26, అక్టోబర్ 2024, శనివారం

దాన ధర్మాలు

 🪷🪷🪷 *దాన ధర్మాలు* 🪷🪷🪷


మనిషి పుణ్యప్రాప్తి పొందేమార్గంకోసమే ధర్మానికి అత్యున్నత స్థానం ఇవ్వబడిఉంది.  అన్ని ధర్మాలలో, ప్రతిఫలం ఆశించకుండా ఎవరికైనా ఆనందంగా ఏదైనా ఇవ్వడం ఉత్తమమైన దాన ధర్మం. 

 యోగ్యమైన వ్యక్తికి సరైన సమయంలో, సరైన స్థలంలో ఇవ్వడం సాత్విక ధర్మం.  తృణప్రాయంగా ఇవ్వడం, ప్రతిఫలంగా ఏదైనా ఆశించడం రాజస ధర్మం.  నిరాడంబరంగా ఎదుటివ్యక్తి యొక్క స్వభావం చూడకుండా లక్ష్యం లేకుండా ప్రతిదీ ఇవ్వడం  సాత్వికదానం . ఇక మిగిలిన దానాలు అన్నీ నిషితం (పనికిరానివి). 

దానాలలో విద్యాదానం చాలా గొప్పది. వెల కట్టలేనిది. గురువు  విద్యను ప్రసాదిస్తాడు కాబట్టి  ఆయనకు ఎంతో విలువ ఉంటుంది. 


దానం చేసిన వస్తువులు ఏవైనా వాడుకలో కరిగిపోతాయి. విరాళం  అనేది అలా కాదు.  ఇది భక్తిని, బాధ్యతను మరింత పెంచుతుంది. నువ్వు విరాళం ఇవ్వలేని స్థితిలో ఉన్నావని కుంగిపోకు, పదిమంది ఉన్నతులచేత సహాయం చేయించు. అప్పుడది గొప్ప సత్కార్యం అవుతుంది. 

ఆదిశంకరుల వంటి మహర్షులు లోకానికి జ్ఞానాన్ని అందించి అజరామరమైన కీర్తిని పొందారు.  అదే విధంగా పూర్వకాలపు రాజులు భక్తులకు, పేదలకు విశేష ప్రతిఫలాన్ని అందించి కీర్తిని పొందారు. 


ప్రతి ఒక్కరూ తన శక్తి మేరకు దానం చేయడం ద్వారా కీర్తించబడతారు. దానం చేయని పిసినారుల మనసు మార్చి సహాయం చేయిచడం నిజమైన సహాయత కోవలోకి వస్తుంది. అదే మనఃశాంతి కలిగిస్తుంది. నీలో దాగివున్న దాగివున్న  ధర్మ గుణాన్ని పరావర్తన రూపాన్ని పొంది మోక్ష మార్గాన్ని చూపిస్తుంది. ఒక దీపాన్ని వెలిగించిన వారికంటే, కొడిగట్టిపోతున్న ఆ దీపపు వత్తిని సరిచేసి ఆ జ్వాలను తిరిగి ప్రజ్వలింపచేసిన వారికే పుణ్య ప్రాప్తి కలుగుతుంది అని వేద ప్రమాణం.


పాపం నుండి నరకం వస్తుంది, పేదరికం నుండి పాపం వస్తుంది. నిస్వార్థం నుండి పేదరికం పోతుంది.  కావున ప్రతి ఒక్కరూ దానం చేయాలి.


-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామివారు*

కామెంట్‌లు లేవు: