ఈ రోజు ఏ T.V చూసినా ఆంధ్రప్రదేశ్ మద్యం అమ్మకాలగూర్చి చర్చిస్తున్నారు. రాష్ట్ర ప్రబుత్వం మద్యం దుకాణాలను తెరవటం అటు మహిళలోకంలో కల కలం రేకెత్తిస్తుంది. చాల మంది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు మద్యానికి అలవాటు పడ్డ వారు ఈ కరోనా పుణ్యమా అని మద్యానికి దూరంగా వున్నారు. ఇది ఇంట్లో వున్న మహిళలకు ఆనందంగా వుంది. రోజు కూలి చేసుకొనే వారు రోజు ఏదో ఒక చిన్నా చితక వ్యాపారాలు చేసుకొనే వారు మద్యం జోలికి పోకుండా ఉండటంతో వారి వద్ద వున్న డబ్బులు సురక్షితంగా ఉన్నాయని ఇంట్లో ఆడవారు అనుకునే ఆశలు అడియాసలే అయ్యాయి వారి ఆనందం నిప్పుల మీద నీళ్లు పోసినట్లుగా ఈ మద్యం దుకాణాల తెరువు అయ్యిన్ది. దానికి తోడు ఇన్నాళ్ల సారా ఆదాయం పూడ్చుకోటానికా అన్నట్లు ఇప్పుడు మద్యం రేటు 75% పెంపు చేశారన్నది బట్ట తలమీద తాటి కాయ పడ్డట్లు అయ్యిన్ది. మద్యం రుచి చూడక ఇన్నాళ్లు ఆగిన సారా రాయుళ్లు యెంత ధరైనా పెట్టి తాగాలని కుతూహలపడటంలో తప్పు లేదు. సారా వ్యసనానికి అలవాటు పడ్డవారు వారి కుటుంబ పరిస్థితులు వారి ఆదాయ వ్యయ నిబద్దత కలిగి వుండరు. కాబట్టి వారు ఇంట్లో భార్య నగలు (ఉంటే) అమ్మి అయినా తాగటానికి వెనుకాడరు. ఇట్లా యెంతోమంది తమ కుటుంబాలను రోడ్డుపైకి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్నీ పరిగణలోకి తీసుకొనైనా ప్రజల ప్రాణాలను కాపాడే దిశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణాలని వెంటనే మూసివేస్తే చాల మంచిది. ఇప్పుడు ఆంధ్రప్రదేషులో కొరోనా విష కోరలు చాపి విజృంబిస్తున్నది. ఈ తరుణంలో సామాజిక దూరం పట్టించుకోకుండా గుంపులు గుంపులుగా జనాలు ఎండలో వచ్చి సారా కొనుక్కని అటు వాళ్ళ కుటుంబం ఇటు సమాజానికి హాని కలుగ చేస్తారటంలో అతిశయోక్తి లేదు. మందు బాబులకు ఒక్కరికి కరోనా సోకినా అది విజృంభించి ఎంతో మంది ప్రాణాలను బలికొంటుందనటం నిజం.
ఏ రకంగా చుసిన ఈ మద్యపు దుకాణాల తెరపు మాత్రం సభ్య సమాజం హర్షించదగ్గ విషయం కాదు.
ప్రభుత్వం మరలా అలోచించి వెంటనే మద్యం షాపులు మూయాలని ప్రజలంతా కోరుతున్నారు.
లిక్కర్ ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే ఒక మంచి వనరు కాదని ఎవ్వరు అనరు. కానీ ప్రజలప్రాణాలు బలిపెట్టి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవటం యెంత వరకు సమంజసం. యేది ఏమైనా ఈ సమయంలో మద్యం దుకాణాలు తెరవటం కరొనాను తలుపులు తెరచి ఆహ్వానించటం కన్నా వేరు కాదు.
ఈ విషయంలో మన ప్రియతమ ప్రధాన మంత్రిగారు తక్షణం దేశాన్ని కరోనానుంచి కాపాడే క్రమంలో దేశం మొత్తంలో మద్యం దుకాణాలను పూర్తిగా కరోనా సమసిపోయే వరకు తెరవకూడదని తెరిస్తే కఠిన శిక్షలు విధిస్తామని ఆర్డినెన్సు తేవాలి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని చూసి తెలంగాణ ప్రభుత్వం కుడా మద్యం షాపులు తెరిచే ప్రయత్నం చేస్తే ఆశ్చర్య పడ నవసరం లేదు.
ఇప్పటికైనా మద్యం దుకాణాలను మూయకపోతే కరోనాను నియంత్రిచటం మన దేశంలో ఎవ్వరి వల్ల కాదు.
జనాలను చంపి స్మశానముమీద పరిపాలన చేయాలనుకుంటే మాత్రమే మద్యం దుకాణాలను ఇంకా ఇంకా తెరచి, ఇంకా కొత్తవి పెట్టి ఆదాయం పెంచుకోండి అని సామాన్య మహిళలు అంటున్నారు.
ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి కానీ ప్రజలతో వ్యాపారం చేసే దిశలో పని చేయకూడదు. మందు బాబులతో కరోనా వ్యాప్తి చెందదు అని ఏమైనా ఉన్నదా, లేదే కరోనాకు జాతి, మత, కుల, వర్ణ, లింగ బేధం లేదని మనం చూడటం లేదా?
ఈ విపత్కర పరిస్థితిలో మద్యం షాపులు తెరవటం సమంజసం కాదని మేధావి వర్గం వేనోళ్ల వక్కాణిస్తున్నది. అంతే కాదు ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన మన ఆంధ్రప్రదేశ్ మరో ఇటలీ కాగలదు. తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త.
మహిళలకు విజ్ఞప్తి; అమ్మలారా, అక్కలారా మీరు మీ భర్తలను ఇంటినుండి బైటికి వెళ్లనీయకుండా కట్టడి చేయండి. మీ మీ భర్తలను సారానుండి కాపాడుకోండి తద్వారా మానవ సమాజాన్ని కాపాడండి.
సర్వ్ జానా సుఖినోభవంతు.
ఓం శాంతి శాంతి శాంతిః