29, నవంబర్ 2021, సోమవారం

రసభస్మము

 ఆయుర్వేద వైద్యము నందు ఉపయోగించు భస్మాల ఉపయోగాలు - 3 . 


 * రసభస్మము -  


    ఈ రసభస్మమును పాదరసం పుటంపెట్టి శుద్ది చేసి తయారుచేస్తారు . ఇలా శుద్ది చేసిన రస భస్మమును అనుపానయుక్తముగా ఉపయోగించిన పక్షవాతము , కంపవాతము , మూత్రఘాతము , వాతరక్తము , కుష్ఠు , దోష జ్వరము , కీళ్లనొప్పులు , కాసలు , బాలింతరోగము పోగొట్టును . శరీరము నందలి రక్తమును వృద్ధిపరచును . 


 * ఇంగిలీక భస్మము - 


    దీనిని అనుపానయుక్తముగా సేవించిన సవాయి మేహము , శుక్ల మేహము , కాసలు , పిల్లల జలుబు , తిమ్మిరి వాతము , కిడ్నీ దోషములు , నొప్పులు , మూత్ర దోషములు తొలగును. 


 * రసకర్పూర భస్మము - 


    ఈ రసకర్పూరమును అనుపానయుతముగా సేవించిన సమస్త రోగములు కుదురును . కుష్ఠు , మేహమచ్చలు , తిమ్మిరి , బొల్లి , కంఠమాల , సవాయిరోగములు మాన్పును . 


 * రస సింధూరం - 


   ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించిన సమస్త మేహములు , కాస , శ్వాస , తిమ్మిరి , శుక్లనష్టములు హరించును . 


 * తాళక భస్మము - 


    ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించిన కుష్ఠు , కఫరోగము , వాతములు , క్షయ , పక్షవాతము , పడిస ( జలుబు ) బాధ పోవును . 


 * పగడ భస్మము - 


      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న కాస , శ్వాస , కుసుమ , క్షయ , రుతుశూల , పాండురోగములు నిర్మూలించును . 


 * ముత్య భస్మము - 


      ఈ భస్మమును సేవించిన కాస , శ్వాస , గుండెరోగము , అతిమూత్రము , కామెర్లు , ఉబ్బసం , మేహములను నయం చేయును , మెదడుకు మంచి బలాన్ని ఇచ్చును . ఇది క్యాల్షియం తక్కువ ఉన్నవారికి ఇవ్వడం వలన క్యాల్షియం లోపం సరిచేయవచ్చు . 


 * ఆల్చిప్పల భస్మము - 


      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న దగ్గులు , కడుపునొప్పులు పోవును . కండ్లకు చనుపాలలో కలిపి కాటుకలా రాసిన కండ్లలోని పొరలను కోయును . 


 * శంఖ భస్మము - 


       ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న సర్వ శూలలు , దగ్గులు , కుసుమ రోగములు , అగ్నిమాంద్యము , సర్ఫవిషము పోగొట్టును . 


 * గవ్వల భస్మము -  


      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న రక్తగ్రహణి , గుండెవ్యాధి , వ్రణములు , పాత సుఖరోగములు , ఉడుకు జ్వరములు నశించును . 


 * కాసీస భస్మము - 


      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించుచున్న ఉబ్బులు , అజీర్ణములు , చర్మరోగములు , గ్రహణి రోగములు , మూత్రకృచ్చము , పాండురోగము , గుండెనొప్పులు తప్పక కుదుర్చును . 


 * హేమాక్షిక భస్మము - 


      ఈ భస్మమును అనుపానయుక్తముగా సేవించిన శూల , హుద్రోగము , అజీర్ణము , కాస , శ్వాస , పైత్యము , పాండువు , కామెర్ల రోగము నయం అగును. 


    తరవాతి పోస్టు నందు మరికొన్ని భస్మాల గురించి మరింత విలువైన సమాచారం మీకు అందిస్తాను . 


              కాళహస్తి వేంకటేశ్వరరావు 


               అనువంశిక ఆయుర్వేదం 


                     9885030034

కామెంట్‌లు లేవు: