19, అక్టోబర్ 2020, సోమవారం

భాగవత పద్యాల పోటీ .

 సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో శతక మరియు భాగవత పద్యాల పోటీ .

(ఈ సారి గృహిణులు కూడా పోటీలో పాల్గొనవచ్చును. గృహిణులకు మధ్యాహ్నం 2గంటల నుండి పోటీలు వేరుగా నిర్వహించబడును)

1.  సోదరి నివేదిత 153 వ జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయిలో కృష్ణ,సుమతీ, వేమన,దాశరథీ శతకం మరియు భాగవతం పద్యాల పోటీ అక్టోబర్ 21 లేదా 22 రోజున నిర్వహించబడును.


2.  నాలుగు శతకాల మరియు భాగవతం నుండి 3 పద్యాల చొప్పున 15 పద్యాలు కంఠస్తం చేసి పోటీలో పాల్గొనాలి.

3.ఈ గ్రూప్లో ప్రతి శతకం, భాగవతం నుండి 8 పద్యాల చొప్పున ఇవ్వటం జరిగింది.ఈ పద్యాల నుండి మాత్రమే 3 పద్యాలు ఎంపిక చేసుకుని పాడాలి.(తాత్పర్యం అవసరం లేదు)


4. అక్టోబర్, తేదీ 21 లేదా 22 న ఉదయం 9 గంటల నుండి జూమ్ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడును.

5. 4,5,6,7,8,9,10 వ తరగతుల మరియు ఇంటర్ ప్రథమ, ద్వితీయ, బిటెక్,డిగ్రీ తరగతుల విద్యార్థులు పాల్గొనాలి

6.4,5,6,7 తరగతి విద్యార్థులు(శ్రేణి1) 8,9,10తరగతి విధ్యార్థులు (శ్రేణి2) ఇంటర్ ప్రథమ, ద్వితీయ తరగతి విధ్యార్థులు (శ్రేణి 3) బిటెక్,డిగ్రీ విద్యార్ధుల (శ్రేణి 4) గ పరిగణించడం జరుగుతుంది

7. శ్రేణి వారిగా  రాష్ట్ర స్థాయిలో ప్రథమ,ద్వితీయ మరియు తృతీయ బహుమతులతో పాటు ప్రతి జిల్లాకు 5 ప్రోత్సాహక బహుమతులు అందచేయబడును


8. పాల్గొన్నవారికి ధ్రువ పత్రాలు (certificates) online ద్వారా అందించబడును.


9. గుణాలు ఈ విధంగా వేస్తారు.

అ) కంఠస్థం (చూసి చెప్పకూడదు)-5 గుణాలు

ఆ) భాష (( ఉచ్చారణ దోషాలు లేకుండా)- 5 గుణాలు

ఇ) పదాల మధ్య అన్వయం - 5 గుణాలు

ఈ) రాగయుక్తం - 5 గుణాలు 

ఉ) భావ యుక్తం(హావభావాలతో) - 5 గుణాలు


ఈ విధంగా మొత్తం 25 గుణాలు ఉంటాయి.

10. పోటీలో పాల్గొనే విద్యార్థులు  వారి పేర్లు, తరగతి మరియు చిరునామాను గ్రూప్ లో నమోదు చేసుకోవలసి ఉంటుంది

కామెంట్‌లు లేవు: