12, నవంబర్ 2020, గురువారం

ధన్వంతరి జయంతి*

 *🕉️ఓం శ్రీ గురుభ్యోనమః 🙏* 

 🚩🚩నమః శుభోదయం 🚩🚩


బొడ్ల మల్లికార్జున్ రాష్ట్రకార్యదర్శి హిందూధర్మ ప్రచారసమితి, తెలంగాణ 


*కలి యుగాబ్దీ 5122*

*శ్రీ శాలివాహన శకం 1942*

ఆంగ్ల మానం *12-11-2020, గురువారం* 

శ్రీ శార్వరి నామ సం।।రం।। దక్షిణాయనం, శరదృతువు; నిజ ఆశ్వయుజ మాసం;బహుళ పక్షం ద్వాదశి: సా.6-24 తదుపరి త్రయోదశి; హస్త: రా.12-04 తదుపరి చిత్త; వర్జ్యం: ఉ.9-25 నుంచి 10-56 వరకు; అమృత ఘడియలు: సా.6-26 నుంచి 7-56 వరకు; దుర్ముహూర్తం: ఉ.9-51 నుంచి 10-36 వరకు, తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు; రాహుకాలం: మ.1-30 నుంచి 3-00 వరకు సూర్యోదయం: ఉ.6-06 సూర్యాస్తమయం: సా.5-21


 *ఈరోజు ధన్వంతరి జయంతి* 


దేవతల ప్రార్థన మేరకు శ్రీహరి వారికి అమృతము అందించాలని సంకల్పముతో క్షీరసాగర మదనం జరింపించగా క్షీరసాగరమున అమృతభాండము తీసుకుని ధన్వంతరి ఆవిర్భవించెను. ధన్వంతరిని అమృత పురుషుడు అని అంటారు. *‘ధను’* అనగా చికిత్సకు అందని వ్యాధి, *‘అంత’* అనగా నాశము *‘రి’* అనగా కలిగించువాడు. చికిత్సకు లొంగని వ్యాధులను నశింపచేయువాడు అని ధన్వంతరి శబ్ధానికి అర్థము. సకల లోకాలలో చికిత్సకు అందని వ్యాధి మరణమే కావున దానిని తొలగించి అమృతాన్ని ఇచ్చి అంతర్థానం అయినట్లు భాగవతాది పురాణాలలో చెప్పబడింది. అలా వచ్చిన స్వామి వృక్షశాస్త్రమును, ఔషధ శాస్త్రమును చికిత్సా విధానాన్ని వివరించే 18 మహా గంథ్రాలను అందించారు. వాటిని ఆధారంగా చేసుకుని చ్యవన, అత్రి, బృహస్పతి, కవి, చంద్ర, వరుణ, మను, ఇక్ష్వాకు మొదలగువారు వైద్య శాస్త్ర గ్రంథాలను అందించారు. ఇలా ధన్వంతరి వైద్య శాస్త్రాన్ని ఆరోగ్య సూత్రాలను అందించారు.


 *ఆశాచ పరమా వ్యాధి: తతో ద్వేష: తతో మను: |* 

 *తేషాం వినాశనే వైద్యం నారాయణ పరాస్మృతి: ||* 


ధన్వంతరి అను గ్రంథానుసారం అన్ని వ్యాధుల కంటే పెద్ద వ్యాధి *‘ఆశ’* తర్వాత *‘ద్వేషం’* ఆ తర్వాత ‘కోపం’ ఈ మూడు వ్యాధులకు చికిత్స నారాయణ మంత్రం. ఇటువంటి ఆధ్యాత్మిక వ్యాధి నివారణ, ఆది భౌతిక వ్యాధి నివారణ, ఆది దైవిక వ్యాధి నివారుణలకు వైద్య శాస్త్రాన్ని ప్రవర్తింపచేసిన వాడు ధన్వంతరి.


జై గురుదేవ్...

కామెంట్‌లు లేవు: