19, అక్టోబర్ 2020, సోమవారం

సమ్మేళనం

 *🔥జ్ఞాన బోధ🔥* *ఒకసారి ఒక నగరంలో ఒక ధార్మిక సమ్మేళనం ఏర్పాటు చేయబడింది.* 


 *దేశం నలుమూలల నుండి పండితులని ఆహ్వానించారు.* 


 *ధర్మమార్గాన నడవడం, నైతిక విలువలను పాటించడం గురించి వివరించడం ఆ సదస్సు ఉద్దేశ్యం ....* 


 *ఆ జ్ఞానామృతాన్ని అందరికీ పంచాలని మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు...* 


 *దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరి నుండి ఒక యువకుడు రోజు అక్కడికి వస్తున్నాడు.అతను తనతో పాటు తమ పొరుగున వున్న ఒక (నిరక్షరాస్యుడైన) పెద్దాయనని* 

 *వెంటపెట్టుకుని వస్తున్నాడు.* 


 *రెండురోజుల కార్యక్రమంలో*  

 *జ్ఞానగంగ ఉధృతంగా ప్రవహించింది.*


 *అది మూడవరోజు..* 

 **ఆ పెద్దాయన పక్కనున్న* 

 *యువకునితో అన్నాడు..* 

 *" వీళ్ళంతా మూడు రోజుల నుండి ఇంత కష్టపడి చెబుతున్నది నేను రెండు వాక్యాల్లో చెప్పగలను. !"* 


 *సరిగ్గా అదే సమయంలో ఆ పక్కనుండి ఆ సదస్సు* *నిర్వాహకులలోని ఒక వ్యక్తి వెళుతూ ఇది వినటం తటస్థించింది.* 


 *అతను వెంటనే స్టేజ్ పైకి వెళ్ళిఆ పెద్దాయన ని పిలిచాడు..* 

 *" మేము ఇంత కష్టపడి ఏర్పాటు చేసిన సదస్సు సారాంశాన్ని మీరు రెండు వాక్యాల్లో చెప్పగలను* *అన్నారు.దయచేసి మాకు వివరించగలరా ?? "* 


 *అందరూ కుతూహలంతో చూసారు....* 


 *ఆ పెద్దాయన స్టేజ్ పైకి వచ్చాడు...* 


 *మైకు చేతిలోకి తీసుకొని అన్నాడు, " చూడండి.. నేను అసలు ఏమీ చదువుకోలేదు.* 

 *గ్రంథాల్లో ఏముందో నాకు తెలియదు.* 

 *నాకు తెలిసిన రెండు మాటలు చెబుతాను.వినండి..* 


 *🔹 రాత్రివేళ అశాంతితో నిద్రపట్టనీయకుండా చేసే ఏ పనీ పగలు చేయవద్దు.* 


🔹 *పగటివేళ ఎవరికీ కన్పించకుండా ముఖం దాచుకోవాల్సి వచ్చే ఏపనీ రాత్రి చేయవద్దు....* 


 *ఇంక చెడ్డ పనులు ఎప్పుడు చేయాలి ???* 

 *ఎప్పుడూ చేయకూడదు.* 

 *పగలు-రాత్రి, ఎల్లవేళలా* 

 *సదా సర్వదా, కేవలం మంచి పనులే చేయాలి.* 

 *ఇంతకు మించి సంక్షిప్తంగా ఏమైనా చెప్పగలమా !!!!!* 


   🕉️🌞🌎🏵️🌼

కామెంట్‌లు లేవు: