19, అక్టోబర్ 2020, సోమవారం

కర్మల్ని చేయాలి

 *జై శ్రీమన్నారాయణ - జై శ్రీహనుమాన్*


*న బుద్ధి భేదం జన యేత్*

*అజ్ఞానం కర్మ సంగినాం*

*జోష యే త్సర్వ కర్మాణి*

*విద్వాన్ యుక్త సమాచరన్*


ఆత్మజ్ఞానం కలవాడు అది లేని వారి బుద్ధిని మార్చకూడదు. కర్మయోగమే సాధనం అనే బుద్ధితో కర్మలను చేస్తూ ఉండాలి. కర్మల నుండి సామాన్య జనాన్ని మరల్చకపోవడమే గాక, తమ కర్మలచేత వారిని సంతోషపెట్టాలి. ఆత్మజ్ఞానం సంపూర్ణంగా లేని వాడు ఎంత ఆసక్తిగా కర్మల్ని చేస్తారో, ఆత్మజ్ఞానులు కూడ లోక సంరక్షణార్థం కర్మల్ని చేయాలి.


*ప్రకృతేః క్రియమాణాని*

*గుణైః కర్మాణి సర్వశః*

*అహంకార విమూఢాత్మా*

*కర్తాహ మితి మన్యతే*


అహంకారంవల్ల ఆత్మ స్వరూపం తెలియనివాడు ప్రకృతి చేత చేయబడుతున్న కర్మల్ని తానే చేస్తున్నానని అనుకుంటాడు. కాని తత్త్వం తెలిసినవాడు సత్త్వ, రజస్తమోగుణాలే ఆయా పనుల్ని చేయిస్తున్నాయి అని అనుకుంటాడు. తాను కర్తనని తలవడు. *అహం* కాని దానియందు *అహంకారం* అంటే. దానినే *దేహాత్మ భ్రాంతి* అంటారు. ఇది తొలగాలి. కర్మ పరిపక్వం కావాలి.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: