**అద్వైత వేదాంత పరిచయం**
8.4.1 మంద భక్తి :
చాలామంది దేవుణ్ణి వాళ్ళ ప్రాపంచిక గమ్యాలు చేరుకునేందుకు ఒక మార్గంగా కొలుస్తారు. ‘నేను ఈ ఆలయానికి వెళితే, నాకు ఈ కోరిక తీరుతుంది
అనుకుంటారు. ఇలా దేవుణ్ణి కొలిస్తే, దాన్ని మంద భక్తి (తక్కువస్థాయి భక్తి) అంటారు’ . అలాంటివాళ్ళు దేవుని మీద అలుగుతారు కూడా.‘నాకు దేవుని మీద పిచ్చికోపం వచ్చింది. మా
అమ్మాయి పెళ్ళి కుదర్చమని కోరాను. ఉలుకూ, పలుకూ లేదు ఆయనలో. దాంతో ఆయన్ని కొలవటం మానేసి, నా ప్రార్థనా పుస్తకాలన్నీ తీసుకువెళ్ళి చెత్తబుట్టలో పారేశాను’ అంటారు.
ఎందుకు?వాళ్ళది షరతులతో కూడుకున్న ప్రేమ. నువ్వు ఇది చేస్తేనే నేను నిన్ను ప్రేమిస్తాను. దయానంద సరస్వతీస్వామి దీన్ని చక్కగా వర్ణిస్తారు. ముందు ‘ఐ లవ్ యు’ అంటారుట.
తర్వాత ‘ ఐ ఎలౌ యు టు గో’ అంటారట. దేవుని దగ్గరైనా అదే పద్ధతి. దీన్ని మంద భక్తి అంటారు, ఎక్కువమంది భక్తి ఈ స్థాయిలో ఉంటుంది.
అద్వైత వేదాంత పరిచయం
8.4.2 మధ్యమ భక్తి : రెండో స్థాయి వాళ్ళు కొంచెం అరుదుగా ఉంటారు. వాళ్ళు దేవుణ్ణి గమ్యం చేర్చే మార్గంగా కొలవరు. వాళ్ళలో పరిపక్వత
ఉంది. స్పష్టత ఉంది వాళ్ళ అవగాహనలో. అందుకని దేవుణ్ణి వాళ్ళ గమ్యంగా కొలుస్తారు. జీవిత లక్ష్యం గమ్యాన్ని చేరటం. దేవుడు భద్రతకి చిహ్నం. దేవుడు శాంతికి చిహ్నం. దేవుడు
ఆనందానికి నెలవు. వాళ్ళకి కావాల్సినవి ఈ శాంతిభద్రతలే.అందుకనిదేవుణ్ణి గమ్యం ప్రేమ పద్ధతిలో ప్రేమిస్తారు.అది ముందు పద్ధతికన్నా హెచ్చుస్థాయి. అందుకని దీన్ని మధ్యమ భక్తి
అంటారు.
8.4.3 ఉత్తమ భక్తి :
మరయితే ఉత్తమ భక్తి ఏది? అత్యంత అరుదుగా చూసే ఈ భక్తి ఏమిటి? ఇందులో దేవుడ్ని మార్గంగానూ చూడరు, గమ్యంగానూ చూడరు. జీవాత్మ పరమాత్మ ఐక్యత
చూస్తారు కాబట్టిపరమాత్మ మీద భక్తి, స్వయం ప్రేమతో సమానం.స్వయంప్రేమ ఎలా ఉత్తమమైనదో, పరమాత్మ మీద అలాంటి ప్రేమ కూడా ఉత్తమమైనదే. మంద భక్తుడికి దేవుడు ప్రియం,
మధ్యమ భక్తుడికి ప్రియతరం, ఉత్తమ భక్తుడికి ప్రియతమం. కృష్ణపరమాత్మ దీనిని విపులంగా భగవద్గీతలో ఏడవ అధ్యాయంలోనూ, పన్నెండవ అధ్యాయంలోనూ వర్ణిస్తాడు.
భక్తి అంటే ఏమిటి? దైవం మీద మంద, మధ్యమ, ఉత్తమ రూపంలో ఉన్న ప్రేమ. ఇది భక్తి యొక్క మొదటి నిర్వచనం.
అద్వైత వేదాంత పరిచయం
8.5 భక్తి రెండవ నిర్వచనం :
ఇప్పుడు భక్తి రెండవ నిర్వచనం చూద్దాం. పురుషార్థములలో
ఉన్నతమైన పురుషార్థం మోక్షాన్ని సాధించటానికి ఉపయోగపడే సాధన పద్ధతి. దీన్ని ఆచరించాల్సిన పద్ధతిగా వర్ణించటానికి, యోగం అన్న పదం కలిపారు. అంటే భక్తిని ఆచరించాల్సిన
పద్ధతిగా వాడితే భక్తి యోగం అంటాం.
8.5.1 మూడు పద్ధతుల ఆధ్యాత్మిక మార్గం :` తర్వాత ప్రశ్న భక్తియోగం అంటే ఏమిటి? ఏ పద్ధతిని సూచిస్తోంది అది? పురుషార్థాలని సాధించటానికి మూడు పద్ధతులని
చర్చించాం ముందు అంశాలలో. అవి కర్మయోగం,
ఉపాసనాయోగం, జ్ఞానయోగం. అప్పుడు భక్తి యోగం మాటే తలపెట్టలేదు. మరి భక్తియోగం అంటే ఏమిటి? అది నాలుగవ పద్ధతా అన్న ప్రశ్న వస్తుంది.
మన జవాబు: భక్తియోగం అనేది వేరే ప్రత్యేకమైన పద్ధతి కానే కాదు. ఈ మూడు పద్ధతులను కలిపి వాడే పద్ధతి భక్తియోగం. అంతేకాని నాలుగవ పద్ధతి కాదు.
కావాలంటే ఇలా చెప్పవచ్చు.
కర్మయోగం మొదటి మెట్టు
ఉపాసన యోగం రెండవ మెట్టు
జ్ఞానయోగం మూడవ మెట్టు
కర్మయోగం + ఉపాసన యోగం + జ్ఞానయోగం = భక్తి యోగం.
ఎందుకు ఈ మూడిరటినీ కలిపి భక్తియోగం అంటున్నాం? ఎందుకు విడిగా చూడలేము?ఎందుకంటే, ఈ మూడు యోగాల్లోనూ సమానంగా ఉన్న అంశం భక్తి.
కర్మయోగంలో భక్తి కలగలపాలి. ఉపాసనా యోగంలో భక్తిలో మునగాలి, జ్ఞానయోగంలో భక్తిరసంలో తేలాలి, రసగుల్లా చక్కెర పాకంలో తేలినట్టుగా.
🙏🙏🙏
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి