19, అక్టోబర్ 2020, సోమవారం

సోమవారము నిజ ఆశ్వీయుజ యుజ శుద్ద తదియ .


మూడవ రోజు  అమ్మ వారి అలంకారము .

టివి

అన్నపూర్ణా  దేవి.


అమ్మ వారికి  నైవేద్యము .


కొబ్బరి  అన్నము.


శరవన్నవరాత్రులలో మూడవ రోజు అన్నపూర్ణా  దేవికి  నైవేద్యం.



కొబ్బరి  అన్నం  .


తయారీ  విధానము .


ఒక  కొబ్బరి  కాయను  కొట్టి  రెండు  చిప్పలను ,  పచ్చి  కొబ్బరి  కోరాముతో  తురుముకుని , పచ్చి కొబ్బరి  తురుము సిద్ధంగా ఉంచుకోవాలి.


తర్వాత  ఒక  గిన్నెలో  గ్లాసు  బియ్యం  పోసుకుని  , ఒకసారి  నీళ్ళతో  కడిగిన తర్వాత,   రెండున్నర  గ్లాసులు   నీళ్ళు  పోసి  స్టౌ  మీద  పెట్టి ,  అన్నం  పొడి పొడిగా  వండుకోవాలి. అన్నం ఉడుకుతున్నప్పుడే  నాలుగు లవంగాలు మరియు  నాలుగు  యాలకులను వేసుకోవాలి .


తర్వాత  స్టౌ  మీద  బాండి  పెట్టి   నాలుగు   స్పూన్లు  నెయ్యి వేసి,   నెయ్యి  కాగగానే ,  నాలుగు  ఎండుమిర్చిని   తుంపి  ముక్కలుగా , రెండు  స్పూన్లు  పచ్చి శనగపప్పు  , స్పూనున్నర  మినపప్పు  , ముప్పావు  స్పూను  జీలకర్ర  , స్పూను  ఆవాలు ,   ఎనిమిది  నిలువుగా   చీల్చిన  పచ్చిమిర్చి  , మూడు  రెమ్మలు  కరివేపాకు , స్పూనున్నర  తరిగిన అల్లం ముక్కలు , పదిహేను  జీడిపప్పు  పలుకులు  వేసి  కమ్మగా పోపు వేయించుకోవాలి. తర్వాత  పోపులోనే  పచ్చి కొబ్బరి తురుమును  వేసి  రెండు నిముషాలు  కొబ్బరి  పచ్చి వాసన పోయే వరకు  వేయించుకోవాలి.


తర్వాత ఒక  బేసిన్ లో  ఉడికిన  అన్నం  వేసుకుని  , తగినంత  ఉప్పును , సిద్ధంగా  ఉంచుకున్న  పోపును ,  మరియు  తరిగిన  కొత్తిమీరను  వేసుకుని    గరిటతో  బాగా  కలుపుకోవాలి  .

 .

అంతే.  ఎంతో  రుచికరమైన  కొబ్బరి   అన్నం  మూడవ రోజు  అన్నపూర్ణా దేవి  నివేదనకు  సిద్ధం .


***************

కామెంట్‌లు లేవు: