3, డిసెంబర్ 2024, మంగళవారం

నిష్ఫలాపేక్ష భక్తి

 

నిష్ఫలాపేక్ష భక్తి 

మన హిందువులు అందరు భక్తులే అందులకు ఏమాత్రము సందేహం  లేదు. కాకపొతే ఎవరు ఏ మోతాదులో భక్తులు అనేది ప్రశ్న. భగవంతుడా నాకు పరీక్షలో చాలా తేలిక ప్రశ్నపత్రం వచ్చేటట్టు చేయి నేను నీ గుడికి వచ్చి 11 ప్రదక్షణాలు చేస్తాను అంటాడు ఒక విద్యార్థి. అదే పదవతరగతి లేక ఇంటర్మీడియేట్ ఇంకా బిటెక్ చదివే విద్యార్థి అయితే వెంకటేశ్వర స్వామీ నన్ను అనుగ్రహించి నేను పరీక్షల్లో మంచి మార్కులతో పాసు అయ్యేటట్లు చేయి స్వామి నేను నీ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాను అని అంటాడు. వారి వారి స్థాయిని బట్టి వారి ఊరిలోని వెంకటేశ్వర స్వామ లేక చిన్న తిరుపతి స్వామా ఇంకా తిరుపతి వెంకటేశ్వర స్వామ అనేది వారి వారి కుటుంబ పరిస్థితి, ఆర్థికస్తోమత మీద ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికి వారి వారి కోర్కెలను తీర్చేది మాత్రం నిస్సందేహంగా వెంకటేశ్వర స్వామే 

మనం సాధారణంగా మూడురకాలగా మనుషులు కోరికలను కోరుకుంటున్నారు. అవి 1) తనకు ఏదో లాభం లేక మేలు జరగాలని ఇందులో తానూ కష్టపడి దాని ఫలితంగా తనకు మేలు అంటే కష్ట ఫలితం కావాలని కోరుకోవటం. పైన చెప్పినవి ఈ కోవకు చెందినవే. 

ఇంక రెండో రకం 2) తానూ తన తెలివితేటలతో ఇతరులను వంచించి లాభం రావాలని కోరుకోవటం. భగవంతుడా నాకు లంచాలు బాగా వచ్చే సీటులో పోస్టింగు ఇవ్వు అని ఒక ఉద్యోగస్తుడు కోరుకుంటాడు. ఇంకా భగవంతుడా ప్రతివారికి నా అవసరం (ఉద్యోగ స్థాయి) ఉండేటట్లు చూడు నేను వాళ్ళను అడిగినంత లంచం ఇచ్చేటట్లు అనుగ్రహించు. ఇక్కడ కూడా ఆ గుమాస్తాగారు కష్ట పడి  పనిచేస్తున్నారు పని చేయకుండా ఫలితాన్ని ఆశించటంలేదు కాకపొతే తాను ఆవిధంగా అక్రమంగా చేసే కష్టం కష్టంగా పరిగణించదు అది కేవలం వంచన అంటే ఒకరికి న్యాయపరంగా చెందాల్సినదానిని తన తెలివితేటలతో తన ఉద్యోగ స్థాయిని అడ్డుపెట్టుకొని ఇంకొకరికి సంక్రమింపచేయటం. ఇది అన్యాయపు కార్యము. ఒక ఉద్యోగి అన్యాయపు పని చేస్తేనే కానీ అన్యాయార్జన చేయలేడు. ఒక ఉద్యోగే కాదు ఒకదొంగ దోపిడీదారుడు కూడా భగవంతుని ప్రార్ధిస్తూనే ఉంటాడు.

ఇక మూడవ రకము .3) ఈ రకం  వారు పై రెండు రకాల వారికన్నా క్రింద వున్నారు. వీరి ఆలోచనలు సమాజాన్ని పూర్తిగా పాడు చేసేవిగా ఉంటాయి. భగవంతుడా నేను అభివృద్ధి చెందాలి నా తోటివాడు పూర్తిగా నాశనం కావలి. సహజంగా సమాజంలో ఈ రకం మనుషులను వ్యాపారస్తులాల్లోను, రాజకీయాలలోను చూస్తూ ఉంటాము. పూర్వం ఒక కదా చెప్పేవారు. 

ఒక ఊరిలో రామయ్య కామయ్య అనే ఇద్దరు మనుషులు ఉండేవారట ఒకరికి ఇంకొకరు అంటే పడదు ఇద్దరు వ్యాపారం చేసే వారట ఒకరిని మించి ఇంకొకరు వ్యాపారంలో వృద్ధి చెందాలని అభిలషించేవారట. కాగా ఒకసారి వారి ఊరికి ఒక సాధుపుంగవుడు వచ్చారట అప్పుడు ముందుగా రామయ్య ఆయనను కలిసి స్వామీ నాకు వ్యాపారంలో మంచిగా వృద్ధి చెందాలని వుంది ఏదైనా మార్గం సెలవివ్వండి అని వేడుకొన్నారట. అప్పుడు ఆ సాధువు నాయనా అడిగిన కోరికలు తీర్చటంలో పరమ శివుని మించిన దేవుడు లేడు నీవు ఆయన గూర్చి తప్పస్సు చేస్తే తప్పక నీ కోరిక నెరవేరుతుంది అని సలహా ఇచ్చి శివదర్శనం పొందటానికి మంత్రోపదేశం చేసి తపస్సు చేయమని సలహా ఇచ్చారు. తరువాత అది తెలుసుకున్న కామయ్య కూడా ఆయనను అడిగితె అదేవిధంగా నీవు పరమ శివుని గూర్చి తప్పస్సు చేయమని చెప్పారు. ఇక ఇద్దరిలో కూడా పట్టుదలమెదలైంది ఆ ఊరిచివరణ వున్నా అరణ్యంలో వారు గుట్టమీద ఒకరు గుట్టక్రింద ఒకరు ఒక చెట్టుచూస్కొని తప్పస్సు చేయటం మొదలుపెట్టారు. ఆలా కొంతకాలం తపస్సు చేసినతరువాట్ ముందుగా ల్స్,కయ్యకు స్వామీ ప్రత్యక్షం అయి భక్తా నీ భక్తికి మెచ్చాను నీకు ఏ వరం కావాలో కోరుకో అని ఆదేశించారు. పరమశివుడిని దర్శించుకున్న కామయ్య అత్యంత భక్తితో స్వామీ నాకు పోటీగా గుట్టమీద నా విరోధికుడా తపస్సు చేసుకుంటున్నాడు ఆయనకు ఏమికావాలో అడిగారా అని అన్నాడు.  నాయనా నేను ఆయనకు ముందుగా దర్శనమిచ్చి నీ దగ్గరకు వచ్చాను అని జవాబు చెప్పారు.  ఆయనకు నీకు ఏమి కావాలో దానికి రెట్టింపు తనకు కావాలని కోరాడు ఇప్పుడు చెప్పు నీకు ఏమి కావాలో అని అన్నారు. రామయ్య మీద కోపంగా వున్న కామయ్య ఆలోచించి స్వామీ మీరు నాకు వరంగా నా ఒక కన్ను తీసివేయండి అని కోరాడట. అదేమిటి నాయనా నేను నీకు చక్కటి వరాలను ఇద్దామని వస్తే నీవు నీ కన్నును కోల్పోదాలుస్తున్నావు అని అడిగారు.  మీరు నా కన్ను తీయండి చాలు అని అన్నాడు. ఆలా కామయ్య తన కన్నును కోల్పోయాడు. తరువాత పరమేశ్వరుడు రామయ్య దగ్గరకు వెళ్లి నాయనా నీవు కోరినట్లుగా ముందుగా నేను కామయ్య కోరికను తీర్చి వస్తున్నాను ఇప్పుడు చెప్పు నీకు ఏమి కావాలో అని మరల అడిగారు.  ఈశ్వర మీరు ఏమి చెప్పనవసరం లేదు కామయ్యకు  ఇచ్చిండానికి రెట్టింపు నాకు ఇవ్వండి అని అన్నాడు. నాయనా వారాల ఆలోచించుకో అని అన్న కూడా వినకుండా తక్షణయే నాకు వరంగా కామయ్యకు ఇచ్చిండానికి రెట్టింపు ఇవ్వమనటంతో రామయ్య రెండు కళ్ళు కోల్పోయాడు. అందుకే అంటారు తనకు లేదు అనుకుంటే ఒక కన్ను ఎదుటువారికి వున్నదని అనుకుంటే రెండు కళ్ళు పోతాయి అని. 

సాధకుడు భగవంతునితో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. నన్ను సృష్టించిన పరమేశ్వరునికి నన్ను ఎలా రక్షించాలో తెలియదా అనే భావనలో వుండి సదా ఈశ్వర ధ్యానములో వుంది ఆయననే తలుస్తూ ఉండాలి అంతేకాని తాత్కాలికమైన ఐహికమైన వాంఛలను పరమేశ్వరుడిని కోరకుండా ఆయన కృపాకటాక్షాలను పొందాలి. అందుకే మనకు ఈశ్వరార్పణగా కర్మలు చేయాలనీ చెప్పారు. సదా తాను ఈశ్వరుని తలుస్తూ అయన ఇచ్చిన ఈ జన్మను అయన స్మృతిలోనే గడుపుతాను అనే భావనలో వుంది జీవనం గడిపితే మోక్షం సిద్ధిస్తుంది. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతి శాంతిః 

ఇట్లు మీ 

  భార్గవ శర్మ

కామెంట్‌లు లేవు: