🚩🕉️ *హిందూ ఆధ్యాత్మిక వేదిక* 🕉️🚩
➖➖➖✍️
*ప్రాపంచిక విషయాల కోసం మనం భగవంతుణ్ణి ప్రార్థించకూడదు.*
ఒకవేళ వాటిని ఆయన మనకు ప్రసాదించినా, ఆ విషయాలు మనకు దుఃఖాలను కూడా తెచ్చిపెడతాయి. *
*భగవంతుడు కోరికలను తీర్చే కామధేనువు. అయితే వ్యక్తిగతమైన విజయాల కోసం, వాంఛల కోసం ఎన్నడూ ఆయనను ప్రార్థించరాదు. సంసార సాగరంలోనూ, మమతానురాగాల మహాసముద్రంలోనూ మునిగిపోకుండా ఉండేటట్లు రక్షించమని మాత్రమే భగవంతుణ్ణి అర్థించాలి. *
*సాధారణంగా మనం దుఃఖం కలుగుతున్నప్పుడు కూడా, శాశ్వతమైన ఆనందానికి మనల్ని చేర్చే భగవన్మార్గాన్ని వెతకకుండా, అర్థంపర్థం లేని కోరికలను ఏమాత్రం విడిచి పెట్టకుండా, ఆ దుఃఖాలలో సర్దుకుపోవడానికి సాధారణంగా ప్రయత్నిస్తూ ఉంటాం. *
*శారీరక సుఖాలకు అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడమే కాక వాటిని వదులుకోవడానికి ఏ మాత్రమూ అంగీకరించం. ఎదురు దెబ్బలు తప్ప మరేమీ దక్కకపోయినా రకరకాలైన ఆ సుఖాలను అంటిపెట్టుకునే ఉంటాం. *
*మాయ లేదా అజ్ఞానం యొక్క ప్రభావం అంత గొప్పది.*
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు!*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి