19, అక్టోబర్ 2020, సోమవారం

అలంకరణ

 20/ 10 / 2020  మంగళవారము.


తిథి .


నిజ ఆశ్వీయుజ మాసము  శుద్ధ చవితి.


 నాలుగవ  రోజున  అమ్మ వారి  అలంకరణ .


శ్రీ  మహాలక్ష్మీ  దేవి.


నైవేద్యం.


అల్లం  గారెలు.



అల్లం గారెలు,


కావలసినవి.


పొట్టు మినపప్పు  / మినపగుళ్ళు  -  రెండు కప్పులు.

అల్లం  -  30  గ్రాములు.

పై చెక్కు తీసుకుని  ముక్కలు గా చేసుకోవాలి.

పచ్చి మిర్చి  - 15  

జీలకర్ర   -   స్పూనున్నర 


నూనె - అర కిలో 

ఉప్పు  -  తగినంత .


తయారీ విధానము .


ముందుగా  పొట్టు  మినపప్పు  లేదా మినపగుళ్ళు  ఒక ఐదు గంటల పాటు  నానబెట్టాలి. 


పొట్టు మినపప్పు  మూడు నాలుగు  సార్లు కడిగి  పొట్టు  తీసి వేసుకుని పప్పు విడిగా తీసుకోవాలి .


మినపగుళ్ళు అయితే  బాగా కడిగి  వడ బోసుకోవాలి.


గ్రైండర్ లో వడగట్టిన పప్పును  నీళ్ళు పోయకుండా  మధ్య మధ్యలో నీళ్ళు చిలుకరించుకుంటూ పిండిని  గట్టిగా  గ్రైండ్  చేసుకోవాలి.


తర్వాత  మిక్సీలో  పచ్చిమిరపకాయలు , అల్లం ముక్కలు , జీలకర్ర  మరియు  తగినంత  ఉప్పును  వేసుకుని ,   మరీ మెత్తగా  కాకుండా  కచ్చాపచ్చాగా  మిక్సీ   వేసుకోవాలి.


గ్రైండ్  చేసిన  పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని , అందులో  మిక్సీ  వేసిన అల్లం  పచ్చి  మిర్చి  మిశ్రమమును  వేసుకుని  చేతితో  పిండిని  బాగా  కలుపుకోవాలి. 


ఇప్పుడు  స్టౌ  మీద బాండీ పెట్టుకుని  మొత్తం  నూనెను పోసుకుని  నూనెను పొగలు  వచ్చే  విధముగా  బాగా కాగనివ్వాలి 


ఇప్పుడు స్టౌ  సెగను మీడియంలో పెట్టు కోవాలి.


ఒక చిన్న అరిటాకును కాని లేదా ఒక చిన్న మైనపు కవరును కాని తీసుకుని  ఎమచేతి  అర చేతిలో  పెట్టుకుని , కుడి చేతితో గిన్నెలోని  పిండిని తీసుకుని  నిమ్మకాయంత ఉండలా చేసుకుని ,  తడి చేసుకున్న అరిటాకులో కాని మైనపు కవర్ లో కాని   పెట్టుకుని , కుడిచేతితో  గుండ్రముగా వత్తుకుని మధ్యలో  చిన్న కన్నము చేసుకుని , కాగుతున్న నూనెలో వేయాలి.


ఇలా నాలుగైదు గారెలు చొప్పున  వేసుకుని  అట్లకాడతో  అటూ ఇటూ తిప్పుతూ  బంగారు రంగులో వేయించు కోవాలి.  


అంతే . ఆశ్వీయుజ  మాసము  నాలుగవ రోజున శ్రీ మహాలక్ష్మీ  దేవి పూజ రోజున మహాలక్ష్మీ  దేవి నైవేద్యమునకు  అల్లం  గారెలు  సిద్ధం.


ఇలా అల్లం  గారెలు నైవేద్యానికి తయారు చేసుకునే  సమయంలో ,  ఉల్లిపాయను  వేయరాదు. 

**********

సాలగ్రామములు

 సాలగ్రామములు 

ఓం నమో నారాయణాయ నమః


సాలగ్రామము విష్ణుప్రతీకమైన ఒక శిలా విశేషము. సర్వకాల సర్వ్యావస్థలయందు విష్ణువు సాక్షాతూ సాన్నిధ్యం కలిగి ఉండేది సాలగ్రామంలో మాత్రమే. అందుచేతే గృహదేవతార్చనలలోగానీ, దేవాలయాలలోగానీ సాలగ్రామము (మూర్తి) లేకుండా పూజలు కొనసాగవు. 

ద్వైతులు, విశిష్టాద్వైతులు, అద్వైతులు తమతమ దేవతార్చనలలో సాలగ్రామములను పూజకు ఉపయోగిస్తారు.


భారతదేశంలో సాలగ్రామ పూజ బహు పురాతనమైనది. క్రీస్తు కంటే ప్రాచీనుడైన అపస్తంబుడు సాలగ్రామ పూజను పేర్కొన్నాడు.


త్రిమతాచార్యులు తమతమ భాష్యాలలో సాలగ్రామాలు విష్ణురూపాలని వివరించారు.


దేవాలయాలలో పంచాయతన మూర్తులకు 

శిలా ప్రతిమలు ఉంటే గృహస్థులకు మణి, స్వర్ణ నిర్మితమైన మూర్తులు, సాలగ్రామములు ఉంటాయి. 


సాధారణంగా ప్రతిమలకు నిత్య పూజా సమయంలో ఆవాహనాది షోడశోపచారాలు చేయాలి. 

సాలగ్రామాలలో దేవత నిత్యం సన్నిహితమై ఉండడం వల్ల వాటికి పూజా సమయంలో అవాహనాది ఉపచారాలు అవసరం లేదు.


హిందువులందరికీ తులసి, శంఖం, సాలగ్రామం పూజనీయమైనవి. 

తులసి హిందువుల ఇహపర సాధనానికి భూలోకంలో అవతరించిన వనదేవత. 

ఈ తులసి అపూర్వమైన మూలిక కూడా. 

శంఖం అత్యంత పవిత్రమైనది. 

శంఖారావం వ్యాపించినంత దూరం సూక్ష్మక్రిములు నశిస్తాయి అంటారు. 

నీరు శంఖంలో పూరిస్తే తీర్థం అవుతుంది. 


వట్టివేళ్ళు, ఏలకులు, లవంగాలు, పచ్చ కర్పూరం మొదలైన సుగంధ ద్రవ్యాలు చేర్చిన నీటిని 

శంఖంలో పోసుకుంటూ..

సాలగ్రామాలకు పురుషుసూక్తం పఠిస్తూ..

అభిషేకం చేసిన తీర్థం సర్వశక్తివంతం. 


ఇటువంటి తీర్ధాన్ని భక్తితో సేవిస్తే ప్రాయశ్చిత్తం, పాపక్షయం కలుగుతుంది. 

తీర్ధాన్ని మూడుసార్లు తీసుకుంటారు. 

మొదటిది కాయసిద్ధి కొరకు, 

రెండవది ధర్మసాధనకు,

మూడవది మోక్షం పొందడానికి. 


అసలీ తీర్ధం వల్ల అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయం కలుగుతాయి.


సాలగ్రామాలు ఉన్న ఇల్లు గొప్ప పుణ్యక్షేత్రంతో సమానం. సాలగ్రామ దర్శనం వల్ల, స్పర్శవల్ల, అర్చనవల్ల అంతులేని పుణ్యం లభిస్తుంది. 

సాలగ్రామాలు శిలాజాలు. 

శాస్త్రజ్ఞులు ఈ శిలలను ఒక విధమైన ప్రాణి నిర్మిస్తుందని అంటారు. 


ఆలి అనే ఒక విధమైన మత్స్యం శీతాకాలంలో 

తన శరీరం నుంచి వెలువడే ఒక విధమైన రసాయనిక పదార్ధంతో శిలామయమైన కవచాన్ని నిర్మించుకుని దానిలో నివశిస్తుందని అది మరణించినప్పుడు లేక 

వదిలి వెళ్ళినప్పుడు అవి సాలగ్రామాలుగా మనకు లభిస్తాయని అంటారు. 


సాలగ్రామాల మీద వివిధ దేవతా చిహ్నాలు ఉంటాయి. ముఖ్యంగా చక్రం, పద్మం ప్రధాన చిహ్నాలు. 

విష్ణు భక్తులైన మాధ్వులకు, వైష్ణవులకు ఇవి పూజకు ఎంతో విలువైనవి. 

వైష్ణవ పురాణాలు, ఇతర వైష్ణవ గ్రంధాలు వీటిని గురించి సవిస్తరంగా వివరిస్తాయి.


నేపాల్ దేశంలో ఖట్మండుకు సుమారు 197 మైళ్ళు దూరంలో ముక్తినాధ్, గండకీ నదీ తీరంపై ఉన్న మహాక్షేత్రంలో ఇవి లభిస్తాయి. 

ఇవి సాధారణంగా స్థలజాలు, జలజాలు అని రెండు రకాలు. 

గండకీ నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న సాలగ్రామ గిరిపైన స్థలజాలు, 

గండకీ నదీ గర్భంలో జలజాలు లభిస్తాయి. 


సాలగ్రామాలలో బంగారం ఉంటుంది. 

అందుకే వాటిని హిరణ్యగర్భ అని కూడా అంటారు. సాలగ్రామాలు అమోనైట్ శిలామాలు. 

ఇండియాలో ఈ సాలగ్రామాలు సముద్రంలో నివసించే టెథైస్ అనే ప్రాణి వల్ల ఏర్పడతాయి. 

ఇటువంటి శిలాజాలు అనేక రకాలు ఉన్నాయి. 


250 మిలియన్ సంవత్సరాలలో ఇండియా ఉత్తర దిక్కుగా 9,000 కి.మీ. జరిగిపోయింది. 

హిమాలయాలు ఏర్పడ్డాయి. 

వీటి నుండి అనేక నదులు ప్రవహించాయి. 

ఇండో మైదానంలోకి ప్రవహించిన అటువంటి నదులలో ఒకటి గండకి. 


సాలగ్రామములు మన శాస్త్రం అనుసరించి కొన్ని సౌమ్యమైనవి. 

కొన్ని ఉగ్రమైనవి. 

శాస్త్ర సమ్మతంగా..

చక్రశుద్ధి, 

వక్త్రశుద్ధి, 

శిలాఉద్ధి, 

వర్ణశుద్ధి గల వాటినే పూజించాలి. 


రకరకాల రంగులు గలిగిన కారునలుపు, భగ్నమైన, మొక్కవోయిన సాలగ్రామాలను పూజించకూడదు. నారసింహ..

పాతాళ నారసింహ, 

గండభేరుండ, 

మహాజ్వాల మొదలైనవాటిని సన్యాసులు, బ్రహ్మచారులు పూజించాలి. 


విష్ణు, 

సీతారామ, 

గోపాల వంటి శాంతమూర్తులనే గృహస్థులు పూజించుకోవాలంటారు. 

పరిమాణాన్నిబట్టి కూడా పూజార్హతను నిర్ణయించుకుంటారు.. 

సాధారణంగా ఇవి ప్రతి గృహంలోనూ వంశపారంపర్యంగా సంక్రమిస్తుంటాయి. 


సాలగ్రామ శిలామహత్మ్యం గురించి వేరే చెప్పనక్కరలేదు. తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరునికీ, 

మంత్రాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామి వారికీ 

అంతటి మహిమ ఉండడానికి కారణం అక్కడ ఉండే సాలగ్రామాలు అంటారు. 

సాలగ్రామాన్ని పూజిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో 

దాని దానం వలన కూడా అంతటి ఫలం లభిస్తుంది.


సాలగ్రామ శిలయందు, చరాచరాత్మకమగు మూడు లోకాలు అణిగి ఉన్నాయి. 

ఆ కారణంగా సాలగ్రామాన్ని భక్తిశ్రద్ధలతో, 

పరిపూర్ణ విశ్వాసంతో, శాస్త్ర ప్రకారం అభిషేకిస్తే, 

కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యఫలానికి సమానమవుతుంది. 


మరియు కోటి గోవులను దానం చేసినంత ఫలితాన్ని పొందుతారు. 

సాలగ్రామ పూజచే, శివకేశవులని పూజించిన ఫలితం కలుగుతుందిట.

సాలగ్రామం వున్న ప్రదేశాలలో స్నానం చేసినా, 

దానం చేసినా, 

కాశీ క్షేత్రంలో పవిత్ర గంగానదీ స్నానంకంటే, 

ఆ పుణ్యక్షేత్రంలో చేసిన దానం కంటే, 

నూరు రెట్లు అధిక ఫలము కలుగుతుంది. 


సాలగ్రామమును అభిషేకించిన పుణ్య బలాలను ప్రోక్షించుకొనినచో, 

సర్వపాపాలను నశింపజేస్తుంది. 

సర్వరోగాలు తొలగిపోతాయి. 

సకల సంపదలు కలుగుతాయి, 

సర్వశుభాలను కలిగించి, 

మోక్ష సామ్రాజ్యమును సిద్ధింపజేస్తుంది. 


సాలగ్రామమును అభిషేకించిన జలాలను 

ప్రోక్షించుకొనిన యెడల, 

పవిత్ర గంగానదీ స్నానమాచరించిన యెడల 

సర్వ తీర్థాలలో స్నానమాచరించిన పుణ్యఫలం కలిగి, సర్వదేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుంది.


ఒక్కసారి భక్తిశ్రద్ధలతో సాలగ్రామాన్ని శాస్త్ర ప్రకారం పూజించి, అభిషేకించితే కోటి లింగాలను దర్శించి, పూజించి, అభిషేకించిన ఫలితం కలుగుతుంది. 

సాల గ్రామ తీర్థం సేవించినచో, 

వెయ్యిసార్లు పంచామృతమును సేవించిన ఫలితముకంటే, 

ప్రాయశ్చిత్తముల యందు ఆచరించు దానాలు ఫలితం కంటే అధిక ఫలితం ఉంటుంది. 


కనీసం, సాలగ్రామాన్ని అర్చించుటకు మంత్రాదులు తెలియకున్నప్పటికీ, శక్తిననుసరించి 

పూర్తి భక్తివిశ్వాసాలతో పూజిస్తే, 

కొన్ని ఫలితాలైనా కలుగుతాయి. 

సాలగ్రామ శిల యందు ఉంచిన అన్ని పదార్థములు పవిత్రములవుతాయి. 

సాలగ్రామమును ముందుంచుకుని పితృదేవతలకు తర్పణాలను ఇచ్చన ఎడల, 

ఆ పితృదేవతలు స్వర్గంలో శాశ్వత సుఖాలను పొందు తారు. 


అన్ని విధాలైన పుణ్యాలకు పరిమితులున్నాయి గాని, 

ఈ సాలగ్రామశిల పూజచే కలుగు పుణ్యానికి 

పరిమితులు లేవు. 

అతల, వితల, రసాతల, పాతాళాది పధ్నాలుగు లోకాలలో ఈ సాలగ్రామ శిలకు సరిపడునట్టి వేరొక శిల లేదన్నదే శాస్తవ్రచనం.


కార్తీక మాసంలో సాలగ్రామ శిలపై ‘స్వస్తిక’ మండలమును రచించినచో అనంతమైన పుణ్యఫలము కలుగుతుంది. సంవత్సరకాలం గృహంలో ‘నిత్యాగ్ని హోమం’ చేసిన ఫలితానికి సమానమైన ఫలితాన్ని పొందుతారు. 


సాలగ్రామంపై శుద్ధమైన మట్టితో గాని, 

రంగులతో గాని, 

ఏ కొద్దిపాటి కేశవనామాలను వ్రాసినా, 

కోటి కల్పాల వరకూ స్వర్గంలో నివసించే భాగ్యం 

కలుగుతుందిట. 

పూజాపీఠంలో సాలగ్రామమును ఉంచితే, 

సమస్తమైన పూజలు సక్రమంగా సాగి 

పరిపూర్ణ ఫలితాలను పొందుతారు. 

సాలగ్రామాలు ఎంత చిన్నవిగా ఉంటే అంత మంచిది. 


సాలగ్రామాలు పగిలినప్పటికీ, 

పెచ్చు పూడినప్పటికీ కూడా పూజార్హత కలిగి ఉంటాయి. కొన్ని సాలగ్రామాలు ఇంట్లో పెట్టుకుని పూజించుటకు అర్హత కలిగి ఉండవు. 

విపరీత పరిణామాలు కలుగుతాయి, 

కాబట్టి ఇంట్లో పెట్టుకుని పూజించాలనుకుంటే, సాలగ్రామములను గురించి క్షుణ్ణంగా తెలిసిన 

పండితుల అమూల్యమైన అభిప్రాయాలను తెలుసుకుని ఆచరించటం శ్రేయస్కరం.


సాలగ్రామంపై గల చక్రాలను బట్టి వాటికి 

వివిధము లైన పేర్లు ఉన్నాయి.

1 చక్రం ఉంటే - సుదర్శనం అని,

2 చక్రములు ఉంటే - లక్ష్మీనారాయణ అని,

3 చక్రములు ఉంటే - అచ్యుతుడు అని,

4 చక్రములు ఉంటే - జనార్ధనడు అని,

5 చక్రములు ఉంటే - వాసుదేవుడు అని,

6 చక్రములు ఉంటే - ప్రద్యుమ్నుడు అని,

7 చక్రములు ఉంటే - సంకర్షణుడు అని,

8 చక్రములు ఉంటే - పురుషోత్తముడు అని,

9 చక్రములు ఉంటే - నవ వ్యూహము అని,

10 చక్రములు ఉంటే - దశావతారము అని,

11 చక్రములు ఉంటే - అనిరుద్ధుడు అని,

12 చక్రములు ఉంటే - ద్వాదశాత్ముడు అని,

12 చక్కముల కన్నా ఎకువ ఉంటే ‘అనంతమూర్తి’ అని అంటారు. 


సాలగ్రామాలు తెల్లనివైతే సర్వపాపాలను హరిస్తాయి. 


పసుపుపచ్చనివి అయితే సంతానభాగ్యాన్ని కలిగిస్తాయి. 


నీలవర్ణంగలవి అయితే సర్వసంపదలను ఇస్తాయి. 


ఎరుపురంగు గలవి అయితే రోగాలను కలిగిస్తాయి, 


వక్రముగా వున్న సాలగ్రామాలు దారిద్య్రాన్ని కలిగిస్తాయి.


నలుపు రంగు కలిగి, దానికి గల చక్రం మధ్య భాగంలో కొద్దిగా ఉబ్బినట్లుగా వుండి, 

రేఖపొడవుగా ఉంటే, దానిని ‘ఆదినారాయణ సాలగ్రామం’ అని అంటారు.


తెలుపురంగు కలిగి రంధ్రంవైపున రెండు చక్రాలు 

ఒక దానితో ఒకటి కలిసిపోయినట్లు ఉంటే, 

దానిని ‘వాసు దేవ సాలగ్రామం’ అని అంటారు. 

ఇది సర్వ శ్రేష్టమైనది. 

ఇది ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది.


పసుపు పచ్చ రంగు కలిగి గుండ్రంగా వుండి, 

రంధ్రం వైపున మూడు రేఖలు ఉండి, ‘

పద్మ చిహ్నం’ పైముఖం గా ఉంటే దానిని 

‘అనిరుద్ధ సాలగ్రామము’ అని అంటారు. 

ఇది చాలా మంచిది. 


కపిలవర్ణం కలిగి, చక్రం పెద్దదిగా ఉంటే, 

దానిని ‘నరసింహ సాలగ్రామం’ అని అంటారు. 

దీనిని బ్రహ్మచర్య దీక్షతోనే పూజించాలి. 


బంగారు వర్ణంతో పొడవుగా వుండి మూడు బిందువులతో వున్నదానిని ‘మత్య్సమూర్తి సాలగ్రామం’ అని అంటారు. ఇది భక్తిని పెంచి ముక్తిని కలిగిస్తుంది. 

సంపదలను ఇస్తుంది. 


నలుపు రంగుతో, మెరుస్తూ వుండి 

ఎడమవైపున గద, చక్రాలు, కుడి వైపున రేఖ వున్నదానిని ‘సుదర్శనమూర్తి సాలగ్రామం’ అని అంటారు. 

శత్రుబాధలు నుండి రక్షిస్తుంది. 


వివిధ వర్ణములతో వుండి, అనేక చక్రాలు, 

అనేక రేఖలు వున్నదానిని ‘అనంతమూర్తి సాలగ్రామము’ అని అంటారు.

ఈ సాలగ్రామం సకలాభీష్టాలను తీర్చుతుంది. 


3 ముఖాలు, 6 చక్రాలు కలిగి నేరేడు పండు ఆకారంలో ఉన్న దానిని ‘షట్చక్రసీతారామ సాలగ్రామం’ అని అంటారు. 

ఇలాంటి సాలగ్రామం దొరకటం దుర్లభం. 

ఈ సాలగ్రామాన్ని పూజించనవారికి అష్టైశ్వర్యములు కలుగుతాయి. 


ఇంకా కొన్ని అపురూపమైన సాలగ్రామాలు కూడా ఉన్నాయి. 

ఇంట్లో పూజించు సాలగ్రామానికి నిత్యనైవేద్యం తప్పనిసరిగా పెట్టాలి. 

కుటుంబ సభ్యులు మినహా అన్యులు సాలగ్రామాన్ని దర్శించరాదు.

సర్వపాపపరిహారమైనది, 

సర్వవిధాలైన కష్టాల నుండి రక్షించేది, 

సర్వ పుణ్యణఫలాలను ఇచ్చేది, 

సర్వదేవతా పూజాఫలితాలను ఇచ్చేది, సర్వశ్రేయస్కరమైనది, 

సర్వో త్కృష్టమైనది, 


సర్వాంతర్యామి యొక్క ప్రతీక అయిన ‘సాలగ్రామాన్ని’ పూజించుకునే భాగ్యం ఈ కలియుగం లో మానవులమైన మనకు కలగటం, 

నిజంగా అపూర్వ మైన అదృష్టం. 

అటువంటి అవకాశాన్ని వినియోగించుకుని, 

జీవితాన్ని ధన్యం ఒనర్చుకుని, 

శాశ్వతానందాన్ని పొంది ముక్తిని పొందటం భక్తిపరుడైన మానవునికి ముఖ్యకర్తవ్యం అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 

అవకాశం దొరికితే, ఆ పుణ్యఫలాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నించాలి.


సాలగ్రామాలను ఆవుపాలతో గాని, 

పంచామృముతోగాని శుద్ధి చేయాలి. 

‘రుద్రాక్షధారణ’ నియమాలనే, 

సాలగ్రామ పూజలోనూ పాటించాలి. 


ప్రత్యేక సమయాలలో, 

సంక్రమణకాలాలలో, 

గ్రహణ సమయాలలో 

ఆయా సాలగ్రామాలననుసరించి 

ఆయా దైవజపాలను 1008 సార్లు చేసినా, చేయించుకున్నా, 

ఆ సాలగ్రామము యొక్క శక్తి ద్విగుణీకృతమవుతుంది.


సాలగ్రామశిలను షోడశోపచార పూజావిధానం ద్వారా అర్చించిన భక్తులకు యావత్‌ కల్పాంతముల వరకు 

వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది. 


కనీసం సాలగ్రామంకు భక్తిశ్రద్ధలతో నమస్కరించి, యథావిధిని పూజిస్తే, 

మరుజన్మ లేకుండా ముక్తి పొందుతారని ప్రతీతి. సాలగ్రామమును స్మరించినా, 

దర్శించినా, 

నమస్కరించినా, 

సర్వపాపాలు పరిహరింపబడతాయి.


(సేకరణ)

ధనిష్ఠ నక్షత్రము

 ధనిష్ఠ నక్షత్రము - గుణగణాలు, ఫలితాలు


నక్షత్రములలో ధనిష్ఠ 23వ నక్షత్రము. ధనిష్ఠా నక్షత్ర అధిపతి కుజుడు, ఇది రాక్షస గణము, పురుష జాతి, రాశ్యాధిపతి శని, జంతువు సింహము. 


ధనిష్ఠ నక్షత్రము మొదటి పాదము  

ధనిష్ఠ నక్షత్ర అధిపతి కుజుడు. ఈ జాతకుల మీద సూర్య కుజ గ్రహ ప్రభావం ఉంటుంది. ఇది రాక్షసగణ ప్రధాన నక్షత్రము. కనుక వీరు ఏదైనా కార్యము యందు పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. వీరికి ఆవేశం పాలు అధికమే. వీరికి యునియన్ నాయకులుగా ఉండే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు, అతిశయం అధికంగా ఉంటాయి. వీరికి తండ్రితో అనుబంధం కాస్త అధికంగానే ఉంటుంది. సైనికపరమైన, విద్యుత్ సంబంధిత, అగ్ని సంబంధిత, భూ సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 


వీరికి ఆరు సంవత్సరముల వరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. విద్యలో అడ్డంకులు ఎదురు కావచ్చు. వీరికి రాహు దశ కాలం తల్లిదండ్రుల నీడలో జరిగి పోతుంది కనుక కష్టం తెలియకుండా గడిచిపోతుంది. రాహు దశ అనుకూలిస్తే సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. 24 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల గురుదశ కారణంగా సమస్యలు కాస్త తగ్గి సుఖం మొదలవుతుంది. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయాల్సిందే. లేదంటే తరువాత వచ్చే శని దశ కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 40 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. 59 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. మిగిలిన జీవితం ఆటంకాలు లేకుండా సాగిపోతుంది.


ధనిష్ఠ నక్షత్రము రెండవ పాదము

  ఈ జాతకులకు ఆవేశం, బుద్ధి కుశలత అధికంగా ఉంటుంది. వ్యాపారం చేయడమంటే అంటే ఆసక్తి కనబరుస్తారు. భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలం. సైనిక పరమైన వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలం. 


ఈ నక్షత్ర జాతకులకు నాలుగు సంవత్సరముల వరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి. వీరికి రాహు దశ కాలంలో తల్లిదండ్రుల నీడలో జరిగిపోతుంది కనుక అప్పుడు కష్టాలు తెలియకుండా జరిగిపోతుంది. రాహు దశ అనుకూలిస్తే సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. 22 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు క్రమంగా తగ్గి సుఖం మొదలవుతుంది. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే తరువాత వచ్చే శని దశ కాలంలో ఆర్థిక సమస్యలు వస్తాయి. 38 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులే అధికమవుతాయి. 57 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కాస్త ఉపశమనం కలుగుతుంది. మిగిలిన జీవితం సుఖంగా సాగిపోతుంది.


ధనిష్ఠ నక్షత్రము మూడవ పాదము   

వీరికి పట్టుదల గల వ్యక్తులై ఉంటారు. ఆవేశమూ అధికమే. వీరు పరిశుభ్రమైన వాతావరణంలో నివసించడానికి ఆసక్తులై ఉంటారు. వీరు కళాత్మకమైన వస్తు సేకరణ చేయడానికి ఆసక్తులై ఉంటారు. వీరికి జల విద్యుత్, జల, భూ సంబంధిత వృత్తులు, ఉద్యోగం, వ్యాపారం అనుకూలిస్తుంది. సైనిక సంబంధిత, కళా సంబంధిత ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి. 


ఈ జాతకులకు రెండు సంవత్సరముల వరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి. రాహుదశ కాలం తల్లిదండ్రుల నీడలో జరిగిపోవడం వల్ల వీరికి కష్టం తెలియకుండా జరిగిపోతుంది. రాహు దశ అనుకూలిస్తే సమస్యలు తగ్గడానికి అవకాశం. 20 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు తగ్గి సుఖం మొదలవుతుంది. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. సంపాదించింది జాగ్రత్త చేయవాల్సిందే. లేదంటే తరువాత వచ్చే శని దశ కాలంలో ఇబ్బందులు తప్పవు. 36 తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికమవుతాయి. 55 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం కలుగుతుంది. 72 సంవత్సరాల కాలంలో వచ్చే కేతు దశ కాలంలో కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. కేతు దశ అనుకూలిస్తే విదేశీ పర్యటన, తీర్ధ యాత్రలు అనుకూలిస్తాయి. మిగిలిన జీవితం సాఫీగా జరిగి పోతుంది.


ధనిష్ఠ నక్షత్రము నాలుగవ పాదము

వీరి మీద పరిపూర్ణ కుజ ప్రభావం ఉంటుంది. ఈ జాతకులకు ధైర్యసాహసాలు, ఆవేశం అధికంగా ఉంటాయి. ప్రజా ఉద్యమాలలో వీరు ముందుంటారు. వీరికి సైనిక సంబంధమైన ఉద్యోగాలు, ధైర్య సహసాలు అవసరమైన ఉద్యోగాలు అనుకూలిస్తాయి. 


ఈ జాతకులకు ఒక సంవత్సరమువరకు కుజ దశ ఉంటుంది. తరువాత వచ్చే 18 సంవత్సరాల రాహు దశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. విద్యలో అడ్డంకులు ఉంటాయి. రాహు దశ అనుకూలిస్తే సమస్యలు తగ్గే అవకాశం. రాహు దశ కాలంలో తల్లిదండ్రుల నీడలో ఉంటారు కనుక కష్టాలు లేకుండా జరిగిపోతుంది. 19 సంవత్సరాల వయసులో వచ్చే 16 సంవత్సరాల కారణంగా సమస్యలు తగ్గి సుఖం మొదలవుతుంది. ఈ దశలో సంపాదనలో అభివృద్ధి ఉంటుంది. అయితే సంపాదించింది జాగ్రత్త చేసుకోవాల్సిందే. లేదంటే తరువాత వచ్చే శని దశ కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయి. 35 సంవత్సరాల తరువాత వచ్చే 19 సంవత్సరాల శని దశ కాలంలో సంపాదన కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. 54 సంవత్సరాల తరువాత వచ్చే 17 సంవత్సరాల బుధ దశ కాలంలో కొంత ఉపశమనం. మిగిలిన జీవితం సాఫీగా సాగిపోతుంది.


ధనిష్ఠా నక్షత్రము ఫలితాలు


ఈ నక్షత్రంలో జన్మించిన వారు మంచి బుద్ధికుశలత కలిగి ఉంటారు. వీరి సరైన తెలివితేటలను ఉపయోగిస్తే శాశ్వత కీర్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకుంటారు. అండగా నిలబడే శక్తివంతమైన వ్యక్తులు జీవితంలో ప్రతి సంఘటనలో ఆదుకుంటారు. అధికారులుగా, రాజకీయ నాయకులుగా, వ్యాపారవేత్తలుగా రాణిస్తారు. చదువు, సంస్కారం ఉపయోగపడే మంచి అధికారిగా రాణిస్తారు. అయితే వీరి అధికార వైఖరి, మొండితనం వల్ల ఇతరుల నుంచి విమర్శలను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఎదురవుతుంది. 


అనవసరమైన విషయాలను గోప్యంగా ఉంచే ఆత్మీయులను దూరం చేసుకుంటారు. సొమ్ము పొదుపు చేయాలని ప్రయత్నిస్తారు. కాని అది ఆచరణ సాధ్యం కాదు. అందరికీ సాయం చేస్తారు. డబ్బు చేతిలో నిలవదు. స్థిరాస్థుల రుపంలోనే నిలబడతాయి. మేధావులుగా భావిస్తారు కాని ఆత్మీయులకు చెప్పకుండా చేసే పనులు నష్టం కలిగిస్తాయి. దుష్టులకు భాగస్వామ్యం అప్పచెబుతారు. అందువలన నష్టపోతారు. అనవసర వ్యక్తులను నెత్తికి ఎక్కించుకుని అందలం ఎక్కించి కష్టాలు కొని తెచ్చుకుంటారు. 


ఈ జాతకులకు గురు, శని, బుధ, మహర్ధశలు, శుక్రదశ యోగిస్తాయి. వీరు జమ్మిచెట్టును పెంచడం, పూజించడం వల్ల మెదడుకి సంబంధించిన సమస్యలు తలెత్తవు. అలాగే వీరికి తెలివితేటలు, మంచి వాక్చాతుర్యం, ధైర్యం కలగడానికి, కుటుంబ సభ్యుల అండదండల కొరకు, సంతానాభివృద్ధి కొరకు ఉపయోగపడుతుంది....మీ... *చింతా గోపీ శర్మ సిద్ధాంతి** *లక్ష్మీలలితా వాస్తు జ్యోతిష నిలయం* (భువనేశ్వరిపీఠం) పెద్దాపురం, సెల్ :- 9866193557

భారతం

 ఈకథ భారతం లో వుందో లేదో నాకు తెలియదు .కానీ ఆడపిల్లలు వద్దనుకునే వాళ్లకి ఈ కథ గుణపాఠం గా వుంటుందనిపించింది. 

పూర్వం ఒక అడవిలో ఒక తోడేలు నివసిస్తూ వుండేది.అదిదగ్గర వున్న గ్రామాల్లోకి వెళ్లి పిల్లల్ని ఎత్తుకొని వచ్చి 

తినేసేది.అలా ఒక రోజు అమ్మాయిని ఎత్తుకొని వచ్చింది.ఆ పాపను చూస్తే దానికి చంపబుద్ధి కాలేదు.ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా పెంచుకుంది.అడవిలోని తేనే,పళ్ళు తినిపించి  

పెంచి పెద్ద చేసింది.ఆ అమ్మాయికి యుక్తవయసు వచ్చాక ఒక యువకుడిని తెచ్చిఅతనికి ఆ అమ్మాయిని కన్యాదానం చేసింది. 

ఆ కన్యాదాన ఫలం వల్ల ఆ తోడేలు సగర చక్రవర్తిగా పుట్టింది.

సగరుడు ఒకసారి కొలువు తీరి వుండగా నారదుడు వచ్చి నీవు పూర్వజన్మ లో తోడేలువి.ఒక అమ్మాయిని చంపకుండా పెంచి కన్యాదానం చేసావు ఆ పుణ్య ఫలం వల్ల 

ఈ జన్మలో చక్రవర్తి వై పుట్టావు. అని చెప్తాడు.

అప్పుడు సగరుడు ఒక్క కన్యను దానం చేసినందువల్లనే చక్రవర్తిగా పుడితే చాలామంది ఆడ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే యింకా యెంత పుణ్యమో నని ఆలోచించి తనకు 

60వేల కన్యలు పుట్టాలని కోరుకుంటూ బ్రహ్మ దేవుడిని గురించి తపస్సు చేస్తున్నాడు.సగరుడు పదహారువేల కన్యలకు తండ్రి యై 

వారందరికీ పెళ్ళిళ్ళు చేస్తే ఆ పుణ్య ఫలం వల్ల అతనికి యింద్ర పదవి లభిస్తుందని, తన పదవికే మోసం వస్తుందని ఆలోచించిఇంద్రుడు సరస్వతీ దేవిని ప్రార్థించి సగరుడు 

బ్రహం దేవుణ్ణి వరం కోరేటప్పుడు అతని నాలుకపై వుండి 60వేల పుత్రికలు అనే బదులు పుత్రులు అనేట్టుగా చేయమని కోరాడు.సరస్వతీ దేవి అలాగే చేస్తాను అని అభయమిచ్చింది. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం కాగానే సగరుడు 60000 పుత్రికలు అనకుండా 60000 మంది పుత్రులు కావాలని కోరాడు.తన పొరపాటు గుర్తించే సరికి ఆలస్యమై పోయింది.చేసేదిలేక వెనుదిరిగాడు సగరుడు.

సగరుడికి 60000 వేల మంది పుత్రులు జన్మించారు.వారంతా పెరిగి పెద్దవా రైన తర్వాత 

సగరుడు కన్యాదాన ఫలం దక్కక పోతే నేమి అశ్వమేధయాగం చేస్తాను అని నిర్ణయించుకున్నాడు.అశ్వమేధ యాగ సమయం లో 

ఇంద్రుడు ఆ అశ్వాన్ని దొంగిలించి పాతాళం లోని ఒక గుహలో దాస్తాడు. అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ వుంటాడు.ఆయనకు ఒక వరముంది తన తపస్సు భగ్నం 

చేసిన వాళ్ళను ఆయన కోపంతో చూస్తే ఎదుటి వాళ్ళు భస్మమై పోతారు.

సగరుడు అశ్వాన్ని వెతికేందుకు తన తమ్ముళ్ళను పంపిస్తాడు.వాళ్ళు భూమండల మంతా వెతికి వెతికి అశ్వము ఎక్కడ వుందో కనుక్కోలేక తిరిగి వస్తారు.సగరుడు తన 

60 వేల మంది పుత్రులను పంపిస్తాడు అశ్వాన్ని వెదుకుతూ 

భూలోకం లో కనబడక పొతే పాతాళం లో వుంటుందేమో నని వారు భూమిని త్రవ్వుతూ పోతారు. పదహారువేల మంది త్రవ్వుతూ పోతే పెద్ద 

ఆఖాతము ఏర్పడుతుంది.త్రవ్వుతూ పోతూ ఆ గుహ వరకు చేరుకుంటారు.అక్కడ కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ వుంటాడు.అతనికి దగ్గరలోనే యాగాశ్వము ఒక స్తంభానికి 

కట్టి వేయబడి వుంటుంది.అది చూసి వాళ్ళు కోపోద్రిక్తు లై మునిని దూషిస్తూ ఓ!దొంగ మునీ మా యాగాశ్వమును దొంగిలించి యిక్కడ తపస్సు చేస్తున్నట్లు 

నటిస్తున్నావా?అని గట్టిగా అరుస్తారు.దీర్ఘ తపస్సులో వున్న కపిలుడు మాట్లాడడు. వారికి కోపం వచ్చి ఆయనను కొడతారు.అప్పుడు కపిలుడికి తపో భంగ మై కళ్ళు తెరుస్తాడు. 

ఆ 60 వేల మంది సగర పుత్రులు భస్మ మై బూడిదగా మారుతారు.

ఆ విషయము నారదుడి వల్ల తెలుసు కొని సగరుడు చాలా దుఖిస్తాడు. వాళ్లకు పుణ్యలోకాలు కలుగాజేయాలనుకుంటాడు.నారదుడు వచ్చి గంగను గూర్చి తపస్సు చేసి

గంగను ఆ భస్మరాసి మీదపారేట్టుగా చేస్తే వారికి పుణ్యలోకాలు కలుగు తాయని చెప్తాడు.సగరుడు వెయ్యేండ్లు తపస్సు చేసి తపస్సు చేస్తూనే మరణిస్తాడు.తరువాతి తరం వారు కూడా ప్రయత్నించి విఫలు లవుతారు.

.సగరుడికి మూడో తరం వాడైన భగీరథుడు గంగను గూర్చి తపస్సు చేసి ఆమెను మెప్పిస్తాడు.ఆమె నేను ఆకాశము నుండి క్రిందకు దూకితే నా వేగమునకు భూమి ఓర్వలేదు.నన్ను భరించే శక్తి పరమ శివుడికి మాత్రమే వుంది.ఆయనను ప్రసన్నం చేసుకొని రా అని చెప్తుంది. భగీరథుడు ఈశ్వరుడిని గూర్చి తపస్సు చేస్తాడు.శివుడు ప్రత్యక్ష మై గంగను నేను భరిస్తాను అంటాడు.

అప్పుడు గంగ ఆకాశము నుండి శివుని శిరస్సు మీదకు దూకుతుంది.శివుడు గంగను తన జటాజూటం లో బంధిస్తాడు.భగీరథుని కోరిక మేరకు తన ఒక జటవిప్పుతాడు.అందు 

లోనుంచి గంగ ఒక పాయగా భగీరథుని వెంట వస్తూ వుండగా జహ్నువు అనే ఋషి ఆశ్రమము మీదుగా ప్రవహిస్తూ ఆ ఆశ్రమాన్ని ముంచి వేస్తుంటే జహ్ను ముని కోపం తో 

గంగను తనగొంతులో బంధిస్తాడు.భగీరథుడు జహ్ను మునిని ప్రార్థించి గంగను విడిచి పెట్టమంటాడు.

ఆయన తన చెవి నుండి గంగను వదులు తాడు. .అందుకే గంగ కు జాహ్నవి అనే పేరు  

వచ్చింది. గంగ భగీరధుడి వెంట వచ్చి ఆ భస్మ రాసుల మీదుగా ప్రవహిస్తుంది.అప్పుడు సగరపుత్రులకు ఉత్తమ లోకాలు సంప్రాప్త మవుతాయి.

భగీరథుడు క్రిందకు తెచ్చినాడు కాబట్టి గంగ భాగీరథి అయింది.

సగరపుత్రులు త్రవ్విన ఆఖాతాన్ని పూడ్చడానికి ఇంద్రుడు పెద్ద వర్షము కురిపించి ఆ 

ఆఖాతాన్నినీటితో నింపి వేస్తాడు. అదే యిప్పుడు మన సముద్రము.సగర పుత్రుల చేత త్రవ్వబడినది కాబట్టి సముద్రానికి సాగరము అనే పేరు వచ్చింది..

--------------------------- --------------------------------

బీచ్‌లో

 మా స్నేహితుడు సూర్యాస్తమయం సమయంలో నిర్జనమైన మెక్సికన్ బీచ్‌లో నడుస్తున్నాడు. అతను వెంట నడుస్తున్నప్పుడు, అతను దూరంలోని మరొక వ్యక్తిని చూడటం ప్రారంభించాడు. అతను దగ్గరగా పెరిగేకొద్దీ, స్థానిక స్థానికుడు కిందకు వాలుతూ, ఏదో తీయటానికి మరియు నీటిలోకి విసిరేయడాన్ని అతను గమనించాడు. పదే పదే అతను వస్తువులను సముద్రంలోకి విసిరేవాడు.


మా స్నేహితుడు మరింత దగ్గరగా వచ్చేసరికి, ఆ వ్యక్తి బీచ్ లో కొట్టుకుపోయిన స్టార్ ఫిష్ ను తీయడం గమనించాడు మరియు ఒక సమయంలో, అతను వాటిని తిరిగి నీటిలోకి విసిరేస్తున్నాడు.


మా స్నేహితుడు అబ్బురపడ్డాడు. అతను ఆ వ్యక్తిని సమీపించి, "గుడ్ ఈవినింగ్, మిత్రమా. మీరు ఏమి చేస్తున్నారో నేను ఆశ్చర్యపోతున్నాను" అని అన్నాడు.


"నేను ఈ స్టార్ ఫిష్‌లను తిరిగి సముద్రంలోకి విసిరేస్తున్నాను. మీరు చూస్తున్నారు, ఇది ప్రస్తుతం తక్కువ ఆటుపోట్లు మరియు ఈ స్టార్ ఫిష్‌లన్నీ ఒడ్డుకు కొట్టుకుపోయాయి. నేను వాటిని తిరిగి సముద్రంలోకి విసిరివేయకపోతే, అవి చనిపోతాయి ఇక్కడ ఆక్సిజన్ లేకపోవడం నుండి. "


"నేను అర్థం చేసుకున్నాను, కానీ ఈ బీచ్‌లో వేలాది స్టార్ ఫిష్‌లు ఉండాలి. మీరు వాటన్నింటినీ పొందలేరు. చాలా ఎక్కువ ఉన్నాయి. మరియు ఇది బహుశా వందల సంఖ్యలో జరుగుతోందని మీరు గ్రహించలేదా? ఈ తీరం పైకి క్రిందికి బీచ్‌లు. మీరు బహుశా తేడా చేయలేరని మీరు చూడలేదా? "


స్థానిక స్థానికుడు నవ్వి, వంగి, మరో స్టార్ ఫిష్‌ను తీసుకున్నాడు, మరియు అతను దానిని తిరిగి సముద్రంలోకి విసిరినప్పుడు, "దానికి ఒక తేడా వచ్చింది!"


జాక్ కాన్ఫీల్డ్ మరియు మార్క్ వి. హాన్సెన్


కథ యొక్క నీతి:


“నేను ఒక్కటే, కాని నేను ఒకడిని. నేను ప్రతిదీ చేయలేను, కాని నేను ఏదో చేయగలను. నేను చేయలేనిదాన్ని నేను చేయగలిగిన పనిలో జోక్యం చేసుకోనివ్వను. ”

 




*This is not on wood, but carving on stone.*


There is a treasure of such excellent artifacts in legendary Hindu temples. 


Which is no less than any other wonders. 


But even of today these artifacts do not get that identity.  


*Kāśīrāja Kali Temple, Varanasi*

ప్రాపంచిక

 



🚩🕉️ *హిందూ ఆధ్యాత్మిక వేదిక* 🕉️🚩

                   ➖➖➖✍️


*ప్రాపంచిక విషయాల కోసం మనం భగవంతుణ్ణి ప్రార్థించకూడదు.*

  

ఒకవేళ వాటిని ఆయన మనకు ప్రసాదించినా, ఆ విషయాలు మనకు దుఃఖాలను కూడా తెచ్చిపెడతాయి. *


*భగవంతుడు కోరికలను తీర్చే కామధేనువు. అయితే వ్యక్తిగతమైన విజయాల కోసం, వాంఛల కోసం ఎన్నడూ ఆయనను ప్రార్థించరాదు. సంసార సాగరంలోనూ, మమతానురాగాల మహాసముద్రంలోనూ మునిగిపోకుండా ఉండేటట్లు రక్షించమని మాత్రమే భగవంతుణ్ణి అర్థించాలి. *


*సాధారణంగా మనం దుఃఖం కలుగుతున్నప్పుడు కూడా, శాశ్వతమైన ఆనందానికి మనల్ని చేర్చే భగవన్మార్గాన్ని వెతకకుండా, అర్థంపర్థం లేని కోరికలను ఏమాత్రం విడిచి పెట్టకుండా, ఆ దుఃఖాలలో సర్దుకుపోవడానికి సాధారణంగా ప్రయత్నిస్తూ ఉంటాం. *


*శారీరక సుఖాలకు అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే కాక వాటిని వదులుకోవడానికి ఏ మాత్రమూ అంగీకరించం. ఎదురు దెబ్బలు తప్ప మరేమీ దక్కకపోయినా రకరకాలైన ఆ సుఖాలను అంటిపెట్టుకునే ఉంటాం. *


*మాయ లేదా అజ్ఞానం యొక్క ప్రభావం అంత గొప్పది.*

         *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!*

                     🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


 

శరీరం నందు వాత, పిత్త , కఫాలు

 శరీరం నందు వాత, పిత్త , కఫాలు పెరిగినపుడు ఏర్పడే శారీరక , మానసిక మార్పులు  - 


  # శరీరము నందు వాతప్రకోపం చెందినపుడు  - 


  ☆ శారీరక మార్పులు  - 


 *  బరువు తగ్గుట. 


 *  శరీర దారుఢ్యం , బలం తగ్గును. 


 *  నరాల నొప్పులు పెరుగును . 


 *  కండరాల నొప్పులు పెరుగును . 


 *  నడుములో నొప్పి ముఖ్యముగా నడుము క్రింద .


 *  కీళ్లనొప్పులు , కాళ్ల నొప్పులు పెరుగును . 


 *  చర్మం గరుకుదనం పెరుగును . 


 *  పెదాలు , శరీరం పగుళ్లు ఏర్పడును . 


 *  మలబద్దకం . 


 *  కడుపుబ్బరం , గ్యాస్ పెరగటం , గ్రహణి సమస్య  


 *  అధిక రక్తపోటు . 


 *  చలిగాలికి తట్టుకోలేకపోవడం . 


 *  ఋతువునోప్పి . 


  

  ☆  మానసిక మార్పులు  - 


 *  మనసు కుదురుగా ఉండదు. రకరకాలుగా పరుగుతీయును . 


 *  పూర్తి విశ్రాంతి తీసుకోలేకపోవడం . 


 *  దేనిమీద ఏకాగ్రత ఉండదు. 


 *  అధికమైన ఆందోళన . 


 *  గాభరా ఎక్కువ అవ్వడం . 


 *  అసహనంగా ఉండటం . 


 *  దిగులు , నిద్రపట్టక పోవడం . 


 *  త్వరగా అలసిపోవడం . 


 *  ఆకలి లేకపోవటం . 


  #  శరీరం నందు పిత్తం ప్రకోపం చెందినపుడు  - 


  ☆  శారీరక మార్పులు  - 


  *  అతిగా దాహం వేయడం . 


  *  అతిగా ఆకలి వేయడం . 


 *  హైపర్ ఎసిడిటి , అల్సర్ ఏర్పడుట. 


 *  ఎండని తట్టుకోలేకపోవడం . 


 *  వొళ్ళంతా మంటలు . 


 * చర్మం పైన పుళ్ళు ఏర్పడుట . 


 *  దద్దురులు , కురుపులు , మొటిమలు వచ్చును .


 * దుర్వాసన , చమటలు అధికంగా పట్టడం . 


 * మొలల వ్యాధి ,  మలద్వారం వద్ద మంట. 


 * కళ్లు ఎరుపెక్కడం . 


 * మూత్రం మంటగా , బాగా పలచగా , ఎరుపుగా వెళ్లడం . 


  ☆   మానసిక మార్పులు  - 


 *  ప్రతిదానికి అరవడం , కేకలు పెట్టడం , చికాకు పడటం . 


 * కోపం అధికం అవ్వడం . అసహనం పెరుగుట . 


 *  ప్రతిదాన్ని విమర్శించడం . 


 *  ప్రతిదానికి ఎదురుమాట్లాడటం . 


 * ప్రతివాళ్ల మీద పగతీర్చుకుంటా అనడం , ప్రవర్తించటం . 


  

 #   శరీరము నందు కఫం ప్రకోపం చెందినపుడు  - 


  ☆  శారీరక మార్పులు  - 


 *  ఛాతి బరువుగా ఉండటం. 


 * కంఠం కఫముతో పూడుకొనిపోయినట్టు ఉండటం. 


 *  ముక్కు , సైనస్ లు జిగురుతో నిండిపోవడం . 


 *  దగ్గు , ముక్కు కారటం , తరచూ జలుబు చేయడం . 


 *  చలి , తేమని తట్టుకోలేకపొవడం . 


 *  ఎప్పుడూ ఎలర్జీలతో ఇబ్బందిపడటం . 


 * ఉబ్బసం కలగడం . 


 *  అధిక బరువు పెరగటం . 


 *  కొలెస్ట్రాల్  మోతాదు పెరగటం . 


 *  శరీరం నందు వాపులు పెరగటం . 


 *  కడుపుబ్బరం . 


 *  శరీరం చల్లగా , తెల్లగా మారడం . 


 * మధుమేహ సమస్య రావటం . 


 *  శరీరంలో గడ్డలు , కండలు పెరగటం . 


       పైన చెప్పిన లక్షణాలన్నీ చూస్తే మీకు కొంత అవగాహన వచ్చి ఉంటుంది. అనగా శరీరం నందలి వాత, పిత్త , కఫాలు కొన్ని కొన్ని కారణాల వలన హెచ్చుతగ్గులకు లోనగును. అలాంటప్పుడు ఏదైతే పెరిగిందో అలా పెరిగిన లక్షణాలు కనిపిస్తాయి . ఉదాహరణకు పైన చెప్పిన లక్షణాలు ఆయా శరీర ప్రకృతుల వారికి సహజ లక్షణాలు . అంటే వాత ప్రకృతి గల వారికి ఏ మాత్రం వాతం పెరిగినా నొప్పులు వెంటనే వస్తాయి. అలాగే కఫం పెరిగితే వాళ్లకి నొప్పులు రావా ? అంటే వస్తాయి . కఫ శరీర తత్త్వం గలవారికి నొప్పులు వచ్చాయంటే వారితో వాతం పెరిగిందని అని అర్థం . అలాగే బరువు అధికంగా పెరగటం కఫ శరీర తత్త్వం ఉన్నవారి లక్షణమైన వాత, పిత్త శరీరతత్వం ఉన్నవాళ్లు కూడా బరువుపెరుగుతారు అటువంటప్పుడు వారిలో కఫ సంబంధ దోషం పెరిగిందని అర్థం చేసుకోవాలి . 


           వాతశరీరం కలిగిన వారు బరువు త్వరగా తగ్గుతారు , బరువు ఆలస్యముగా పెరుగుతారు. పిత్త శరీరం కలవారు ఆకలి ఎక్కువుగా ఉండటం , స్ట్రెస్ ఎక్కువుగా ఉండటం వలన అతిగా తింటారు. దానివల్ల బరువు పెరుగుతారు . వీరుకొంత ఆలస్యముగా బరువు తగ్గుతారు. కఫప్రకృతి వారు బరువు తగ్గడం అంత త్వరగా సంభవించదు. 


  గమనిక  -


           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.


           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.


            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.


      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 100 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.


            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .


                  కాళహస్తి వేంకటేశ్వరరావు 


                         9885030034 


               అనువంశిక ఆయుర్వేద వైద్యులు

పన్నెండు జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు🌼🌿*

 *🌼🌿 ఈ పన్నెండు జ్యోతిర్లింగాల దర్శన ఫలాలు🌼🌿*


ఈ పన్నెండు జ్యోతిర్లింగాలను చూసినా, తాకినా, పూజించినా తలచినా మానవులు ఇహపర సుఖాలను పొందుతారు.


1 . సౌరాష్ట్ర దేశంలో చంద్రనిర్మితమైన, అయన పేరు తోనే అలరారుతున్నకుండంలో స్నానంచేసి, అక్కడ సోమనాథ జ్యోతిర్లింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధించిన వాళ్ళు కుష్ఠాపస్మారక్షయాది రోగవిముక్తులై ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతోజీవిస్తారు.

2 . ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలంలో మల్లిఖార్జుననామంతో వెలసిన శివుడి జ్యోతిర్లింగారాధన వలన సర్వవిధ దరిద్రాలు సమసిపోయి, సద్యశ్శుభాలేర్పడి, అనంతరం మోక్ష పదం కలుగుతుంది.

3 . ఉజ్జయిని ‘మహాకాల’ నామకమైన జ్యోతిర్లింగార్చనవలన భయ రాహిత్యం, విద్యాపాటవం, భోగభాగ్యాలూ సమకూరి అన్నింటా విజయం.

4 . అమరేశ్వర, పరమేశ్వర, ఓంకారేశ్వారాది సార్థకనామధేయలాతో ఓంకారేశ్వారంలో వెలసిన శివుడి జ్యోతిర్లింగాన్ని పూజించడం వలన ఇహపరాలు రెండింటా కృతార్థత లభిస్తుంది.

5 శ్రీహరియొక్క రెండు అంశలైన నరనారాయణుల ప్రార్థనతో ఆవిర్భవించిన జ్యోతిర్లింగం హిమవత్పర్వతం మీద వుండి. కేదారేశ్వరుడిగా పేరు వహించిన ఇక్కడి లింగారాధన సర్వాభిష్టాలనూ నెరవేరుస్తుంది. ఇక్కడి రేతః కుండంలోని నీళ్ళతో మూడుసార్లు ఆచమించడమే ముక్తికి చేరువ మార్గమని ముని వాక్యం.

6 . ఢాకిని అనే ప్రదేశంలో ఉన్న జ్యోతిర్లిగం పేరు భీమశంకరలింగం. ప్రాణావసానుడై ఉన్న భక్తుడి రక్షణార్థమై వెలసిన ఈ లింగారాధన వలన అన్ని విధాల భయాలూ అంతరించి, శత్రుజయం కలుగుతుంది. అకాలమృత్యువులు తప్పిపోతాయి.

7 . సర్వప్రపంచం చేతా సేవించబడుతూన్న విశ్వేశ్వరలింగం కాశీలో ఉంది. ఈ పుణ్యక్షేత్ర దర్శన 

మాత్రం చేతేనే సమస్తమైన కర్మబంధాల నుంచీ విముక్తులౌతారు. ఇక్కడ కొన్నాళ్ళు నివసించినా, లేదా కాలవశాన ఇక్కడనే దేహం చాలించినవాళ్ళు మోక్షాన్నే పొందుతారు.

8 . మహారాష్ట్ర నాసిక్ లో ఉన్న జ్యోతిర్లింగం పేరు త్రయంబకేశ్వర లింగం. దీని ఆరాధన వలన అన్ని కోరికలూ తీరుతాయి. అపవాదులు నశిస్తాయి.

9 . చితాభూమిలో ఉన్న జ్యోతిర్లింగం వైద్యనాథుడు. ఈ లింగారాధన వలన భుక్తి ముక్తులే కాకుండా అనేక విధాలైన వ్యాధులు హరించబడతాయని ప్రతీతి.

10 . నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ లింగ దర్శనార్చనాడుల వలన సమస్తమైన భవభయాలే కాకుండా, మహాపాతక ఉపపాతాకాలు కూడా నశించిపోతాయి.

11 . శ్రీరాముని కోరికమేరకు రామేశ్వరంలో జ్యోతిర్లింగంగా వెలిసిన శివుడు, రామేశ్వరుడనే పేరుతోనూనే రాజిల్లుతున్నాడు. కాశీలోని గంగా జలాన్ని తెచ్చి, ఇక్కడి లింగానికి అభిషేకం 

చేసిన వాళ్ళు జీవన్ముక్తులవుతారని ప్రఖ్యాతి.

12 ‘ఘృష్ణేశ్వరుడు’. శివాలయమనే కొలనులో భక్తరక్షణార్థమై ప్రభవించిన ఈ స్వయంభూలింగం భక్తుల ఇహపర భోగాలను అందజేస్తుంది.

నవరాత్రులు

 **దేవీ నవరాత్రులు*  


3.మూడవరోజు


 అమ్మవారి అలంకారము.


శ్రీ గాయత్రీ దేవి.


**ముక్తా విద్రుమ హేమనీల**

**ధవళచ్చాయైర్ముఖైస్త్రీ క్షణై:**

**యుక్తామిందు నిబద్ధరత్న**

**మకుటం తత్త్వార్థ వర్ణాత్మికామ్!**

**గాయత్రీం వరదాభయాంకుశమ్*

**కశాశ్శుభ్రం కపాలం గదాం**

**శంఖం చక్రమధారవింద యుగళం** **హసైర్వాహంతీం భజే**


సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం , చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీ దేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాత: కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. "ఓం భూర్భావస్వ: తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యధీమహి దియో యోన: ప్రచోదయాత్" అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానించాలి.


 అమ్మవారికి అల్లపు గారెలు నివేదన చేయాలి. గాయత్రీ స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేయాలి. గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి.


నైవేద్యం - అల్లం గారెలు,రవ్వకేసరి,పులిహోర.


శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి


ఓం శ్రీ గాయత్రై నమః

ఓం జగన్మాత్రే నమః

ఓం పరబ్రహ్మస్వరూపిణే నమః

పరమార్ధప్రదాయై నమః

ఓం జప్యాయై నమః

ఓం బ్రహ్మతేజో నమః

ఓం బ్రహ్మస్త్రరూపిణ్యై నమః

ఓం భవ్యాయై నమః

ఓం త్రికాలధ్యేయరూపిణ్యై నమః

ఓం త్రిమూర్తిరూపాయై నమః

ఓం సర్వజ్ఞాయై నమః

ఓం వేదమాతాయై నమః

ఓం మనోన్మవ్యై నమః

ఓం బాలికాయై / వృద్దాయై నమః

సూర్యమండలవసిన్యై నమః

ఓం మందేహదానవధ్వంసకారిణ్యై నమః

ఓం సర్వకారణాయై నమః

ఓం హంసరూఢాయై నమః

ఓం వృషారూఢాయై నమః

ఓం గరుడారోహిణ్యై నమః

ఓం శుభాయై / షట్కుక్షిణ్యై నమః

ఓం త్రిపదాయై / శుద్దాయై నమః

ఓం పంచశీర్షాయై నమః

ఓం త్రిలోచనాయై నమః

ఓం త్రివేదరూపాయై నమః

ఓం త్రివిధాయై నమః

ఓం త్రివర్గఫలదాయిన్యై నమః

ఓం దశహస్తాయై నమః

ఓం చంద్రవర్ణాయై నమః

ఓం విశ్వామిత్రవరప్రదాయై నమః

ఓం దశాయుధధరాయై నమః

ఓం నిత్యాయై నమః

ఓం సంతుష్టాయై నమః

ఓం బ్రహ్మపూజితాయై నమః

ఓం ఆదిశక్తై నమః

ఓం మహావిద్యాయై నమః

ఓం సుషుమ్నాభాయై నమః

ఓం సరస్వత్యై నమః

ఓం చతుర్వింశత్యక్షరాఢ్యాయై నమః

ఓం సావిత్ర్యై నమః

ఓం సత్యవత్సలాయై నమః

ఓం సంధ్యాయై / రాత్ర్యై నమః

ఓం సంధ్యారాత్రి ప్రభాతఖాయై నమః

ఓం సంఖ్యాయనకులోద్బవాయై నమః

ఓం సర్వేశ్వర్యై నమః

ఓం సర్వవిద్యాయై నమః

ఓం సర్వమంత్రాద్యై నమః

ఓం అవ్యయాయై నమః

ఓం శుద్దవస్త్రాయై నమః

ఓం శుద్దవిద్యాయై నమః

ఓం శుక్లమాల్యానులేపనాయై నమః

ఓం సురసింధుసమాయై నమః

ఓం సౌమ్యాయై నమః

ఓం బ్రహ్మలోకనివాసిన్యై నమః

ఓం ప్రణవప్రతిపాద్యర్భాయై నమః

ఓం ప్రణతోద్దరణక్షమాయై నమః

ఓం జలాంజలిసుసంతుష్టాయై నమః

ఓం జలగర్భాయై నమః

ఓం జలప్రియాయై నమః

ఓం స్వాహాయై / స్వధాయై నమః

ఓం సుధాసంస్థాయై నమః

ఓం శ్రౌషడ్వౌషటడ్వషట్క్రియాయై నమః

ఓం సురభ్యై నమః

ఓం షోడశకలాయై నమః

ఓం మునిబృందనిషేవితాయై నమః

ఓం యజ్ఞప్రియాయ నమః

ఓం యజ్ఞమూర్త్యై నమః

ఓం స్రుక్ స్రువాజ్యస్వరూపిణ్యై నమః

ఓం అక్షమాలాధరయై నమః

ఓం అక్షమాలాసంస్థాయై నమః

ఓం అక్షరాకృత్యై నమః

ఓం మధుచ్చందదఋషిప్రీతాయై నమః

ఓం స్వచ్చందాయై నమః

ఓం చందసాంనిద్యై నమః

ఓం అంగుళీపర్వసంస్థాయై నమః

ఓం చతుర్వింశతిముద్రికాయై నమః

ఓం బ్రహ్మమూర్త్యై నమః

ఓం రుద్రశిఖాయై నమః

ఓం సహస్రపరమాయై నమః

ఓం అంబికాయై నమః

ఓం విష్ణుహృదయాయై నమః

ఓం అగ్నిముఖాయై నమః

ఓం శతమాధ్యాయై నమః

ఓం శతవరాయై నమః

ఓం సహస్రదళపద్మస్థాయై నమః

ఓం హంసరూపాయై నమః

ఓం నిరంజనాయై నమః

ఓం చరాచరస్థాయై నమః

ఓం చతురాయై నమః

ఓం సూర్యకోటిసమప్రభాయై నమః

ఓం పంచవర్ణముఖీయై నమః

ఓం ధాత్రీయై నమః

ఓం చంద్రకోటిశుచిస్మితాయై నమః

ఓం మహామాయాయై నమః

ఓం విచిత్రాంగ్యై నమః

ఓం మాయాబీజనివాసిన్యై నమః

ఓం సర్వయంత్రాత్మికాయై నమః

ఓం జగద్దితాయై / రాత్ర్యై నమః

ఓం మర్యాదాపాలికాయై నమః

ఓం మాన్యాయై నమః

ఓం మహామంత్రఫలప్రదాయై నమః

ఓం సర్వతంత్రస్వరూపాయై నమః 


🌹శ్రీ మాత్రే నమః🌹

🙏🙏🙏

media

 Reporter:- Sir, what do you eat during Navratri?


Modi : I only eat one single fruit in this Navratri.


Reporter :- PM Sir; which fruit will you Eat ?


Modi:- Papaya


NDTV :- Breaking news ...

Modi does not like Mangoes; Banana; etc.He only eats Papaya.


Surjewala :- Modi like Papaya means Saffron in color.

This means Saffronisation of food choice


Shekhar Gupta :- This means Modi is only promoting Hindutva.

He does not like green fruits means he is against Muslims.

This clearly shows Modi has no feelings for Muslims.


Mamata - I will put a ban on papaya in Bengal.


Rahul Gandhi:- My favorite Fruit is Banana ....I will never eat Papaya.


Barkha Dutt : The nation wants to know why Modi likes Papaya more than other fruits .


Mehbooba Mufti :- Modi doesn't like kashmiri Apple.This is Modi’s tactic to usurp Kashmir. We will not allow this to happen.


Yechuri:- Selecting an expensive fruit like Papaya shows Modi is pro- capitalist. We would ask for a Judicial enquiry.


Kejriwal:- Traditionally AAM (mango) is considered the King of Fruits.

Modi is anti aam aadmi.


Ravish Kumar : Modi has betrayed his ugly, communal façade by declaring that he likes Papaya. By deliberately avoiding green guavas from the list of fruits he likes, Modi has clearly demonstrated his anti-Muslim, communal mentality. He is Polarising the nation.


A Tweet by Rajdeep Sardesai : "Modi likes Papaya an Indian fruit which mean he hates Olives, the Italian fruit. This shows a narrow nationalism. These RSS people have no international taste & class"


Mani Shankar Aiyar : Modi is a rotten Papaya and must therefore be immediately removed from the basket. Otherwise all Papayas in the basket will rot. A rotten Papaya like modi has no place in the secular, all-inclusive basket of India.


Alpesh Thakor - मोदीजी विश्व का सबसे महंगा पपीता खाते है


Pawan khera - मोदीजी विश्व के सबसे उच्च किस्म के पपीते से facial करवाते है.


kanhaiya kumar - मोदीजी केवल पपीते का केसरी भाग खाते है और हरे भाग को काट कर फैंक देतें है मोदी ने देश को तोड़ दिया.


Sadanand Dhume quoting Rupa -

"As per an eminent economist, eating only Papaya can reduce consumption of other food, thus lowering Indian GDP growth by 100 basis points."


600 Theatre Artists, 100 Filmmakers, 103 Economists, Civil society groups and Award Wapsi brigade has issued a Combine statement urging Indians to boycott Papaya , as this fruit is damaging the unity & integrity of India.


This is how media interprets🤔

విజయవాడలో

 _*విజయవాడలో ఈరోజు గాయత్రీ దేవి అలంకారం - శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి*_


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


శరన్నవరాత్రులలో మూడవ రోజు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది.


సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి. ముక్త , విద్రుమ , హేమ , నీల , ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం , చక్ర , గద , అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపముగా అర్చించారు.


*శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి*


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


ఓం శ్రీ గాయత్రై నమః

ఓం జగన్మాత్రే నమః

ఓం పరబ్రహ్మస్వరూపిణే నమః

పరమార్ధప్రదాయై నమః

ఓం జప్యాయై నమః


ఓం బ్రహ్మతేజో నమః

ఓం బ్రహ్మాస్త్రరూపిణ్యై నమః

ఓం భవ్యాయై నమః

ఓం త్రికాలధ్యేయరూపిణ్యై నమః

ఓం త్రిమూర్తిరూపాయై నమః


ఓం సర్వజ్ఞాయై నమః

ఓం వేదమాతాయై నమః

ఓం మనోన్మవ్యై నమః

ఓం బాలికాయై నమః

ఓం తరుణాయై నమః


ఓం వృద్దాయై నమః

ఓం సూర్యమండలవసిన్యై నమః

ఓం మందేహదానవధ్వంసకారిణ్యై నమః

ఓం సర్వకారణాయై నమః

ఓం హంసరూఢాయై నమః


ఓం గరుడారూఢాయై నమః

ఓం వృషారూఢాయై నమః

ఓం శుభాయై నమః

ఓం షట్కుక్షిణ్యై నమః

ఓం త్రిపదాయై నమః


ఓం శుద్దాయై నమః

ఓం పంచశీర్షాయై నమః

ఓం త్రిలోచనాయై నమః

ఓం త్రివేదరూపాయై నమః

ఓం త్రివిధాయై నమః


ఓం త్రివర్గఫలదాయిన్యై నమః

ఓం దశహస్తాయై నమః

ఓం చంద్రవర్ణాయై నమః

ఓం విశ్వామిత్రవరప్రదాయై నమః

ఓం దశాయుధధరాయై నమః


ఓం నిత్యాయై నమః

ఓం సంతుష్టాయై నమః

ఓం బ్రహ్మపూజితాయై నమః

ఓం ఆదిశక్తై నమః

ఓం మహావిద్యాయై నమః


ఓం సుషుమ్నాభాయై నమః

ఓం సరస్వత్యై నమః

ఓం చతుర్వింశత్యక్షరాఢ్యాయై నమః

ఓం సావిత్ర్యై నమః

ఓం సత్యవత్సలాయై నమః


ఓం సంధ్యాయై నమః

ఓం రాత్ర్యై నమః

ఓం సంధ్యారాత్రి ప్రభాతఖాయై నమః

ఓం సంఖ్యాయనకులోద్బవాయై నమః

ఓం సర్వేశ్వర్యై నమః


ఓం సర్వవిద్యాయై నమః

ఓం సర్వమంత్రాద్యై నమః

ఓం అవ్యయాయై నమః

ఓం శుద్దవస్త్రాయై నమః

ఓం శుద్దవిద్యాయై నమః


ఓం శుక్లమాల్యానులేపనాయై నమః

ఓం సురసింధుసమాయై నమః

ఓం సౌమ్యాయై నమః

ఓం బ్రహ్మలోకనివాసిన్యై నమః

ఓం ప్రణవప్రతిపద్యఅర్దాయై నమః


ఓం ప్రణతోద్దరణక్షమాయై నమః

ఓం జలాంజలిసుసంతుష్టాయై నమః

ఓం జలగర్భాయై నమః

ఓం జలప్రియాయై నమః

ఓం స్వాహాయై నమః


ఓం స్వధాయై నమః

ఓం సుధాసంస్థాయై నమః

ఓం శ్రౌషట్ వౌషట్ వషట్క్రియాయై నమః

ఓం సురభ్యై నమః

ఓం షోడశకలాయై నమః


ఓం మునిబృందనిషేవితాయై నమః

ఓం యజ్ఞప్రియాయ నమః

ఓం యజ్ఞమూర్త్యై నమః

ఓం స్రుక్ స్రువాజ్యస్వరూపిణ్యై నమః

ఓం అక్షమాలాధరయై నమః


ఓం అక్షమాలాసంస్థాయై నమః

ఓం అక్షరాకృత్యై నమః

ఓం మధుచ్చందసే నమః

ఓం ఋషిప్రీతాయై నమః

ఓం స్వచ్చందాయై నమః


ఓం చందసాంనిద్యై నమః

ఓం అంగుళీపర్వసంస్థాయై నమః

ఓం చతుర్వింశతిముద్రికాయై నమః

ఓం బ్రహ్మమూర్త్యై నమః

ఓం రుద్రశిఖాయై నమః


ఓం సహస్రపరమాయై నమః

ఓం విష్ణుహృదయాయై నమః

ఓం అగ్నిముఖాయై నమః

ఓం శతమధ్యాయై నమః

ఓం దశ ఆవరాణాయై నమః


ఓం సహస్రదళపద్మస్థాయై నమః

ఓం హంసరూపాయై నమః

ఓం నిరంజనాయై నమః

ఓం చరాచరస్థాయై నమః

ఓం చతురాయై నమః


ఓం సూర్యకోటిసమప్రభాయై నమః

ఓం పంచవర్ణముఖీయై నమః

ఓం ధాత్రీయై నమః

ఓం చంద్రకోటిశుచిస్మితాయై నమః

ఓం మహామాయాయై నమః


ఓం విచిత్రాంగ్యై నమః

ఓం మాయాబీజనివాసిన్యై నమః

ఓం సర్వయంత్రాత్మికాయై నమః

ఓం సర్వతంత్రస్వరూపాయై నమః

ఓం జగద్దితాయై నమః


ఓం మర్యాదాపాలికాయై నమః

ఓం మాన్యాయై నమః

ఓం మహామంత్రఫలప్రదాయై నమః

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

గేటు బాగు చేయించి

 *హలో..రామారావు గారేనా* ?


*ఆ ..చెప్పండి ..నేను రామారావు నే మాట్లాడుతున్నా*!


*అజాంఘర్ కాలనీ రామారావు గారేనా మాట్లాడేది* ?


*అవునయ్యా ..అజాంఘర్ కాలనీ రామారావు నే మాట్లాడుతున్నాను ..అయితే ఏంటిట*...


*మీరు మారుతి స్విఫ్ట్ కారు ఓనర్ రామారావు గారేనా* ?


*అబ్బబ్బ ..విషయం ఏంటో చెప్పకుండా ఏంటయ్యా నీ నస* ? 


*టీఎస్ 10 8055 కారు ఓనర్ రామారావు గారు మీరే కదా* ?


*ఇదిగో వేళాపాళా లేకుండా ఆ రామారావు నువ్వేనా ..ఈ రామారావు నువ్వేనా అని చంపుకు తింటున్నావ్ ..ఇంతకీ ఎవడ్రా నువ్వు ..ఏం కావాలి నీకు* ?


*ఒరేయ్ రామారావు ..మీ కారు వరదలో కొట్టుకొచ్చి..మా కాలనీలో.. నా ఇంటి గేటుకు గుద్దుకుని ఆగిపోయింది ..వచ్చి గేటు బాగు చేయించి కారు పట్టుకుపో* 😃😃😃!

 Our mother tongue Telugu language enters the American Elections & in Ballot boxes also in California State of USA 

A proud moment for all Telugu speaking Indians



ధర్మం/నీతి/

 *ధర్మం/నీతి/విలువలు సంబంధ 58 పుస్తకాలు(PDF) ఒకేచోట ఉచితంగా తెలుగులో. ఈ క్రింది లింక్స్ పై క్లిక్ చేసి Read/Download చేసుకోగలరు*

------------------------------------------------


58 పుస్తకాలు ఒకేచోట https://www.freegurukul.org/blog/dharmam-pdf


               (OR)


చాణక్య నీతి సూత్రాలు www.freegurukul.org/g/Dharmam-1


విదురనీతి www.freegurukul.org/g/Dharmam-2


బోధాయన ధర్మ సూత్రము www.freegurukul.org/g/Dharmam-3


ధర్మం www.freegurukul.org/g/Dharmam-4


హిందూ ధర్మ శాస్త్రము www.freegurukul.org/g/Dharmam-5


11 నీతి కథలు www.freegurukul.org/g/Dharmam-6


నీతి కథా మంజరి-1 www.freegurukul.org/g/Dharmam-7


చాణక్య నీతి దర్పణము www.freegurukul.org/g/Dharmam-8


నిర్ణయ సింధువు-1 www.freegurukul.org/g/Dharmam-9


మానవ ధర్మ శాస్త్రము www.freegurukul.org/g/Dharmam-10


అమ్మ చెప్పిన కమ్మని నీతి కథలు www.freegurukul.org/g/Dharmam-11


ఆర్ష ధర్మ సూత్రములు www.freegurukul.org/g/Dharmam-12


భారతమాత సేవలో www.freegurukul.org/g/Dharmam-13


ధర్మ సందేశాలు www.freegurukul.org/g/Dharmam-14


కుటుంబ వ్యవస్థ అవసరమా ? www.freegurukul.org/g/Dharmam-15


మహాభారత కథలు-1 www.freegurukul.org/g/Dharmam-16


ధర్మ శాస్త్ర రత్నాకరం www.freegurukul.org/g/Dharmam-17


నీతి కథామంజరి www.freegurukul.org/g/Dharmam-18


మాటల మధ్యలో రాలిన ముత్యాలు-1,2 www.freegurukul.org/g/Dharmam-19


ధర్మ ఘంట www.freegurukul.org/g/Dharmam-20


నిత్య జీవితానికి నియమావళి www.freegurukul.org/g/Dharmam-21


మంచివాళ్ళు మాటతీరు www.freegurukul.org/g/Dharmam-22


యధార్ధ మానవత్వము www.freegurukul.org/g/Dharmam-23


ధర్మ మంజరి www.freegurukul.org/g/Dharmam-24


సంపూర్ణ నీతి చంద్రిక-1,2 www.freegurukul.org/g/Dharmam-25


మహనీయుల ముచ్చట్లు www.freegurukul.org/g/Dharmam-26


రామాయణము మానవ ధర్మము www.freegurukul.org/g/Dharmam-27


భారత నీతి కథలు-1,2 www.freegurukul.org/g/Dharmam-28


బడిలో చెప్పని పాటాలు www.freegurukul.org/g/Dharmam-29


పవిత్ర సన్నివేశములు www.freegurukul.org/g/Dharmam-30


పరమోత్తమ శిక్షణ www.freegurukul.org/g/Dharmam-31


బాల శిక్ష www.freegurukul.org/g/Dharmam-32


నీతి శతక రత్నావళి www.freegurukul.org/g/Dharmam-33


నీతి వాక్యామృతం www.freegurukul.org/g/Dharmam-34


మహర్షుల హితోక్తులు www.freegurukul.org/g/Dharmam-35


మహాభారత కథలు-5 www.freegurukul.org/g/Dharmam-36


మానవ జీవితము-2 www.freegurukul.org/g/Dharmam-37


మానవ జీవితము-3 www.freegurukul.org/g/Dharmam-38


మానవ ధర్మము www.freegurukul.org/g/Dharmam-39


ధర్మ పధం కథలు www.freegurukul.org/g/Dharmam-40


విదురామృతం www.freegurukul.org/g/Dharmam-41


సంస్కృతి - సంప్రదాయం www.freegurukul.org/g/Dharmam-42


స్ఫూర్తి కణాలు www.freegurukul.org/g/Dharmam-43


హితోపదేశము-1,2 www.freegurukul.org/g/Dharmam-44


ఆర్ష కుటుంబము www.freegurukul.org/g/Dharmam-45


మనుస్మృతి www.freegurukul.org/g/Dharmam-46


పరాశర స్మృతి www.freegurukul.org/g/Dharmam-47


సనాతన ధర్మం దాని విశిష్టత www.freegurukul.org/g/Dharmam-48


రత్న త్రయము www.freegurukul.org/g/Dharmam-49


పౌర హక్కులు - విధులు www.freegurukul.org/g/Dharmam-50


నీతి సుధానిది-3నుంచి5 www.freegurukul.org/g/Dharmam-51


జాతక కథలు-1 నుంచి 5 www.freegurukul.org/g/Dharmam-52


వేమన పద్యములు www.freegurukul.org/g/Dharmam-53


ధర్మ శాస్త్రాలలో శిక్షాస్మృతి www.freegurukul.org/g/Dharmam-54


భారతంలో నీతి కథలు www.freegurukul.org/g/Dharmam-55


నీతి కథలు www.freegurukul.org/g/Dharmam-56


చందమామ కథలు www.freegurukul.org/g/Dharmam-57


నూరు మంచి మాటలు www.freegurukul.org/g/Dharmam-58


ధర్మం/నీతి/విలువలు పై అధ్యయనం, పరిశోధన చేయడానికి కావలిసిన పుస్తకాలు ఒకేచోట దొరకక తెలుగువారు ఇబ్బంది పడుతున్నారు. కావున ప్రతి ఒక్కరికి చేరేలా సహాయం చేయండి 🙏.


మరింత సమాచారం కోసం:

ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్

Website: www.freegurukul.org

Android App: FreeGurukul 

iOS App: Gurukul Education  

Helpline: 9042020123

*To Join In WhatsApp Group*: To get this type of Spiritual, Inspirational, PersonalityDevelopment messages daily, join in group by this link www.freegurukul.org/join

రామాయణమ్. 97

 రామాయణమ్. 97

..

రామలక్ష్మణులను తాను కలిసినదిమొదలు వారితో కలిసి గడిపిన సమయాన్ని లక్ష్మణుడి మనో వేదనను ,ఆరాత్రి తాను,లక్ష్మణుడు ముచ్చటించుకున్నసంగతులన్నీ పూసగుచ్చినట్లు చెప్పి,చివరగా వారిని తాను గంగదాటించిన విషయాన్ని కూడా ఎరుకపరచాడు గుహుడు .

.

ఈ సంగతులన్నీ విన్న భరతుని హృదయంలో శోకం పెల్లుబికి కట్టలు తెంచుకొని ప్రవహించింది.కొరడాలతో కొట్టినప్పుడు ఒక్కసారే కూలబడే ఏనుగులాగ కూలపడి పోయినాడాయన.భరతుడి స్థితి చూస్తున్న శత్రుఘ్నుడుకూడా శోకముతో పట్టుదప్పినిలువలలేక నేలపైబడిన భరతుని కౌగలించుకొని బిగ్గరగా ఏడ్చాడు.

.

ఈ శోకములు విన్న తల్లులు మువ్వురూ భరతుని వద్దకు వచ్చిచేరగా కౌసల్యామాత తన దుఃఖము ఆపుకోలేక తానూ నేలపైపడి భరతుని కౌగలించుకొని ఏడ్వసాగింది.

.

ఆవిడ తీవ్రమైన బాధతో భరతుని ఉద్దేశించి నాయనా ఇంకనీవు ఏడువకురా ,మొత్తము రాజవంశము అంతా నీమీదనే ఆధారపడి ఉన్నది నీకేమయినా అయితే మేమెవ్వరమూ తట్టుకోలేము. 

.

దశరధమహారాజులేడు,రామలక్ష్మణులు చెంతలేరు,నిన్నుచూసుకొని బ్రతుకుతున్నామురా తండ్రీ నాయనా ఎందుకీ దుఃఖము ? సీతారామలక్ష్మణులగూర్చి ఏ విధమైన అప్రియమైన వార్త నీవు వినలేదు కదా!.అని పలుకుతూ తనను ఓదారుస్తున్న పెద్దతల్లి మాటలకు కాస్త తెప్పరిల్లి ఏడుస్తూనే గుహుడితో మరలమరల సీతారామలక్ష్మణుల గూర్చి ప్రశ్నించాడు .వారు ఎక్కడ ఉన్నారు? ఏమి తిన్నారు?ఎక్కడ నిదురించారు ? ఇలాంటి విషయాలు పదేపదే అడిగితెలుసుకుంటున్నాడు భరతుడు.

.

అప్పుడు రాముడు నిదురించిన చెట్టు వద్దకు తీసుకెళ్ళాడు గుహుడు .

రాముడు అక్కడనే దర్భలమీద శయనించాడన్న సంగతితెలుసుకొని మరల ఆయనలో దుఃఖము పొంగిపొర్లింది.

.

దశరధకుమారుడైన రాముడే నేలపై పడుకోవలసి వచ్చిందంటే కాలము కంటే బలమైన వాడెవడూ లేడని తెలుస్తున్నది.

.

న నూనం దైవతం కించిత్ కాలేన బలవత్తరమ్

యత్ర దాశరధీ రామో భూమావేవ శయీత సః.

.

ఇదిగో ఇది నా అన్నగారు పరుండిన చోటు ,

ఇదిగో ఈ గడ్డి అంతా ఆయన శరీరపు రాపిడికి నలిగి పోయింది.

ఇదిగో ఈ దర్భలమీద ఇంకా బంగారపుపొడులు అంటుకొనే ఉన్నాయి మా వదినగారు అలంకారాలేవీ తీయకుండగనే శయనించినట్లున్నది.

ఆవిడ ఏమాత్రము దుఃఖించకుండగనే నా అన్నవెంట వెళ్ళినది .అత్యంత సుకుమారి,పతివ్రతా శిరోమణి ఆవిడ ! 

ఈ కష్టాలు ఏవి లెక్కపెట్టినట్లులేదు,

 భర్త ఉన్న చోటే తనకూ సుఖకరమైనది అనుకొంటున్నది.

.

అయ్యో ఎంత కష్టము వచ్చినది నేనెంత క్రూరుడను నావలన భార్యాసహితుడై రాముడు అనాధవలే ఇట్లాంటి పడకలపై నిదురించవలసి వచ్చినదికదా! అని మరల ఏడ్వసాగాడు భరతుడు.

.

వూటుకూరు జానకిరామారావు 

.

శివ శివ




















 

కర్మల్ని చేయాలి

 *జై శ్రీమన్నారాయణ - జై శ్రీహనుమాన్*


*న బుద్ధి భేదం జన యేత్*

*అజ్ఞానం కర్మ సంగినాం*

*జోష యే త్సర్వ కర్మాణి*

*విద్వాన్ యుక్త సమాచరన్*


ఆత్మజ్ఞానం కలవాడు అది లేని వారి బుద్ధిని మార్చకూడదు. కర్మయోగమే సాధనం అనే బుద్ధితో కర్మలను చేస్తూ ఉండాలి. కర్మల నుండి సామాన్య జనాన్ని మరల్చకపోవడమే గాక, తమ కర్మలచేత వారిని సంతోషపెట్టాలి. ఆత్మజ్ఞానం సంపూర్ణంగా లేని వాడు ఎంత ఆసక్తిగా కర్మల్ని చేస్తారో, ఆత్మజ్ఞానులు కూడ లోక సంరక్షణార్థం కర్మల్ని చేయాలి.


*ప్రకృతేః క్రియమాణాని*

*గుణైః కర్మాణి సర్వశః*

*అహంకార విమూఢాత్మా*

*కర్తాహ మితి మన్యతే*


అహంకారంవల్ల ఆత్మ స్వరూపం తెలియనివాడు ప్రకృతి చేత చేయబడుతున్న కర్మల్ని తానే చేస్తున్నానని అనుకుంటాడు. కాని తత్త్వం తెలిసినవాడు సత్త్వ, రజస్తమోగుణాలే ఆయా పనుల్ని చేయిస్తున్నాయి అని అనుకుంటాడు. తాను కర్తనని తలవడు. *అహం* కాని దానియందు *అహంకారం* అంటే. దానినే *దేహాత్మ భ్రాంతి* అంటారు. ఇది తొలగాలి. కర్మ పరిపక్వం కావాలి.


*శుభంభూయాత్*

 దేవుడి సొమ్ము అపహరిస్తే !

.

న విషం విష మిత్యాహు బ్రహ్మస్వ విషముచ్చతే

విషమేకాకినం హన్తి బ్రహ్మస్వం పుత్ర పౌత్రుకంll

-

విషం అంత భయంకరమైనది కాదు.

కానీ దేవుడిసొమ్మువిషము కంటే భయంకరమైనది.


విషము తీసుకున్న వాడిని మాత్రమె చంపుతుంది 

కానీదేవుడి సొమ్ము అపహరిస్తే వంశ నాశనం అవుతుంది.


దేవుడి సొమ్ము తినే రోజుల్లో తియ్యగానే ఉంటుంది .


తర్వాత రోజుల్లో అదే కాల కూట విషంగా మారి యావత్ వంశం సర్వ నాశనం అవుతుంది .


" ఆ !! ఇవ్వన్నీ కాకమ్మ కబుర్లు. ఆయనకేం కోట్లు కోట్లు సంపాదించి రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాడని " అనుకోవద్దు.


తగిలే దెబ్బ అలా ఇలా ఉండదు. సర్వ నాశనమే.

దైవాన్ని

 🌷🌷🌷🌹🌹🌹

*దైవాన్ని కోరిక ఎలా కోరాలి*


*1.నువ్వు బతికి* *ఉన్నంత కాలం* *ధార్మిక* *కార్యాలు నీ సంపదతో చేయాలి అని* *కోరుకోవాలి, అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది.*


2. *నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది.*


3. *నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు..*


4. *నా ఇంటికి ఎవ్వరు వచ్చినా కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి అంటే నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది.*


5. *నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం..*


6. *భాగవతులతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరుకోవడం...*


7. *కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే నువ్వు ఆరోగ్యంగా, ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే జరుగుతుంది ఇంక ఏమీ కావాలి జీవితానికి..*


*8 *చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం..*

*మనకు తల్లిదండ్రులు ఆ దైవమే వారిని కాకా ఎవరిని అడుగుతాము కానీ ఆ అడిగే కోరిక ఇలా ఉంటే ఆ దైవం కూడా అనుగ్రహిస్తుంది.*


         

 🙏🙏🙏🌺🌺🌺🌺🙏🙏🙏🙏

ఈయనను

 ఈయనను దర్శించినా మన జన్మ ధన్యమే 🙏🙏🙏


శ్రీ క్షేత్ర గణగాపురంలో శ్రీ గురుచరిత్ర పారాయణ చేసిన దత్త భక్తులు ...


చేతినే ప్రమిదగా చేసి, వొత్తి వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి, ఒకే చోటున స్థిరంగా కూర్చుని, ఒక రోజులోనే పూర్తిగా శ్రీ గురు చరిత్ర పారాయణ చేస్తున్న దత్త భక్తులు బ్రహ్మశ్రీ జీవన్ ఉపాధ్యాయ గారు ... 


9 గంటల పాటు ఆ జ్యోతి వెలుగుతూనే ఉన్నది, జీవన్ గారు కూడా కనీసం కాలకృత్యాలకు వెళ్లడం గానీ, నీళ్లు తాగడం కానీ చేయలేదు ... 


దత్ర అనుగ్రహం వల్లనే ఇది సాధ్యం కదా, దత్తానుగ్రహం పొందిన ధన్యజీవులు జీవన్ ఉపాధ్యాయ గారు..


ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః

నిర్వాణ షట్కం

 సేకరణ 👇


*జగద్గురు ‘ ఆది శంకరాచార్య’ విరచిత ” నిర్వాణ షట్కం ”*


(1 )  మనో బుద్ధ్య హంకార చిత్తాని నాహం న కర్ణం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే

నచ వ్యోమ భూమిర్న తేజో న వాయు: చిదానంద రూపశ్శివోహం శివోహం

నేను మనసునూ కాను, బుద్దినీ కాను, అహంకారమునూ కాను,చిత్తమునూ కాను, నేను

కర్ణములనూ కాను, నేను జిహ్వనూ కాను, నేను ఘ్రాణ ఇంద్రియము ఐననాసికనూ కాను,

నేను చక్షురింద్రియము ఐన నేత్రములనూ కాను. నేను ఆకాశమునూ కాను, నేను భూమినీ

కాను నేను తేజస్సునూ కాను, నేను వాయువునూ కాను, చిదానంద రూపుదనైన శివుడనే,

శివుడనే. నేను అంతఃకరణ చతుష్టయము ఐన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారములను

కాను. నేను జ్ఞానేద్రియములైన త్వక్, చక్షు, శ్రోత్ర, (జిహ్వ)రసన, ఘ్రాణ ఇంద్రియములు అంటే చర్మము, కనులు, చెవులు,నాలుక, నాసిక(ముక్కునూ) కాను.అంటే ‘నాకోసం’ అని ఎవరి కోసం అయితే చర్మము ద్వారా, కనుల ద్వారా, చెవుల ద్వారా, నాలుక ద్వారా, ముక్కు ద్వారా ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని అనుకుంటున్నానో ఆ అనుభవించేది నేను కాను. ఆ అనుభవము నాదీ కాదు. అంటే అనుభవించే వాడు వేరే, నేను కాదు. అంటే నాకోసం అని తుచ్చమైన ఆనందాలకు నేను లోను కానవసరం లేదు, కాకూడదు, అంటే నేనే కాదు ఎవరూ కూడా లోను కావలసిన అవసరం లేదు. ఎందుకంటే వీటి ద్వారా కలిగే ఆనందాలు క్షణికాలు కనుక! నేను పంచ మహా భూతములు ఐన పృదివ్యాపస్తేజో వాయురాకాశములను కాను.అంటే నేను భూమిని కాను, జలమును అంటే నీరునూ కాను, తేజస్సు అంటే అగ్నినీ కాను, నేను వాయువునూ కాను, ఆకాశమునూ కాను. పంచ భూతాత్మకమైన ఈ శరీరమును నేను కాను.ఎందుకంటే పంచ భూతాత్మికమైన ఈ శరీరం పంచ భూతములలో కలిసిపోతుంది కనుక. ఇక్కడి ఇంకొక రహస్యం ఏమిటంటే పంచ తన్మాత్రలైన శబ్ద, రూప, స్పర్శ, రస, గంధములనుండి వరుసగా పంచ మహా భూతములు ఐన ఆ కాశము ,అగ్ని ,వాయువు, జలము, భూమి ఉద్భవించాయి, వీనిని గ్రహించడానికి, అనుభవించడానికి వరుసగా

పంచ జ్ఞానేంద్రియములు ఐన చెవులు, కనులు, చర్మము, జిహ్వ, నాసిక ఉద్భవించాయి.

వీటి ద్వారా ఈ జ్ఞానములు అనుభవం లోకి వస్తాయి కనుక వీటిని జ్ఞానేంద్రియములు అన్నారు.


2)  నచ ప్రాణ సంజ్ఞో నవై పంచ వాయుర్నవా సప్త ధాతుర్నవా పంచ కోశః

న వాక్ పాణి పాదౌ నచోపస్థ పాయు చిదానంద రూపశ్శివోహం శివోహం

నేను ప్రాణ వాయువులైన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయు సంఘమును కాను,

సప్త ధాతువులైన రక్త, మాంస, మేథ, అస్థి, మజ్జ, శుక్ర, రసములను కాను, నేను అన్నమయ,

ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములనే పంచ కోశములను కాను, నేను

పంచ కర్మేంద్రియములైన వాక్కు, చేతులు, పాదములు, కామ ఇచ్చను తీర్చుకునే ఇంద్రియమును

కాను, విసర్జక అవయవ ఇంద్రియమునూ కాను..చిదానంద రూపుదనైన శివుడనే, నేను శివుడనే!

(3)


న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ మదో నైవ మే నైవ మాత్సర్య భావ

న ధర్మో నచార్దో న కామో న మోక్షః చిదానంద రూపశ్శివోహం శివోహం

నాకు ద్వేషము లేదు, రాగము లేదు, నాకు లోభము లేదు,మోహము లేదు, నాకు మదము

కానీ, మాత్సర్యము కానీ లేవు, నాకు ధర్మము, అర్ధము, కామము, మోక్షము లేవు, నేను

చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! అనగా నాకు ఏ ద్వంద్వములూ లేవు, నాకు

యే పురుషార్ధములూ లేవు..ఎందుకనగా..నేను భౌతిక శరీరాన్ని కలిగిన మానవుడిని కాను

కనుక నేను సాక్షాత్తూ శివుడను కనుక, మానవ సహజమైన మంచి చెడులకు అతీతుడను కనుక!

4)


న పుణ్యం న పాపం న సౌఖ్యం న దు:ఖం న మంత్రో న తీర్ధం న వేదా న యజ్ఞ

అహం భోజనం నైవ భోజ్యం న భోక్తా చిదానంద రూప శ్శివోహం శివోహం


నాకు పుణ్యము లేదు, పాపమూ లేదు, సౌఖ్యము లేదు, దు:ఖము లేదు,మంత్రము, తీర్ధము,వేదము, యజ్ఞము, ఏవీ లేవు. నేను అనుభవమును కాను, అనుభవించుట యను

క్రియనూ కాను, అనుభవించే వాడినీ కాను, నేను చిదానంద రూపుడనైన శివుడను,

నేను శివుడను!

(5)


న మృత్యుర్నశంకా నమే జాతి భేద: పితా నైవ మే నైవ మాతా చ జన్మ

న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానంద రూపశ్శివోహం శివోహం


నాకు మృత్యువు లేదు, శంకా లేదు, జాతి భేదములు లేవు, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, జన్మ

లేదు, నాకు బంధువులు లేరు, మిత్రులు లేరు, గురువు లేడు, శిష్యులు లేరు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! జనన మరణములు, జాతి భేదములు, తల్లి దండ్రులు,

గురు శిష్యులు..ఏ బంధములు లేవు..ఎందుకనగా..నేను శివుడను కనుక..అన్ని బంధములకు, అనుబంధములకు అతీతుడను కనుక!


6)


అహం నిర్వికల్పో నిరాకార రూపో విభుత్వాచ సర్వత్ర సర్వేంద్రియాణామ్

న చా సంగతం నైవ ముక్తిర్నబంధః చిదానంద రూపశ్శివోహం శివోహం


నేను నిర్వికల్పుడను అనగా నాకు వేరే సాటి ఐనది లేదు, నేను నిరాకారుడను, ఎందుకంటే ఈ

ఆకారం శాశ్వతం కాదు కనుక, అన్నింటికీ, అంతటా అన్ని ఇంద్రియములకూనేనే అధిపతిని,

నాకు ధించినవి సంబంధించనివి ఏవీ లేవు, నాకు ముక్తి లేదు, బంధమూ లేదు, నేను చిదానంద రూపుడనైన శివుడనే, నేను శివుడనే! ఇది నిర్వాణ శతకమునకు సాహిత్యానువాదము, కొద్ది వ్యాఖ్యానముతో. ఆది శంకరాచార్యులవారి సాహిత్యం స్తోత్ర (భక్తి) సాహిత్యము, వైరాగ్య ప్రకరణములు అని రెండుగా విభజించ వచ్చు క్లుప్తముగా. ఇది వైరాగ్య ప్రకరణముల కోవలోనిది. ఆధునిక పోటీ పరీక్షలలో జవాబులు తప్పుగా ఇచ్చినప్పుడు, సరిగా జవాబులిచ్చిన కారణంగా వచ్చే ‘మార్కుల’నుండి తప్పుగా ఇచ్చిన వాటికి శిక్షగా మార్కులు తగ్గించే పద్ధతి వుంటుంది కొన్ని పరిక్షలలో. అందుకని సమాధానం సరిగా తెలియనప్పుడు సరి కాని సమాధానములను వరుసగా ఇది కాదు, ఇది కాదు అని చివరికి సరి ఐన లేదా సరి ఐనట్లు అనిపించిన సమాధానమును చేరుకొనే పద్ధతి ఒకటి ఉంది. దీనినే తీసివేత పద్ధతి లేదా ఆంగ్లంలో ఎలిమినేషన్ ప్రాసెస్ అంటారు. భగవంతుని రూపమును, తత్త్వమును తెలిసికొనడం, అసాధ్యం కనుక, ఏది భగవంతుడో తెలియనప్పుడు, ఏది భగవంతుని తత్త్వమో తెలియనప్పుడు ఏది భగవంతుని తత్త్వము కాదో తెలిసికొనడం తేలిక కనుక ‘ఇది కాదు’ ‘ఇది కాదు’ అని తీసి వేస్తూ చివరికి మిగిలిన వర్ణనకు, వ్యాఖ్యానమునకూ అందని తత్త్వమేదో అదే పరమాత్మ తత్త్వము అని తెలిసికొనడాన్ని వేదాంతం ‘నేతి’..’నేతి’..అంటే .’న ఇతి’..’న ఇతి’..అంటే..’ఇది కాదు’..’ఇది కాదు’..అనే ‘నేతి’ మార్గం అని చెప్పింది! ఈ నిర్వాణ శతకం లో ‘చిదానంద రూపుడైన శివుడు’ అనే పరమాత్మ తత్త్వాన్ని అదే మార్గంలో ఆది శంకరుడు తెలియ జేశారు! నిర్వాణ షట్కం భారతీయ వేదాంత మార్గంలో ఉన్నతమైన రచన. నిజానికి ఎంతో దీర్ఘమైన వ్యాఖ్యానము, వివరణ అవసరము కాని, ఇక్కడ క్లుప్తముగా మాత్రమే చర్చ ప్రస్తుతానికి!ఒకరి అభ్యర్ధన మేరకు, వారి సందేహములను ప్రస్తుతానికి తీర్చడానికి నాకున్న కొద్ది పరిధిలో, అల్ప జ్ఞానముతో చేస్తున్న ప్రయత్నము ఇది.

మనో బుద్ధ్యాహంకార చిత్తాని నాహం.. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే నాలుగు విధములైన అంతః కరణ ప్రవృత్తులు వున్నాయి. మనసు అన్నింటికీ అధిపతి. లేని దాన్ని ఉన్నట్లుగా, తనది కాని దాన్ని తనదే అన్నట్లుగా, క్షణికమైన దానిని శాశ్వతమన్నట్లుగా మరులు గొల్పుతుంది, వుసి గొల్పుతుంది, పురి కొల్పుతుంది, భ్రమింప జేస్తుంది, మరిపిస్తుంది, మురిపిస్తుంది, ఆకాశానికి ఎత్తేస్తుంది, అందలాలెక్కిస్తుంది, అధః పాతాళానికి తొక్కేస్తుంది. కనుకనే మనసే అన్నింటికీ కారణం, ప్రేరణం, ఉత్ప్రేరకం, వినాశకరం. అందుకే ‘ మన ఏవ మనుష్యాణామ్ కారణం బంధ మోక్షయో:’ మనుషుల బంధాలకు, మోక్షానికి కారణం మనసే అన్నది ఒక

ఉపనిషత్తు! ‘ద్వే శబ్దే బంధ మోక్షాయ మమేతి న మమేతిచ, మమేతి బధ్యతే జంతు: న మమేతి విముచ్యతే.. ‘నాది’, ‘నాది కాదు’ అనే రెండు శబ్దాలే బంధానికీ, మోక్షానికీ కారణాలు, నాది అనుకుంటే బంధం, ఎందుకంటే నాది అనే దానితో మొదలై, నాది మాత్రమే, నాకు మాత్రమే, నాకు కాకున్నా పరవా లేదు ఎవరికీ కాకూడదు..నాది కాకున్నా పరవా లేదు, ఎవరిదీ కాకూడదు, ఎవరికీ చెందకూడదు..అనే దాకా దారి తీస్తుంది. ఆది వినాశనానికి దారి తీస్తుంది. ఈనాడు సమాజంలో జరుగుతున్న హింసకు, దౌర్జన్యానికీ అదే కారణం!


బుద్ధి విచక్షణను కలిగిస్తుంది. మంచి, చెడులను గ్రహింప గలుగుతుంది. చిత్తము తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించేలా చేస్తుంది. అహంకారం మహదహంకారం(గొప్ప అంధకారం) మిధ్యాహంకారం (మిధ్యాన్ధకారం) అని రెండు రకాలుగా ఉన్నది. అహంకారం అంటేనే అంధ కారం. సృష్టికి మొదలు మహా అంధకారం వ్యాపించి వున్నది..ఏదీ తెలియని బ్రహ్మ దేవుడు తనకన్నా పరమాత్ముడు ఐన వాడిని ప్రార్ధిస్తే ఆ శ్రీ మహా విష్ణువు తన తేజః పుంజములతో దానిని తొలగించి కరుణిస్తే, అప్పుడు బ్రహ్మ తన సృష్టిని కొనసాగించాడు అని పురాణ గాధ.

నేను అనేది సాత్త్వికాహంకారం, నేను కూడా అనేది రాజసిక అహంకారం, నేను మాత్రమే అనేది తామసిక అహంకారం! నేను ఏమిటి, ఎవరు, ఎందుకు, ఎక్కడి నుండి, ఎక్కడికి అనే అన్వేషణ సాత్త్వికమైనది, మనిషిని వున్నతుడిని చేస్తుంది. నేను కూడా అనేది రాజసికమైనది, నాకూ ఒక ఉనికి, ఒక సత్తా ఉంది అనే సాధనకు ఉపకరిస్తుంది..ఈ రెండూ మంచివే..అవసరమైనవే. నేను మాత్రమే, నాకు మాత్రమే, నాది మాత్రమే అనేది తమసికమైనది, ఆది కలిగివున్నవాడిని, వాడి ద్వారా సర్వాన్నీ నాశనం చేస్తుంది. ఈ నాశనానికి చిత్తం బాటు వేస్తుంది, చిత్తం వచ్చినట్లు ప్రవర్తించడం ద్వారా, దానికి మనసు కారణమౌతుంది సరిగా వుపయోగించకుంటే, మనసే అన్నింటికీ కారణం కనుక దానిని బుద్ధికి స్వాధీనం చేసి, అప్పుడు బుద్ధి ద్వారా కలిగిన విచక్షణతో మంచి చెడులను తెలిసికొని, మంచిని గ్రహించి, చెడును విసర్జించాలి కనుక బుద్ధి పరమాత్మ తత్త్వం. ఉపనిషత్తులు అన్నీ ఇదే చెప్పాయి.

ఆత్మానగుం రధినం విద్ధి శరీరం రధమేవతు బుద్ధించ సారధిం విద్ధి, మనః ప్రగ్రహమేవచ,

ఇన్ద్రియాణి హయాన్యాహు: తేషాం విషయ గోచరాన్, అత్మెంద్రియ మనో యుక్తం భోక్తేత్యాహు

ర్మనీషిణః .. అన్నది ఒక ఉపనిషత్తు. అంటే శరీరమే రధము. ఆత్మ అంటే పరమాత్మ స్వరూపి

ఐన జీవాత్మ రధికుడు. అంటే రధాన్ని ఎక్కే వాడు. బుద్ధి సారధి. అంటే పరమాత్మ రూపకమైన

బుద్ధి ఈ రధాన్ని నడిపితే, గుర్రములవంటి ఇంద్రియములను మనసు అనే కళ్ళెం తో అదుపు

చేస్తూ, పరమాత్ముడి సారధ్యంలో, సర్వం ఆయనకే అప్పగించి, నమ్మి,కూర్చుంటే రధాన్ని

క్షేమంగా గమ్యానికి నడుపుతాడు, కనుక మనసు అనే కళ్ళెమును కూడా సారధి ఐన

పరమాత్ముడికి అప్పగించాలి


అంటే మనసును పరమాత్ముని యందు లగ్నం చేయాలి. ఆత్మ,

ఇంద్రియాలు, మనసు కలిగిన వాడిని భోక్త అంటారు, డానికి బుద్ధిని కూడా జోడిస్తే ఆ భోక్తృత్వ

భావన నశిస్తుంది. అప్పుడు నేను చేస్తున్నాను, చూస్తున్నాను, అనుభవిస్తున్నాను అనే భావన

నశిస్తుంది. అప్పుడు సుఖ దు:ఖాలూ, రాగ ద్వేషాలు, బంధ మోక్షాలూ, మంచీ చెడూ, ఇలాంటి

ద్వంద్వాలు నశిస్తాయి. శివమే అంటే శాంతమే, సౌఖ్యమే, ఆనందమే మిగులుతుంది..కనుక

శివోహం..శివోహం!


బుద్ధికి అప్పజెప్పి ప్రయాణం చేస్తే కర్మేంద్రియాలూ, జ్ఞానేంద్రి యాలూ దారి తప్పవు, మంచి కర్మలే

మిగులుతాయి, మంచి జ్ఞానమే మిగులుతుంది అప్పుడు శివుడౌ తాడు మానవుడు, కనుక ఇంతా

కలిగిన శివుడనే నేను!


సప్త ధాతువులు, పంచ ప్రాణాలు, పంచ కోశాలు, బంధాలు, భవ బంధాలు, అనుబంధాలు,సంబంధాలు

అన్నీ నేను దేహం అనుకుంటే అవి గెలుస్తాయి, నేను దేహమును కాను ఎందుకంటే దేహం శాశ్వతం కాదు

కనుక, అని తెలిసికొంటే దేహం నశిస్తుంది, ఆత్మ రహిస్తుంది ఆత్మ మిగులుతుంది, ఆ ఆత్మ పరమాత్మ తత్త్వం కనుక, జీవం ఉన్నంత కాలం జివునితో వుండి తరువాత దేవునితో కలిసిపోతుంది కనుక, దానికి మరణం

లేదు, కనుక ఆది శాశ్వతం.ఈ జ్ఞానం కలిగితే దేహం ద్వారా వచ్చే ఏ మంచి చెడు..సుఖ దు;ఖాలు..మొదలైన ద్వంద్వాలున్డవు కనుక అప్పుడు మిగిలేది పరమానందమే కనుక నేను శివుడను, నేను శివుడనే! మనసును బుద్ధి ద్వారా నియమించుకుని కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను జయించి, కర్మేన్ద్రియములను, జ్ఞానేన్ద్రియములను, ప్రాణ వాయువులను, సప్త ధాతువులను,పంచ మహా భూతాలను, పంచ కోశాలను జయించి అంటే ఇవన్నీ జయించడం ద్వారా మిగిలిన పరమానందమును అనుభవించడం ద్వారా చిదానంద రూపుడైన శివుడను నేను, శివుడనే నేను!

యద్వాచా నాభ్యు దితం యేన వాగభ్యుధ్యతే ….

యన్మనసా న మనుతే ఏనాహుర్మనోమతం ….

యత్ చక్షుసా న పశ్యతి యేన చక్షూగుమ్సి పశ్యతి….

యత్ శ్రోత్రే ణ న శ్రుణోతి యేన శ్రోత్రమిదం శ్రుతం…

యత్ ప్రాణేన న ప్రాణితి యేన ప్రాణాః ప్రణీయతే…

తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదిద ముపాసతే ….


ఏది వాక్కుల ద్వారా తెలిసికొన బడ జాలదో, దేని ద్వారా వాక్కు పలుకడం జరుగుతుందో, ఏది

మనసు ద్వారా తెలిసికొన బడ జాలదో, దేని ద్వారా మనసు దేనినైనా తెలిసికొన గలుగుతుందో,

ఏది కనుల ద్వారా చూడ బడ జాలదో, దేని ద్వారా కనులు చూడ గలుగుతాయో, ఏది చెవుల

ద్వారా వినబడ జాలదో దేని ద్వారా చెవులు విన గలుగుతాయో, ఏది ప్రాణములచేత జీవింపదో,

దేని ద్వారా ప్రాణములు జీవింప గలుగుతాయో అదియే బ్రహ్మము..వేరేది ఏదీ కాదు..అని

చెప్పింది ఉపనిషత్తు. రెండు పెదవులు, ముప్పై రెండు పళ్ళూ, నాలుక, కొండ నాలుక వున్న

వాళ్ళు కూడా పలుక లేని వారు వున్నారు, మూగ వాళ్ళు, అంటే వీటన్నింటికీ పలుకును ఇచ్చే

శక్తి ఒకటి వున్నది కదా, ఆది లేక పోతే ఇవన్నీ వున్న వాళ్ళు కూడా పలుకలేరు కదా, కళ్ళు,

కను బొమలు, కను గుడ్లు అన్నీ సరిగా వున్నా చూపు లేని వాళ్ళు గుడ్డి వాళ్ళు వున్నారు,అంటే వీటన్నింటికీ చూపును ఇచ్చే శక్తి ఒకటి వేరేది వున్నది, అలాగే చెవులున్నా, కర్ణభేరి వున్నా

మిగిలినవి అన్నీ సరిగా వున్నా వినలేని చెవిటి వాళ్ళు వున్నారు, అంటే వీటన్నిటికీ విన గలిగిన

శక్తిని ఇచ్చే శక్తి ఒకటి వున్నది కదా, ప్రాణములు వున్నప్పుడూ తెలియబడనిది, అదేదో తెలియనిది ఐన ఏది లేకుంటే ప్రాణములు లేకుండా పోతాయో దాని వల్లనే ప్రాణములున్నట్లు, జీవం వున్నట్లు కనిపిస్తుందో…అదియే బ్రహ్మము..అంటే కేవలం పైకి కనిపించే నోరు, కళ్ళు, చెవులు,ఇవన్నీ సరిగా వున్నా అవి పని చేయకుండ పోతాయి, అంటే వీటికి శక్తినిచ్చే శక్తి ఒకటి ఉంది కదా..అదే బ్రహ్మం. పంచకర్మేంద్రియాలూ. పంచ జ్ఞానేంద్రియాలు అలాగే వున్నా ప్రాణం లేని శరీరం ఎందుకూ పనికి రాదు, ఏదీ చేయ లేదు. నోరున్నా పలుక లేదు,చేతులున్నా పను చేయ లేవు, కాళ్ళు వున్నా నడువ లేవు, కామేంద్రియం వున్నా పని చేయదు, కామం వుండదు, విసర్జక అవయవం వున్నా విసర్జించే శక్తి వుండదు , చర్మం వున్నా స్పర్శను గ్రహింప లేదు, కనులు వున్నా చూడలేవు,చెవులు వున్నా వినలేవు, నాలుక వున్నా రుచి చూడ లేదు, ముక్కు వున్నా వాసన చూడలేదు, సప్త ధాతువులూ వున్నా వాటి పని అవి చేయ లేవు, పంచ కోశాలు వున్నా పనికి రావు..ఇవన్నీ వున్నా ఏది లేకుంటే ఇవన్నీ లేనట్లే లెక్కనో అదే ప్రాణ శక్తి, అదే బ్రహ్మం, అదే జీవం, అదే నాదం, అదే వేదం! కనుక ఆ శక్తిని మాత్రమే శాశ్వతము ఐన శక్తిగా తెలిసికొంటే మిగిలినవన్నీ అశాశ్వతాలు అని తెలిసికొనడం జరుగుతుంది. అప్పుడు మిగిలిన వాటి ద్వారా వచ్చే సుఖ దు:ఖాలు, జయాపజయాలు, క్షణికమైనవి అని తెలుస్తుంది, ఆనందమే మిగులుతుంది, కనుక శివుడనై పోతాను కనుక నేను శివుడను, నేను శివుడనే!


అశబ్ద మస్పర్శ మరూప మవ్యయం

తథా అరసం నిత్య మగంధ వచ్చయత్

అనాద్యనంతం మహతః పరం ధృవం

నిచాయ్య తన్మ్రుత్యు ముఖాత్ప్ర ముచ్యతే..అన్నది ఉపనిషత్తు ఇదే భావాన్ని తెలియ జేస్తూ..ఈ జ్ఞానం కలిగినప్పుడు మృత్యువు లేకుండా పోతుంది, పుట్టుకే శాశ్వతం కాదు అని తెలిస్తే మృత్యువూ శాశ్వతం కాదు

అని తెలుస్తుంది కనుక మృత్యువు వుండదు, ఇదంతా అశాశ్వతం అని తెలుస్తుంది కనుక ఇవన్నీ పోయేవే అని తెలుస్తుంది కనుక భయం వుండదు, ఆ భయమే మృత్యువు, ఆ బలహీనతే మృత్యువు, తెలిసికొన్న ఆ శాశ్వత సత్యం, ఆ శక్తి అదే జీవం, ఎందుకంటే దానికి చావు అంతం అనేది లేదు కనుక, ఇదే భావాన్ని స్వామి వివేకానంద చెప్పింది! ఇక్కడ చావు వుండదు అంటే పుట్టుకా శాశ్వతం కాదు, చావూ శాశ్వతం కాదు, అవి సహజ ధర్మాలు,అనివార్యాలు అని తెలియడం వలన కలిగే జ్ఞానం వలన కలిగే ఆనందం వలన మృత్యు భీతి వుండదు కనుక మృత్యు భావం వుండదు కనుక మృత్యువు వుండదు అని అర్థం, అంతే కానీ ఈ జ్ఞానం కలిగిన వాడు శారీరకంగా చిరంజీవి అని కాదు, శరీరానికే మృత్యువు, ఆత్మకు కాదు అని తెలిసికొనడం వలన కలిగే చావు లేని ఆత్మ జ్ఞానం అని అర్థం!..ఎందుకంటే ఆ ఆత్మకు చావు లేదు.

దుర్గా

 *దుర్గా ద్వాత్రింశ న్నామమాలా*

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


*దుర్గా దుర్గార్తి శమనీ దుర్గాపద్వినివారిణీ !*

*దుర్గమచ్ఛేదినీ దుర్గసాధినీ దుర్గనాశినీ !!*


*దుర్గతోద్ధారిణీ దుర్గనిహన్త్రీ దుర్గ మావహా !*

*దుర్గమజ్ఞానదా దుర్గ దైత్యలోకదవానలా!!*


*దుర్గమా దుర్గమాలోకా దుర్గమాత్మ స్వరూపిణీ !*

*దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రితా !!*


*దుర్గమ జ్ఞాన సంస్థానా దుర్గమధ్యానభాసినీ !*

*దుర్గమోహా దుర్గమగా దుర్గమార్థస్వరూపిణీ !!*


*దుర్గమాసుర సంహన్త్రీ దుర్గమాయుధ ధారిణీ !!*

*దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ !!*


*దుర్గభీమా దుర్గభామా దుర్గభా దుర్గధారిణీ !*

*నామావళి మిమాంయస్తు దుర్గాయా మమ మానవః !*

*పఠేత్‌ సర్వభయాన్ముక్తో భవిష్యతి న సంశయః !!*


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 32 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


 ‘కనకాంగదకేయూరకమనీయభుజాన్వితా’ 


అమ్మవారి నామములలో ముఖమండలము వరకు ఉన్నవి చాలా గొప్ప నామములు. ఇక్కడనుండి కిందకి వెళుతూ ఉంటే ప్రతి నామము జీవితానికి సమన్వయము అవుతూ ఉంటుంది. అమ్మా! నువ్వు బంగారముతో చేసిన  అంగదములను, కేయూరములను భుజములకు ధరించి ఉన్నావు. వాటిని ధరించడము వలన భుజములు శోభిల్లుతున్నాయని అర్థము పైకి అనిపిస్తుంది. అమ్మవారు చతుర్బాహు సమన్విత కనక నాలుగు అంగదములు, నాలుగు కేయూరములు కావలసి ఉంటాయి. ఆవిడ అలా ధరించి ఉండటము వలన రెండు ప్రయోజనములు ఉన్నాయి. 

ఒకటి - ఇక్కడ స్తోత్రము అమ్మవారి పాదాది కేశ పర్యంతము చేస్తున్నారు. అమ్మవారి కంఠము దగ్గరకు వచ్చేసరికి ఒక ప్రశస్తమైన కూటం పూర్తవుతున్నది. ఇక్కడనుంచి మొదలయ్యే నామములు పాదముల వరకు వర్ణన చేస్తూ వెళుతుంటాయి. దానిని లావణ్యలహరి అంటారు. ఇందులో ఏ ఒక్క నామమును విడచి పెట్టకుండా ప్రతిరోజు చదివితే తెలియకుండానే జీవితములో గొప్ప ప్రయోజనము చేకూరుతుంది. తరవాత చాలా గొప్పదైన వైభవలహరి మొదలవుతుంది. 


రెండు – కేవలము భుజములను చూడడము వలన వచ్చే ప్రయోజనము గొప్పది కాదని అనలేక పోయినా దాని అర్థమును సమన్వయము చేసి లోపల నిలపెట్టుకునే ప్రయత్నము చెయ్యడము వలన అమ్మవారి భుజములను మరొక్కమారు సందర్శించ కలుగుతారు. పాదములు అనుకున్న గమ్యమును చేరుస్తాయి. చేతులు అనుకున్న పనిని చేయిస్తాయి. భుజములు అన్నమాటను ఇక్కడ చేతులుగా సమన్వయము చేసుకోవాలి. మనిషి ఆహారము తినేముందు తిన్న తరవాత కూడా చేతులు కడుక్కుంటాడు. ఈశ్వరుడు ఇచ్చిన చేతిని ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలి. చేతి కదలికలలో పాప పుణ్యములు ఉన్నాయి. చేసే కర్మకు సూచన చెయ్యి. చేసిన కర్మలు మరిచిపోయినా ఈశ్వరుడు మరచిపోడు.వాటిని మూడు కింద విభజించి ఉంచుతాడు. సంచితము, ఆగామి, ప్రారబ్ధము. ఇవి పట్టుకుంటే అమ్మవారి చేతిని ఎందుకు స్తోత్రము చెయ్యాలో తెలుస్తుంది. ఏ శరీరములో ఉన్నా పాపమో పుణ్యమో ఏదో చేస్తూనే ఉంటారు మన ఖాతాలో ఉంటాయి అది తెలియదు. చేసిన పుణ్య పాపములను అనుభవించమని శరీరము ఇస్తాడు. ఆ అనుభవించేదే ప్రారబ్ధము. శరీరములో ఉండగా భగవంతుని భక్తితో సేవిస్తే వారికి అమ్మవారి అనుగ్రహముతో అప్పటివరకు కొన్ని కోట్ల జన్మలలో సంపాదించిన పాప పుణ్యములు కాలిపోతాయి. మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరము ఉండదు. సంచితము దగ్ధము అవడము వలన ఆ స్థితి వస్తుంది. సంచితము వలన ఆగామి పోతుంది. చేతి కదలికలు పాప పుణ్యములకు, ద్వందములకు హేతువులు. మనసు ఎలా ప్రకోపము చెందితే అలా ఆడుతూ ఉంటుంది. ఆడిన కొద్దీ పాప పుణ్యములు పడుతూ ఉంటాయి. అలా పడకుండా ఎప్పుడూ నిభాయించి ఉండేట్టుగా మనసుని మార్చకలిగినది అమ్మవారి చెయ్యి. ఈ చేతులు మళ్ళీ జన్మ ఎత్తవలసిన అవసరము లేని రీతిలో పని చెయ్యాలి అంటే అమ్మవారి అనుగ్రహము ఉండాలని సమన్వయము చేసుకుంటే అమ్మవారి చేతులకి పెట్టిన భూషణముల గురించి తెలిసినట్టు అర్థము. 


అమ్మవారి భుజములకు రక్షణ ఒక్కటే తెలుసు. అది అర్థమయితే ఆనాడు భూషణము పెట్టుకున్న వారు అవుతారు. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

 గురువు తప్ప మరొక గతి లేదు అనేది అర్థమై, ఆచరించ గలిగితే అసాధ్యం లేదు. గురువు నీ చేతిని పట్టుకోవాలని అంటే ఆ అర్హతను నువ్వు సాధించుకోవాలి

గురువు ఎప్పుడూ పరమ ప్రేమ స్వరూపమే.

అందులో సందేహం లేదు. ఎల్లప్పుడూ శిష్యుని అభ్యున్నతిని కోరుతాడు గురువు. అందులోనూ సందేహం లేదు.

అయితే గురువు ప్రసరించే ప్రేమ శక్తిని అందుకునే స్థాయి శిష్యునికి వుండాలి. అదెలా వస్తుంది?

గురువు మాత్రమే తనను ఉద్ధరించ గలడు అనే పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి వుండటమే ఆ స్థాయిని అందిస్తుంది. కానీ మనం ఏమి చేస్తున్నాం?

ఏదో ఒక సమస్య పరిష్కారానికి గురువును ఆశ్రయంచి ఉంటున్నాం. ఆ సమస్య తీరితే ఆ గురువు గొప్పవాడు. తీరకపోతే మరో గురువు. ఇలా కొట్టుకు పోతున్నాం.

గురువు నీ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తారు. ఆ శక్తి గురువులో వుందని నువ్వు మనసా, వాచా, కర్మణా నమ్మాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది.

సేవాభావం వల్లనూ మరియూ సర్వస్వ శరణాగతి వల్లనూ గురువు ప్రసన్నుడు అవుతాడు.*

కనుక నువ్వు ఎప్పుడు గురువే సర్వస్వం అని నమ్ము అప్పుడే నీ గురువు నీ చేతిని పట్టుకుని నడిపిస్తాడు.

నమ్మకం అచంచలంగా వుందా నీలో? ఆ ప్రశ్నకి ఎవరికి వారే సమాధానం చెప్పుకోవాలి.

గురువు మార్గాన్ని చూపిస్తాడు…ఆ మార్గంలో నడవటం నీ పని. గురువు జ్ఞానాన్ని అందిస్తాడు…ఆ జ్ఞానాన్ని జీవితంలో భాగం చేసుకోవటం నీ పని. గురువు ప్రేమని ప్రసరిస్తాడు…ఆ ప్రేమని నీలో నింపుకోవడం నీ పని. 

గురువు దగ్గరకి వెళ్ళేటప్పుడు నీ బుద్ధిని, నీ తెలివితేటలను పక్కనపెట్టి వెళ్ళాలి. గురువుతో వాదన పనికిరాదు.


గురువు చెప్పే మాటలను చెవులతో కాదు…మనసుతో వినాలి. గురువును నమ్మినప్పుడు కళ్ళు మూసుకొని, ఇతర చింతనలు లేకుండా నమ్మాలి.

గురువుకు నిన్ను నువ్వు సమర్పించుకోవడం అంటే నీ హృదయాన్ని పూర్తిగా తెరచి సమర్పించాలి. గురువు ఉపదేశాన్ని వినేటప్పుడు నోరు మూసుకొని వినాలి. గురువును ఏదైనా కోరేటప్పుడు కొంగు చాచి అడగాలి.


ఇవన్నీ చేయగలిగితే గురువు నీవాడు అవుతాడు.

గురుకృప ఏ వ్యక్తినైనా కూడా గురు స్థానంలో నిలుపుతుంది. అయితే ఆ వ్యక్తి తనకు గురుత్వ స్థాయిని కోరుకొని చేశాడా? కానే కాదు. తన ఆత్మోన్నతి కోసమే చేస్తాడు. అది సఫలం అయినప్పుడు గురువే ఆ వ్యక్తిని తన పరికరంగా ఆయుధంగా లోకానికి సమర్పించి , ఆ వ్యక్తిని గురువుగా నిలుపుతాడు. తన పరికరంగా , తన బాధ్యతలను ఆ వ్యక్తి ద్వారా నెరవేరుస్తారు. (శ్రీ దత్తుడు – విష్ణుదత్తుని వలె )


నువ్వు లౌకికంగా అత్యున్నత విద్యావంతుడివి కావచ్చు. కానీ గురువు ముందు అనుక్షణమూ నీకు అక్షరాభ్యాసమే

నువ్వు సమాజంలో గురువు కన్నా ఉన్నత స్థాయిలో వుండవచ్చు. కానీ గురువు ముందు నువ్వు కేవలం ఒక సేవకుడివే.

నువ్వు గురువు కన్నా అత్యధిక ధనవంతుడివి కావచ్చు. కానీ గురువు ముందు నిరుపేదవే. నువ్వు గురువు కన్నా అధిక లౌకిక జ్ఞానం కలవాడివి కావచ్చు. కానీ గురువు ముందు పరమ అజ్ఞానివే.

నీ లౌకిక విద్య గురువు ముందు నిరక్షరాస్యత గా మిగులుతుంది. సమాజంలో నీ స్థాయి గురువు ముందు నిష్ప్రయోజనం గా మిగులుతుంది.

నీ ధన సంపద అంతా గురు చరణ ధూళిని కూడా తాకలేదు. నీ లౌకిక జ్ఞానం సమస్తం గురువు అలౌకిక జ్ఞానం ముందు గుడ్డి గవ్వకు కూడా పనికిరాదు

ఈ విషయాన్ని మనస్సులో స్థిరంగా నిలుపుకో గలిగితే గురువు నీ వాడు అవుతాడు.

కృతజ్ఞత యొక్క శక్తి*🌴

 *కృతజ్ఞత యొక్క శక్తి*🌴



        కృతజ్ఞత తో కూడిన వైఖరిని అలవర్చుకోవాలి. ఎందుకంటే, ఒక చిన్న కథ ను చదవండి.


*ఇది కథ లాంటి కథ, కథ కాని కథ, ఇది మనందరి కథ*


ఎడారిలో నివసించే ఒక పక్షి ఉంది.....అది చాలా అనారోగ్యం తో, ఈకలు అన్ని రాలిపోయి... తినడానికి మరియు త్రాగడానికి ఏమీ లేకుండా, నివసించడానికి ఆశ్రయం లేకుండా.... ఇలా చెప్పడానికి అలవి లేని బాధల తో, అనారోగ్యం తో, అష్ట దరిద్రాలలో చిక్కుకొని ఉంది.


ఒక రోజు ఒక పావురం అటువైపుగా ప్రయాణిస్తున్నప్పుడు, అనారోగ్యంతో ఉండి.... జీవితం పై అసంతృప్తి చెందిన ఆ పక్షి పావురాన్ని ఆపి, "మీరు ఎక్కడకి  వెళ్తున్నారు? అని అడిగింది" 


అప్పుడు ఆ పావురం,  "నేను స్వర్గానికి వెళుతున్నాను" అని బదులిచ్చింది.

 వెంటనే జబ్బుపడిన పక్షి,  " స్వర్గం లో ఉన్న అనంత శక్తి అయిన ఆ భగవంతుడిని దయచేసి నా బాధలు ఎప్పుడు తీరుతాయో, ఈ కష్టాల నుంచి నేను ఎప్పుడూ బయట పడతానో అడిగి  తెలుసుకోండి?"  

అని వేడుకుంది...


పావురం "ఖచ్చితంగా, నేను ఆ పని చేస్తాను" అని చెప్పి జబ్బుపడిన పక్షికి వీడ్కోలు పలికి స్వర్గానికి బయలుదేరింది.

పావురం స్వర్గానికి చేరుకుంది మరియు జబ్బుపడిన పక్షి సందేశాన్ని ప్రవేశ ద్వారం వద్ద దేవదూత ఇన్‌ఛార్జితో(Angel) పంచుకుంది.


 దేవదూత ఇలా అన్నాడు,

 "తన జీవితంలో తరువాతి ఏడు సంవత్సరాలు పక్షి ఇలా బాధపడాలి, ఆ పక్షి కి అప్పటి వరకు ఆనందం లేదు."

 పావురం, ఆశ్చర్యపోతూ, బాధతో ఇలా అంది "అనారోగ్య పక్షి ఇది విన్నప్పుడు, అది నిరాశకు, నిట్టూర్పు కు గురవుతుంది,

దీనికి మీరు ఏదైనా పరిష్కారం సూచించగలరా?" అని వేడుకుంది...


దేవదూత, "ఈ రహస్యం పాటించమని ఆ పక్షి కి చెప్పండి" అని కింద ఉన్న మాటలను ఉపదేశించాడు.


*Thank you God for everything*

 

*"నాకున్న ప్రతిదానికీ దేవునికి కృతజ్ఞతలు. "*


పావురం ఆనందం తో వెంటనే అక్కడ నుంచి బయలుదేరి అనారోగ్య పక్షిని మళ్ళీ కలుసుకుని,  దానికి దేవదూత చెప్పిన మాటలన్నీ చెప్పి ఆ సందేశాన్ని తెలియచేసింది.....


ఏడు రోజుల తరువాత పావురం మళ్ళీ అటువైపుగా ప్రయాణిస్తున్నప్పుడు,

పక్షి ని చూసి చాలా ఆశ్చ్యపోయింది. ఆ పక్షి చాలా సంతోషంగా ఉంది, దాని శరీరంపై ఈకలు పెరిగాయి, ఎడారి ప్రాంతంలో ఒక చిన్న మొక్క కూడా పెరిగింది, నీటి తో కూడిన ఒక చిన్న చెరువు కూడా ఉంది, పక్షి ఆనీళ్ళల్లో ఆడుతూ, పాడుతూ ఉల్లాసంగా నృత్యం చేస్తోంది.  పావురం ఆశ్చర్యపోయింది. 


రాబోయే ఏడు సంవత్సరాలు పక్షికి ఆనందం ఉండదని ఏంజెల్ చెప్పాడు.... మరి ఏంటి ఈ పక్షి కి ఏడు రోజులలోనే అన్ని కష్టాలు తీరిపోయాయి అని ఆశ్చర్యపోయి, ఈ ప్రశ్నను దృష్టిలో పెట్టుకుని, పావురం  స్వర్గ ద్వారం వద్ద ఉన్న దేవదూతను దర్శించడానికి వెళ్ళింది......


పావురం తన ప్రశ్నను ఏంజెల్కు చెప్పింది.  ఏంజెల్ బదులిచ్చారు.  "అవును, పక్షికి ఏడు సంవత్సరాలు ఆనందం లేదు, కానీ పక్షి  ప్రతిదానికీ  " ధన్యవాదాలు " అనే మంత్రం  పఠిస్తున్నందున, ప్రతి పరిస్థితిలోనూ, అతని జీవితం మారిపోయింది, 7 సంవత్సరాలలో అందవలసిన......  కృతజ్ఞతకు శక్తి  7 రోజులకే అందేలా  కుదించినది.


పక్షి వేడి ఇసుక మీద పడిపోయినప్పుడు అది ఇలా చెప్పింది  "ప్రతిదానికీ ధన్యవాదాలు"....

 అది ఎగరలేకపోయినప్పుడు,  "ప్రతిదానికీ దేవునికి ధన్యవాదాలు"

 దాహం వేసినప్పుడు మరియు చుట్టూ నీరు లేనప్పుడు, అది ఇలా చెప్పింది,

 "ప్రతిదానికీ దేవునికి ధన్యవాదాలు"


పరిస్థితి ఏమైనప్పటికీ, పక్షి అనంత విశ్వ శక్తి పైన సంపూర్ణ, పరిపూర్ణ విశ్వాసం ను ఉంచి ఆ పవిత్ర మంత్రాన్ని పునరావృతం చేస్తూనే ఉంది,

 "ప్రతిదానికీ దేవునికి ధన్యవాదాలు"


అందువల్ల ఏడు సంవత్సరాలలో కరగవలసిన అతని కర్మలు 7 రోజులలోనే కరిగిపోయాయి.

ఈ కథ విన్నప్పుడు, నా అనుభూతి, ఆలోచించడం, అంగీకరించడం మరియు జీవితాన్ని చూసే విధానంలో విపరీతమైన మార్పును అనుభవించాను.


 నేను ఈ మంత్రం ను తెలుకున్న తర్వాత నా జీవితంలోకి దీన్ని స్వీకరించాను.  

నేను ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి కి, నాకు ఆ అనంత శక్తి ప్రసాదించిన ప్రతీ దానికీ  నేను ఈ మంత్రం పఠించడం ప్రారంభించాను.


 *THANK YOU GOD FOR EVERYTHING*


*"ప్రతిదానికీ దేవునికి ధన్యవాదాలు"*


నా అభిప్రాయాన్ని నా జీవితంలో లేనిదానినీ  మార్చడానికి లేదా కొత్తగా సృష్టించు కొనేందుకు ఇది నాకు ఎంతో సహాయపడింది.

ఉదాహరణకి :  నాకు తల నొప్పి ఉంటే నా మిగతా శరీరమంతా పూర్తిగా చక్కగా మరియు ఆరోగ్యంగా ఉందని దేవునికి ధన్యవాదాలు చెప్పాను.......... నా  తలనొప్పి నన్ను అస్సలు బాధించకుండా మాయమవటం నేను గమనించాను.


అదే పద్ధతిలో నేను ఈ మంత్రం తో నా సంబంధాలలో (కుటుంబం, స్నేహితులు, పొరుగువారు, సహోద్యోగులు కావచ్చు) ఆర్థిక, సామాజిక జీవితం, వ్యాపారం మరియు నేను సంబంధం ఉన్న ప్రతిదానిలో ఉపయోగించడం ప్రారంభించాను. 


నేను ఈ కథను నేను పరిచయం ఎరిగిన ప్రతి ఒక్కరితో పంచుకున్నాను...... ఇది వారి ప్రవర్తనలో కూడా గొప్ప మార్పును తెచ్చిపెట్టింది, మీరు కూడా ప్రయత్నించి చూడండి... మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి...


  💐💐💐🙏🙏🙏💐💐💐