12, నవంబర్ 2020, గురువారం

జ్ఞానము పాత్ర శుద్ధి*

 *జ్ఞానము పాత్ర శుద్ధి*

🕉️🌞🌍🌙🌟🚩


జ్ఞానము పొందాలంటే పాత్రశుద్ది అవసరము. పాత్ర అంటే శరీరము కాదు, ఆత్మ అంతకంటే కాదు. పాత్ర అంటే మన అంతరంగం. ఈ అంతరంగం మనో,బుద్ధి,చిత్త అహంకారములతో కూడి ఉంటుంది. ఈ అంతరంగం మన ఆలోచనల ద్వారా, మన నిర్ణయాల ద్వారా, మన సంస్కారాల ద్వారా, మన స్వభావము ద్వారా శుద్ధిగా ఉందో, అశుద్దిగా ఉందో నిర్ణయింప బడుతుంది. అన్నిటి కంటే పెద్ద అశుద్ధం అహంకారము, ఇది పోతే కానీ గురువు సాన్నిధ్యం లభ్యం కాదు, జ్ఞానము కలుగదు. 



అందుకని ఈ పాత్ర శుద్ధికి  సులభమైన మార్గము నిష్కామ కర్మ. మన కర్తవ్య కర్మలను నిమిత్తమాత్ర భావంతో చేస్తు, కర్మఫలాలను,భగవదర్పణ చేస్తూ, అంటే ప్రతిరోజు పడుకునే ముందు...


 

"కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ |

కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి" 

అన్న శ్లోకము చదువుకోవచ్చును.



 ఈ శ్లోకము అర్థం ఏమిటి అంటే శరీరంతో, వాక్కు తో, మనస్సు అనే ఇంద్రియముతో, బుద్ధితో అహంకారంతో, స్వభావంతో నేను ఏది చేశానో అది అంతా నేను నారాయణునికి సమర్పించుతున్నాను అని అర్థం.

ఇలానే శివ సంప్రదాయంలో కూడా ఒక శ్లోకము ఉంది అది కూడా పై అర్ధం ఇస్తుంది.



 ఆ శ్లోకము

"కరచరణ కృతం వాక్కాయజం కర్మజంవా

శ్రవణ నయనజం వా మానసం వాపరాధం

విహితమ విహితం వా సర్వమేతత్ క్షమస్వ

జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో!"



ఇలా మన కర్మలు ఆచరణ జరుగుచు ఉండగా మన అంతరంగం శుద్ధి అయ్యి, ఆ పరమాత్మ స్వయంగా, సద్గురు రూపంలోగాని,అంతరంగ ప్రేరణ ద్వారా గానీ, మన దగ్గరకి వచ్చి, లేదా మనని  ఉద్దరిస్తారు.



 అపుడప్పుడు మాయ ప్రభావము వల్ల మనలో అహంకారము పెరిగితే అజ్ఞానం ఆవహిస్తుంది.

కాబట్టి  సాధన చేస్తూ, సిద్ది పొందే వరకు, అత్మజ్ఞానం కలిగే వరకు జాగరుకులై అహంకారమును  పోగొట్టుకునే దిశగా ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి.


🕉️🌞🌍🌙🌟🚩

కామెంట్‌లు లేవు: