19, అక్టోబర్ 2020, సోమవారం

గాయత్రీ

 గాయత్రీ దేవి

౼౼౼౼౼౼౼౼

వేదాలు నాల్గింట వేద్యమ్మునైయుండి

            విశ్వమ్మునే గాచు వినుతశక్తి,

బ్రహ్మర్షులైన విశ్వామిత్రు లతిభక్తి

             తపియించి దర్శించు త్రాణశక్తి,

మంత్రాదులన్నింట మాన్యంబునైయుండి

             మహిత తేజమునిచ్చు మాన్యశక్తి,

మతిని శ్రద్ధనుబూని మననంబుగావింప

             సతము గావగజాలు స్తవ్యశక్తి,


మంత్ర తత్త్వార్థ సంపదే మదినెఱింగి

సవితయే వ్యాప్తిగావించు శ్రావ్యశక్తి

అయిన గాయత్రిగా రూపమందిగాచు

కనకదుర్గమ్మ  యెదనీకు ప్రణతిశతము.


రాయప్రోలు సీతారామశర్మ ,భీమవరం.

కామెంట్‌లు లేవు: