచాయతీ,

హిందూస్థాన్ న్యూస్,

ప్రపంచ సంభాషణ కేంద్రం,

ప్రజా సంక్షేమం,

చరిత్ర సేకరణ కమిటీ,

స్త్రీ శక్తి మేల్కొలుపు,

ఒకే పాఠశాల,

ధర్మ జాగ్రన్,

భారత్ భారతి,

సావర్కర్ అధ్యాయన్,

శివాజీ అధ్యాక్సన్,

పడిపోయిన పవిత్ర సంస్థ,

హిందూ ఐక్యత,

నాలుగు డైమెన్షనల్ హిందూ మతాన్ని పరిరక్షించడానికి, ఇలాంటి అనేక సంస్థలు పనిచేస్తున్నాయి.


 పగలు, రాత్రి ప్రజలు ప్రేరణగా పనిచేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో సుమారు 10 లక్షల మంది ప్రచారకులు ఉన్నారు, వారు తమ "కులవాద చాతుర్వణం బ్రాహ్మణ మతాన్ని" రక్షించడానికి జీవితకాలం అవివాహితులుగా ఉండాలని నిర్ణయించుకున్నారు మరియు వారి పెంపకానికి వారి సమాజం బాధ్యత తీసుకుంది. ఆర్‌ఎస్‌ఎస్‌కు నిధులు లేని భారతదేశంలో ఆలయం లేదు. విదేశాల నుండి కూడా చాలా డబ్బు ఉంది. మతం పేరిట ఎక్కడో కొన్ని కార్యక్రమాలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి.


కాంగ్రెస్ లేదా కమ్యూనిస్ట్ పార్టీల, మూలాలను చాలా తేలికగా ఆర్ఎస్ఎస్ కదిలిస్తుంది.  ఆర్ఎస్ఎస్ లేని భారతదేశం గురించి ఎవ్వరూ కలలు కనలేరు మరియు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టలేరు.


ఈ దేశంలోని శూద్ర / అతిశూద్రులు నేటికీ మద్దతు ఇవ్వకపోతే, భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ మాత్రమే శతాబ్దాలుగా పాలన చేస్తుంది. మనుస్మృతి యొక్క నాలుగు చాతుర్వర్ణ వ్యవస్థ అమలులో ఉంటుంది. దీనిలో శూద్ర (ఓబిసి) సేవా (బానిస) పని చేస్తుంది, అతిశూద్ర (ఎస్సీఎస్టీలు) అంటరానివారు అవుతారు, అవర్ణులు ఎస్టీలు కూడా అడవుల నుండి తొలగించబడతారు, ముస్లీంలు రెండవ తరగతి పౌరులు అలాగే ఉంటారు.


మీరు హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడల్లా, మీ భాష దేశద్రోహిగా లేదా మీరనుసరించే మతం  శత్రువుగా గుర్తింపబడుతుంది. మతవిశ్వాసం ద్వారా కరిగిన సీసంను చెవుల్లోకి పోశారు.  కేకలు వేయడానికి డ్రమ్స్ కొట్టడానికి వాటి శబ్దాలలో మీ గొంతుక అణచివేయబడుతుంది.


ఈ సమస్యలను నివారించడానికి మార్గం ఏమిటి అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది.


85% శూద్ర బహుజన సమాజం చైతన్యం పొంద, ప్రజలు మనువాది వ్యవస్థను వదిలించుకోవాలని ప్రచారం చేస్తున్నారు, చిన్న, పెద్ద సంస్థలన్నీ కలిసి నిలబడి మనువాదులను వ్యతిరేకిస్తే, ఆర్‌ఎస్‌ఎస్ ఎంత శక్తివంతమైనప్పటికి, ఖచ్చితంగా దానిని ఓడించవచ్చు, 


ఒకే ఒక సమస్య బహుజనులకు ఉంది. మన సంస్థలన్నీ ఒకటి అవుతాయని ఆశించడం అతి పెద్ద మూర్ఖత్వం. ఎందుకంటే ఎవరైనా ఒక సంస్థను ఏర్పాటు చేయడం ఆచరణాత్మకం కాదు, ఎందుకంటే దాని స్వంత గుర్తింపు కొరకు సంఘాలను సృష్టించడం ద్వారా పని చేయాల్సి ఉంటుంది, అందువల్ల సంస్థల అనైక్యత సమస్యగా మారింది. స్వార్థ ప్రయోజనాలను ఆశించి సొంతంగా సంఘాలు పెట్టుకున్న వారందరూ తమ సంఘాలను మూసివేయాలి. రద్దు చేయాలి.


ఇప్పుడు ఆచరణాత్మకమైన ప్రణాళిక ఏమిటి?  సైద్ధాంతిక ఏకరూపతను అవలంబించడం అనేది ఆచరణాత్మకమైనది. అంటే, అన్ని సంస్థల యొక్క సాధారణ ప్రాధాన్యత ఎకీకరణ. వర్గీకరణ కాదు. 


☸️☸️1. బహుజన సమాజంలో మహా పురుషులైన బుద్ధుడు, అశోక్, కబీర్, రవిదాస్, నారాయణ గురు, ఫూలే, సావిత్రిబాయి, సంత్ గాడ్గే బాబా, లలాయి, జగదేవ్, రామ్‌శ్వరూప్, సాహు మహరాజ్, పెరియార్, బాబాసాహెబ్ అంబేడ్కర్, కాన్షిరామ్ మొదలగువారి జయంతులను, వర్థంతులను పండుగలా జరుపుకోవాలి. ఆ రోజు స్వీట్ల స్థానంలో పుస్తకాలను పంపిణీ చేయాలి. సంఘ సంస్కర్తల జయంతుల రోజున బహిరంగంగా వందనం చేయాలి, తద్వారా బహుజన సమాజ ప్రజలు, హిందూ దేవుళ్ళకు ప్రత్యామ్నాయంగా మహాపురుషులను ఉపయోగించుకోవచ్చు. ఈ నిజమైన విముక్తిదారులు ఆదర్శాలను మూలవాసులు అవలంబించాలి.


☸️☸️2. అన్ని బహుజన సంస్థల ప్రజలు తప్పనిసరిగా మూడు తీర్మానాలు చేయాలి - 1. మేము విగ్రహారాధన చేయము. 2. మేము కుల భేదాలను అంగీకరించము. 3. మేము బ్రాహ్మణుడితో ఎ పూజా కార్యక్రమాలు చేయము.


☸️☸️3. అన్ని బహుజన సంస్థల ప్రజలు భారత రాజ్యాంగం పీఠికపై ప్రమాణ స్వీకారం చేసి తమ కార్యక్రమాన్ని ముగించాలి.


✊✊ఈ సంస్థల ప్రజలందరూ ఈ సాధారణ సైద్ధాంతిక విషయాలను అవలంబిస్తే, సంస్థలు ఒకటి కావా, కనీసం బహుజన సమాజం యొక్క సైద్ధాంతిక ఆలోచన ఒకటి కావచ్చు. 85% మంది ప్రజలు ఒకే విధంగా ఆలోచిస్తారు. వారి శత్రువులను ఎవరో మరియు స్నేహితులు ఎవరో గుర్తిస్తారు. ఆ రోజు ఆర్‌ఎస్‌ఎస్ ఎంత శక్తివంతంగా ఉన్నా, 85% సమాజం యొక్క సైద్ధాంతిక ఐక్యత ముందు నిలబడదు.


👊👊మిత్రులారా విరివిగా ప్రచారం చేయండి అన్ని గ్రూపుల్లో షేర్ చేయండి. ఇది ఒక సంస్థ యొక్క సమాచారం కాదు. మన మూల నివాసుల మొత్తానికి సంబంధించిన విలువైన పోస్టింగ్.                                                                                     బిట్టు భాయ్👍👍