19, అక్టోబర్ 2020, సోమవారం

క్షమ~~~పగ*

 *క్షమ~~~పగ* 

🕉️🌞🌎🏵️🌼🚩


 *మనకున్న గొప్ప లక్షణాలలొ ముఖుమైనది క్షమ. దీనికి వ్యతిరేకం పగ.* 


 *క్షమించడం వల్ల మనకే లాభము.* 


 *మనని ఇబ్బంది పెట్టిన సంఘటనలు కానీ,*  


 *వ్యక్తులని కానీ క్షమించ గలిగితే,* 

 *మన అంతరంగంలో వాటి తాలూకు ములుకులు గుచ్చుకోవు.* 


 *మన అంతరంగం ప్రశాంతంగా ఉంటుంది.* 


 *దేహ త్యాగ సమయంలో,*  

 *ఆత్మ చక్కగా,* 

 *ఒక పక్షి లాగా తనలోకాలకి వెళ్ళిపోతుంది* .


 *అదే మనం క్షమించలేదు అనుకొండి,* 

 *అది పగగా మారుతుంది.* 

 *ఈ పగ మనని ఇబ్బంది పెట్టినసంఘటనలు కానీ వ్యక్తిలని కానీ ఏమి చేస్తుందో తెలియదు కానీ, మనని మాత్రం దహించి వేస్తుంది.* 


 *చితి మనం చనిపోయక దేహాన్ని దహిస్తుందేమో కానీ, పగ మనం బ్రతికి ఉండగానే* *మనని దహిస్తుంది.* 


 *పగతో రగులుతూ ఉన్నప్పుడు దేహ త్యాగ జరిగితే, ఆత్మ ఒక పాము లాగా అధోలోకాలకి వెళ్ళిపోతుంది.* 


 *జన్మ జన్మలైన ఈ పగ మనలో ఉండి,*  

 *మనము పగ పట్టిన వ్యక్తి, ఏ రూపంలో ఉన్నాడో తెలుసుకొని పగ తీర్పుకుంటుంది,* 


 *అలానే మన పై పగ పట్టినవారు కూడా అంతే.* 


 *ఒకవేళ మనపై ఎవ్వరు పగ పట్టినా,మనలో క్షమాగుణం ఉంటే కనక,* 

 *మనం వారిని క్షమించమని అప్పుడే అందరి ముందు ఆడిగేస్తాము, క్షమిచ్చాడమా పగ పట్టడమా అన్నది వారి స్వంత విషయం. కానీ ఇలా చేయడం వల్ల మన దేహ త్యాగ సమయంలో,* 

 *ఆత్మ హాయిగా ఒక పక్షి లాగా ఎగిరి వెళ్ళిపోతుంది.* 


 *కాబట్టి మనం క్షమించాలా,*  

 *లేక,* 

 *పగ పట్టాల అన్నది ఎవ్వరికి వారు నిర్ణయించుకోవాల్సిన స్వభావము.* 


 *ఒకటి మాత్రం సత్యము.* 

 *క్షమ దైవీ గుణం, పగ అసురీ గుణం.* 


 *ఇక చెప్పేదేముంది,* 

 *"యదా ఇచ్ఛసి తదాకురు"* 

 *మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అనడం తప్ప.* 

 *మీరు మాత్రం* 

 *"కరిషేవ వచనం కురు",* 

 *నువ్వు చెప్పినట్టు చేస్తా* 

 *అని మాత్రం అనకండి* ,

 *మీకు పుణ్యం ఉంటుంది.* 


 *అంతే గా* 


 *ఏమంటారు🤔* 


💐🌷💐🌷💐

కామెంట్‌లు లేవు: