." శ్రీ వెంకటేశ్వర స్తోత్రం" Part-2,(తరువాయి భాగం,) (మజుందార్,:). శ్లోకం: 2) "జనార్ధనః పద్మనాభో వెంకటాచల వాసనః.! సృష్టికర్త జగన్నాధో మాధవో భక్తవత్సలః !! .8) జనార్ధనః :- జన్మము లేనివాడు సర్వులను సంహరించు వాడు. శ్రీనివాసు నకు యశోద, వకుళ, దేవకి మొదలగువారు తల్లులని ప్రసిద్ధి కలదు. వారి వారి మూలకము గ తాను లోకమునందు కనబడుట వల్ల అట్లు పేరుతో కలిగినది. నిజము నా కాత నికి జన్మము లేదు. అదే విధముగా సర్వులకు కతడు సంహారకుడు. అతనికి సంసారము లేదు. ప్రళయ కాలము నందు కూడా యాతడు ఉన్నాడు. .9)"పద్మనాభః:-- బ్రహ్మాండం మను కమలం. నాభి పొక్కిలి. ప్రళయ సముద్రమునందు శయనించిన నారాయణుడు ప్రళయ కాలము ముగి యున్నప్పుడు లేచెను. 23 తత్వములను సృష్టించెను. నీళ్లను సృష్టించి బ్రహ్మాండము ను దాని మీద తేలినట్లు చేసెను. ఆ బ్రహ్మాండము నందు తాను ప్రవేశించెను. దేవ మానము ప్రకారము ఒక వెయ్యి సంవత్సరములు శయనించెను. అప్పుడతని పొక్కిలి నుండి ఒక పద్మము బహిర్గతమైన ది. అది పూర్వము నారాయణునిచే నిర్మింపబడిన బ్రహ్మాండం యొక్క రూపాంతరము. ఆ కమలము నుండి సృష్టికర్త అయిన (భగవంతుడు) బ్రహ్మదేవుడు పుట్టినాడు. ఇట్లు పొక్కిలి నుండి బ్రహ్మాండాంత కమైన పద్మమును సృష్టించి నందులకు శ్రీనివాసునకు "పద్మనాభుడు" అని పేరు కలిగెను. 10)"వెంకటాచల వాసన" :-- "వెంకటాచల" వెంకటాద్రి యందు అందరూ వహించినట్లు చేసెను. ఈ వెంకటాద్రి కి శ్రీనివాసుడు వచ్చు వరకు ఇది సామాన్య క్షేత్రము. ఇతడు వచ్చిన మీదట సకల దేవతలు, రుషులు, మొదలగు వారంతా విశేషముగా సన్నిహితులు శ్రీనివాసుని సేవించుచున్నాను. దీని వలన సీనివాస్ ఉన్న కు వెంకటాచల వాసనః అని పేరు కలిగినది. 11)"సృష్టికర్త:-- బ్రహ్మదేవుడు సృష్టి కర్త అని ప్రసిద్ధి గాంచి యున్నాడు. అయినను అతడు పుట్టినది నారాయణుడు నుండి అని "పద్మనాభుడు" అను పదము చే వ్యక్తమవుతున్నది. ఆ పద్మము దానికి కారణమైన 23 తత్వములను, బ్రహ్మాండము బ్రహ్మదేవునిచే పుట్టలేదు. అవి అన్నియు నారాయణుడు నుండి పుట్టినవి. బ్రహ్మదేవుడు ముందు ముందు చేయు సృష్టి నారాయణుని అనుగ్రహము నుండి ఏర్పడినది. కనుక సకల ప్రపంచమును సృష్టించిన వాడు శ్రీనివాసుడు తప్ప ఇతరులు ఎవ్వరు కాదని సిద్ధమైనది. .12)"జగన్నాథః":-- "జగత్" లోకము లన్నిటికీ యజమాని పాలించే వాడే, యజమాని అనిపించుకొనును. సృష్టికర్త ఏ కానీ, సంహార కర్తయే గాని, యజమాని అనిపించుకొను నియమము లేదు. దూడ ఆవు కె దూడ అయినప్పటికీ దాని యజమానుడు గొల్ల వాడే కదా! అందులోకి సకల లోక రక్షకుడైన శ్రీనివాసుడు సకల లోకముల యజమానుడు. ఇతరులెవరూ కాదని తెలియుచున్నది. 13)" మాధవః":- మా జ్ఞానము మరియు ప్రమాణము లకు ధన యజమాని. శ్రీనివాసుడు జ్ఞాన పూర్ణుడై యుండి బ్రహ్మాది సమస్త దేవతలకు తత్వోపదేశం చేసినవాడు. సకల శాస్త్రములకు ప్రవర్తకుడు డాతడు. దాని వలన అతనికి "మాధవుడు" నీ పేరు. 14)"భక్తవత్సల":-- భక్తుల యందు విశేషమైన ప్రీతి గలవాడు. భక్తురాలైన మహాలక్ష్మి దేవికి గాని పద్మావతిని పరిగ్రహించెను. భక్త ప్రహల్లాద దీనికిగాను తన విరోధి ఎగు హిరణ్యకశిపుని వుద్ధరించెను. దీనివలన శ్రీ హరి భక్త వాత్సల్య ప్రభావమును తెలుసుకొనవచ్చును. శ్లోకము: 3 :-- "గోవిందో గోపతిః కృష్ణం కేశవొ గరుడధ్వజః ! వరహౌ వామన శైచవ నారాయణ ఆధోక్షజః !!15)"గోవిందః:"-- 1) వేదముల వలన తెలియబడినవాడు. వేదైశ సర్వ రహ మే వేదైశ సర్వ రహ మేత వేదయః ఇత్యాది ప్రమాణములు సకల వేదములు శ్రీకృష్ణుని పరమ ముఖ్య వృత్తి చే చెప్పు చున్నవి. ఇతరులెవ్వరికీ అంతటి అర్హత లేదు. అని చెప్పబడినది. అందుచేత శ్రీనివాసుడు సకల వేద ప్రతిపాదుయడయైన గోవిందుడు. 2) శ్రీకృష్ణావతార మునందు గోవులను కాపాడెను. కామదేనువు తన వంశ మందు పుట్టిన గోవులను కాపాడిన అందులకు తన చీర శ్రీకృష్ణుడు నాకు అభిషేకము చేసి గోవిందుడు పట్టమును కట్టెను. దీని వలన మా శ్రీనివాసునకు గోవిందుడని అను పేరు వచ్చినది. 3)బ్రహ్మదేవుడు గోరూప ధారియై శ్రీనివాసునకు ప్రతిదినము తన పాల చే అభిషేకము చేయుచుండగా చోళరాజు భృత్యుని గొడ్డలి పెట్టు నుండి కాపాడెను. ఇట్లు గోరూపియైన బ్రహ్మదేవుని కాపాడి నందులకు శ్రీనివాసునికి "గోవిందుడు "అని పేరు. 16)"గోపతి":-- విద్యలకు అధిపతి "వేదవిదేవచాహం" ఇచ్ఛాధారి ప్రమాణములు అన్నియు వేదములను పూర్ణముగా తెలిసినవాడు. శ్రీకృష్ణుడు ఒక్కడే తప్ప ఇతరులు ఎవ్వరు లేరు అని చెప్పుచున్నవి. కనుక శ్రీనివాసుడే విద్యాధి పతి యగు ట వలన "గోపతి "యు అగుతున్నాడు. 17)"కృష్ణః":-- భూమి మీద నుండి నను ఆనంద పూర్ణుడు భక్తుల మనసు ఆకర్షించు వాడు. 1) వాయుదేవుడు మొదలగువారు భూమిమీద అవతరించు నపుడు మూల రూపము తోనూ ప్రాకృత దేహము కలిగి ఉందురు. నారాయణ నాకు ప్రాకృత దేహము లేదు. అందుచేత భూమి మీద ఉన్నప్పటికీ ఆనంద పూర్ణుడై ఉండెను. ఇతరులకు ఆనందము ఇచ్చువాడు. 2) ఇతర అవతారముల నందు చూపించ బడని అసంఖ్య అద్భుత వ్యాపారములను చూపించి భక్తుల మనసు చూరగొని ఉండుటచే తను శ్రీనివాసులకు "కృష్ణుడు" అను పేరు. 16)" కేశవః":-- 'క' బ్రహ్మను "ఈసా శివుని "వ" రక్షించువాడు. 4)శ్లోకము (ఇది హరివంశము లోనిది అని గమనించగలరు) "హిరణ్యగర్భః కు ప్రోక్త ఈశః శంకర ఏవచ! స్పష్టదినా వర్త యతి తాయతః కేశవో భవాన్!! ఈ హరివంశ వచన మందలి బ్రహ్మదేవునకు "క" అని పేరు. రుద్ర దేవునకు "ఈసా "అని పేరు. వీరిద్దరి స్పష్టది సర్వ వ్యాపారములను నడిపించు చున్నందున శీ కృష్ణుడు నకు "కేశవుడు" అను పేరు చెప్పబడినది. 19)"గరుడ ధ్వజ":-- గరుడ దేవుడు ధ్వజము గా కలవాడు. శ్రీనివాస దేవుడు గరుడారూఢే ఆకాశరాజు పట్టణమునకు పోయినాడు. ఆ కారణము చేత గరుడధ్వజ అతని పేరు అతనికి సూక్త మైనది. 20)"వరహః:-- శ్రేష్టుడు హేయుడు గాడు. 1) శ్రేష్టుడైన వాడు, చెప్ప దగ దోషములు అతని నందు లేవు. 2) వరాహావతారము గైకొని భూమిని పాతాళము నుండి ఎత్తి లోకమును రక్షించినవాడు. కనుక్కొని శ్రీనివాసునకు "వరాహుడు" అను పేరు కలదు. ,21)"వామనః చవినః:- మరియు వామనుడు ఈ వామన తత్వము ఎల్లప్పుడూ ఉండ తగినది . 1) శ్రీ హరి బలిచక్రవర్తిని నిగ్రహించి ఇంద్రునకు దేవలోక ఇచ్చుటకు గానీ వామన రూపము గైకొనెను. ఆ రూపము చాలా చిన్న రూపం అయినందున దానికి అని పేరు వచ్చినది. అతి సుందరుడా అయినందున శ్రీనివాసునకు "వామన" మను పేరు కలిగెను. ,22)"నార" గుణములు, జ్ఞానము, ముక్తి , వీనికి ఆయన ఆశ్రయమైన వాడు. నారాయణ దోషములకు ఆశ్రయుడు కాదు. నీళ్లను ఆశ్రయము గా కలవాడు. 1) "అర" అను పదము దోషమును తెలుపుతున్నది దానికి విరుద్ధమయిన గుణములకు "నార"అని పేరు . అనంత కళ్యాణ గుణ గణముల శ్రీనివాసుడు ఆశ్రయుడై యున్నాడు. 2) అదవా నరున కనగా జ్ఞాన పురుషునకు సంబంధించిన జ్ఞానమునకు నారా అని పేరు. ఆ జ్ఞానమే "ఆయన " మూర్ఖుడైన వాడు అనగా అజ్ఞానము చేత లభ్యుడగు వాడు శ్రీనివాసుని ప్రాప్తి అను ముక్తికి జ్ఞానమే సాధనమని చెప్పినట్లు అయినది. 3) లేక" ఆ ర" అనగా జనన మరణాది దోషములు ఎవరి యందు లేవో ముక్తు లకు "నార" అని పేరు. అటువంటి ముక్తులకు ఆశ్రయుడు. 4) లేక"అరాయణ" అనగా దోషములు. " న" లేనివాడు. శ్రీనివాసు నందు దోషములు ఏవి లేవు. 5)"నర" అనగా ప్రళయ కాలమందు నాశనము లేనివాడు, అట్టి వానిచే పుట్టిన నీళ్లకే నా రా అని పేరు. 18 ఆయన అనగా ఆశ్రయము గా కలవాడు. వెనుక పద్మనాభా అను పదమునకు కర్ణము చెప్పు నప్పుడు వివరించినట్లు సృష్టి యొక్క ఆదియందు నీళ్ల యందు శ్రయనిం చిన వాడ ని తెలియవలెను. ఇట్లు శ్రీనివాసునకు పైనుదహరించిన కారణముచేత "నారాయణ "నా పేరు పొందియున్నాడు. ,23) అధోక్షజః :- ఇంద్రియముల నుండి పుట్టిన జ్ఞానములు అజ్ఞానము వలన తెలియబడిని వాడు. కన్ను చెవి మొదలగు ఇంద్రియముల వలన శ్రీనివాసుని తెలిసికొన సాధ్యం కాదు. వేదములు వేదాలు సారి అయినా శాస్త్రములను తెలియవలెను. తిరుపతి యందు శ్రీనివాసుడు నిజరూపము తోనే ఉన్నాడని అనేక ప్రమాణములు చెప్పుచున్నవి. ఇంద్రియముల చేత తెలిసిన అతని బింబము రాతి తెలియకూడదు. శాస్త్రము నందు చెప్పినట్లు జ్ఞానం కూడా రూపమైన తెలియవలెను. (సశేషం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి