23, ఫిబ్రవరి 2025, ఆదివారం

తెలుసుకోవలసిన

 *అందరూ తెలుసుకోవలసిన మంచి విషయాలు🙏🚩*

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు  


భాగవతం, మహాభారతం


1. మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - దేవ్ ధాం,నేపాల్.


2. నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్.


3. జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్.


4. మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్


5. శమంత పంచకం (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు) మరియు దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా


6. పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) - కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం


7. మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా


8. నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్


9. వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్


10. నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్


11. వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్


12. ప్రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్.


13. సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర.


14. హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్.


15. మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్.


16. వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర.


17. కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్.


18. మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు) - పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్.


19. ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్.


20. గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా.


21. కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్ (ఆఫ్ఘనిస్తాన్).


22. పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్.


23. కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం - గిర్నార్, గుజరాత్.


24. శ్రీకృష్ణ, బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్.


25. హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు) -జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్.


26. విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర


27. కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర


28. చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్.


29. కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా, మధ్యప్రదేశ్.


30. ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర.


31. కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్.


32. పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్, సహజహంపూర్, ఫారుఖాబాద్ ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్.


33. కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్.


34. జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్.


35. కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమ హర్యానా.


36. మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకు వున్న ప్రాంతం, రాజస్థాన్.


37. విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్


38. శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం.


39. ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం.


40. నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం, సోంనాథ్, గుజరాత్.


41. జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్.


42. కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్.


43. బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్.


44. గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్.


ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు.

:::::::::::::::::::::::::::::::::::::

రామాయణం

:::::::::::::::::::::::::::::::::::::


1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్


2. కపిల మహర్షి ఆశ్రమం,(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్


3. కాంభోజ రాజ్యం - ఇరాన్ ( శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).


4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా


5. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు - గోకర్ణ, కర్ణాటక

6. సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్


7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్


8. కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం


9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్.


10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.


11. ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్.


12. తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్


13. అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్


14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్


15. గుహుడు సీతారామలక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర

16 దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు.


17. చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.


18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.


19. కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.


20. శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.


21. హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.


22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర,కర్ణాటక


23. విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి, తమిళనాడు.


24. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం,తమిళనాడు


25. రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.


26. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక


27. శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక


28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.


29. వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చిన స్థలం / భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.


30. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.


31. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్


32. తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్


33. పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్.

సంవ‌త్స‌రంలో

 మీరు ఏ సంవ‌త్స‌రంలో పుట్టారు... అంటే ఠ‌క్కున చెప్పేస్తారు. కానీ, ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారు అంటే చెప్ప‌లేరు. అందుకే మీ కోసం ఆ తెలుగు సంవ‌త్స‌రాలు ఇస్తున్నాను..మీరు ఏ తెలుగు సంవ‌త్స‌రంలో పుట్టారో తెలుసుకోండి.👍

 

*( 1867, 1927,1987,)*: ప్రభవ

*(1868,1928,1988)*: విభవ

*(1869,1929,1989)*: శుక్ల

*(1870,1930,1990)*: ప్రమోదూత

*(1871,1931,1991)*: ప్రజోత్పత్తి

*(1872,1932,1992)*: అంగీరస

*(1873,1933,1993)*. శ్రీముఖ

*(1874,1934,1994)*: భావ

*(1875,1935,1995)*: యువ

*(1876,1936,1996)*: ధాత

*(1877,1937,1997)*:  ఈశ్వర

*(1878,1938,1998)*: బహుధాన్య

*(1879,1939,1999)*: ప్రమాది

*(1880,1940,2000)*: విక్రమ

*(1881,1941,2001)*: వృష

*(1882,1942,2002)*: చిత్రభాను

*(1883,1943,2003)*: స్వభాను

*(1884,1944,2004)*: తారణ

*(1885,1945,2005)*: పార్థివ

*(1886,1946,2006)*:  వ్యయ

*(1887,1947,2007)*: సర్వజిత్

*(1888,1948,2008)*: సర్వదారి

*(1889,1949,2009)*: విరోది

*(1890,1950,2010)*: వికృతి

*(1891,1951,2011)*: ఖర

*(1892,1952,2012)*:  నందన

*(1893,1953,2013)*: విజయ

*(1894,1954,2014)*: జయ

*(1895,1955,2015)*: మన్మద

*(1896,1956,2016)*: దుర్ముఖి

*(1897,1957,2017)*: హేవిళంబి

*(1898,1958,2018)*: విళంబి

*(1899,1959,2019)*: వికారి

*(1900,1960,2020)*: శార్వరి

*(1901,1961,2021)*: ప్లవ

*(1902,1962,2022)*: శుభకృత్

*(1903,1963,2023)*: శోభకృత్

*(1904,1964,2024)*: క్రోది

*(1905,1965,2025)*: విశ్వావసు

*(1906,1966,2026)*: పరాభవ

*(1907,1967,2027)*: ప్లవంగ

*(1908,1968,2028)*: కీలక

*(1909,1969,2029)*: సౌమ్య

*(1910,1970,2030)*:  సాదారణ

*(1911,1971,2031)*: విరోదికృత్

*(1912,1972,2032)*: పరీదావి

*(1913,1973,2033)*: ప్రమాది

*(1914,1974,2034)*: ఆనంద

*(1915,1975,2035)*: రాక్షస

*(1916,1976,2036)*: నల

*(1917,1977,2037)*: పింగళ

*(1918,1978,2038)*: కాళయుక్తి

*(1919,1979,2039)*: సిద్దార్థి

*(1920,1980,2040)*: రౌద్రి

*(1921,1981,2041)*: దుర్మతి

*(1922,1982,2042)*: దుందుభి

*(1923,1983,2043)*: రుదిరోద్గారి

*(1924,1984,2044)*: రక్తాక్షి

*(1925,1985,2045)*: క్రోదన

*(1926,1986,2046)*: అక్షయ


దయచేసి షేర్ చెయ్యండి మన తెలుగు వారు అందరూ తెలుసుకోవాలి.👍

అభిజ్ఞాన శాకుంతలం

 🙏అభిజ్ఞాన శాకుంతలం కవికుల గురువు కాళిదాసు 🙏

కాళిదాసు ప్రజ్ఞకు అభిజ్ఞాన శాకుంతలంలోని చతుర్దాకములోని శ్లోక చతుష్టయాన్ని ఉదాహరణకు చెప్పాలనుకుంటున్నాను 

.ఉపమా కాళిదాసస్య!

భారవే రర్థగౌరవం!

దండినః పదలాలిత్యం!

మాఘే సంతి త్రయోగుణాః!!


కాళిదాసుయొక్క ఉపమాలంకార ప్రయోగ చాతుర్యము , భారవిలో గల (అర్థగౌరవము)అర్ధాంతరన్యాస అలంకారం ,దండి యొక్క పదలాలిత్యము- యీ మూడులక్షణాలు కూడా మాఘుని యందు చూడగలము

.మరొక మంచి శ్లోకం 

"కావ్యేషు నాటకం రమ్యం నాటకేషు చ శకుంతలా

తస్యాంచ చతుర్ధ్వాంకః తస్మిన్ శ్లోక చతుష్టయం"

.

కావ్యాలకంటే నాటకాలు రమ్యంగా ఉంటాయి.

నాటకాలలో శాకుంతలం, అందులో మళ్ళీ నాల్గవ అంకము, 

అందులో కూడా శ్లోక చతుష్టయం 

అద్భుతమయినవి. శ్లోక చతుష్టయం అంటే నాలుగు శ్లోకాలు.

ఈ నాలుగూ కూడా కణ్వ మహర్షి చెప్పిన సందర్భంలోవే. 

ఏమిటా శ్లోకాలు? ఎందుకవి అంత గొప్పవి అంటే వాటిని చదవ వలసినదే:

.

పాతుం న ప్రధమం యవస్యతిజలా యుష్మాస్వపీ తేషుయా

నాదత్తే ప్రియమండనాపి భవతాం స్నేహే నయా పల్లవం

ఆజ్యేవః కుసుమ ప్రసూతి సమయే యస్యాభవత్యుత్సవః

సేయం యాతి శకుంతలా పతిగృహం సర్వైరనుజ్ఞాయతాం

.

మనిషికీ ప్రకృతికీ ఉండే బంధాన్ని ఎంత చక్కగా చెప్పాడో కదా కాళిదాసు! 

.

మొక్కలకి నీళ్ళు పోయకుండా తను మంచినీళ్ళు కూడా త్రాగేది కాదు, చిగురుటాకులను అలంకరించు కోవటం ఎంత ఇష్టమయినా సరే తుంచేది కాదు, తాను పెంచిన మొక్కకి పువ్వు పూస్తే పిల్లలు పుట్టినంత ఆనందించి ఉత్సవం చేసేది, 

అటువంటి శకుంతల అత్తవారింటికి వెళుతోంది కనుక మీరు అనుజ్ఞని ఇవ్వండి అంటాడు కణ్వ మహర్షి. ఈ శ్లోకంలో మొక్కలని సాటి మనిషిగా, అతిధిగా, సన్నిహితులుగా, బంధువులుగా చూపటం జరిగింది. 

వృక్షో రక్షతి రక్షితః అని మనం అనడమే తప్ప ఏనాడయినా 

ఇంత మమకారం చూపించామా? అనిపిస్తుంది నాకయితే.

.

యాస్యత్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్ట ముత్కంఠయా

కంఠస్థంబిత బాష్పవృత్తి కలుషశ్చింతా జడం దర్శనం

వైక్లవ్యం మమతావదీ దృశ మిదం స్నేహాదరణ్యౌ కసః పీడ్యంతే గృహిణః కథంనుతనయా విశ్లేష దుఃఖైర్నవైః

.

నా కూతురయిన శకుంతల అత్తవారింటికి వెళుతుంటే బాధతో కంఠం పట్టేసి నోట మాట రావటం లేదు, కంటిలో నీరు చేరి చూపు కనిపించటం లేదు, అంతా జడంగా, నిర్జీవంగా అనిపిస్తోంది. 

మునివృత్తిలో ఏ బంధాలూ లేకుండా ఉండే నాకే ఇంత బాధగా, మనసంతా ఏదోలా ఉంటే అదే గృహస్థులకి కూతురిని అత్తవారింటికి పంపేటప్పుడు ఇంకెంత బాధాకరంగా ఉంటుందో కదా! అని ఆలోచిస్తాడు కణ్వ మహర్షి.

ఒక ప్రక్కన తను బాధపడుతూనే వేరే వారి పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన కూడా కణ్వ మహర్షిలో కలిగినట్టు చూపెడతాడు కాళిదాసు. ఒక తండ్రికి అత్యంత బాధ కలిగే సమయం ఇదే అంటారు అందుకేనేమో!

.

అస్మాన్ సాధు విచింత్య సంమ్యమధనాన్ ఉచ్ఛైః కులంచాత్మనః

త్వైయస్యాః కథమప్యబాంధవ కృతాం స్నేహ ప్రవృత్యించతాం

సామాన్య ప్రతిపత్తి పూర్వక మిదం దారేషు దృశ్యాత్వయా

భాగ్యా యత్త మతః పరం నఖలుత ద్వాత్యం వధూబంధుభిః

.

కూతురితో రాజయిన అల్లుడికి కణ్వ మహర్షి పంపే సందేశమే ఈ శ్లోకం. 

నేను సారెలు, కట్నకానుకలు ఇవ్వలేదు. ముని వృత్తిలో ఉన్న మాకు తపస్సు, నీతి నియమాలే ధనం. రాజువయిన నీకు ఇంతకన్నా గొప్ప ధనాన్ని (నీ తాహతుకు తగ్గట్టు) మేము ఇవ్వలేము. 

కావున అవేమీ ఇవ్వలేదని మా అమ్మాయిని సాధించకు, డబ్బు,నగలు లేవని తృణీకార భావంతో చూడకు. మీది పెద్దలు కుదిర్చిన పెళ్లి కూడా కాదు. స్నేహభావంతో, అనురాగంతో మీరిరువురూ గాంధర్వ వివాహం చేసుకున్నారు కనుక మా అమ్మాయి నచ్చలేదు అని ఏ నాడూ అనకు. 

నీకు చాలా మంది భార్యలున్నా (బహు భార్యత్వం ఆ కాలంలో సహజమే) వారితో సమానంగా చూడు. వారికన్నా బాగా చూసుకుంటాను అంటే అది శకుంతల భాగ్యం కానీ నేను మాత్రం వారికన్నా బాగా చూడమని చెప్పకూడదు అని ఈ శ్లోక సారాంశం. 

నన్నెంతగానో కదిల్చింది. ఎంత ముందుచూపు ఆ తండ్రికి? నీతి నియమాలు, సత్ప్రవర్తనకి మించిన ధనం ఉంటుందా? ఈ విషయం ఈ కాలం వారు గ్రహించి ఆచరిస్తే ఎంతో మంది స్త్రీలు కట్న పిశాచికి బలి కాకుండా ఉండేవారేమో కదా! అనిపించింది.

ఇక్కడ శ్లేష కూడా ఉంది.

అస్మాన్ సాధు విచింత్య 

మమ్ములను సాధువులని (తపస్సాలులమని ) తెలుసుకో.నీ దగ్గర ఎంత ధనమైన ఉండవచ్చు మాకు సంమ్యమధనాన్.  తపస్ శక్తియే ధనం. మా తపోధనము ముందు నీ ఐహిక సంపదలు నిలవవు. ఈమె ఉన్నత వంశములో పుట్టినది..

.సా -- మాన్య  ప్రతిపత్తి పూర్వక మిదం దారేషు దృశ్యాత్వయా ఆమెను మాన్య అంటే ఇతర స్త్రీ గా చూడవద్దు అని హెచ్చరించారు చాలా గొప్ప శ్లోకం కాళిదాసు దివ్య చరణాలకు నా నమస్కారాలు.

 

సుశ్రూషస్వ గురూన్ ప్రియసఖీ వృత్తిం సపత్నీజనే

భర్తుర్విప్ర కృతాపి రోషణతయా మాస్మం ప్రతీ పంగమః

భూయిష్ఠం భవ దక్షిణా పరిజనే భాగ్యేష్వనుత్సేకినీ

యాంత్యేవం గృహిణీ పదం యువతయో వామాః కులస్యాధయః

.

ఇంతకు ముందు చెప్పిన శ్లోకంలో అల్లుడు కూతురిని ఎలా చూసుకోవాలో చెప్పిన కణ్వ మహర్షి ఈ శ్లోకంలో ఆడపిల్ల అత్తవారింట ఎలా ఉండాలో చెప్పాడు. 

పెద్దలకి (అత్తమామలకీ, మొ..వారికి) సేవ చెయ్యి, సవతులతో స్నేహంగా ఉండు, భర్త కోపంలో ఒక మాట అన్నా రోషం తెచ్చుకోకుండా అతనితో సామరస్యంగా ఉండు, 

సేవకుల యందు దయకలిగి ఉండు వారిని ఏ నాడూ తక్కువగా చూడకు, భోగ భాగ్యాలున్నాయి అన్న ఉద్వేగంతో గర్వం దరిచేరకుండా చూసుకో. ఇలా ఉన్నప్పుడే యువతులు గృహిణీ స్థానం పొందుతారు లేదా చెడ్డ పేరు తీసుకువస్తారు అని చెప్తాడు. 

ఒక్కో మాట ఒక్కో ఆణిముత్యం. తప్పక ప్రతీ ఒక్కరూ ఇవన్నీ పాటిస్తూ ఆచరణలో పెట్టగలిగితే (?) ఈ కాలంలో విడాకులు అనేవి ఉండేవి కావేమో! అనిపిస్తుంది.

ఈ నాలుగు శ్లోకాలూ అమోఘం. 

కాళిదాసు ఇవన్నీ ఈ కాలంలో పరిస్థితులు ఇలా ఉంటాయన్న ముందుచూపుతో ఇవన్నీ వ్రాశాడో, లేక మామూలుగానే వ్రాశాడో తెలియదు కానీ ప్రపంచం ఎంతగా మారిపోయినా ప్రతీ ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవలసిన మాటలు కదూ! 

అందుకేనేమో ఇవి శ్లోక చతుష్టయం అంటూ అంతటి గొప్ప స్థానాన్ని పొందాయి.

ఈ నాటకమంతటిలో నాకు కాళిదాసు జనాలకి ఎక్కువ ఉపదేశాలు చేశారనిపిస్తుంది. ఎన్నో ధర్మాలకి అక్షర రూపం ఈ నాటకం. ప్రతీ శ్లోకంలోనూ ఒక్కో ధర్మాన్ని చూడచ్చు

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

అంకము

 🙏🙏🙏అంకము 

 శ్రవ్య కావ్య విభాగములను ఏర్పరచుటకంటె, నాటకమును అంకములుగా విభజించుటలో నియమములెక్కువ. అలంకార శాస్త్రములో 

ఈ అంక నిర్మాణాత్మకమైన నియమ లక్షణము ఈ విధముగా ఉండును: 


ఇతి వృత్త వృత్తాంతములో ఒకరోజు జరిగిన సంఘటనమునే అంకము 

నందు ప్రదర్శింపవలెను . కథ ఎంత దీర్ఘ కాల వృత్తమైనను కావచ్చును, కాని 

ఒక అంకము నందు ఆ దీర్ఘ కాలములో ఒక దినమున జరిగిన దానిని మాత్రమే 

 స్వీకరింపవలెను.” ఇది ముఖ్య నియమము.


శాకుంతలములోని కథ మూడు సంవత్సరములు జరిగినది ఆ నాటక 

ములోగల ఏడంకములలో ఏడు దినముల కథ మాత్రమే గ్రహింపబడినది. 

అయినను కథలో వెలితియున్నదని గాని ఇది ఏడు దినముల కథయే అనిగాని 

మనసునకు గోచరింపదు. ఇది కవియొక్క ఇతివృత్త సన్నివేశ చాతుర్యఫలితము. 

శకుంతలాదర్శనము మొదలుకొని పుత్ర సంతాన ప్రాప్తి వరకునుగల దుష్యంతుని 

చరితలో ఆయువుపట్లని చెప్పదగిన దినములు ఏడింటిని గ్రహించి ఆ దినము 

లలో జరిగిన చరిత్రను ఏకతా సంఘటించి మిగిలిన బహుదినములకు సంబంధిచిన 

చరిత్రమును కాళిదాను మనకు అవగత మగునట్లు చేసెను . ఈ సన్నివేశములో కథ 

యెచ్చటను విచ్చిన్న మైనట్టు కానరాదు. ఏ ఉత్తమ నాటక మైనను ఇట్లే యుండును 


ప్రతి అంకము లోని కథయంతయు ఒక నాయకుని అపేక్షిత ప్రయోజన పరాయణముగానే ఉండవలెను, సాధ్యమైనంతవరకు అన్ని అంకములలోను నాయకుని ప్రవేశము ఉండవలెను, లేదా ఆతని ప్రస్తావన అయినా పురస్కరించుకొనియే ఆయంకము  

నడవ వలెను,. 

అంకగతమైన కథ ఒకటిరెండు కాక పెక్కు పాత్రల ప్రవేశమునకు తగిన విస్తృతి కలదిగా నుండవలెను.సంస్కృతమున బహుశబ్దమునకు 

అధమము మూడు అని యర్థము. వ్యాకరణమున ఏకవచన, ద్వివచన, బహు 

వచనములు అన్నచోట ఆ 'బహు” శబ్దమునకు అర్థమిదియే.ఒకటి రెండు పాత్రలతో విష్కంభాదులుగా చెప్పబడెడి కథాసూచనలు మాత్రమే నిర్వహింపబడును. 

అంకములో అట్లు కుదరదు.


మరియు అంకమునందలి కథ బీజానుగుణముగా, బిందు వ్యాప్తి 

పురస్కృతముగా ఉండవలెను. ప్రతి కథకును ఆది మధ్యాంతములనెడి మూడు 

దశలుండును. ఈ మూడును క్రమముగా బీజ, బిందు, వ్యాప్తి కార్యములని ఈ శాస్త్ర 

పరిభాషలో చెప్పబడెను, ఏ ప్రయోజనాపేక్ష చే కవి కథను ప్రారంభించునో, 

ఆ ఫలమును ఇచ్చుటకు సమర్థమైన ఉపకరణ నకు 'బీజము' ఆని పేరు 

పుష్ప, ఫల సమన్విత మైన వృక్షముగా వృద్ధి చెందుటకు ఎట్టి శక్తి మంతమైన బీజమును నాటవలెనో, అట్టి శక్తి మంతమైన బీజముతోనే, 

కథా వికాసమునకు వ్యాప్తికి ఆనుగుణమైన దానితో కథను ఉపక్రమించవలెను, శక్తివంత 

మైన ఆ ఉపక్రమణముబట్టియే కథావిశృతి మరియు వికాసములు కలుగును , ఆ వికాస 

మునకు బీజమునందలి శక్తి యొక్క వ్యాప్తియే కారణము. దీనినే ఈ లక్షణమునే బిందువు' అందురు. అంకము బీజానుగుణముగా, 

బిందువ్యాప్తీ పురస్కృతముగా ఉండవలెను ఈ ధర్మమును పాటించినపుడు ప్రతి అంకమునందలి ఇతివృత్తాంశమును తత్పూర్వాంకమున 

కంటె ఎక్కువ వ్యాప్తి యగుచుండును. అంకమునకు అంకమునకును ఓండొంటికి 

అవిచ్చిన్న మైన సంబంధముండవలెను పూర్వాం కములోని కధాంశము ఉత్తరాంక 

కథాంశ మునకు కారణభూతమగుచుండును, అంకములన్నిటను ప్రదర్శనీయ మైన కథాభాగమే ఉండవలెను, ప్రదర్శింపరానివియు , ప్రదర్శింప వీలు లేనివియు, ప్రదర్శింపకూడనివియు (అయోగ్య, అసంభావ్య, అనావశ్యక) అగు ఘట్టములను అవసరమగుచో ఆర్దోపక్షేపకములందు సూచింతురు. ఆంకమున దృశ్య కథాభాగము మాత్రమే ఉండవలెను . అంకాంతమున రంగమునందలి పాత్రలన్నియు నిష్క్ర మింపవలెను

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

అందరూ చూచేది

 N🙏🕉️శ్రీమాత్రేనమఃశుభోదయం🕉️🙏               🔥మనకు ఎంత గుర్తుంపు ఉన్నా అందరూ చూచేది మన గుణాన్నే.. ఉన్నదానిని నిర్ణక్ష్యం చేస్తూ లేనిదానికై ఆరాటపడుతూ ఉంటే ఎన్నటికీ సంతోషంగా ఉండలేం.. శ్రద్ద ఉన్నవాడే సర్వం ఉన్నవాడు🔥మెట్లు దిగడం చాలా సులువు, ఎక్కడం చాలా శ్రమతో కూడుకున్న పని.. మాటలు అనడం చాలా సులువు, నిలబెట్టుకోవడం చాలా కష్టం మైన పని..చెట్లని నరికి వేయడం చాలా సులువు, పెంచి పోషించడం చాలా కష్టం.. ఎదుట మనిషిని నిందించడం చాలా సులువు, కానీ తిరిగి స్వీకరించడం చాలా కష్టం.. చప్పట్లు కొట్టడం చాలా సులువు, తిరిగి పొందడం చాలా కష్టతరం.. ఏదీ కూడా ఊరకే రాదు.. శ్రమ మరియు పట్టుదల చాలా అవసరం🔥జ్ఞానంతో చెప్పేవారి మాట వినకపోయినా పర్వాలేదు.. కానీ అనిభవంతో చెప్పే వారి మాట ఖచ్చితంగా వినాలి.. నమ్మకం ఉన్నవాడు ఓటమి ఎదురైన ప్రతీ సారి గెలవడానికి ప్రయత్నిస్తాడు.. నమ్మకం లేనివాడు ఒక్క ఓటమికే తన ప్రయత్నాలాన్ని విరమిస్తాడు..మీకు సాయం చేస్తున్న వారిని మరువకండి.. మిమ్మల్ని అభిమానించే వారిని ద్వేషించకండి.. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయకండి🔥🔥మీ *అల్లం రాజు భాస్కరరావు శ్రీ విజయ ఆయుర్వేదిక్ & జనరల్ ఏజన్సీస్  D.N.29-22-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్యసలహాలు ఉచితం*🙏🙏🙏

కలియుగ లీల లేమొ

 చ.కలియుగ లీల లేమొ యివి కాలుడు గారడి సేయు చుండె విం

తలు గన మానసమ్మునకు తాలిమి లే దిసుమంత యైన నీ

కలుషిత భావ జాలము వికారములన్ సృజియింప మానవుల్ 

తలపగ లేరు వారి భవితవ్యము నెంచ గనంగ భారతీ!౹౹ 63


ఉ.పారము పొందఁ జాలక నవాంఛిత రీతి నరాచకమ్ములన్ 

భూరి దిగంతరాళములఁ బూని వినాశనముల్ సృజించుచున్

ఘోర ఖలీకృతుల్ సలుపు కూళుల నీవు సహించుటేల? వి

స్ఫారిత లోచనాభ్యుదయ! వైభవ పూర్ణ! విశాల భారతీ!౹౹ 64

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - కృష్ణ పక్షం  - దశమి - మూల -‌‌  భాను వాసరే* (23.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*