12, నవంబర్ 2020, గురువారం

సుందరకాండ - పదమూడవ సర్గ*

 *సుందరకాండ - పదమూడవ సర్గ*


*(06)*

అయోనిజ, విదేహ రాజ్యానికి చెందిన, మిథిలను పుట్టినిల్లుగా చేసుకొన్న, జనకుని కుమార్తె అయిన సీత తన నిస్సహాయ స్థితిలో రావణునికి వశవర్తియై ఉంటుందని నమ్మకం కలగడం లేదు.


*(07)*

రాముడు ఏ క్షణంలో వస్తాడోనని రామబాణాలకు భయపడి రావణుడు సీతను తీసుకొని ఆకాశ మార్గాన వేగంగా ఎగిరి పోతున్నప్పుడు దారి మధ్యలో ఆమె క్రింద పడిపోయి ఉంటుందేమో.


*(08)*

లేకపోతే సిద్ధులు సంచరించే ఆకశమార్గంలో అపహరింపబడి తీసుకునిపోతుండగా క్రిందనున్న మహాసముద్రాన్ని చూడగానే భీతిచెంది పూజ్యురాలైన సీతకు గుండె ఆగిపోయి ఉండవచ్చునేమో.


*(09)*

సీతను ఆకాశమార్గంలో అపహరించి తీసుకొని వస్తున్నప్పుడు రావణుని ప్రచండ వేగానికీ, అతడి భుజాల ఒత్తిడికీ విశాలనేత్రాలు గల ఆ సాధ్వీమణి ప్రాణాలు విడిచి ఉంటుందేమో.


*(10)*

సముద్రం మీద ఎగురుతూ పోతున్నప్పుడు రావణుని బంధనం నుండి విడివడడానికి పెనుగులాడుతున్నప్పుడు సీత సముద్రంలో పడిపోయి ఉండడానికి కూడా ఆస్కారం లేకపోలేదు.


*జైశ్రీహనుమాన్*

కామెంట్‌లు లేవు: