30, ఆగస్టు 2024, శుక్రవారం

ఆగష్టు, 31, 2024*🌹 *ధృగ్గణిత పంచాంగం*

 *卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*

       🍁 *శనివారం*🍁

🌹 *ఆగష్టు, 31, 2024*🌹

    *ధృగ్గణిత పంచాంగం*                   


*స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం* 

*దక్షిణాయణం - వర్షఋతౌః*  

*శ్రావణమాసం - కృష్ణపక్షం*


*తిథి     : త్రయోదశి* రా 03.40 తె వరకు ఉపరి *చతుర్ధశి*

*వారం    : శనివారం* (స్ధిరవాసరే)

*నక్షత్రం  : పుష్యమి* రా 07.39 వరకు ఉపరి *ఆశ్లేష*


*యోగం  : వరీయాన్* సా 05.39 వరకు ఉపరి *పరిఘ* 

*కరణం  : గరజి* మ 02.59 *వణజి* రా 03.40 తె ఉపరి *భద్ర*


*సాధారణ శుభ సమయాలు* 

*ఉ 10.30 - 01.00 సా 05.00 - 06.00*

అమృత కాలం  :*మ 12.48 - 02.31*

అభిజిత్ కాలం  : *ఉ 11.43 - 12.32*


*వర్జ్యం          : ఈరోజు లేదు*

*దుర్ముహూర్తం:ఉ 05.54 - 07.34*

*రాహు కాలం : ఉ 09.01 - 10.34*

గుళికకాళం      : *ఉ 05.54 - 07.27*

యమగండం    : *మ 01.41 - 03.14*

సూర్యరాశి : *సింహం* 

చంద్రరాశి : *కర్కాటకం*

ఉ 05.54 

సా 06.21

*ప్రయాణశూల   : తూర్పు దిక్కుకు పనికిరాదు*


*వైదిక విషయాలు*

ప్రాతః కాలం   :  *ఉ 05.54 - 08.23*

సంగవ కాలం   :*08.23 - 10.53*

మధ్యాహ్న కాలం :*10.53 - 01.22*

అపరాహ్న కాలం: *మ 01.22 - 03.52*

*ఆబ్ధికం తిధి:శ్రావణ బహుళ త్రయోదశి*

సాయంకాలం :  *సా 03.52 - 06.21*

ప్రదోష కాలం  :  *సా 06.21 - 08.40*

నిశీధి కాలం     :*రా 11.44 - 12.31*

బ్రాహ్మీ ముహూర్తం :   *తె 04.22 - 05.08*

______________________________

           🌷 *ప్రతినిత్యం*🌷

 *_గోమాతను 🐄 పూజించండి_* 

        *_గోమాతను 🐄 సంరక్షించండి_*


🌹 *శ్రీవేంకటేశపంచకస్తోత్రం*🌹


తారహీరక్షీరశార దాభ్రతారకేశకీర్తి 

విహార  మాదిమధ్య్ ఆన్తశూన్యమవ్యయమ్ ।

తారకాసురాటవీకుఠారమద్వితీయకం

నాగరాఙ్గిరీశ్వరం నమామి వేఙ్కటేశ్వరమ్ ॥ 

*॥ ఇతి శ్రీవేఙ్కటేశ్వరపఞ్చకస్తోత్రం సమ్పూర్ణమ్ ॥*


            🍁 *ఓం శ్రీ*🍁

🌹 *ఆంజనేయాయ నమః*🌹


🍁🪷🌹🛕🌹🌷🪷🌷🍁

*సర్వే జనాః సజ్జనో భవంతు !*

*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*

*సర్వే స్వజనా సుకృతో భవంతు !*

*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*

<><><><><><><><><><><><><><><>


         🌷 *సేకరణ*🌷

      🌹🌿🍁🍁🌿🌹

        *న్యాయపతి వేంకట*

       *లక్ష్మీ నరసింహా రావు*

      🌷🍃🍁🍁🍃🌷

 🌹🌷🍁🍁🍁🍁🌷🌹

శనివారం, త్రయోదశి

 *రేపు శనివారం, త్రయోదశి మరియు పుష్యమీనక్షత్రం అంటే శనినక్షత్రం.* అందువలన జాతకం లో శనిదోషాలు ఉన్న వారు శనీశ్వరునకు అభిషేకాద్యర్చనలు లేదా శనైశ్చరదోష నిరహరణార్థం పరమేశ్వరునకు రుద్రాభిషేకాద్యర్చనలు చేసుకోవడం, వారనియమాలు పాటించడం అనగా అభ్యంగన(తలంటు)స్నానము చేసి నువ్వులనూనె తో దీపారాధన చేసి శనీశ్వరుని పూజించి నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని నైవేద్యం పెట్టి దానిని గోవుకు సమర్పించి, ఏకభుక్తం(పగలు ఒకపూట మాత్రమేభోజనం) చేసి, మద్యమాంసాదులనూ ఉల్లిపాయలనూ విడిచిపెట్టి భూతలశయనంతో రాత్రి ని గడపడం వలన శనిదోషప్రభావం తగ్గుతుంది. రేపటి రోజు న తిష్యనక్షత్రయుత శనిత్రయోదశీప్రయుక్తముగా మన కల్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం లో ఉదయం 8 గంటలకు ప్రత్యేక అభిషేకాద్యర్చనలు నిర్వహించబడును. ఈ కార్యక్రమం లో  ప్రత్యక్షంగా నూ పరోక్షంగా నూ భక్తులు పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం లో గోత్రనామాలు చెప్పించుకునే ఆసక్తి గల భక్తులు వారి గోత్రనామాలు మాకు వాట్సాప్ చేయగలరు. మా వాట్సాప్ నంబర్ 9492050200.

యదార్థ సంఘటన*

 లండన్ బస్ డ్రైవర్ సమాధానం వినండి... ఆసక్తికరం కానీ యదార్థ సంఘటన*


 *ఒక అరబ్ ముస్లిం లండన్‌లో బస్సు ఎక్కాడు మరియు "బస్సులో పాశ్చాత్య సంగీతాన్ని ప్లే చేయడాన్ని వెంటనే ఆపమని" బస్సు డ్రైవర్‌ను అభ్యర్థించాడు.*


 *దీనికి కారణం ఏమిటని బస్సు డ్రైవర్ అడిగినప్పుడు, అరబ్ ముస్లిం ఇస్లాం బోధనల ప్రకారం, ప్రియమైన ప్రవక్త సమయంలో సంగీతం మరియు ముఖ్యంగా పాశ్చాత్య సంగీతం లేనందున సంగీతం వినడం హరామ్ అని చెప్పాడు.*


 *బస్సు డ్రైవర్ మర్యాదగా రేడియో స్విచ్ ఆఫ్ చేసాడు!*


 *బస్సు డోర్ తెరిచి అరబ్ ముస్లింని బస్సు దిగమని అభ్యర్థించాడు!*


 *దీనికి కారణం అడిగాడు అరబ్ ముస్లిం.*


 బస్ డ్రైవర్ మర్యాదగా సమాధానమిచ్చాడు - "ఓ అరబ్ సోదరా! ప్రియమైన ప్రవక్త కాలంలో టాక్సీలు లేవు, బస్సులు లేవు, బాంబులు లేవు, విమానం హైజాకర్లు లేవు, మసీదులో శబ్దం చేసే లౌడ్ స్పీకర్లు లేవు, ఆత్మాహుతి దాడులు లేవు, RDX లేదు, లేదు. AK 47, ప్రతిచోటా శాంతి మాత్రమే *అక్కడ ఉంది.*


 *ఎక్కడికైనా వెళ్లి ఇస్లాం పేరుతో డబుల్ ట్రిక్ ఆడండి.* *నిశ్శబ్దంగా దిగి ఒంటె గమ్యం చేరే వరకు వేచి ఉండండి.*..!!...

 :🙏ఈరోజు నేను వ్రాయవలసి వచ్చింది, మీరు తప్పక చదవండి🙏


 *నానక్ కంటే ముందు సిక్కు లేరు!*


 *ముహమ్మద్‌కు ముందు ముస్లిం లేడు!*


 రిషభదేవునికి ముందు జైనుడు లేడు!


 *బుద్ధుడికి ముందు బౌద్ధుడు లేడు!*


 కార్ల్ మార్క్స్ ముందు వామపక్షవాది లేడు!


 కానీ:

 *కృష్ణుని ముందు* *రాముడు...*

 *రాముడికి ముందు* *జమదగ్ని...*

 *జమదగ్ని*కి ముందు *అత్రి...*

 *అత్రికి ముందు* *అగస్త్యుడు...*

 *అగస్త్యుడికి ముందు* *పతంజలి...*

 *పతంజలి*కి ముందు *కనద్...*.


 కనడకు ముందు *యాజ్ఞవల్క్యుడు...*.


 యాజ్ఞివల్క్యుడు ముందు*...


 అందరూ *"సనాతన్ వేద"* అనుచరులు..!


 *"రాజకీయ చదరంగం" యొక్క ఈ -"12 ఎత్తుగడలు" జాగ్రత్తగా "చూసి అర్థం చేసుకోండి....?*


 *01*.

 *"మొఘలులు" "భారతీయులు" అయ్యారు...? మరి, "భారతీయులు., "కాఫిర్"...?*


 *02*.

 "ఘ్యాసుద్దీన్ ఖాన్":-


 మోతీలాల్, జవహర్‌లాల్ "నెహ్రూ"


 -ఇందిర, రాజీవ్, -మైనో అందరూ *"గాంధీ"* అయ్యారు..?


 మరి.., *"భారతీయులు", "మూర్ఖులు"....?*


 *03*.


 "మోమిన్" "కాశ్మీరీ" అయింది...?


 మరి, "కాశ్మీరీ పండితులు", "శరణార్థులు"....?


 *04*.


 "బంగ్లాదేశీయులు" "బెంగాలీలు" అయ్యారు....?


 మరి, "బెంగాలీలు", "బయటి హిందువులు".....?


 *05*.


 "సైనికుల" "కిల్లర్స్" మరియు


 "రాళ్లతో కొట్టేవారు"....*


 "ఆందోళనకారులు".....? మరియు, "సైన్యం",

 "మానవ హక్కుల ఉల్లంఘన"....?*


 *06*.


 *"తుక్డే-తుక్డే గ్యాంగ్" "దేశభక్తుడు" అయింది...?*


 మరియు, "పేట్రియాట్" "బ్రాండెడ్ హార్డ్కోర్ తీవ్రవాది.....?*


 *07*.

 "పైర్ వుడ్" "పర్యావరణ ఆందోళన"గా మారింది.....


 మరి, "ఖననం"లో వృధా అయిన భూమి "జన్మహక్కు" అయింది.....?


 *08*.

 "రాఖీ"లో వాడిన "ఉన్ని" "గొర్రెలను" "బాధ" చేసింది...?*


 *09*.

 "బుజ్జగింపు" "సెక్యులర్" అయింది.....?*


 అయితే, "సమానత్వం" "కమ్యూనల్" అయింది.....?*


 *10*.

 "RSS" "టెర్రరిస్ట్" అయింది...?*


 మరియు, "ఒసామా జీ"..., "హఫీజ్ సాహెబ్"..., మరియు -"హురియత్",

 "శాంతి శిఖరాలు"......


 *11*.

 *"భారత్ మాతా కీ జై"*,


 "కమ్యూనల్" అయ్యాడు....? మరియు,


 “భారత్ తేరే తుక్డే హోంగే”,


 "వ్యక్తీకరణ స్వేచ్ఛ" అయింది....?*


 *12*. “డివైడ్ అండ్ రూల్” “రూల్” అయింది....? మరి..,

 *“సబ్కా సాథ్ సబ్కా వికాస్” "జుమ్లా"?.*?


 కేవలం "ఆలోచించండి"...? మరియు "అర్థం చేసుకోండి"... అని


 *"అన్నింటికంటే" - "హిందూ మెజారిటీ దేశం"...,*


 "ఇదంతా" "ఎలా" జరిగింది...???


 మీరు ఇప్పుడే చదువుతారా? లేక దాన్ని కూడా ఫార్వర్డ్ చేస్తారా?

 లేదు, సరియైనదా ???


 నాకు తెలుసు


 *"హిందువులు" ఎవరు "మిగిలి"...?*!!!


 ఇలాగే నిద్రపోయారా.....? కాబట్టి -


 నీకు కూడా తెలియదా..?,


 "ఎప్పుడు"...


 మీరు "ఉగ్ర దేశానికి" "పౌరులు" అయ్యారు...?


 *"హిందువు" అయినందున, దీన్ని కనీసం "10 మందికి" లేదా -"సమూహం"కి పంపవలసిందిగా నేను మిమ్మల్ని "అభ్యర్థిస్తున్నాను".*


 ఈ సమాచారం అంతా ఎవరి అవిశ్రాంత ప్రయత్నాల ద్వారా సేకరించబడింది. దీన్ని మీ వద్ద ఉంచుకోకండి, మీ వేళ్లను ఉపయోగించి అన్ని హిందూ సోదరుల వాట్సాప్ గ్రూపులకు పంపండి.


 ధన్యవాదాలు

శాఖ చంద్ర న్యాయం - వేదాంతం

 

శాఖ చంద్ర న్యాయంవేదాంతం 

పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి బింబముగా కనపడతాడు, వెన్నెల పిండి ఆరబోసినట్లు గా ఉంటుంది కాబట్టి పున్నమి చంద్రుడు ప్రతివారికి ఆకాశం వైపుచూస్తే చాలు కనపడతాడుఇంకొక విశేషము ఏమిటంటే పున్నమి చంద్రుడు రాత్రి పూర్తిగా అంటే సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటలవరకు ఆకాశంలో ప్రకాశిస్తూవుంటాడు కాబట్టి రోజు రాత్రి చంద్రుని ఎవరు చూపించనవసరం లేకుండానే అందరు చూడగలరు

కానీ అమావాస్య మరుసటి రోజు చంద్రుడు రేఖామాత్రంగా ఉండి ఆకాశంలో కేవలం 48 నిమిషాలు మాత్రమే ఉంటాడు కాబట్టి రోజు అంటే అమావాస్య వెళ్లిన పాడ్యమి నాడు చంద్రుని చూడటం చాలా కష్టం. దానికి కారణం చంద్రుడు చిన్నగా ఉంటాడు మరియు కొద్ది సమయం మాత్రమే ఉంటాడు

ఒక గురువు గారు ఆకాశంలో వున్న చంద్రుని తన శిష్యునికి చేపించదలచారు అప్పుడు ఆయన ముందుగా అక్కడ వున్న ఒక చెట్టు కొమ్మను శిష్యునికి చూపించారు అది కంటికి దగ్గరగా వుంది కాబట్టి దాన్ని శిష్యుడు గుర్తించగలిగాడు. ఇక ఇప్పుడు చంద్రుని చూపించాలి దానికోసం గురువుగారు వృక్ష శాఖ లోని ఒక పత్రాన్ని చూపి దాని సందులో చంద్రుడు ఉన్నాడని చెప్పారు. తెలివైన శిష్యుడు   శాఖ మధ్యనుండి గురువుగారు చెప్పిన విధంగా నిశితంగా పరిశీలించి చూసి సూక్ష్మ మాత్రంగా ఉన్న చంద్రుడిని చూసాడుఒక్కసారి చంద్రుని చేస్తే తరువాత శిస్యునికి మరల వృక్ష శాఖతో నిమిత్తం లేదు ఆకాశంలో ఎటువంటి ఉపాధి లేకుండా చంద్రుని మరల చూడగలడు. ఎందుకంటె ఇప్పుడు శిష్యునికి చంద్రుడు ఎక్కడ వున్నదో పూర్తిగా జ్ఞ్యానం కలిగి వున్నాడు జ్ఞ్యానం కలిగే అంతవరకే శాఖ యొక్క ఉపయోగంఒక్కసారి శిష్యునికి చంద్రుని గూర్చిన జ్ఞానం కలిగిన తర్వాత శాఖ పూర్తిగా మరచిపోతారుకేవలం మనస్సు చంద్రుని మీద లగ్నాత చేయగలుగుతాడు.

నిజానికి చంద్రుని చూడడానికి వృక్ష శాఖ తో పనిలేదు. కానీ గురువుగారు వృక్ష శాఖను తన పనికి వాడుకున్నారుఎందుకంటె శిష్యుని దృష్టిని కేంద్రీకరించడానికి శాఖ ఒక ఉపయుక్తంగా లేక ఉపకరణంగా పనికి వచ్చిందిఅదే వృక్ష శాఖ లేదనుకోండి అప్పుడు గురువు గారు శిష్యునికి చంద్రుని చూపించడం కుదిరే పని కాదుఎందుకంటె పాడ్యమినాడు చంద్రుడు చాలా సూక్ష్మంగా ఉండటమే కాకుండా కేవలం ఆకాశంలో 48 నిమిషాలు మాత్రమే ఉంటాడుకాబట్టి శాఖ చంద్ర దర్శనానికి చాలా తోడ్పడ్డదని మనకు తెలుస్తున్నది.

ఇక విషయానికి వస్తే భగవంతుడు నామ రూప గుణ  రహితుడు మరి అటువంటప్పుడు భగవంతుని దర్శించుకోవడం ఎలా ఎందుకంటే మన ఇంద్రియాలు కేవలం సగుణాత్మకమైన రూపాలను మాత్రమే చూడగలవు. మనం చూసే దృశ్యమాన జగత్తులో భగవంతుని చూడలేము. కేవలము మనస్సును అంతరముఖం చేస్తేనే కానీ అది సాధ్యం కాదు.  మనస్సు ఎల్లప్పుడూ ఏదో ఒక భౌతికమైన విషయం మీదనే లగ్నం అవుతుంది అది ప్రస్తుతం వున్నదో లేక గతంలో వున్న దాని భావనో ఏదో ఒకటి కావచ్చుకాబట్టి మనస్సుకి ఒక చక్కటి శిక్షణ ఇవ్వాలి దానికోసం ముందుగా మనస్సుని ఏదో ఒక విషయం మీద స్థిరపరచాలి తరువాత నెమ్మదిగా శాఖమీది నుంచి దృష్టిని చంద్రుని వైపు మళ్లించినట్లు మనస్సుని భగవంతుని మీదకు మళ్లించవచ్చు.

కాబట్టి సాదాకా మన ఆరాధనా పద్దతులలో విగ్రహారాధన, యజ్ఞ యాగ, జపాది పద్ధతులు కేవలం సాధకుని మనస్సు స్థిరపరచటానికి ఏర్పాటు చేసిన విధానాలుగా మనం తెలుసుకోవాలి. ఒక విగ్రహారాధనను మనం చంద్రుని దర్శించుకోవడానికి ముందుగా శాఖను చూడటం లాగ తెలుసుకోవాలి. ఎలాగైతే చంద్రుని దర్శించుకున్న తర్వాత శాఖ ప్రయోజనం లేదో అలాగని నిరాకారుడైన నిర్గుణుడైన  భగవంతుని చేరుకొన్న సాధకునికి విగ్రహారాధన తో నిమిత్తం లేదుఇది తెలుసుకొని సాధనలో పట్టు సాధించాలి.

విగ్రహారాధన నుంచి మనస్సు నిరాకారుని వైపు మళ్లించటం చెప్పినంత తేలిక కాదు నిరంతర అకుంఠిత సాధన చేస్తేనే కానీ అది సాధించగలడుపట్టుదల, అవిరామ కృషి మాత్రమే సాధకుని దీక్షను ముందుకు సాగించగలవుసాధనలో ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు, సాధకబాధకాలు వస్తూ వుంటాయికానీ నిజమైన సాధకుడు వాటినన్నిటిని అధిగమించి తన సాధనను ముందుకు కొనసాగించాలినిజానికి ఆధ్యాత్మిక జీవనం చాలా కష్టతరమైనది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇసుకను పిండి నూనెను పట్టినట్టు. ఎంతో దుర్లభమైన సాధన చేస్తే కానీ మోక్షం సిద్దించదు. సద్గురువు మనకు చంద్రుని చూడటానికి శాఖ ఉపకరించినట్లుగా మాత్రమే సాధకునికి సహాయం చేయగలడు. చంద్రుని చూసినతరువాట్ ఎలాగైతే మనకు శాఖతో పనిలేదో అదేవిధంగా సాధన సిద్దించినతరువాట్ సాధకునికి సత్ గురువుతో పనిలేదు.  మనకు అనేకమంది వాచా వేదాంతులు తారసపడి మనలను తప్పుడు త్రోవలో పంపడానికి ప్రయత్నిస్తుంటారు వారిని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలిముఖ్యంగా రోజుల్లో నిజమైన సాధకులు చాలా తక్కువగా వున్నారో లేక లేరో నాకు ఇంకా పూర్తిగా తెలియడం లేదు. ఒక్క మాట మాత్రం చెప్పగలను మన చుట్టూ వున్న సమాజంలో మాత్రం నిజమైన సాధకులు లేకపోవచ్చు. ఎక్కడో అరణ్యాలలోనో లేక హిమాలయాలలోనో ఉంటే ఉండవచ్చు. ఫై ఫై డాంబికాలు పోయి తామే సద్గురువులమనే కుహనా వేదాంతులు మనకు అడుగడుగునా కనిపిస్తారువారితో జాగ్రత్త. కొంతమంది గురువులే దైవం అని తలచి గురువులకు పూజలు చేయటం కూడా మనం చూస్తూవున్నాము. నిజానికి ఒక గురువు సాధకునికి మార్గదర్శకత్వం వహించే వాడే కానీ అంతకు మించి కాదు. నిరాంబరుడు, ధనాపేక్ష లేని సద్గురువుని ఆశ్రయిస్తేనే సాధకుడు బ్రహ్మ జ్ఞాన వంతుడు కాగలడు  నీగమ్యం నిర్ధారించుకొని అడుగు ముందుకు వేయి.

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

చేరువేల భార్గవ శర్మ

 

హిమగిరి సొగసులు

 హిమగిరి సొగసులు

          

   ----------------------------- 


           చం: " అటజని గాంచె , భూమిసురుఁ డంబర చుంబి శిరస్సర ఝ్ఝరీ


                        పటల ముహుర్ముహుర్లుట దభంగ తరంగ మృదంగ నిస్వన  


                        స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్


                        దటక చరత్కరేణు కర కంపిత సాలము, శీత శైలమున్ ;

              

                             మనుచరిత్రము- అల్లసాని పెద్దన! 


              హిమాలయమును వర్ణించు అద్భుతమైన యీపద్యము పెద్దన గారిది. ఆంధ్ర కవితా పితామహునిగా, తొలిప్రబంథనిర్మాతగా, రాయలచే గండపెండేరమును దొడిగించుకొనిన కవిపుంగవునిగా పెద్దన ప్రశస్తినందినవాడు.

వయసా,వచసా ,వర్ఛసా పెద్దన పెద్దయే! వర్ణనల లోనేగాక కథాకథనమున సిధ్ధహస్తుడు. " అల్లసానివాని యల్లిక

జిగిబిగి "- యను ప్రశంస యతని గొప్పతనమునకు ప్రతీక!


                     అరుణాస్పద నగరమున ప్రవరుడను నాహితాగ్ని వసించును. అతనికి తీర్థయాత్రపై మక్కువ.కానీ

తీరికయేలేదు. ఒకనాడు అతిథిగా వచ్చిన సిధ్ధుని వలన పాదలేపనమును పొంది, ఆకాశగమనమున హిమగిరి

కరుదెంచెను.


             కం: ఆమందిడి యతడరిగిన


                  భూమీ సురుఁడేగె, తుహిన భూధర శృంగ


                  శ్యామల కోమల కానన  


                 హేమాఢ్య దరీ ఝరీ నిరీక్షా పేక్షన్; 


                          ఆతరువాతి పద్యమిది. కొంచెం అర్ధం వివరిస్తా!  


               అర్ధ వివరణము: భూమిసురుడు- బ్రాహ్మణుడు (ప్రవరుడు) అంబరచుంబి- ఆకాశమును ముద్దిడుచున్న; శిరత్- శరసులనుండి (శిఖరములనుండి) ఝరీ- కొండకాలువలయొక్క; పటల- సముదాయముపు: మహుర్ముహుః- మాటిమాటికి

లుఠత్- క్రిందకు జారిపడు; అభంగ- విరుగని; తరంగ- కెరటములను; మృదంగ- మద్దెలలయొక్త ; నిస్వన- ధ్వనులకు; నటనానుకూల-

నాట్యానుకూలముగా; స్ఫుటత్-స్పష్టపడుచున్న; పరిఫుల్ల- బాగుగా విప్పుకొన్న ;కలాపి- నెమళయొక్క; కలాపిజాలమున్: పింఛముల

సముదాయములు గలదానిని, తటక: కొండ చఱియలయందు; చరత్-తిరుగాడు; కరేణు- ఏనుగుల; కర-తొండములచే;కంపిత- వంపబడుచున్న ;సాలమున్-మద్దిచెట్లు గలదియు అగు; శీతశైలమున్: హిమగిరిని:; అటజని- అటకుబోయి; కాంచెన్-చూచెను.


          భావము: పాద లేపనం సాయంతో యెగిరి వచ్చిన ప్రవరుఁడు. హిమాలయ పర్వతమును జూచాడు. అదియెలావుంది?

చాలాయెత్తుగా ఉంది. దానిశిఖరాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆగిరి శిఖరమునుండి కొండకాలువలు క్రిందకు జారిపడుతున్నాయి. ఆప్రవాహాల మ్రోతలు మద్దెలల ధ్వనుల ననుకరిస్తున్నాయి. ఆధ్వనుల కనుకూలంగా నెమళ్ళు పురులు విప్పి నాట్యం చేస్తున్నాయి. ఆకొండ చఱియలలో విస్తారంగా ఏనుగులున్నాయి. అవి అక్కడి మద్దిచెట్ల కొమ్మలను తొండములతో వంచి ఆకులను మేస్తున్నాయి. 


                          ఇదీ మంచుకొండ దృశ్యము! ఈదృశ్యాన్ని కవితా కమనీయంగా పెద్దన వివరించిన తీరు అద్భుతమైనది.

           

           " అంబరచుంబి.......... 

 ఇత్యాదిగా నారంభమైన యా సుదీర్ఘసమాసము హిమాలయముల ఉన్నతికి నిదర్శనము. కొండ శిఖరములనుండి సెలయేటి ప్రవాహ ములు జాలువారుట, మిగుల సుందరతర దృశ్యము. సెలయేటి మ్రోతలు మద్దెల ధ్వానముల నుపమించుట,తదనుగుణముగా నెమలి గుంపులయాటలు మంజుల మనోహర దృశ్యములు. కొండచఱియలలో యేనుగులు విహరించుట ఆహిమగిరి శక్తికి నిదర్శనము. మద్దివృక్షముల కొమ్మలను వంచుట ఇత్యాదులు అచటి వృక్షసంపదకు సంకేతము. 


                         కొండలయున్నతి ఆకాశమంటుట చే నతిశయోక్తియు, అభంగతరంగముల ధ్వానము మద్దెలమ్రోతలపై నారోపణము చేయుట చే రూపకము, వెరసి "రూపకాను ప్రాణిత అతిశయోక్తి యలంకారము"- ఇందుచెప్పబడినది.


                     అసమాన మైన పదాడంబరము, సుదీర్ఘసమాసములు, పాఠకుల కలవిగాని యానందాశ్చర్యములను కలిగించు

చున్నవి గదా! ఇదీ పెద్దన గారి వర్ణనలోని గొప్పదనము!


                                                                        స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

సైబర్ నేరాల పట్ల జాగ్రత్త*

 తిరుపతి జిల్లా..


*తిరుపతి జిల్లా సైబర్ క్రైమ్ పోలీసు వారి విజ్ఞప్తి..*


*సైబర్ నేరాల పట్ల జాగ్రత్త*


*సైబర్ నేరాల స్టైలే వేరు* 

*రూటు మార్చిన సైబర్* *కేటుగాళ్లు*


 మీ పేరు పైన గానీ లేదా మీ కుమారుడు/కుమార్తె పేరు పైన గాని ఒక పార్సెల్ వచ్చిందని, అందులో ఒక లాప్టాప్ మరియు మాదక ద్రవ్యాలకు సంబంధించిన కొకైన్, డ్రగ్స్ ఉన్నట్లుగా గుర్తించామని ముంబై కస్టమ్స్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ యూనిఫామ్ ధరించిన ఒక అపరిచిత వ్యక్తి నుంచి మీకు వీడియో కాల్ గాని లేదా నార్మల్ కాల్ గాని చేసి మిమ్మల్ని భయపెడతారు..


 వెంటనే ఈ కేసు నుంచి బయటపడాలంటే తాము చెప్పిన అకౌంట్ కి Rs.50,000/- ట్రాన్స్ఫర్ చేయాలని, ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఈ మొత్తాన్ని తిరిగి మీ అకౌంట్ కి పంపిస్తామని చెప్పి మభ్యపెడతారు..


 ఇలాంటి అపరిచిత కాల్స్ వచ్చినప్పుడు వెంటనే నేను ఎటువంటి ఆర్డర్స్ పెట్టలేదని చెప్పి, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేస్తానని కాల్ కట్ చేసి, ఆ ఫోన్ నంబర్ను బ్లాక్ లిస్టులో పెట్టాలి..


 అపరిచిత కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, మీ వ్యక్తిగత పిన్ నెంబర్ మరియు ఓటీపీలను షేర్ చేయకుండా ఉండాలని జిల్లా ఎస్పీ. శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపిఎస్ , గారు విజ్ఞప్తి చేశారు..

దైవ సన్నిధి

  28, జనవరి 2023, శనివారం


 దైవ సన్నిధి 


తిరుమల కొండమీద కాలుపెట్టినది మొదలు ఏదోతెలియని ఒక దివ్య మనోభావన నిజానికి మనం భూమిమీదనే వున్నా సాక్షాత్తు ఆ వైకుంఠానికి వచ్చినంతగా మనం  ఆనందపడతాము. అందుకేనేమో కలియుగ వైకుంఠంగా తిరుమల క్షేత్రాన్ని అభివర్ణించారు. అక్కడ మన ఊరువారు ఎవరైనాకనపడితే మీకు దర్శనం అయ్యిందా, లేదండి ఇందాకనే వచ్చాము ఇంకాదర్శనం కాలేదు,  మా టికెట్లు సాయంత్రం 3 గంటలకు మేము ముందే బుక్ చేసుకున్నాము. అని ఇలా అనేక విధాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి గూర్చే ముచ్చటిస్తూవుంటారు.  నిజం చెప్పాలంటే తిరుమల కొండమీద గడిపిన రెండు మూడు రోజులు ప్రతివారు వారి నిత్య సాధారణ జీవితాన్ని పూర్తిగా మరచి కేవలం స్వామి గూర్చి మాత్రమే ఆలోచిస్తారు. దర్శనం టికెట్ కొనలేనివారు, దొరకని వారు గంటలకొద్దీ క్యూ షెడ్లలో ఉండి మరి స్వామివారి దర్శనం చేసుకోవటం కోసం ఎదురుచూస్తారు. అయ్యో ఇంతసేపు నేను క్యూలో ఉండాలా అని ఏమాత్రం సంకోచించరు  గోవిందా, గోవిందా అని గోవిందనామ స్మరణతో తిరుమల అంతా మారుమోగుతోంది.  అక్కడ ఉన్నంతసేపు త్రాగమా, తిన్నామా అనే భావన కూడా కలుగదు అంటే ఆకలి దప్పులు వేయవన్నమాట. మనుషులంతా గుండు చేయించుకొని వీధులమీద దర్శనమ్ ఇస్తారు. జుట్టుతో వున్నవారు అతితక్కువ మంది కనపడాతారు. గుండు చేయించుకోలేదు అంటే వాళ్ళు అప్పుడే బస్సు దిగారని అర్ధం. ఇదంతా యెట్లా సాధ్యం అంటే అదంతా అదేవ దేవుడి లీల అని అంటారు. 


దాదాపు తిరుమల దర్శించుకున్న భక్తులు అందరు తలనీలాలు సమర్పించటం అంటే గుండు చేయించుకోవటం ఆనవాయితీ. పిల్లలు ఎవరైనా నేను గుండు చేయించుకొని అంటే తప్పు అట్లా అనకూడదు కళ్ళు పోతాయి అని తల్లిదండ్రులు పిల్లలకు బలవంతంగా మరి గుండు చేయించటం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది స్త్రీలు కూడా శిరోముండనం చేయించుకోవటం మనమెరుగుదము. ఇప్పుడు స్త్రీల నిమిత్తం నారి క్షురకులని దేవస్థానం ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ముందుగా గుండు చేయించుకొని అటు పిమ్మటే స్వామి దర్శనం.  కొంతమంది ఆన్లైనులో ఇంటివద్దనే పూర్తీ కార్య క్రమాన్ని (ప్రోగ్రాం) నిర్ణయించుకొని తిరుపతికి రావటం మనమెరుగుదము.  మనిషికి దేహవ్యామోహాన్ని కలుగచేసేది ముఖము అందునా సుందరమైన కేశాలు దేహసౌందర్యాన్ని ఇనుమిడింప చేస్తాయి. అంటే ఒక మనిషి తాను అందంగా వున్నాను అనుకోవటానికి మూల కారణం  కేశాలు. కేశాలు నిర్ములిస్తే దేహ సౌందర్యం పూర్తిగా పోతుంది.  అందుకేనేమో ఈ ముండనవిధి.  శరీరం అందంగా .లేదని ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో అప్పుడు దేహవ్యామోహం వదిలి మనస్సు దైవం వైపు మళ్లుతుంది. మన ధర్మంలో సన్యాసులు ముండనం చేసుకొని ఉండటం చూస్తున్నాము. ఏతావాతా తేలేది ఏమిటంటే మనం దేహవ్యామోహం వదిలి దైవ చింతన చేయాలని.మాత్రమే  


సముద్రమట్టానికి ఎగువకు వెళుతున్నకొద్దీ అంటే సముద్రమట్టానికన్నా ఎక్కువ ఎత్తుకు వెళితే మనకు వాతావరణ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వస్తాయి అవి వాతావరణ పీడనం, గురుత్వాకర్షణ శక్తిలో తేడా, అంతే కాకుండా గాలిలో ఆక్సిజన్ శాతంలో మార్పు ఇలా అనేకమైన తేడాలు కలుగుతాయి. అందుకే మనకు భూమికన్నా ఎంతో ఎత్తుమీద విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎత్తయిన ప్రదేశాలలో మనిషి మనస్సు ప్రశాంతముగా,  సంతోషంగా,ఆనందంగా ఉంటుంది అన్నది నిజం. ఈ సత్యాన్ని  మన మహర్షులు ఎప్పుడో తెలుసుకున్నారు. ఆ మానసిక స్థితే మనిషిలో ఆత్యాత్మికతను మేల్కొలుపుతుంది. అందుకే  ఎత్తైన గుట్టలమీద, కొండలమీద దేవాలయాలు నిర్మించారు.  ఎప్పుడో నిర్మించిన దేవాలయాలు ఇప్పటికి పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతూవున్నాయి. ఆయా దేవాలయాల్లో నెలకొన్న దేవుళ్ళు  భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారు. హిందుత్వంలో ప్రతిదీ శాస్త్రేయత కలిగి ఉంటుంది.  అంతరార్ధం తెలుసుకోలేని మూర్ఖులకు అది అర్ధం కాదు. 


తిరుమల కొండమీద రోజు కొన్ని లక్షలమంది వస్తున్నారంటే దానికి కారణం కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రమే కానీ మరొకటి కాదు. ఏడుకొండలు వున్నాయి కానీ ఇతర కొండలమీదికి ఒక్కరు కూడా వెళ్ళరు. ప్రతి భక్తుడు తిరుమలలో వున్నన్ని రోజులు తాను పూర్తిగా దైవ సన్నిధిలో ఉన్నట్లు భావిస్తాడు.  అంతే కాదు ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క రీతిలో స్వామి అనుగ్రహించినట్లు చెప్పుకుంటారు. ఒక్కసారి తిరుమలకు వచ్చిన భక్తుడు ఇంటికి వెళ్లిన తరువాత కొన్నిరోజుల వరకు తిరుమల విశేషాలు చేర్చించుకుంటూ ఆనందిస్తాడు.  ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల యాత్ర ఒక ఆనందానుభూతితో కూడిన అనుభవం.  ఈ అనుభవం ఈ వ్యాసం చదువుతున్న వారందరు పొంది వుంటారు అంటే అతిశయోక్తి కాదేమో. 


తిరుమల వెళ్లకుండానే నీకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే, నీకు తిరుమల కొండమీద వున్నప్పుడు కలిగే దైవ సన్నిధి అనే ఆనందభావన నీ ఇంట్లోనే కలిగితే యెట్లా ఉంటుంది.  ఆలోచించటానికి చాలా  బాగుంటుంది. కానీ అది యెట్లా సాధ్యం ఎట్టి పరిస్థితిలోకూడా సాధ్యం కాదు ఆలా అని ప్రతివారు అంటారు.  మన ధర్మంలో వున్న గొప్పతనం ఏమిటంటే ఒక నోము, వ్రతము, యజ్ఞ యాగాది క్రతువులు, దేవాలయాలలో దైవ దర్శనం ఇలా కొన్ని సత్ కర్మలు చేయటం వలన మానసికోల్లాసము కలిగి దివ్యమైన ఆనందానుభూతులు పొందుతాము.  తత్ద్వారా  ఏ లక్ష్యంతో ఆ య  సత్కర్మలు ఆచరించారో  ఆ యా లక్ష్య సిద్ది అంటే కోరికలు ఈడేరుతాయి ఒక్కమాటలో చెప్పాలంటే మునకు మన మీద మనకు తెలియకుండా పనిచేసే దైవ శక్తి ప్రేరితం అయ్యి ఆ ఫలితాలను ఇస్తుంది. 


తిరుమలలో ఉన్నంత కాలం ప్రతి భక్తుడు స్వామి సన్నిధిలోనే అంటే ఆయన రాజ్యంలోనే వున్నాడని తనను ఆ శ్రీ వెంకటేశ్వర స్వామే కాపాడుతాడనే ప్రఘాఢ విస్వాసంతో  ఉంటాడు. నిజానికి భక్తుని విశ్వాసమే భగవంతుడు, కాబట్టి తప్పకుండ భగవంతుడు కాపాడుతాడు. "మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః" అని అన్నారు కదా కాబట్టి ఎప్పుడైతే మనిషి మనస్సు పరిశుద్ధంగా దైవస్మరణతో ఉంటుందో అప్పుడు అది తేజోమయంగా, శుద్ధంగా ఉండి ధనాత్మకపు ఆలోచనలు  వస్తాయి. దాని పర్యవసానమే ఆ సత్కర్మ ఫలితాలుగా మనం పేర్కొనవచ్చు.  అందుకే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయి. సాధకుడు ఒక భక్తుడు తిరుమల కొండమీద పొందిన ఆనందానుభూతి తన ఇంట్లో, లేక ఏ చెట్టుకిందనో, నది వడ్డునో, కూడా పొందగలడు అది ఎట్లాగో చూద్దాం. 


చిన్న పిల్లవానికి సైకిలు త్రొక్కటం రాదు అప్పుడు వాడి తండ్రిగారో లేక అన్నగారో సైకిలు పట్టుకొని కొంత సమయం ఊతం ఇచ్చి నేర్పితే అప్పుడు బాలుడు స్వతంత్రంగా సైకిలు  త్రొక్కగలడు. అదేవిధంగా మనలో ఉన్న దైవశక్తిని తెలుసుకోలేక పోవటంచేత మనం కూడా సైకిలు నేర్చుకునే బాలుడు తన తండ్రిగారి మీద ఆధార పడినట్లు మనం భగవంతుని మీద బాహ్యంగా ఆధార పడాలి దానికోసమే తీర్ధాలు,  క్షేత్రాలు. నిజానికి తీర్థక్షేత్ర దర్శనం కేవలం మనలోని దైవాన్ని తెలుసుకోవటం కోసం తీసుకునే శిక్షణ  మాత్రమే. కానీ ఒక సాధకుడు భగవంతుని దర్శించటం కేవలం తనలోనే అనే విషయం తెలుసుకోవాలి. 


భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మనిషి ఎప్పుడైతే అంతర్ముఖుడు అవుతాడో అప్పుడు తనకు తెలుస్తుంది భగవంతుడు బయట కాదు అంతరంగంలో వున్నాడని అప్పటినుంచి అసలైన వెతుకులాట మొదలవుతుంది అదే సాధనకు నాంది పలుకుతుంది. అప్పుడు సాధకుడు తిరుమల కొండమీద చేసినవే జీవితాంతం చేసి మోక్షాన్ని పొందుతాడు.  కొండమీద ఏమిచేసాడు అని ఆలోచిస్తే ముందుగా కొండ ఎక్కగానే గుండు చేయించుకున్నాడు అలానే తాను మోక్షాన్ని పొందాలనుకునే సాధకుడు దేహవ్యామోహాన్ని తొలగించుకోవటానికి సదా ముండనం చేసుకొని ఉంటాడు.  కొండమీద ఏరకంగా అయితే నిరంతర భగవత్ సంకీర్తనం చేస్తూ ఉంటాడో అలాగే సాధకుడు కూడా నిత్యం ఆ భగవంతునే స్మరిస్తూ భగవంతునిలోనే లీనమై వుంటూ నిరంతర సాధన చేస్తూ ఆత్మలోనే లయం అయి ఉంటాడు.  తత్ ద్వారా జీవన్ముక్తి పొందుతాడు.  సాధన ఎలా చేయాలి ఏ ఏ నియమాలు పాటించాలి అనేవి ఒక సత్ గురువు ద్వారా శిక్షణ పొంది ఆత్మా జ్ఞ్యానాన్ని పొందాలి.


ఓం తత్సత్ 


 ఓం శాంతి శాంతి శాంతిః 


మీ 


భార్గవ శర్మ

అమరత్వం మరియు వృద్ధాప్యం

 మృత్యువుకు ప్రతి ఒక్కరూ భయపడతారు కానీ జనన మరణాలు సృష్టి నియమాలు..... విశ్వం యొక్క సమతుల్యతకు ఇది చాలా అవసరం. లేకపోతే, మానవులు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయిస్తారు. ఎలా? ఈ కథ చదవండి... 


        ఒకసారి ఒక రాజు తన రాజ్యం వెలుపల ఒక చెట్టు క్రింద కూర్చున్న సన్యాసి వద్దకు వెళ్ళాడు. అతనిని కలిసి "ఓ స్వామీ! నేను అమరత్వం పొందగలిగే మూలికా ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు తెలియజేయండి" అని అడిగాడు. అప్పుడా సన్యాసి "ఓ రాజా ! దయచేసి మీరు ఎదురుగా వున్న రెండు పర్వతాలను దాటండి.అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది. దాని నీరు త్రాగండి. మీరు అమరత్వం పొందుతారు."అని చెప్పాడు. 


         రెండు పర్వతాలు దాటిన తర్వాత రాజుకు ఒక సరస్సు కనిపించింది. అతను నీరు తాగడానికి  వెళ్ళబోతున్నప్పుడు అతనికి బాధాకరమైన మూలుగులు వినిపించాయి. అతను నీరు తాగకుండా ఆ గొంతును అనుసరించాడు. చాలా బలహీనమైన వ్యక్తి ఒకడు పడుకుని నొప్పితో బాధపడుతున్నాడు. రాజు కారణం అడగగా... 


        "నేను సరస్సులోని నీటిని తాగి అమరుడనయ్యాను. నాకు నూరేళ్లు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటి వేశాడు.గత యాభై ఏళ్లుగా నన్ను చూసుకునే వారు లేకుండా పడి వున్నాను. నా కొడుకు చనిపోయాడు. నా మనుమలు ఇప్పుడు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు త్రాగటం మానేశాను.అయినా నేను ఇంకా బ్రతికే ఉన్నాను."


          రాజు ఆలోచించాడు... "అమరత్వం మరియు వృద్ధాప్యం యొక్క ప్రయోజనం ఏమిటి ? నేను అమరత్వంతో పాటు యవ్వనం పొందితే?" పరిష్కారం కోసం మళ్లీ సన్యాసి దగ్గరకెళ్ళి అడిగాడు. "నాకు అమరత్వంతో పాటు యవ్వనంకూడా లభించే మార్గం తెలుపండి "అని


         సన్యాసి ఇలా అన్నాడు... "సరస్సు దాటిన తర్వాత మీకు మరొక పర్వతం కనిపిస్తుంది. దాన్ని కూడా దాటండి. అక్కడ మీకు పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది, వాటిలో ఒకటి తీసుకుని తినండి. మీరు అమరత్వంతో పాటు యవ్వనం కూడా పొందుతారు." 


         రాజు బయలుదేరి మరో పర్వతాన్ని దాటాడు.అక్కడ  అతనికి పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపించింది. పండ్లను తెంపి తినబోతుంటే... కొందరు గట్టిగా అరస్తూ పోట్లాడుకోవడం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు పోట్లాడుకుంటారని ఆలోచించాడు.


         నలుగురు యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశాడు. అలా వాదించుకుంటూ ఈ మారు మూలలో పోట్లాడుకోవడానికి కారణం ఏమిటని రాజు వాళ్ళని అడిగాడు. వారిలో ఒకరు "నాకు 250 ఏళ్లు, నా కుడి వైపున ఉన్న వ్యక్తికి 300 సంవత్సరాలు. అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. రాజు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు..."నా కుడి వైపున మా నాన్న వున్నాడు. అతనికి 350 సంవత్సరాల వయస్సు. అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు, నేను నా కొడుకుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి వున్న 400 సంవత్సరాల వయస్సు గల అతని తండ్రిని సూచించాడు. ఆస్తి కోసం  అంతులేని మా పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుండి వెళ్లగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు. 


         రాజు దిగ్భ్రాంతికి గురై  సన్యాసి వద్దకు తిరిగి వచ్చి...


      *"మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియచేసినoదుకు ధన్యవాదాలు"* అన్నాడు.  


        అపుడు ఆ సన్యాసి ఇలా అన్నారు...


     _*మరణం ఉంది కాబట్టి ప్రపంచంలో ప్రేమ ఉంది*_


        "మరణాన్ని నివారించే బదులు,మీ ప్రతి రోజూ, ప్రతి క్షణం సంతోషంగా జీవించండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి. అపుడు ప్రపంచం మారుతుంది. 


1.మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానం (పవిత్ర స్నానం) లాగా ఉంటుంది. 

2. ఆహారం తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం అవుతుంది 

3. నడిచేటప్పుడు జపిస్తే అది తీర్థయాత్ర  లాగా ఉంటుంది 

4. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహా ప్రసాదం అవుతుంది.

5. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్ర లాగా ఉంటుంది .

6. పనిచేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది. 

7.ఇంట్లో జపిస్తే దేవాలయం అవుతుంది. 🙏

దేవాలయాలు - పూజలు 26*

 *దేవాలయాలు - పూజలు 26*


సభ్యులకు నమస్కారములు.


*నైవేద్యము - ప్రసాదములు 2*   ఆయా దేవాలయాలను బట్టి గాని భక్తులు వారి వారి గృహములలో అనుసరించు సంప్రదాయముల ప్రకారము నైవేద్య పదార్థాలు ఉండగలవు. శాఖాహారము కావచ్చును లేక మాంసాహారము కావచ్చును. సాధారణంగా శిష్టాచార  దేవాలయాలలో, గృహాలలో శాఖాహారమే నైవేద్యంగా ఉంటుంది. గ్రామ దేవతల గుడులలో కొన్ని ప్రత్యేక సమయాలలో,  దినాలలో మాంసాహార పదార్థాలు, వంటకాలు నైవేద్యంగా సమర్పించబడుతాయి.  భగవన్నివేదన చేసే నైవేద్యాలలో అత్యధిక శాతం శాఖాహారమే  ఉంటుందనుటలో సందేహము లేదు. గృహాలలో నైవేద్యంలో బెల్లము, కొబ్బెఱ మరియు నెయ్యికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. 


*నైవేద్యాలలో వివిధములు*

1) ఫలములు:-  కదళీ ఫలము = అరటి పండు, కాశ్మీర ఫలము = సేపు పండు, అమలకం = ఉసిరి పండు, శుష్క ద్రాక్ష = ఎండు ద్రాక్ష, కిస్ మిస్,  నారికేళ ఖండ ద్వయం = కొబ్బరి చిప్పలు, భాగాలు, మాది ఫలం= దబ్బ పండు ఇత్యాది.

2) *నిత్య దినుసులు* 

1) శర్కర = చక్కర, 2) మధు = తేనె, 3) క్షీరం = పాలు, 4) దధి= పెరుగు, 5) పృథక్ = అటుకులు, 6) నవ నీతం = వెన్న, 7) గుడం = బెల్లం మున్నగునవి.

3) *విశేష నివేదనములు*

1) ప్రుథక్ పాయస = అటుకుల పాయసం, 

2) స్నిగ్ధౌధనం = తెల్లటి అన్నము, 

3) మరీచ్యన్నము = కట్టు పొంగలి,

 4) సపాదక భక్షం = గోధుమనూక ప్రసాదం, 

5) క్షీరాన్నం= పరమాన్నం, 

6) చిత్రాన్నం = పులిహోర,  

7) దధ్ధ్యోజనం=పెరుగన్నం

8) కదంబం= కూరగాయలతో కలసిన పులుసన్నం...ఇంకా ఎన్నెన్నో....


*కొన్ని నియమాలు*

1) దేవాలయాలలో  మరియు గృహాలలో తప్పనిసరిగా ఇంటి వంటకాలనే నైవేద్యంగా సమర్పించాలి.

2) ముఖ్యంగా  గడప దాటి వచ్చిన ఆహార పదార్థాలు, వంటకాలు భగవత్ నివేదనకి పనికి రావు ,అర్హత ఉండదు. చాల మంది భక్తులు  తీపి పదార్థాలు (Sweets) అంగడి (Shops) లో కొనుగోలు చేసి దేవాలయాలలో ఇస్తూ ఉంటారు. *ఆ పదార్థాలు అనేకానేక అశౌచములకు గురియై ఉంటాయి,.... ఉండవచ్చును*. 

3) *ద్రవ్యశుద్ధి ముఖ్యము*. నైవేద్య పదార్థాలు సక్రమార్జితమా, , అక్రమార్జితమా లేక హింసా మార్గ  ఆర్జితమా అను విచక్షణ ఆలయ యాజమాన్యానికి, అర్చక స్వాములకు మరియు గృహస్థులకు ఉండాలి. ద్రవ్య శుద్ధి లోపించిన,  దోష మార్గాన ఆర్జిత వస్తువులు భగవత్ నివేదనకు అనర్హము.

4) నైవేద్య ఆహారాలలో ఉల్లి, వెల్లుల్లి, పుట్ట గొడుగులు, ఇతర మసాలా *తామస* ఆహారమూలాలు ఉన్న పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ దేవాలయాలలో అర్చక స్వాములు, గృహాలలో గృహస్థులు వాడరాదు. 

5) నైవేద్య పదార్థాలను భగవన్ సమర్పణకు ముందు దేవాలయాలలో అర్చక స్వాములు, గృహాలలో గృహస్థులు రుచి చూడరాదు. 

భగవన్నామ జపము/నామ సంకీర్తన చేస్తూ వంట చేయాలి... పవిత్ర హృదయం తో నైవేద్యాలు తయారు చేయబడాలి.

6) *భక్తులు, గృహస్థులు ప్రసాదం పుచ్చుకున్న తదుపరి, "కుడి చేతి" లో ఉన్న ప్రసాదమును "ఎడమ చేతిలోకి" మార్చుకుని నెమ్మదిగా ప్రసాదమును ఆరగింపవలెను*. కుడి చేతిలోని ప్రసాదమును కుడి చేతితోనే గబుక్కున *పక్షి లాగా తినకూడదు*.


పూజలు మరియు వ్రతాలలో  తీర్థ ప్రసాదాలు, హోమ  యజ్ఞ యాగాదులులలో హవిస్సులు భగవంతునికి  కృతజ్ఞతా పూర్వకంగా  అర్పించడం, సమర్పించడం ద్వారా దేశ కాల పరిస్థితులే గాకుండా అర్పించిన  భక్తులకు ఈ జన్మలోనే గాకుండా వంశం యావత్తులో ఏ లోటూ రాకుండా ఆ పరమాత్మ చూసుకుంటాడు. భగవంతుని తీర్థ ప్రసాదాల సమర్పణలోనూ, పుచ్చుకునుటలోనూ నిర్లక్ష్యము కూడదు. 


ధన్యవాదములు.

*(సశేషం)*

ప్రళయమా!! ప్రభంజనమా!!*

 *ప్రళయమా!! ప్రభంజనమా!!**

&&&&&&&&&&&&&&&&&&

ఇండ్లు కూలిపోతూన్నాయి 

భవనాలు రాలిపోతూన్నాయి 

పెంకుటిండ్లు పడిపోతూన్నాయి 

చెరువులు కుంటలు నిండిపోతూ 

వీధులు మునిగిపోతూన్నాయి 

రోడ్లన్నీ అస్తవ్యస్తమవుతూ ఆగాధల్లా మారిపోయి మృత్యు కుహురాలుగా మారిపోతూన్నాయి 

పట్టాలు రోడ్లు గతి తప్పి ప్రమాదాలతో రక్తసిక్తమవుతున్నాయి 

భూమికి శస్త్ర చికిత్స చేసినట్లు 

ఎక్కడి రోడ్లు అక్కడే తవ్వకాలు జరిగి శీఘ్ర గతిన మరమ్మతులకు నోచుకోక 

ప్రయాణనికి అంతరాయం కలిగిస్తూన్నాయి 

చేతికందే పంటలు నీటిలో కల్సి పోతూన్నాయి 

హాహాకారాలతో జనమంతా ఆర్తనాదాలు చేస్తూన్నారు 

తిండి నీడలేక అలమటిస్తూన్నారు 

ఎక్కడి జనం అక్కడే మృత్యువాతపడుతున్నారు 

ప్రాణులన్నీ కొట్టుకుపోతూన్నాయి 

దేశమంతా అల్లకల్లోలం అవుతుంది 

భీభత్సమైన వర్షంతో బిక్కు బిక్కు మంటూ రోదిస్తూంది లోకం

జనజీవన స్రవంతి స్థంభించి పోతూంది 


హైడ్రా ఆదేశాలతో హైద్రాబాద్ మరో పక్క బేంబేలు పడుతూ అలల్లాడుతూంది

ప్రభుత్వం మరిన్ని ప్రణాళికలతో పథకాలతో ప్రజానీకానికి రక్షణ కల్పించాలి 

రాజకీయ నాయకులు పరస్పరం ఒకరిఫై మరొకరు విరుచుకుపడకుండా 

రాజ్యం క్షేమం గురించి అందరూ ఏక తాటిన ఆలోచిస్తూ శీఘ్రనిర్ణయాలు తీసుకోవాలి

&&&&&&&&&&&&&&&&&&&&&

రచన :  మిత్రాజీ

(ప్రభాకర్ రావు గుండవరం, అత్వెల్లి, మేడ్చల్ జిల్లా )

ఫోన్ నం. 9949267638

_*శ్రీ గరుత్మంతుడి కధ -16

 _*శ్రీ గరుత్మంతుడి కధ -16 వ భాగం*_

🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑


       *విష్ణుస్వరూపము*

ధర్మరాజు " పితామహా ! మహాను భావులు అగ్నులను తమయందు సమాహితం చేసుకుంటారు కదా ! అటువంటి వారు విష్ణుమూర్తిని ఎటువంటి వాడిగా భావిస్తారు ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! క్షీరసాగర మధనంలో అమృతం పుట్టగానే దేవతలు దానవులకు యుద్ధం జరిగింది అందులో దానవులు దేవతలను జయించి అమృతము కైవశము చేసుకున్నారు. దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. అప్పుడు ఆకాశము నుండి " దేవతలారా ! నేను మిమ్ము గెలిపించడానికి వస్తున్నాను " అన్న మాటలు వినిపించాయి. అంతలో విష్ణుమూర్తి  గరుఢారూడుడై శంఖ చక్ర గధా సహితుడై అసురుల మీదకు యుద్ధానికి వచ్చి వారిని జయించి వెంటనే అంతర్ధానం అయ్యాడు. అది చూసి ఆశ్చర్యచకితులైన దేవతలు " ఈ మహానుభావుడు ఎవరు ? " అని బ్రహ్మదేవుడిని అడిగారు. బ్రహ్మదేవుడు " దేవతలారా ! ఆయన విష్ణుమూర్తి వైకుంఠములో ఉంటాడు. ఆయన ఇలా ఉంటాడు అని నాకు వర్ణించడానికి శక్తిచాలదు. అయినా ఆయన రూపము తెలుసుకోవడానికి నేను ఒకకథ చెప్తాను.


#మునులతో_గరుత్మంతుడు

హిమాలయాలలో మునులు, సిద్ధులు తపసు చేసుకుంటున్న తరుణంలో అక్కడకు గరుడుడు వచ్చి వారికి నమస్కరించాడు. వారు అతడిని సుఖాసీనులను చేసి " గరుడా ! నిన్ను ఒక విషయం అడగాలని ఉంది " అని అడిగారు. అందుకు గరుడుడు  " ధన్యుడను అడగండి చెప్తాను " అని అన్నాడు. మునులు సిద్ధులు " గరుడా ! విష్ణు భక్తుడవై సదా విష్ణువుకు సమీపంలో ఉండే నీవు మాకు విష్ణుతత్వము ఎరిగించగల సమర్ధుడవు. కనుక భక్త సులభుడైన విష్ణుతత్వము గురించి మాకు వివరించు " అని అడిగారు. మహానుభావులారా ! ఈ మూడు లోకములను విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు అని మాత్రమే నాకు తెలుసు. అంతమాత్రాన నాకు అన్ని తెలుసునని అనుకోవడం కష్టం. మీకు నాకే కాదు ఎవరికైనా విష్ణుతత్వము గురించి చెప్పడము కష్టమే. నేను విన్న ఆయన కథలను కావాలంటే చెప్తాను. నేను దేంద్రుడిని జయించి అమృతభాంఢమును తీసుకు వెడుతున్న తరుణంలో ఆకాశం నుండి " గరుడా ! నీ పరాక్రమానికి మెచ్చాను ఏదైనా వరం కోరుకో " అనే మాటలు వినిపించాయి. అప్పుడు నేను " అయ్యా ! మీరెవరో నాకు తెలియదు మీరెవరో నాకు తెలిపి వరాలను ఇవ్వండి " అన్నాను. ఆ మాటలకు బదులుగా ఒక నవ్వు వినిపించి తరువాత " కాలక్రమేణా నీకు నేనెవరో తెలుస్తుంది. నీవు నా వాహనముగా ఉండు. నీకు వ్యాధులు సోకవు మరణం ఉండదు. అసురులను జయిస్తావు " అన్న మాటాలు చెప్తూ ఒక కాంతిపుంజము నా ఎదుట నిలిచింది. నేను ఆకాంతి స్వరూపానికి చేతులెత్తి నమస్కరించి " మహానుభావా ! నేను నీకు వాహనమౌతాను. నీవు ఎక్కిన రధముకు నన్ను ధ్వజముగా నియమించమని నేను కోరుకుంటున్నాను " అని అడిగాను. " అలాగే జరుగుతుంది " అని చెప్పి ఆ కాంతి స్వరూపం మాయమయ్యింది. ఆ మాటలకు ఆశ్చర్యానందాలు కలిగాయి...


" తరువాయి భాగం రేపటి శుభోదయంలో  " 

🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅🍅