30, ఆగస్టు 2024, శుక్రవారం

శాఖ చంద్ర న్యాయం - వేదాంతం

 

శాఖ చంద్ర న్యాయంవేదాంతం 

పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి బింబముగా కనపడతాడు, వెన్నెల పిండి ఆరబోసినట్లు గా ఉంటుంది కాబట్టి పున్నమి చంద్రుడు ప్రతివారికి ఆకాశం వైపుచూస్తే చాలు కనపడతాడుఇంకొక విశేషము ఏమిటంటే పున్నమి చంద్రుడు రాత్రి పూర్తిగా అంటే సాయంత్రం 6 గంటల నుండి ఉదయం 6 గంటలవరకు ఆకాశంలో ప్రకాశిస్తూవుంటాడు కాబట్టి రోజు రాత్రి చంద్రుని ఎవరు చూపించనవసరం లేకుండానే అందరు చూడగలరు

కానీ అమావాస్య మరుసటి రోజు చంద్రుడు రేఖామాత్రంగా ఉండి ఆకాశంలో కేవలం 48 నిమిషాలు మాత్రమే ఉంటాడు కాబట్టి రోజు అంటే అమావాస్య వెళ్లిన పాడ్యమి నాడు చంద్రుని చూడటం చాలా కష్టం. దానికి కారణం చంద్రుడు చిన్నగా ఉంటాడు మరియు కొద్ది సమయం మాత్రమే ఉంటాడు

ఒక గురువు గారు ఆకాశంలో వున్న చంద్రుని తన శిష్యునికి చేపించదలచారు అప్పుడు ఆయన ముందుగా అక్కడ వున్న ఒక చెట్టు కొమ్మను శిష్యునికి చూపించారు అది కంటికి దగ్గరగా వుంది కాబట్టి దాన్ని శిష్యుడు గుర్తించగలిగాడు. ఇక ఇప్పుడు చంద్రుని చూపించాలి దానికోసం గురువుగారు వృక్ష శాఖ లోని ఒక పత్రాన్ని చూపి దాని సందులో చంద్రుడు ఉన్నాడని చెప్పారు. తెలివైన శిష్యుడు   శాఖ మధ్యనుండి గురువుగారు చెప్పిన విధంగా నిశితంగా పరిశీలించి చూసి సూక్ష్మ మాత్రంగా ఉన్న చంద్రుడిని చూసాడుఒక్కసారి చంద్రుని చేస్తే తరువాత శిస్యునికి మరల వృక్ష శాఖతో నిమిత్తం లేదు ఆకాశంలో ఎటువంటి ఉపాధి లేకుండా చంద్రుని మరల చూడగలడు. ఎందుకంటె ఇప్పుడు శిష్యునికి చంద్రుడు ఎక్కడ వున్నదో పూర్తిగా జ్ఞ్యానం కలిగి వున్నాడు జ్ఞ్యానం కలిగే అంతవరకే శాఖ యొక్క ఉపయోగంఒక్కసారి శిష్యునికి చంద్రుని గూర్చిన జ్ఞానం కలిగిన తర్వాత శాఖ పూర్తిగా మరచిపోతారుకేవలం మనస్సు చంద్రుని మీద లగ్నాత చేయగలుగుతాడు.

నిజానికి చంద్రుని చూడడానికి వృక్ష శాఖ తో పనిలేదు. కానీ గురువుగారు వృక్ష శాఖను తన పనికి వాడుకున్నారుఎందుకంటె శిష్యుని దృష్టిని కేంద్రీకరించడానికి శాఖ ఒక ఉపయుక్తంగా లేక ఉపకరణంగా పనికి వచ్చిందిఅదే వృక్ష శాఖ లేదనుకోండి అప్పుడు గురువు గారు శిష్యునికి చంద్రుని చూపించడం కుదిరే పని కాదుఎందుకంటె పాడ్యమినాడు చంద్రుడు చాలా సూక్ష్మంగా ఉండటమే కాకుండా కేవలం ఆకాశంలో 48 నిమిషాలు మాత్రమే ఉంటాడుకాబట్టి శాఖ చంద్ర దర్శనానికి చాలా తోడ్పడ్డదని మనకు తెలుస్తున్నది.

ఇక విషయానికి వస్తే భగవంతుడు నామ రూప గుణ  రహితుడు మరి అటువంటప్పుడు భగవంతుని దర్శించుకోవడం ఎలా ఎందుకంటే మన ఇంద్రియాలు కేవలం సగుణాత్మకమైన రూపాలను మాత్రమే చూడగలవు. మనం చూసే దృశ్యమాన జగత్తులో భగవంతుని చూడలేము. కేవలము మనస్సును అంతరముఖం చేస్తేనే కానీ అది సాధ్యం కాదు.  మనస్సు ఎల్లప్పుడూ ఏదో ఒక భౌతికమైన విషయం మీదనే లగ్నం అవుతుంది అది ప్రస్తుతం వున్నదో లేక గతంలో వున్న దాని భావనో ఏదో ఒకటి కావచ్చుకాబట్టి మనస్సుకి ఒక చక్కటి శిక్షణ ఇవ్వాలి దానికోసం ముందుగా మనస్సుని ఏదో ఒక విషయం మీద స్థిరపరచాలి తరువాత నెమ్మదిగా శాఖమీది నుంచి దృష్టిని చంద్రుని వైపు మళ్లించినట్లు మనస్సుని భగవంతుని మీదకు మళ్లించవచ్చు.

కాబట్టి సాదాకా మన ఆరాధనా పద్దతులలో విగ్రహారాధన, యజ్ఞ యాగ, జపాది పద్ధతులు కేవలం సాధకుని మనస్సు స్థిరపరచటానికి ఏర్పాటు చేసిన విధానాలుగా మనం తెలుసుకోవాలి. ఒక విగ్రహారాధనను మనం చంద్రుని దర్శించుకోవడానికి ముందుగా శాఖను చూడటం లాగ తెలుసుకోవాలి. ఎలాగైతే చంద్రుని దర్శించుకున్న తర్వాత శాఖ ప్రయోజనం లేదో అలాగని నిరాకారుడైన నిర్గుణుడైన  భగవంతుని చేరుకొన్న సాధకునికి విగ్రహారాధన తో నిమిత్తం లేదుఇది తెలుసుకొని సాధనలో పట్టు సాధించాలి.

విగ్రహారాధన నుంచి మనస్సు నిరాకారుని వైపు మళ్లించటం చెప్పినంత తేలిక కాదు నిరంతర అకుంఠిత సాధన చేస్తేనే కానీ అది సాధించగలడుపట్టుదల, అవిరామ కృషి మాత్రమే సాధకుని దీక్షను ముందుకు సాగించగలవుసాధనలో ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు, సాధకబాధకాలు వస్తూ వుంటాయికానీ నిజమైన సాధకుడు వాటినన్నిటిని అధిగమించి తన సాధనను ముందుకు కొనసాగించాలినిజానికి ఆధ్యాత్మిక జీవనం చాలా కష్టతరమైనది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇసుకను పిండి నూనెను పట్టినట్టు. ఎంతో దుర్లభమైన సాధన చేస్తే కానీ మోక్షం సిద్దించదు. సద్గురువు మనకు చంద్రుని చూడటానికి శాఖ ఉపకరించినట్లుగా మాత్రమే సాధకునికి సహాయం చేయగలడు. చంద్రుని చూసినతరువాట్ ఎలాగైతే మనకు శాఖతో పనిలేదో అదేవిధంగా సాధన సిద్దించినతరువాట్ సాధకునికి సత్ గురువుతో పనిలేదు.  మనకు అనేకమంది వాచా వేదాంతులు తారసపడి మనలను తప్పుడు త్రోవలో పంపడానికి ప్రయత్నిస్తుంటారు వారిని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలిముఖ్యంగా రోజుల్లో నిజమైన సాధకులు చాలా తక్కువగా వున్నారో లేక లేరో నాకు ఇంకా పూర్తిగా తెలియడం లేదు. ఒక్క మాట మాత్రం చెప్పగలను మన చుట్టూ వున్న సమాజంలో మాత్రం నిజమైన సాధకులు లేకపోవచ్చు. ఎక్కడో అరణ్యాలలోనో లేక హిమాలయాలలోనో ఉంటే ఉండవచ్చు. ఫై ఫై డాంబికాలు పోయి తామే సద్గురువులమనే కుహనా వేదాంతులు మనకు అడుగడుగునా కనిపిస్తారువారితో జాగ్రత్త. కొంతమంది గురువులే దైవం అని తలచి గురువులకు పూజలు చేయటం కూడా మనం చూస్తూవున్నాము. నిజానికి ఒక గురువు సాధకునికి మార్గదర్శకత్వం వహించే వాడే కానీ అంతకు మించి కాదు. నిరాంబరుడు, ధనాపేక్ష లేని సద్గురువుని ఆశ్రయిస్తేనే సాధకుడు బ్రహ్మ జ్ఞాన వంతుడు కాగలడు  నీగమ్యం నిర్ధారించుకొని అడుగు ముందుకు వేయి.

ఓం తత్సత్

ఓం శాంతి శాంతి శాంతిః

ఇట్లు 

చేరువేల భార్గవ శర్మ

 

కామెంట్‌లు లేవు: