*మనిషి జీవితం దుఃఖమయం తల్లి గర్భంలో ఉన్నప్పుడు పూర్వ జన్మ జ్ఞానం ఉండడంతో అయ్యో పుణ్యం సాధన చేయకుంటిని అని దుఃఖిస్తాడు.*
*ఈ గర్భస్తు నరకం నుండి ఎప్పుడు బయటపడితే మళ్ళీ పదార్థ ప్రపంచంలో పడతానని దుఃఖిస్తాడు.*
*బయటకి రాగానే కన్నీళ్లు పెట్టుకుంటే పూర్వ జ్ఞానం పోయిందే అని దుఃఖిస్తాడు.*
*తల్లి పాల కోసం ఆకలితో దుఃఖిస్తాడు*
*శిశు ప్రాయంలో ఏది చెప్పాలన్నా ఏడుపు తప్ప వేరే మార్గం లేదు.*
*బాల్యం వచ్చేసరికి విద్య బుద్ధులు నేర్పించడానికి పాఠశాలకు పంపుతారు విషయం పెరుగుతుందని దుఃఖిస్తాడు.*
*యవ్వనం రాగానే ఆకర్షణ మొదలవుతుంది ప్రేమ కోసం దుఃఖిస్తాడు.*
*ఉద్యోగం రాలేదని దుఃఖిస్తాడు.*
*ఇక్కడ విచారణ చేయాలి ఎందుకు ఎలా జరుగుతోందని అప్పుడే జ్ఞానం కలుగుతుంది అంతేకాని ఆత్మ హత్య చేసుకోరాదు.*
*పెళ్లి చేస్తే స్వేచ్ఛ పోయినదనిదుఃఖిస్తాడు.*
*భార్య బిడ్డలు మాట వినలేదని దుఃఖిస్తాడు.*
*పక్క వాళ్ళ కంటే మనం తక్కువగా ఉమ్నమని దుఃఖిస్తాడు.*
*వ్రిద్ధాప్యం వచ్చాక నవారు నన్ను చూడలేదని దుఃఖిస్తాడు.*
*ఆఖరికి మరణ సమయంలో కూడా ఈ వదలడం ఇష్టం లేక అందరి మీద మమకారం పెంచుకుని అయ్యో వాళ్లకు ఓ దారి చూపించకుండా పోతున్నానని దుఃఖిస్తాడు.*
*మనస్సు ఈ ప్రపంచంలో ఎన్నోజన్మలు అనిత్యమైన సుఖాల కోసం తిరిగి తిరిగి అలసిపోయి చివరికి ఇవేవి నిత్యం కాదని పరమాత్మా వైపుకి తిరుగుతుంది మనస్సు అదే భక్తి అప్పుడు శాంతి తృప్తి లభిస్తాయి.*
*ఇన్నాళ్లు నేను నాది అని అహంకార మమకారాలు పెంచుకున్నాను ఇప్పుడు తెలిసింది నేను కాదు నాది కాదు*
*అంతా పరమాత్మే నేను కేవలం నిమిత్త మాత్రుడను అనే భావన కలుగుతుంది అదే శరణాగతి.*
*మన భక్తికి మెచ్చి భగవంతుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.*
*మనం బయట ప్రపంచాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని వెతికి తెలుసుకుంటాము, కానీ బయట వెతకాల్సిన అవసరం లేదు.*
*మనలోనే ప్రపంచం ఉంది, పరమాత్మా ఉన్నాడు. కాబట్టి మన గురించి మనం తెలుసుకుంటే చాలు. బంధం, మోక్షము కూడా మనలోనే ఉన్నాయి. అంతర్ముఖత చెందాలి అప్పుడు విచారణ, అన్వేషణ మొదలవుతుంది.*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి