30, ఆగస్టు 2024, శుక్రవారం

ప్రళయమా!! ప్రభంజనమా!!*

 *ప్రళయమా!! ప్రభంజనమా!!**

&&&&&&&&&&&&&&&&&&

ఇండ్లు కూలిపోతూన్నాయి 

భవనాలు రాలిపోతూన్నాయి 

పెంకుటిండ్లు పడిపోతూన్నాయి 

చెరువులు కుంటలు నిండిపోతూ 

వీధులు మునిగిపోతూన్నాయి 

రోడ్లన్నీ అస్తవ్యస్తమవుతూ ఆగాధల్లా మారిపోయి మృత్యు కుహురాలుగా మారిపోతూన్నాయి 

పట్టాలు రోడ్లు గతి తప్పి ప్రమాదాలతో రక్తసిక్తమవుతున్నాయి 

భూమికి శస్త్ర చికిత్స చేసినట్లు 

ఎక్కడి రోడ్లు అక్కడే తవ్వకాలు జరిగి శీఘ్ర గతిన మరమ్మతులకు నోచుకోక 

ప్రయాణనికి అంతరాయం కలిగిస్తూన్నాయి 

చేతికందే పంటలు నీటిలో కల్సి పోతూన్నాయి 

హాహాకారాలతో జనమంతా ఆర్తనాదాలు చేస్తూన్నారు 

తిండి నీడలేక అలమటిస్తూన్నారు 

ఎక్కడి జనం అక్కడే మృత్యువాతపడుతున్నారు 

ప్రాణులన్నీ కొట్టుకుపోతూన్నాయి 

దేశమంతా అల్లకల్లోలం అవుతుంది 

భీభత్సమైన వర్షంతో బిక్కు బిక్కు మంటూ రోదిస్తూంది లోకం

జనజీవన స్రవంతి స్థంభించి పోతూంది 


హైడ్రా ఆదేశాలతో హైద్రాబాద్ మరో పక్క బేంబేలు పడుతూ అలల్లాడుతూంది

ప్రభుత్వం మరిన్ని ప్రణాళికలతో పథకాలతో ప్రజానీకానికి రక్షణ కల్పించాలి 

రాజకీయ నాయకులు పరస్పరం ఒకరిఫై మరొకరు విరుచుకుపడకుండా 

రాజ్యం క్షేమం గురించి అందరూ ఏక తాటిన ఆలోచిస్తూ శీఘ్రనిర్ణయాలు తీసుకోవాలి

&&&&&&&&&&&&&&&&&&&&&

రచన :  మిత్రాజీ

(ప్రభాకర్ రావు గుండవరం, అత్వెల్లి, మేడ్చల్ జిల్లా )

ఫోన్ నం. 9949267638

కామెంట్‌లు లేవు: