30, నవంబర్ 2021, మంగళవారం

 ఒక ప్రశ్న మాత్రమే భారతం లోనిది మిగిలినవన్ని రామాయణంలోనివే సుమా !

................................................................


(1) కుంతీదేవి తనకు సంతానం కావలెనని కోరుకొన్నపుడు, తథాస్తని వరమిచ్చిన మహర్షి ఎవరు ?


(అ) వ్యాసుడు

(ఆ) దుర్వాసుడు

(ఇ) అగస్త్యుడు

(ఈ) అంగీరసుడు


(2) రామాయణంలో  ధాన్యమాలిని ఎవరు ? 


(అ) రావణుని రెండవ భార్య అతికాయుని తల్లి

(ఆ) గోదావరి తీరంలో శ్రీరాముని సేవించిన మత్స్యకన్య

(ఇ) అశోకవనంలో త్రిజటతోపాటుగా సీతాదేవికి సేవలు చేసిన రాక్షసస్త్రీ

(ఈ) దండకారణ్యంలో శూర్పణఖకు సఖి


(3) మారీచసుబాహుల తల్లి ఎవరు ?


(అ) అంక్షుమాలిని

(ఆ) లంబకర్ణిక

(ఇ) తాటకి

(ఈ) కైకసి


(4) కుంభకర్ణుడు తపస్సుచేసి ఇంద్రాసనం (ఇంద్రసింహసనం) అడగాలనుకొని పొరబాటున నిద్రాసనం కావాలన్నాడు.  ఆ దేవుడు ప్రత్యక్షమై తథాస్తు అన్నాడు. అందుకే కుంభకర్ణుడు ఆరునెలలు గాఢంగా నిద్రపోతాడు. ఇంతకు కుంభకర్ణునికి ఆ వరమిచ్చిన దేవుడెవరు ?


(అ) శంకరుడు

(ఆ) సూర్యభగవానుడు

(ఇ) ఇంద్రుడు

(ఈ) బ్రహ్మ


(5) వాలి తన చివరి ఘడియలలో సుగ్రీవుని పిలిచి అంగదుడిని బాగా చూచుకొమ్మని కోరి, తన మెడలోని కాంచనమాలను తీసి అతని మెడలో వేశాడు. తాను అహంకారంతో ప్రవర్తించానని కనుక క్షమించమని శ్రీరాముని కోరుతూ మరణించాడు.  ఆ కాంచనమాలను ఎవరు ధరించి యుద్దం చేసినా ఎదుటివ్యక్తి బలం క్షీణించి బలహీనుడైతాడు. ఇంతకు వాలికి కాంచనమాలను ఇచ్చినదెవరు ?


(అ) రావణుడు

(ఆ) ఇంద్రుడు

(ఇ) జాంబవంతుడు

(ఈ) నీలుడు


(6) రామసేతు నిర్మాణానికి వాస్తుదర్శకుడెవరు  (ఇంజనీరు ఎవరు )


(అ) నలుడు

(ఆ) జాంబవంతుడు

(ఇ) అంగదుడు

(ఈ) నీలుడు


(7) రామరావణ సంగ్రామ ప్రారంభానికి ముందు "సీతను తిరిగి ఇచ్చి క్షమాపణ చెప్పాలనే " సందేశంలో  రావణనుడి దగ్గరకు వెళ్లిన శ్రీరామదూత ఎవరు ?


(అ)  సుగ్రీవుడు

(అ) నలుడు

(ఇ) నీలుడు

(ఈ) అంగదుడు


(8) రావణుడు విద్యుజ్జిహ్వుడనే రాక్షసుడు చేసిన రాముని తలను పోలిన ఒక శిరస్సును సీతకు చూపి యుద్ధంలో రామలక్ష్మణులు చనిపోయారని సీతతో చెప్పాడు. సీత ఆ శిరస్సును చూచి, కన్నీరు మున్నీరుగా విలపించింది. రావణుడు వెళ్ళిపోయాక విభీషణుని భార్య -- - - - - - అనే సాధ్వి సీతను దగ్గర చేరి ఓదార్చి అదంతా కపటమాయని భయపడవద్దని, యుద్ధానికి వానర సమేతంగా శ్రీరాముడు సిద్ధంగా ఉన్నాడని, సీతకు శుభము కలుగుతుందని చెప్పింది. ఇలా చెప్పి సీతను ఓదార్చిన ఆ సాధ్వీమణి పేరేమిటి ?


(అ) రుజ

(ఆ) సరయు

(ఇ) చారుమాలిని

(ఈ) అంశుమాలిని


(9) శ్రీరామపట్టాభిషేకంలో అయోధ్యకు యువరాజుగా పట్టాభిషక్తుడైనవాడెవరు ?


(అ) లక్ష్మణుడు

(ఆ) భరతుడు

(ఇ) శత్రుఘ్నుడు

(ఈ) అంగదుడు


(10) వాల్మికిమహర్షి రామాయణం వ్రాయటానికి ముందు ఏ నది ఒడ్డున పక్షులజంటను చూచాడు ?


(అ) సరయు

(ఆ) గంగా

(ఇ) యమున

(ఈ) సరస్వతి

................................................................................ ................................ జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కామెంట్‌లు లేవు: