29, జనవరి 2024, సోమవారం

హిందువులకు

 



హిందూ సనాతన ధర్మ విశిష్టత కోసం ప్రతి ఒక్కరికి తెలిసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా ఏడాది పొడవునా కనీసం 15 పుణ్యక్షేత్రాలకు దర్శించిన వారికి వారు ఖర్చు చేసిన ప్రతి రూపాయి వారికి తిరిగి ఇచ్చే విధంగా ఈ పధకం హిందువులకు ఉపయోగపడుతుంది


దయచేసి ప్రతి ఒకరు మన పేజిని లైక్ చేసి మాకు సపోర్ట్ గా నిలవండి :)🙏🙏🚩🚩🚩

హిందూ బంధువులకు

 సమస్త హిందూ బంధువులకు ఒక సూచన ! మనం ఒక విచిత్రమైన తప్పిదం చాలా కాలంగా చేస్తున్నాం .ఒకసారి కుటుంబ సమేతంగా తిరుపతి, శ్రీ శైలం, కనక దుర్గమ్మ ఆలయాలు దర్షించాక మళ్లీ మళ్లీ అవే ఆలయాలకు 15/20/25 వేలు ఖర్చులు పెట్టి, క్యూ లలో నిల్చుని, రూం.లు దొరకక, చంటి పిల్లలతో అవస్థలు పడి, 300/1000 రూ టిక్కెట్లు పెట్టీ వెళుతుంటే ప్రభుత్వాలు ఆ సొమ్ము ఇతర వర్గాలకు మళ్లిస్తున్నారు. అదే వెంకన్న, మల్లన్న, దుర్గమ్మ గుడులు మన వూళ్ళో ఉన్నా బాగు చేయడానికి మనసు రాదు.

మరి మనం ఇదే ఖర్చులో పావలా వంతు మన ఊరి గుడికి ఖర్చు పెట్టుకుంటే ఏ అలసట లేకుండా ,దర్శనం,ప్రసాదం, ఆశీర్వాదం లభిస్తాయి. పేద పూజారి కడుపు నిండుతుంది. కొంత సొమ్ము మీ దగ్గర లోని గోషాలలకు ఇస్తే గోమాతల కడుపు నిండి ఆశీర్వాదం,పుణ్యం లభిస్తాయి . కొన్నాళ్ళకు ప్రభుత్వాలు గుడులపై పెత్తనం వదులుకుంటారు. ఇది సాధ్యమే ! తిరుపతి వెంకన్న ,మనగుడిలో వెంకన్న ఒకరే కదా !! ఆలోచించండి ,అర్థం చేసుకోండి !!

పది మందికీ ఇదే విషయం చెప్పి మీ గుడి, మీ వూరు,మీ గోవులను కాపాడుకోండి !జై శ్రీ రామ్!!!

అన్నం విలువ

 *అన్నం విలువ*

🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚

ఒక స్కూల్లో చిన్న పిల్లవాడు భోజన సమయంలో తన మిత్రులతో పాటు

తాను తెచ్చుకున్న ఆహారాన్ని తినేవాడు. ఆ అబ్బాయి తాను తెచ్చుకున్న అన్నాన్ని ఒక్క మెతుకు కూడా క్రింద పడకుండా, పదార్థాలను వృధా చేయకుండా తినేవాడు. అతని స్నేహితుల్లో చాలా మంది ఇంటి నుండి తెచ్చుకున్న అన్నాన్ని సరిగ్గ తినకుండా, క్రింద పైన వేసుకుంటూ తినేవారు. మరికొందరైతే గొడవపడుతూ కోపంతో ఆహారాన్ని విసిరిపారేస్తుంటారు. కానీ ఈ అబ్బాయి మాత్రం ఒక్క మెతుకు కూడా పారేయకుండా తినేవాడు.

ఒకవేళ తాను తెచ్చుకున్న బాక్స్ కు ఎక్కడైనా రెండు మెతుకులు అతుక్కుని ఉన్నాకూడా వాటిని కూడా తినేవాడు. అది చూసి మిగతా పిల్లలు ఈ అబ్బాయిని

ఎగతాళి చేసేవారు. " అరే! వీడొక తిండిపోతు రా! ఒక్కమెతుకుకూడా

వదలకుండా తింటాడు"అని ఎగతాళి చేసినా ఈ అబ్బాయి పట్టించుకునేవాడు కాదు. ఈ అబ్బాయి స్నేహితుడు ఇవన్నీ రోజూ గమనిస్తూ ఉండేవాడు, ఒకరోజు తన మిత్రున్ని ఇలా అడిగాడు.

"నువ్వు ప్రతిరోజూ ఇలా నీవు తెచ్చుకున్న ఆహారాన్ని వృధా చేయకుండా ఇంత చక్కగా తింటున్నావు కదా! మిగతావాళ్ళు నిన్ను ఎగతాళి చేస్తున్నా నీకు బాధ అనిపించదా? " దానికి ఈ అబ్బాయి ఇలా సమాధానం ఇచ్చాడు.


"ఏదో వారికి తెలియకుండా నన్ను ఎగతాళి చేస్తున్నారు. నాకేం బాధలేదు.

ఇక నేను అలా తినడానికి కారణం చెప్పనా? అలా తినడం అన్నది

నా తల్లిదండ్రులకు నేను ఇచ్చే మర్యాదకు చిహ్నం.

అమ్మ ఉదయాన్నే లేచి నాకు ఇష్టమైన పదార్థాలను అడిగి వండి ప్రేమతో బాక్స్ లో పెట్టి పంపిస్తుంది,

వండటానికి కావలసిన వస్తువులను నాన్న ఎంతో కష్టపడి పనిచేసి ఆ సంపాదనతో సాయంత్రానికి తెస్తాడు.

ఇద్దరి ప్రేమతో పాటు వారి కష్టంకూడా నా భోజనంలో ఉంది.

అలాంటప్పుడు నేను ఒక్క మెతుకును వృధా చేసినా వారికి అగౌరవ పరచినట్లే!

అంతేకాదు ఒక రైతు తన చెమటను చిందించి పంటను పండిస్తాడు.

అతన్ని కూడా నేను అవమానపరిచినట్లే కదా!

అందుకే నేను ఎవరు

నవ్వుకున్నా ఒక్క మెతుకును కూడా వృధా చేయను

అంతేకాదు ఎంతోమందికి రెండుపూటలా కడుపునిండా అన్నం దొరకడం లేదు. నాకు దొరికింది.

నా తల్లిదండ్రుల పుణ్యమా అని, అమ్మ ఎప్పుడూ చెపుతుంది. ఆహారాన్ని వృధా చేయకూడదని "

అని చాలా చక్కగా చెప్పాడు.

ప్రతి ఉపాధ్యాయుడూ, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటివి చెప్పి వారిలో ఆలోచనా విధానంలో మార్పుతేవలసిన అవసరం ఎంతైనా ఉంది.


అన్నం పరబ్రహ్మ స్వరూపం.

Panchang

  


గొప్ప సంస్కృతి

 ఎంత గొప్ప సంస్కృతి మనది!🙏🏵️🙏🚩


*దశరథ మహారాజు తన నలుగురు కొడుకులతో కూడిన వివాహ శోభాయాత్రతో కలసి... సకుటుంబ సపరివారంగా, బంధు మిత్రుల సమేతంగా బయలుదేరి జనక మహారాజు గారి ద్వారం వద్దకు వెళ్తాడు.*


*అప్పుడు జనక మహారాజు తాను స్వయంగా ఎదురు వెళ్లి సాంప్రదాయ పద్ధతిలో వారి వివాహ శోభాయాత్రకు సాదరపూర్వక స్వాగతం చెబుతాడు.*


*అప్పుడు వెంటనే దశరథ మహారాజు ముందుకు వెళ్లి జనక మహారాజుకు పాదాభివందనం చేస్తాడు.*


*అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు యొక్క భుజం తట్టి పైకి లేపి సంతోషంతో కౌగలించుకొని... “రాజా! మీరు పెద్దవారు. పైగా వరుని పక్షంవారు. ఇలా మీరు నాకు పాదాభివందనం చేయడం ఏమిటి?” గంగానది వెనక్కు ప్రవహించడం లేదు కదా అని అంటాడు.*


*అప్పుడు దశరథ మహారాజు అద్భుతమైన, సుందరమైన జవాబు చెబుతాడు...*


*”మహారాజా! మీరు దాతలు... కన్యాదానం చేస్తున్నారు... నేనైతే యాచకుణ్ణి... మీ ద్వారా కన్యను పొందాలని వచ్చాను... ఇప్పుడు చెప్పండి. దాత మరియు యాచకులలో ఎవరు పెద్ద?ఎవరు గొప్ప?” అని అంటాడు.*


*ఆ మాటలను విన్న జనక మహారాజు కళ్ళల్లోంచి ఆనందబాష్పాలు రాలుస్తూ ఇలా అంటాడు... ”ఏ గృహంలో అయితే కూతుళ్లు ఉంటారో... వాళ్ళు భాగ్యవంతులు. ప్రతీ కూతురి అదృష్టంలో తండ్రి తప్పక ఉంటాడు.”*


*ఇదీ ఘనమైన మన భారతీయత..!*   


*ఇదీ మహోత్కృష్ఠమైన మన సంస్కృతి..!* 


*ఇదీ రామాయణం నీతి..!*  

.

అమృతం త్రాగి

 అమృతం త్రాగి

భూమి మీదకు

ఎవరు రాలేదు


మహారాజు కూడ

మరణం పొందినాడు


ఒకడు చరిత్ర సృష్టించి

పోయినాడు


మరొకడు చరిత్రహీనుడై

మరణించినాడు


మంచిపనులు చేసి

నరలోకంలో

దేవుడు అయ్యాడు


చెడుపనులు చేసి

రాక్షసుడు అయ్యాడు


సమయం వస్తే అందరు

భౌతికదేహం వదిలి

పైకి పోతారు


అహంకారం వదిలేద్దాం

అవివేకం వదిలేద్దాం

మంచి ప్రజలను

ప్రతిభావంతులను

ప్రోత్సహిస్తు

ముందుకు పోదాం


⚡⚡⚡⚡⚡⚡⚡⚡⚡


అమృతం పీత్వా 

 కో2పి భూమౌ 

 న ఆగతవాన్


మహారాజః అపి

మరణం ప్రాప్తవాన్ 


కశ్చన చరిత్రం సృష్ట్వా

గతవాన్


కశ్చన చరిత్రహీనః భూత్వా

మృతవాన్


సాధుకార్యాణి కృత్వా

నరలోకే దేవః అభవత్


అసాధుకార్యాణి సమాచర్య

నరలోకే దైత్యః అభవత్


సమయమ్ ఆగచ్ఛతి చేత్

సర్వే భౌతికదేహం త్యక్త్వా

ఉపరి గచ్ఛంతి ఏవ


అహంకారం త్యజేమ

అవివేకం విసర్జయేమ

సజ్జనాన్ సత్పురుషాన్

ప్రతిభావతః జనాన్

సదా ప్రోత్సాహయన్తః

అగ్రే గచ్ఛేమ

గోవు వెనక వెళ్ళడమెందుకు

 🙏 శ్రీ గురుభ్యోనమః 🙏


🕉️గోవు వెనక వెళ్ళడమెందుకు?🕉️


పరమాచార్య స్వామివారు విజయయాత్రలలో భాగంగా, వివిధ ప్రాంతాలలో నివసిస్తుండేవారు. అలాంటి సమయాలలో కొందరు భక్తులు, తమ ఇళ్ళకు రమ్మనో లేదా అక్కడి దేవాలయాలకు రమ్మనో అభ్యర్తిస్తుంటారు.


భక్తులు రమ్మని ప్రార్తిస్తున్నది దేవాలయానికే అయితే పరమాచార్య స్వామివారు దాదాపుగా వారి అభ్యర్థనను మన్నించి అక్కడకు వెళ్లి, దేవాలి దర్శనం చేసుకుని, దగ్గరలోని ఒక స్థలంలో మకాం చేసి, కొద్దిసేపో లేదంటే ఒకరోజో అక్కడ ఉంది భక్తులకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తుంటారు. కొన్నిసార్లు ఏదైనా ఉపన్యాసం కాని లేదా సామాన్య విషయాలు చర్చించడం కాని జరుగుతూ ఉంటాయి.


ఒకసారి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తం విజయయాత్ర చేస్తున్నారు. యాత్రలో భాగంగా తిరుచిరాపల్లిలో కొన్నిరోజుల పటు మకాం చేశారు. ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు.

ఆ భక్తజన సమూహంలో తిరుచ్చిలోని ఒక కళాశాల ప్రధానాచార్యులు కూడా ఉన్నారు. వరుసలో అతని వంతు రాగానే మహాస్వామివారికి నమస్కరించి, ఎన్నోరకాల పళ్ళు పూలు సమర్పించాడు. మహాస్వామివారి దివ్యపాదములు తన కళాశాలను తాకాలని, విద్యార్ధులని అనుగ్రహించాలని ప్రార్థించాడు.


కాని మహాస్వామివారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అతని ప్రార్థనకు మౌనమే స్వామివారి సమాధానం అయ్యింది. అతను మాత్రం రోజూ వచ్చి స్వామివారిని అర్థించేవాడు.


చివరగా ఒకరోజు కరుణాసాగరులైన మహాస్వామివారు అతనిపై తమ దయను ప్రసరింపజేశారు. పటికబెల్లం, కుంకుమ ప్రసాదం ఇస్తూ, స్వామివారు అతనితో, “రేపు ఉదయం మీ కళాశాలకు వస్తాను. ఒక ఆవు, దూడతో నీవు నీ భార్య సిద్ధంగా ఉండండి” అని ఆజ్ఞాపించారు.


ఆ భక్తుని సంతోషానికి అవధులు లేవు. “ఖచ్చితంగా అలాగే చేస్తాను పెరియవా” అని మహదానందంతో వెళ్ళిపోయాడు.


చెప్పినట్టుగానే ఉదయం స్వామివారు కళాశాలకు వెళ్ళారు. అతను ఆవు, దూడ, పూర్ణకుంభంతో సహా స్వామివారికోసం ఎదురుచూస్తున్నాడు. మహాస్వామివారి పూర్ణకుంభాన్ని స్వీకరించి, కళాశాల ద్వారం వద్దకు వచ్చి నిలబడ్డారు.


స్వామివారు ఆ భక్తునితో, “నువ్వు ఎక్కడేక్కడైతే నేను రావాలి అనుకుంటున్నావో, అక్కడకు నువ్వు ఆవు, దూడను ముందు తీసుకుని వెళ్ళు, నేను అనుగమిస్తాను” అని తెలిపారు.


స్వామివారి ఆదేశం ప్రకారం అతను భార్యతో కలిసి ఆవు దూడను ముందు తీసుకుని వెళ్తూ ఉంటె స్వామివారు ఆవు వెనుకగా వస్తున్నారు. మొత్తం కలియతిరిగిన తరువాత స్వామివారు ఆ భక్తునితో, “సంతృప్తిగా ఉందా?” అని అడుగగా, అతను తనకు కలిగిన ఆనందాన్ని మాటలలో చెప్పడం కుదరక, కళ్ళ నీరు కారుస్తూ, హృదయం ఉప్పొంగి, తనకు స్వామివారు కలిగించిన అదృష్టానికి, వారి దయకు కృతజ్ఞతగా నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. 


తమ వసతికి తిరిగొచ్చిన స్వామివారు సాయింత్రం భక్తులతో మాట్లాడుతూ, ఉదయం తాము కళాశాలకు వెళ్లోచ్చిన విషయం ప్రస్తావనకు రావడంతో ఒక వ్యక్తి స్వామివారిని, “పెరియవా, కళాశాలో మీరు ఆవు వెనుకగా ఎందుకు వెళ్ళారు?” అని అడిగాడు.


స్వామివారు చిరునవ్వుతూ, “అతను నాపై అత్యంత భక్తిభావం కలవాడు. నేను వస్తే అది కళాశాలకు మంచి అని నమ్మి నన్ను ఆహ్వానించాడు. కాని అది ఆడపిల్లలు చదివే కళాశాల. వారు అన్ని రోజులలోను కళాశాలకు వస్తారు. వారు దూరం ఉండాల్సిన సమయాలలో కూడా కళాశాలకు వస్తారు. అందుకే నేను ఒక ఆలోచన చేశాను. అతని కోరికను తీర్చాలి. నా అనుష్టానం, నియమపాలన కూడా కాపాడబడాలి. దానికి పరిష్కారం ఒక్కటే. మన శాస్త్రాలలో ఉన్నదాని ప్రకారం, ఎటువంటి అశౌచమైనా, ఎటువంటి స్థలమైనా గోవు డెక్కల నుండి వచ్చే ధూళి తగిలితే, ఆ స్థలం పవిత్రమవుతుంది. అందుకే ఆవును ముందు వదిలి నేను దాన్ని అనుసరించాను” అని బదులిచ్చారు.


స్వామివారు చెప్పిన విషయాన్ని విన్నవారందరూ స్థాణువులై నిలబడిపోయారు. ఇంతటి ధర్మసూక్ష్మము ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ధర్మాన్ని, ఆశ్రమ నియమ పాలనను ఇంతగా పాటించే జీవితం ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ఇలా దయను కూడా ధర్మంతో ముడిపెట్టి పాలించేవారు కంచి పరమాచార్య స్వామివారు కాక ఇంక ఎవరు ఉంటారు?


🌹👏🌹

జయ జయ శంకర

హర హర శంకర

🌹👏🌹


అపార కరుణాసింధుం 

జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం

ప్రణమామి ముదావహం

మరణం ఎందుకు

 *మరణం ఎందుకు ముఖ్యం?*

🌷🌷🌷🌷🌷🌷🌷

      

    మరణం ఎందుకు ముఖ్యమైనది ? దాని ప్రాముఖ్యతను వివరించే  అందమైన కథనం. 


        మృత్యువుకు ప్రతి ఒక్కరూ భయపడతారు కానీ జనన మరణాలు సృష్టి నియమాలు..... విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం. లేకపోతే, మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు. ఎలా? ఈ కథ చదవండి... 


        ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతనిని కలిసి "ఓ స్వామీ! నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి" అని అడిగాడు. అప్పుడా సన్యాసి "ఓ రాజా ! దయచేసి మీరు ఎదురుగా వున్న రెండు పర్వతాలను దాటండి.అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది. దాని నీరు త్రాగండి. మీరు అమరత్వం పొందుతారు."అని చెప్పాడు. 


         రెండు పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపించింది. అతను నీరు తాగడానికి  వెళ్ళబోతున్నప్పుడు అతనికి బాధాకరమైన మూలుగులు వినిపించాయి. అతను నీరు తాగకుండా ఆ గొంతును అనుసరించాడు. చాలా బలహీనమైన వ్యక్తి ఒకడు పడుకుని నొప్పితో బాధపడుతున్నాడు. రాజు కారణం అడగగా... 


        "నేను సరస్సులోని నీటిని తాగి అమరుడనయ్యాను. నాకు నూరేళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటి వేశాడు.గత యాభై ఏళ్లుగా నన్ను చూసుకునే వారు లేకుండా పడి వున్నాను. నా కొడుకు చనిపోయాడు. నా మనుమలు ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు త్రాగటం మానేశాను.అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను."


          రాజు ఆలోచించాడు... "అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి ? నేను అమరత్వంతో పాటు యవ్వనం పొందితే?" పరిష్కారం కోసం మళ్లీ సన్యాసి దగ్గరకెళ్ళి అడిగాడు. "నాకు అమరత్వంతో పాటు యవ్వనంకూడా లభించే మార్గం తెలుపండి "అని


         సన్యాసి ఇలా అన్నాడు... "సరస్సు దాటిన తర్వాత మీకు మరొక పర్వతం కనిపిస్తుంది. దాన్ని కూడా దాటండి. అక్కడ మీకు పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది, వాటిలో ఒకటి తీసుకుని తినండి. మీరు అమరత్వంతో పాటు యవ్వనం కూడా పొందుతారు." 


         రాజు బయలుదేరి మరో పర్వతాన్ని దాటాడు.అక్కడ  అతనికి పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపించింది. పండ్లను తెంపి తినబోతుంటే... కొందరు గట్టిగా అరస్తూ పోట్లాడుకోవడం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచించాడు.


         నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అలా వాదించుకుంటూ ఈ మారు మూలలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు వాళ్ళని అడిగాడు. వారిలో ఒకరు "నాకు 250 ఏళ్లు, నా కుడి వైపున ఉన్న వ్యక్తికి 300 సంవత్సరాలు. అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. రాజు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు..."నా కుడి వైపున మా నాన్న వున్నాడు. అతనికి 350 సంవత్సరాల వయస్సు. అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు, నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి వున్న 400 సంవత్సరాల వయస్సు గల అతని తండ్రిని సూచించాడు. ఆస్తి కోసం  అంతులేని మా పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుండి వెళ్లగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు. 


         రాజు దిగ్భ్రాంతికి గురై  సన్యాసి వద్దకు తిరిగి వచ్చి...


      *"మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియచేసినoదుకు ధన్యవాదాలు"* అన్నాడు.  


        అపుడు ఆ సన్యాసి ఇలా అన్నారు...


     _*మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది*_


        "మరణాన్ని నివారించే బదులు,మీ ప్రతి రోజూ, ప్రతి క్షణం సంతోషంగా జీవించండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అపుడు ప్రపంచం మారుతుంది. 


1.మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానం (పవిత్ర స్నానం) లాగా ఉంటుంది. 

2. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది 

3. నడిచేటప్పుడు జపిస్తే అది తీర్థయాత్ర  లాగా ఉంటుంది 

4. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహా ప్రసాదం అవుతుంది.

5. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్ర లాగా ఉంటుంది .

6. పనిచేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది. 

7.ఇంట్లో జపిస్తే దేవాలయం అవుతుంది.

శ్రీమద్భగవద్గీత

 🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷

. *🌹శ్రీమద్భగవద్గీత🌹*

. *రెండొవ అధ్యాయము* 

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

. *సాంఖ్య యోగము*

. *శ్లోకము 04-05*

🌹🪷🌹🪷🌹🪷🌹🪷🌹🪷


*అర్జున ఉవాచ ।*

*కథం భీష్మమహం సంఖ్యే* 

*ద్రోణం చ మధుసూదన ।*

*ఇషుభి ప్రతియోత్స్యామి*

*పూజార్హవరిసూదన ।। 4 ।।*


*గురూనహత్వా హి మహానుభావాన్*

*శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే ।*

*హత్వార్థకామాంస్తు గురూనిహైవ*

*భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ।। 5 ।।*



*భావము:*

అర్జునుడు ఇలా అన్నాడు: ఓ మధుసూదనా, పూజ్యులైన భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వారి మీద యుద్ధంలో నేను బాణాలు ఎలా విడువగలను? ఓ, శత్రువులను నాశనం చేసేవాడా. నా గురువులైన ఈ పెద్దలను సంహరించి ఈ భోగాలని అనుభవించటం కంటే యాచకుడిగా బ్రతకటం మేలు. వీరిని చంపితే, మనము అనుభవించే ఈ సంపద, భోగాలు, రక్తం తో కళంకితమై ఉంటాయి.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సంకల్పము

 *శుభోదయం*

**********

సంధ్యా వందన 

మరియు ఇతర 

పూజాకార్యక్రమాల సంకల్పము. 

పూర్వ పద్ధతి పంచాంగం.

తేదీ.29.01.2024 

సోమ వారం (ఇందు వాసరే) 

 **********

గమనిక:-ఇక్కడ నేను ఇచ్చే సంకల్పం మా పెద్దలు మరియు గురువుల ద్వారా నేర్చుకున్న నిష్కామ సంకల్పం. దీనిని మీరు ఉన్న ప్రదేశం మరియు మీరు మీ గురువు ద్వారా నేర్చుకున్న విధంగా మార్చుకో వచ్చును. 

__________________

శుభాభ్యుదయార్ధంచ, శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్నేయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే

మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీ శైలస్య వాయువ్య దిగ్భాగే (హైదరాబాద్ లో వారికి మాత్రమే)గంగా కావేర్యోర్మధ్య ప్రదేశే శ్రీలక్ష్మీ నివాస గృహే సమస్థ దేవతా హరిహర గురు గో బ్రాహ్మణ చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన

శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

హేమంతృతౌ

పౌష్య మాసే కృష్ణ పక్షే 

చతుర్ధ్యాం (సూర్యోదయానికి ఉన్న తిథే చెప్పుకోవాలి సంధ్యావందనాలకు మాత్రమే)

ఇందు వాసరే 

శుభ నక్షత్రే

శుభ యోగే,

శుభకరణ,  

ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభ తిధౌ 

శ్రీమాన్_______గోత్రః_____నామధేయః  

శ్రీమతః ______గోత్రస్య_______ నామధేయస్య మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతః/మాధ్యాహ్నిక/సాయం 

సంధ్యాముపాసిష్యే. 

సంధ్యా వందనం కొరకు మాత్రమే.

*ఇతర పూజలకు*

 శ్రీ శోభకృత్ నామ సంవత్సరే ఉత్తరాయణే

హేమంతృతౌ పౌష్య మాసే కృష్ణ పక్షే

చతుర్ధ్యాం

ఇందు వాసరే అని చెప్పుకోవాలి.

*ఇతర ఉపయుక్త విషయాలు*

సూ.ఉ.6.37

సూ.అ.5.50

శాలివాహనశకం 1945 వ సంవత్సరం.  

విక్రమార్క శతాబ్దం లో 2080 వ సంవత్సరం. 

కల్యబ్దాః 5124 వ సంవత్సరం. 

*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ^

^ఉత్తరాయణ పుణ్యకాలం శరత్ ఋతువు-

పుష్య మాసం 

God's పక్షం చవితి రా.తె.6.19 వరకు.

సోమ వారం. 

నక్షత్రం పుబ్బ సా.5.13 వరకు. 

అమృతం ప.10.07 ల 12.53 వరకు. 

దుర్ముహూర్తం ప.12.35 ల 1.20 వరకు. 

దుర్ముహూర్తం మ.2.49 ల 3.34 వరకు. 

వర్జ్యం రా.1.12 ల 2.58 వరకు. 

యోగం శోభన ఉ.8.38 వరకు. 

కరణం బవ సా. 5.13 వరకు.   

కరణం బాలవ రా. తె. 6.19 వరకు. 

సూర్యోదయము ఉ.6.00 గంటలకు అయితే

రాహు కాలం ఉ. 7.30 ల 9.00 వరకు. 

గుళిక కాలం సా.1.30 ల 3.00 వరకు. 

యమగండ కాలం ప. 10.30 ల 12.00 వరకు. 

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి

---////----////---////---////---

పుణ్యతిధి పుష్య బహుళ చవితి. 

************

బ్రాహ్మణ వధూవరుల వివరాలకై సంప్రదించండి:-

*శ్రీ పద్మావతి శ్రీనివాస బ్రాహ్మణ వివాహ సమాచార సంస్థ*, 

(రి.జి.నెం.556/2013)

S2 - C 92, 6 - 3 -1599/92,

సచివాలయనగర్,వనస్థలిపురం,

హైదరాబాద్ 500 070.

ఫోన్(చరవాణి) నెం.

*8019566579/9848751577*

****

*బ్రాహ్మణ వధూవరుల సమాచార కేంద్రం*

                           వారి

*బ్రాహ్మణ వధూవరుల ద్వై మాసవపత్రిక*

*పత్రికలో రిజిస్ట్రేషన్*ఉచితం, పుస్తకం కావలసిన వారు ₹100/- చెల్లించిన చో పుస్తకం వారి చిరునామాకు పంపబడును* 

*రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకై*

*సంప్రదించండి*

ఫోన్(చరవాణి) నెం లను 

*9030293127/9959599505

*.**************

ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్ళి రోజు జరుపు కుంటున్న అందరికీ గాయిత్రి మాత ఆయురారోగ్యాలు సర్వదా ప్రసాదించాలని కోరుకుంటూ మీ శ్రేయోభిలాషి.

**************

మాస్క్ ధరిస్తూ సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యం గాను క్షేమంగాను ఉండాలని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.

🙏🙏🙏

.

గరుడ పురాణం

 శ్లోకం:☝️

   *స్వస్థానాచ్చలితే శ్వాసే*

*కల్పాఖ్యో హ్యాతురక్షణః |*

   *శతవృశ్చికదంష్ట్రస్య*

*యా పీడా సాయనుభూయతే ||*

   - గరుడ పురాణం


భావం: మరణ సమయాన ప్రాణాధారమైన గాలి తన స్థలం నుండి కదులుతున్నప్పుడు, ఒక క్షణం కూడా ఒక యుగంలా గడుస్తుంది, మరియు నొప్పి వంద తేళ్లు కుట్టినంత సమానంగా ఉంటుంది.

జనాలు గరుడ పురాణం చదవాలంటే భయపడేది ఇందుకేనేమో?

పంచాంగం 29.01.2024

 ఈ రోజు పంచాంగం 29.01.2024

Monday,

 

స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: ఉత్తరాయణం హేమన్త ఋతు పుష్య మాస కృష్ణ పక్ష: చవితి తిధి ఇందు వాసర: పూర్వఫల్గుని నక్షత్రం శోభన యోగ: బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


చవితి ఈ రోజు పూర్తిగా ఉంది.

పూర్వఫల్గుని సాయంత్రం 06:57 వరకు.

సూర్యోదయం : 06:53

సూర్యాస్తమయం : 06:06


వర్జ్యం : రాత్రి 03:05 నుండి 04:54 వరకు.


దుర్ముహూర్తం : మధ్యాహ్నం 12:51 నుండి 01:36 వరకు తిరిగి మధ్యాహ్నం 03:06 నుండి 03:51 వరకు.


అమృత ఘడియలు : పగలు 11:44 నుండి మధ్యాహ్నం 01:32


రాహుకాలం : పగలు 07:30 నుండి 09:00 వరకు.


యమగండం: పగలు 10:30 నుండి 12:00 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

నైమిశారణ్యం

 *నైమిశారణ్యం*

*పురాణాల పుట్టిల్లు నైమిశారణ్యం. గురువులకు, తపస్వులకు నిలయం. వేదకాలం నుంచి నైమిశారణ్యంలో ఎప్పుడూ ఏవేవో దివ్య క్రతువులు, జ్ఞాన సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. మూడులోకాలలోని తీర్థాలలో ఉత్తమమైనది నైమిశారణ్యం. ఈ దివ్య తీర్థాన్ని దర్శిస్తే సకల తీర్థాలనూ సేవించిన ఫలితం లభిస్తుంది.*


 కురుక్షేత్రంలో ఒక క్రోసెడు దూరం నడిచినా, నైమిశారణ్యంలో ఒక అడుగు నడిచినా, యజ్ఞం చేసిన ఫలం లభిస్తుందని మహాభారతంలోని అరణ్యపర్వం చెబుతుంది. నైమిశారణ్యం ఎనిమిదో వైకుంఠం అని తులసీదాసు రామచరిత మానస్ చెబుతోంది. 


1. దండకారణ్యం, 

2. సైంధవారణ్యం, 

3. జంబుకారణ్యం, 

4. పుష్కరారణ్యం, 

5. ఉత్పలారణ్యం, 

6. బదరికారణ్యం, 

7. జాంగలారణ్యం, 

8. ఉత్తరారణ్యం, 

9. నైమిశారణ్యం 


అనే తొమ్మిది అరణ్యాలలో ఇది ఉత్తమమైనది.


*నైమిశం ఇలా పుట్టింది*


పాంచాల రాజ్యానికి, కోసల దేశానికి మధ్యలో 84 క్రోసులు అంటే 252 కి.మీ. దూరం వ్యాపించిన సువిశాల అరణ్యమే *"నైమిశారణ్యం.* అనాదికాలం నుంచి మన రుషులకు తపోస్థలి. శౌనకాది మహామునులు ఇక్కడ చిరకాలం తపస్సులు చేశారు. యజ్ఞయాగాలు నిర్వహించారు. ఇక్కడ ప్రతి చెట్టు, ప్రతి పుట్ట పవిత్రమైనవే.


 పూర్వం కలియుగం ప్రారంభంలో రుషులు, మునులు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి, “స్వామీ! రాబోయే కలియుగం సకల అనర్థాలకూ మూలం కదా! మాకు కలిప్రభావం లేని ప్రదేశాన్ని సూచించండి. మేమంతా అక్కడికి వెళ్లి తపస్సు చేసుకుంటాం” అని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన మనస్సు ద్వారా ఒక దివ్యచక్రాన్ని సృష్టించి భూమిపైకి పంపాడు. “మహాత్ములారా! మీరంతా ఆ చక్రాన్ని అనుసరిస్తూ వెళ్లండి. ఆ చక్రం నేమి (ఇరుసు) ఎక్కడ ఆగుతుందో అదే మీరు కోరుకునే పుణ్యప్రదేశం" అని చెప్పి పంపించాడు. అలా బ్రహ్మ వదిలిన చక్రం ఇరుసు ఆగిన ప్రదేశమే *నైమిశారణ్యం.*


 ఈ అరణ్యంలో శౌనక మహర్షి 84 వేలమంది మునులతో కలిసి భాగవత పారాయణ చేశాడని చెబుతారు. వ్యాసుడి శిష్యుడైన వైశంపాయనుడు కూడా ఇక్కడే ఒక యాగాన్ని చేసి మహాభారత పారాయణ చేశాడు. శ్రీరాముడు అశ్వమేధయాగం ఇక్కడే చేశాడు. ఇక్కడే లవకుశుల్ని కలుసుకున్నాడు.


*దర్శనీయ స్థలాలు:*


*చక్రతీర్థం:*


 బ్రహ్మదేవుడి చక్రం ఆగిన స్థలంలోనే చక్రతీర్థం అనే పుష్కరిణి ఏర్పడింది. నైమిశారణ్యంలో ఇది సుప్రసిద్ధ తీర్థం. ఇది వృత్తాకారంగా అందంగా కనిపిస్తుంది. ఈ దివ్యతీర్థంలో స్నానం చేసినవారికి వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుందని ప్రతీతి. అమావాస్య, సోమవారం కలిసి వచ్చిన రోజున సోమావతీ అమావాస్య (జూలై 17) అంటారు. ఆ రోజున ఎవరైతే చక్రతీర్థంలో స్నానం చేస్తారో వారి మనోవాంఛలన్నీ తప్పకుండా సిద్ధిస్తాయి. అందుకే, ఈ పుణ్యతిథినాడు లక్షలాదిమంది నైమిశారణ్యానికి వచ్చి, చక్రతీర్థంలో స్నానాలు చేస్తారు. ఈ చక్రతీర్థమే భూమండలానికి మధ్యభాగం అని మహాభారతం శాంతిపర్వం (343.2) చెబుతోంది. ఈ తీర్థం పక్కనే ప్రాచీనమైన శివాలయం కూడా ఉంది. స్వామిపేరు *భూతేశ్వరుడు.*


*వ్యాసగద్దె :*


భగవాన్ వేదవ్యాస మహర్షి వేదవిభజన చేసిన ప్రదేశమే ఈ వ్యాసగద్దె. వ్యాసుడు ఇక్కడే ఒక్కటిగా ఉన్న వేదరాశిని నాలుగు వేదాలుగా విభాగం చేశాడంటారు♪. జైమిని, వైశంపాయనుడు, పైలుడు, అంగీరసుడు వంటి శిష్యులకు వేదవిద్యను ఇక్కడే ప్రబోధించాడు. అష్టాదశ పురాణాలను అందించాడు. ఈ వ్యాసగద్దెను చక్కటి పట్టువస్త్రంతో అలంకరిస్తారు. ఈ గద్దె పక్కనే వ్యాస, శుకమహర్షుల పాలరాతి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఈ వ్యాసగద్దె సమీపంలోనే మరికొన్ని మందిరాలు కూడా ఉన్నాయి. ఇది చక్రతీర్థానికి అరకిలోమీటరు దూరంలోనే ఉంది.


*సూతగద్దె :* 


 సూత పౌరాణికుడు ఎనభై ఎనిమిది వేలమంది మునులకు పురాణాలను వినిపించాడు. అంతేకాదు మన ఆంధ్రదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాన్ని మొదటిసారిగా సూతమహర్షి శౌనకాది మునులకు బోధించిన స్థలం కూడా ఇదే. ఈ ప్రదేశంలో సూతమహర్షి పాలరాతి విగ్రహాన్ని ఒక మందిరంలో ప్రతిష్ఠించారు. ప్రస్తుతం ఒక పెద్ద దేవాలయంగా దీన్ని తీరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.


*శౌనక యాగశాల:* 


 సూతగద్దె సమీపంలోనే పూర్వం శౌనకాది మహామునులు దీర్ఘసత్రయాగం చేసిన ప్రదేశం ఉంది. ఇక్కడ ఒక ప్రాచీనమైన యాగశాల మనకు కనిపిస్తుంది.


*లలితా శక్తిపీఠం:* 


పవిత్రమైన నైమిశారణ్య క్షేత్రంలో సతీదేవి హృదయభాగం పడిందని చెబుతారు. దక్షయజ్ఞ వాటికలో ప్రాణాలు కోల్పోయిన సతీదేవి శరీరాన్ని శ్రీహరి తన చక్రంతో 108 భాగాలుగా ఖండించగా అవన్నీ భూమండలంలో 108 ప్రదేశాల్లో పడి శక్తిపీఠాలుగా మారిపోయాయి. తంత్రగ్రంథాలలో ఈ పీఠాన్ని *ఉడ్డీయనీ పీఠం* అంటారు. నైమిశారణ్యంలో కొలువున్న అమ్మవారిని *లింగధారిణీ* అనే పేరుతో ఆరాధిస్తారు. అయితే లలితాపీఠంగా ఇది ప్రసిద్ధి చెందడం విశేషం. దసరా నవరాత్రులు, చైత్ర నవరాత్రుల్లో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. చక్రతీర్థం నుంచి సుమారు ఒక కి.మీ. దూరంలో శక్తిపీఠం ఉంటుంది. 


ఇంకా నైమిశారణ్యంలో బాలాజీ మందిరం, దేవరాజన్ మందిరం, గోమతీ నది, దధీచి కుండం, రుద్రావర్త కుండం హత్యారణ్య కుండం తప్పకుండా చూడవలసినవి.