26, అక్టోబర్ 2024, శనివారం

అశ్వగంధ చూర్ణం

 అశ్వగంధ చూర్ణం ఉపయోగాలు - 


    కొంతకాలం క్రితం అశ్వగంధ గురించి కొన్ని వివరాలు మీకు అందించాను. ఈ మధ్యకాలంలో   అశ్వగంధ గురించి మరింత విలువైన సమాచారం తెలుసుకున్నాను . వీటిలో చాలా వరకు నేను నా పేషెంట్స్ కి ఇచ్చినప్పుడు కొన్ని ఇతర సమస్యలు తీరడం నా దృష్టికి వచ్చింది.  ఇప్పుడు నా స్వానుభావాలు మరియు కొన్ని అత్యంత పురాతన గ్రంథ పరిశోధనలో నాకు లభ్యమైనవి కూడా మీకు వివరిస్తాను . 


స్వచ్ఛమైన అశ్వగంధ తయారీ విధానం - 


      మెట్టభూములు మరియు అడవులలో లభ్యమగు మంచి ముదురు పెన్నేరు గడ్డలను తెచ్చి మట్టి , ఇసుక , దుమ్ము వంటి వ్యర్థపదార్థాలు లేకుండా శుభ్రపరచుకొని నీడ యందు ఎండించవలెను . పూర్తిగా ఎండిన తరువాత  కత్తితో ముక్కలుగా కొట్టి ఒక గిన్నెలో వేసి అవి మునుగునంత వరకు దేశి ఆవుపాలు పోసి సన్నటిసెగపైన పాలు ఇగురునంత వరకు ఉడికించవలెను . అలా ఉడికించిన తరువాత గడ్డలను బాగుగా ఎండించవలెను . ఆ దుంపల యందు తడి పూర్తిగా ఆరిపోయేంత వరకు ఎండించవలెను . లేనిచో ఆ దుంపలకు బూజు పట్టును . ఇలా పూర్తిగా ఎండిన దుంపలను మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా మొత్తం 11 సార్లు చేసి ఆ తరువాత బాగుగా ఎండించి చూర్ణం చేసి వస్త్రగాలితం చేసుకుని వచ్చిన మెత్తటి చూర్ణాన్ని తడి తగలకుండా జాగ్రత్తగా నిలువచేసుకోవలెను . 


మోతాదు - 


     2 నుంచి 3 గ్రాముల మోతాదులో ఉదయము మరియు సాయంత్రం భోజనానికి అరగంట ముందు ఆయా సమస్యను బట్టి వైద్యులు సూచించిన అనుపానంతో వాడవలెను . 


       అశ్వగంధ 7 సార్లు శుద్ది చేయవలెను అని చెప్పుదురు . 11 సార్లు శుద్ది చేసిన ప్రశస్తముగా ఉండును . మరియు బలంగా పనిచేయును . 


  ఔషధోపయోగాలు  - 


*  శరీరానికి అమితమైన బలాన్ని ఇచ్చును . శుష్కించు శరీరం కలవారు దీనిని వాడుట వలన శరీరానికి కండపట్టి బలంగా తయారగుదురు . 


*  నిద్రలేమితో బాధపడువారికి ఈ అశ్వగంధ అత్యంతద్భుతముగా పనిచేయును . అశ్వగంధ ప్రధానముగా నరాల మీద పనిచేసి నరాలకు బలాన్ని చేకూర్చును . దీనిని వాడుట వలన ప్రశాంతమైన నిద్ర లభించును . 


*  క్షయరోగముతో ఇబ్బంది పడువారికి ఇది అత్యంత బలవర్ధకమైనది . ఊపిరితిత్తులకు బలాన్ని చేకూర్చుటయే కాక శరీర రోగనిరోధక శక్తి పెంచుటలో అత్యంత వేగముగా పనిచేయును . 


*  విరిగిన ఎముకలు త్వరగా కట్టుకొనుటకు ఈ అశ్వగంధ బాగుగా పనిచేయును . 


*  స్త్రీలు మరియు పురుషలలో కలుగు వంద్యదోషాలను నివారించును . 


*  రక్తము నందలి దోషములను పోగొట్టును . 


*  కీళ్లనొప్పులు నుంచి ఉపశమనం కలిగించును . 


*  నాడీవ్యవస్థ కు చెందిన వ్యాధుల పైన బాగుగా పనిచేయును . 


*  పక్షవాతం మొదలగు వాతవ్యాధుల యందు దీని పనితీరు అద్బుతముగా ఉంటుంది . 


*  మెదడులోని న్యూరాన్ల పైన దీని ప్రభావం ఉంటుంది. దీనిని వాడుట మూలన మెదడు చురుకుగా పనిచేయును . జ్ఞాపకశక్తి మెరుగుపడును . 


* అగ్నిమాంద్యము , మలబద్దకం నివారించును .


*  బాలింతలకు వచ్చు సూతికారోగము నివారించును . 


*  శరీరంలోని టాక్సిన్స్ బయటకి పంపి శరీరాన్ని శుద్ది చేయును . 


*  కఫ సంబంధ దోషములైన శ్వాస ( ఆయాసం ) , శోష మొదలైన వాటిని నివారించును . 


*  గ్రంధి సంబంధ రోగాలు ఉదాహరణకి థైరాయిడ్ వంటి వాటిపై అమోఘముగా పనిచేయును . 


*  గుండెసంబంధ సమస్యల కలవారు అశ్వగంధ వాడవలెను . 


*  కొంతమంది పిల్లలు శారీరకంగా ఎండుకుపోయి ఉంటారు. అటువంటివారికి తేనె అనుపానంగా ఈ అశ్వగంధ చూర్ణమును ఇచ్చిన మంచి కండపట్టి పుష్టిగా తయారగుదురు . 


*  వృద్ధాప్యము నందు వచ్చు సమస్యలను ఎదుర్కోవడానికి అశ్వగంధ నిత్యము సేవించవలెను . 


*  స్త్రీల శారీరక బలహీనతని పోగొట్టును . ప్రదర రోగములను నివారించును . 


*  మూర్చరోగులకు ఇది వరం వంటిది . 


*  స్త్రీలలో కలుగు బహిష్టు సంబంధ సమస్యలను నివారించును . 


*  స్త్రీ మరియు పురుషులలో హార్మోన్స్ మీద ఇది చాలా అద్బుతముగా పనిచేయును . 


      పైన చెప్పిన అనేక ఉపయోగాలు మాత్రమే కాకుండగా అనేకమంది HIV వ్యాధిగ్రస్తులకు ఇది నేను ఇవ్వడం జరిగింది. దీనిని ఉపయోగించిన తరువాత వారిలో CD4 కౌంట్ నందు మార్పు కనిపించింది. అంతకు ముందు ఉన్నటువంటి నీరసం , నిస్సత్తువ తగ్గిపోయాయి.  ఇలా మరెన్నో వ్యాధులపైన దీనిని ప్రయోగించాను . అద్బుతమైన ఫలితాలు వచ్చాయి . 


         కరోనా చికిత్సలో కూడా ఇది చాలా అద్బుతముగా పనిచేసింది . నేను ఎంతో మంది రోగులకు ఇచ్చాను . కరోనా నుంచి కోలుకొనిన తరువాత వచ్చే దుష్ప్రభావాలనుంచి కాపాడుకోవడానికి ఇది వాడుట అత్యుత్తమం . 


      మీకు ఇక్కడ మరొక్క ముఖ్యవిషయం చెప్పవలెను . నేను మామూలుగా ఆయుర్వేద షాపుల్లో దొరికే శుద్ధిచేయని మామూలు అశ్వగంధ చూర్ణము ఉపయోగించినప్పటికంటే నేను పాలల్లో ఉడకబెట్టి తయారుచేసిన అశ్వగంధ చూర్ణం వాడుట వలన ఫలితాలు అతి తక్కువ సమయములో వేగముగా ఫలితాలు వచ్చాయి . ఈ అశ్వగంధ చూర్ణం వాడువారు పాలు , పెరుగు , వెన్న , పప్పు తరచుగా వాడవలెను . తాంబూలం , మద్యము , కర్బుజా పండు , పనసపండు , చల్లనినీరు , చద్ది అన్నం నిషిద్దం . 


  గమనిక - 


       శుద్ధిచేసిన అశ్వగంధ చూర్ణం కావలెను అనిన నన్ను సంప్రదించగలరు . కావలసిన వారు ఫొన్ ద్వారా మాత్రమే సంప్రదించగలరు . sms , whatsup mess ki సమాధానం ఇవ్వడం జరగదు . మీరు సంప్రదించవలసిన ఫొన్ no      9885030034 . 


               కాళహస్తి వేంకటేశ్వరరావు 


             అనువంశిక ఆయుర్వేద వైద్యం 


                      9885030034

Panchang


 

*4 - భజగోవిందం

 *4 - భజగోవిందం / మోహముద్గర*

🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦


*భజగోవిందం శ్లోకం:-2*


*మూఢ జహీహి ధనాగమ తృష్ణాంకురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్* 

*యల్లభసే నిజకర్మోపా త్తం* 

*విత్తం తేన వినోదయ చిత్తమ్ ॥* *భజ ॥2.*


*ప్రతి||* మూఢ! = ఓ మూఢుడా! ధన ఆగమ తృష్ణామ్= ద్రవ్యసేకరణము మీదనున్న నీ ఆశను; జహీహి = వదలివేయుము; మనసి= నీమనసు నందు; వితృష్ణాం = ఆశ అనేది లేకుండా; సద్బుద్ధిం = కల్మష రహితమయిన ఆలోచనలను; కురు = చేయుము; నిజకర్మ) = నీ కర్తవ్యమయిన పనుల ద్వారా; ఉపాత్త = ఆర్జించిన; యత్ = ఏ; విత్తం = ధనము; లభసే = నీవు పొందెదవో; తేన = దానిచేత; చిత్తం = నీ సంకల్పాత్మక చిత్తాన్ని; వినోదయ = సంతోషింప జేయుము.


*భావం:-*


ఓయీ! మూర్ఖుడా ! ద్రవ్యసేకరణ మీద ఆశను వదిలివేసి ఉద్రేకా లూ అవేశాలూ లేకుండా నిల్చి సత్యపదార్థ సంబంధమైన ఆలోచనలను నీ మనస్సులో సృష్టించు: చేసినట్టి కర్తవ్యమయిన పనులకు ప్రతి ఫలంగా లభ్యమయిన ద్రవ్యం యేదయితేవుందో దానితో మాత్రమే మనస్సంతోషాన్ని అనుభవించు. (తృప్తిగా వుండు.)


*వివరణ:-*


సత్యపదార్థంలో ఒక భాగంగా అవతరించిన మనిషి - అతడి బుద్ధి అలా సత్య పదార్థ సంబంధమైన ఆలోచనలతో మాత్రం గడిపితే శాంతి స్థిరత్వాలు వుండిపోవును. కాని అతడిలోగల అతిరిక్తమైన మూర్తిమత్వము లేదా పృథక్త్వము ఆ సత్య పదార్దమునకు దూరంగా కదిలి బయట ప్రపంచములో తానేదో బాముకొందామని వెతుకుతుంది. క్షణ క్షణం మార్పుచెందే యీ జగత్తులో సంతోషమిచ్చే అనుభవాలు కూడ అస్థిరమైన నే అయినా ఇతడు వాటినే తన చుట్టూ సేకరించి తద్వారా అనుభవాల్ని పొందాలని సంకల్పిస్తాడు. కూడబెట్టాలని, సంపాదించాలని, దాచి ఈ స్థితే పెట్టాలని, అనుభవించాలని అదే తన ముఖ్యోద్దేశంగా పెట్టుకుంటాడు. మనిషిని అతడున్న శాంతి పదమునుంచి దించి లోభ మోహాల రాజ్యంలోకి లాగి తుఫాను రేగింపజేస్తుంది. అలా చేయటం చేతనే మనిషి అపార సంసార సముద్ర మధ్యంలోని దుఃఖాలతో చిక్కుపడి పోతున్నాడు. నిజానికి అతడు అనంతమైన శాంతి అనుభవాలకు వారసుడుగా గదా ఆ సత్యపదార్థ భాగంగా అవతరించింది!!


ఎనడు తన తెలియని తనం కారణంగా చిక్కులోపడి బాధనను ఆశను వదిలి భవిస్తుంటాడో అతడు మూఢుడు. ద్రవ్య సేకరణ మీది వెయ్యమనటంతో శ్రీశంకరులు ఈ సంసార దుఃఖాల సమస్యలన్నింటి నెత్తిన ఒక మేకు కొట్టినవారయినారు. ఇక్కడ ద్రవ్యం అనే పదానికి విశాలమైన అర్థం చెప్పుకోవాలి. ధనం సంపద మాత్రమే కాదు. ఏయే ప్రపంచ వస్తువులను తన అధీనములో వుంచుకొని తత్కాల సంతృప్తిని పొందాలని చిత్తము కోరుతుందో ఆ వస్తువులన్నీ కూడ యీ ద్రవ్యమనే పదం వల్ల సూచింప బడుతున్నవి.


ద్రవ్యమనేది యథాతథంగా వట్టి ప్రాపంచిక వస్తువు మాత్రమే దాని తప్పే ముంది కనుక! వేదాంతమూ యీ వస్తువులకు విరోధి మాత్రం కాదు. నీకున్న ద్రవ్యా న్ని వదిలి వెయ్యమని చెప్పలేదీ శ్లోకంలో పైగా ఉన్నదాంతో మాత్రం సంతోషపడమన్నారు. ద్రవ్య సేకరణపై తృష్ణ" అంటే యీ ప్రపంచ వస్తువులు తనకు సుఖసంతోషాల నివ్వగలవనే నమ్మకంతో వాటిని తనవిగా భావించిన సంబంధము మాత్రమే దానిని వదలి వేయాలి. బయట నున్న వస్తువులను తప్పుపట్టరాదు. మనిషికి వాటితోగల సంబంధమే వివేకయుతమై పవిత్రంగా వుండాలి. తృష్ణతో కూడి యుండరాదు.


ఈ తృష్ణవంటి మనోభావాలు త్యజించివేసి ఉద్రేకాలనుంచీ, ఆవేశాల నుంచీ మనస్సును కడిగివేసి వితృష్ణ స్థితిలో మనసునుంచుకొని సత్యపదార్థాన్ని ధ్యానం చెయ్యాలి. తృష్ణ వదలటం ఒక మెట్టు ధ్యానించటం రెండో మెట్టునా? అయినా కావచ్చు అలా లేక పోయినట్లయితే మనసును ప్రస్తుతం వున్న మెట్టుమీద నుంచి లాగివేసినట్లయి అది నట్టి శూన్య పదార్థంలో వుండాలి. ఇదెలా సంభవిస్తుంది? అందుకని దానికి రెండో మెట్టు నాసరాగా యివ్వా. పైగా మనస్సు యీ వినోదమిచ్చే పదార్థాలపై ప్రసరించి తన శక్తినలా వినియోగిస్తున్న దింతవరకు - ఇకనిప్పుడు ఆ పని తప్పించి వాటిమీదనున్న మనుస్సును వెనక్కు మళ్ళించినట్లయితే దానిలో వున్న శక్తి యేదారి చూసుకోవాలి? ఆ శక్తి అలా కూడుకొంటూవుంటే తిరిగి అది ఆ వినోదమిచ్చే వస్తువుల పైననే ప్రసరించవచ్చు. గట్లు త్రెంచుకొని విడివడిన కాలువలా, అందుకే తనను తను ఒకానొక సృజనా త్మకమైన పంథాలో మనసును మరల్చుకొనక పోతే ఆ చిక్కు తప్పదు. అందుకనే ఆ రెండో మెట్టు అయిన సత్యపదార్థ సేవనం కలిగి తీరాలని ధ్వని సూచన.


ప్రాపంచిక వస్తువులపై మోహం ఏదయితేవుందో అది మనసునుంచి తుడిచి వెయ్యి. కూడబెట్టాలనే లోభం, ద్రవ్యార్జనం పై తృష్ణ, పూర్తిగా తుడిచివెయ్యి. ఆ పైన ఆ మనుసును సత్యపదార్థం మీద, ఆ శాశ్వతుని మీద ఆ నిత్యత్వం మీద ప్రవర్తించనీ, అంతే చేయదగినది.


ఈ సలహాను వేదాంతి చెప్పినప్పుడు ప్రపంచంలో బ్రతికే యే అనుభవపరుడైనా యిలా ప్రశ్నించుతాడు:- “ద్రవ్యమనేది కావాలనుకోకుండా వుంటే దాన్ని సంపాదించకుండావుంటే మనం ఎలా బ్రతికేది?" అని వేదాంతి అనుభవ పూర్ణుడయి వుండాలి. అలా కాకపోతే ప్రాపంచిక చింతనం చేసే అనుభవజ్ఞుడు, ఆయన చెప్పిన వేదాంతాన్ని నిర్లక్ష్యం చేసి తనకు మనోహ్లాదకరమైన విషయ వాంఛల దోవలో నడిచిపోతాడు. చేయటానికి వీలుకాని పనులను అసంభవమైన పనులను చేయవలసిందని నిజమైన వేదాంతి అననే అనడు.


ఆయన అనుభవపూర్ణుడయి తగిన సమాధానం చెప్పగలడు.


ఈ శ్లోకంలో శంకరులు మనం యీ ప్రపంచంలో బ్రతకట మెలాగనే విషయం నిర్దిష్టంగా సూచించారు. మనం కర్మలు చేస్తూవుంటాము. అలాచేస్తూనే వుండాలి. తప్పదు: ఆ కర్మలవల్ల వాటి ఫలితంగా మనకు ఏదో లభిస్తుంది. ద్రవ్యమే లభిస్తుంది. దానితో తృప్తి మనస్సంతోషం పొంది జీవితాన్ని హాయిగా అనుభవించు. అది నీవు చెయ్యాల్సింది. అని శ్రీ శంకరుల సలహా మనకు మరి - మనస్సు యొక్క భ్రాంతి- భావన- లకు పరిమితి లేదు. మనిషి తన చేతిలోని కళ్ళెమును యీ భ్రాంతికి అధీనం చేసేటట్లయితే- తను కళ్ళు మూసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యీ రథాన్ని ఆపమంటాడు, లెమ్మనుకొంటూ నిద్రపోతే ఇక ఆవేగాన్ని ఆపటం అనేది అసంభవమే అవుతుంది. ఎందుకంటే కోరికల్ని సంతృప్తి పరచినకొద్దీ వృద్ధి పొందుతా యి. ఒక్కొక్క ఎత్తుకు ఎక్కినకొద్దీ చుట్టూ, కనబడే విస్తీర్ణం పెరుగుతూ వుంటుందో అలాగే ఒక కోరిక తీరినదన్న స్థితిలో దాని అనుషంగికమై ఉద్భవించే కోరికలు శరపరం సరలుగా సృష్టియగును. తృష్ణతీర్చిన కొద్దీ దాహమెక్కువయేది ఈ స్థితిలోనే. అది ఎక్కువయిన కొద్దీ దుఃఖ భూయిష్టమైన అసంతృప్తి అనే దంష్ట్రాలు శాంతి అనే మన రొట్టె ముక్కలోకి గుచ్చుకుపోతాయి.


మనిషి జీవితంలో అన్వేషించేది సంతృప్తి. కాని ధనం మనకు కొనిపెట్ట గలిగింది – విషయ వాంఛను తీర్చే వస్తువుల్ని మాత్రమే. సంతృప్తి కావాలనే మనకు తాత్కాలింకంగా యీ విషయవాంఛ తీరిన క్షణాన తృప్తి దర్శనమిస్తుంది గాక. కాన అంతలోనే తృష్ణ తిరిగి ఆవరిస్తుంది క్షణంలో ఆ తిరిగి రావడంలో నిర్దాక్షిణ్యంగా మనలను, నలగగొట్టాలని నిరంకుశత్వం మనపై నెఱపాలనే కాంక్షతో వస్తుంది. ఇక నిజమైన సుఖం అంతర్గతమైన శాంతిని పొందే మార్గమింకేమిటి? అదే ముఖ్య సమస్య. అందుకు ఒకటే మార్గం తృప్తితో మనసును నింపటం. వస్తువు లేకపోయినా సరే తృప్తి వుండాలి. తృప్తి అనేది ఒక భావం, ఈ భావాన్ని మనసులోనే సృష్టించవచ్చు. ఈ తృప్తి వున్నంతకా లం “లేదు” అని దిగులుపడే భావం రాదుకదా. ఉన్నవాటితో తృప్తిపడి లేనిదానికి చింత చెయ్యరాదన్నమాట. స్వయంగా చేసిన కష్టంద్వారా సంపాదించబడినదే కొద్దివుంటుందో, దానితోనే తృప్తి పడటం. ఫలానిదేదోకావాలి అని కోరటం కామించడం కూడదని ఆంక్ష. అలాంటి సంతృప్తిని కలిగివున్న హృదయంలోనే ఉన్నతమైన ఆలోచన లుంటవి. ఆత్మసంబంధమైన సత్యపదార్థము యొక్క కొలత లేమిటో అప్పుడే మనకు తట్టేది.


ధనాశ మనిషిని దిగజార్చుతుంది. రాగమనేది అంతూ పొంతూలేని కేశాలను తెచ్చి మీద పడేస్తుంది. ధనం సంపాదించటంలో క్లేశం. సంపాదించిన ధనాన్ని తెలివిగా పొదుపుచేసి కాపాడుకోవటం క్లేశం. కష్టపడి సంపాదించినది పోగొట్టుకుంటే క్లేశం. సంపాదించిన వస్తువును కాపాడుకోవటానికి ఎంతో ఆదుర్దాపడపడం మనం గమని స్తాము. ఇదంతా అంతులేని వ్యథలతో, బాధలతో సాగుతున్న నిత్య జీవన క్రీడా విలాసమే అనవచ్చు.


కఠోపనిషత్తులో నచికేతనుడనే చిన్నపిల్లవాడు తనగురువయిన యమధర్మ రాజుతో యీ భావాన్ని చక్కగా వెలిబుచ్చి చెప్పాడు. “సవిత్తేన తర్పణీయో మనుష్యః



* ' (కఠో-1) మనుష్యుడు తనకున్న వాటితో మాత్రమే యెన్నడూ తృప్తిచెందడు. అంతేకాక శంకరుల వివేకచూడామణిలో బృహదారణ్యకోపనిషత్తులోని మంత్రాన్ని ఉదహరించి, *"నాశనములేని అమృతత్వ పదవిని ధనసహాయంతో పొంద బూనడం ఊహించరానట్టిది.


మనం వదలివేయవలసిందల్లా లోభ భావం మాత్రమే. ఈ భావాన్ని వదలి వేస్తేనే ప్రపంచంలోని విషయానందాన్ని సంపూర్ణంగా అనుభవించగలం. ఈ వాగ్దానం ఈశావాస్యోపనిషత్తులో చదువుతాము. మనం "తేన త్యక్తేన భుంజీథాః మాగృథః కస్యస్విద్ధనం”


*సశేషం*

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

దాన ధర్మాలు

 🪷🪷🪷 *దాన ధర్మాలు* 🪷🪷🪷


మనిషి పుణ్యప్రాప్తి పొందేమార్గంకోసమే ధర్మానికి అత్యున్నత స్థానం ఇవ్వబడిఉంది.  అన్ని ధర్మాలలో, ప్రతిఫలం ఆశించకుండా ఎవరికైనా ఆనందంగా ఏదైనా ఇవ్వడం ఉత్తమమైన దాన ధర్మం. 

 యోగ్యమైన వ్యక్తికి సరైన సమయంలో, సరైన స్థలంలో ఇవ్వడం సాత్విక ధర్మం.  తృణప్రాయంగా ఇవ్వడం, ప్రతిఫలంగా ఏదైనా ఆశించడం రాజస ధర్మం.  నిరాడంబరంగా ఎదుటివ్యక్తి యొక్క స్వభావం చూడకుండా లక్ష్యం లేకుండా ప్రతిదీ ఇవ్వడం  సాత్వికదానం . ఇక మిగిలిన దానాలు అన్నీ నిషితం (పనికిరానివి). 

దానాలలో విద్యాదానం చాలా గొప్పది. వెల కట్టలేనిది. గురువు  విద్యను ప్రసాదిస్తాడు కాబట్టి  ఆయనకు ఎంతో విలువ ఉంటుంది. 


దానం చేసిన వస్తువులు ఏవైనా వాడుకలో కరిగిపోతాయి. విరాళం  అనేది అలా కాదు.  ఇది భక్తిని, బాధ్యతను మరింత పెంచుతుంది. నువ్వు విరాళం ఇవ్వలేని స్థితిలో ఉన్నావని కుంగిపోకు, పదిమంది ఉన్నతులచేత సహాయం చేయించు. అప్పుడది గొప్ప సత్కార్యం అవుతుంది. 

ఆదిశంకరుల వంటి మహర్షులు లోకానికి జ్ఞానాన్ని అందించి అజరామరమైన కీర్తిని పొందారు.  అదే విధంగా పూర్వకాలపు రాజులు భక్తులకు, పేదలకు విశేష ప్రతిఫలాన్ని అందించి కీర్తిని పొందారు. 


ప్రతి ఒక్కరూ తన శక్తి మేరకు దానం చేయడం ద్వారా కీర్తించబడతారు. దానం చేయని పిసినారుల మనసు మార్చి సహాయం చేయిచడం నిజమైన సహాయత కోవలోకి వస్తుంది. అదే మనఃశాంతి కలిగిస్తుంది. నీలో దాగివున్న దాగివున్న  ధర్మ గుణాన్ని పరావర్తన రూపాన్ని పొంది మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. ఒక దీపాన్ని వెలిగించిన వారికంటే, కొడిగట్టిపోతున్న ఆ దీపపు వత్తిని సరిచేసి ఆ జ్వాలను తిరిగి ప్రజ్వలింపచేసిన వారికే పుణ్య ప్రాప్తి కలుగుతుంది అని వేద ప్రమాణం.


పాపం నుండి నరకం వస్తుంది, పేదరికం నుండి పాపం వస్తుంది. నిస్వార్థం నుండి పేదరికం పోతుంది.  కావున ప్రతి ఒక్కరూ దానం చేయాలి.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామివారు*

హిందువుగా గర్విస్తున్నాను

 🙏🕉️

*నేను హిందువుగా గర్విస్తున్నాను. ఇది చదివితే మీరు కూడా..🙋‍♂️*


 *క్రైస్తవం* 

యేసు ఒక్కడే

బైబిల్ ఒక్కటే

అయినప్పటికీ, లాటిన్ కాథలిక్, సిరియన్ కాథలిక్, మార్తోమా, పెంటెకోస్ట్, సాల్వేషన్ ఆర్మీ, సెవెంత్ డే అడ్వెంటిస్ట్, ఆర్థడాక్స్, జాకోబైట్ వంటి

 *146 వర్గాలు* తమలో తాము కొట్టుకుంటూ తమ వర్గానికి చెందని ఏ ఇతర వర్గానికి చెందిన చర్చికి హాజరు కావు.

 *ఇస్లాం* 

అల్లా ఒక్కడే,

ఖురాన్ ఒక్కటే,

ప్రవక్త ఒక్కరే. కానీ

ఇప్పటికీ షియా, సున్నీ, అహ్మదీయా, సూఫీ, ముజాహిదీన్ వంటి 

*13 వర్గాలు* ఒకరి పై ఒకరు రక్తపు దాహంతో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వేర్వేరు మసీదులు ఉన్నాయి. కలిసి కూర్చొని నమాజ్ చేయకూడదు. ఎప్పుడూ మతం పేరుతో ఒకరినొకరు చంపుకోవాలనే ఉద్దేశ్యంతో ఉంటారు.

 *సనాతన ధర్మం* 

 *1280* మత గ్రంథాలు

 *10 వేలకు* పైగా కులాలు, లెక్కలేనన్ని పండుగలు మరియు పబ్బాలు,

లెక్కలేనన్ని దేవుడు మరియు దేవతలు.

లక్షకు పైగా ఉపకులాలు, వేల మంది ఋషులు, వందలాది భాషలు.

అయినా ఇప్పటికీ, హిందువులందరూ అన్ని దేవాలయాలకు వెళ్లి అన్ని పండుగలను జరుపుకుంటారు మరియు తమలో తాము శాంతియుతంగా మరియు నాగరికంగా జీవిస్తారు. ఇతర వర్గం మాత్రమే కాదు మతాలను గౌరవిస్తూ ఆదరిస్తూ పరమత సహనాన్ని పాటిస్తారు.

ఇదే *హిందూ మతం యొక్క గొప్పతనం* ,

అలాంటప్పుడు హిందువులు హిందూ మతం గురించి ఎందుకు గర్వపడకూడదు?

 *మేము హిందువులమని గర్వంగా చెప్పండి* 

🙏🕉️

బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడిగా

 🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

 *గురువు పట్ల శిష్యుడి కర్తవ్యం*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడిగా గురువు తపించేది శిష్యుడికోసమే.*


*అంతగా పరితపించే గురువు శిష్యుడినుండి ఏం కోరతాడు? ఏమీ ఉండదు. అంటే తను అడగ దలుచుకున్నది బలవంతంగా అణచుకోవడం కాదు. కోరుకోవడానికి ఆయనకు మరే కోరిక ఉండదు కనుక. ’నాకిది కావాల్రా’ అని అడగడు. కారణం –ఆయన కోరుకుంటే ఇచ్చేవాడు వేరొకడున్నాడు (పరమేశ్వరుడు). ఆయన్ని అడుగుతాడు తప్ప శిష్యుడి ముందు చేయిచాపడు. అయనకా అవసరం లేదు కూడా. ఆయన పరిపూర్ణుడు. ఎప్పుడూ తృప్తితో ఉంటాడు.*


*మరి అటువంటి గురువు పట్ల శిష్యుడి కర్తవ్యం?*


*గురువుగారు శరీరంలో ఉండేటట్లు చూసుకోవడమే. శరీరం అనిత్యమని గురువుకు తెలుసు. అది పడిపోతుంది. కించిత్‌ బెంగపెట్టుకోడు. ‘నేను ఆత్మ, శాశ్వతం. ఎక్కడికీ వెళ్ళను’ అన్న అవగాహనతో పరమ సంతోషంతో ఉంటాడు. ఈ శరీరంతో అనుభవించడానికి ఆయనకు భోగాపేక్ష ఉండదు. ఒకవేళ కష్టం వస్తే... గతజన్మల తాలూకు కర్మఫలం పోతున్నదని అనుభవిస్తాడు. కానీ గురువుగారి శరీరం లేకపోతే నష్టం కలిగేది శిష్యులకు.*


*ఊపిరి త్వరగా తీసి త్వరగా విడిచిపెడుతుంటే ఆయువు క్షీణిస్తుంటుంది. బోధనలు నిర్విరామంగా చేస్తూంటాడు గురువు. ఆయన ఆయువు త్వరగా క్షీణిస్తుంది. ఇలా శిష్యులకోసం తన ఆయువును తాను తగ్గించుకుంటున్న గురువుకు శిష్యుడు చెయ్యడానికేమీ ఉండదు. మరి ఏం చేయాలి ?*


*కేవలం శుశ్రూష మాత్రమే చేయగలడు. ఆయన శరీరం సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడం కోసమని తాపత్రయపడి చేసే సేవే శుశ్రూష. ఇది స్థాన శుశ్రూష అని, దేహ శుశ్రూష అని రెండు రకాలు. స్థాన శుశ్రూష అంటే – గురువుగారి ఇల్లు సాక్షాత్‌ పరమేశ్వరుడు కొలువైన దేవాలయంతో సమానం. అందుకే గురువుగారి ఇంటిపక్కనుంచి వెళ్ళేటప్పుడు అది గుడి అన్న భావనతో ప్రదక్షిణంగా వెడతారు చాలామంది.*


*విరాటపర్వంలో ఉత్తరకుమారుడితో అర్జునుడు– ‘‘రథం నడపడంలో నీకంత ప్రవేశం లేదు. ఆయన మా గురువు ద్రోణాచార్యులవారు. వారు నాకు పరమ పూజ్యులు. నీవు రథం నడిపేటప్పుడు పొరబాటున కూడా నా రథాన్ని మా గురువుగారి రథం ముందు పెట్టవద్దు. మా గురువుగారి రథం నా ఎడమవైపున కూడా ఉండడానికి వీల్లేదు. వారి రథం నా కుడి చేతివైపునే ఉండాలి. కారణం– నేను మా గురువుగారి మీద బాణం వెయ్యను. గురువుగారే ఒకవేళ ముందు వేస్తే...నేను క్షత్రియుడిని కాబట్టి దానికి బదులుగా బాణం వేస్తాను తప్ప నా అంతట నేను వేయను. యుద్ధరంగంలోకి వెళ్ళేటప్పుడు కూడా వారి రథాలకు ప్రదక్షిణచేసి లోపలకు నడుపు’’ అన్నాడు. దీన్ని స్థాన శుశ్రూష అంటారు. దానివల్ల గురువులకు ఒరిగేదేమీ ఉండదు. శిష్యుడి స్థాయి పెరుగుతుంది. అంతే.*


*గురువుగారు ఉన్న ఇంటిని శుభ్రం చేయడం, గురువుగారి అవసరాలు గుర్తెరిగి సమకూర్చడంవంటివి చేస్తారు.*


*దేహ శుశ్రూష – దేహము అంటే దహ్యమానమయిపోతుంది. ఆయన శరీరం ఒడలిపోతుంది. నీరసపడిపోతుంది. వయసు పెద్దదవుతుంది. శరీరంలో బలమూ తగ్గిపోతుంది. కానీ ఆయనకు శిష్యుడిపట్ల ప్రేమ ఎక్కువవుతుంటుంది. ఆ గురువు ఉండాలి ఆ శరీరంలో. అందుకని గురువుగారు పడుకుంటే ఆయన కాళ్ళు ఒత్తుతారు. మంచినీళ్ళు తెచ్చిస్తుంటారు. గురువుగారు నదీస్నానం చేస్తుంటే ప్రవాహదిశలో దిగువకు శిష్యుడు స్నానం చేస్తాడు. గురువుగారిని తాకి వస్తున్న నీరు గంగకన్నా గొప్పది.*


*శ్రీ గురుభ్యోనమః!*

🛐🛐🛐🛐🛐🛐🛐🛐

*ఓం శాంతిః శాంతిః శాంతిః!*

*సర్వేజనా సుఖినోభవంతు!!*

*ఓం తత్సత్!!*


*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*

*ఓం నమః శివాయ!!!*

🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐

*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

పంచాంగం 26.10.2024 Saturday,

 ఈ రోజు పంచాంగం 26.10.2024 Saturday,


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: దక్షిణాయనం శరదృతు ఆశ్వీయుజ మాస కృష్ణ పక్ష దశమి తిథి స్థిర వాసర: ఆశ్రేష నక్షత్రం శుక్ల యోగః: వణిజ తదుపరి భద్ర కరణం. ఇది ఈరోజు పంచాంగం.


 దశమి రా.తె 05:23 వరకు.

 ఆశ్లేష పగలు 09:47 వరకు.


సూర్యోదయం : 06:16

సూర్యాస్తమయం : 05:44


వర్జ్యం : రాత్రి 11:06 నుండి  12:52 వరకు.


దుర్ముహూర్తం : ఉదయం 06:16 నుండి 07:48 వరకు.


అమృతఘడియలు : పగలు 08:02 నుండి 09:47 వరకు.


రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.


యమగండం: మధ్యాహ్నం 01:30 నుండి 03:00  వరకు.

.


శుభోదయ:, నమస్కార:

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం దక్షిణాయణం - శరదృతువు - ఆశ్వయుజ మాసం - కృష్ణ పక్షం - దశమి - ఆశ్రేష -‌‌ స్థిర వాసరే* (26.10.2024)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

-----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*