*4 - భజగోవిందం / మోహముద్గర*
🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦🥦
*భజగోవిందం శ్లోకం:-2*
*మూఢ జహీహి ధనాగమ తృష్ణాంకురు సద్బుద్ధిం మనసి వితృష్ణామ్*
*యల్లభసే నిజకర్మోపా త్తం*
*విత్తం తేన వినోదయ చిత్తమ్ ॥* *భజ ॥2.*
*ప్రతి||* మూఢ! = ఓ మూఢుడా! ధన ఆగమ తృష్ణామ్= ద్రవ్యసేకరణము మీదనున్న నీ ఆశను; జహీహి = వదలివేయుము; మనసి= నీమనసు నందు; వితృష్ణాం = ఆశ అనేది లేకుండా; సద్బుద్ధిం = కల్మష రహితమయిన ఆలోచనలను; కురు = చేయుము; నిజకర్మ) = నీ కర్తవ్యమయిన పనుల ద్వారా; ఉపాత్త = ఆర్జించిన; యత్ = ఏ; విత్తం = ధనము; లభసే = నీవు పొందెదవో; తేన = దానిచేత; చిత్తం = నీ సంకల్పాత్మక చిత్తాన్ని; వినోదయ = సంతోషింప జేయుము.
*భావం:-*
ఓయీ! మూర్ఖుడా ! ద్రవ్యసేకరణ మీద ఆశను వదిలివేసి ఉద్రేకా లూ అవేశాలూ లేకుండా నిల్చి సత్యపదార్థ సంబంధమైన ఆలోచనలను నీ మనస్సులో సృష్టించు: చేసినట్టి కర్తవ్యమయిన పనులకు ప్రతి ఫలంగా లభ్యమయిన ద్రవ్యం యేదయితేవుందో దానితో మాత్రమే మనస్సంతోషాన్ని అనుభవించు. (తృప్తిగా వుండు.)
*వివరణ:-*
సత్యపదార్థంలో ఒక భాగంగా అవతరించిన మనిషి - అతడి బుద్ధి అలా సత్య పదార్థ సంబంధమైన ఆలోచనలతో మాత్రం గడిపితే శాంతి స్థిరత్వాలు వుండిపోవును. కాని అతడిలోగల అతిరిక్తమైన మూర్తిమత్వము లేదా పృథక్త్వము ఆ సత్య పదార్దమునకు దూరంగా కదిలి బయట ప్రపంచములో తానేదో బాముకొందామని వెతుకుతుంది. క్షణ క్షణం మార్పుచెందే యీ జగత్తులో సంతోషమిచ్చే అనుభవాలు కూడ అస్థిరమైన నే అయినా ఇతడు వాటినే తన చుట్టూ సేకరించి తద్వారా అనుభవాల్ని పొందాలని సంకల్పిస్తాడు. కూడబెట్టాలని, సంపాదించాలని, దాచి ఈ స్థితే పెట్టాలని, అనుభవించాలని అదే తన ముఖ్యోద్దేశంగా పెట్టుకుంటాడు. మనిషిని అతడున్న శాంతి పదమునుంచి దించి లోభ మోహాల రాజ్యంలోకి లాగి తుఫాను రేగింపజేస్తుంది. అలా చేయటం చేతనే మనిషి అపార సంసార సముద్ర మధ్యంలోని దుఃఖాలతో చిక్కుపడి పోతున్నాడు. నిజానికి అతడు అనంతమైన శాంతి అనుభవాలకు వారసుడుగా గదా ఆ సత్యపదార్థ భాగంగా అవతరించింది!!
ఎనడు తన తెలియని తనం కారణంగా చిక్కులోపడి బాధనను ఆశను వదిలి భవిస్తుంటాడో అతడు మూఢుడు. ద్రవ్య సేకరణ మీది వెయ్యమనటంతో శ్రీశంకరులు ఈ సంసార దుఃఖాల సమస్యలన్నింటి నెత్తిన ఒక మేకు కొట్టినవారయినారు. ఇక్కడ ద్రవ్యం అనే పదానికి విశాలమైన అర్థం చెప్పుకోవాలి. ధనం సంపద మాత్రమే కాదు. ఏయే ప్రపంచ వస్తువులను తన అధీనములో వుంచుకొని తత్కాల సంతృప్తిని పొందాలని చిత్తము కోరుతుందో ఆ వస్తువులన్నీ కూడ యీ ద్రవ్యమనే పదం వల్ల సూచింప బడుతున్నవి.
ద్రవ్యమనేది యథాతథంగా వట్టి ప్రాపంచిక వస్తువు మాత్రమే దాని తప్పే ముంది కనుక! వేదాంతమూ యీ వస్తువులకు విరోధి మాత్రం కాదు. నీకున్న ద్రవ్యా న్ని వదిలి వెయ్యమని చెప్పలేదీ శ్లోకంలో పైగా ఉన్నదాంతో మాత్రం సంతోషపడమన్నారు. ద్రవ్య సేకరణపై తృష్ణ" అంటే యీ ప్రపంచ వస్తువులు తనకు సుఖసంతోషాల నివ్వగలవనే నమ్మకంతో వాటిని తనవిగా భావించిన సంబంధము మాత్రమే దానిని వదలి వేయాలి. బయట నున్న వస్తువులను తప్పుపట్టరాదు. మనిషికి వాటితోగల సంబంధమే వివేకయుతమై పవిత్రంగా వుండాలి. తృష్ణతో కూడి యుండరాదు.
ఈ తృష్ణవంటి మనోభావాలు త్యజించివేసి ఉద్రేకాలనుంచీ, ఆవేశాల నుంచీ మనస్సును కడిగివేసి వితృష్ణ స్థితిలో మనసునుంచుకొని సత్యపదార్థాన్ని ధ్యానం చెయ్యాలి. తృష్ణ వదలటం ఒక మెట్టు ధ్యానించటం రెండో మెట్టునా? అయినా కావచ్చు అలా లేక పోయినట్లయితే మనసును ప్రస్తుతం వున్న మెట్టుమీద నుంచి లాగివేసినట్లయి అది నట్టి శూన్య పదార్థంలో వుండాలి. ఇదెలా సంభవిస్తుంది? అందుకని దానికి రెండో మెట్టు నాసరాగా యివ్వా. పైగా మనస్సు యీ వినోదమిచ్చే పదార్థాలపై ప్రసరించి తన శక్తినలా వినియోగిస్తున్న దింతవరకు - ఇకనిప్పుడు ఆ పని తప్పించి వాటిమీదనున్న మనుస్సును వెనక్కు మళ్ళించినట్లయితే దానిలో వున్న శక్తి యేదారి చూసుకోవాలి? ఆ శక్తి అలా కూడుకొంటూవుంటే తిరిగి అది ఆ వినోదమిచ్చే వస్తువుల పైననే ప్రసరించవచ్చు. గట్లు త్రెంచుకొని విడివడిన కాలువలా, అందుకే తనను తను ఒకానొక సృజనా త్మకమైన పంథాలో మనసును మరల్చుకొనక పోతే ఆ చిక్కు తప్పదు. అందుకనే ఆ రెండో మెట్టు అయిన సత్యపదార్థ సేవనం కలిగి తీరాలని ధ్వని సూచన.
ప్రాపంచిక వస్తువులపై మోహం ఏదయితేవుందో అది మనసునుంచి తుడిచి వెయ్యి. కూడబెట్టాలనే లోభం, ద్రవ్యార్జనం పై తృష్ణ, పూర్తిగా తుడిచివెయ్యి. ఆ పైన ఆ మనుసును సత్యపదార్థం మీద, ఆ శాశ్వతుని మీద ఆ నిత్యత్వం మీద ప్రవర్తించనీ, అంతే చేయదగినది.
ఈ సలహాను వేదాంతి చెప్పినప్పుడు ప్రపంచంలో బ్రతికే యే అనుభవపరుడైనా యిలా ప్రశ్నించుతాడు:- “ద్రవ్యమనేది కావాలనుకోకుండా వుంటే దాన్ని సంపాదించకుండావుంటే మనం ఎలా బ్రతికేది?" అని వేదాంతి అనుభవ పూర్ణుడయి వుండాలి. అలా కాకపోతే ప్రాపంచిక చింతనం చేసే అనుభవజ్ఞుడు, ఆయన చెప్పిన వేదాంతాన్ని నిర్లక్ష్యం చేసి తనకు మనోహ్లాదకరమైన విషయ వాంఛల దోవలో నడిచిపోతాడు. చేయటానికి వీలుకాని పనులను అసంభవమైన పనులను చేయవలసిందని నిజమైన వేదాంతి అననే అనడు.
ఆయన అనుభవపూర్ణుడయి తగిన సమాధానం చెప్పగలడు.
ఈ శ్లోకంలో శంకరులు మనం యీ ప్రపంచంలో బ్రతకట మెలాగనే విషయం నిర్దిష్టంగా సూచించారు. మనం కర్మలు చేస్తూవుంటాము. అలాచేస్తూనే వుండాలి. తప్పదు: ఆ కర్మలవల్ల వాటి ఫలితంగా మనకు ఏదో లభిస్తుంది. ద్రవ్యమే లభిస్తుంది. దానితో తృప్తి మనస్సంతోషం పొంది జీవితాన్ని హాయిగా అనుభవించు. అది నీవు చెయ్యాల్సింది. అని శ్రీ శంకరుల సలహా మనకు మరి - మనస్సు యొక్క భ్రాంతి- భావన- లకు పరిమితి లేదు. మనిషి తన చేతిలోని కళ్ళెమును యీ భ్రాంతికి అధీనం చేసేటట్లయితే- తను కళ్ళు మూసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యీ రథాన్ని ఆపమంటాడు, లెమ్మనుకొంటూ నిద్రపోతే ఇక ఆవేగాన్ని ఆపటం అనేది అసంభవమే అవుతుంది. ఎందుకంటే కోరికల్ని సంతృప్తి పరచినకొద్దీ వృద్ధి పొందుతా యి. ఒక్కొక్క ఎత్తుకు ఎక్కినకొద్దీ చుట్టూ, కనబడే విస్తీర్ణం పెరుగుతూ వుంటుందో అలాగే ఒక కోరిక తీరినదన్న స్థితిలో దాని అనుషంగికమై ఉద్భవించే కోరికలు శరపరం సరలుగా సృష్టియగును. తృష్ణతీర్చిన కొద్దీ దాహమెక్కువయేది ఈ స్థితిలోనే. అది ఎక్కువయిన కొద్దీ దుఃఖ భూయిష్టమైన అసంతృప్తి అనే దంష్ట్రాలు శాంతి అనే మన రొట్టె ముక్కలోకి గుచ్చుకుపోతాయి.
మనిషి జీవితంలో అన్వేషించేది సంతృప్తి. కాని ధనం మనకు కొనిపెట్ట గలిగింది – విషయ వాంఛను తీర్చే వస్తువుల్ని మాత్రమే. సంతృప్తి కావాలనే మనకు తాత్కాలింకంగా యీ విషయవాంఛ తీరిన క్షణాన తృప్తి దర్శనమిస్తుంది గాక. కాన అంతలోనే తృష్ణ తిరిగి ఆవరిస్తుంది క్షణంలో ఆ తిరిగి రావడంలో నిర్దాక్షిణ్యంగా మనలను, నలగగొట్టాలని నిరంకుశత్వం మనపై నెఱపాలనే కాంక్షతో వస్తుంది. ఇక నిజమైన సుఖం అంతర్గతమైన శాంతిని పొందే మార్గమింకేమిటి? అదే ముఖ్య సమస్య. అందుకు ఒకటే మార్గం తృప్తితో మనసును నింపటం. వస్తువు లేకపోయినా సరే తృప్తి వుండాలి. తృప్తి అనేది ఒక భావం, ఈ భావాన్ని మనసులోనే సృష్టించవచ్చు. ఈ తృప్తి వున్నంతకా లం “లేదు” అని దిగులుపడే భావం రాదుకదా. ఉన్నవాటితో తృప్తిపడి లేనిదానికి చింత చెయ్యరాదన్నమాట. స్వయంగా చేసిన కష్టంద్వారా సంపాదించబడినదే కొద్దివుంటుందో, దానితోనే తృప్తి పడటం. ఫలానిదేదోకావాలి అని కోరటం కామించడం కూడదని ఆంక్ష. అలాంటి సంతృప్తిని కలిగివున్న హృదయంలోనే ఉన్నతమైన ఆలోచన లుంటవి. ఆత్మసంబంధమైన సత్యపదార్థము యొక్క కొలత లేమిటో అప్పుడే మనకు తట్టేది.
ధనాశ మనిషిని దిగజార్చుతుంది. రాగమనేది అంతూ పొంతూలేని కేశాలను తెచ్చి మీద పడేస్తుంది. ధనం సంపాదించటంలో క్లేశం. సంపాదించిన ధనాన్ని తెలివిగా పొదుపుచేసి కాపాడుకోవటం క్లేశం. కష్టపడి సంపాదించినది పోగొట్టుకుంటే క్లేశం. సంపాదించిన వస్తువును కాపాడుకోవటానికి ఎంతో ఆదుర్దాపడపడం మనం గమని స్తాము. ఇదంతా అంతులేని వ్యథలతో, బాధలతో సాగుతున్న నిత్య జీవన క్రీడా విలాసమే అనవచ్చు.
కఠోపనిషత్తులో నచికేతనుడనే చిన్నపిల్లవాడు తనగురువయిన యమధర్మ రాజుతో యీ భావాన్ని చక్కగా వెలిబుచ్చి చెప్పాడు. “సవిత్తేన తర్పణీయో మనుష్యః
* ' (కఠో-1) మనుష్యుడు తనకున్న వాటితో మాత్రమే యెన్నడూ తృప్తిచెందడు. అంతేకాక శంకరుల వివేకచూడామణిలో బృహదారణ్యకోపనిషత్తులోని మంత్రాన్ని ఉదహరించి, *"నాశనములేని అమృతత్వ పదవిని ధనసహాయంతో పొంద బూనడం ఊహించరానట్టిది.
మనం వదలివేయవలసిందల్లా లోభ భావం మాత్రమే. ఈ భావాన్ని వదలి వేస్తేనే ప్రపంచంలోని విషయానందాన్ని సంపూర్ణంగా అనుభవించగలం. ఈ వాగ్దానం ఈశావాస్యోపనిషత్తులో చదువుతాము. మనం "తేన త్యక్తేన భుంజీథాః మాగృథః కస్యస్విద్ధనం”
*సశేషం*
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి