30, ఆగస్టు 2024, శుక్రవారం

శనివారం, త్రయోదశి

 *రేపు శనివారం, త్రయోదశి మరియు పుష్యమీనక్షత్రం అంటే శనినక్షత్రం.* అందువలన జాతకం లో శనిదోషాలు ఉన్న వారు శనీశ్వరునకు అభిషేకాద్యర్చనలు లేదా శనైశ్చరదోష నిరహరణార్థం పరమేశ్వరునకు రుద్రాభిషేకాద్యర్చనలు చేసుకోవడం, వారనియమాలు పాటించడం అనగా అభ్యంగన(తలంటు)స్నానము చేసి నువ్వులనూనె తో దీపారాధన చేసి శనీశ్వరుని పూజించి నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని నైవేద్యం పెట్టి దానిని గోవుకు సమర్పించి, ఏకభుక్తం(పగలు ఒకపూట మాత్రమేభోజనం) చేసి, మద్యమాంసాదులనూ ఉల్లిపాయలనూ విడిచిపెట్టి భూతలశయనంతో రాత్రి ని గడపడం వలన శనిదోషప్రభావం తగ్గుతుంది. రేపటి రోజు న తిష్యనక్షత్రయుత శనిత్రయోదశీప్రయుక్తముగా మన కల్యాణ కార్తికేయ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర సహిత శ్రీ అభీష్ట గణపతి పంచాయతన దేవాలయం లో ఉదయం 8 గంటలకు ప్రత్యేక అభిషేకాద్యర్చనలు నిర్వహించబడును. ఈ కార్యక్రమం లో  ప్రత్యక్షంగా నూ పరోక్షంగా నూ భక్తులు పాల్గొనవచ్చు. ఈ కార్యక్రమం లో గోత్రనామాలు చెప్పించుకునే ఆసక్తి గల భక్తులు వారి గోత్రనామాలు మాకు వాట్సాప్ చేయగలరు. మా వాట్సాప్ నంబర్ 9492050200.

కామెంట్‌లు లేవు: