నా పేరు పడాల శ్రీనివాస రెడ్డి. తూర్పుగోదావరి జిల్లాలోని గొల్లల మామిడాడ నా స్వగ్రామం. నేను రాజమండ్రిలో నివాసం ఉంటున్నాను. సెప్టెంబర్ 6 వ తేదీన మా మేనల్లుడికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది.ఆ విషయం తెలిసిన తర్వాత నేను హోం ఐసోలేట్ అయ్యాను.నేను చాలా ఆందోళనకు కూడా గురయ్యాను. కారణం 4వ తేదీన రెండు గంటలు, ఐదో తేదీన గంటన్నర మా మేనల్లుడి రూమ్ లో సిస్టమ్ ముందు వాడి ప్రక్కనే నేను కూర్చుని వాడితో కంప్యూటర్ పని చేయించుకున్నాను. ఆ సమయంలో ఏసీ వేసుకుని తలుపులు కూడా మూసివేయడం జరిగింది. పైగా నాకు డయాబెటిస్ కూడా ఉంది. ఖమ్మంలో ఆర్థోపెడిక్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్న మా దగ్గరి బంధువుకు విషయాన్ని తెలియజేసాను. మీరు చెప్పినదానిని బట్టి ఆలోచిస్తే మీకు కూడా కోవిడ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లేనని, మీలో కోవిడ్ లక్షణాలేవైనా బయటపడితే వెంటనే ట్రీట్మెంట్ మొదలు పెడదామని, కంగారు పడవద్దని అతను నాకు చెప్పాడు. అదే సమయంలో హైదరాబాదులోని జగద్గిరిగుట్ట ఏరియాలో నివసించే నా మిత్రుడు మిరియాల సుధాకర్ నాకు ఫోన్ చేసాడు. మాటల సందర్భంలో తాను కూడా గతంలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన అతని మిత్రునితో ఇంటరేక్ట్ అయినట్లుగానూ, అప్పుడు అతని మిత్రుడైన జబర్దస్త్ కెవ్వు కార్తీక్ సలహామేరకు హైదరాబాదులోని కమలాపురి కాలనీలో 'రాజ వైద్య నిలయం' పేరుతో ఆయుర్వేద హాస్పిటల్ నిర్వహిస్తున్న డాక్టరు MB రెడ్డి గారి వద్ద ప్రివెన్షన్ డోస్ తీసుకోగా ఎటువంటి సమస్య ఎదురవ్వ లేదని, చావు బ్రతుకుల మధ్యనున్న కెవ్వు కార్తీక్ తల్లిగారు డా.MB రెడ్డి గారి వద్ద కేన్సర్ ట్రీట్మెంట్ పొందిన తర్వాత నాల్గవ దశలో ఉన్న ఆమె కేన్సర్ వ్యాధి కూడా చాలామటుకు తగ్గుముఖం పట్టిందని, అనేకమంది కోవిడ్ పేషెంట్లకు కూడా ఆయన మందు ఇస్తున్నారని, మంచి ఫలితాలు కనపడ్డాయని కూడా చెప్పాడు. డా.MB రెడ్డి గారితో నన్ను మాట్లాడమని, కొరియర్ లో మందులు ఎక్కడికైనా సరే ఆయన పంపిస్తారని చెప్పి ఆయన మొబైల్ నంబర్లు నాకు వాట్సాప్ చేసాడు.
ఆ మొబైల్ నంబర్లు చూసిన తర్వాత డాక్టర్ ఎం బి రెడ్డి అంటే డాక్టర్ మేడపాటి భామి రెడ్డి అని నాకు అర్ధమయ్యింది. నేను ఆశ్చర్యపోయాను.ఎందుకంటే ఆయన స్వగ్రామం కూడా నా స్వగ్రామమైన గొల్లల మామిడాడ మరియు ఆయన అత్తవారి గ్రామమైన మాచవరం నా అత్తవారి గ్రామం కూడా. అంతేకాదు ఆయన నా పెద్ద అత్తయ్య గారి అల్లుడు కూడా కావడం విశేషం. ఆయనేదో ఆయుర్వేద వైద్యం చేస్తారని, హైదరాబాద్ మరియు చెన్నై వెళ్లి వస్తూ ఉంటారని మాత్రమే నాకు తెలుసు. కానీ ఎక్కడో సుదూరంలో ఉన్న హైదరాబాదులోని నా మిత్రుడు చెబితేనేగానీ ఆయన ప్రతిభ నాకు తెలియలేదు. నేను ఆయనకు ఫోన్ చేయడం, ఆయన నాకు మందులు పంపించడం చకచకా జరిగిపోయాయి. ఆయన నాకు పంపించిన ఆ ప్రివెన్షనరీ డోసును నేను మొదలు పెట్టి ఈరోజుకి 20 రోజులు పూర్తయ్యాయి. నాలో ఎటువంటి కోవిడ్ లక్షణాలూ కనబడలేదు. ఆ డోసును మా అక్క,బావగారితో సహా మా మేనల్లుడి భార్య మరియు ఆమె పుట్టింటి కుటుంబ సభ్యులు అందరూ వాడినారు. వారిలో ఏ ఒక్కరూ కోవిడ్ బారిన పడకపోవడం విశేషం. బిక్కవోలు, కొంకుదురు,మాచవరం మరియు పసలపూడి గ్రామాల్లో కూడా పాజిటివ్ గా తేలిన కొందరు కోవిడ్ పేషెంట్లు కూడా భామిరెడ్డి గారి కోర్సును వాడి తక్కువ ఖర్చుతో వైరస్ నుంచి బయటపడ్డారని కూడా నేను ఇటీవల విన్నాను.
అంతవరకూ నేను 'పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు' అన్న సామెతను విన్నాను. కానీ ఈ సంఘటన జరిగిన తర్వాత అనుభవపూర్వకంగా ఆ సామెత యొక్క అంతరార్థం నాకు తెలిసింది.మన పెరట్లో లభించే ఔషధ మొక్కల విలువను గుర్తించకుండా ఎక్కడో అడవిలో దొరికే మూలికలనే మనం నమ్ముతాము. అదే విధంగా అందుబాటులో ఉన్నవారి ప్రతిభాపాటవాలను మనం గుర్తించక ఎక్కడెక్కడికో దూరాలకు పోయి ఎవరెవరికోసమో గాలిస్తాము. నాకు బాగా కావాల్సిన,దగ్గరి బంధువైన వ్యక్తి యొక్క ప్రతిభాపాటవాల గురించి ఎక్కడో హైదరాబాదులో ఉన్న నా మిత్రుడు చెబితేనే నాకు అర్ధమైంది. బహుశా ఇక్కడి వారు చెబితే నేనసలు డా.మేడపాటి భామిరెడ్డి గారి మందునే వాడియుండేవాడిని కాదేమో!
ఎందరో కోవిడ్ బారిన పడి లక్షలకు లక్షలు కార్పొరేట్ ఆసుపత్రులకు ఖర్చు పెడుతున్నారు. కొంతమంది తమ ప్రాణాలను కాపాడుకునే క్రమంలో తమకున్న కొద్దిపాటి ఆస్తులను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం నెలకొనియుంది. కరోనా వైరస్ బారిన పడనివారు ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ భామిరెడ్డి గారి వైరస్ నిరోధక డోసును వాడడం మరియు పాజిటివ్ వచ్చినవారు నియంత్రణ మందుల కోర్సును వాడడం అందరికీ శ్రేయస్కరమని భావిస్తూ... అందరికీ మేలు చేయాలనే భావనతో ఆయన మొబైల్ నంబర్స్ ను షేర్ చేస్తున్నాను.
*డాక్టర్ M.భామిరెడ్డి* ,
*9963465666 & 7989253555* .
*ఇట్లు* ,
పడాల శ్రీనివాస రెడ్డి
9440100002 & 9440100009.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి