27, మే 2024, సోమవారం

ఋణపడిపోకూడదు

 దక్షిణ అంటే ఏంటి

          పూజారికి దక్షిణ ఇవ్వటం తప్పనిసరా..?


ముందుగా దక్షిణ అంటే ఏంటో తెలుసుకుందాము ..దక్షత కలిగిన వారికి సమర్పించుకునేది దక్షిణ .. 

ప్రదక్షిణ అనేది మనము మనకుగా భగవంతుడిని ధ్యానిస్తూ భగవంతుడి చుట్టూ తిరుగుతూ ఆయన వైపుగా కదలడము ప్రదక్షిణము,ఆ దక్షత కలిగిన వారు భగవంతుడు మాత్రమే కనుక మనము ప్రదక్షిణము భగవంతుడికి మాత్రమే సమర్పించుకుంటాము.


*సమర్పణ ఎందుకు ?*


సాధారణముగా మనకు ఏ పని చేసి పెట్టినా వారు ఎవరు అయినా వారికి వారి కష్టానికి డబ్బులు లేక వారి కష్టానికి ప్రతిఫలము ఇవ్వడము ధర్మము .ఒకవేళ అలా ఇవ్వకపోతే అది పెద్ద అధర్మం ..

ఇది నేను కాదు, వాల్మీకి రామాయణములో భరతుడు చెప్పిన ధర్మము.ఇప్పుడు పూజారులకు దక్షిణ ఎందుకు ఇవ్వడమో చూద్దాము.


వేదము అంటేనే దైవము, మానవ నేత్రముకి కనిపించని దైవము మంత్ర రూపములో వేదరాశిలో నిక్షిప్తమయి మనకు వినిపిస్తారు, 

మన సాధనకు మార్గము చూపి తనలో మనని తన వైపు నడిపించేదే వేదము. అటువంటి దైవముకి కానీ వేదముకి కానీ వెల కట్టే సొమ్ము ఎంత ?


పూజాదికాలు యజ్ఞ యాగాదులు చేయగలిగే దక్షత కలిగినవారు ఎవరు ?

కేవలము పూజారులే .. పూజారులకు దక్షిణ ఇచ్చేదీ వేదము చదివే దక్షత పొందిన దక్షులు కనుక. వారిలో ఉన్న వేదముకి విలువ, ఆ వేదముకి విలువ కట్టేంత వారము కాదు, ఈ విషయము గ్రహించాలి. వారికి దక్షిణ ఇవ్వడము అంటే మనము ఇవ్వగలిగినంత ఇవ్వడము కానీ 10 రూపాయలో లేక 100 రూపాయలో విలువ కట్టి ఇవ్వడము కానే కాదు. అది తప్పు . గుడిలో పూజ లేక అర్చన లేక హారతి లేక ఇతర ఎటువంటి క్రతువులు చేయించుకున్నా పూజారి గారికి దక్షిణ తప్పకుండా ఇవ్వవలసిందే.నియమం అనరు కానీ ఇది తప్పకుండా పాటించ వలసిన ధర్మం మరియు ఆచారం .. దక్షిణ ఇవ్వకుంటే చేసుకున్న పూజకి పూర్తి ఫలితము ఎలా దక్కుతుంది.. ?


ఇది వాస్తవము మరియు సత్యము. పూజారులకు వారి సంతృప్తి కలిగే దక్షిణ ఇవ్వడము చేత వారు సంతృప్తి చెందడము చేత పొందేవి ఏమిటంటే ?


1) వారి కంఠము, స్వరము , ఊపిరితిత్తులను అనుక్షణమూ నొప్పిస్తూ, అనుగుణముగా లయబద్ధముగా ఉపయోగిస్తూ మంత్రభాగము తప్పు దొర్లకుండా దేవతలను ఆవాహనము చేస్తూ పూజాదికాలు నిర్వహించే వారి కష్టమునకు ప్రతిఫలము, దానికి విలువ ఎంత ఇవ్వగలరో ఊహించి మన ధర్మము కోసము ఇవ్వడము.


2) జీవులను ఉద్ధరించడము దైవ ధర్మము, వేద రూపమున తనను స్మరించి సర్వ మనవాళికి శుభము కలిగించే మనకు మరియు దైవముకు సాధనముగా ఉన్న పూజారులకు వారి సంతృప్తి మేర దక్షిణ ఇస్తే, తన ధర్మము కోసము ఉన్న పూజారి సంతృప్తి చూసి దైవము కూడా సంతృప్తి చెందుతారు. ఏవరికి ఎప్పుడూ ఋణపడి ఉండకూడదు.


3) ఉచితంగా ముహూర్తాలు, జాతకాలు అడగకూడదు. 


జ్యోతిష్యునికి,పురోహితునికి ఎప్పుడూ ఋణపడిపోకూడదు.

వారి ద్వారా సేవలను తీసుకున్నప్పుడు తప్పక వారికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వారిని గౌరవిస్తూ ఉంటే ..

వారి ఆత్మ సంతృప్తి మనకు దీవెనల రూపంలో మంచిని కలుగజేస్తాయి.


ఓం నమో నారాయణాయ 


          🚩సర్వేజనా సుఖినోభవంతు 🚩

సామవేదం షణ్ముఖశర్మ గారు

 సామవేదం షణ్ముఖశర్మ గారు


షణ్ముఖశర్మ 1967లో ఒడిషా - ఆంధ్రప్రదేశ్ సరిహద్దుపైన ఉన్న గంజాం జిల్లా, అస్క గ్రామంలో, పండిత కుటుంబంలో జన్మించారు. బెర్హంపూర్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో హానర్స్ డిగ్రీ పొంది సాహితీ పిపాసను తీర్చుకోవటానికై ఉపాధిని వెతుక్కుంటూ విజయవాడ చేరారు. 1988లో స్వాతి వారపత్రికలో ఉపసంపాదకుడిగా చేరి అక్కడ ఏడేళ్ల పాటు పనిచేశారు. తన గీతరచనా నైపుణ్యానికి విజయవాడలోని స్వాతి కార్యాలయంలో పునాది పడిందని శర్మ చెప్పుకున్నారు. స్వాతి పత్రిక సంపాదకబృందంలో పనిచేసి సంపాదించిన అనుభవం ఋషిపీఠం అనే ఆధ్యాత్మిక పత్రిక యొక్క స్థాపనలో సహకరించింది. ఋషీపీఠాన్ని గుంటూరులో ప్రసాదరాయ కులపతి (ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతిగా పేరుబడ్డారు) వంటి పండితుల సమక్షంలో ప్రారంభించారు.


శర్మ తొలుత భక్తిగీతాలు వ్రాయడంతో గీతరచనను ప్రారంభించారు. ఈయన వ్రాసిన భక్తిగీతాలను నేపథ్యగాయకుడు ఎస్.పీ.బాలసుబ్రమణ్యం సహాయంతో ఒక ఆడియో ఆల్బంను కూడా విడుదల చేశారు. ఆ ఆల్బం బాగా విజయవంతమవడంతో చెన్నైలోని సినీ రంగంలో కూడా గీతరచనా అవకాశాలు వచ్చాయి. కొంతకాలం పాటు సినీరంగంలో పాటలు వ్రాసిన తర్వాత ఆధ్యాత్మిక ఉపన్యాసాలను వ్రాయటం వాటిపై సభలలో ఉపన్యాసాలు ఇవ్వటమనే మరో ఉన్నత శిఖరంవైపు దృష్టి మరల్చారు.


సామవేదం షణ్ముఖశర్మగారు రాసిన సినిమాలలో శుభాకాంక్షలు, సూర్యవంశం, సుస్వాగతం చిత్రాలలో ప్రజాదరణ పొందిన పాటలు వ్రాసారు. 


శర్మ గారు పండిత కుటుంబంలో పెరిగినందున, అతను అనేక మంది గురువుల నుండి శాస్త్రాలు మరియు కావ్య వచనాలు నేర్చుకున్నారు. తన జీవితాన్ని మరింత మెటాఫిజికల్ విషయాలకు అంకితం చేస్తూ, ఇప్పుడు హైదరాబాద్‌ను తన స్థావరంగా చేసుకుని ఉపన్యాసాలు ఇస్తూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఆయన మొదటి ఉపన్యాసం విజయవాడలోని శివరామకృష్ణ క్షేత్రంలో ' అగ్ని'పై జరిగింది. 


వీరు ఆంధ్ర ప్రదేశ్ మరియు భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో మతపరమైన ఉపన్యాసాలు, వైదిక విలువలు మరియు ఇతిహాసాలపై ఉపన్యాసాలు ఇస్తున్నారు . అతను US, UK మరియు ఆస్ట్రేలియాలో పర్యటించాడు మరియు హిందూ గ్రంథాలు మరియు భారతీయ సాంస్కృతిక వారసత్వంపై ఉపన్యాసాలు ఇచ్చాడు. 


శర్మ గారు స్వామి వివేకానందను తన స్ఫూర్తిగా భావిస్తారు.


శర్మ గారు సమకాలీన రచయితల కంటే చాలా ఆలస్యంగా గీత-రచన వృత్తిని ప్రారంభించారు. అతను హిందూ మతం యొక్క వివిధ అంశాలపై భక్తి మరియు తత్వాలను వ్యక్తీకరించడానికి 1000 కంటే ఎక్కువ శివపదం పాటలను వ్రాసారు. శివపాదం కీర్తనలను పుస్తకాలు, కార్యక్రమాలు, క్యాసెట్లు మరియు సీడీల రూపంలో ప్రజలకు విడుదల చేశారు.


శర్మ గారు 2021లో ఆన్‌లైన్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది, భగవద్గీత మరియు ఇతర హిందూ గ్రంధాలకు సంబంధించిన కోర్సులను అందిస్తోంది... 


సామవేదం నరసింహాచార్యులు(తండ్రి), సత్యవతి (తల్లి) దంపతులకు ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు. వారిలో రెండవ కుమారుడు సామవేదం రామమూర్తిశర్మ గారు. రామమూర్తిశర్మ  గారి మూడవ కుమారుడు "సామవేదం సత్యనరసింహశర్మ". మరొక కుమారుడు సామవేదం షణ్ముఖశర్మ గారు.


బ్రాహ్మణ సమాజానికి గర్వ కారణం అయిన మన సామవేద షణ్ముఖ శర్మ గారికి  పాదాభి వందనాలు చేస్తూ......


రచయిత ఎవరో నాకు తెలియదు ఇది నా రచన కాదు.

భాగస్వాములు కండి

 మీరు భాగస్వాములు కండి 

ఈ బ్లాగును ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలోని తెలుగువారు చూస్తున్నారు.  మనలో ఎంతోమంది, కవులు, పండితులు, ఫొటోగ్రాఫరులు ఇంకా ఇతర కళాకారులు ఉండి వుంటారు. వారందరికీ ఇదే మా సాదర ఆహ్వానం. మీరు మీ రచనని లేదా మీరు ఈ బ్లాగులో ప్రచురించదలచిన అంశం ఏదైనా కానీ అందరకు ఉపయోగపడుతుందని తలుస్తే దాని మీద "తెలుగు పండిత కవులలో ప్రచురణార్ధం" అని వ్రాసి మీ పేరు, చిరునామా, ఫోను నెంబరు పేర్కొంటూ +91 9848647145 కు వాట్సాప్ చేయండి.  దానిని మేము మన బ్లాగులో ప్రచురిస్తాము. మీరు పంపిన అంశాలు (content ) ప్రపంచమంతా చూస్తారు. 

ఈ బ్లాగును మరింత సుందరంగా తీర్చి దిద్దే దిశలో మీ వంతు భాగస్వామ్యంగా విరాళాలు+91 9848647145 ఫోను నెంబరుకు ఇవ్వగలరు   

ఇట్లు 

మీ బ్లాగరు


*మే 28, 2024* 🌹 *దృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

    🍁 *మంగళవారం*🍁

   🌹  *మే 28, 2024* 🌹

     *దృగ్గణిత పంచాంగం*                  

 *స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*ఉత్తరాయణం - వసంతఋతౌః*

*వైశాఖమాసం - కృష్ణపక్షం*

*తిథి : పంచమి* మ 03.23 వరకు ఉపరి *షష్ఠి*

వారం :*మంగళవారం*(భౌమవాసరే)

*నక్షత్రం : ఉత్తరాషాడ* ఉ 09.33 వరకు ఉపరి *శ్రవణం*

*యోగం : బ్రహ్మ* రా 02.06 వరకు ఉపరి *ఐంద్ర*

*కరణం   : తైతుల* మ 03.23 *గరజి* రా 02.33 ఉపరి *వణజి* 

*సాధారణ శుభ సమయాలు*

*ఉ 09.00 - 01.00 సా 04.30 - 06.30* 

అమృత కాలం :*రా 10.38 - 12.10*

అభిజిత్ కాలం :*ప 11.39 - 12.31*

*వర్జ్యం : మ 01.24 - 02.56*

*దుర్ముహుర్తం : ఉ 08.10 - 09.03 రా 10.59 - 11.43*

*రాహు కాలం:మ 03.20 - 04.58*

గుళిక కాలం :*మ 12.05 - 01.43*

యమ గండం :*ఉ 08.49 - 10.27*

సూర్యరాశి : *వృషభం* 

చంద్రరాశి :*మకరం*

సూర్యోదయం :*ఉ 05.34*

సూర్యాస్తమయం :*సా 06.36*

*ప్రయాణశూల :‌ ఉత్తర* దిక్కుకు ప్రయాణం పనికిరాదు


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం :*ఉ 05.34 - 08.10*

సంగవ కాలం :*08.10 - 10.47*

మధ్యాహ్న కాలం :*10.47 - 01.23*

అపరాహ్న కాల :*మ 01.23 - 03.59*

*ఆబ్ధికం తిధి  : వైశాఖ బహుళ పంచమి/షష్ఠి*

సాయంకాలం :*సా 03.59 - 06.36*

ప్రదోష కాలం :*సా 06.36 - 08.47*

నిశీధి కాలం :*రా 11.43 - 12.27*

బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.06 - 04.50*

______________________________

       🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*

            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹

*శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।*

*వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥*

*బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।*

*బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥*


 🌹🍁 *ధ్యానం*🍁🌹

గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।

రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥🙏

*యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।*

*భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥*🙏

🌴🪷🌹🛕🌹🌷🪷🌷🌴

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*


          🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

🌹🌷🍁🍁🍁🍁🌷🌹

పంచమి

 *శ్రీ క్రోధి నామ సంవత్సరం*

 *ఉత్తరాయణం - వసంత ఋతువు*

     *వైశాఖ మాసం - బహళ పక్షం*   

🔔తిథి     : *పంచమి* మ3.09 వరకు

🔯వారం   : *మంగళవారం* (భౌమ్యవాసరే )

⭐నక్షత్రం  : *ఉత్తరాషాఢ* ఉ9.43 వరకు

✳️యోగం : *బ్రహ్మం* రా2.25 వరకు

🖐️కరణం  : *తైతుల* మ3.09 వరకు

            తదుపరి *గరజి* రా2.13 వరకు

😈వర్జ్యం   :   *మ1.33 - 3.04*

💀దుర్ముహూర్తము : *ఉ8.04 - 8.55* 

                        మరల *రా10.50 - 11.34*

🥛అమృతకాలం    :  *రా10.43 - 12.15*  

👽రాహుకాలం       : *మ3.00 - 4.30*

👺యమగండ/కేతుకాలం : *ఉ9.00 - 10.30*

🌞సూర్యరాశి: *వృషభం* || 🌝చంద్రరాశి: *మకరం*

🌄సూర్యోదయం: *5.5.29* || 🌅సూర్యాస్తమయం:*6.25*

సర్వేజనా సుఖినో భవంతు - శుభమమస్తు 

ఇరగవరపు రాధాకృష్ణ🙏

Indian History


 Here is a colourful 1 page Chart depicting 5000 years of Indian History. Feel free to forward to all your friends and also try getting it colour-printed in large size- say A3, for your children as well as yourselves. I am sure it will be of great help to our young generation.

Panchaag

 


ఈ పద్యం జ్ఞాపకం వున్నదా

 ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై

యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం

బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము దాన యైన వా

డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్‌


ఈ పద్యం జ్ఞాపకం వున్నదా

ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాల

 *తరుచుగా మన వంట గదిలో లభించే మూలికలతో కలిగే ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాల :-*


• అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.

• కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.

• నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.

• గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.

• అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.

• జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.

• బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.

• సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.

• మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

• బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.

• మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

• దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.

• ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.

• అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.

• కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.

• మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.

• ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.

• బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

• క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

• మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

• ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.

• అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.

• పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.

• సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.

• దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.

• ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.

• చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

• కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.

• క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.

• యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

• వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

• పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.

• ఉలవలు ఊభకాయాన్ని తగ్గిస్తాయి.

• ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి, మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది.

• ద్రాక్షలో ఉండే పైటోకెమికల్స్.. కొలెస్ట్రాల్ ని దరి చేరనివ్వవు.

• జామపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

• ప్రోస్త్రేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టొమాటోలకు ఉంది.

• నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.

• మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు.

• మునగ కాయలు ఆకలిని పెంచుతాయి.


*ఇట్లు,*

*మీ ఆయుర్వేద వైద్యులు,*

అన్నం పరబ్రహ్మస్వరూపం

 🌾అన్నం పరబ్రహ్మస్వరూపం🌾

🍃🌺 *'అన్నం'* *గురించి నలుగురు మంచి మనుషులు చెప్పిన నాలుగు గొప్ప మాటలు...*


1. ఆకలిగొన్నవాడికి   ' దేవుడు '  కనపడేది అన్నం రూపంలోనే ! 

   

   ( మహాత్మా గాంధీ ) .


2. " నేను వంటింట్లోకి వేరే  పనిమీదవెళ్ళినాకూడా , వంట చేస్తున్న మా అమ్మగారు.  " పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ-   నేను అన్నం కోసం వచ్చాననుకుని ! 

ఎంతయినా అమ్మ అంటే అన్నం.  అన్నం అంటే అమ్మ ! అంతే !


  ( జంధ్యాలగారు ) .


3. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాపసభకి వెళ్ళినదానితో సమానం ! 


( విశ్వనాధ సత్యనారాయణ గారు ) . 


4.. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు !  వజ్రాలూ , వైడూర్యాలూ  పోగేసుకున్న ఈ వయసులో  మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి ! 


( రేలంగి వెంకట్రామయ్య గారు ) .

 

5. ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా,   మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !


( ముళ్ళపూడి వెంకటరమణ గారు ) .


6. ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు 


" అన్నీ మనవికావు నాయనా " అని బీదసాదలకి చేటలతో పంచేసే వారు. 

అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనేగానీ 

అర్ధం కాలేదు ! 


( ఆత్రేయ గారు ) 


7. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం ! 

అమ్మ చేతి   అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు ! 


( చాగంటి కోటే శ్వర రావుగారు ) . 


8.  ఆకలితో వున్న వాని  మాటలకు ఆగ్రహించవద్దు !!


( గౌతమ బుద్దుడు ). 


9 ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారుకూడా అమృతంలా రుచిస్తుంది !

( మాతా అమృతానందమయి ) .


10. మీ పిల్లలు ఎంతదూరంలో,  ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పాకాదూ , మీ గొప్పాకాదు 

మీ పూర్వీకుల పుణ్యఫలమే అని  గుర్తించు.

🙏🙏

మిషన్ గ్రీన్ ఇండియా

భారతదేశ జనాభా 140 కోట్లకు పైగా ఉంది, ఒక వ్యక్తికి 20 అడుగుల స్థలం ఉన్న ప్రదేశంలో మీరు ఈ రోజు ఒక్క చెట్టును నాటితే, నేరుగా 140 కోట్ల చెట్లు ఉంటాయి మరియు వచ్చే వేసవిలో 30 డిగ్రీల వరకు వేడి ఉంటుంది. మరియు వర్షం కూడా పెరుగుతుంది. కేకులు/బట్టలు/బైక్‌ల కోసం వేలల్లో ఖర్చు చేస్తారు. అయితే ఈరోజు కాస్త ఆలోచించి బజారుకి వెళ్లి 20 రూపాయల చెట్టు మొక్కను తెచ్చిన తర్వాత తర్వాతి తరం గురించి ఆలోచించండి.


మిషన్ గ్రీన్ ఇండియా


మీ మనస్సాక్షి చెబితే కనీసం 10 మందికి ఈ సందేశాన్ని పంపండి మరియు సహకరించండి. *వచ్చే వర్షాకాలం నాటికి ఈ సందేశాన్ని భారతదేశమంతటా వ్యాప్తి చేయండి.తప్పక చేయండి

తాజా ఆహారం

 🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


👉 *అది యూరప్ అమెరికా వాళ్ళ అసహాయత!*🙏

👉 *ఇది మన అనంతమైన అజ్ఞానం!*🙏

 

1.  తాజా ఆహారం అందుబాటులో లేక, వండుకోవదానికి సమయం కేటాయించుకో లేక ఎప్పుడో నెలల క్రితం చేసిన రుబ్బిన పిండిని కేన్ లో వేసుకుని నిలవ పెట్టీ పెట్టీ దానితో రోజూ Pan కేకుల్నీ, ఆర్నెల్ల క్రితం చేసిన పిజ్జాలమీద, బంకలు సాగే కూరలు వేసుకుని తినాల్సిన ఖర్మపట్టడం అమెరికా యూరప్ *వాళ్ళ నిస్సహాయత !*

👉 56 భోజన వంటకాలను పక్కనపెట్టి ఎవడో ఏనాడో వండి పెట్టిన రొట్టెని కాలవలో పారెయ్యకుండా, ఫ్రిజ్జిలో మురగబెట్టి పెట్టీ మోడ్రన్ స్టైల్ పేరుతో ఆ పిజ్జాల్ని వేడిచేసి ₹ 400 / - పెట్టి  మరీ తినడం, *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


2. ఎనిమిది నెలలు ఎముకలు కొరికే చలి తట్టుకోలేక, కోట్లూ సూట్లూ వేసుకోవడం *వారి నిస్సహాయత...*

👉 వేసవి వేడిలో చమటలతో ఉక్కపోసి వళ్ళంతా జిడ్డుజిడ్డుగా అతుక్కుంటూ చిర్రెెత్తిపోతున్నా కూడా పెళ్లి రోజు వెర్రిగా కోట్లూ సూట్లూ వేసుకుని  తిరగడం *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


3. తాజా భోజనం వండేవాళ్ళు లేక ఫ్రీజ్ వాడడం, అమెరికా యూరోప్ *వాళ్ళ నిస్సహాయత...*

👉 రోజూ తాజా కూరగాయలు వస్తున్నా, వారం రోజుల కూరగాయలు ఫ్రీజ్ లో కుక్కి కుక్కి అవి  మురుగుతున్నవాటిని వండుకు తినడం, *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


4 . ఔషధ మొక్కల జ్ఞానం లేక, మూలికలతో పరిచయం లేక, వారు జీవ జంతువుల మాంసం తో కెమికల్స్ తో ఏవేవో మందులు తయారు చేయడం, వాటి సైడ్ ఎఫెక్ట్స్ కి వేరేవేరో రోగాల పాలవ్వడం *వారి నిస్సహాయత...*

👉 మరి ఆయుర్వేదం లాంటి గొప్ప చికిత్సా విధానం తెలిసినప్పటికీ, పట్టించుకోకుండా... కెమికల్  మందులు ఉపయోగించడం, సైడ్ ఎఫెక్ట్ లతో కొత్తరోగాలు తెలిసితెలిసి తెచ్చుకోవడం *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


5. సరిపడ ధాన్యం లేక పంటలు పండక పళ్ళూ కాయలూ దొరకకా  పాముల్ని, కప్పల్నీ, కుక్కల్ని నక్కల్ని కూడా చంపి తినడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 మరి 1600 రకాల ఆహార ధాన్యాలు లభిస్తున్నా వాళ్ళల్లా తినడానికి ప్రయత్నించడం *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


6. కొబ్బరి నీళ్ళూ మావిడి పళ్ళు బత్తాయి పళ్ళూ, సపోటా, అంబలి, చల్ల, మజ్జిగ, పాలు మొదలైనవి లేకపోవడం లేదా తెలియకపోవడం వల్ల పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు తాగడం *వారి నిస్సహాయత...*

👉 అవన్నీ కాక ఎన్నో రకాల ప్రాకృతిక పానీయాలు అందుబాటులో ఉన్నా... పురుగుల మందులు వేసిన శీతల పానీయాలు అనే విషాన్ని తాగడం ఆధునికంగా అభివృద్ది చెందామని భావించండం *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


7. వాళ్ళ పంపుల్లో నీళ్ళు గడ్డకడుతుంటే టాయిలెట్ కి వెళ్ళిన  తరవాత కడుక్కోలేక టిష్యూ పేపర్లతో తుడుచుకొని తిరగడం స్నానం చెయ్యలేక సెంటేసుకుని పడుకోవడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 సుబ్బరంగా మనకు నీళ్ళొస్తున్నా కడుక్కోకుండా  

తుడుచుకొని, సెంటేసుకుని తిరగడం *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


8. ఎలాంటి ముందుచూపూ లేక, మరుగుదొడ్ల నీళ్ళని నదుల్లో  కలుపుకోవడం మళ్ళీ వాటినే శుభ్రం చేసుకుని తాగడం *వాళ్ళ బుద్దిహీనత*

👉 అన్నీ తెలిసి తెలిసి వాళ్ళని గుడ్డిగా అనుసరించి అదే అభివృద్ది అనుకుని మనం కూడా మన నదుల్ని మురికి కూపాలు చేసుకుని మంచినీటి కోసం ఏడవడం *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


9. తోటలూ మొక్కలూ లేక ఎక్కడో ఎవరి దగ్గరో బానిసలా బతికడం కాయలూ పళ్ళూ కొనుక్కు తెచ్చుకోవడం. సరియైన కుటుంబ వ్యవస్థ లేకపోవటం వల్ల, నా అనే వాళ్ళు లేక, అశాంతిగా ఒంటరిగా జీవించడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 చక్కగా పల్లెల్లో ఫాం హౌసుల్లాంటి ఇళ్ళల్లో, చక్కని ఉమ్మడి కుటుంబ వ్యవస్థతో,  పెరట్లో బోలెడన్ని మొక్కలేసుకుని, చెట్టుకి పండిన కాయలూ పళ్ళూ తిన్నన్ని తిని పక్కవాళ్ళకిచ్చి సంతోషంగా, అందరితో కష్ట సుఖాలను పంచుకుంటూ, ఆనందంగా, ఆరోగ్యంగా జీవించే మనం...

ఆ అమెరికా, యూరోప్ వారిని అనుకరించడం... ఇలా కొట్టుకు చస్తూ, ఏడుస్తూ బతకడం... *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


10. చెట్లు పెంచుకోవడానికి ఏ ఎరువెయ్యాలో తెలియక రసాయనిక మందులేసుకోవడం కడుపులో ఎసిడిటీలు కేన్సర్లూ  తెచ్చుకోవడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 ఇంట్లో వుండే ఎద్దులూ, ఆవులు, కోళ్ళు, మేకల మల మూత్రాలను బయో ఫెర్టిలైజర్స్ గా, ఆర్గానిక్ పెస్టిసైడ్స్ గా వాడుకుంటూ హాయిగా ఆరోగ్యంగా బతికిన మనం...

వాటిని వదిలి అమెరికా, యూరోప్ వాళ్ళ మోజులో పడి వాళ్ళని అనుసరించి, మనం కూడా ఆ క్రిమిసంహారక మందులే వాడుతూ, ఇమ్యూనిటీ నాశనం చేసుకుంటూ ఆ రోగాలే తెచ్చుకోడం *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


11. ఒక్కోసారి ఆరునెలల పాటు వాళ్లకు సూర్యుడు కూడా కనిపించడు కనక వాషింగ్ మెషిన్ లో ఉతికేసిన బట్టలు సూర్యరశ్మిలో ఎండబెట్టే అవకాశం లెక డ్రైయ్యర్లో ఆరబెట్టుకుంటూ వాటికున్న ఎరోబిక్ ఎనరోబిక్ బాక్టీరియాల్లో కొన్ని చావకపోయినా హానికరమైన కెమికల్స్ వేసుకుని బతకడం *వాళ్ళ నిస్సహాయత...*

👉 హాయిగా ఎంతో ఆరోగ్యాన్నిచ్చే సూర్యరశ్మి నిండుగా వున్నా వాషింగ్ మెషిన్లో ఉతికిన బట్టల్ని అందులోనే ఆరబెట్టుకోవడం మన బుద్దిహీనత *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


12. గడ్డకట్టేసిన నీటితో  స్నానం చెయ్యలేక శానిటైజేషన్ పేరుతో మురికి చేతులపైనే పురుగులమందులు జల్లుకుంటూ...

అవే బట్టలతో ఇల్లంతా తిరగడం, మంచాల మీద పడుకోవడం... వాటివల్ల మాటిమాటికీ రోగాలు తెచ్చుకోవడం మందులు మింగడం *వాళ్ళ నిస్సహాయత...*

👉హాయిగా నీళ్ళొస్తున్నా స్నానం చెయ్యకుండా స్టైల్ పేరుతో కుక్కకంపు కొట్టే సెంట్లు కొట్టుకుంటూ తిరగడం *మన అనంతమైన అజ్ఞానం.*

*🙏మరోసారి మళ్ళీ క్షమించాలి ఇదినిజం*🙏


13. దూరంగా నిలబడి ఆహ్వానించడం, నమస్కరించడం, 

చెప్పులు వేసుకుని ఏ ఇంట్లోకి వెళ్ళక పోవడం. 

కాళ్ళు చేతులూ కడుక్కోవడానికి బకెట్ తో నీళ్ళివ్వడం 

మన సంస్కారం. మన పెద్దలు మనకు నేర్పిన అత్యుత్తమ సంస్కారం. దాన్ని వదిలేసి ఇవ్వాళ ఏడవడం *మన అజ్ఞానం.!*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


14. విపరీతమైన చలితట్టుకోలేక ఇంటాబయటా అవే సాక్స్ అవే బూట్లతిరగడం *వాళ్ళ నిస్సహాయత.*

👉ఇంట్లోకి వచ్చేముందు చెప్పులు గుమ్మం బయటే వదిలెయ్యడం, బయట తిరిగిన బట్టల్ని బాత్ రూములొ  తడిపేసి స్నానం చేసి ఇంట్లోకి రావడం మన పద్దతి. అలాంటి పద్దతుల్ని చాదస్తం పేరుతో... ఆలోచన లేకుండా వదులుకోవడం *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

 

మనం ఎంతో ఆత్మీయత గుండెల్లో పొంగితే కానీ చేతులు పట్టుకోలేం, హత్తుకుని కౌగిలించుకోలేం. తల మీదో బుగ్గల మీదో ముద్దులు పెట్టుకోలేం కానీ అవి అమెరికా వాళ్ళకి అత్యంత సహజం..

కానీ నేడు దాన్ని వద్దంటోంది ప్రపంచ ఆరోగ్య మానవాళి... అంతా 

భారతీయుల్ని చూసి  క్వారంటైన్ జ్ఞానం నేర్చుకుంటోంది. నేర్చుకోమంటోంది.


కనీసం ఇప్పటికైనా మనం మన మడి ఆచారాలను మళ్ళీ పాటించడం ప్రారంభించకుంటే అది *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏


🧐🧐🧐 జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ అజ్ఞానం అంతా వాళ్ళని చూసి మనకుగా మనం తెచ్చిపెట్టుకున్న అజ్ఞానం...

 

మన బానిస మనస్తత్వ అజ్ఞానం...


విదేశీ వ్యామోహ అజ్ఞానం...


కరోనా లాంటి వైరస్ లను కొంపమీదకు తెచ్చిపెట్టుకునే అజ్ఞానం...


అమెరికాలో యాపిల్ ఫోన్ అంత మంచిఫోన్ మరొకటి లేదు.

అన్నది ఎంత నిజమో...


అమెరికా, యూరోపియన్ ప్రజలు తినేంత అనారోగ్యకరమైన ఆహారం...

వాళ్ళ కున్నన్ని ఆర్టిఫిషల్ అలవాట్లు కూడా ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేవు. అన్నది కూడా అంతే నిజం...


ఆధునీకరణ, ఫ్యాషన్, మొదలగు పేర్లతో ఋషులు మనకు అందించిన

దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా...

ప్రాకృతిక జీవనాన్ని  వదలేసుకోవడం *మన అజ్ఞానం*

🙏 *క్షమించాలి ఇదినిజం*🙏

 

Bottom LIne.

*వేటిని స్వీకరించాలో వాటినే స్వీకరిద్దాం...*


కానీ గుడ్డిగా...

మోజుతో...

వెర్రిగా...

అనాలోచనతో...

అనుకరిస్తే...

పోతాం! 


ఏం వచ్చి పోతాం?


కరోనా లాంటివి వచ్చి పోతాం!. -..🙏..🙏..🙏..🙏..🙏

జై సనాతన ధర్మ✊

భారతీయ సంస్కృతిని రక్షిద్దాం.

భారతీయ ఆచార సంప్రదాయాలను పాటిద్దాం.

వారణాసిలో హోటల్ కమ్ సత్రం

 GRT వారు కాశి/వారణాసిలో హోటల్ కమ్ సత్రం ప్రారంభించింది.


దక్షిణ భారత ఆహారాన్ని అందిస్తారు. గది అద్దెలు నామమాత్రం. ఆహారం ఉచితం.


మేము ఇటీవల వారణాసికి వెళ్లి GRT నిర్మించిన సత్రంలో బస చేసాము....

పేరు మాత్రమే సత్రం, కానీ గదులు అన్ని సౌకర్యాలతో అద్భుతంగా ఉన్నాయి, మీకు ఎక్కడా లభించదు.


గరిష్టంగా ముగ్గురు ఒక గదిలో ఉండగలరు... వారు ఉదయం కాఫీ, టిఫెన్, లంచ్, సాయంత్రం టీ మరియు రాత్రి భోజనం అందిస్తారు. ... రూమ్ సర్వీస్ లేదు... అన్ని ఆహారాలు ఉచితంగా మరియు అపరిమితగా...అమావాస్య రోజున వారు ఉల్లిపాయలు & వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని అందిస్తారు.


మేము గత అమావాస్యకు అక్కడ ఉన్నాం ఎలా నిర్వహించాలా అని ఆలోచిస్తున్నాము... మేము డైనింగ్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు అది ఉల్లి/వెల్లుల్లి లేని ఆహారం అని సూచించే పెద్ద బోర్డు ఉంది. అనేక రకాల వస్తువులు.... నిజానికి బయటి ఆహారం మనకు సరిపడదు కాబట్టి వారు తమ అతిథులను అక్కడ మాత్రమే తినమని పట్టుబట్టారు.

ఖాళీ చేస్తున్నప్పుడు ఆ అన్నదాన ట్రస్ట్ కోసం సహకారం అందించాలనుకున్నాము.. వారు అంగీకరించలేదు...


ఒక టిప్ బాక్స్ ఉంది... టిప్ ఇవ్వడం తప్పనిసరి కాదు... కానీ మేము అది లేకుండా వెళ్లలేము ఎందుకంటే వారి సేవ నిజంగా అద్భుతమైనది.... మీరు చుట్టూ తిరగడానికి అక్కడ చాలా EVలు లభిస్తాయి... V ఆనందించారు మేము అక్కడ ఉండడానికి మరియు GRT యొక్క సేవ నుండి టోపీలు...

వారణాసికి వెళ్లే ఎవరైనా, GRTలో ఉండండి... గది అద్దె కూడా చాలా చౌకగా ఉంటుంది... గదులు స్టార్ హోటల్ గదుల్లా ఉన్నాయి... సరికొత్త మోడల్ హైఫై ఫిట్టింగ్స్‌తో. 


ఇక్కడి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని ప్రదేశాలు... శంకర మఠం, గంగానది, విశ్వనాథర్ ఆలయం మరియు ఇతర దేవాలయాలకు వెళ్లడానికి మీకు పుష్కలంగా ఎలక్ట్రిక్ వాహనాలు లభిస్తాయి.


GRT హోటల్..కాంటాక్ట్ నెం.7607605660.


వసతి కోసం వారి వెబ్‌సైట్‌ని సందర్శించండి...

https://www.grtkasichatram.com/   లేదా GOOGLE IT మరియు లాగిన్ అవ్వండి.

ఆన్‌లైన్ ద్వారా మాత్రమే బుకింగ్.


కాశీని సందర్శించాలనుకునే వ్యక్తులకు ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు. 👍🏻


ఓం నమః శివాయ 🌹🙏🌹


www.grtkasichatram.com

అల్లం నిలువ ఉండే పచ్చడి

 


దోసెలు లోకి, ఇడ్లీల్లోకి , గారెల్లోకి చాలా బాగుండే మా అల్లం నిలువ ఉండే పచ్చడి ఇప్పుడు రెడి గా ఉన్నది. అద్భుతమైన రుచి మరియు శుచి శుభ్రతలతో, యధావిధిగా తేయారుచేబడిన అల్లం పచ్చడి మీరు ఒక సారి ఆస్వాదించితే, మరల మరల తెప్పించుకోవడం తథ్యం.

వెంటనే మీ ఆర్డర్ తెలుపగలరు.

తంగిరాల విశ్వనాథ్

శ్రీ గాయత్రి ఎంటర్ప్రెస్సెస్

7416223176

చైతన్యపురి, హైదరాబాద్

IPC to BNS సెక్షన్లు

 👉 *ఈ క్రింది పేర్కొనబడిన* *IPC సెక్షన్లను BNS(Bharatiya Nyaya Sanhita)  సెక్షన్లగా మార్చడం జరిగింది*


1. 302 IPC = 103 BNS

2. 304(A) IPC = 106 BNS

3. 304(B) IPC = 80 BNS

4. 306 IPC = 108 BNS

5. 307 IPC = 109 BNS

6. 309 IPC = 226 BNS

7. 286 IPC = 287 BNS

8. 294 IPC = 296 BNS

9. 509 IPC = 79   BNS

10. 323 IPC = 115 BNS

11. R/W 34 IPC = 3(5) BNS

12. R/W 149 = R/W 190 BNS

13. 324 IPC = 118(1) BNS

14. 325 IPC = 118(2) BNS

15. 326 IPC = 118(3) BNS

16. 353 IPC = 121 BNS

17. 336 IPC = 125 BNS

18. 337 IPC = 125 BNS(A)

19. 338 IPC = 125 BNS(B)

20. 341 IPC = 126 BNS

21. 353 IPC = 132 BNS

22. 354 IPC = 74 BNS

 23. 354(A) IPC = 75 BNS

 24. 354(B) IPC = 76 BNS

*****


 25. 354(C) IPC = 77 BNS

 26. 354(D) IPC = 78 BNS

 27. 363 IPC = 139 BNS

 28. 376 IPC = 64 BNS

 29. 284 IPC = 286 BNS

 30. 286 IPC = 288 BNS

       ( Fine - 5000/-)

 31. 290 IPC = 292 BNS

       ( Fine - 1000/-)

 32. 294 IPC = 296 BNS

 33. 447 IPC = 329 (3) BNS

 34. 448 IPC = 329 (4) BNS

 35. 392 IPC = 309 BNS

 36. 411 IPC =  317 BNS

 37. 420 IPC =  318 BNS

 38. 382 IPC =  304 BNS

 39. 442 IPC =  330 BNS

 40. 445 IPC =  330 BNS

41. 447 IPC =  330 BNS

42. 448 IPC =  331 BNS

43. 494 IPC =  82 BNS

44. 498 (A) IPC = 85 BNS

45. 506 IPC = 351 BNS

46. 509 IPC = 79 BNS

     *(Petty Originized Crime)* 


47. 9(I), 9(II) = 112 BNS


*పై IPC to BNS సెక్షన్లు తే 01.07.2024 ది న నుండి అమలలోనికి రానున్నాయి.*

డొనెషన్లు

 డొనెషన్లు

మిత్రులారా మన బ్లాగు అభివ్రుద్దికి డొనేషనులు +91 9848647145 మొబేలు నంబరుకు జీ పే, ఫొనె పె, లొ దేనితొ నయినా పంప వచ్హు. మీ స్క్రీన్ షాట్ పంపిస్తె మన బ్లాగులొ పబ్లిష్ చేస్తాము. ఇక ఆలశ్యం యెందుకు ఇప్పుడె మీరు డొనెషన్ పంపండి. మన బ్లాగు అభివ్రుద్దికి తొట్పడండి 

Rent a car

 *SREAYA TRANSPORTS*

*9160707234*

* 🚘🚙🚌🚖*

 *24/7 All Type Of Cars / Swfit Dizer / Etios /ERTIGA/ XYLO / INNVOA / INNOVA CRYSTAA* / 12 14

 17 22 24 *Seats* *Tempo* *Traveller* / 35 40 50 *Seats *Buses Available For Rental Purpose With Full Experience Drivers All City's* *HYDERABAD VIJAYAWADA GUNTUR*

 *Telangana Andhra Pradesh Tamilnadu Karanataka States*


Rent a car

S R Travels

Lalithabagh Uppuguda

Hyderabad

6309527694

Web Design

 *Web Design*


👉Web Design all kinds

👉Domain

👉Hosting (Unlimited space)

👉On page SEO

👉Meta description

👉Meta title

 👉IMG alt tags

👉Submission Web Master Tools

👉Backup

👉1 year support


Contact us for above services



*Ramanakumar Palakodeti*


*Cell.No.86881 34897*



Disclaimer. Blogger is not responsible for the content

అల్లం ఊరగాయ

 

రుచికరమైన, శుభ్రమైన, మరియు తాజా అల్లం ఊరగాయ అమ్మకానికి సిద్ధంగా ఉంది.

 *మా ప్రత్యేకతలు:* వెనిగర్ లేదు.. కృత్రిమ రంగులు లేవు.. ప్రిజర్వేటివ్‌లు లేవు.

 అన్నం, దోస, ఇడ్లీ మరియు ఉప్మాతో తినడానికి సిద్ధంగా ఉంది.

ఇంకా ఎందుకు ఆలేస్యం.. వెంటనే

 *సంప్రదించండి:*

 *తంగిరాల విశ్వనాథ్*

 *శ్రీ గాయత్రి ఎంటర్‌ప్రైజెస్*

 *8639447717*

 *చైతన్యపురి, హైదరాబాద్*

భగవద్గీత నేర్చుకుందాం*

 * భగవద్గీత నేర్చుకుందాం* 📖

*ఉచిత ఆన్‌లైన్ తరగతులు 👩‍🏫👩‍💻*

         

శుభారంభం - శుక్రవారం, 7 జూన్ 2024

సాయంకాలం *7* గం॥ల నుండి 

తరగతుల ఆరంభం - 

సోమవారం 10 జూన్ 2024

నుండి మీరు ఎంచుకున్న సమయంలో


స్థాయి 1️⃣ - 33 వ బ్యాచ్ 


🌻 *20 రోజుల్లో 2 అధ్యాయాలు* శుద్ధ సంస్కృత ఉచ్చారణ తో చదవడం నేర్చుకుందాం. 

🌻 పఠన పరీక్షలో ఉత్తీర్ణులు అయిన వారికి *"గీతా గుంజన్"* ఈ-ప్రశస్తి పత్రం ఇవ్వబడును. 

🌻 భగవద్గీతను సంపూర్ణంగా నేర్చుకొనుటకు తరువాత 3 స్థాయిలకు (3 Levels) ప్రవేశం ఉచితం.

🌻 వారానికి 5 రోజులు, ప్రతి రోజు కేవలం 40 నిమిషాలు మాత్రమే

🌻 మీ సౌలభ్యం 21 టైమ్ స్లాటల నుండి ఎంపిక చేసుకోవచ్చు (ఉదయం 4:00 గం॥ నుండి రాత్రి 2:00 గం॥ వరకు IST)

🌻 గీత తరగతులు 13 భాషల్లో అందుబాటులో ఉన్నాయి (हिंदी, English, मराठी, ગુજરાતી, తెలుగు, தமிழ், ಕನ್ನಡ, മലയാളം, বাংলা, ଓଡିଆ, नेपाली, অসমীয়া, सिंधी)

🌿 *ప్రత్యేకం:* నిత్య దైనందిన జీవితంలో భగవద్గీతను ఆచరించుటకు, చాలా సులభమైన మరియు ఆసక్తికరమైన వారాంతపు (శనివారం-ఆదివారం) గీత అర్థ వివేచనము 


*మీ మొబైల్ నుండి ఫారము పురించండి, వెంటనే WhatsApp సమూహంలో చేరండి*

joingeeta.com 


*🌸 || గీత చదవండి, చదివించండి, జీవితంలో   అన్వయించండి || 🌸* 


ప్రచార విభాగము

*లర్న్ గీతా, గీతా పరివార్*🚩

శివలింగాలు రేడియోధార్మికత!

 



శివలింగాలు రేడియోధార్మికత!  భారతదేశం యొక్క రేడియో ధార్మికత పటాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు! భారత ప్రభుత్వం యొక్క అణు రియాక్టర్ కాకుండా, అన్ని జ్యోతిర్లింగాల ప్రదేశాలలో అత్యధిక రేడియేషన్ కనిపిస్తుంది. శివలింగం కూడా ఒక రకమైన అణు రియాక్టర్లు గా చూడొచ్చు.  బిల్దేవా,  అక్మద్,  ధాతురా,  గుధల్ వంటి మహాదేవులకు ఇష్టమైన పదార్థాలన్నీ అణుశక్తి శోషకాలు.శివలింగం పై అమర్చిన నీరు కూడా రియాక్టివ్‌గా మారుతుంది.బాబా అణు రియాక్టర్ రూపకల్పన కూడా శివలింగం మాదిరిగానే ఉంటుంది.  శివలింగం మీద పొసే నీరు నది ప్రవహించే నీటితో కలిస్తే ఔషధం యొక్క రూపాన్ని తీసుకుంటుంది.అప్పుడు మన పూర్వీకులు మహాదేవ్ శివశంకర్‌కు కోపం వస్తే ప్రళయం వస్తుందని మనకు చెప్పేవారు.  మహాకల్ ఉజ్జయిని నుండి మిగిలిన జ్యోతిర్లింగాల మధ్య సంబంధం (దూరం) చూడండి -  ఉజ్జయిని నుండి సోమనాథ్ - 777 కి.మీ.  ఉజ్జయిని నుండి  ఓంకరేశ్వర్ - 111 కి.మీ.  ఉజ్జయిని నుండి  భీమాశంకర్ - 666 కి.మీ.  ఉజ్జయిని నుండి కాశీ విశ్వనాథ్ - 999 కి.మీ.  ఉజ్జయిని నుండి మల్లికార్జున్ - 999 కి.మీ.  ఉజ్జయిని నుండి  కేదార్‌నాథ్ - 888 కి.మీ.  ఉజ్జయిని నుండి  త్రయంబకేశ్వర్ - 555 కి.మీ.  ఉజ్జయిని నుండి బైద్యనాధ్  - 999 కి.మీ.  ఉజ్జయిని నుండి రామేశ్వరం - 1999 కి.మీ.  ఉజ్జయిని నుండి  ఘృష్ణేశ్వర్ - 555 కి.మీ.  హిందూ ధర్మం లో, కారణం లేకుండా ఏమీ జరగదు.  వేలాది సంవత్సరాలుగా సనాతన ధర్మంలో నమ్మకం ఉన్న ఉజ్జయిని భూమికి కేంద్రంగా  పరిగణించబడుతుంది.   అందువల్ల,  సూర్యుడిని లెక్కించడానికి మరియు జ్యోతిష్యాన్ని సుమారు 2050 సంవత్సరాల క్రితం లెక్కించడానికి ఉజ్జయినిలో మానవ నిర్మిత సాధనాలు కూడా తయారు చేయబడ్డాయి.   సుమారు 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ శాస్త్రవేత్త ఊహాత్మక రేఖ  ను సృష్టించినప్పుడు, అతనికి మధ్య భాగం ఉజ్జయిని అని తేలింది.  నేటికీ శాస్త్రవేత్తలు ఉజ్జయినికి సూర్యుడు మరియు అంతరిక్షం గురించి సమాచారం కోసం మాత్రమే వస్తారు అని తెలిసింది.                    సేకరణ

జాతి వైభావాన్ని..

 వేదం 90% శాతం మంది భారతీయులకు అసలు ఆ పదం గాని, అవి ఎన్నో కూడా తెలియదు..


మనం మరిచిపోయింది.. వేదాలనే కాదు.. ఒక మహా జాతి వైభావాన్ని.. 


వేదాలు సమస్తం జ్ఞానానికి మూలం ఈ మాట నేను చెప్పటం లేదు.. విదేశీయులు చెప్తున్నారు.. జర్మనీ పార్లమెంట్ చెప్తుంది.. ఫ్రంక్పర్ట్ యూనివర్సిటీ చెప్తుంది.. 


ఎవడైనా వాగుతున్నాడా?? వేదాలను గురించి పిచ్చి పిచ్చిగా ?? మీ ముందు?? అయితే వాడిని ఒకటి పీకి.. ఈ పోస్ట్ చూపించండి...


శ్రీ బ్రహ్మ శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి !!


జర్మనీ వారికి ప్రియమైన తెలుగు పండితుడు" శ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి"


ఒక్క యజుర్వేదమే నాలుగు ముఖాలుగా, నాలుగు రూపాల్లో అవగతమవుతుంది.

ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికి ఈ నాలుగు శాస్త్రాల్లో అభినివేశం ఉండాల్సిందే. అంత అభినివేశం, ప్రతిభ ఉన్నవారుగా ఇరవయ్యో శతాబ్దంలో పేరుపొందిన వారు దండిభట్ల విశ్వనాథశాస్త్రి. అంత ప్రతిభావంతులు కాబట్టే హిట్లర్‌ ఆయన్ని జర్మనీకి ఆహ్వానించారు! 


రాజమహేంద్రవరం లో వ్యాకరణశాస్త్ర పండితులుగా పేరుపొందిన దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి అత్యంత ఆసక్తికరమైన సంఘటన - ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నరోజుల్లో పశ్చిమ జర్మనీకి పంపిన రాయబారికి అక్కడి అధికారులు తమ కార్యాలయాలు చూపుతూ ఓ చోట ఓ భారతీయుని ఫోటో చూపించి ఆయన పేరేమిటో చెప్పమని అడిగారట. తనకు తెలియదని ఆ రాయబారి అనడంతో వెంటనే జర్మనీ అధికారులు దండిభట్ల విశ్వనాథశాస్త్రి అని చెప్పి ఆయనకు జర్మనీలో గొప్పపేరు ప్రతిష్టలు రావడానికి కారణమేమిటో కూడా చెప్పారు.


తొలి ప్రపంచ యుద్ధం తాత్కాలికంగా చల్లారింది. జర్మనీలో కెయిజర్‌ ప్రభుత్వం పతనమైంది. ప్రపంచమంతా దాని ప్రభావంతో ఆర్థికమాంద్యం నెలకొంది. ఆ యుద్ధంలో బందీలయిన వేలాదిమంది జర్మనీ సైనికుల్లో ఒకరు హిట్లర్‌. ఆయన ఆ అవమానాన్ని దిగమింగు కోలేకపోయారు. ప్రపంచ జాతుల్లో తనదే గొప్పజాతన్నది ఆయన విశ్వాసం. ఎలాగైనా తమ ఆధిపత్యం నిరూపించాలని ఆయన నాజీ పార్టీ స్థాపించారు. జర్మనులను దేశభక్తితో ఉత్తేజితం చేశారు. వైజ్ఞానికంగా, పారిశ్రామికంగా జర్మనీది పైచేయిగా మార్చడానికి ఎన్నో సంస్కరణలు ప్రారంభించారు. అలాగే కొత్త మారణాయుధాల అన్వేషణ ప్రారంభించారు.అప్పటికే సంస్కృత భాషాధ్యాయనం పట్ల జర్మన్లు ఆసక్తి పెంచుకొన్నారు. భారతీయ వేద-శాస్త్ర వాఞ్మయంలో మారణాయుధాల రహస్యాలున్నాయని ఆయన గ్రహించారు. 


ఒకవైపు సంస్కృత సాహిత్యాన్ని తమప్రజలకు అర్థమయ్యేలా అనువదింపచేశారు. ఆ విధంగా తొలిసారిగా ముద్రణకు నోచుకొన్న ఆ వాఞ్మయం నుంచి జర్మన్లు అబ్ధిపొందడానికి గట్టిచర్యలు హిట్లర్‌ తీసుకొన్నారు. అయితే యుద్ధ పరికరాలు, ఆయుధాల నిర్మాణానికి సంబంధించిన రహస్యాలను వేదశాస్త్ర వాఞ్మయం నుంచి విడమరిచి చెప్పేవారికోసం ఆయన అన్వేషణ సాగిస్తూనే వచ్చారు. అదే సమయంలో దండిభట్ల విశ్వనాథశాస్త్రి గురించి తెలుసుకున్న హిట్లర్‌ ప్రతినిధులు ఆయనకోసం అన్వేషణ ప్రారంభించారు.


దండిభట్ల విశ్వనాథశాస్త్రి నిత్యం శాస్త్ర విషయాలు ఆలోచిస్తూ, తమ ఇంటికి వచ్చేవారితో చర్చలు జరిపేవారు తప్ప లౌకిక విషయాలను పట్టించుకొనేవారు కాదు. ఓ రోజు ఆయన విశాఖపట్నం సమీపానున్న కొత్తవలస దగ్గర ఒక పల్లెటూరికి వెళ్లవలసి వచ్చింది. కాలినడకన వెళ్తోన్న సమయంలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన్ని సమీపించారు. 

వాదోపవాదాలకు తావులేకుండా ఆయన్ని అక్కడినుంచి ముందుగా విశాఖపట్నానికి, తర్వాత కలకత్తాకు తీసుకువెళ్లారు. కతకత్తాలో హిట్లర్‌ ప్రతినిధులు ఆయన మనసు మార్చడానికి అన్ని విధాలా ప్రయత్నించారు. చివరకు ఆయన్ని జర్మనీ తీసుకెళ్లారు. దండిభట్ల జర్మనీ చేరుకొన్న సమయం ఎటువంటిదంటే రెండో ప్రపంచ యుద్ధానికి రంగాన్ని సిద్ధం చేస్తున్న తరుణం!


బాంబులు తయారుచేసి రాశులు పోస్తున్నారు. అయితే నిల్వచేసే సమయంలో ఏమాత్రం వత్తిడి కలిగినా అవి పేలిపోతుండడంతో విపరీతమైన నష్టం సంభవించింది. అలా పేలకుండా నిల్వఉంచే మార్గం వారికి తోచలేదు. దండిభట్ల విశ్వనాథశాస్త్రి యజుర్వేదం నుంచి ఆ సమస్యకు పరిష్కారం సూచించారు. దాంతో దండిభట్ల పేరు మారు మోగింది. ఇక అప్పట్నించీ ఆయన పూజ్యపాదులయ్యారు. 


తన శాస్త్ర పాండిత్యాన్ని ఆయన జర్మనులకు పంచి పెట్టారు. ప్రపంచ దేశాల్లో జర్మనీ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి తనవంతు సహకారం అందించారు. జర్మనీకి వెళ్లిపోయిన తర్వాత దండిభట్ల తిరిగి భారతదేశానికి రాలేక పోయారు.


దండిభట్ల జర్మనీకి వెళ్లిన చాలాకాలం వరకు కూడా వారి సతీమణికి మూడువందల రూపాయల సొమ్ము ప్రతినెలా అందింది. అయితే చాలా కాలం తర్వాత నెలకు తొంభైరూపాయలు మాత్రమే వచ్చేవి. అంటే దండిభట్ల జీవించి ఉన్నంతకాలం ఆమెకు మూడువందల రూపాయలవంతున అంది, ఆయన మరణం తర్వాత కుటుంబపింఛనుగా తొంభై రూపాయల వంతున అందింది. మరి కొంత కాలానికి అదికూడా ఆగిపోయింది! 


అంటే వారు అప్పటికే పరమపదించి ఉంటారని ఆయన మిత్రులు, శిష్యులు అభిప్రాయపడటం గమనార్హం.దండిభట్ల దేశానికి దూరమైన తర్వాత దేశం, రాష్ట్రం అన్నీ ఆయన్ని మరచి పోయాయి! అయితే జర్మనులు మాత్రం ఆయన్ని తమవాడుగా, మాననీయుడిగా, మహనీయుడిగా ఇప్పటికీ నిలుపుకోవడం విశేషం.


ఇప్పటికి జర్మనీలో విదేశాంగ శాఖ కార్యలయంలో, పార్లమెంట్ లో దండిభట్ల వారి చిత్రం ఉంటుంది..


అది మన జ్ఞాన సంపద, అది మన జాతి వైభవం.. అటువంటి వేదాలను, వేదా విజ్ఞానాన్ని నాశనం చెయ్యాలని ఎందరో ప్రయత్నిస్తూనే ఉన్నారు ఇప్పటికి.. గుర్తుపెట్టుకో భారతదేశం అంటే ప్రపంచానికి జ్ఞాన జ్యొతి..


ఇప్పుడు కూడా టాప్ అంతా విదేశంలొ స్క్రాప్ అంతా మనదేశంలో.. 


పెరటిమొక్క వైద్యానికి పనికి రాదన్నట్టు మన సంస్కృతి, సాంప్రదాయ సిద్ధం గా ఉండే వేదాల విలువ పరాయి దేశం వాడు చెపితేగాని మనకు తెలియవు.. మన యోగా గురించి పాశ్చాత్యులు చెపితే గాని మనం నమ్మలేదు.


మనకు వీపు ఉందనే విషయాన్ని మన వెనకవాడు చెపితేగాని మనం నమ్మే పరిస్థితి లో లేము.. 


మన భారతదేశ ఔన్నత్యం ను ప్రపంచానికి చాటిన ఈ మహానుభావుని గురించి చదువుతుంటే

ప్రతి భారతీయునికి ఛాతీ గర్వంతో ఓ అంగుళం  పెరుగుతుంది.        🙏🙏🌄🙏🙏

వర్క్‌హాలిక్‌గా ఉండటం

 *🙏జై శ్రీమన్నారాయణ 🙏*

27.05.2024, సోమవారం



వర్క్‌హాలిక్‌గా ఉండటం ఎందుకు ప్రమాదకరం?

వృత్తివిషయంలో నిబద్ధత కనబరచడం. కష్టపడి పనిచేయడం మంచి లక్షణమే. అయినప్పటికీ అది మోతాదును మించకూడదు. ఎందుకంటే ఇది వారి వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా ఇతరుల వ్యక్తిగత జీవితానికి హాని చేస్తుంది. అది కొన్నిసార్లు తీవ్రమైన పరిణామాలకు దారితీయవచ్చు. వర్క్‌హాలిక్‌గా ఉండటం వల్ల మీ సంబంధాలు తెగిపోవచ్చు. అలాగే మానసికంగా, శారీరకంగా వ్యక్తులను కుంగదీస్తుంది. ఆందోళన, అసంతృప్తి, ఇతర అనారోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఒత్తిడితో కూడుకున్న పని నిర్వహిస్తున్నప్పుడు అది ఉత్తమమైన ఫలితాలను ఇవ్వదు. దీనివల్ల మొదటికే మోసం వస్తుంది. కష్టపడి పనిచేసినా ఫలితాలు రానప్పుడు అది నిరాశను కలిగిస్తుంది. ఈ రకంగా ఇటు వృత్తిపరంగా, అటు వ్యక్తిగతంగా రెండు వైపులా నష్టం వాటిల్లుతుంది.

మానవుడు పాప కార్యములను వదలనే వదలడు*.

 *శ్రీ ఆదిశంకరాచార్య విరచిత మోహముద్గరం పూర్తిగా...*



*మోహముద్గరమ్*

(శ్రీ ఆదిశంకరకృతం)


శ్లో𝕝𝕝 

*భజగోవిందం భజగోవిందం*

*గోవిందం భజ మూఢమతే*

*సంప్రాప్తే సన్నిహితే కాలే*

*నహి నహి రక్షతి డుకృణ్ కరణే* ॥1॥


భావం: 

గోవిందుడిని భజించుము గోవిందుడిని భజించుము. ఓ మూఢుడా! గోవిందుడినే భజించు. మరణసమయం ఆసన్నమైనప్పుడు ఈ (డుకృణ్ కరణే లాంటి ) వ్యాకరణ  సూత్రాలు నిన్ను రక్షించవు గాక రక్షించవు.   


శ్లో𝕝𝕝

*మూఢ జహీహి ధనాగమతృష్ణా*

*కురు సద్బుద్ధిం మనసి వితృష్ణా*

*యల్లభసే నిజకర్మోపాత్తం*

*విత్తం  తేన వినోదయ చిత్తం* ॥2॥


భావం:

ఓ మూర్ఖుడా! ధనసంపాదన యందు ఆశను విడిచిపెట్టుము. మనసులో ఆశలు పెంచుకోకుండా మంచి ఆలోచనలు కలిగి ఉండుము. నీ కర్తవ్య కర్మల ద్వారా లభించిన ధనముతో సంతోషంగా ఉండుము.  


శ్లో𝕝𝕝   

*నారీస్తనభర నాభీదేశం*

*దృష్ట్వా  మాగా మోహావేశం*

*ఏతన్మాంస వసాది వికారం*

*మనసి విచంతయ వారం వారం* ॥3॥


భావం: 

స్త్రీల వక్షోజ సౌందర్యాన్ని చూచి మోహావేశం చెందవద్దు. అవి నిజంగా మాంసం, కొవ్వు మొదలైన వానితో కూడినవి. ఈ విషయమును నీ మనస్సులో మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉండుము. 


శ్లో𝕝𝕝   

*నళినీ దలగత జలమతి తరలం*

*తద్వజ్జీవితమతిశయచపలం*  

*విద్ధి వ్యాద్యభిమానగ్రస్తం* 

*లోకం శోకహతం చ సమస్తం* ॥4॥


భావం: 

తామరాకు మీద నీటిబొట్టు ఎంత చంచలమైనదో ఈ మానవ జీవితం కూడా అంత అస్థిరమైనది, అల్పమైనది. అంతేకాదు ఈ  మానవ జీవితం అంతా రోగాలతోనూ 'నాది' అన్న మమకారంతోనూ కూడుకున్నట్టిదై సమస్త దుఃఖాలకు ఆలవాలమైందని తెలుసుకొనుము. 



శ్లో𝕝𝕝   

*యావద్విత్తోపార్జన సక్తః*

*తావన్నిజ పరివారో రక్తః*

*పశ్చాజీవతి జర్జర దేహే*

*వార్తాం కోపి న పృచ్ఛతి గేహే* ॥5॥


భావం:

ధధసంపాదన చేసినంత వరకే పరివారమంతా ప్రేమగా ఉంటారు. దేహం కాస్త సడలిపోయి, ఏ పని చేయగల శక్తి లేనివారైతే ఇక ఇంటిలో ఎవరూ పట్టించుకోరు. కుశల ప్రశ్నలు కూడా వేయరు.



శ్లో𝕝𝕝 

*యావత్పవనో నివసతి దేహే*

*తావత్పృచ్చతి కుశలం గేహే*

*గతవతి వాయౌ దేహాపాయే*

*భార్యా బిభ్యతి తస్మిన్కాయే* ॥6॥


భావం: 

ఎంతవరకైతే ఈ దేహం లో ప్రాణం ఉంటుందో  అంతవరకే ఇంట్లోనివారు క్షేమాన్ని అడుగుతారు. శరీరానికి అపాయం కలిగి ప్రాణం పోతే ఆ  చూసి భార్య కూడా భయపడుతుంది. 



శ్లో𝕝𝕝  

*బాలాస్తావత్ క్రీడాసక్తః*

*తరుణస్తావ త్తరుణీసక్తః*

*వృద్ధాస్తావ చ్చింతాసక్తః*

*పరే బ్రహ్మణి కోఽపి న సక్తః* ॥7॥


భావం: 

మానవుడు - బాలుడుగా ఉన్నప్పుడు ఆటపాటల మీద ఆసక్తి కలిగి ఉంటాడు, యౌవనం లో స్త్రీల  పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు, వృద్ధాప్యంలో చింతలతో సతమతం అవుతుంటాడు. కానీ ఆ పరమాత్మ యందు ఆసక్తిని చూపే వారెవరూ లేరు కదా!!!


శ్లో𝕝𝕝  

*కాతే కాంతా కస్తే పుత్రః*

*సంసారోఽయమతీవ విచిత్రః*

*కస్య త్వం కః కుత ఆయాతః*

*తత్వం చింతయ తదిహ భ్రాతః* ॥8॥


భావం:

నీ భార్య ఎవరు? నీ కుమారుడు ఎవరు? ఈ సంసారం చాలా విచిత్రమైనది. నీవు ఎవరు? ఎవరికి చెందినవాడవు? ఎక్కడ నుంచి వచ్చావు? ఓ సోదరా! ఆ తత్వాన్ని ఇక్కడే - ఈ దేహం లో ఉండగానే ఆలోచన చేయుము.


శ్లో𝕝𝕝  

*సత్సంగత్వే నిస్సంగత్వం*

*నిస్సంగత్వే నిర్మోహత్వం*

*నిర్మోహత్వే నిశ్చలతత్వం*

*నిశ్చలతత్వే జీవన్ముక్తిః* ॥9॥


భావం: 

సత్పురుషులతో సాంగత్యం  చేయడం వల్ల  ఈ ప్రాపంచిక విషయాల మీద సంగభావం తొలగిపోతుంది. దానివల్ల క్రమంగా మనలో ఉన్న భ్రమ లేదా మోహం తొలగిపోతుంది. మోహం పోతే మనసు భగవంతుడి మీద చలించకుండా నిలిచిపోతుంది. అప్పుడు సకల కర్మ బంధనాల నుంచి విముక్తి లభిస్తుంది. జీవించి ఉండగానే ముక్తి లభిస్తుంది. అదే మోక్షం, జీవన్ముక్తి.


శ్లో𝕝𝕝  

*వయసి గతే కః కామవికారః*

*శుష్కే నీరే కః కాసారః*

*క్షీణే విత్తే కః పరివారః*

*జ్ఞాతే తత్వే కః సంసారః* ॥10॥


భావం: వయస్సు మళ్ళిపోతే కామవికారాలుండవు.  నీరంతా ఇంకిపోయిన తర్వాత సరస్సు ఉండదు. డబ్బు పోయిన తర్వాత పరిచారకులు ఉండరు. *అలాగే ఆత్మజ్ఞానం తెలిసి అజ్ఞానం తొలగిపోతే ఇక ఈ జనన మరణ రూప సంసారం అనేది ఉండదు*



శ్లో𝕝𝕝 

*మా కురు ధన జన యౌవన గర్వం*

*హరతి నిమేషత్కాలః సర్వం*

*మాయామయ మిదమఖిలం హిత్వా*

*బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా* ॥11॥


భావం: ధనమున్నదని, అనుచరగణం ఉన్నదని, యౌవనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం ఒక్క నిముషంలో హరించిపోతుంది. ఈ ప్రపంచమంతా భ్రమతో కూడుకున్నది, మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో. ఆత్మానుభూతిని చెందు.



శ్లో𝕝𝕝  

*దినయామిన్యౌ సాయం ప్రాతః*

*శిశిరవసంతం పునరాయాతః* 

*కాలః క్రీడతి గచ్ఛత్యాయుః*

*తదపి న ముంచత్యాశాపాశః*  ॥12॥


భావం: రాత్రింబవళ్ళు, ఉదయం సాయంత్రాలు, శిశిర వసంతాలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి; పోతుంటాయి. కాలచక్రం అలా ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయుష్కాలం కూడా అలాగే వెళ్లిపోతుంటుంది. అయినప్పటికీ *మానవుని ఆశ మాత్రం వదలటంలేదు*.


శ్లో𝕝𝕝

*కాతే కాంతా ధనగతచింతా*

*వాతుల కిం తవ నాస్తి నియంతా*

*త్రిజగతి సజ్జనసంగతి రేకా*

*భవతి భవార్ణవతరణే* ॥13॥


భావం: ఓరి వెఱ్ఱివాడా! ఎందుకు నీ భార్య గురించి, ధన సంబంధ విషయాల గురించి ఆలోచిస్తావు? అన్నిటిని, అందరిని నియమించే సర్వజ్ఞుడైన ప్రభువు లేడనుకున్నావా? *ఈ ముల్లోకాలలో చావు పుట్టుకలనే భవసాగరాన్ని దాటడానికి సజ్జన సాంగత్యమే సరైన నౌక*



శ్లో𝕝𝕝

*ద్వాదశమంజరికాభిరశేషః*

*కథితో వైయాకరణస్యైషః*

*ఉపదేశో భూద్విద్యానిపుణైః*

*శ్రీమచ్ఛన్కరభగవచ్ఛరణైః* ॥14॥ 


భావం: ఈ పన్నెండు (2-13) శ్లోకాలు శ్రీ శంకర భగవత్పాదులవారు ఒక వ్యాకరణకర్తకి ఉపదేశంగా ప్రసాదించారు.


శ్లో𝕝𝕝

*జటిలో ముండీ లుంఛితకేశః*

*కాషాయాంబరబహుకృతవేషః*

*పశ్యన్నపి చన పశ్యతి మూఢ*

*హ్యుదరనిమిత్తం బహుకృతవేషః* ॥15॥


భావం: జడలు కట్టుకొని, గుండు గీయించుకొని, జుట్టు పీకివేసుకొని, కాషాయ వస్త్రాలు ధరించి  వేషాలు వేస్తుంటారు. ఈ వేషాలన్నీ పొట్టకూటికోసమే గాని, వీరు కళ్ళతో చూస్తూ కూడా సత్యాన్ని దర్శించలేని మూర్ఖులు.



శ్లో𝕝𝕝

*అగ్రే వహ్నిః పృష్ఠేభానూ*

*రాత్రౌ చుబుకసమర్పితజానుః*

*కరతలభిక్షస్తరుతలవాసః*

*తదపి న ముంచత్యాశాపాశః* ॥16॥


భావం: ఎదురుగా చలిమంట పెట్టుకొని,  వీపుపై సూర్యుని కిరణాలు పడేలా కూర్చొని, రాత్రిళ్ళు మోకాళ్ళకి గడ్డాన్ని ఆనించుకుని కూర్చుంటాడు; తిండి తినడానికి రెండు చేతులూ దొప్పలుగా చేసుకొని అందులో తింటాడు. చెట్టు నీడన ఉంటాడు. ఐనా ఆశలు మాత్రం వదలడు.


శ్లో𝕝𝕝

*కురుతే గంగాసాగరగమనం*

*వ్రత పరిపాలన మథవా దానం* ౹

*జ్ఞానవిహీనః సర్వమతేన*

*ముక్తిం న భజతి జన్మశతేన* ॥17॥


భావం: తీర్థయాత్రలు చేయవచ్చు; పూజలు, నోములు, వ్రతాలు చేయవచ్చు; దానధర్మాలు చేయవచ్చు. కాని *ఆత్మజ్ఞానము పొందనివాడు నూఱు జన్మలెత్తినా సరే ముక్తిని పొందలేడని సర్వమతములు చెబుతున్నాయి.*



శ్లో𝕝𝕝 

*సుర మందిర తరు మూలనివాసః*

*శయ్యా భూతలమజినం వాసః౹*

*సర్వ పరిగ్రహ భోగ త్యాగః*

*కస్యసుఖం న కరోతి విరాగః* ॥18॥


భావం: దేవాలయాల్లోనూ, చెట్ల మొదళ్ళలోనూ నివసిస్తూ; కటిక నేల మీద నిద్రిస్తూ; చర్మాన్ని వస్త్రంగా ధరిస్తూ; దేనినీ గ్రహించకుండా - *ఏమీ కావాలని కోరుకోకుండా అన్ని భోగాలను విడిచిపెట్టిన ఏ విరాగికి సుఖం లభించదు*? 'తప్పక లభిస్తుంది'.



శ్లో𝕝𝕝 

*యోగరతో వా భోగరతో వా*

*సంగరతో వా సంగవిహీనః* ౹

*యస్య బ్రహ్మణి రమతే చిత్తం*

*నందతి నందతి నందత్యేవ* ॥19॥


భావం: ఒకడు యోగిగా జీవించవచ్చు, భోగిగా జీవించవచ్చు; ఈ ప్రపంచంలో అందరితో కలసి మెలసి జీవించవచ్చు లేదా ఒంటరిగా అందరికీ దూరంగా జీవించవచ్చు. కాని ఎవరైతే తమ మనసును బ్రహ్మతత్వమునందే నిలిపి తమను తాము బ్రహ్మగా భావిస్తూ ఉంటారో అట్టివారే ఆనందిస్తారు. ముమ్మాటికీ అట్టివారికే ఆనందం.


శ్లో𝕝𝕝 

*భగవద్గీతా కించిదధీతా*

*గంగా జలలవ కణికాపీతా* ౹

*సకృదపి యేన మురారి సమర్చా*

*క్రియతే తస్య యమేవ న చర్చ* ॥20॥


భావం: ఎవరైతే భగవద్గీతని కొంచెమైనా అధ్యయనం చేస్తారో, గంగా జలాన్ని కొద్దిగా ఐనా త్రాగుతారో, కొంచమైనా శ్రీకృష్ణుని పూజిస్తారో అట్టివారికి యమునితో వివాదం ఉండదు.


శ్లో𝕝𝕝 

*రథ్యా కర్పట విరచిత కంథః*

*పుణ్యాపుణ్య వివర్జిత పంథః* ౹

*యోగి యోగనియోజిత చిత్తో*

*రమతే బాలోన్మత్తవదేవ* ॥21॥


భావం: దారిలో దొరికే గుడ్డ పీలికలతో తయారైన గోచిని ధరించిన వాడై, ఇది పుణ్యమని, అది పాపమని ఏ మాత్రం ఆలోచించక, *నిరంతరం మనసుని యోగమునందే నిలిపిన యోగిపుంగవుడు ఈ లోకంలో బాలునిలాగ, పిచ్చివానిగా ప్రవర్తిస్తూ ఉంటాడు.*



శ్లో𝕝𝕝 

*కస్త్వం కోహం కుత ఆయాతః*

*కా మే జననీ కో మే తాతః*౹ 

*ఇతి పరభావయ సర్వమసారం*

*విశ్వం త్యక్త్వా స్వప్న విచారం* ॥22॥


భావం: నీవెవరు? నేనెవరు? ఎక్కడ నుండి వచ్చాను? నా తల్లి ఎవరు? నా తండ్రి ఎవరు? ఇదీ నువ్వు విచారణ చెయ్యవలసినది. *ఈ ప్రపంచం అంతా సారహీనమైనది; కేవలం కలలో కనిపించు దృశ్యం లాంటిదే అని దీనిని తెలుసుకొని విడిచిపెట్టుము*.


శ్లో𝕝𝕝 

*త్వయి మయి చాన్యత్రైకో విష్ణుః*

*వ్యర్థం కుప్యసి మయ్యసహిష్ణుః* ౹

*భవ సమచిత్తః  సర్వత్ర త్వం*

*వాంఛస్యచిరాద్యది విష్ణుత్వం* ॥23॥


భావం: *నీలోను, నాలోను, ఇతరులలోను ఉన్నది ఏకమైన సర్వవ్యాపక చైతన్యమే*. సహనం లేనివాడివి కనుక నాపై కోపగించుకుంటున్నావు. నీవు బ్రహ్మత్వం (మోక్షం) ను పొందగోరితివా! అంతటా - అన్నివేళలా సమబుద్ధిని కలిగి ఉండుము.


శ్లో𝕝𝕝 

*శత్రౌ మిత్రే పుత్రే బంధవ్*

*మా కురు యత్నం విగ్రహ సంధవ్* ౹

*సర్వస్మిన్నపి పశ్యాత్మానం*

*సర్వత్రోత్సృజ భేదాజ్ఞానం* ॥24॥


భావం: శత్రువు గాని, మిత్రుడు గాని, పుత్రుడు గాని,  బంధువు గాని - వీరిపట్ల శత్రుత్వమో, స్నేహమో చేసే యత్నం మానుకో. అందరిలోను ఆత్మను చూస్తూ, భేదభావాన్ని అన్ని సందర్భాలలోనూ విడిచిపెట్టుము.


శ్లో𝕝𝕝

*కామం క్రోధం లోభం మోహం*

*త్యక్త్వా త్మానం భావయ కోహం* 

*ఆత్మజ్ఞాన విహీనా మూడాః*

*తే పచ్యంతే నరకనిగూడః* ॥25॥


భావం: కోరిక, కోపం, లోభం, భ్రాంతి - వీటన్నిటిని విడిచిపెట్టిన సాధకుడు "ఆ పరమాత్మను నేనే " అనే సత్యాన్ని దర్శిస్తాడు. ఆత్మజ్ఞానం లేనివారు మూఢులు. అట్టివారు ఈ సంసార జనన మరణ చక్రం అనే నరకంలో బంధింపబడి హింసించబడతారు.


శ్లో𝕝𝕝 

*గేయం గీతా నామ సహస్రం*

*ధ్యేయం శ్రీపతి రూపమజస్రం* ౹

*నేయం సజ్జన సంగే చిత్తం*

*దేయం దీనజనాయ చ విత్తం* ॥26॥


భావం: భగవద్గీత, విష్ణు సహస్రనామాలను గానం చెయ్యాలి. ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యానించాలి. *సజ్జన సాంగత్యంలో మనసుని నడపాలి. దీనులైన వారికి ధనాన్ని దానం చెయ్యాలి.


శ్లో𝕝𝕝

*సుఖతః క్రియతే రామాభోగః*

*పశ్చాద్ధంత శరీరే రోగః* ౹

*యద్యపిలోకే మరణం శరణం*

*తదపి నముంచతి పాపాచరణం* ॥27॥


భావం: సుఖాన్ని పొందాలని స్త్రీ పురుషులు రతి కార్యంలో నిమగ్నమవుతారు. దాని కారణంగా శరీరం రోగాలపాలవుతుంది. చివరికి మరణం అనేది ఎవరికి తప్పదు. ఐనా సరే *మానవుడు పాప కార్యములను వదలనే వదలడు*.


శ్లో𝕝𝕝 

*అర్థమనర్థం భావయ నిత్యం*

*నాస్తితతః సుఖలేశః సత్యం* ౹

*పుత్రాదపి ధన భాజాం భీతిః*

*సర్వత్రైషా విహితా రీతిః* ॥28॥


భావం: డబ్బు దుఃఖాన్ని ఇస్తుందని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకో. దాని వల్ల కొంచం సుఖం కూడా లేదు అనే మాట సత్యం. *ధనవంతునికి తన కుమారుని వల్ల కూడా భయమే. అన్ని చోట్ల డబ్బు యొక్క పద్ధతి ఇంతే*.


శ్లో𝕝𝕝 

*ప్రాణాయామం ప్రత్యాహారం*

*నిత్యానిత్య వివేకవిచారం* ౹

*జాప్యసమేత సమాధివిధానం*

*కుర్వవధానం మహదవధానం* ॥29॥


భావం: క్రమపద్ధతిలో శ్వాసను నియమించడం, విషయాల నుండి మనసుని వెనక్కి మళ్లించడం, నిత్య వస్తువేదో, అనిత్య వస్తువేదో నిరంతరం బుద్ధితో విచారించడం, జపంతో కూడుకున్న ధ్యాననిష్ఠను సాగించి సర్వ సంకల్పాలను విడిచిపెట్టడం అనే సాధనలను ఎంతో జాగ్రత్తగా అనుష్ఠించుము.


శ్లో𝕝𝕝

*గురుచరణాంబుజ నిర్భర భక్తః*

*సంసారాదచిరార్భవ ముక్తః*

*సేంద్రియమానస నియమాదేవం*

*ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం* ॥30॥


భావం: గురుచరణ కమలములనే సర్వస్వంగా భావించిన ఓ భక్తుడా! నీ ఇంద్రియాలను, మనసుని నిగ్రహించడం ద్వారా మాత్రమే ఈ *చావు పుట్టుకులతో కూడిన సంసార సాగరం నుండి ముక్తుడవై, నీ హృదయంలోనే ఉన్న పరమాత్మ సాక్షాత్కారం పొందెదవు గాక*!


శ్లో𝕝𝕝


*మూఢః కశ్చన వైయాకరణో*

*డుకృఞ్ కరణాధ్యయన ధురీణః*

*శ్రీమచ్ఛఞ్కర భగవచ్ఛిష్యైః*

*బోధిత ఆసీచ్ఛోధితకరణః* ॥31॥


భావం: వ్యాకరణసూత్రములను మూఢత్వంతో అధ్యయనము చేయుటలో మునిగి ఉన్న వ్యక్తి శ్రీ ఆదిశఙ్కరుల వారి శిష్యులు చేసిన జ్ఞానబోధచేత అంతఃకరణ శుద్ధి చేయబడినాడు. 


శ్లో𝕝𝕝

*భజగోవిందం భజగోవిందం*

*గోవిందం భజ మూఢమతే*

*నామస్మరణాదన్యముపాయం*

*నహి పశ్యామో భవతరణే* ॥32॥ 


భావం: భజించు గోవిందుని! భజించు గోవిందుని! ఓ మూఢుడా  గోవిందుడినే భజించు. సంసార సాగరాన్ని దాటడానికి గోవింద నామస్మరణకి మించినది లేదు.


|| ఇతి భజగోవిందం సంపూర్ణం ||

వైశాఖ పురాణం - 19.*

 *వైశాఖ పురాణం - 19.*


*19వ అధ్యాయము - విష్ణువు యముని ఊరడించుట*


నారదుడు అంబరీషునితో పలుకుచున్నాడు. శ్రుతదేవుడు శ్రుతకీర్తితో నిట్లనెను.


యముని మాటలను విని బ్రహ్మ యిట్లనెను. ఓయీ! నీవెందులకు విచారింతువు. నీవు చూచినదానిలో నాశ్చర్యమేమున్నది? సజ్జనులకు బాధను కలిగించినచో దాని వలని ఫలము జీవితాంతముండును. శ్రీహరి నామమునుచ్చరించినంతనే విష్ణులోకమును చేరుదురు. రాజాజ్ఞచే వైశాఖవ్రతమును చేసి శ్రీహరి లోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది? గోవిందనామము నొక్కసారి పలికినను నూరు అశ్వమేధ యాగముల అనంతరము అవబృధస్నానము చేసిన వచ్చునంత పుణ్యము కల్గును. ఎన్ని యజ్ఞములను చేసినవారైనను పుణ్యఫలముల ననుభవించి మరల జన్మింపక తప్పదు కాని శ్రీహరికి నమస్కరించినచో పునర్జన్మ వుండదు. శ్రీహరి నామము నుచ్చరించినవారు కురుక్షేత్రమునకు పోనక్కరలేదు. సరస్వతి మున్నగు తీర్థముల యందు మునగనక్కరలేదు. చేయరాని పనులను చేసిన వారైనను యెంత పాపము చేసినను మరణకాలమున విష్ణువును స్మరించినచో శ్రీహరి పదమును చేరుదురు. తినరానిదానిని తిన్నవారును శ్రీహరిని స్మరించినచో పాపములను పోగొట్టుకొని విష్ణు సాయుజ్యమునందుదురు. ఇట్టి శ్రీమహా విష్ణువునకిష్టమైనది వైశాఖమాసము. వైశాఖ ధర్మములను విన్నచో సర్వపాపములును హరించును. విష్ణుప్రియమగు వైశాఖ వ్రతము నాచరించినవారు శ్రీహరి పదమును చేరుటలో నాశ్చర్యమేమున్నది? మనలందరిని సృష్టించి సర్వ జగన్నాధుడు శ్రీమహా విష్ణువు. అట్టివానిని సేవించినవారు విష్ణులోకమును చేరుటలో నాశ్చర్యమేమున్నది? కీర్తిమంతుడు శ్రీహరి భక్తుడు. శ్రీహరికిష్టమైన వైశాఖమాస వ్రతమును చేసిన వారియందు శ్రీహరి ప్రీతుడై వారికి సాయపడుట సహజమే కదా! యమధర్మరాజా! శ్రీహరి భక్తుడగు ఆ రాజును శిక్షింపగల శక్తి నాకు లేదు. శ్రీహరి భక్తులకెప్పుడును అశుభముండదు కదా! జన్మమృత్యు జరావ్యాధి భయము కూడ నుండదు. యజమాని చెప్పిన పనిని అధికారి శక్తికొలది ఆచరింప యత్నించినచో నతడు పనిని పూర్తిచేయకపోయినను నరకమునకు పోడు. తన శక్తికి మించినచో ఆ విషయమును యజమానికి నివేదించిన అధికారి/సేవకుడు పాపమునందడు. వానికెట్టి దోషమును లేదు. యజమాని చెప్పిన పని శక్తికి మించినప్పుడు అది వాని దోషము కాదు. అని బ్రహ్మ యముని బహువిధములుగ ఊరడించెను.


అప్పుడు యముడు బ్రహ్మమాటలను విని స్వామీ! నీ యాజ్ఞను పాటించి నేను కృతార్థుడనైతిని. అన్నిటిని పొందితిని. ఇది చాలును. నేను మరల నా పూర్వపు ఉద్యోగములోనికి వెళ్లజాలను. కీర్తిమంతుడిట్లు పరాక్రమముతో వైశాఖవ్రతములతో భూమిని పాలించుచుండగా నేను నాయధికారమును వహింపను. ఆ రాజు వైశాఖ వ్రతమును మానునట్లు చేయగలిగినచో నేను తండ్రికి గయాశ్రాద్దము చేసిన పుత్రునివలె సంతృప్తి పడుదును. కృపాకరా! నాయీ కోరిక తీరునట్టి యుపాయమును చెప్పుము. అప్పుడు నేను మరల నా కర్తవ్యమును నిర్వహింపబోదును అని ప్రార్థించెను.


అప్పుడు బ్రహ్మ యమధర్మరాజా! విష్ణుభక్తుడగు అతనితో నీవు విరోధపడుట మంచిది కాదు. నీకు కీర్తిమంతునిపై కోపమున్నచో మనము శ్రీహరి వద్దకు పోవుదము. జరిగినదంతయు శ్రీమన్నారాయణునకు చెప్పి ఆయన చెప్పినట్లు చెయుదము. సర్వలోకములకు కర్తయగు ఆ శ్రీమన్నారాయణుడే. ధర్మపరిపాలకుడు. మనలను శిక్షించు దండధరుడు మనల నాజ్ఞాపించు నియామకుడు. శ్రీహరిమాటలకు మనము బదులు చెప్పదగినది యుండదు. కీర్తిమంతుడును శ్రీహరి భక్తుడగుటచే అతనికిని బదులు చెప్పజాలము. మనము శ్రీహరి యెద్దకే పోవుదుమని యమధర్మరాజును వెంట నిడుకొని క్షీరసముద్రము కడకరిగెను. జ్ఞానస్వరూపుడు నిర్గుణుడును సాంఖ్యయోగములతో కూడినవాడును పురుషోత్తముడునగు శ్రీహరిని స్తుతించెను. అప్పుడు శ్రీహరి వారికి ప్రత్యక్షమయ్యెను. బ్రహ్మ, యమధర్మరాజు యిద్దరును శ్రీహరికి నమస్కరించిరి.


శ్రీహరియు వారిద్దరిని జూచి "మీరిద్దరు నెందులకిచటకు వచ్చితిరి. రాక్షసుల వలన బాధ కలిగినదా? యముని ముఖము వాడియున్నదేమి? అతడు శిరము వంచుకొని యేల నుండెను? బ్రహ్మ! యీ విషయమును చెప్పుమని" యడిగెను.


అప్పుడు బ్రహ్మ మీ భక్తుడగు కీర్తిమంతుని పరిపాలనలో ప్రజలందరును వైశాఖ వ్రతమును పాటించి విషులోకమును చేరుచున్నారు. అందువలన యమలోకము శూన్యమై యున్నది. అందుచే నితడు దుఃఖపడుచున్నాడు. ఆ దుఃఖము నాపుకొనలేక కర్తవ్యపరాయణుడగు యముడు కీర్తిమంతునిపైకి దండెత్తి వెళ్ళెను. తుదకు యమదండమును గూడ ప్రయోగించెను. కీర్తిమంతుని రక్షించుటకై వచ్చిన మీ చక్రముచే పరాభూతుడై యేమి చేయవలయునో తెలియక నా యొద్దకు వచ్చెను. నేనును యేమి చేయుదును. స్వామీ నీ భక్తులను శిక్షించుటకు మేము చాలము. అందువలన మేము నీ శరణు గోరి వచ్చితిమి. దయయుంచి నీ భక్తుని శిక్షించి ఆత్మీయుడైన యముని కాపాడుమని బ్రహ్మ పలికెను. శ్రీమహావిష్ణువు ఆ మాటలను విని నవ్వి యముని, బ్రహ్మను జూచి యిట్లనెను. నేను లక్ష్మీదేవినైనను, నా ప్రాణములను, దేహమును, శ్రీవత్సమును, కౌస్తుభమును, వైజయంతీమాలను, శ్వేతద్వీపమును, వైకుంఠమును, క్షీరసాగరమును, శేషుని, గరుత్మంతుని దేనినైనను విడిచెదను గాని నా భక్తుని మాత్రము విడువను. సమస్త భోగములను, జీవితములను విడిచి నాయందే ఆధారపడియున్న యుత్తమ భక్తునెట్లు విడిచెదను?


యమధర్మరాజా! నీ దుఃఖము పోవుటకొక యుపాయమును కల్పింపగలను. నేను కీర్తిమంతుమహారాజునకు సంతుష్టుడనై పదివేల సంవత్సరముల ఆయుర్దాయము నిచ్చితిని. ఇప్పటికెనిమిదివేల సంవత్సరములు గడచినవి. ఆ తరువాత వేనుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టములైన వేదోక్తములగు సదాచారములను నశింపజేయును. పెక్కు దురాచారములను ఆచరణలో నుంచును. అప్పుడు వైశాఖమాస ధర్మములును ఆచరించువారు లేక లోపించును. ఆ వేనుడును తాను చేసిన పాప బలమున నశించును. అటుపిమ్మట నేను పృధువను పేరున జన్మించి ధర్మసంస్థాపన చేయుదును. అప్పుడు మరల వైశాఖ ధర్మములను లోకమున ప్రవర్తింప జేయగలను. అప్పుడు నాకు భక్తుడైనవాడు నన్నే ప్రాణములకంటె మిన్నగా నమ్మి వ్యామోహమును విడిచి వైశాఖధర్మములను తప్పక పాటించును. కాని అట్టివాడు వేయిమందిలో నొకండుండును. అనంత సంఖ్యలోను జనులలో కొలదిమంది మాత్రమే నాయీ వైశాఖధర్మముల నెరిగి పాటింతురు. మిగిలిన వారు అట్లుగాక కామవివశులై యుందురు. యమధర్మరాజా! అప్పుడు నీకు వలసి నంతపని యుండును. విచారపడకుము. వైశాఖమాస వ్రతమునందును నీకు భాగము నిప్పింతును. వైశాఖవ్రతము నాచరించువారందరును నీకు భాగము నిచ్చునట్లు చేయుదును. యుద్దములో నిన్ను గెలిచి నీకీయవలసిన భాగమును రాకుండ జేసిన కీర్తిమంతుని నుండియు నీకు భాగము వచ్చునట్లు చేయుదును. నీకురావలసిన భాగము కొంతయైన వచ్చినచో నీకును విచారముండదు కదా! (ఇచట గమనింపవలసిన విషయమిది. కీర్తిమంతుడు యముని ఓడించి భాగమును గ్రహించుట యేమని సందేహము రావచ్చును. వైశాఖవ్రతము చేసిన పాపాత్ములు నరకమునకు పోకుండ విష్ణులోకమునకు పోవుటయనగా నరకమునకు పోవలసినవారు యముని భాగము కాని వారు యముని భాగము కాకుండ విష్ణులోకమునకు పోవుచున్నారు. ఇందులకు కారణమెవరు? రాజైన కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు ఇతడు శాసనము చేసి బలవంతముగా ప్రజలందరిని వైశాఖ ధర్మము నాచరించు వారినిగా చేసెను. కావున యముని భాగమును కీర్తిమంతుడు గెలుచుకొనుటయనగా ఇప్పుడు శ్రీహరి వైశాఖ ధర్మమునాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ ధర్మము నాచరించువారు యమునికి గూడ భాగమునిచ్చునట్లు చేయుదును. అనగా వైశాఖ వ్రతము నాచరించు కీర్తిమంతుడును యమునకు తానును భాగము నిచ్చునట్లు చేయును. ఇందువలన యమధర్మరాజు మనస్సున కూరట కలుగునని శ్రీహరి యభిప్రాయము) వైశాఖ వ్రతము నాచరించువారు ప్రతిదినమునను స్నానము చేసి నీకు అర్ఘ్యము నిత్తురు. వైశాఖవ్రతము చివరినాడు జలపూర్ణమైన కలశమును, పెరుగన్నమును నీకు సమర్పింతురు. అట్లు చేయని వైశాఖ కర్మలన్నియు వ్యర్థములగును. అనగా వైశాఖ వ్రతమాచరించువారు ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యము నీయవలయును మరియు వ్రతాంతమున జలపూర్ణమైన కలశమును, పెరుగన్నమును యమునకు నివేదింపవలయును. యముని పేరుతో దానమీయవలయును. అట్లు చేయనివారి పూజాదికర్మలు వ్యర్థములగునని భావము.


కావున యమధర్మరాజా! నీకు యీ విధముగా భాగము నిచ్చు కీర్తిమంతునిపై కోపమును విడుపుము. ప్రతిదినము స్నానమున అర్ఘ్యమును చివరి దినమున జలపూర్ణ కలశమును, పెరుగన్నమును భాగముగ గ్రహింపుము. ఇట్లు చేయనివారి వైశాఖకర్మలు వ్యర్థమై వారు చేసిన పుణ్యపాపముల ననుసరించి నీ లోకమున నుందురు. ధర్మాధర్మముల నిర్ణయించు నిన్ను విడిచి నన్ను మాత్రమే సేవించు నా భక్తులను నాయాజ్ఞానుసారము శిక్షింపుము. వైశాఖవ్రతమున నీకు అర్ఘ్యమునీయనివారిని విఘ్నములు కలిగించి శిక్షింపుము. కీర్తిమంతుడును నీకు భాగమునిచ్చునట్లు సునందుని వాని కడకు పంపుదును. సునందుడును నామాటగా కీర్తిమంతునకు చెప్పి నీకు భాగము నిప్పించును. అని పలికి శ్రీహరి యమధర్మరాజు అచట నుండగనే సునందుని కీర్తిమంతుని కడకు పంపెను. సునందుడును కీర్తిమంతునకు శ్రీహరి సందేశమును చెప్పి కీర్తిమంతుని అంగీకారమును గొని శ్రీహరి కడకు వచ్చి యా విషయమును చెప్పెను.


శ్రీహరి యీ విధముగ యమధర్మరాజు నూరడించి యంతర్ధానము నందెను. బ్రహ్మయును యమునకు చెప్పవలసిన మాటలను చెప్పి జరిగినదానికి విస్మయపడుచు తన వారితో గలసి తన లోకమునకు పోయెను. యముడును కొద్దిపాటి సంతోషముతో తన నగరమునకు తిరిగి వెళ్ళెను. శ్రీమహావిష్ణువు పంపిన సునందుని మాటను పాటించి కీర్తిమంతుడు, వాని యేలుబడిలోని ప్రజలు అందరును వైశాఖవ్రతము నాచరించుచు యమధర్మరాజునకు ప్రతిదిన స్నానసమయమున అర్ఘ్యమును, వ్రతాంతమున జలకలశమును దధ్యన్నమును సమర్పించుచుండిరి. ధర్మరాజునకెవరైన అర్ఘ్యము మున్నగు వాని నీయనిచో యమధర్మరాజు వారి వైశాఖవ్రత ఫలమును గ్రహించును.


కావున వైశాఖవ్రతము నారంభించు ప్రతివారును ప్రతిదినము స్నానసమయమున యమునకు అర్ఘ్యమునీయవలెను. వైశాఖపూర్ణిమయందు జలకలశమును దధ్యన్నమును ముందుగా యమునకిచ్చి తరువాత శ్రీమహావిష్ణువు కర్పింపవలయును. అటు తరువాత పితృదేవతలను, గురువును పూజింపవలయును, తరువాత శ్రీమహావిష్ణువునుద్దేశించి చల్లని నీరు పెరుగు కలిపిన యన్నమును దక్షిణగల తాంబూలమును ఫలములనుంచిన కంచుపాత్రను సద్బ్రాహ్మణునకు/పేదవాడగు వానికి నీయవలయును బ్రాహ్మణుని తన శక్తికి దగినట్లుగ గౌరవించిన శ్రీహరి సంతసించి మరిన్ని వివరముల నీయగలడు. వైశాఖవ్రతము నాచరించువారిలో భక్తి పూర్ణత ముఖ్యము. వ్రతధర్మములను పాటించునప్పుడు యధాశక్తిగ నాచరించుట మరింత ముఖ్యము.


ఇట్లు వైశాఖవ్రతము నాచరించినవారు జీవించినంతకాలము అభీష్టభోగముల ననుభవించుచు పుత్రులు, పుత్రికలు, మనుమలు, మనుమరాండ్రు మున్నగువారితో సుఖముగ శుభలాభములతో నుండును. మరణించిన తరువాత సకుటుంబముగ శ్రీహరి లోకమును చేరును. కీర్తిమంతుడును యధాశక్తిగ వైశాఖవ్రతమును దానధర్మముల నాచరించి సకల భోగభాగ్యములను సర్వసంపదల ననుభవించి తనవారితో శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.


కీర్తిమంతుని తరువాత దుర్మార్గుడు నీచుడునగు వేనుడు రాజయ్యెను. అతడు సర్వధర్మములను నశింపజేసెను. వైశాఖమాస వ్రతాదులును లోపించినవి. ఇందువలన మోక్షసాధనము సర్వసులభమునగు వైశాఖధర్మము యెవరికిని దెలియని స్థితిలోనుండెను. పూర్వజన్మ పుణ్యమున్నవారికి మాత్రమే వైశాఖధర్మములయందాసక్తి నిశ్చల దీక్ష శ్రీహరిభక్తి యుండును. అట్టివారికి ముక్తి యిహలోక సుఖములు, సులభములు తప్పవు. కాని పురాకృతసుకృతమువలననే యిది సాధ్యము సుమా అని శ్రుతదేవుదు శ్రుతకీర్తికి వివరించెను. శ్రుతదేవమహామునీ! పూర్వపు మన్వంతరముననున్న వేనుడు దుర్మార్గుడనియు యిక్ష్వాకు వంశమునకు చెందిన వేనుడు మంచి వాడనియు వింటిని. మీ మాటలవలన కీర్తిమంతుని తరువాత వేనుడు రాజగునని చెప్పిరి. దీనిని వివరింపుడని యడిగెను.


శ్రుతదేవుడును రాజా! యుగములనుబట్టి, కల్పములనుబట్టి కథలు అందలి వారి స్వభావము వేరుగ చెప్పబడి యుండవచ్చును. ఆకథలును ప్రమాణములే మార్కండేయాదిమునులు చెప్పిన వేనుడొక కల్పమువాడు. నేను చెప్పిన వేనుడు మరియొక కల్పమువాడు మంచి చెడుకలవారి చరిత్రలనే మనము మంచి చెడులకు గుర్తుగా చెప్పుకొందుము. అట్లే కీర్తిమంతుని మంచితనము, గొప్పతనము తరువాత వేనుని చెడ్డతనము దుష్టత మనము గమనింపవలసిన విషయములు సుమా యని పలికెను. అని నారదుడు అంబరీషునకు వివరించెను.


వైశాఖ పురాణం 19వ అధ్యాయం సమాప్తం.

ఋగ్వేదం అధ్యయనం

 అందరికి నమస్కారం నా పేరు శ్రీదత్త ఘనపాఠి ఋగ్వేదం . ఎవరైనా బ్రాహ్మణ పిల్లలు  ఋగ్వేదం  వేరే పాఠశాల లో అధ్యయనం చేసి మధ్యలో విద్య ఆగిపోయిన విద్యార్థులకు పూర్తి గ పూర్తి చేసి పంపగలము .ఆసక్తి ఉన్నవారు కర్నూలు లో గల కంచి వారి ఆధ్వర్యం లో  ఏర్పాటు చేసిన  అఖిల బ్రాహ్మణ కరివిన సత్రం శంకరా చార్య వేద పాఠశాలలో అధ్యాపకుడిగా ఉన్నాను.విద్య , వైద్యం ఉచితంగా చక్కటి భోజన సదుపాయాలతో ఉన్నది. ఆసక్తి ఉన్నవారు .చేర్పించవచ్చు .అలాగే ఋగ్వేదం సంపూర్ణం గ నేర్పించి సర్టిఫికెట్ ఇప్పించగలను దయచేసి ఎవరైనా ఉంటె చెప్పండి 🙏8277246156 .   ఈ మెసేజ్ forword  చెయ్యండి.ఒకరైన ధర్మoవైపు నడిపించిన వాళ్ళం అవుతాము . నమశ్శివాయ🙏

దారి చూపిస్తుందో

 .         ఒక దీపం ఎలాగైతే 

      వెలుగునిచ్చి దారి చూపిస్తుందో

               ఒక మంచి ఆలోచన 

              మన జీవితానికి అలా 

                 దారి చూపిస్తుంది

              మంచి ఆలోచనలతో 

          మనసు నింపుకున్నవారు 

             ఎప్పుడూ ఆరోగ్యంగా 

           సంతోషంగా ఉంటారు.

    🌹🌟🌹🌟🌹🌟🌹

Universities

 


25 important Universities of ancient BHARAT. The first University on this Earth was in Ancient Bharta. Ancient Bharat was the centre of Knowledge, Education, Development and prosparious civilization. Our ancient Sanatani Bharat used to call “Sone ki Chidia” means The country of Golden bird. 

This is the main reason why muslim invaders ( T€rr0r!st$) and Western invaders had destroyed our all ancient universities and 40,000+ Gurukuls

తెలుగులో భాష

 *🔴 తెలుగులో ఉన్న తిరకాసు. 🔴*

*💡కరెంటు పోయి విసుగ్గా*

*బాల్కనీలో కూర్చుని ఉన్న*

*🙍‍♀️భార్య ను చూసి అప్పుడే*

*🏡ఇంటికి వచ్చిన*

*🙎‍♂️భర్త అక్కడేం చేస్తున్నావు అని అడిగాడు,*

*దానికి ఆమె,*

*"ఆలి పోయిన వాని*

*ఆలిని*

*వెతక బోయిన వాని తల్లి*

*మగని కోసం కూచున్నా అంది,*

*అర్థము కాక అయొమయంలొ ఉన్న భర్తతో భార్య*

*ఈవిధంగా చెప్పింది ఏమిటంటే*

*"ఆలి పోయిన వాడు 🏹 శ్రీరామ చంద్రుడు,🏹*

*"వెతక బోయిన వాడు*

*🐒హనుమంతుడు "అతని తల్లి అంజనాదేవి, "ఆమె మొగుడు 🪁వాయుదేవుడు అంటే గాలి కోసం,*

*బాల్కనీలో కూచున్నా అని*

*విసనకర్రతో విసురుతూ చెప్పింది*

*👌తెలుగులో ఉన్న తిరకాసు మరే భాషలోనూ లేనిదీ ఇదే ! బావుంది!*

విరాళాలు

 విరాళాలు ఇవ్వగలరు 

రోజు మన బ్లాగుని 1000 నుండి 2000 మంది ప్రేక్షకులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలనుండి చూస్తున్నారని తెలుపుటకు సంతోషిస్తున్నాము. ముఖ్యంగా అమెరికా నుంచి చూస్తున్న వారి సంఖ్య భారత దేశ వీక్షకులను మించి కొన్ని రోజులు వున్నాయి అంటే అతిశయోక్తి లేదు. బ్లాగును ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.  మీరు చూపే ఆదరణే ఈ బ్లాగు పురోగవృద్దికి పునాది. ఈ బ్లాగులో వివిధ అంశాలు మన హిందూ ధర్మానికి చెందినవి, విద్య వైజ్ఞానికమైనవి, రోజు పోస్టు చేస్తుంటే వాటిని మీరు తిలకిస్తున్నారు. ఈ బ్లాగులో సాహిత్య, సాంస్కృతిక, హిందుత్వ ముఖ్యంగా ఆధ్యాత్మికమైన విషయాలకు విశేష స్థానాన్ని కల్పిస్తున్నాము. ఈ బ్లాగును ఇంతకంటే మెరుగుగా తీర్చి దిద్దాలని కోరుకుంటున్నాము. 

 

ఈ రోజుల్లో ఏ పని చేయాలన్న ధనంతో కూడుకున్నదని  మనకు తెలుసు " ధనమ్ములం మిదం జగత్" ఏ కొత్త గాడ్జెట్ కొనాలన్నా ఎంతో ఖరీదులో ఉంటున్నాయి. మారుతున్న ప్రపంచంతో పాటు మనం కూడా మారక పొతే ఆధునికతలో వెనక పడి ఉంటాము అన్నది అక్షర సత్యం. కాబట్టి ప్రేక్షకులను కోరేది ఏమిటంటే మీరు మీకు తోచినంత విరాళాన్ని ఇచ్చి ఈ బ్లాగు అభివృద్ధికి తోడ్పడగలరు. క్రింది మొబైలు నంబరుకు జీ పే, పెటియం, లేక ఫోనుపే చేయగలరు. మీరు పంపే విరాళాలను కృతజ్ఞతతో స్వీకరించి బ్లాగు అభివృద్ధికి వినియోగించ బడును. 

+91 9848647145

తెలుగు పలుకుల తేనెలు!

 శు భో ద యం🙏


తెలుగు పలుకుల తేనెలు!


సీ:వానిముందలబొట్టు,వానిదోవతికట్టు,

వానియామెడచుట్టు,

వానిజుట్టు,/

వానిమాటలయింపు,వానివన్నెలసొంపు,

వానిచెంపలకెంపు,

వానివంపు /

వాని  మైగలతావి,వానిపిల్లనగ్రోవి,

వాని నడలఠీవి,వానిమోవి,/

వానిదౌపెనురొమ్ము,వానిచూపులయమ్ము,

వానియాకటియొమ్ము,వానిదమ్ము /

వానికే చెల్లునోచెలి,వలచితతని

వేగమేగొనిదెమ్ము,నేనాగలేను,

అతను నమ్ములు బాధించె నంచయాన!

చితికిపోదు నే విరహంపు హతికి దూలి.

-నీలిదొఱవన్నెలు-నీలకంఠ-


శ్రీకృష్ణవిలాసమనే యీచిరుకృతిని చదువుతున్నప్పుడు.మరల దక్షిణాంధ్రయుగంలోకి 

వెళ్ళామా ?అనే భ్రాంతికి లోనయ్యాను.ఇంతచక్కటి తెలుగు పలుకులమోహరింపు 

శబ్దాలంకార ప్రయోగ చాతుర్యం ఈమధ్య నేనెక్కడా చవిచూడలేదు.

తత్సమ పదప్రయోగాధిక్యంతో.తెలుగుపదాలప్రయోగం విరళమౌతున్న యీకాలంలో 

చిక్కటి తేటతెనుగుపదాలతోదేశికవితా వైభవంచవిచూపి, విందుచేశారు 

నీలకంఠంగారు.వారు మన "ముఖపుస్తక మిత్రులవటం మనభాగ్యం."

వృత్తిరీత్యావారు తెలుగు అధ్యాపకులు కాకపోయినా,ప్రవత్తిరీత్యా కవులై అపుడపుడు 

పద్యాలురచిస్తూ ఈశ్రీకృష్ణవిలాసకృతికి"-అక్షరరూపాన్ని 

సంతరించారు.శతాధికపద్యాలతో,వెలగట్టుటకు అశక్యమైన యీకృతిని వీరు 

వెలలేకుండానే అందించటం మరోవిశేషం.

శ్రీకృష్ణుని అష్ట మహిషులలో,నీలాసుందరి,మిత్రవిందాదుల పరిణయాల వర్ణనమే 

యీకృతి.చిరుకావ్యంలో అష్టవిధ శృంగారనాయికావర్ణమపురూపం!

దేశికవితకు చలువపందిరులు వేసి,కందాలతో 

మకరందాలుకురిపించి,తెలంగాణమాండలికపదాలఅందాలనువిస్తరింపజేసిన,

నీలకంఠరావుగారు ఆయురారోగ్యాలతో విసిల్లుతూ మరిన్ని కమ్మని కావ్యాలను రచించి 

రసజ్ఙులమనస్సును రంజింప జేయగోరుతున్నాను. 

                                   స్వస్తి!🙏🙏🙏🙏👌👌👌👌🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷

సోమవారం,మే27,2024

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హo*

సోమవారం,మే27,2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం - వసంత ఋతువు

వైశాఖ మాసం - బహుళ పక్షం

తిథి:చవితి సా4.42 

వారo:సోమవారం(ఇందువాసరే )

నక్షత్రం:పూర్వాషాఢ ఉ10.25 

యోగం:శుభం ఉ7.08 వరకు తదుపరి శుక్లం తె4.52 

కరణం:బాలువ సా4.42 

తదుపరి కౌలువ తె5.36 

వర్జ్యం:సా6.11 - 7.44

దుర్ముహూర్తము:మ12.22 - 1.13

మరల 2.57 - 3.48

అమృతకాలం:ఉ5.41 - 7.15

మరల తె3.30 - 5.04

రాహుకాలం:ఉ7.30 - 9.00

యమగండ/కేతుకాలం:ఉ10.30 - 12.00

సూర్యరాశి వృషభం

చంద్రరాశి:ధనుస్సు 

సూర్యోదయం:5.5.29

సూర్యాస్తమయం:6.24


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*పద్య కవితా శిల్పకళానిధి* 

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

27.05.2024. సోమవారం

 27.05.2024.        సోమవారం


*శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు*


సుప్రభాతం.....


ఈరోజు వైశాఖ మాస బహుళ పక్ష *చతుర్థి* తిథి సా.04.53 వరకూ తదుపరి *పంచమి* తిథి, *పూర్వాషాఢ* నక్షత్రం ఉ.10.13 వరకూ తదుపరి *ఉత్తరాషాఢ* నక్షత్రం, *శుభం* యోగం ఉ.06.37 వరకూ తదుపరి *శుక్ల* యోగం రా.04.28 వరకూ తదుపరి *బ్రహ్మ* యోగం,  *బాలవ* కరణం సా.04.53 వరకూ, *కౌలవ* కరణం రా.04.10 వరకూ తదుపరి *తైతుల*  కరణం ఉంటాయి.

*సూర్య రాశి*: వృషభం (రోహిణి నక్షత్రం లో)

*చంద్ర రాశి*: ధనస్సు రాశి లో సా.04.05 వరకూ తదుపరి మకర రాశిలో.

*నక్షత్ర వర్జ్యం*: సా.06.00 నుండి సా.07.33 వరకూ.

*అమృత కాలం*: ఉదయం 05.30 నుండి ఉదయం 07.04 వరకూ మరలా రా.03.20 నుండి రా.04.53 వరకూ.


( హైదరాబాద్ ప్రాంతం వారికి)

*సూర్యోదయం* : ఉ.05.41

*సూర్యాస్తమయం*: సా.06.45

*చంద్రోదయం*:రా.10.32

*చంద్రాస్తమయం*: ఉ.08.49

*అభిజిత్ ముహూర్తం*: ప.11.47 నుండి మ.12.40 వరకూ

*దుర్ముహూర్తం*: మ.12.40 నుండి మ.01.32 వరకూ మరలా మ.03.16 నుండి సా.04.09 వరకూ

*రాహు కాలం*: ఉ.07.19 నుండి ఉ.08.57 వరకూ

*గుళిక కాలం*: మ.01.51 నుండి మ.03.29 వరకూ

*యమగండం*: ఉ.10.35 నుండి మ.12.13 వరకూ.


నారాయణ స్మరణం తో.....సమస్త సన్మంగళాని భవంతు..శుభమస్తు..నమస్కారం.....సభక్తికం గా.....మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్.

ఫోన్ నెంబర్: 6281604881.

బృహత్ సంఖ్యలు:-

 🌸🪷🌸🪷🌸🪷🌸🪷🌸🪷🌸

*బృహత్ సంఖ్యలు:--*


(1)అర్భుదమ్=ఒకటి తరువాత 8సున్నలు


(2) వృందం=ఒకటి తరువాత 9సున్నలు


(3)ఖర్వి:=ఒకటితరువాత 10సున్నలు


 (4)నిఖర్వి:=ఒకటితరువాత 11సున్నలు


(5)శంఖ:=ఒకటితరువాత12సున్నలు 


(6)పద్మ:=ఒకటితరువాత13సున్నలు 


(7)సాగర:=ఒకటితరువాత14సున్నలు 


(8)అంత్యమ్=ఒకటితరువాత15సున్నలు 


(9)మధ్యమ్=ఒకటితరువాత16సున్నలు 


(10)పరార్థమ్=ఒకటితరువాత17సున్నలు.

🌸🪷🌸🪷🌸🪷🌸🪷🌸🪷🌸

రాశిఫలాలు

 ☘️🙏🕉️శ్రీ గురుభ్యోనమః🕉️🙏☘️


•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

*27-05-2024 / సోమవారం / రాశిఫలాలు*

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

మేషం


కుటుంబ సభ్యులతో విలువైన విషయాలు గూర్చి చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి  వ్యాపారాలు లాభాలబాటలో  సాగుతాయి.  ఉద్యోగస్తులకు  పదోన్నతులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో  శుభకార్యాలలో పాల్గొంటారు.

---------------------------------------

వృషభం


బంధు, మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు  అందుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శత్రు సంభందమైన  సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి  వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో   నూతన అవకాశాలు అందుకుంటారు.

---------------------------------------

మిధునం


ఆదాయానికి మించిన  ఖర్చులు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగ  ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో  మాటపట్టింపులు ఉంటాయి. దూరప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.

---------------------------------------

కర్కాటకం


ఇంటా బయట అదనపు  బాధ్యతల వలన చికాకు పెరుగుతుంది.  మానసిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. నూతన  ఋణాలు చెయ్యవలసి వస్తుంది. బంధు, మిత్రులతో స్పల్ప మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా  లాభిస్తాయి.   ఉద్యోగస్తులకు  ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి.

---------------------------------------

సింహం


కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో  పాల్గొంటారు. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. వ్యాపార విస్తరణకు లభించిన  అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

---------------------------------------

కన్య


అవసరానికి మించిన  ఖర్చులు  పెరుగుతాయి. కీలక విషయాలలో ద్విస్వభావ  ఆలోచనలు చెయ్యడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు కొంత  నిదానంగా పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలలో మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. నిరుద్యోగులకు కొన్ని విషయాలలో నిరాశ పెరుగుతుంది.

---------------------------------------

తుల


ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. స్నేహితుల నుండి ఊహించని సహాయం అందుతుంది. ఇంటా బయట   మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాల్లో మరింత పురోగతి  సాధిస్తారు. వృత్తి  ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

---------------------------------------

వృశ్చికం


ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం  మంచిది కాదు. నిరుద్యోగులు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి. ఆర్ధిక  విషయంలో  లోటుపాట్లు   ఉంటాయి. నేత్ర   సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన  ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తివ్యాపారాలు అంతంత మాత్రంగా  సాగుతాయి.

---------------------------------------

ధనస్సు


సంఘంలో గౌరవ మర్యాదలు  పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఆలోచనలు  కార్యరూపం దాల్చుతాయి.   భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై   ఊరట చెందుతారు. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో  ఆశించిన పురోగతి సాధిస్తారు.

---------------------------------------

మకరం


ధనపరంగా  అనుకూల వాతావరణం ఉంటుంది. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు  లాభసాటిగా సాగుతాయి. సమాజంలో  ప్రముఖుల నుండి   ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో  సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులు  లభించిన  అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.

---------------------------------------

కుంభం


దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. గృహమున కొందరి ప్రవర్తన  మానసికంగా  చికాకు కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో తొందరపాటు  నిర్ణయాలు చేసి ఇబ్బంది పడతారు. వ్యాపారమున ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి.

---------------------------------------

మీనం


కుటుంబ వ్యవహారాలలో  అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. నిరుద్యోగ  ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. ఆర్ధిక ఇబ్బందులు బాధిస్తాయి. వాహన ప్రయాణాలలో అప్రమత్తంగా  వ్యవహరించాలి. వ్యాపారాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో  అదనపు పనిభారం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

•••••┉━•••••┉━ •••••┉━•••••┉━•••••┉━•••••┉━

🍁 *శుభం భూయాత్* 🍀

సంసార సాగరాన్ని దాటడానికి

 💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝 *ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరిరం గృహం*

      *పూజా తేవిషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః* |

      *సంచారః పదయోః పద్రక్షిణవిధిః స్తోత్రాణిసర్వా గిరో*

   *యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్* || ౪ ||


             [ *శివ మానస పూజ* ]


ఓ స్వామీ, నీవేనా ఆత్మవి మరియు పార్వతివి బుద్ధివి. నా శరీరం నీ ఇల్లు మరియు నా ఇంద్రియాలు నీ పరిచారకులు. నా ఇంద్రియాలకు

సంబంధించిన వస్తువులను సమర్పించి నిన్ను పూజిస్తున్నాను. నా నిద్రసమాధిస్థితి. నేను ఎక్కడ నడిచినా నీ చుట్టూ తిరుగుతున్నాను.

నా ప్రతిపదం మీ కోసం. నా క్రియలన్నీ నీకు భక్తి,

ఓ శంభో.

              

   👇 //----- ( *మోహముద్గరం* )-----// 👇


శ్లో𝕝𝕝

*భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే*

*నామస్మరణాదన్యముపాయం నహి పశ్యామో భవతరణే* ॥33॥ 


భావం: భజించు గోవిందుని! భజించు గోవిందుని! ఓ మూఢుడా  గోవిందుడినే భజించు. సంసార సాగరాన్ని దాటడానికి గోవింద నామస్మరణకి మించినది లేదు.


|| ఇతి భజగోవిందం సంపూర్ణం ||


*ఈరోజుతో భజగోవిందం సంపూర్ణం నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ మనఃపూర్వక అపరిమిత సంస్కార నమస్కారములు.*