3, డిసెంబర్ 2024, మంగళవారం

గణపతి ఉపనిషత్తు 🙏 మొదటి భాగం

 🙏గణపతి ఉపనిషత్తు 🙏

                   మొదటి భాగం 

ముందు గణపతి ఉపనిషత్తు వ్రాసి తరువాత అర్ధం ఇచ్చాను గమనించగలరు.

ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః! భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః!

స్థిరైరంగైస్తుష్ఠువాగ్ం సస్తనూభిః! వ్యశేమ దేవహితం యదాయుః! 

స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః! స్వస్తి నః పూషా విశ్వవేదాః !

స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః! స్వస్తి నో బృహస్పతిర్దధాతు !


               ఓం శాంతిః శాంతిః శాంతిః

అర్థం:

1: ఓం , ఓ దేవా నీ దయవల్ల , శుభకరమైనవి మన చెవులతో విందుము గాక , 2: మనం 

 ఏది శుభప్రదమైనదో మరియు ఆరాధనీయమైనదో అది మన కళ్లతో చూద్దాం ,

3: మన మనస్సుశరీరాలతో స్థిరత్వంతో మనం ప్రార్థిద్దాం , 4: దేవతలు (దేవుని సేవ కోసం) మనకిచ్చిన మన ఆయుష్షును అందిస్తాము . ఇన్ద్రో వృద్ధశ్రవాః । స్వస్తి నః పూషా విశ్వవేదః । స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః । స్వస్తి నో బృహస్పతిర్దధాతు

మహిమ గల ఇంద్రుడుమనకు క్షేమమును ప్రసాదించుగాక, సర్వజ్ఞుడైనపూషణుడుమనకు క్షేమమును ప్రసాదించుగాక, : రక్షణ వలయుడైన తార్క్షయుడు క్షేమమును ప్రసాదించు గాక .​​​​​ మాపై బృహస్పతి మాకు క్షేమాన్ని ప్రసాదించుగాక , : ఓం , శాంతి , శాంతి , శాంతి 


ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి! త్వమేవ కేవలం కర్తాఽసి ! త్వమేవ కేవలం ధర్తాఽసి! త్వమేవ కేవలం హర్తాఽసి! త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి! త్వం సాక్షాదాత్మాఽసి నిత్యమ్!1

ఋతం వచ్మి సత్యం వచ్మి 2 


అవ త్వం మామ్, అవ వక్తారమ్, అవ శ్రోతారమ్, అవ దాతారమ్, అవ ధాతారమ్, 

అవానూచానమవ శిష్యమ్, అవ పశ్చాత్తాత్, అవ పురస్తాత్, అవోత్తరాత్తాత్, అవ దక్షిణాత్తాత్, 

అవ చోర్ధ్వాత్తాత్, అవాధరాత్తాత్, సర్వతో మాం పాహి పాహి సమంతాత్! 3


త్వం వాఙ్మయస్త్వం చిన్మయః! త్వమానందమయస్త్వం బ్రహ్మమయః!

త్వం సచ్చిదానందాఽద్వితీయోఽసి! త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి! త్వం జ్ఞానమయో విజ్ఞానమయోఽసి! 4


సర్వం జగదిదం త్వత్తో జాయతే! సర్వం జగదిదం త్వత్తస్తిష్ఠతి! సర్వం జగదిదం త్వయి లయమేష్యతి! సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి! త్వం భూమిరాపోఽనలోఽనిలో నభః త్వం చత్వారి వాక్పదాని! 5


త్వం గుణత్రయాతీతః! త్వం దేహత్రయాతీతః! త్వం కాలత్రయాతీతః! త్వం అవస్థాత్రయాతీతః!

త్వం మూలాధారస్థితోఽసి నిత్యమ్! త్వం శక్తిత్రయాత్మకః! త్వాం యోగినో ధ్యాయంతి నిత్యమ్!

త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువః స్వరోమ్! 6


గణాదిం పూర్వముచ్చార్య! వర్ణాదీం స్తదనంతరమ్! అనుస్వారః పరతరః! అర్ధేందులసితమ్!

తారేణ ఋద్ధమ్! ఏతత్తవ మనుస్వరూపమ్! గకారః పూర్వరూపమ్ అకారో మధ్యమరూపమ్ అనుస్వారశ్చాంత్యరూపమ్! బిందురుత్తరరూపమ్! నాదః సంధానమ్! సంహితా సంధిః!

సైషా గణేశవిద్యా! గణక ఋషిః! నిచృద్గాయత్రీచ్ఛందః! శ్రీ మహాగణపతిర్దేవతా ఓం గం గణపతయే నమః!7


ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి

తన్నో దంతిః ప్రచోదయాత్ 8


ఏకదంతం చతుర్ హస్తం పాశమంకుశధారిణమ్

రదం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజమ్!

రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససమ్ 

రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితమ్!

భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతమ్ 

ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్పరమ్!

ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః 9


నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేఽస్తు

లంబోదరాయైకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః 10


ఏతదథర్వశీర్షం యోఽధీతే స బ్రహ్మభూయాయ కల్పతే

స సర్వవిఘ్నైర్న బాధ్యతే స సర్వతః సుఖమేధతే

స పంచమహాపాపాత్ ప్రముచ్యతే !


సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి

ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి 

సాయం ప్రాతః ప్రయుంజానోఽపాపో భవతి 

సర్వత్రాధీయానోపవిఘ్నో భవతి! ధర్మార్థకామమోక్షం చ విందతి


ఇదమథర్వశీర్షమశిష్యాయ న దేయమ్ 

యో యది మోహాద్ దాస్యతి స పాపీయాన్ భవతి 

సహస్రావర్తనాద్యం యం కామమధీతే తం తమనేన సాధయేత్ 11


అనేన గణపతిమభిషించతి స వాగ్మీ భవతి చతుర్థ్యామనశ్నన్ జపతి స విద్యావాన్ భవతి ఇత్యథర్వణవాక్యమ్ బ్రహ్మాద్యాచరణం విద్యాన్నబిభేతి కదాచనేతి 12


యో దూర్వాంకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి 

యో లాజైర్యజతి స యశోవాన్ భవతి స మేధావాన్ భవతి 

యో మోదకసహస్రేణ యజతి స వాంఛితఫలమవాప్నోతి

యః సాజ్య సమిద్భిర్యజతి స సర్వం లభతే స సర్వం లభతే 13


అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్ గ్రాహయిత్వా సూర్యవర్చస్వీ భవతి 

సూర్యగ్రహే మహానద్యాం ప్రతిమాసన్నిధౌ వా జప్త్వా స సిద్ధమంత్రో భవతి 

మహావిఘ్నాత్ ప్రముచ్యతే మహాదోషాత్ ప్రముచ్యతే మహాపాపాత్ ప్రముచ్యతే 

మహాప్రత్యవాయాత్ ప్రముచ్యతే స సర్వవిద్భవతి స సర్వవిద్భవతి 


య ఏవం వేద ఇత్యుపనిషత్ 14


ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్ఠువాగ్ం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు!


ఓం శాంతిః శాంతిః శాంతిః

ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి! త్వమేవ కేవలం కర్తాఽసి ! త్వమేవ కేవలం ధర్తాఽసి! త్వమేవ కేవలం హర్తాఽసి! త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి! త్వం సాక్షాదాత్మాఽసి నిత్యమ్!1

ఋతం వచ్మి సత్యం వచ్మి 2 


హరిః ఓం! గం ! గణపతి బీజం.గణపతి రూపం కూడా ఎల్లాగంటే సంస్కృతంలోని "గ " చూడండి పరిశీలించండి రెండు నిలువు గీతలు ఉంటాయి. ఒక గీత క్రింద వంపు తిరుగుతుంది j ఇల్లాగ అది తొండము. l ప్రక్కగీత దంతం ఇప్పుడు రెండు గీతలు గణపతి యొక్క తొండము,దంతం కాబట్టి గకారమే గణపతి.

నమస్తే గణపతయే... ఓ గణములకు పతియైన వాడా! - నమః తే...నీకు నమస్కారం. (నీ ముందు అహంకార రహితమైన నా మనస్సును సమర్పిస్తున్నాను.)

త్వమేవ ప్రత్యక్షం తత్త్వమసి

త్వమేవ - నీవు మాత్రమే ప్రత్యక్షంగా, "తత్" .. అది ఏదైతే సనాతనమో, ఏదైతే ఆది అంత్యములు లేనిదో, అనిర్వచనీయమో, భావానికీ శబ్దానికీ అతీతమైనదో "అది (అట్టి పరమాత్మ )" నీవు (త్వం) అయి ఉన్నావు (అసి).

త్వమేవ కేవలం కర్తాసి... అన్నింటికీ నీవే కర్తవు,

త్వమేవ కేవలం ధర్తాఽసి! 

 నీవే ధరించే వానివి (ధర్త)

త్వమేవ కేవలం హర్తాఽసి! నీవే లయం చేసుకునే వానివి (హర్త).

త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి

నీవు మాత్రమే సర్వమూ, బ్రహ్మమూ అయి ఉన్నావు కదా (ఖల్విదం)

ఋతం వచ్మి సత్యం వచ్మి

ఋతం-- ఇతః పూర్వం ఋజువు చేయబడిన వాడివి నీవే, సత్యానివీ నీవే. అవ అంటే రక్షించు, కాపాడు ఋతం - సత్యం రెండింటికి తేడా ఏమిటంటే మన అనుభవంతో చెప్పేది సత్యం.మన అనుభవంతో కాకుండా పెద్దలు చెప్పిన విషయం ఋతం. మామ్ -- నన్ను, వక్తారం ... ప్రవచించే వక్తను గురువును , శ్రోతారమ్... జాగ్రత్తగా వినే శ్రోతలను శిష్యులను , దాతారమ్ ... దానం చేసే దాతలను, ధాతారమ్.... బ్రహ్మాదులను, అనూచానంగా(తరతరాలు వస్తున్న ఆచారం) దానిని కాపాడు. అవ శిష్యమ్... శిష్యులను కాపాడు. అర్హత ప్రాతిపదికగా విజ్ఞానాన్ని ఇచ్చేవాడు గురువు. ఆ గురువును భక్తి పూర్వకంగా భావిస్తూ, అతనిచ్చిన అభిగమ్యమైన (పొందదగిన) విజ్ఞానాన్ని పవిత్రంగా, జిజ్ఞాసతో, అభిలాషతో అధ్యయనం చేసే వాడు శిష్యుడు. ఇరువురికీ సామాన్యంగా ఉండవలసిన లక్షణం "అర్హత".

అవ త్వం మామ్, అవ వక్తారమ్, అవ శ్రోతారమ్, అవ దాతారమ్, అవ ధాతారమ్, 

అవానూచానమవ శిష్యమ్, అవ పశ్చాత్తాత్, అవ పురస్తాత్, అవోత్తరాత్తాత్, అవ దక్షిణాత్తాత్, 

అవ చోర్ధ్వాత్తాత్, అవాధరాత్తాత్, సర్వతో మాం పాహి పాహి సమంతాత్! 3


జగత్తును ఆవరించిన ఈ ఆరు దిక్కులను (పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, ఊర్ధ్వ, అధో దిశలు) కాపాడు. సర్వతో మాం పాహి.... ఈ ఆరు దిక్కులచే చక్కగా చుట్టబడిన (సమంతాత్) సర్వమును కాపాడు.

త్వం వాఙ్మయస్త్వం చిన్మయః! త్వమానందమయస్త్వం బ్రహ్మమయః!

త్వం సచ్చిదానందాఽద్వితీయోఽసి! త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి! త్వం జ్ఞానమయో విజ్ఞానమయోఽసి! 4

త్వం వాజ్ఞ్మయః .. నీవే సకల వాక్సంబంధిత శక్తివి, నీవే (చిత్ మయః) జ్ఞాన మూర్తివి, నీవే ఆనంద మయునివి, నీవే పరబ్రహ్మము. నీవే సత్ చిత్ ఆనందమవు. శాశ్వతమైన వానివి నీవే, నీకన్న రెండవది లేదు. ప్రత్యక్షంగా పర బ్రహ్మమవు నీవే. నీవే జ్ఞానానివి, నీవే విజ్ఞానానివి. (పంచేంద్రియాలచే తెలుసుకునేది లేదా గ్రహించేది జ్ఞానం కాగా వీటికి అతీతంగా పొదగలిగినది విజ్ఞానం. భౌతికంగా విజ్ఞానం అంటే... ఆచరించి దాని మంచి చెడ్డలను అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది విజ్ఞానం.)

                    సశేషం 

సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

Panchang


 

అవధానవిద్య నఱయగ

 అవధానవిద్య నఱయగ 

వ్యవధానములేక సాగు నవధానమ్ముల్ 

అవధానియె సర్వాధిపు 

డవధానియె చక్రవర్తి యావేదికపై 


అవధాని ననుసరింపగ 

వ్యవధానము కోరి జూతు రాపృచ్ఛకులున్ 

అవధానవిద్య యంతయు 

సవరించిన భూషణమ్ము నా వాణికినౌ 


సారస్వత విన్యాసము 

పారీణత పెల్లుబుకెడు పాండిత్యమునౌ 

ధీరత నిండిన సరసత 

భూరిగ పండించు హాస్య ఫుల్లాబ్జములున్ 


వేదికపై పండితకవు 

లాదరమొప్పంగ వాణి నందుకొనంగన్ 

మోదముతో ప్రేక్షకులును 

స్వేదము చిందించుచుండ్రు చిఱునగవులతో 

*~శ్రీశర్మద*

శ్రీశైలభ్రమరాంబికామల్లికార్జునస్వామిని

 శ్రీశైలభ్రమరాంబికామల్లికార్జునస్వామిని స్తుతిస్తూ మాలినీ వృత్తము లో చేసిన  శ్లోక పంచకమ్


అగణితగుణసోమం హారకేయూర భూషమ్।

జగదభయనిధానం శ్రీగిరీంద్రప్రకాశమ్।

మనసి సతత మాద్యం చిన్తయే భూతనాథమ్।

అమిత జన సుసేవ్యం  భ్రామరీ ప్రేమపాత్రమ్।


గజగమనవిహారం శైలజా పార్శ్వదేహ మ్।

స్మిత వదన మహేశం శ్రీగిరీంద్రప్రకాశమ్।

శ్రితశుభద పదాబ్జం దేవతాసార్వభౌ మమ్।

లలితసలిలసేవ్యం భ్రామరీ ప్రేమపాత్ర మ్।


సురనరగణబృందైఃనిత్యపూజ్యం ప్రభా తే।

చరణ యుగళగీతైః తుష్ట సాంబం నటేశమ్।

నిఖిల నిగమవేద్యం ప్రార్ధయే మల్లినాథ మ్।

మృదులమధురతారా  భ్రామరీప్రేమపా త్రమ్।


అతులవిహితభావైర్దీపితం నీలకంఠమ్।

జగతినమితభక్త్యారాజితం శంభుమూర్తి మ్।

పశుపతిరితి కీర్త్యా శోభితం నౌమి రుద్ర మ్।

కుసుమధవలవర్ణం  భ్రామరీప్రేమపాత్ర మ్।


ప్రమధగణసమేతం తాణ్డవానందలోల మ్।

ఢమఢమరుకఢక్కానాదలీలావిశేషమ్।

జనమరణచక్రత్రాణనైపుణ్యశూలిమ్।

వృషభగమనసాంబం మల్లినాథం భజే2హమ్ ।।


గురు చరణాంబుజాధ్యాయీ

 విజయకుమార శర్మా 

✍️విమలశ్రీ: 

*!जयगुरुदत्त श्रीगुरुदत्त !: *కవిరాజ విరాజిత* వృత్తములో


1) అఖిలచరాచర విశ్వసు పోషక పాశవిమోచక సూత్రమతే।

సులభ శివాధవ పన్నగ భూషణ చంద్రకళాధర సాధుమతే।

వృషభ రథోపరిభాసిత భాస్కర కోటి సమాకృతి భూతపతే।

జయజయహే  భ్రమరా సహితేశ్వరదేవ గిరీశ్వర పాలయమాం।


 2) విమల యశోధన భూరి కృపాకర కష్టనివారక లోకగురో।

ఋషిజనసంస్తుత సుందర పావన మన్మథ విగ్రహ పాహి విభో।

విధిహరిసేవిత శంకర శీఘ్ర ఫలప్రద భావిత దేవవిభో।

జయ జయహే భ్రమరా సహితేశ్వర భక్త శుభంకర పాలయమామ్।


3) సకల సుసేవిత గౌరి మనోహర నాయక దేవర పాలయమామ్।

గురుహరశంకర భూరిధన ప్రద భైరవ వేషక శంకురుమే।

పరమదయాకర శైలవన స్థిత మందిరసుందర భర్గగుణ।

జయ జయహే భ్రమరా సహితేశ్వర భక్త శుభంకర పాలయమామ్ ।


 4)కరిముఖ షణ్ముఖ పుత్ర విరాజిత పార్వతి నాయక దేవమణే।

కరివన భూషణ దాన మహాగుణ కారణ భూసుర పాలమహాన్।

కరివరదప్రముఖాదిసువందిత దానవమర్దన ధర్మ నిధే।

జయ జయహే భ్రమరా సహితేశ్వర భక్తశుభంకర పాలయమాం।


గురు చరణాంబుజాధ్యాయీ 

విజయ కుమార శర్మా 

✍️విమల శ్రీ

కవిరాజ విరాజిత

 *!जयगुरुदत्त श्रीगुरुदत्त !: *కవిరాజ విరాజిత* వృత్తములో


1) అఖిలచరాచర విశ్వసు పోషక పాశవిమోచక సూత్రమతే।

సులభ శివాధవ పన్నగ భూషణ చంద్రకళాధర సాధుమతే।

వృషభ రథోపరిభాసిత భాస్కర కోటి సమాకృతి భూతపతే।

జయజయహే  భ్రమరా సహితేశ్వరదేవ గిరీశ్వర పాలయమాం।


 2) విమల యశోధన భూరి కృపాకర కష్టనివారక లోకగురో।

ఋషిజనసంస్తుత సుందర పావన మన్మథ విగ్రహ పాహి విభో।

విధిహరిసేవిత శంకర శీఘ్ర ఫలప్రద భావిత దేవవిభో।

జయ జయహే భ్రమరా సహితేశ్వర భక్త శుభంకర పాలయమామ్।


3) సకల సుసేవిత గౌరి మనోహర నాయక దేవర పాలయమామ్।

గురుహరశంకర భూరిధన ప్రద భైరవ వేషక శంకురుమే।

పరమదయాకర శైలవన స్థిత మందిరసుందర భర్గగుణ।

జయ జయహే భ్రమరా సహితేశ్వర భక్త శుభంకర పాలయమామ్ ।


 4)కరిముఖ షణ్ముఖ పుత్ర విరాజిత పార్వతి నాయక దేవమణే।

కరివన భూషణ దాన మహాగుణ కారణ భూసుర పాలమహాన్।

కరివరదప్రముఖాదిసువందిత దానవమర్దన ధర్మ నిధే।

జయ జయహే భ్రమరా సహితేశ్వర భక్తశుభంకర పాలయమాం।


గురు చరణాంబుజాధ్యాయీ 

విజయ కుమార శర్మా 

✍️విమల శ్రీ

శారదరాత్రులన్నియుఁ

 ఉ॥

శారదరాత్రులన్నియుఁ బ్రశాంతతఁ జంద్రికఁ గుమ్మరించి సం 

సారములందు సౌఖ్యముల సందడి గొల్పి విరాజిలంగఁ దా 

భూరితుషారభాసురనభోయవనీపరివేష్టితమ్ముగా 

సారెను దెచ్చెనోయనగ సాగివరించెను హేమమిత్తఱిన్ 

-----------------------------

యవనీ = యవనిక 

హేమము=మంచు, హేమంతర్తువు. 

-----------------------------

*~శ్రీశర్మద*

ఉమ్మెత్త చెట్టు - అత్యుత్తమ మూలిక

 ఉమ్మెత్త  చెట్టు  -  అత్యుత్తమ మూలిక 

 

* ఉమ్మెత్త లొ 3 రకాల చెట్లు ఉంటాయి.  అవి 

 

 1 - తెల్ల పువ్వులు పూసే ఉమ్మెత్త .

 2 - పసుపు పచ్చ పూసే పచ్చ ఉమ్మెత్త.

 3 - నల్ల పువ్వులు పూసే నల్ల ఉమ్మెత్త .


 ఇది వగరు ,చేదు , తీపి రుచులు కలిగి శరీరానికి మత్తు, పైత్యం , వేడి పుట్టిస్తుంది. కుష్టు, దురదలు, 

కురుపులు, గడ్డలు, అన్ని వ్రణాలు హరించి వేస్తుంది. ఉబ్బసానికి దీని పొగ పీల్చడం పురాతన సాంప్రదాయం ..


 దీని ఉపయోగాలు  - 


 * దగ్గు, దమ్ము, ఆయాసము, ఉబ్బసము, వీటితో బాధపడేవారు చిలుము గొట్టములో పొగాకు కు బదులు ఎండిన ఉమ్మెత్త ఆకులు వేసి అంటించి ఆ పొగ పీలుస్తూ ఉంటే అప్పటికప్పుడే ఉబ్బసం శాంతిస్తుంది.


 * నలల ఉమ్మేత్తాకు నలగగొట్టి సమంగా ఆవు పేడతో కలిపి మెత్తగా నూరి ఒక పాత్రలో వేసి ఉడకబెట్టి దానిని గోరువెచ్చగా గండమాలల పై వేసి కట్టు కడుతూ ఉంటే శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఆ గడ్డలు పగిలి మానిపోతాయి .


 * ఉమ్మేత్తకులకు కొంచం నూనె రాసి వెడి చెసి కురుపులపై ఈ ఆకులు వేసి కట్టు కడుతూ ఉంటే నారీకురుపులు నశించిపోతాయి. 


 * ఉమ్మేత్తాకులకు ఆముదం రాసి వెచ్చగా చేసి వాపులపైన వేసి కట్టు కడుతూ ఉంటే అన్ని రాకాల వాపులు , కీళ్ళ నొప్పులు , మంటలు తగ్గిపోతాయి. 


 * ఆదివారం నాడు తెల్ల ఉమ్మెత్త చెట్టుకి పుజ చేసి విధి పూర్వకముగా దాని వేరు తీసుకొచ్చి మలేరియా జ్వరంతో బాధపడే రోగి కుడి చేతికి దారంతో కట్టు కడితే ఒక్కరోజులో మలేరియా జ్వరం మాయం అవుతుంది. 


 * నలల వుమ్మేత్తాకు నలగగొట్టి ఆముధముథొ నూరి ఉడకబెట్టి  ఆ ముద్దను కురులపై లేపనం చేస్తూ ఉంటే తల కురుపులు తగ్గిపోతాయి . 


 * అరికాళ్ళ మంటలు తగ్గుటకు నలల ఉమ్మెత్తకు రసం , దొండాకు రసం, చిక్కుడాకు రసం సమంగా కలిపి అరికాళ్ళకు మర్దన చేస్తూ ఉంటే  మంటలు మాయం అయిపోతాయి .


 * కాళ్ల పగుళ్లు తగ్గుటకు ఉమ్మెత్త విత్తనాలు, నలల నువ్వులు , పసుపు వీటిని సమముగా మెత్తగా నూరి ఉంచుకుని రోజు రాత్రి నిద్రించే ముందు తగినంత పొడిలో గేద వెన్న కలుపుకొని ఆ పేస్టు ని పగుల్లకు లేపనం చేస్తూ ఉంటే క్రమముగా పగుళ్లు , పుండ్లు , ఒరుపులు మయం అయ్యి పాదాలు పద్మాల వలే అందముగా తయారు అవుతాయి. 

                        ( లేదా ) 


 * ఉమ్మెత్త గింజలు , సైంధవ లవణం సమముగా పొడి చేసుకొని ఉంచుకుని ఆ పొడిని నిద్రించే ముందు గేద వెన్న, మరియు గోమూత్రము తో కలిపి పేస్టు లాగా చేసి దానిని పట్టిస్తూ ఉంటే కాలి వ్రేళ్ళ సందులో వచ్చిన పుండ్లు , దురదలు మాయం అయిపొతాయి. 


 * తామర,  గజ్జి , చిడుము కు నల్ల ఉమ్మెత్తాకు , గొరింటాకు ( మైదాకు ) , మిరియాలు సమ బాగాలుగా వంటా ముదముతో మెత్తగా నూరి పైకి లేపనం చేస్తూ ఉంటే ఎంతో కాలం నుంచి వేధిస్తూ ఉన్న తామర, గజ్జి, చిడుము లంటి చర్మ రోగాలు వారం రొజుల్లొ మాయం అవుతాయి. 


 * మేహా వ్రణాలు మాడి పొవుటకు నల్ల ఉమ్మెత్తాకు , గేద పేడ సమముగా కలిపి నూరి అందులొ కొద్దిగా వంటా ముదము కలిపి ఉడకబెట్టి ఆ ముద్దని పెద్ద పెద్ద వ్రణాల కి గాని , మేహా వ్రణాలు కి గాని , మురిగిన వ్రణాలు కి గాని పైన వేసి కట్టు కడుతూ ఉంటే అవి హరిన్చిపోతాయి .


 * పంటి పోటు తగ్గుటకు నల్ల ఉమ్మేత్తల గింజల పొడి 5 గ్రా , ఉత్తరేణి వేరు పొడి 5 గ్రా , దోరగా వేయించిన మిరియాల పొడి 3 గ్రా కలిపి ఉంచుకొవాలి . పంటి పోటు రాగానే నొప్పి ఎడమ వైపు వస్తే , కుడి చెవిలో , లేదా కుడివైపు వస్తే ఎడమ చెవిలొ పైన తయారు అయిన పొడిని కొంచం నీటితో కలిపి రెండు మూడు చుక్కలు వేస్తె ఒక్క క్షణంలో నొప్పి మాయం అవుతుంది. 


 * సర్వ చెవి రోగాలకు  ఉమ్మెత్తాకు రసం 100 గ్రా , నువ్వుల నూనె  20 గ్రా కలిపి చిన్న మంట పైన మరిగిస్తూ దానిలొ ఏడు జిల్లేడు ఆకులు వేయాలి క్రమముగా దానిలొ రసాలు అన్ని ఇగిరిపోయి తైలం మిగలగానే దించి వడబోసి నిలువ ఉంచుకొవాలి. చెవికి సంభందించి యే సమస్య అయినా ఈ తిలం గోరువెచ్చగా రెండు మూడు చుక్కలు వేస్తే ఈ సమస్యలు నివారిన్చాబడతాయి.


 * స్త్రీల రొమ్ము సమస్యలకు  ఉమ్మెత్తకు మెత్తగా  నూరి రోమ్ములపైన వేసి కట్టు కడితే పాలు  తగ్గిపోతాయి .

 

* ఉమ్మెత్తకు నలగగొట్టి ఉడకబెట్టి గోరువెచ్చగా పట్టు వేస్తుంటే రొమ్ములో వాపు తగ్గిపోతుంది.


 * గర్భవతులు ఉమ్మేత్తవేరు ని దారానికి చుట్టి మొలకి కట్టుకుంటే గర్భస్రావం కాదు. 


 * నలల వుమ్మేత్తాకులు , మాని పసుపు కలిపి మెత్తగా నూరి లెపనమ్ చేస్తూ ఉంటే స్థానాల వాపు దురద తగ్గిపోతాయి . 


 ఉమ్మెత్త విషానికి విరుగుడు  - 

 

 తెలియక పొరపాటుగా ఉమ్మెత్త పూలని గాని , విత్తనాలను గాని , ఆకులను గాని అధికముగా లోపలి తీసుకుంటే శరీరం చచ్చుబడుతుంది. చూపు  తగ్గుతుంది  , మతి బ్రమిస్తుంది. పిచ్చివారిలాగా రకరకాలుగా ప్రవర్తిస్తారు. 


           దీనికి పత్తి చెట్టు విరుగుడు . ఉమ్మేత్తలోని పూలు లేదా గింజలు దేనివల్ల అపకారం జరిగిందో పట్తి చెట్టులోని అదే బాగాన్ని నీటితో నూరి లొపలికి ఇచ్చిన ఆ విషం మరుక్షణమే విరిగిపోతుంది.


 శరీరం పైన దీనిని వాడవచ్చు . శరీరం లొపలికి మాత్రం అనుభవం లేకుండా వాడరాదు. చాలా  స్వల్ప మోతాదులోనే వాడాలి.  


మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

ఉత్తరేణి చెట్టు ఔషధ ఉపయోగాలు -

 ఉత్తరేణి చెట్టు ఔషధ ఉపయోగాలు  -


   ఉత్తరేణి చెట్టుని "అపామార్గ" అని పిలుస్తారు . తెలుగులో " దుచ్చెన చెట్టు " అని మరొక పేరు . ఆయుర్వేద వైద్యంలో ఈ చెట్టుకు ప్రముఖస్థానం ఉన్నది.  ఈ చెట్టు గురించి దీని ఔషధ ఉపయోగాలు గురించి మీకు సంపూర్ణంగా వివరిస్తాను.


 *  ఈ చెట్టు సమూల రసం కాని కషాయం చేదుగా మరియు వెగటుగా ఉండును.


 * శరీరంలోని త్రిదోషాలను పోగొట్టును .


 *  ఉత్తరేణి చెట్టు విత్తులను పాలతో వండి పాయసంలా చేసుకుని తినుచున్న పరిణామ శూలని పొగొట్టును. పరిణామశూల అనగా ఆహారం తీసుకొనిన తరువాత జీర్ణం అయ్యే సమయంలో కలుగు నొప్పి.


 *  ఈ చెట్టు సమూలం తీసికొనివచ్చి నీడలో ఎండించి భస్మం చేసి ఆ భస్మమును 3 గ్రాముల చొప్పున నీటిలో కలిపి తీసుకొనుచున్న అజీర్ణం వలన వచ్చే నొప్పి తగ్గును.


 *  ఉత్తరేణి చెట్టు సమూల భస్మం గంజితో కాని , శొంఠి కషాయంతో కాని ఇచ్చిన శరీరపు ఉబ్బు మరియు ఉదర రోగం నివారణ అగును.


 *  దీని విత్తనాలను నీళ్లతో నూరి కాని , చూర్ణం చేసి నీళ్లతో ఇచ్చిన వెర్రికుక్క విషపు సంధి   (Hydrophobia ) తగ్గును. దీని పూతవెన్నులను కొద్దిగా పంచదార వేసి నూరి మాత్రలుగా చేసి వెర్రికుక్క కరిచిన వానికి ఇచ్చిన విషం హరించును 

పూటకు గచ్చకాయ మోతాదులో రోజుకు రెండుపూటలా 3 నుంచి 4 దినములు ఇవ్వవలెను.


 * ఉత్తరేణి చెట్టు ఆకులను కాని పూత వెన్నులను నూరి తేలు కుట్టినచోట దళసరిగా పట్టించిన బాధ  మరియు మంట తగ్గును. పాము కరిచిన చోట పట్టించిన దాని విషం హరించును . జెర్రీ కుట్టినచోట పట్టించిన మంట నివారణ అగును.


 *  ఉత్తరేణి చెట్టు సమూల భస్మం తేనెతో కలిపి ఇచ్చిన దగ్గులు , ఉబ్బసం హరించును . మోతాదు 2 గ్రాములు . రోజుకు రెండుపూటలా ఇవ్వవలెను.


 *  ఉత్తరేణి చెట్టు సమూల భస్మంలో హరిదళం వేసి నూరి నూనె కలిపి పూసిన వ్రణములు , పులిపిరికాయలు హరించును .


 *  ఉత్తరేణి చెట్టు సమూల భస్మం నువ్వులనూనె లో కలిపి ఉదయం , సాయంత్రం 2 చుక్కలు చెవుల్లో వేసిన కర్ణరోగములు మానును .


 *  ఉత్తరేణి చెట్టు సమూల రసంలో దూది తడిపి పుప్పిపంటిలో పెట్టిన పుప్పి పన్ను వల్ల వచ్చు నొప్పి మానును .


 *  ఉత్తరేణి చెట్టు విత్తనాలు గాని ఆకు గాని నూరి కట్టిన శరీరం పైన లేచు గడ్డల మంట , పక్క నొప్పి  ( Pleurodynia ) నివారణ అగును.


 *  ఉత్తరేణి ఆకుల రసం లోపలికి ఇచ్చిన సర్పవిషం హరించును .


 *  ఉబ్బసం దగ్గుతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఉత్తరేణి చెట్టు ఎండిన ఆకులను నిప్పులపైన వేసి ఆ పొగ పీల్చిన దగ్గు, ఆయాసం తగ్గును.


 *  ఉత్తరేణి ఆకు నీడన ఎండించిన చూర్ణం పుచ్చుకొనిన రక్తగ్రహణి తగ్గును.


 *  ఉత్తరేణి చెట్టు పచ్చి ఆకులలో కొద్దిగా మిరియాలు , కొద్దిగా వెల్లుల్లిపాయలు చేర్చి నూరి గచ్చకాయ అంత సైజు మాత్రలు చేసి చలిజ్వరం రాక మునుపు ఇచ్చుచుండిన చలిజ్వరం , వరసగా వచ్చు జ్వరం నివారించును.


 *  ఉత్తరేణి ఆకును నీటితో కలిపి నూరి వంటికి పూసిన కందిరీగలు, తేనెటీగలు మొదలయిన పురుగులు కుట్టినప్పుడు కలుగు మంట, బాధ నివారణ అగును. 


. మరిన్ని అనుభవపూర్వక ఆయుర్వేద ఔషధ చిట్కాల కొరకు మరియు సంపూర్ణ సమాచారం కొరకు నేను రచించిన గ్రంధాలు చదవగలరు . .


  గమనిక  -


      నేను రాసిన " ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " మరియు " ఆయుర్వేద మూలికా రహస్యాలు " రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా  గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. 


            నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు  ఒకేదగ్గర లభ్యం అగును . 


   ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .  


  


                ఈ గ్రంథములు కావలసిన వారు  9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .


      ఈ గ్రంథాలు కావలసినవారు క్రింద ఇచ్చిన నంబర్ కి ఫోన్ చేయగలరు .


          కాళహస్తి వేంకటేశ్వరరావు  


       అనువంశిక ఆయుర్వేద వైద్యులు 


                  9885030034

చలిపులి గాండ్రుబెట్టె

 చం॥

చలిపులి గాండ్రుబెట్టె నిక శైత్యరుజోద్ధతి వేధజేసె భూ

తలి గల జీవులెల్ల నధధా యధధంచు వడంకజొచ్చె శీ

తలరుచిభూతమయ్యె వసుధాతలమెల్ల భరించలేమిచే 

కళవలమందెనయ్య శివ! కానవె! ప్రోవవె! భద్రమీయవే! 

*~శ్రీశర్మద*

నిష్ఫలాపేక్ష భక్తి

 

నిష్ఫలాపేక్ష భక్తి 

మన హిందువులు అందరు భక్తులే అందులకు ఏమాత్రము సందేహం  లేదు. కాకపొతే ఎవరు ఏ మోతాదులో భక్తులు అనేది ప్రశ్న. భగవంతుడా నాకు పరీక్షలో చాలా తేలిక ప్రశ్నపత్రం వచ్చేటట్టు చేయి నేను నీ గుడికి వచ్చి 11 ప్రదక్షణాలు చేస్తాను అంటాడు ఒక విద్యార్థి. అదే పదవతరగతి లేక ఇంటర్మీడియేట్ ఇంకా బిటెక్ చదివే విద్యార్థి అయితే వెంకటేశ్వర స్వామీ నన్ను అనుగ్రహించి నేను పరీక్షల్లో మంచి మార్కులతో పాసు అయ్యేటట్లు చేయి స్వామి నేను నీ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాను అని అంటాడు. వారి వారి స్థాయిని బట్టి వారి ఊరిలోని వెంకటేశ్వర స్వామ లేక చిన్న తిరుపతి స్వామా ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామ అనేది వారి వారి కుటుంబ పరిస్థితి, ఆర్థికస్తోమత మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికి వారి వారి కోర్కెలను తీర్చేది మాత్రం నిస్సందేహంగా వెంకటేశ్వర స్వామే 

మనం సాధారణంగా మూడురకాలగా మనుషులు కోరికలను కోరుకుంటున్నారు. అవి 1) తనకు ఏదో లాభం లేక మేలు జరగాలని ఇందులో తానూ కష్టపడి దాని ఫలితంగా తనకు మేలు అంటే కష్ట ఫలితం కావాలని కోరుకోవటం. పైన చెప్పినవి ఈ కోవకు చెందినవే. 

ఇంక రెండో రకం 2) తానూ తన తెలివితేటలతో ఇతరులను వంచించి లాభం రావాలని కోరుకోవటం. భగవంతుడా నాకు లంచాలు బాగా వచ్చే సీటులో పోస్టింగు ఇవ్వు అని ఒక ఉద్యోగస్తుడు కోరుకుంటాడు. ఇంకా భగవంతుడా ప్రతివారికి నా అవసరం (ఉద్యోగ స్థాయి) ఉండేటట్లు చూడు నేను వాళ్ళను అడిగినంత లంచం ఇచ్చేటట్లు అనుగ్రహించు. ఇక్కడ కూడా ఆ గుమాస్తాగారు కష్ట పడి  పనిచేస్తున్నారు పని చేయకుండా ఫలితాన్ని ఆశించటంలేదు కాకపొతే తాను ఆవిధంగా అక్రమంగా చేసే కష్టం కష్టంగా పరిగణించదు అది కేవలం వంచన అంటే ఒకరికి న్యాయపరంగా చెందాల్సినదానిని తన తెలివితేటలతో తన ఉద్యోగ స్థాయిని అడ్డుపెట్టుకొని ఇంకొకరికి సంక్రమింపచేయటం. ఇది అన్యాయపు కార్యము. ఒక ఉద్యోగి అన్యాయపు పని చేస్తేనే కానీ అన్యాయార్జన చేయలేడు. ఒక ఉద్యోగే కాదు ఒకదొంగ దోపిడీదారుడు కూడా భగవంతుని ప్రార్ధిస్తూనే ఉంటాడు.

ఇక మూడవ రకము .3) ఈ రకం  వారు పై రెండు రకాల వారికన్నా క్రింద వున్నారు. వీరి ఆలోచనలు సమాజాన్ని పూర్తిగా పాడు చేసేవిగా ఉంటాయి. భగవంతుడా నేను అభివృద్ధి చెందాలి నా తోటివాడు పూర్తిగా నాశనం కావలి. సహజంగా సమాజంలో ఈ రకం మనుషులను వ్యాపారస్తులాల్లోను, రాజకీయాలలోను చూస్తూ ఉంటాము. పూర్వం ఒక కదా చెప్పేవారు. 

ఒక ఊరిలో రామయ్య కామయ్య అనే ఇద్దరు మనుషులు ఉండేవారట ఒకరికి ఇంకొకరు అంటే పడదు ఇద్దరు వ్యాపారం చేసే వారట ఒకరిని మించి ఇంకొకరు వ్యాపారంలో వృద్ధి చెందాలని అభిలషించేవారట. కాగా ఒకసారి వారి ఊరికి ఒక సాధుపుంగవుడు వచ్చారట అప్పుడు ముందుగా రామయ్య ఆయనను కలిసి స్వామీ నాకు వ్యాపారంలో మంచిగా వృద్ధి చెందాలని వుంది ఏదైనా మార్గం సెలవివ్వండి అని వేడుకొన్నారట. అప్పుడు ఆ సాధువు నాయనా అడిగిన కోరికలు తీర్చటంలో పరమ శివుని మించిన దేవుడు లేడు నీవు ఆయన గూర్చి తప్పస్సు చేస్తే తప్పక నీ కోరిక నెరవేరుతుంది అని సలహా ఇచ్చి శివదర్శనం పొందటానికి మంత్రోపదేశం చేసి తపస్సు చేయమని సలహా ఇచ్చారు. తరువాత అది తెలుసుకున్న కామయ్య కూడా ఆయనను అడిగితె అదేవిధంగా నీవు పరమ శివుని గూర్చి తప్పస్సు చేయమని చెప్పారు. ఇక ఇద్దరిలో కూడా పట్టుదలమెదలైంది ఆ ఊరిచివరణ వున్నా అరణ్యంలో వారు గుట్టమీద ఒకరు గుట్టక్రింద ఒకరు ఒక చెట్టుచూస్కొని తప్పస్సు చేయటం మొదలుపెట్టారు. ఆలా కొంతకాలం తపస్సు చేసినతరువాట్ ముందుగా ల్స్,కయ్యకు స్వామీ ప్రత్యక్షం అయి భక్తా నీ భక్తికి మెచ్చాను నీకు ఏ వరం కావాలో కోరుకో అని ఆదేశించారు. పరమశివుడిని దర్శించుకున్న కామయ్య అత్యంత భక్తితో స్వామీ నాకు పోటీగా గుట్టమీద నా విరోధికుడా తపస్సు చేసుకుంటున్నాడు ఆయనకు ఏమికావాలో అడిగారా అని అన్నాడు.  నాయనా నేను ఆయనకు ముందుగా దర్శనమిచ్చి నీ దగ్గరకు వచ్చాను అని జవాబు చెప్పారు.  ఆయనకు నీకు ఏమి కావాలో దానికి రెట్టింపు తనకు కావాలని కోరాడు ఇప్పుడు చెప్పు నీకు ఏమి కావాలో అని అన్నారు. రామయ్య మీద కోపంగా వున్న కామయ్య ఆలోచించి స్వామీ మీరు నాకు వరంగా నా ఒక కన్ను తీసివేయండి అని కోరాడట. అదేమిటి నాయనా నేను నీకు చక్కటి వరాలను ఇద్దామని వస్తే నీవు నీ కన్నును కోల్పోదాలుస్తున్నావు అని అడిగారు.  మీరు నా కన్ను తీయండి చాలు అని అన్నాడు. ఆలా కామయ్య తన కన్నును కోల్పోయాడు. తరువాత పరమేశ్వరుడు రామయ్య దగ్గరకు వెళ్లి నాయనా నీవు కోరినట్లుగా ముందుగా నేను కామయ్య కోరికను తీర్చి వస్తున్నాను ఇప్పుడు చెప్పు నీకు ఏమి కావాలో అని మరల అడిగారు.  ఈశ్వర మీరు ఏమి చెప్పనవసరం లేదు కామయ్యకు  ఇచ్చిండానికి రెట్టింపు నాకు ఇవ్వండి అని అన్నాడు. నాయనా వారాల ఆలోచించుకో అని అన్న కూడా వినకుండా తక్షణయే నాకు వరంగా కామయ్యకు ఇచ్చిండానికి రెట్టింపు ఇవ్వమనటంతో రామయ్య రెండు కళ్ళు కోల్పోయాడు. అందుకే అంటారు తనకు లేదు అనుకుంటే ఒక కన్ను ఎదుటువారికి వున్నదని అనుకుంటే రెండు కళ్ళు పోతాయి అని. 

సాధకుడు భగవంతునితో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. నన్ను సృష్టించిన పరమేశ్వరునికి నన్ను ఎలా రక్షించాలో తెలియదా అనే భావనలో వుండి సదా ఈశ్వర ధ్యానములో వుంది ఆయననే తలుస్తూ ఉండాలి అంతేకాని తాత్కాలికమైన ఐహికమైన వాంఛలను పరమేశ్వరుడిని కోరకుండా ఆయన కృపాకటాక్షాలను పొందాలి. అందుకే మనకు ఈశ్వరార్పణగా కర్మలు చేయాలనీ చెప్పారు. సదా తాను ఈశ్వరుని తలుస్తూ అయన ఇచ్చిన ఈ జన్మను అయన స్మృతిలోనే గడుపుతాను అనే భావనలో వుంది జీవనం గడిపితే మోక్షం సిద్ధిస్తుంది. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు మీ 

  భార్గవ శర్మ

నమకం విశిష్టత

 🙏 నమకం విశిష్టత🙏

నమకానికి రుద్రం అనీ, రుద్ర ప్రశ్న అనీ, శత రుద్రీయం అనీ, రుద్రోపనిషత్ అనీ ఇలా అనేక పేర్లు ఉన్నాయి. రుద్రాన్ని మించిన మంత్రరాజము లేదు. బ్రాహ్మణులు బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్త, సన్యాస నాలుగు ఆశ్రమాలవారు రుద్ర పారాయణము చేయవచ్చు.ధర్మశాస్త్రం సన్యాసులకు వేదపారాయణ నిషేధం చెప్పింది. వారికి ఓం అనే ప్రణవమే జపించాలి. అని ధర్మ శాస్త్రం చెప్పినమాట. కాని సన్యాసులు రుద్రనమకం మాత్రం నిత్య పారాయణము చేయవచ్చు. వేదంలో కర్మకాండ, జ్ఞాన కాండ, ఉపాసన కాండ ఉన్నాయి. రుద్ర నమకానికి ఉన్న విశిష్టత ఏమిటంటే నమకములో కర్మకాండ జ్ఞాన కాండ, ఉపాసన కాండల లోని అన్ని విషయాలు ఉన్నాయి. ఇందులో రుద్రతత్త్వం, రుద్ర రూపాలు రుద్ర నామాలు , అంతకుమించి ఉపాసనా జ్ఞానములు సంపూర్ణముగా ఉన్నవి. అందుకే రుద్ర నమకాన్ని రుద్రోపనిషత్ అన్నారు.

పరమేశ్వరుణ్ణే రుద్రుడు అని అంటారు. అయితే రుద్ర నామానికి అర్థం ఏమిటి? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. . రుద్రుడు అంటే రోదనము కలిగించువాడు, కరిగించువాడు, నమస్కరించే వారి దుఃఖం పోగొట్టేవాడు అని అర్థం. రోదనము కలిగించడం ఏమిటి? అల్లా చేస్తాడా? అంటే మనకు జన్మలు ఇవ్వడమే రోదనము కలిగించడం పుట్టుకయే దుఃఖ కారణం. ఇంక కరిగించువాడు అంటే పాపములను హరించి జన్మ రాహిత్యం కలుగజేయువాడు ( జన్మలు లేకుండా మోక్షం ఇచ్చేవాడు ) అని అర్ధం

జన్మలు ఇచ్చేవాడు, జన్మలు తీసేవాడు కాబట్టే రుద్రుడు అయ్యాడు 

రుద్ర నామానికి పైన చెప్పుకున్న అర్థమే కాకుండా తత్త్వపరమైన అర్థం కూడా ఉంది. రుద్రుడు అనే పేరులో… 'ర'కారం అగ్ని బీజం కదా , ఇది అన్నిటికీ మూలం అయిన చిదగ్ని, అగ్ని అంటే అమ్మవారే 'ద'కారం సోమ తత్త్వం, అంటే శివుడు (రు అంటే అమ్మవారు ద్ర అంటే శివుడు శివ శక్తుల కలయిక ) వెరసి అమ్మ, అయ్యా కలిపితే రుద్ర తత్త్వం.

రుద్ర శబ్దానికి మరొక అర్ధం ఏమిటంటే దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని పోగొట్టువాడు 

రుద్ర శబ్దములో ఉన్న రెండు రకారాలు ( రు లో రకారము, ద్ర లో రకారం సూచిస్తాయి ఇవి రెండు అగ్ని బీజాలు )

రుద్ర మంత్రం :" ఓం నమో భగవతే రుద్రాయ " నమకము చేయలేకపోయినా ఈ మంత్రం ఒక్కటి జపించిన విశేష ఫలితం వస్తుంది. ఇది సత్యము.

నమకం పఠనం వలన లేదా శ్రవణం వలన ప్రధాన ప్రయోజనం : పాపాలను పోగొట్టి, శివుని యొక్క అనుగ్రహం పొందేటట్టుగా చేసి, క్షామం, భయం పోగొట్టి , ఆహారము , గోసంపద సమృద్ధి గావించి, ఇతర జంతువుల నుండి, అనారోగ్యము ( రోగాలు )నుండి కాపాడుతుంది. చెడుకర్మ, గ్రహనక్షత్రముల యొక్క చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.చివరకు మోక్షం ప్రసాదిస్తుంది

మాకు నమకము రాదు నేర్చుకోలేదు ఎల్లగా? అనుకోవద్దు. నమకము శ్రవణము కూడా విశేష ఫలితమే.. భక్తి శ్రద్దలతో వినండి చాలు.అలాగే శివ కవచం పారాయణం చేయవచ్చు. స్వరముతో పనిలేదు ఫలితం ఒక్కటే ఈశ్వరానుగ్రహం తప్పకుండా కలుగుతుంది..

ఏకాదశ రుద్రులు చూద్దాము 

నమస్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్-మహాదేవాయ నమః ॥

వీరు మన శరీరంలో జ్ఞానేంద్రియ పంచక, కర్మేంద్రియ పంచక మనస్సు రూపాలతో ఉన్నారు.

 కొందరు ఎన్ని పారాయణములు చేసినా పరిస్థితి మారలేదు అనుకుంటారు. దానికి సమాధానం మన పూర్వ జన్మకర్మ పరిపక్వమునకు రాలేదు చెడు అంత తీవ్రముగా ఉంది అని అర్ధం చేసుకోని మరింత పట్టుదలతో, శ్రద్ధతో పారాయణం చేయడమో, వినడమో తప్పక చేయాలి. అప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగితీరుతుంది. ఇది సత్యము

రుద్ర నమకము యొక్క అర్ధం ఒకటి రెండు ఒకటి రెండు అనువాకములు చూద్దాము.


నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః.

నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తేనమః.


ఓ రుద్రుఁడా! నీ కోపమునకు నమస్కారము.నీ బాణములకు నమస్కారము. నీ ధనుస్సుకు నమస్కారము నీ బాహువులకు నీ కోపము. నా బాహ్యాంతశ్శత్రువులపైన ప్రవర్తింపజేయుము.


యాత ఇషుశ్శివతమా శివం బభూవ తే ధనుః.

శివాశరవ్యా యాతవతయానో రుద్ర మృడయ.


ఓ రుద్రుఁడా! నీ యీ శరము, నీ ధనుస్సు,. నీ యమ్ములపొది పరమ శాంతమైన దానినిగా జేయుము. శాంతించిన శరీరము తోడను, అమ్ములపొది తోడను మమ్ములను అనందింప.జేయుము

                 ఓం నమశ్శివాయ

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

సుభాషితమ్

 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝*


  𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*భద్రం కృతం కృతం మౌనం కోకిలై ర్జలదాగమే!*

*దర్దురా యత్ర వక్తారః తత్ర మౌనం హి శోభనం!!*


*భావము:*

వానాకాలంలో కోకిలలకు మౌనంగా ఉండడమే భద్రం అవుతుంది... కప్పలు గొప్ప వక్తలమని అనుకునే చోట కోకిలలకు మౌనమే శోభిస్తుంది....

కొంతమంది మేమే గొప్ప మాకు అంతా తెలుసు *నీకేమీ తెలీదు అంటూ మూర్ఖంగా వాదిస్తూ ఉంటారు.... అలాంటి వారు ఉన్న చోట మనం మౌనంగా ఉండటమే మంచిది*.

మొగలిచెర్ల అవధూత మంత్రోపదేశం

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...*

 

*మంత్రోపదేశం ..ఆశ్రమ నిర్మాణ కర్త ఆగమనం..*


*(ఇరువై ఒకటవ రోజు)*


ఆశ్రమ నిర్మాణానికి వేరే వారు పూనుకుంటారనీ..మీరేమీ ఆలోచించవద్దనీ శ్రీధరరావు దంపతులకు శ్రీ స్వామివారు తెలియచెప్పి..


"అమ్మా!..నీ దేవీపూజ కోటి పూర్తి అయిందా?.." అని ప్రభావతి గారిని అడిగారు..


"నాయనా..నా పదమూడో ఏట, మా తల్లిగారు ఉపదేశించిన మంత్రాన్ని జపిస్తున్నాను..అలాగే మా నాన్నగారు బోధించిన వైష్ణవమంత్రమూ జపిస్తున్నాను..లెక్క పెట్టుకోలేదు.." అన్నారు ప్రభావతి గారు..


"అయితే..నీకు సమయం వచ్చినప్పుడు వైష్ణవమంత్రం ఉపదేశిస్తాను.. దీక్షతో చేయి  తల్లీ!..శ్రీధరరావు గారూ మీకు ఈశ్వరాంశం మంత్రం ఉపదేశించనా?..లేక వైష్ణవమంత్రమా?.."అన్నారు నవ్వుతూ..


"స్వామీ!..నాకు ఏ మంత్రాలూ వద్దు..నేను ఈ దీక్షలు చేయలేను..అదేదో ఆవిడకు బోధించండి..తపనతో చేస్తూ ఉంటుంది..నేను కర్మ సిద్దాంతాన్ని నమ్ముతాను...మీకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను..మీ తపస్సు, దాని ఫలితాలు..నా దృష్టిలో ఒక ప్రయోగంగా భావిస్తున్నాను..అందుకు నేను దోహదకారిగా వుంటాను..అంతే కాని..ఈ జపాలు వగైరాలు నాకు సరిపడవు!.." అన్నారు శ్రీధరరావు గారు..


శ్రీ స్వామి వారు పక పకా నవ్వారు.."చూసావా అమ్మా!..శ్రీధరరావు గారు మంత్రోపదేశం వద్దన్నారు..పోనీలే అమ్మా..నీకు సమయం వచ్చినప్పుడు ఆ దీక్ష ఇస్తాను..కొనసాగిద్దువు గానీ.." అని..మళ్లీ కూడా ఆ ఇద్దరికీ ఆశ్రమ నిర్మాణం గురించి చింత వద్దని చెప్పి, ఆశీర్వదించి పంపించివేశారు..దంపతులిద్దరూ తేలిక పడ్డ మనసుతో మొగలిచెర్ల చేరారు..


ప్రక్కరోజు ఆదివారం.. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు శ్రీధరరావు గారింటికి వచ్చారు..రాగానే, శ్రీధరరావు గారికి నమస్కారం చేసి.."అయ్యా..నా పేరు బొగ్గవరపు చిన మీరా శెట్టి..ఇతను నా మిత్రుడు!..మాది, వింజమూరు తాలూకా గొట్టిగుండాల గ్రామం.." అన్నాడు..


శ్రీధరరావు గారు వారిని సాదరంగా వరండాలో కూర్చోబెట్టి..వచ్చిన పని ఏమిటో చెప్పమన్నారు..


"నేను..మాలకొండ లో తపస్సు చేసుకుంటున్న స్వామివారికి ఆశ్రమం నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతో వున్నాను..ఆ విషయమై మీతో మాట్లాడాలని వచ్చాను.." అన్నారు..శ్రీధరరావు గారికి ఒక్కక్షణం తాను ఏం వింటున్నానో అనే సందేహం కలిగింది..వెంటనే ప్రభావతి గారిని పిలిచారు..ఇద్దరూ కూర్చున్న తరువాత, చిన మీరాశెట్టి గారు మళ్లీ అదేవిషయం..తాను శ్రీ స్వామివారికి ఆశ్రమ నిర్మాణం చేయదలచానని చెప్పారు..


నిన్న శనివారం  సాయంత్రం శ్రీ స్వామివారు తమతో ఆశ్రమ నిర్మాణానికి వేరే వాళ్ళు వస్తారు అని చెప్పారు..ఈరోజు సాయంత్రానికల్లా ఆ వ్యక్తి వచ్చి ఎదురుగా కూర్చున్నాడు..దంపతుల ఆశ్చర్యానికి అంతులేదు..


చిన మీరాశెట్టి గారిని..శ్రీధరరావు గారు శ్రీ స్వామివారు ఎలా పరిచయం అని అడిగారు..


శ్రీ స్వామివారు  ఎర్రబల్లె గ్రామం లో ఉన్నప్పటి నుంచీ తెలుసుననీ.. శ్రీ స్వామివారు వ్యాసాశ్రమం వెళ్లి వచ్చిన తరువాత కూడా ఒకటి రెండు సార్లు తాను, తన భార్యా శ్రీ స్వామివారిని కలిసామని..శ్రీ స్వామివారు మాలకొండ లో తపోసాధన కు వెళ్లిన తరువాత ఆయనతో కలవడం కుదరలేదనీ..మీరాశెట్టి గారు చెప్పారు..


నిన్నరాత్రి తనకు స్వప్నంలో కనిపించి..ఆశ్రమ నిర్మాణం చేయమని ఆదేశించారని..ముందుగా మిమ్మల్ని కలువమని కూడా ఆజ్ఞాపించారని కూడా మీరాశెట్టి గారు చెప్పారు..శ్రీ స్వామివారి ఆదేశం మేరకు మీరాశెట్టి గారు తన స్నేహితుడిని వెంటబెట్టుకొని మొగలిచెర్ల చేరారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లకు ఇదంతా కలలా ఉంది..దైవలీలలు ప్రత్యక్షంగా అనుభవానికి వస్తున్నాయి..తాము నమ్మిన ఆ లక్ష్మీనృసింహుడే..ఇదంతా నడిపిస్తున్నాడనీ..లేకుంటే..ఒకానొక సాధకుడు, తన తపోసాధనకు తమ సహకారం కోరి..తమ జీవితాలకు ఒక అర్ధం కల్పించడం..లీల కాక మరేమిటి?..


మీరాశెట్టి గారిని, వారి స్నేహితుడిని..ఆ రాత్రికి తమ ఇంటిలోనే వుండమని చెప్పి, తెల్లవారగానే మాలకొండకు వెళ్లి శ్రీ స్వామివారిని కలుద్దామని చెప్పారు శ్రీధరరావు గారు..మీరాశెట్టి గారూ అందుకు అంగీకరించారు..


అందరూ సోమవారం నాడు ఉదయాన్నే..మాలకొండకు బయలుదేరి వెళ్లారు..


ఆశ్రమ నిర్మాణానికి సూచనలు..బావి లో జలకళ..రేపు..



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

మొగలిచెర్ల అవధూత ఆహారపు పద్దతి.

 *మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర..*

 

*శ్రీ స్వామివారి ఆహారపు పద్దతి..*


*(పంతొమ్మిదవ రోజు)*


ఫకీరు మాన్యం భూమి ని చూసివచ్చిన తరువాత శ్రీ స్వామివారు శ్రీధరరావు గారి ఇంటికి తిరిగివచ్చేశారు..వెంటనే ఆయన ధ్యానం చేసుకోవటానికి వెళ్లిపోయారు..ప్రభావతి గారు వంట పని మొదలెట్టి..తమ ఇంటికి సిద్ధపురుషుడు వచ్చాడని సంబరపడుతూ..రెండు రకాల కూరలు, పప్పు, పులుసు, పచ్చడి పాయసం వగైరాలతో చిన్నపాటి విందుభోజనం వండిపెట్టారు..


కొద్దిసేపటి తరువాత శ్రీ స్వామివారు ఇంట్లోకి వచ్చారు.."నాయనా..భోజనం వడ్డించమంటారా?.." అడిగారు ప్రభావతి గారు.."అన్నం పెట్టు తల్లీ..త్వరగా వెళ్లిపోతాను!.." అన్నారు శ్రీ స్వామివారు..


శ్రీ స్వామివారు పీట మీద కూర్చున్నారు..ఆయన ముందు విస్తరి వేసి, అందులో తాను చేసిన కూరలు, పప్పు వడ్డించి అన్నం కూడా పెట్టి ఆపై నెయ్యి కూడా వేసి ఆయన వైపు చూసారు ప్రభావతి గారు..ఆ ప్రక్కనే శ్రీధరరావు గారు కూర్చుని వున్నారు..శ్రీ స్వామివారు విస్తరిలో వడ్డించిన పదార్ధాల వైపు ఒక్కసారి తేరిపారా చూసి..


"అమ్మా!..ఇంకా ఏమైనా ఉన్నాయా ?..వుంటే అవికూడా వడ్డించమ్మా.." అంటూనే..అప్పటిదాకా విస్తరిలో ఉన్న పదార్ధాలన్నీ అన్నంలో ఒకటిగా కలిపేశారు.."అమ్మా!..ఆ పెరుగో..మజ్జిగో..అదికూడా తీసుకురామ్మా.."అన్నారు..


ప్రభావతి గారు నొచ్చుకున్నారు..ప్రక్కనున్న శ్రీధరరావు గారు మౌనంగా చూస్తున్నారు.."అది కాదు నాయనా..మీకోసమని రుచిగా, శుచిగా చేసాను..మీరు..ఇలా.." ఆవిడ మాట పూర్తికాకముందే..


"అమ్మా..నేను సన్యాసిని..మా సన్యాసులకు రుచులు ఉండకూడదు తల్లీ!..అలా రుచికి అలవాటు పడితే..జిహ్వ అదే రుచి..అంతకంటే ఇంకా మంచిదేదన్నా వుంటే..ఆ రుచి కావాలని కోరుకుంటుంది..ఇప్పుడు నువ్వు చేసావే..ఈ బెండకాయ కూర బాగుందనుకో.. ప్రభావతమ్మ చేసిన బెండకాయకూర బాగుంది..మరోసారి తినాలనిపిస్తుంది..ఇంకొకరు చేసిన చారు మహత్తరంగా ఉందని దానినీ కోరుకుంటుంది..అందుకనే యోగులు, సిద్ధులు.. సాధకులూ..సన్యాసులూ..తమ అహాన్ని చంపుకొని..నాలుగైదు ఇళ్లలో "భిక్ష" స్వీకరించి..దానిని ఒకే ముద్దగా చేసుకొని ఆహారంగా తీసుకుంటారు..జిహ్వ ను అరికట్టటం సాధకుల మొదటి లక్షణం..ఈరోజు మీ ఇంట్లో ఉన్నానని ..నీవు చేసిన ప్రతి పదార్ధాన్నీ విడి విడిగా రుచి చూస్తూ భుజిస్తే...రేపటినుండి ఈ నాలుక నా మాట వింటుందా?..వేసేయ్ తల్లీ..నీవు చేసిన అన్ని పదార్ధాలూ ఒకేసారి వడ్డించు!.." అన్నారు..


ప్రభావతి గారు ఇక చేసేదేమీ లేక..తాను చేసిన పాయసం..కూడా తెచ్చి, పెరుగు తో సహా విస్తరిలో వడ్డించారు..శ్రీ స్వామివారు అన్నీ కలిపేసి తినేశారు..


ఆ తరువాత శ్రీధరరావు గారు, "ప్రభావతీ నీకు గుర్తుందా?..మనం కంచి కామకోటి పీఠాధిపతి పరమాచార్య గారి గురించి విని వున్నాము..వారు కూడా ఇలాగే జిహ్వ ను అదుపులో పెట్టుకోవడానికి..ఒకసారి గోమయంతో తమ నాలుకను శుద్ధి చేసుకున్నారు.. ఆ అనుభవాన్నే మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాము..మన అదృష్టమేమిటంటే..ఒకానొక సాధకుడీకి కొంతకాలం పాటు ఆశ్రయం ఇచ్చి సేవ చేసుకోగలగడం!.."అన్నారు..ప్రభావతి గారు కూడా మనసులో సమాధాన పడ్డారు..


శ్రీ స్వామివారు ఆహారం స్వీకరించిన తరువాత, ఈ దంపతులను పిలచి.."మీకు లభ్యమైన శివలింగం పూజాపీఠం లో ఉందన్నారు కదా?..ఒకసారి  చూపించండి"అన్నారు..శ్రీధరరావు దంపతులు, శ్రీ స్వామివారిని తమ పూజగదిలోకి తీసుకొని వెళ్లి, పూజా పీఠం లో ఉన్న శివలింగాన్ని చూపారు..శ్రీ స్వామివారు ఆ శివలింగాన్ని చేతిలోకి తీసుకొని..దానిని తన హృదయానికి ఆనించుకొని ఒకానొక సమాధి స్థితిలోకి వెళ్లారు..సుమారు పది పదిహేను నిముషాల పాటు శ్రీ స్వామివారు అలా నిశ్చలంగా ఉండిపోయి..తిరిగి జాగ్రత్తగా పూజాపీఠం లో యధాస్థానంలో ఉంచారు..


"మీఇంటికి ఈశ్వరుడొచ్చాడు..నేనూ వచ్చాను..అమ్మా!..నీది వైష్ణవ భక్తి..ఆ లక్ష్మీనృసింహుడినే కొలుస్తున్నావు..ఇక ఆలస్యం చేయకుండా..ఉదయం మనం చూసిన పొలంలో బావి  త్రవ్వించే కార్యక్రమం చేద్దాము..మీరే మొదలు పెట్టాలి.." శ్రీ స్వామివారు అప్పుడు మాట్లాడిన మాటల్లో శ్రీధరరావు ప్రభావతి గార్లకు పొంతన ఉన్నట్లు అనిపించలేదు..సగం సగం మాట్లాడేరేమో..అని సరిపెట్టుకొని.."బావి ఎక్కడ త్రవ్వించాలి నాయనా?.." అని మాత్రం ప్రభావతి గారు అడిగారు..


"రేపుదయాన్నే స్థల నిర్ణయం చేసి, నేను తిరిగి మాలకొండ వెళ్లిపోతాను..గృహస్తుల వద్ద ఎక్కువకాలం మాలాటి సన్యాసులు ఉండరాదు.."అన్నారు..అన్నవిధంగానే.. మరుసటిరోజు పొద్దున్నే..బావి త్రవ్వడానికి స్థలాన్ని చూపారు..


"స్వామీ!..ఈ పొలంలో నీటి లభ్యత తక్కువ!..జల పడదేమో?.." అన్నారు శ్రీధరరావు గారు..


"పాతాళ గంగ కూడా పైకి వస్తుంది శ్రీధరరావు గారూ..మీరు పని మొదలుపెట్టండి..అన్నీ సమకూరుతాయి!.." అన్నారు నవ్వుతూ.."ఇక నేను మాలకొండ వెళతాను.." అన్నారు..


శ్రీధరరావు దంపతులు సరే నని చెప్పి..శ్రీ స్వామివారిని మాలకొండకు తమ బండిలో పంపారు..మళ్లీ ఆ దంపతుల మనసులో సందేహం మొదలైంది.."స్వామివారికి స్వంత పొలం వుందికదా..మన భూమి అడిగి, అందులో మనచేత బావి త్రవ్వించి..ఆశ్రమ నిర్మాణం చేయడమెందుకు?.." ఈసారి ఆయనను కలిసి ఈ సందేహనివృత్తి చేసుకుందామని అనుకొని ఇంటికొచ్చేశారు..


సందేహనివృత్తి...రేపు..



సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

ఊర్మిళాదేవి వింత కోరిక

 *ఊర్మిళాదేవి వింత కోరిక🪷🌹🙏*


🌹🪷శ్రీరామ చంద్రుడు శివ ధనుర్భంగం చేసి సీతా దేవిని పెళ్లి చేసుకున్న తర్వాత… జనకుడు తన రెండో కూతురు అయిన ఊర్మిళా దేవిని లక్ష్మణుడికి ఇచ్చి వివాహం జరిపించాడు.ఈ తర్వాత సీతా రామ లక్ష్మణులు వన వాసానికి పోయినన్ని రోజులు… ఊర్మిళా దేవి నిద్రపోయిందని చెబుతుంటారు.


🌹🪷దాదాపు 14 సంవత్సరాలు నిద్ర పోవడం అంటే చిన్న విషయం ఏమీ కాదు.కానీ ఆమె అన్ని రోజులు ఎందుకలా నిద్ర పోయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


🌹🪷సీతా రాములతో లక్ష్మణుడు కూడా వన వాసాలకు పోయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే.వనవాస సమయంలో లక్ష్మణుడు.శ్రీరామ సంరక్షణార్థం నిద్ర పోకుండానే ఉండిపోయాడట. ప్రతి రోజూ అంటే 14 సంవత్సరాల పాటు లక్ష్మణుడు నిద్ర పోకుండానే ఉన్నాడట.


🌹🪷భర్త నిద్ర పోకుండా ఉండటం వల్ల… ఆయనలో సగ భాగం అయినా ఊర్మిళా దేవి ఈ 14 సవంత్సరాల కాలం నిద్రపోయిందని పురాణాలు చెబుతున్నాయి.అంతే కాదండోయ్ ఈ కాలంలో ఎక్కువ సేపు నిద్రపోయే వారిని ఊర్మిళా దేవితో పోలుస్తారు.


🌹🪷రావణసంహారం జరిగి పోయింది. రాములవారు దిగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు. మంచి ముహూర్తంలో అంగరంగవైభోగంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది. ఒకరోజున రాములవారు సభలో కూర్చుని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి.


🌹🪷14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేని మనిషే ఇంద్రజిత్తుని చంపగలడు. లక్ష్మణుడు అలా 14 ఏళ్లపాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే... ఆయన ఇంద్రజిత్తుని సంహరించగలిగాడు,' అని ఎవరో గుర్తుచేశారు.ఆ మాటలు విన్న రాములవారు ''14 ఏళ్లపాటు మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు.నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో ఆ నిద్రని అనుభవించిదని తెలుసు.అని అన్నాడు.


🌹🪷అదే సమయంలో ఊర్మిళ పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు. ''తల్లీ! వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతోపాటు లేకపోయినా, ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలనీ తట్టుకుని నిలబడగలిగాము. అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆసీనురాలివై ఉండు!'' అన్నారట రాములవారు.


🌹🪷రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్లు చెమ్మగిల్లాయి. కానీ ''ప్రభూ! నాకు నీ పాదపద్మాల దగ్గర చోటు కంటే వేరే వరమేదీ వద్దు. ప్రతిరోజూ నీ పాదాల చెంతకి చేరుకుని, నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు,'' అని వేడుకుందట ఊర్మిళ.


🌹🪷అప్పుడు రాములవారు ''కలియుగంలో పూరీక్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను. నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు. నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్రపాలకురాలుగా వెలుస్తావు. అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు,'' అంటూ వరాన్ని ప్రసాదించారట.


🌹🪷ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరిలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది. అక్కడ నిత్యం తయారుచేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు. పూరీలో నిత్యం 56 రకాల ప్రసాదాలతో వైభవోపేతమైన నైవేద్యం రూపొందే విషయం తెలిసిందే! ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా విస్తృత ప్రచారంలో కనిపిస్తుంది.