*నవంబరు 13న శ్రీవారి ఆర్జిత సేవల ఆన్‌లైన్ టికెట్ల కోటా విడుదల*
శ్రీవారి కళ్యాణోత్సవం, డోలోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు నవంబరు 13వ తేదీ శుక్రవారం ఉదయం 11.00 గంటలకు టిటిడి ఆన్ లైన్ (వర్చువల్) కోటాను విడుదల చేయనుంది.
నవంబరు 22 నుంచి 30వ తేదీ వరకు ఈ సేవ టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
కాగా, కల్యాణోత్సవం, డోలోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు బుక్ చేసుకున్న గృహస్తులు శ్రీవారి దర్శనం కొరకు వారికి ప్రత్యేకంగా కేటాయించిన దర్శనం స్లాట్‌లల్లో దర్శన టికెట్లు పొందవలసి ఉంటుంది. కల్యాణోత్సవం టికెట్లు పొందిన గృహస్తులు(ఇద్దరికి) ఆ టికెట్‌పై ఉచితంగా శ్రీవారి దర్శనం కల్పిస్తారు. డోలోత్సవం, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు బుక్ చేసుకున్న గృహస్తులు వారికి కేటాయించిన ప్రత్యేక స్లాట్‌లల్లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు పొందవలసి ఉంటుంది. టికెట్లు బుక్ చేసుకున్నతేదీ నుండి 90 రోజుల్లోపు శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని గృహస్తులకు టిటిడి కల్పించింది.
ప్రతి నెల చివరి వారంలో శ్రీవారి ఆర్జిత సేవ ఆన్‌లైన్ (వర్చువల్) కోటా విడుదల :
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఆన్‌లైన్ కోటాను ప్రతి నెల చివరి వారంలో టిటిడి విడుదల చేస్తుంది.
ఇందుకు అనుగుణంగా శ్రీవారి దర్శనం కోటాను, దర్శనం స్లాట్‌లను క్రమబద్ధీకరిస్తూ రోజువారి దర్శనం టోకెన్లను భక్తులకు మంజారు చేయబడుతుంది. కోవిడ్ లాక్‌డౌన్ తరువాత, ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని టిటిడి శ్రీవారి ఆర్జిత సేవల కోటాను ఖరారు చేస్తున్నది. కావున ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.
🚩🚩🚩🚩🚩🚩🚩🚩
*హిందూ వైభవమ్ ఆధ్యాత్మిక మాసపత్రిక*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి