29, నవంబర్ 2021, సోమవారం

రసభస్మము

 ఆయుర్వేద వైద్యము నందు ఉపయోగించు భస్మాల ఉపయోగాలు - 3 . 


 * రసభస్మము -  


    ఈ రసభస్మమును పాదరసం పుటంపెట్టి శుద్ది చేసి తయారుచేస్తారు . ఇలా శుద్ది చేసిన రస భస్మమును అనుపానయుక్తముగా ఉపయోగించిన పక్షవాతము , కంపవాతము , మూత్రఘాతము , వాతరక్తము , కుష్ఠు , దోష జ్వరము , కీళ్లనొప్పులు , కాసలు , బాలింతరోగము పోగొట్టును . శరీరము నందలి రక్తమును వృద్ధిపరచును . 


 * ఇంగిలీక భస్మము - 


    దీనిని అనుపానయుక్తముగా సేవించిన సవాయి మేహము , శుక్ల మేహము , కాసలు , పిల్లల జలుబు , తిమ్మిరి వాతము , కిడ్నీ దోషములు , నొప్పులు , మూత్ర దోషములు తొలగును. 


 * రసకర్పూర భస్మము - 


    ఈ రసకర్పూరమును అనుపానయుతముగా సేవించిన సమస్త రోగములు కుదురును . కుష్ఠు , మేహమచ్చలు , తిమ్మిరి , బొల్లి , కంఠమాల , సవాయిరోగములు మాన్పును . 


 * రస సింధూరం - 


   ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించిన సమస్త మేహములు , కాస , శ్వాస , తిమ్మిరి , శుక్లనష్టములు హరించును . 


 * తాళక భస్మము - 


    ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించిన కుష్ఠు , కఫరోగము , వాతములు , క్షయ , పక్షవాతము , పడిస ( జలుబు ) బాధ పోవును . 


 * పగడ భస్మము - 


      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న కాస , శ్వాస , కుసుమ , క్షయ , రుతుశూల , పాండురోగములు నిర్మూలించును . 


 * ముత్య భస్మము - 


      ఈ భస్మమును సేవించిన కాస , శ్వాస , గుండెరోగము , అతిమూత్రము , కామెర్లు , ఉబ్బసం , మేహములను నయం చేయును , మెదడుకు మంచి బలాన్ని ఇచ్చును . ఇది క్యాల్షియం తక్కువ ఉన్నవారికి ఇవ్వడం వలన క్యాల్షియం లోపం సరిచేయవచ్చు . 


 * ఆల్చిప్పల భస్మము - 


      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న దగ్గులు , కడుపునొప్పులు పోవును . కండ్లకు చనుపాలలో కలిపి కాటుకలా రాసిన కండ్లలోని పొరలను కోయును . 


 * శంఖ భస్మము - 


       ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న సర్వ శూలలు , దగ్గులు , కుసుమ రోగములు , అగ్నిమాంద్యము , సర్ఫవిషము పోగొట్టును . 


 * గవ్వల భస్మము -  


      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న రక్తగ్రహణి , గుండెవ్యాధి , వ్రణములు , పాత సుఖరోగములు , ఉడుకు జ్వరములు నశించును . 


 * కాసీస భస్మము - 


      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న ఉబ్బులు , అజీర్ణములు , చర్మరోగములు , గ్రహణి రోగములు , మూత్రకృచ్చము , పాండురోగము , గుండెనొప్పులు తప్పక కుదుర్చును . 


 * హేమాక్షిక భస్మము - 


      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించిన శూల , హుద్రోగము , అజీర్ణము , కాస , శ్వాస , పైత్యము , పాండువు , కామెర్ల రోగము నయం అగును. 


    తరవాతి పోస్టు నందు మరికొన్ని భస్మాల గురించి మరింత విలువైన సమాచారం మీకు అందిస్తాను . 


              కాళహస్తి వేంకటేశ్వరరావు 


               అనువంశిక ఆయుర్వేదం 


                     9885030034

మూడో తరంగం భారత్‌ను తాకింది

 అత్యవసర ప్రకటన; మూడో తరంగం భారత్‌ను తాకింది

 

 దయచేసి వెంటనే స్వీయ లాక్ డౌన్ చేయండి.

 1. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు.

 2. మీరు బయటకు వెళ్లినప్పుడు డబుల్ మాస్క్ వేయండి మరియు ఏ సమయంలోనైనా మాస్క్ తీయకూడదు.

 3. మీ ఇంటి బయట భోజనం చేయకండి.

 4. వ్యక్తులు బంధువులు లేదా సన్నిహితులు అయినా మీ ఇంట్లోకి రానివ్వకండి.

 5. బంధువులు లేదా స్నేహితుల ఇళ్లకు వెళ్లవద్దు.

 ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇండో-పాకిస్థాన్‌లో ప్రజలు దీన్ని చాలా తేలికగా తీసుకుంటున్నారు. మనం ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే జనాభాలో గణనీయమైన భాగం తుడిచిపెట్టుకుపోతుంది. కోవిడ్ వివక్ష చూపదు. దయచేసి వినండి.

 అందుకున్నట్లుగా ఫార్వార్డ్ చేయండి.

 *కెనడా* విమానాలను లోపలికి మరియు బయటికి నిషేధించింది మరియు రోజువారీ మరణాల సంఖ్య 1,000 మించిపోయింది.

      *సౌదీ అరేబియా* బ్లాక్ చేయబడింది మరియు ఇన్‌బౌండ్ మరియు అవుట్‌బౌండ్ విమానాలు లేవు.

       *కొలంబియా* పూర్తిగా నిరోధించబడింది.

       ఈరోజు 4,100 కంటే ఎక్కువ మంది మరణించిన *బ్రెజిల్* దాని అత్యంత ఘోరమైన అధ్యాయంలో పడిపోయింది.

       *స్పెయిన్* అత్యవసర పరిస్థితిని పొడిగించవచ్చని ప్రకటించింది.

       *యునైటెడ్ కింగ్‌డమ్* ఒక నెల లాక్‌డౌన్‌ను ప్రకటించింది.

       *ఫ్రాన్స్* 2 వారాల పాటు లాక్ చేయబడింది.

       *జర్మనీ* 4 వారాల పాటు సీలు చేయబడింది.

       *ఇటలీ* ఈరోజు దగ్గరగా అనుసరించింది.

       *అన్ని* ఈ దేశాలు/ప్రాంతాలు *COVID19 యొక్క మూడవ తరంగం* మొదటి వేవ్ కంటే చాలా ఘోరమైనదని నిర్ధారించాయి. కాబట్టి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు *అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి*.

       స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల మధ్య హెచ్చరిక సంభాషణకర్త అవ్వండి. *అందరినీ మూడవ అల నుండి రక్షించండి*.

       *రెండో తరంగ దిగ్బంధనాన్ని బట్టి అంచనా వేయకండి *ఏమీ జరగలేదు*...

       *1917-1919 నాటి స్పానిష్ ఫ్లూ లాగా, మొదటి మరియు రెండవ తరంగాల కంటే మూడవ తరంగం చాలా ప్రమాదకరమని చరిత్ర చెబుతోంది.

       *మిమ్మల్ని మరియు మిమ్మల్ని మీరు రక్షించుకోండి

      కుటుంబం*.

       * జీవ భద్రత చర్యలను నిర్వహించడం, మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచుగా చేతులు కడుక్కోవడం మొదలైనవి.


      చరిత్ర అబద్ధం చెప్పదు, వెనక్కి తిరిగి చూద్దాం.

       ____________

       *ఈ సమాచారాన్ని మీ కోసం ఉంచుకోవద్దు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో పంచుకోండి.


      *

*తొలి తిరుపతి

 *తొలి తిరుపతి*......


తిరుపతి అనగానే మనకు గుర్తుకువచ్చేది చిత్తూరు జిల్లాలోని తిరుమల తిరుపతి.


అయితే తూర్పు గోదావరి జిల్లాలోని పెద్దాపురం లో తిరుపతి వుందని


అదే తొలి తిరుపతి అని --- అది సింహాచలం 8000 సంవత్సరాలు , తిరుమల తిరుపతి 6000 సంవత్సరాలు ... మరియు దేశంలోని ఇతర ప్రసిద్ది చెందిన నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల కంటే మిక్కిలి పురాతనమై , పరమ పవిత్రమై న చిరుమందహాస చిద్విలాస *శ్రీ శృంగార వల్లభ స్వామి* శోభాయమానంగా స్వయంభువుగా కొలువుదీరిన దేవాలయానికి 9000 (తొమ్మిది వేల సంవత్సరాల) చరిత్ర వుందని చాలా మందికి తెలియదు.


విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే వెలసినందుకు ఈ తిరుపతి ని తొలి తిరుపతి అని పిలుస్తారు ...


స్వయంభువు గా స్వామి వారు వెలసిన ప్రతి చోటా ఆళ్వారులు వుంటారు అలాగే ఇక్కడ కూడా గర్బాలయం పక్కన ఎడమ వైపు ఆళ్వారుల విగ్రహాలు వున్నాయి.


ఆలయ చరిత్ర : 

--------------


ఒకానొకప్పుడు ఇప్పుడు తొలి తిరుపతి ఉన్న గ్రామమంతా కీకారణ్యం ధృవుని సవతి తల్లి అయిన సురుచి ధృవుని కి సింహాసనం దక్కకుండా కుతంత్రాలు నడుపుతున్నసమయంలో


ధృవుని తల్లి అయిన సునీతి నువ్వు సింహాసనం అధిష్టించి రాజ్యపాలన చేయాలంటే శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోమని చెప్పిందట అప్పుడు ధృవుడు తపస్సు చేయడానికి ఈ కీకారణ్యం చేరుకున్నాడట.


అదే సమయంలో అక్కడ శాండిల్య మహాముని ఆశ్రమం ఉందట అప్పుడు ధృవుడు శాండిల్య మహాముని దర్శనం చేసుకుని శ్రీ మహా విష్ణువు యొక్క తపస్సు విదానం అడుగగా


ఆ ముని " నాయనా విష్ణుమూర్తి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని తలుచుకుంటూ తపస్సు చేయి" స్వామి ప్రత్యక్షమై నీ కోరిక నేరవేరుస్తాడు అని చెప్పి తపస్సుకి కావాల్సిన ఏర్పాటు చేసాడట.


ఆ మహాముని చెప్పినట్లే "దివ్య కాంతులతో శ్రీ మహావిష్ణువు సాక్షాత్కరించాడట" అయితే ఆ కాంతి ని చూడలేక ధృవుడు బయపడ్డాడట. 


అప్పుడు విష్ణుమూర్తి నాయనా భయమెందుకు * నేనూ నీ అంతే వున్నాను కదా * అని నవ్వుతూ ధృవుని తలనిమిరి అతని భయాన్ని పోగొట్టాడట


ఆ తరువాత స్వామి ధృవుని కి దర్శనమిచ్చిన చోటే శిలా రూపంలో వెలిసాడట.


స్వామి * నీ అంతే వున్నాను కదా * అని చెప్పినందుకు *ఆలయ ప్రవేశ ద్వారం వద్ద గచ్చు మీద ఉన్న పుష్పం పై నుంచుని చూసిన వాళ్ళు ఎంత ఎత్తులో వుండి చూస్తే అంత ఎత్తులోనే దర్శనమిస్తాడు (చిన్న వాళ్లకు చిన్నవాడిగా పెద్దవాళ్ళకు పెద్ద వాడిగా)*


ఆ అరణ్య ప్రాంతం లో వెలిసిన స్వామి ఎండకు ఎండి వానకు తడవడం చూసి దేవతలే స్వయంగా స్వామికి ఆలయాన్ని నిర్మించారు. 


ఆ తరువాత శ్రీ లక్ష్మీ దేవి వారిని - నారద మహర్షి ప్రతిష్టించారట. తరువాత శ్రీ కృష్ణ దేవరాయల వారు భూదేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు (దీనికి శిలా శాసనాలే ఆధారం).


ఆలయ విశిష్టత : 

------------------

1) చిద్విలాస వేంకటేశ్వరుడు (నవ్వుతున్నట్టుగా వుండే విగ్రహం ) 


2) విగ్రహం చిన్న పిల్లలకు చిన్నగానూ పెద్దవారికి పెద్దగానూ (ఎంత ఎత్తులో ఉండేవారికి అంతే ఎత్తులో కన్పిస్తుంది ) 


3) తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని విగ్రహానికి పూర్తి విభిన్నంగా శంఖ – చక్రాల స్థానం మారి వుంటాయి 


4) ఆలయ ప్రాంగణం లోనే శివాలయం వైష్ణవాలయం రెండూ వున్నాయి. 


5) సంతానం లేని దంపతులు ఆలయం వద్ద నూతిలో స్నానం చేసిన సంతాన ప్రాప్తి లబిస్తుంది. 


6) ఏకశిలా కళా ఖండాలు... విగ్రహమూర్తి .. ఉత్సవ మూర్తి ... ప్రదాన ఆకర్షణ.


కార్యక్రమాలు - పూజా విధానం : 

------------------------------

1) నిత్య ధూప దీప నైవేద్యం.


2) ఉదయం 6 నుంచి రాత్రి 8 వరకూ దర్శనం.


3) శ్రీరామ నవమి తరువాత వచ్చే మొదటి ఏకాదశి అనగా చైత్ర శుద్ద ఏకాదశి రోజు స్వామి వారి కళ్యాణం అంగ రంగ వైభవంగా .. ప్రారంభిస్తారు, ఆరోజు నుంచీ ఆరు రోజులపాటూ ఉత్సవాలు జరుపుతారు.


4) ధనుర్మాసం లో నెల రోజుల పాటూ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 


చరిత్రలో స్వామి వారిని దర్శించుకొన్న ప్రముఖులు : 

------------------------------------

బోజమహా రాజు

బట్టీ విక్రమార్క 

రాణీ రుద్రమదేవి 

శ్రీ కృష్ణ దేవరాయలు 

పెద్దాపురం - పిఠాపురం సంస్థాన మహారాజులు 


లక్ష్మీ నర సాపురం రాజులు ( లక్ష్మీ నరసాపురం రాజులు ఆలయానికి 600 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు కానీ ఇప్పుడు కేవలం 21 ఎకరాలు మాత్రమే గుడి పేర వున్నట్టు ... ఆలయం ప్రభుత్వ ఆదీనం లోనే ఉన్నప్పటికీ యాత్రికులకి... దర్శనానానికి ... బసకి సరైన సదుపాయాలు లేవు అని స్తానికులు బాధపడుతున్నారు )


How to Reach Tholi Tirupathi :


తొలితిరుపతి శృంగార వల్లభస్వామి ఆలయం సామర్లకోట కు 10 కిమీ దూరం లో ఉంది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడు వెళ్లే దారిలో దివిలి వస్తుంది. ఈ దివిలి కి 1 కిమీ దూరం లోనే ఈ ఆలయం ఉంది. పిఠాపురం నుంచి వచ్చేవారు దివిలి చేరుకోవడానికి ఆటో లు ఉంటాయి. సామర్లకోట రైల్వేస్టేషన్ కోడ్ SLO అన్ని ప్రధాన ట్రైన్స్ ఇక్కడ ఆగుతాయి.


పెద్దాపురం నుంచి కూడా ఆటో సౌకర్యం ఉంది. కాకినాడ నుంచి దివిలి కి బస్సు సౌకర్యం ఉంది. కాకినాడ నుంచి వచ్చే బస్సు లు సామర్లకోట మీదుగా వస్తాయి. 


కాకినాడ - ప్రత్తిపాడు , పెద్దిపాలెం , శాంతి ఆశ్రమం బస్సు లు దివిలి లో ఆగుతాయి. కాకినాడ నుంచి తామరాడ వెళ్లే బస్సు తొలితిరుపతి లో ఆగుతాయి. తొలితిరుపతి ని చదలాడ తిరుపతి అని కూడా పిలుస్తారు.


Nearest Railway Station :


Samalkota ( SLO ) Distance : 10 km 


Nearest Bus Stop : 

Divili ( Divli )


Toli Tirupathi Temple Address:


Sri Srungara Vallabha Swamy Temple,

Peddapuram Mandal,

East Godavari,

Andhra Pradesh.

దేవుడు కలలో కనపడితే

 🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌿🌿🌿🌿🌿🌿🌸


*🌻దేవుడు కలలో కనపడితే ఫలితం ఏమిటి🌻*


🍃🌹మనం తరచూ కలలు కంటుంటాం. చాలామందికి నిత్యం తమ జీవితాల్లో జరిగే విషయాలు, అంశాలు కలల్లో కనిపిస్తుంటాయి. అయితే మీకు ఎప్పుడైనా కలలో దేవుడు కనిపించాడా.? ఒకవేళ మీ కలలో దేవుడు కనిపిస్తే ఏం జరుగుతుంది.? దేవుడు కలలో కనిపిస్తే.. దేనికి సంకేతం.? స్వప్న శాస్త్రం ప్రకారం.. ప్రతీ కలకు ఓ అర్ధం ఉంటుంది. అలాంటి పరిస్థితిలో, మీరు కలలో దేవుడిని చూస్తే.. దానికి ప్రత్యేకమైన సంకేతం ఉంటుంది. కలలో ఏ దేవుడు కనిపిస్తే.. ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..


*🌻దుర్గామాత కోపంగా కనిపిస్తే..🌻*


🍃🌹మీ కలలో దుర్గామాతను కోపంగా చూసినట్లయితే, ఆ కల అశుభ పరిణామానికి సంకేతం. అంటే ఆ తల్లి మీపై కోపంగా ఉందని అర్థం. ఒకవేళ దుర్గామాత సింహంపై స్వారీ చేసినట్లు మీకు కలలో కనిపిస్తే.. మీ జీవితంలో సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని అర్ధం.


*🌻శివుడిని కలలో చూస్తే..🌻*

మీ కలలో శివుడిని చూసినట్లయితే, మీరు సమస్యల నుంచి అతి త్వరలో విముక్తి పొందనున్నట్లు అని అర్ధం. శివుడు కలలోకి వచ్చాడంటే.. అన్ని ఇబ్బందులు తొలిగినట్లే. అంతేకాకుండా మీ కలలో శివలింగాన్ని చూసినట్లయితే, ఆ కల కూడా ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. మీ జీవితంలో పురోగతి, కీర్తిని పొందుతారని.. దాని సంకేతం.


*🌻రాముడిని కలలో చూస్తే..🌻*

మీరు కలలో రాముడిని చూస్తే.. చాలా శుభప్రదం. మీ జీవితంలో పురోగతికి అవకాశాలు లభిస్తాయని అర్థం. అయితే అందుకు మీ విధులను మీరు సక్రమంగా నిర్వర్తించాలని ఆ కల సంకేతం.


*🌻కలలో శ్రీకృష్ణుని దర్శనం..🌻*

మీకు కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తే.. స్నేహం, లేదా మరేదైనా బంధం ద్వారా మీ జీవితంలో ప్రేమ చిగురిస్తుందని దాని అర్ధం. ఒకవేళ మీరు ఎవరితోనైనా ప్రేమలో ఉంటే.. ఈ కల చాలా పవిత్రమైనది అని అంటారు.


*🌻కలలో విష్ణువు దర్శనం..🌻*

మీ కలలో విష్ణువును చూసినట్లయితే, మీరు విజయం సాధిస్తారని.. జీవితంలో పురోగతిని పొందుతారని అంటారు.


*🌻లక్ష్మీదేవి కలలో కనిపిస్తే..🌻*

మీ కలలో లక్ష్మీదేవి కమలంపై కూర్చున్నట్లు కనిపిస్తే, అది చాలా పవిత్రమైన కలగా పరిగణిస్తారు. ఈ కల సంపదకు చిహ్నం. కలలో లక్ష్మీమాతను చూస్తే.. మీకు డబ్బు త్వరలోనే లభిస్తుందని.. లాభాలను పొందుతారని అంటారు.


🌿☘️🌼🌼🌺🌼🌼☘️🌿

పెళ్లి అడ్డంకులు తొలగించే వ్రతము

 పెళ్లి అడ్డంకులు తొలగించే వ్రతము


సీత,రాముల వివాహా వేడుకనే వివాహపంచమి అని పిలుస్తారు.


హిందూ అచారా సాంప్రదాయాల ప్రకారం సీతారాముల పెళ్ళిరోజును పండుగగా జరుపుకోవటం అనవాయితీగా వస్తుంది. నవంబరు – డిసెంబరు నెలల మధ్యకాలంలో శుక్లపక్షపు ఐదవ రోజున ఈ వేడుక జరుపుకుంటారు. సీతాదేవి శ్రీరామచంద్రుడు వివాహం చేసుకున్నారని పురాణాలు చెప్పడంతో ప్రతి ఏడాది సీతారాముల వివాహ వార్షికోత్సవం నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తోంది.


సీతారాముల వివాహ బంధాన్ని నేటికి అంతా ఆదర్శంగా భావిస్తున్నారు. ఎక్కడైన వివాహ వేడుకకు హాజరైతే తప్పకుండా పెళ్ళిజంటను సీతారాముల్లా కలకాలం అన్యోన్యంగా ఉండాలని దీవిస్తుండటం మనం చూసే ఉంటాం. అంటే సీతారాముల వైవాహిక జీవితం ఎంతగా ఆదర్శవంతంగా మారిందో అర్ధమౌతుంది. సీతకోసం రాముడు, రాముని కోసం సీత ఇలా వారి జీవితం కష్టాల నడుమ సాగిన వైనాన్ని నేటి తరానికి కధలు కధలుగా చెప్తుంటారు.


భర్త అడువులకు వెళుతుంటే రాజప్రసాదంలో ఉండలేక భర్తతో అడవిలో కష్టాలు అనుభవించటానికైనా సిద్దమై అతనితో కలసి అడవుల బాటపడుతుంది. ప్రస్తుతం భార్యభర్తలు ఒకరినొకరు అర్ధం చేసుకుని ఎలాంటి పరిస్ధితులు ఎదురైనా ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ వైవాహిక జీవితాన్ని ముందుకు సాగించాలి.


రావణుడు సీతను అపహరించుకు వెళ్ళిన సందర్భంలో లంకలో ఆమె మనస్సు మార్చే ప్రయత్నం రావణుడు చేసినప్పటికీ ఆమెకు రామునిపై ఉన్న ప్రేమ,అప్యాయత ఏమాత్రం చెరగలేదు. రాముడు తనను లంకనుండి విడిపించుకు తీసుకువెళతాడన్న నమ్మకంతో ఉంది. అదే సమయంలో రాముడు సైతం భార్యకోసం, ఆమె జాడకోసం అనేక ప్రయత్నాలు చేసి చివరకు ఆమెను విడిపించుకుని తీసుకురావటం కూడా రామునికి సీతపై ఉన్న ప్రేమానురాగాలను తెలియజేప్తుంది.


అలాంటి అదర్శదంపతుల వివాహమహోత్సవపు రోజును నేటికి వివాహ పంచమిగా ప్రతిఏటా నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తుంది. వివాహ పంచమి వ్రతం ప్రతి ఏడాది మార్గశిర మాసం శుక్ల పక్షంలో 5వ రోజును వివాహ పంచమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 8వ తేదిన వివాహ పంచమి నిర్వహించనున్నారు. వివాహ పంచమి డిసెంబర్ 07, 2021 రాత్రి 11 గంటలకు ప్రారంభమై, 08 వ తేదీ డిసెంబర్ 2021 రాత్రి 09 గంటల 25 నిమిషాలకు ముగుస్తుంది.


ఈ వివాహ పంచమి వ్రతం రోజు పెళ్లి కాని వారు వివాహ పంచమి వ్రతం చేయటం వల్ల వారికి తొందరగా వివాహ గడియలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల వివాహంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోయి అనంతరం వివాహం జరగడమే కాకుండా వీరి వైవాహిక జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలు లేకుండా గడుపుతారు. వివాహపంచమి రోజు హిందువులు ఈ వ్రతాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పంచమి రోజు సీతారాముల ప్రతిమలను ప్రతిష్టించి వారికి వివాహం జరిపించి వివిధ రకాల నైవేద్యాలతో పూజించడం వల్ల వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది.


భారతదేశం, నేపాల్ లోని మిథిల ప్రాంతంలో శ్రీ రాముడితో సంబంధం ఉన్న దేవాలయాలు, పవిత్ర స్థలాలలో సీత, రాముడి వివాహ ఉత్సవంగా జరుపుకుంటారు. సీతారాముల ఆలయంల్లో ఘనంగా వేడుకలు, పూజలు, యాగాలు నిర్వహిస్తారు. చాలా ప్రాంతాలలో శ్రీ రామచరితమానస్ పారాయణం చేస్తారు. నేపాల్‌ ప్రాంతంలో సీతాదేవి జన్మ స్థలమని నమ్ముతారు అందుకే ఆప్రాంతంలో వివాహపంచమి వేడుకలను వైభవంగా నిర్వహించటం ఆనవాయితీగా వస్తుంది. ఈ వేడుకలను తిలకించేందుకు మనదేశం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రతిఏటా తరలి వెళుతుంటారు.

భోళాశంకరుడు

 🕉️🔱🚩 ఓం నమః శివాయ 🙏


🌹#భోళాశంకరుడు🔱🚩


♦️పూజాయా అభికోహోమో హోమాత్తర్పణ ముత్తమం 


     తర్పణాచ్చ జపః శ్రేష్టో హ్యభిహేకః పరో జపాత్ ”♦️


🌹పూజకంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణం కంటే జపమూ, జపం కంటే #అభిషేకము ఉత్తరోత్తరం, శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెపుతారు.


🌹సృష్టిలో తాను చాలా ప్రత్యేకమైన వ్యక్తిననీ, తనంతటి వారు మరేవరూ లేరని అనుకోవడం మనిషి సహజ అహాంకారం.


🌹ఫలోదకాలను మన తెలివితో సంపాదించుకున్నామనే అహంకారాన్ని వదిలి... అవన్నీ భగవంతుడు ప్రసాదిస్తే అనుభవించగలుతున్నామని గుర్తించేందుకు శివాభిషేకం చేయాలి.


🌹అందుకు మనసులో నీవిచ్చిన సంపదతోనే నిన్ను అర్చిస్తున్నామని స్వామికి కృతజ్ఞతను తెలియజేయడం అభిషేకంలో ఉన్న అంతరార్థం.


🌹వినయాన్ని విన్నవించుకోవడం అభిషేకం.


🌹ఎలాగైతే మనం మన శరీరంపై ఉన్న దుమ్ము, ధూళీ, మురికి తొలగించుకోవడానికి స్నానం చేస్తామో...

అలాగే మన అంతరంగంలోని మాలిన్యం ప్రక్షాళన కావడానికి శివుడికి అభిషేకం చేయాలి.


🌹అభిషేక సమయంలో వినిపించే రుద్రాధ్యాయంలోని మంత్రభాగం మనకు కనువిప్పు కలిగిస్తుంది.

సృష్టిలోని సకలప్రాణులు, వృక్షాలు మొదలైనవన్నీ పరమేశ్వర స్వరూపమేననీ, సకల ప్రాణులకూ శుభం కలగాలని మనం అందులో కోరుకుంటున్నట్లుగా శివాభిషేకం చేయాలి.


🌹అభిషేకం చేసే సమయంలో వెలువడే మంత్రాల అర్థాలు మన అంతరంగాన్ని తట్టి మేల్కోల్పుతాయి. అప్పుడు జ్ఞాన జ్యోతి స్వరూపుడైన #పరమశివుడు మనలో ఆవిర్భవిస్తాడు.


♦️శివో అభిషేక ప్రియ:♦️ అంటే... 

🌹పరమశివుడు అభిషేక ప్రియుడు.


♦️“నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి

  పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు

    గామధేనువు వానింట గాడి పసర

  మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు”♦️


🌹#తాత్పర్యము

శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు ‘కామధేనువు’ కాడి పశువుగా పడి వుంటుందట.

‘కల్పవృక్షం’ అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట.


🌹శివార్చన, అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి. సకల ఐశ్వర్యములు సమకూరతాయి.


ఆవు పాలతో -- సర్వ సౌఖ్యాలు

ఆవు పెరుగు -- ఆరోగ్యం, బలం

ఆవు నెయ్యి -- ఐశ్వర్యాభివృద్ధి

చెరకు రసం (పంచదార) -- దుఃఖ నాశనం, ఆకర్షణ

తేనె -- తేజో వృద్ధి

భస్మ జలం -- మహా పాప హరణం

సుగంధోదకం -- పుత్ర లాభం

పుష్పోదకం -- భూలాభం

బిల్వ జలం -- భోగ భాగ్యాలు

నువ్వుల నూనె -- అపమృత్యు హరణం

రుద్రాక్షోదకం -- మహా ఐశ్వర్యం

సువర్ణ జలం -- దరిద్ర నాశనం

అన్నాభిషేకం -- సుఖ జీవనం

ద్రాక్ష రసం -- సకల కార్యాభివృద్ధి

నారికేళ జలం -- సర్వ సంపద వృద్ధి

ఖర్జూర రసం -- శత్రు నాశనం

దూర్వోదకం (గరిక జలం) -- ద్రవ్య ప్రాప్తి

ధవళొదకమ్ -- శివ సాన్నిధ్యం

గంగోదకం -- సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి

కస్తూరీ జలం -- చక్రవర్తిత్వం

నేరేడు పండ్ల రసం -- వైరాగ్య ప్రాప్తి

నవరత్న జలం -- ధాన్య గృహ ప్రాప్తి

మామిడి పండు రసం -- దీర్ఘ వ్యాధి నాశనం

పసుపు, కుంకుమ -- మంగళ ప్రదం

విభూది -- కోటి రెట్ల ఫలితం లభిస్తుంది.


🌹నిశ్చలమైన భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. 

అందుకే ఆయన "భోళా శంకరుడు"

                    🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱

అద్భుతమైన కథ

 Must Read🙏🙏🙏🙏


ఒక అద్భుతమైన కథ 

  


రాత్రి 11 గంటలకు. తాళం వేసిఉన్న ఇనుప ద్వారం బయట నుండి ఒక పిలుపు. ఎవరా అని వచ్చి చూశాను. గుమ్మం ముందు ఒక పెద్దాయన ఉన్నారు. చాలా దూరం వచ్చినట్లుగా నలిగిపోయిన బట్టలు చేతిలో చిన్న సంచి తో నిలబడి ఉన్నారు. అయన తన చేతిలోని చిన్న కాగితం లోకి చూస్తూ "ఆనంద్, నెంబర్ 8, యోగానంద వీధి ఇదే కదూ!" అని అడిగారు. "అవును నేనే ఆనంద్. ఇదే చిరునామా. మీరూ ..." అని అడిగాను. అయన చిన్నగా వణుకుతూ తడారి పోయిన తన పెదవులను నాలుక తో తడుపుకుంటూ "బాబూ! నేను మీ నాన్నగారి మిత్రుడిని. మీ ఊరినుండే వస్తున్నాను. నాన్నగారు మీకు ఈ ఉత్తరం ఇచ్చి మీ సాయం తీసుకోమన్నారు" ఉత్తరాన్ని చేతిలో పెట్టారు.  


అయన ఆ ఉత్తరం ఇవ్వగానే "నాన్నగారా?" అంటూ ఆ ఉత్తరాన్ని తీసుకొని ఆత్రంగా చదివాను. అందులో "ప్రియమైన ఆనంద్! నీకు నా ఆశీర్వాదములు. ఈ ఉత్తరం తీసుకుని వచ్చిన వ్యక్తి నా స్నేహితుడు. పేరు రామయ్య. చాలా కష్టజీవి. కొద్ది రోజుల క్రితం ఈయన కొడుకు ఒక ఆక్సిడెంట్ లో చనిపోయాడు. నష్టపరిహారం కోసం తిరుగుతున్నాడు. అది వస్తే అయనకు, ఆయన భార్యకు రోజు గడవడానికి కాస్త తోడవుతుంది. ఆక్సిడెంట్ జరిగిన తరువాత పోలీస్ వారి విచారణలు, ట్రావెల్స్ వారు ఇస్తామని అన్న నష్టపరిహారపు పేపర్లు అన్ని సేకరించి నీకు పంపాను. డబ్బులు Head Office లో తీసుకోమన్నారు. ఆయనకు హైదరాబాద్ కొత్త. ఏమి తెలియదు. నువ్వు ఆయనకు సహాయం చేస్తావని నమ్ముతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. కుదిరినప్పుడు ఒక్కసారి ఊరికి రావాల్సిందిగా కోరుతూ

మీ నాన్న" అని ఉంది.  


నన్నే చూస్తూ నిలబడి ఉన్నారు రామయ్యగారు. ఒక్క నిమిషం అలోచించి ఆయనను లోనికి ఆహ్వానించాను. మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చి "ఏమైనా తిన్నారా" అని అడిగాను. "లేదు బాబూ. ప్రయాణం ఆలస్యం కావడంతో నాతో పాటు తెచ్చుకున్న రెండు పళ్ళు మాత్రం తిన్నాన"ని చెప్పారు.


నాలుగు దోశలు వేసుకొచ్చి అందులో కొద్దిగా ఊరగాయ వేసి ఆయన చేతిలో పెట్టాను. "మీరు తింటూ ఉండండి" అని చెప్పి, ఆ గది బయటకు వచ్చి కొన్ని ఫోన్ లు చేసుకొని తిరిగి ఆయన దగ్గరకు వచ్చాను. నేను వచ్చి చూసే సరికి ఆయన దోశలు ఆరగించి, చేతిలో ఏవో పేపర్లు పట్టుకుని కూర్చున్నారు. నన్ను చూసి ఆ పేపర్ లు నా చేతిలో పెట్టారు. అందులో ఆక్సిడెంట్ లో చనిపోయిన వారి అబ్బాయి ఫోటో కూడా ఉంది. కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు. సుమారు 22 సంవత్సరాల వయసు ఉంటుంది. నా కళ్ళలో నీళ్లు తిరిగాయి.  


"ఇతడు నా ఒక్కగానొక్క కొడుకు. అంతకు ముందు పుట్టినవారు చిన్నతనం లోనే అనేక కారణాల వలన చనిపోయారు. ఇతడు మాత్రమే మాకు మిగిలాడు. పేరు మహేష్. కష్టపడి చదివించాను. బాగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకున్నాడు. మమ్మల్ని చూసుకుంటానని, కష్టాలన్నీ తీరపోతాయని చెప్పి ఉద్యోగంలో చేరాడు. ఆ రోజు రోడ్ దాటుతుండగా ఆక్సిడెంట్ జరిగింది. అక్కడికక్కడే చనిపోయాడు. నష్టపరిహారం తీసుకోవడం ఇష్టం లేక బిడ్డ పైన వచ్చిన పైకం వద్దనుకున్నాము. కానీ రోజు రోజుకీ నాలో శక్తి తగ్గిపోతోంది. నా భార్య ఆరోగ్యం బాగా లేదు. మీ నాన్నగారి బలవంతం మీద ఇప్పుడు వచ్చాను. నా కొడుకు సహాయం చేస్తారని చెప్పి ఈ ఉత్తరం ఇచ్చి పంపారు మీ నాన్నగారు" అని ముగించారాయన.  


"సరే పొద్దు పోయింది, పడుకోండి" అని చెప్పి నేను కూడా నిదురపోయాడు  


పొద్దున లేచి స్నానాదికాలు ముగించుకుని, కాఫీ తాగి ఇద్దరం బయల్దేరాము. దారిలో టిఫిన్ ముగించుకుని ఆయన తీసుకొచ్చిన పేపర్ల లోని అడ్రెస్ ప్రకారాం ఆ ఆఫీస్ కు చేరుకున్నాము. "ఆనంద్! ఇక నేను చూసుకుంటాను. నువ్వు ఆఫీస్ వెళ్ళు బాబు" అన్నారాయన. "పర్లేదండి. నేను లీవ్ పెట్టాను" అన్నాను. దగ్గరుండి ఆ నష్టపరిహారం ఇప్పించాను. చాలా థాంక్స్ బాబూ! నేను ఊరికి బయల్దేరుతాను. మా ఆవిడ ఒక్కతే ఉంటుంది ఇంట్లో" అని చెప్పి తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు రామయ్య గారు. "రండి, నేను మిమ్మల్ని బస్సు ఎక్కించి వెళ్తా" అని చెప్పి, టిక్కెట్ తీసి ఇచ్చి, ఇప్పుడే వస్తానని వెళ్లి దారిలో తినడానికి పళ్ళు అవి తెచ్చి రామయ్య చేతిలో పెట్టాను.  


ఆయన సంతోషంగా "ఆనంద్ బాబూ! నాకోసం సెలవు పెట్టుకొని, చాలా సాయం చేశావు. ఊరు వెళ్ళగానే మీ నాన్నకు అన్ని విషయాలు చెప్పాలి. కృతజ్ఞతలు తెలియచేయాలి అన్నాడు.  


అప్పుడు నేను నవ్వుతూ రామయ్య గారి చేతులు పట్టుకుని "నేను మీ స్నేహితుడి కొడుకు ఆనంద్ ని కాదండీ. నా పేరు అరవింద్. మీరు వెళ్లవలసిన చిరునామా మారి నా దగ్గరకు వచ్చారు. ఆ చిరునామ ఇంటికి వెళ్లాలంటే అంత రాత్రిపూట 10 km ప్రయాణం చేయాలి. మీరేమో అలసిపోయి ఉన్నారు. అందుకే నేను నిజం చెప్పలేదు. మీరు తెచ్చిన లెటర్ లో ఫోన్ నెంబర్ ఉండడంతో వారికి ఫోన్ చేశాను. ఆ ఆనంద్ ఏదో పని మీద వేరే ఊరు వెళ్లారట. ఆ మిత్రుడికి విషయం చెప్పాను. అయన చాల బాధ పడ్డారు, నేను దగ్గరుండి చూసుకుంటానని చెప్పడంతో కాస్త కుదుట పడ్డారు. మీకు జరిగిన నష్టం నేను తీర్చలేనిది. కానీ ఏదో నాకు చేతనైన సహాయం చెయ్యాలనిపించింది. నాకు ఆ తృప్తి చాలండి" అన్నాను. బస్సు కదలడం తో ఒక్కసారి రామయ్యగారు తన కన్నీటితో నా చేతులను తడిపేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. "నువ్వు బాగుండాలి బాబు" అని ఆశీర్వదించారు. ఆ మాటే చాలనుకున్నాను నేను. పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఈ రామయ్య గారిని చూస్తూ ఉంటే ఆయన ముఖం లో మా నాన్నగారు కనిపించారు.  


ఆకాశంలోకి చూశాను. అక్కడే ఎక్కడో ఉండి ఉంటారు మానాన్న. "నాన్నా! నా అభివృద్ధి చూడడానికి ఈ రూపంలో వచ్చావా నువ్వు! ఒక ఉత్తరం తీసుకువచ్చి నాకు చూపి నేను సాయం చేస్తానో లేదో అని పరీక్షించావా? మీ వంటి ఉత్తమమైన తండ్రికి కొడుకుగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను నాన్నా! మీకు సంతోషమేనా నాన్నా!" అంటూ ఆనంద బాష్పాలు రాల్చాను.  


"సాయం చెయ్యడానికి మనసు ఉంటే చాలు. మిగిలినవన్నీ

 దానికి తోడుగా నిలబడతాయి"

ఈ కథ చదవగానే నాకు కళ్లల్లో నీళ్లు వచ్చాయి 

అవసరం లో ఉన్నవారికి సాయ పడదాం🙏copied..post...

రాముడిలో

 *రాముడిలో ఏమంత గొప్పదనం ఉంది?*

 

*మాయలు మంత్రాలు చూపించలేదు.*

*#విశ్వరూపం ప్రకటించలేదు.*


*జీవితంలో ఎన్నో కష్టాలు... జరగరాని సంఘటనలు... చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు.*


*పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు... తోడుగా, ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు.*


*కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు... అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస వధ చేశాడు.*


*అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా  అహం దశరథాత్మజః - దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు.*


*అయినా లోకమంతా ఆయననే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది?ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కక పోయినా, స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా, సందర్భమేదైనా కానీ... ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు. లోకానికి ఒకేఒక్కడుగా నిలిచాడు.*


*💠 శాస్త్ర ధర్మం 💠*


*తండ్రి మాట కోసం వనవాసానికి సీత, లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య. పెద్దకుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయానని బాధపడతాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది. తాను దశరథుడినని, పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది. కానీ, రాముడు ఇందుకు ఒప్పుకోడు. శాస్త్రప్రమాణాలు అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచుతాడు. నిజంగా నీవు దశరథుడవే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు. నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్నసమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఒక్కడే.*


*💠 స్నేహ ధర్మం 💠*


 *మాయలేడి కారణంగా సీతమ్మను వదలి, పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు. ఇదే అదనుగా భావించిన రావణుడు మారు వేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు. ఇదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగిస్తాడు. విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకుని, రావణుడిని ముప్పు తిప్పలు పెడతాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికివేస్తాడు. రెక్కలు తెగిన ఆ పక్షిరాజు  నేలకూలుతాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి, రాముడి చేతిలోనే ప్రాణం విడుస్తాడు. తనకు క్షేమం కలిగించటానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడుగా స్వీకరించి, అతడికి ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య. తాను క్షత్రియుడు. చేస్తున్నది వనవాసం. మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తరక్రియలు చేసి, స్నేహ ధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడా మహనీయుడు.*


 *💠 యుద్ధ ధర్మం 💠*


*వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. తమ్ముడి భార్య కోడలితో సమానం. మామగారు తండ్రితో సమానం. తండ్రిలాగా కాపాడాల్సిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు. అంతేకాదు... వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరాలను వేటాడటం క్షత్రియధర్మం. అంతేకాదు, ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది. దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టే రాముడు చెట్టుచాటున దాగి, వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధధర్మం. వాలి వధ ఘట్టంలో రాముడు క్షత్రియ, యుద్ధ ధర్మాలను పాటించాడు.*


*రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి, ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు. అప్పుడు రామచంద్రుడు*


*మరణాంతారం వైరాని నివృత్తం నః ప్రయోజనం | క్రియతామద్య సంస్కారః మమాప్యేష యథా తవ ||*


*‘విభీషణా! శతృత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది. సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు. నాకూ అన్నగారే’ అంటాడు... ఇదీ రాముడి ధర్మవర్తన.*


*💠 దయా ధర్మం 💠*


*సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి రాజ్య బహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు. సముద్రతీరంలో అపారమైన వానరసేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు విభీషణుడు. మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయం ఇస్తాడు రామయ్య.*


*అంతేకాదు, రావణుడిని చంపి విభీషణుడిని లంకారాజ్యానికి రాజును చేస్తానని ప్రతి


జ్ఞ చేస్తాడు. కానీ, సుగ్రీవుడు మొదలైన వారికి ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి, విభీషణుడిని నమ్మవద్దని చెబుతారు. అతడు రావణాసురుడి దూత అంటూ హెచ్చరిస్తారు. అంతా విన్న రాముడు విభీషణుడే కాదు... చివరకు రావణుడే తనను ఆశ్రయించినా... అతడికి కూడా అభయం ఇస్తానంటాడు. ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించటం క్షత్రియధర్మం. దయాధర్మం కూడా. వనవాసంలో ఉన్నా, చివరకు యుద్ధభూమిలో ఉన్నా దయాధర్మాన్ని రామయ్య విడిచిపెట్టలేదు.*


*💠 మనుష్య ధర్మం 💠*


*రామరావణ సంగ్రామం ముగుస్తుంది. రావణుడు నేలకు ఒరుగుతాడు. ముల్లోకాలూ ఎంతో ఆనందిస్తాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారు. రాముడిని సాక్షాత్తు శ్రీమహావిష్ణు స్వరూపంగా స్తుతిస్తారు. ‘నీది విష్ణు అంశ. వాస్తవానికి నువ్వు నిరాకారుడివి. అయినా సాకారుడిగా ఉన్నావు. సృష్టి, స్థితి, లయలు నీవే నిర్వహిస్తావు...’ అంటూ రాముడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పినా రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు. తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు.*


*‘ఆత్మానం మానుషం మన్యే... దశరథాత్మజః’*


*అంటూ తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే. సాధారణ వ్యక్తిని మాత్రమే’ అంటాడు. ఇదీ రామయ్య పాటించిన మనుష్యధర్మం. రామయ్య ఎక్కడా మాయలు, మంత్రాలు ప్రకటించలేదు. తాను దైవాన్నని చెప్పుకోలేదు. సాధారణ పౌరుడిలాగే రాజ్యభోగాలతో పాటు సుఖదుఃఖాలూ అనుభవించాడు. మనుష్యధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతారమూర్తి శ్రీరాముడు.*


*💠 సోదర ధర్మం 💠*


*రావణ వధ జరిగింది. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావలసిందిగా విభీషణుడుకి వర్తమానం పంపించి, విశ్రాంతిగా కూర్చున్నాడు రామయ్య. దూరంగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుంది? రాముడి ఆలోచన సాగుతుండగానే ఆమె ఎదురుగా వచ్చి నిలుచుంది. అమ్మా! నీవెవరు? ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే నీకు భయంగా అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సాయం కావాలా? అంటూ రామయ్య ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానం ఇస్తూ, రామచంద్రమూర్తీ! నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామా! నీవు ధర్మమూర్తివనీ, ఏకపత్నీవ్రతుడవనీ,  సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలచవనీ విన్నాను. నా భర్త అనేకమంది స్త్రీలను చెరపట్టాడు. నీవంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని చూడాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే నీ ఔన్నత్యం అర్థమైంది. రామా! ధన్యురాలను. ఇక సెలవు. అంటూ నిష్క్రమించింది. ఇదీ... పరస్త్రీల పై రామయ్య చూపించే సోదరధర్మం.*


*పవిత్ర జీవితం కోసం, ముక్తి కోసం సాధన చేసే యోగులు రామునిలా జీవించాలని అనుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు. ఎలాగైనా ఉండొచ్చు. నిరీక్షించి... కాలపరీక్షను ఎదుర్కోవడం వివేకవంతుల లక్షణం.*


*రాముడు అదే చేశాడు. ఎప్పుడూ ప్రణాళిక బద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేం. మన ప్రమేయం లేకుండా చికాకులు కలుగుతాయి. వాటికి కుంగిపోతే జీవితం గతి తప్పుతుంది. గుచ్చుకున్న ముల్లును నెమ్మదిగా తొలగించి ముందుకెళ్లాలి. అలా చేయగలిగితే అద్భుతమైన అనుభూతి మిగులుతుంది. ఏ విషయాన్నైనా సక్రమంగా నిర్వర్తించే సామర్ధ్యం పెరుగుతుంది.*


*రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆరాధన కోసం కాదు. మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది అందులోని పరమార్థం. త్యాగం, ధర్మం, దయ, పరాక్రమం రామునిలోని గొప్ప లక్షణాలు. వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే శ్రీరామ జయరామ జయ జయరామ*


*🕉️🙏🙏🙏 🚩జై శ్రీ రామ్🚩