30, నవంబర్ 2021, మంగళవారం

క‌లం మూగ‌బోయింది

 క‌లం మూగ‌బోయింది..... తాను ఇంక ఎవ‌రిద్వారా భావాల్ని ప‌లికించాలంటూ రోదిస్తోంది... త‌నతో ఎన్నో భావాల్ని అల‌వోక‌గా కురిపించిన ఆయ‌న లేరనే వార్త‌ను జిర్ణించుకోలేని క‌లం ఇక నేను తెల్ల‌కాగితాన్ని అలానే వుంచుతానా అంటూ క‌నిపించిన వారిని అడుగుతూ కుమిలిపోతోంది..... 

దాద‌పు 30 సంవ‌త్స‌రాల పాటు ఆయ‌నతో మ‌మేక‌మే న‌వ‌ర‌సాల్ని అల‌వోక‌గా అల‌తితొల‌తి మాట‌ల‌తో సామాన్య ప్ర‌జానీకాన్ని ఆక‌ట్టుకుని ఏ సంద‌ర్భానికైనా ప‌లికే పాట‌ల్ని రాయించిన ఆయ‌న లేర‌నే మాట న‌మ్మ‌లేని క‌లం సొమ్మ‌సిల్లింది.....


సిరివెన్న‌ల సీతార‌మశాస్త్రి  ఇక లేర‌నే వార్త యావ‌త్త్ సిని ప్ర‌పంచంతో పాటు సాహితీ ప్రియులు  దిగ్భ్రాంతికి గుర‌వుతున్నారు... వారం క్రితం దాకా త‌మ‌తో ఎంతో ఆప్యాయంగా గ‌డిపిన ఆయ‌న ఒక్క‌సారిగా ఈ భువిని విడిచారంటే న‌మ్మ‌లేకున్నారు... దాదాపు మూడువేల  పాటలు రాసిన సిరివెన్న‌ల అస‌లు పేరు చెంబోలు సీతారామ శాస్త్రి  .... చిన్న వ‌య‌సులోనే పాట రాసి ఇంటివారిని మెప్పించి  ప్ర‌శంస‌లు అందుకున్నారు... డాక్ట‌ర్ అవుదామ‌నుకున్నా ఇంటి ప‌రిస్తితులు బాగోక పోస్ట‌ల్ డిపార్ట్మెంట్లో  క్ల‌ర్క్ గా త‌న జీవితాన్ని ప్రారంభించారు... ఇది త‌నకు స‌రిప‌డ‌దనుకుని సినిప్ర‌పంచంలో త‌న అదృష్ఠాన్ని ప‌రీక్షించుకోవాల‌కున్న ప్ర‌యత్నాల‌కు కె విశ్వానాథ్ త‌న చిత్రంతో ప‌రిచ‌యం చేసారు...    ఆ సిన‌మా పేరునే త‌న ఇంటిపేరుగా మార్చుకుని  ఎన్నో చిత్రాల‌కు త‌న సాహిత్యాన్ని అందించారు...  ఆయ‌న రాసిన బూడిదిచ్చే వాడినేదికోరేది పాట ఇప్ప‌టికి పండిత‌పామ‌రుల్లో నానుతూనే వుంటుంది.,.  ఇలాంటి పాట‌లే కాకుండా శృంగార‌రసంలో కూడా త‌న  క‌లాన్ని ఝ‌ళ‌పించారు... మ‌రోవైపు శ్రీ శ్రీ ని త‌ల‌పిస్తూ  విప్ల‌వ‌గీతాల‌కు  ప్రాణం పోసాడు... నిగ్గ‌దీసి అడుగు సిగ్గులేని జ‌నాన్ని అంటూ త‌నే యాక్ట్ చేసారు... మ‌రోవైపు జ‌గ‌మంత కుటుంబం నాది అంటూ వేదాంత దోర‌ణిలో ప‌లికించిన సాహిత్యం ఆయ‌న ఋషిని గుర్తుకుతెస్తాడు., ఇలా చెప్పుకుంటూ పోతే ఒక‌టా రెండా వేల పాట ఆయ‌న కలం జాలువారాయి....  అటువంటి సీతారామ‌శాస్త్రి  క‌లం మూగ‌బోయింది...

కామెంట్‌లు లేవు: