19, అక్టోబర్ 2020, సోమవారం

 [18/10, 10:06 pm] +91 99638 01993: *పురుషసూక్తమ్*


*(14) చంద్రమా మనసో జాతః*

*చక్షోః సూర్యో అజాయత*

*ముఖాదింద్రశ్చాగ్నిశ్చ*

*ప్రాణాద్వాయురజాయత*


తా" మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు. కంటి నుండి సూర్యుడు, ముఖం నుండి ఇంద్రాగ్నులు ఉద్భవించారు. ప్రాణం నుండి వాయువు ఉత్పన్నమైనాడు.


******************************

[18/10, 10:06 pm] +91 99638 01993: *  ధర్మం --- అధర్మం*

 ఓ తపస్సంపనుడు, సన్యాసి తన శిష్యులతో దేశ

సంచారం చేస్తూ ప్రజల్లో భక్తి తత్వాన్ని, ఆధ్యాత్మికా

చింతనను బోధిస్తూ, ఒక గ్రామం లో విడిది చేసారు.

ఒకరోజు ఆయన ప్రవచనం ప్రారంభిస్తుండగా, ఆ సమూహం లోనుండి ఒక యువకుడు లేచి  "గురువు

గారూ! ఈ మధ్యనే మా ఊళ్ళోని శివాలయం లోని

నందీశ్వరుడుని  పగలకొట్టి, దేవాలయం లోని డిబ్బీ

ని ఎత్తుకు పోయారు. దేశం లో అత్యాచారాలు, మాన

భంగాలు ఎక్కువైపోయాయి! అన్యాయమే రాజ్యమేలుతున్నట్టుంది.మరి ఇంత జరుగుతున్న

మీ లాంటి ధర్మప్రభోధకులు, "ధర్మం! ధర్మం !" అంటుం

టారు. ఎందుకండి?  అధర్మంగా ప్రవర్తించే వాళ్ళే ఎంతో హాయిగా ఉంటుంటే , ధర్మం, న్యాయం,అంటూ

ఉండేవారు ఎన్నో కష్టాలు పాలవుతున్నారు! దీనికి

కారణం ఏమిటంటారు?" అని అడిగాడు! అపుడు 

ఆయన మాట్లాడుతూ " మంచి ప్రశ్న వేసావు నాయనా! పాండవులు ధర్మప్రవర్తన కలవారు. వాళ్ళు

అరణ్యవాసం చేస్తున్న సందర్భంలో కామ్యకవనం లో

ఉన్నప్పుడు  నీవు అడిగినట్టే ధర్మరాజు తన పురోహి

తుడు దౌమ్యుడుని ఇలాంటి ప్రశ్నే వేస్తే అపుడు దౌమ్యుడు  అధర్మంగా నడిచేవాడికి వచ్చే సంపద

తాత్కాలికమైనది. అది  బాహ్యంగా సుఖాన్ని ఇచ్చినా

అంతర్ముఖఃగా లోపల మనిషిని దహించేస్తుంటుంది!

తన ఆలోచనా ధోరణే మూలం! అటువంటి వారు శిక్ష

ను అనుభవించక తప్పదు! అదే ధర్మాన్ని ఆచరిస్తూ,

పెద్దల మాటను గౌరవిస్తూ ఉండేవారికి వచ్చే కష్టాలు

తాత్కాలికమే! వారి ఆలోచన అంతఃకరణం ఎలాఉందో అలాగే బాహ్యంగా నడచు కొంటుంటారు!

వారిలో పాపభీతి అనేది ఉండదు. కనక మానసిక పరంగా ఏ సమస్యలూ రావు!కలిమి ఎప్పుడూ స్థిరం

గా ఒక చోట ఉండదు. అధర్మపరులకు గర్వం ఏర్పడు

తుంది!  ఆ గర్వమే వినాశానికి మూలం. వారిలో 

విశక్షణా జ్ఞానం నశిస్తుంది. అగ్ని వనాన్ని దహించి నట్లు  పాటించిన అధర్మమే వాళ్ళను దహింపచేస్తుంది

పంచభూతాలైన అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశం

మనం చేసే కర్మకు సాక్షీభూతాలు! ఎక్కడైనా అధర్మం

ప్రబలినప్పుడు వాటిద్వారానే వినాశంకలుగుతుంది! 

 పైలోకంలో  ధర్మదేవత  మన కర్మలను బట్టే శిక్షిస్తాడు!

అంతిమంగా ధర్మపరాయణులు శాశ్వతకీర్తిని ఆర్జిస్తారు! అని వివరించాడు! అలాగే ఇప్పుడు విద్వంశాలు సృష్టించేవాళ్ళు, దుష్టులు! అధర్మపరాయణులు అరాచకాలను సృష్టిస్తున్నా, విధి

చేతిలో ఎప్పటికైనా శిక్షింప బడతారు నాయనా!"

అని ఆ యోగి ఇచ్చిన సమాధానంతో తృప్తి పడ్డాడాయువకుడు!

*        **         ****          *           **

[18/10, 10:06 pm] +91 99638 01993: *సంస్కృత సూక్తి*


*ఆత్మకృతానాం హి దోషాణాం నియతమనుభవితవ్యం ఫలమాత్మనైవ*


తాను చేసిన తప్పుల ఫలితాన్ని తానే తప్పక అనుభవించాల్సి ఉంటుంది.


==========

[18/10, 10:06 pm] +91 99638 01993: 🌹🌹🙏🙏💐

చంద్రఘంటా దుర్గా,  దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం. 🙏🙏🙏భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ, చండికా, రణచండీ అని కూడా పిలుస్తారు. చంద్రఘంటా అంటే అర్ధచంద్రాకారంతో, గంట కలగి ఉన్నది అని అర్ధం. నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటా దేవి ధైర్యానికీ, శక్తికీ, తేజస్సుకూ ప్రతీకగా భక్తులు భావిస్తారు. ఆమె తన తేజస్సుతో పూజించినవారి పాపాలు, ఈతిబాధలు, రోగాలు, మానసిక రుగ్మతలు, భూత భయాలు దూరం చేస్తుంది.

చంద్రఘంటా దుర్గాదేవ

పురాణ గాథ సవరించు

శివుడు, పార్వతి దేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న  తరువాత ఆమె ఎంతో సంతోషిస్తుంది. పార్వతీదేవి తల్లిదండ్రులైన  మేనకా దేవి, హిమవంతులు కూడా పెళ్ళికి అంగీకరిస్తారు. పెళ్ళి రోజున శివుడు దేవతలతోనూ, మునులతోనూ, తన గణాలతోనూ, శ్మశానంలో తనతో ఉండే భూత,  ప్రేత, పిశాచాలతోనూ తరలి విడిదికి  వస్తాడు. వారందరినీ చూసి పార్వతి తల్లి మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది.  అప్పుడు  అమ్మవారు  చంద్రఘంటాదేవి  రూపంలో శివునకు కనిపించి,  తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం  మార్చుకోమని ఆయనను కోరుతుంది. అప్పుడు శివుడు రాజకుమారుని  వేషంలో,  లెక్కలేనన్ని  నగలతో తయారవుతాడు.   అప్పుడు  ఆమె కుటుంబసభ్యులు,  స్నేహితులు, బంధువులూ భయం  పోయి  శివుణ్ణి  వివాహానికి  ఆహ్వానిస్తారు.  ఆ  తరువాత  శివ,పార్వతులు  వివాహం చేసుకుంటారు.  అలా  ప్రజల  భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా చంద్రఘంటా అవతారం ఎత్తింది.


శివ, పార్వతుల కుమార్తె కౌషికిగా దుర్గాదేవి జన్మించింది. శుంభ, నిశుంభులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు. ఆమె యుద్ధం చేస్తుండగా, ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు. అమెను తన తమ్ముడు నిశుంభునికిచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుని ధూమ్రలోచనుణ్ణి కౌషికిని ఎత్తుకురమ్మని పంపిస్తారు. అప్పుడు అమ్మవారు తిరిగి చంద్రఘంటా దుర్గా అవతారం ధరించి ధూమ్రలోచనుణ్ణి, అతని పరివారాన్ని సంహరిస్తుంది. అలా శుంభ, నిశుంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంటా దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు.💐💐

చంద్రఘంటా దుర్గా దేవి అవతార

చంద్రఘంటా దుర్గా దేవి ఎనిమిది చేతులతో ఉంటుంది. ఒక చేతిలో  త్రిశూలం, ఒక దానిలో గద, ఒక చేతిలో ధనుర్భాణాలు, మరో చేతిలో  ఖడ్గం,  ఇంకో  చేతిలో కమండలం  ఉంటాయి. కుడి హస్తం  మాత్రం అభయముద్రతో ఉంటుంది. చంద్రఘంటా దుర్గాదేవి పులి మీదగానీ, సింహం  మీదగానీ ఎక్కుతుంది. ఈ వాహనాలు ధైర్యానికి, సాహసానికీ ప్రతీకలు.  అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా, ఫాలభాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి. అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూంటుంది. శివుడు ఈ అమ్మవారి అందానికి ముగ్ధుడయ్యాడని పురాణోక్తి.

ఈ అమ్మవారిని ఉపాసించేవారు మొహంలో దైవ శోభతో ప్రకాశిస్తుంటారని భక్తుల నమ్మిక. వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారట. ఈ అమ్మవారిని పూజించేవారు విజయాన్ని అతిశీఘ్రంగా పొందగలరని భక్తుల విశ్వాశం. దుష్టులను శిక్షించేందుకు ఈ అమ్మవారు ఎప్పుడూ తయారుగా ఉంటుందని పురాణోక్తి. అలాగే తన భక్తులకు ప్రశాంతత, జ్ఞానం, ధైర్యం ప్రసాదిస్తుందిట ఈ అమ్మవారు. రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని ఘంట భీకరమైన శబ్దం చేసిందట. కొందరు రాక్షసులకు ఆ ఘంటానినాదానికే గుండెలవిసాయని దేవి పురాణం చెబుతోంది. అయితే ఈ ఘంటానినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమనీ, ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీతి. దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో, ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది.

💐💐💐💐💐💐

ధ్యాన శ్లోకం

పిండజ ప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ప్రసాదం తనుతే మహ్యాం చంద్రఘంటేతి విశ్రుతా శ్రీ మాత్రే నమః🙏🙏🙏

కామెంట్‌లు లేవు: