అనగనగా....
[2. నన్ను పొగడని నాన్నని చంపేస్తాను !
8
అనగనగా 'భారవి' అనే విద్యార్థి ఉండేవాడు. అతను చిన్నప్పటినుండీ మంచి కవిత్వాన్ని చెప్తూండే వాడు. అతని కవిత్వాన్ని విన్నవాళ్లంతా అతణ్ణి మెచ్చుకోవడమే కాక అతని తండ్రితో కూడ ఆ విషయాన్ని ముచ్చటిస్తూండేవారు. భారవి తండ్రి మాత్రం వారి ప్రశంసని వింటూనే ఏదో మా వెజినాగన్న తోచీతోచనిది చెప్తే, దాన్ని కవిత్వమంటూ మీరు కూడా పొగిడితే ఎలా ? వాడూ - వాడికో కవిత్వమూనా ?' అంటూ తేలికగా అంటూండేవాడు.
తన పుత్రుణ్ణి తాను పొగడకూడదనీ, అలా పొగడడం పుత్రునికి ఆయుఃక్షీణతని కలుగజేస్తుందని ఆయన అభిప్రాయం తప్ప, భారవి చెప్పే కవిత్వంలో గొప్పదనం లేదనేది కాదు. తన పుత్రుని కవిత్వాన్ని ఇతరులు చెప్పగా పూర్తిగా విని, భారవి కవిత్వం కొత్త పుంతలు తొక్కుతోందని మనసులో ఆనందపడుతూ, ఆ విషయాన్ని తన భార్యతో అనేక పర్యాయాలు చెప్పాడు కూడా అయితే రహస్యంగానూ, ఎవరూ వినకుండానూ మాత్రమే.
తనని ఊరంతా మెచ్చుకోవడం, తన తండ్రి మాత్రమే తనని తన ఊరివారిముందే తీసిపారేసినట్టు మాట్లాడ్డం భారవికి చాల కష్టంగా అన్పించింది. ఒకనాడది తారస్థాయికి చేరింది. తండ్రి పీడని శాశ్వతంగా వదిలించుకోవాలనుకున్నాడు భారవి.
అంతే ! ఫలితంగా ఒక బండజాతిని అటక మీదికి చేర్చుకుని కూచున్నాడు. తన తండ్రి భోజనం చేస్తున్నవేళ, ఆ బండజాతిని ఆయన నెత్తిపై పడేలా వేయాలనేది భారవి పథకం. ఈ విషయాన్ని గమనించిన భారవితల్లి మాత్రం ఏమీ ఎజగనట్టుగానే ఉండిపోయింది.
భారవితండ్రి భోజనానికి విస్తరిముందు కూచోగానే పైనున్న భారవిక్కూడా వినిపించేలాగా ఆమె 'ఏమండీ భారవి ఇంట్లో లేడు! కాబట్టి అడుగుతున్నాను. నిజాన్ని సూటిగా నాకు చెప్పండి. ఊళ్లో వాళ్లంతా వాడి కవిత్వాన్ని మెచ్చుకుంటూంటే ఎందుకని వారు వాణ్ణి-వాడి కవిత్వాన్నీ వాళ్ల ఎదురుగుండానే -చులకన చేస్తూ తీసిపడేస్తున్నారు ? వాడి పసిమనసు ఎంతో గాయపడుతోందని నాకు అన్పిస్తోంది' అని అంది.
అనగనగా....
CO
అటక మీద బండజాతిని పట్టుకుని ఉన్న భారవి, తన తండ్రి సమాధానాన్ని విన్న మీదట ఏంచేయాలో నిర్ణయించుకుందామనుకున్నాడు.
భారవి తండ్రి తన భార్యవంక చూస్తూ 'ఏమే ! మనింటి చెట్టుకి పండిన పండు చాల రుచిగా ఉందని అంతా అంటూంటే 'కాదు చేదుగా ఉం'దని నేనెందుకంటున్నానో నీకు మాత్రం తెలియదా ? ఎప్పుడూ నువ్వు ఈశ్లోకాన్నే వినలేదా ?”
'ప్రత్యక్షే గురవః స్తుత్యాః పరోక్షే మిత్ర బాంధవాః | కొ ర్యాంతే దాసభృ త్యాద్యా: న తు పుత్రా: కదాచన I'
'గురువుగారి పాండిత్యానికి సంతోషపడిన శిష్యుడు ఎవరైనా ఆయనని ఆయన సమక్షంలోనే పొగడాలిట. ఇక మిత్రుల ఔదార్యాన్నీ, బంధువుల ఆదరణనీ వారి పరోక్షంలోనే చెప్పుకోవాలిట. అంటే, మనం మనమిత్రుల బంధువుల పరోక్షంలో వాళ్లగూర్చి ఏది అనుకుంటామో, అది వారిమీద మనకున్న నిజమైన అభిప్రాయ మౌతుందట. చెప్పిన పనిని పూర్తి చేసుకుని వచ్చాక మాత్రమే దాసులనీ, నెలసరి జీతంమీద పనిచేసే భృత్యులనీ పొగడాలిట.
ఇలా ఎప్పుడో ఒకప్పుడు పై వారినందఱినీ ఎలాగో ఒకలాగ పొగడవచ్చుటగానీ, తాము కన్న సంతానాన్ని మాత్రం ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ పొగడనే పొగడరాదట. ఇదిగో ఇలా మనసులోనే పరమానంద పడుతూ ఉండాలిట. నా ఆనందాన్ని నీకు మాత్రం అప్పుడప్పుడు చెప్పలేదా ? ఈ రోజు ఎందుకో వింతగా అడుగుతున్నావుగానీ' అన్నాడు.
ఈ మాటలు వింటూ ఆమె ఉబ్బితబ్బిబ్బవుతూంటే మళ్లీ ఆయనే 'పిల్లవాడి బాగుకోరిన ఏ తండ్రీ కూడా, వాళ్లి వాడి ఎదురుగా పొగడడుపొగడ కూడదు కూడ.
ఈ వయసులో వాడికి మహాపండితుణ్ణనే అహంకారం వస్తే వాడికిక విద్యాగంధం అబ్బక భ్రష్టుడై పోతాడు. 'పుత్ర శ్శత్రు రపండిత!' లోకంలో ఏ తండ్రికైనా నిజమైన శత్రువెవరంటే చదువురాని పుత్రుడేనటే' అంటూ భోజనాన్ని ముగించాడు.
ఈ మాటలని వింటూనే భారవి చెప్పలేని బాధతో అటకదిగి తండ్రికి సాష్టాంగపడి, ఆయన పాదాలని కన్నీటితో కడిగేసాడు. తాను చేయదలచిందంతా సవివరంగా చెప్పి తన తప్పుకి శిక్షని విధించవలసిందిగా తండ్రిని ప్రార్థించాడు.
10
అనగనగా....
భారవిలో పశ్చాత్తాపబుద్ధి కలిగినందుకెంతో సంతోషపడిన తండ్రి ' ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకుని ఒక శ్లోకాన్ని చెప్పవలసిం దన్నాడు. అంతే! క్షణంలో ఆశువుగా భారవి ఈ శ్లోకాన్ని చెప్పాడు.
సహసా విదధీత న క్రియామ్ అవివేక: పరమాపదాం పదమ్|
వృణుతే హి విమృశ్యకారిణం గుణలబా: స్వయమేవ సంపద:|
“ఏ పనినీ తొందర పాటు నిర్ణయంతో చేయకూడదు. 'తొందర' క్షణికావేశాన్ని కలిగిస్తుంది. ఆ క్షణికావేశం కారణంగా వ్యక్తి అవివేకి అవుతాడు. ఆ అవివేకం అనేక ఆపదలకి నిలయం. బాగా ఆలోచించి పనిచేసేవాల్లే సర్వశుభాలూ సంపదలూ వరిస్తాయి " అనే అర్థం కల ఈ శ్లోకాన్ని విని, భారవి తండ్రి మఠంత ఆనందపడి శిక్ష ముగిసిందన్నాడు భారవితో.
అయినా భారవి వినకుండా తన తప్పుకి ఏమైనా శిక్షని విధించ వలసిందేనని తండ్రిని పట్టుబట్టాడు. అయితే అత్తవారింటిలో ఆర్నెలలుండి రావలసిం'దని అన్నాడు తండ్రి. భారవికి అదొక శిక్ష అనిపించకపోయినా తండ్రిమాట ప్రకారం మర్నాడే భార్యతో అత్తవారింటికి వెళ్లాడు.
పండితుడూ-మంచికవిగా పేరొందినవాడూ-అందునా కొత్తల్లుడూను-అంటూ అత్తింటి వారు మొదట వారంరోజులూ భారవిని కాలు కింద పెట్టనీయలేదు.
రెండోవారం చూసీ చూడనట్టు వ్యవహరించారు.
మూడోవారం పనీపాటా లేక ఊరికే తినిపోదామని వచ్చినవాడు' గా తనని గూర్చి గుసగుసలాడారు.
నాలుగో వారానికి ఆమాట అననే అన్నారు.
ఐదోవారానికి ఇంటిపనీ, పొలంపనీ, ఇంటికి వచ్చి పోయే చుట్టాలపక్కాల మర్యాదలూ ..... ఇలా అప్పగించడం మొదలెట్టారు.
భర్తకి జరుగుతున్న ఈ అవమానం తనకేమాత్రమూ పట్టినట్టనిపించలేదు భారవి భార్యకి. అత్తారింటిలో ఆర్నెలలుండడంలో 'శిక్ష' ఎంత దాగుందో రోజు రోజుకీ తెలియ సాగింది భారవికీ.
మొదటివారంలోని మీగడ పెరుగూ పిండివంటల భోజనం క్రమంగా మూడోవారానికి మజ్జిగా ఆవకాయగా మాటి, ఆటో నెల ప్రారంభానికి
అనగనగా....
గంజి నీళ్ల స్థాయికి చేరింది. ఈ తిండికి తోడు అసమర్థుడూ, మేసేపోతూ, తిమ్మరాజూ వంటి బిరుదులని కూడ భారవి ఓర్పుతో భరించి ఆర్నెలలు నిండిన మజురోజే బయలు దేరుతూ తన రాకకి కారణాన్ని అత్తగారితో చెప్పి తండ్రి వద్దకి వచ్చి సాష్టాంగపడ్డాడు.
కన్నీటితోనే తల్లిదండ్రులిద్దటూ భారవిని దీవించారు. మహాకవి కాలిదాసు రచించిన రఘువంశం, మేఘసందేశం, కుమారసంభవం అనే మూడు కావ్యాలు-మాఘమహాకవి రాసిన శిశుపాలవధాకావ్యం, ఈ భారవి రాసిన కిరాతార్జునీయం అనే కావ్యంతో కలిపి మొత్తం ఈ ఐదింటినీ సంస్కృతంలో పంచకావ్యాలు అంటారు.
అలా సంస్కృతంలో ఏ అయిదు కావ్యాలని చదివితే భాష కరతలామలకమౌతుందో, ఆ పంచకావ్యాల్లో ఒకటైన కిరాతార్జునీయాన్ని రచించి, భారవి శాశ్వతుడయ్యాడు.
3. ఆ శ్లోకం నన్ను రక్షించింది.
11
అత్తారింటిలో ఉంటున్న కాలంలో, తనకంటూ ఓ సంపాదన లేని కారణంగా భారవిచేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోయింది. అదే సమయంలో పండక్కి తన భార్యకి చీర తేవలసి వచ్చింది కూడ. దిక్కుతోచక, తానురాసిన 'సహసా విదధీత న క్రియామ్ ..... ' అనే శ్లోకాన్నే ఒక తాటాకు మీద రాసి ఆ శ్లోకాన్ని ఆ ఊళ్లోనే ఒక వ్యాపారి వద్ద కుదువ పెట్టాడు భారవి.
ఆ సొమ్ముతో అప్పటికి పరువు నిల్చింది. ఆ తాకట్టు (కుదువ)ని విడిపించుకునేంతవరకూ శ్లోకాన్ని ఏ గ్రంథంలోనూ ఏ సభలోనూ భారవి చెప్పకూడదు సరికదా, ఆ శ్లోకాన్ని ఇంతకుముందు విన్న ఎవరైనా చదివినా అది తన శ్లోకమేనని అనకూడదు కూడా. అదీ నియమం.
ఆ శ్లోకాన్ని కుదువ పెట్టుకున్న బేహారి ఆ రాత్రే వ్యాపార నిమిత్తం పొరుగు దేశానికి బయలుదేరుతూ ఆ శ్లోకం ఇంటి చూరులో ఉందనీ, భారవి సొమ్మిచ్చినప్పుడు ఆ తాటాకుని ఆయనకిచ్చి వేయవచ్చు'ననీ భార్యకి చెప్పి వెళ్లాడు. ఆ వ్యాపారి బయలుదేరేనాటికి అతని భార్య రెండవ నెల గర్భవతి. .
వ్యాపారం నిమిత్తం వెళ్లిన బేహారి పన్నెండు సంవత్సరాలకి తిరిగి వచ్చాడు. ఉత్తర ప్రత్యుత్తరాలు రాసుకునే వీలు ఏమాత్రమూ లేని ఆ కాలంలో,
అనగనగా....
12)
వెళ్లిన వ్యక్తి తిరిగి వస్తేనే అతడు జీవించి ఉన్నట్టు లెక్క. పన్నెండేళ్లయిన కారణంగానూ, తాను వెళ్లేనాటికి 'తన భార్య గర్భవతి' అనే మాటని మఱచిన కారణంగానూ, తన ఇంట్లో ఒంటరిగా ఉండే భార్యకి తాను తెచ్చిన నగలని వెంటనే చూపించి ఆనందపరచాలనే ఉద్దేశ్యంతో ఆ అర్ధరాత్రివేళలోనే ఓడదిగి ఇంటికి తిన్నగా చరచరా వచ్చాడు వ్యాపారి.
ఆరు బయట పంచలో తన భార్య పక్కలో వేవొకడు పడుకొని ఉండడాన్ని చూసిన వ్యాపారికి కోపం, ద్వేషం-ఒక్కసారి మిన్నుముట్టాయి. ' తాను దూరంగా ఉన్న కారణంగా ఈమె ఇంతటి నీచానికి దిగజాటీం'దని అర్థమైన వ్యాపారి, తన ఒరలోని కత్తిని దూసి ఆమె తలమీద వేయడానికి పైకేత్తగానే, ఆ కత్తి మొన ఇంటిచూరుకి తగిలి, అక్కడ దాచి ఉంచిన భారవి శ్లోకం రాసి ఉన్న తాటాకు నేలన పడింది.
చూరునుండి పడింది ఒకతాటాకని అర్థమయింది వ్యాపారికి. దీపం వెలుగులో దానిలో ఏముందో చదివాడు.
'సహసా విదధీత న క్రియామ్....” 'తొందరపాటు నిర్ణయంతో ఏ పనినీ చేయకు. ఆలోచించి చేసిన పని ద్వారా సకలశుభాలూ సంపదలూ చేకూరుతాయి' అనే అర్థం ఉన్న ఆశ్లోకం కనిపించింది.
అంతే ! అప్పట్లో తను పెట్టుకున్న కుదువా...... తస విదేశీ ప్రయాణం.... అమె అప్పటికి గర్భవతిగా ఉండడం.... అన్నీ గుర్తుకి రావడమేకాక, తాను బయలుదేరేప్పుడు గర్భవతిగా ఉన్న తన భార్య, ఈ పిల్లవాణ్ణి ప్రసవించి ఉండి ఉంటుందని కూడా క్షణాల్లో అర్థమైపోయింది.
కత్తిమొనకి ఈ తాటాకే తగిలి నేలన పడి ఉండకపోతే, ఎంత దారుణం జరిగి ఉండేది! కన్నీళ్లు ధారగా కారుతుంటే భార్యాపుత్రుల్ని లేపి జరిగింది చెప్పి తన తప్పుని మన్నించవలసిందన్నాడు వ్యాపారి.
మఱునాడే సకుటుంబంగా భారవి ఉన్న గ్రామానికి వెళ్లిన వ్యాపారి, భారవిని విశేషంగా సత్కరించి "తనకుటుంబాన్ని నిలపడానికి 'శ్రీరామ రక్ష' అయిన ఆ శ్లోకం ఎందఱినో తొందరపాటు నుండి రక్షించగల"దని పలికి భారవి ఆశీస్సులని పొందాడు.
దీనితో భారవీ ఆయన శ్లోకమూ కూడ చిరస్థాయి అయినట్లే కదా !
అనగనగా....
13
ఎన్నో ఔషధాలలో ఏదో ఒక ఔషధం, ఎందతో రోగులలో ఎవరో ఒకరోగి మీద, ఎప్పుడో ఒకప్పుడైనా వికటించ వచ్చునేమో కానీ, ఇలాటి శ్లోకాలు ఎప్పుడూ ఎవరికీ హానిని కల్గించనే కల్గించవు. అందుకే ఆ కవుల చరిత్ర శాశ్వతం. వారి ప్రతి అక్షరం నిత్యసత్యం.