19, అక్టోబర్ 2020, సోమవారం

శివామృతలహరి


శ్రీ.చిల్లర కృష్ణమూర్తి గారు వ్రాసిన
#శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

మ||
భువిలో గల్గిన వృక్షజాతులు కలంబుల్ చేసి సంద్రాల యం
బువులన్నింటి"సిరా"యొనర్చి ధరయున్ పొల్పైన పత్రంబుగా
నవదీక్షంగొని వ్రాసినన్ కవులు విన్నాణంబునన్ సత్యమౌ
శివతత్త్వంబు వచింప సాధ్యమగునే? శ్రీ సిద్ధలింగేశ్వరా!

భావం;
ఈ భూప్రపంచంలోని సమస్త  వృక్షములను కలములుగా చేసి,
అన్ని సముద్రాలలోని నీటిని సిరాగా మార్చి, భూమిని మొత్తం పత్రముగా చేసికొని కవులందరూ దీక్ష బూని, ఎంత నేర్పరితనముతో వ్రాసినప్పటికీ నిజమైన శివ తత్వాన్ని వర్ణించడం సాధ్యమవుతుందా స్వామీ! శ్రీ సిద్ధ లింగేశ్వరా! 

కామెంట్‌లు లేవు: