19, అక్టోబర్ 2020, సోమవారం

మైలాపూర్

 *స్థలం: చెన్నై, మైలాపూర్, కపాలీశ్వర దేవాలయం సమయం: ఇంచుమించు 1922 సంవత్సరం*  


ఒక సాయంకాలం

దేవాలయం కోనేటి మెట్లపై ఓ ఐదారుగురు మిత్రులు కబుర్లాడుతున్నారు. వారంలో ఒకసారి అలా కలుసుకోవడం ఆనవాయితీ. ఆ గుంపులో మెడిసిన్ లో డిప్లమా తీసుకొని, చెన్నై ఆయుర్వేద కళాశాలలో పనిచేస్తున్న ఒక డాక్టరూ ఉన్నాడు.


ఆయన నెల జీతం అరవై రూపాయలు.

డాక్టర్ : నాకేగనక ఓ పదివేలరూపాయలుంటే నా పరిశోధనలతో అద్భుతాలు చేసి చూపిస్తాను.


ఒకశ్రోత : సర్లేవయ్యా! నీ సోది ఎప్పుడూ ఉండేదేగదా!


డా: నిజం సర్, నామాట నమ్మండి. పెట్టుబడే ఉంటే, "సర్పగంధి "తో నేను దివ్యౌషధాలు చేసి చూపిస్తాను. 


రెండవశ్రోత : ఇంకానయం. మృతసంజీవని చేస్తానన్నావుకాదు.


డా :పరిహాసాలు కాదు సర్. సర్పగంధితో చాలా రోగాలను నయం చేయవచ్చు. కావాలసిందంతా పరిశోధనలకు పెట్టుబడి. అంతే.


మొ.శ్రో.: పరిహాసం కాదు డాక్టరుగారూ! నిజంగానే అంటున్నాను. అంతపెట్టుబడి మనకెక్కడ? ఏ అమెరికావాడో పెడితే తప్ప. 


ఇంతలో పెద్దవాన. కూర్చున్నవాళ్ళంతా లేచి బిరబిరా తలో మూలా వెళ్ళారు. మన మిత్రబృందం దేవాలయం సన్నిధిలో పూజాసామాగ్రి అమ్మే ఒక దుకాణం చూరుకింద నిల్చున్నారు.అక్కడా ఈ డాక్టరు గారు వదల్లేదు. సర్పగంధి గొప్పదనాన్ని గురించి ఆంగ్లంలో అనర్గళంగా దంచుతూనే ఉన్నాడు. ఇంతలో వెనుకనుంచి ఒకతను, 


" నిజంగానే మీరు అలాంటి మందులను తయారు చేయగలరా?" అని ప్రశ్నించాడు ఆంగ్లంలో.


మిత్రులు ఆశ్చర్యంతో వెనక్కు తిరిగి చూస్తే, అతనొక అమెరికన్. 


డాక్టర్ అత్యుత్సాహంతో " కచ్చితంగా సర్. పెట్టుబడి పెట్టిచూడండి." అన్నాడు.


ఆ అమెరికన్ "సరే. నేను LEDERLE కంపెనీ ప్రతినిధిని. మాకంపెనీ డైరెక్టర్స్ తో మాట్లాడి, ఒకట్రెండు నెలల్లో మీకు తెలియపరుస్తాను." అంటూ డాక్టరుగారి చిరునామా తీసుకున్నాడు. 


“ నిజం సర్. ఆరునెలలు గడువియ్యండి చాలు. నేను మాట నిలబెట్టుకోలేకపోతే ఇండియాకు తిప్పి పంపేయండి" అంటూ ఏదేదో పలవరించసాగాడు పాపమాడాక్టర్.


మర్నాటినుంచీ డాక్టర్ ఎదురు చూపులూ, మిత్రుల పరిహాసాలూ.

ఆరువారాలతరువాత LEDERLE COMANY నుంచి డాక్టరుగారికి ఒక ఉత్తరం వచ్చింది. 

.

" మా ప్రతినిధి ద్వారా మీ ఉత్సాహం, ఓషధీజ్ఞానం మాకు తెలిసింది. ప్రజలకోసం కొత్తమందులు కనిపెట్టడమే మా లక్ష్యం. మీరుకనిపెట్టే వాటిల్లో ఏ ఒక్కటి ఫలప్రదమైనా సంతోషిస్తాం. మీరు ఢిల్లీలో మాసంస్థ కార్యాలయానికి వెళ్ళండి. మీప్రయాణ ఏర్పాట్లన్నీ వారు చూసుకుంటారు". 

.

ఇదీ ఆ ఉత్తరం సారాంశం. డాక్టరుగారు ఆ ఉత్తరాన్ని ఓ వందసార్లయినా మిత్రులకు చదివి వినిపించుంటారు.


తరువాత ఆయన అమెరికా వెళ్ళడం HETROGEN, TETRACYCLINE, METHOTREXATE(USEFUL IN CANCER TREATMENT) ,POLYMIXIN (Cattle Field ) లాంటి దివ్యౌషధాలు కనుక్కోవడం అంతా గొప్ప చరిత్ర.

.


*ఆ మహానుభావుడే డాక్టర్ యల్లాప్రగ్గడ సుబ్బారావు గారు.* 

.

జనవరి 12 పూజ్య స్వామీ వివేకానంద జన్మదినం అని అందరికీ తెలుసు. ఆరోజే డాక్టర్ యల్లాప్రగ్గడ సుబ్బారావుగారి జన్మదినం కూడా.

.


LEDERLE COMPANY వారు తమ ప్రాంగణంలో సుబ్బారావు గారి విగ్రహం ప్రతిష్ఠించి ఆయనపై తమ గౌరవాన్ని చాటుకున్నారు. 

నోబెల్ బహుమతి గానీ ,భారతరత్న పురస్కారం గానీ వారికి లభించలేదు .


*భాస్కరుడు, చరఖులనుంచీ, శ్రీనివాసరామానుజం, యల్లాప్రగ్గడ సుబ్బారావు గారి* దాకా వేలసంవత్సరాలుగా మన భారతీయ మేధ విశ్వవ్యాప్తం అవుతూనే ఉంది. మన యువతకే అది పనికిరానిదయింది.

కామెంట్‌లు లేవు: