*సివిల్ కేసులలో ప్రతివాదులకు మరియు లీగల్ నోటీసులు వాట్సాప్ ద్వారా పంపిన నోటీసులు చట్టబద్ధమే*
ఐటీ చట్టంలో వచ్చిన మార్పుల ప్రకారం వాట్సాప్ ద్వారా పంపిన లీగల్ నోటీసులు కూడా చెల్లుబాటు అవుతాయని,
అలాగే సందేశాన్ని చూసినప్పుడు వచ్చే బ్లూ టిక్ మార్కును సరైన ఆధారంగా పరిగణించవచ్చునని బాంబే హైకోర్ట్ స్పష్టం చేసింది. ముంబైకి చెందిన రోహిదాస్ జాదవ్ అనే వ్యక్తి పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన కేసు విచారణలో భాగంగా కోర్ట్ పై విధంగా స్పందించింది. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా వాట్సాప్ ద్వారా అతని మొబైల్ నెంబర్ కి పీడీఏప్ ఫైల్ రూపంలో పంపిన లీగల్ నోటీసులను అతను చూసి కూడా స్పందించకపోవడంతో దానిని సరైన ఆధారంగా పరిగణిచవచ్చునని జస్టిస్ గౌతమ్ ఎస్ పటేల్ తెలిపారు.
సివిల్ ప్రొసీజర్ ఆర్డర్ XXI రూల్ 22 ప్రకారం, తాను దీనిని అంగీకరిస్తున్నానని, ఎందుకంటే ప్రతివాది మొబైల్ నెంబర్ కు నోటీసులు పంపిణీ చేయడం, అలాగే బ్లూ టిక్ మార్కులు సందేశాన్ని తెరిచి చదివినట్లు స్పష్టంగా తెలుపుతున్నాయని జస్టిస్ పటేల్ తెలిపారు.
ఈ కేసు ప్రకారం రోహిదాస్ 2010 సంవత్సరంలో క్రెడిట్ కార్డు బిల్లు నిమిత్తం రూ.85వేలు చెల్లించాల్సి ఉంది. కానీ అతను దానిని చెల్లించకపోవడంతో చివరికి అది వడ్డీతో కలిపి రూ.1.17 లక్షలకు చేరుకుంది. బ్యాంకు అనేక మార్లు సందేశాలు పంపినప్పటికీ, అతని నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో న్యాయవాది ద్వారా అతని ఇంటికి లీగల్ నోటీసులు పంపించింది. కానీ అతను ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంటికి మారాడు. దీంతో బ్యాంకు అధికారులు అతని మొబైల్ నెంబర్ కు వాట్సాప్ ద్వారా లీగల్ నోటీసులను పంపించారు. అతను ఆ ఫైల్ ను తెరిచి చూసి కూడా స్పందించకపోవడంతో బ్యాంకు తరఫు న్యాయవాదులు కోర్ట్ ను సంప్రదించారు. ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ గౌతమ్ పటేల్ వాట్సాప్‌లో పంపిన ఫైల్‌ను అతను చూసినందువలనే బ్లూ టిక్ మార్కు వచ్చింది. దీని ఆధారంగా అతడికి నోటీసు అందినట్లు పరిగణిచవచ్చని జస్టిస్ తెలిపారు.
రాజస్థాన్ చెందిన ఒక ఉద్యోగి వ్యక్తి తన భార్య విడాకులకు ఓపి పైల్ చేసుకున్నాడు నన్ను వదిలి ఉద్యొగం కోసం తన భార్య నెదర్లాండ్స్ వెళ్లింది విడాకుల కేసు తన లాయర్ ద్వారా ఫైల్ చేసుకున్నాడు. ఆమెకు వాట్సప్ యాప్ ద్వారా నోటీసులు పంపినారు. ఆమె అక్కడ నుంచే రావడానికి కుదరదు వీడియో కాల్ ద్వారా విచారణ కోర్టు వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది.
కోర్టు నుంచి ఎటువంటి దావా నోటీసులు వచ్చిన మరియు లీగల్ నోటీసులు వచ్చిన వెంటనే స్పందించాలి. లేని పక్షంలో చదువుకున్నవారికి మాత్రమే వర్తిస్తాయి.
ఎస్.ఆర్ ఆంజనేయులు
న్యాయవాది 9848018828
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి