7, ఆగస్టు 2023, సోమవారం

ఎవరు వృద్ధులు

 *



ఏది ముసలితనం? ఎవరు వృద్ధులు.?* 🥰  *వార్ధక్యం వయసా నాస్తి* *మనసా నైవ తద్భవేత్‌* *సంతతోద్యమ శీలస్య* *నాస్తి వార్ధక్య పీడనమ్‌* ముసలితనం వయసులో లేదు, వయస్సుతో రాదు. మనస్సులోనూ ఉండకూడదు. ఎప్పుడూ పని చేసుకునేవానికి ముసలితనపు పీడ ఉండదని సుభాషితం. ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం, దుఃఖం వల్ల వచ్చేది భావజం. వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింపబడిన ముసలితనమే.  *70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి, అవయవాలు పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు.* _కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది_ *మానసిక వృద్ధాప్యం అంటే.. ‘నాకు ముసలితనం వచ్చేసింది’ అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానీయకూడదు.* ‘సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనం’ అన్న మాటలను గుర్తుపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకోవాలి *భారతీయ సంప్రదాయంలో జ్ఞానవార్దక్యాన్ని అంగీకరించారుగానీ వయో వార్ధక్యాన్ని కాదు.* నిత్యవ్యాయామం,యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం,సతతక్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం,మంచిమాటలు ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు. 🙏

Dondakaya


 

Rudram

Sri Rudra bhasyam 

Vote


 

Rama


 

Oc


 

గద్దర్

 గద్దర్..!


ఓ పువ్వు రాలిపోయే

ఓ‌ కొమ్మ‌ రాలిపోయే

ఓ‌ చెట్టు రాలిపోయే

ఎర్రని సింధూరమా...


అడవి తల్లడిల్లి

పల్లె ఏడిసినాది

ఊరు గొల్లుమంటూ

జనం కన్నీరాయే..


డప్పు మూగ బోయే

పాట ఆగి పోయే

ఆట లేక పోయే

మాట రాక పోయే..


స్వరం లేకపోయే

గజ్జె గొల్లుమనే

చేతి కర్ర జారే 

ఎర్ర పువ్వు బాసే.


ఏడున్నావు లచ్చుమమ్మా కొడుకా!

నేల వదిలి పోయినావురా..


తుపాకీ తూట వంటిలోన

నేల కోయిల స్వరమేమో

పదునెక్కిన గానమై

ఊరూరా పాడుతుంటే...


నా ఊరు నా వాడ

ప్రతి ఊరు చివరన

మొదలయ్యే పోరాటం

చెట్టు చేమ చేసే యుద్ధం...


నీ పాట పిలిచేను

నీ ఆట కదిలించేను

యుద్దనౌక నడిచేను

విప్లవ శంఖం వినిపించే.


జాతికొక వైరము

మనిషికొక ద్వేషము

మనిషిని మనిషిగా

చూసే గడియ వరకు

ఆగదీ పాట పోరాటం.


జనం గుండె చప్పుడై

త్యాగాల గుర్తువై

తిరగబడ్డ ప్రాణమై

గానమే గళమై

కష్టంలో ధైర్యమై

వెన్నంటి ఉంటావు...

చిరకాలం నీవు గద్దర్..


ఎర్రని సూరీడా

నీకు వందనం

పొద్దువాలిన సూరీడా

నీకు వందనం.


🙏🙏🙏🙏🙏


అశోక్ చక్రవర్తి. నీలకంఠం

వాస్తవం




 నానా చెత్తను చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కించి, వాస్తవం ఘటనలు చరిత్రలో లేకుండా ఎంతో జాగ్రత్త పడ్డ విషయం ఉప్పు పన్ను గోడ .........


1850నాటికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకొని మంచి పట్టు సాధించారు, వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ప్రజలకు అత్యవసరమైన #ఉప్పు మీద  పన్ను 1000% పెంచడం.


ఇలాంటి అసహజ/ అన్యాయమైన పన్ను ఎగ్గొట్టాడానికి స్థానిక వ్యాపారులు గుజరాత్, ఒరిస్సా  తీరప్రాంతాల్లో ఉప్పు తయారు చేసి (గట్లు కట్టి సముద్రపు నీరు అందులోకి తరలిస్తే ఉచితంగా ఉప్పు తయారైయేది) గంగా నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ రవాణా చెయ్యడం ప్రారంభించారు. తద్వారా బ్రిటిష్ వాళ్ళు విధించిన సుంకం ఎగ్గొట్టేవారు. ఈ అక్రమ రవాణా వ్యవహారం తెలుసుకున్న బ్రిటిష్ వాళ్ళు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు

 , స్థానికులకు బుద్ధి చెప్పడానికి , తాము విధించిన అన్యాయమైన సుంకం రాబట్టుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు 4000 వేల కిలోమీటర్ల మేర (పంజాబ్ నుంచి ఒరిస్సా వరకు) ఒక కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని 

ఇరవై అడుగుల ఎత్తు , పదిహేను అడుగుల వెడల్పు కంచె ఏర్పాటు చేసారు. 

కంచె ఎలాంటిది అంటే పెద్దపెద్ద చెట్లు, ముళ్ళ చెట్లతో ఎద్దుల బళ్ళు సంగతి పక్కన పెడితే మనుషులు కూడా దూరడానికి లేకుండా వుండేటట్టు కంచె, దాని పక్కనే కందకం కూడా తవ్వారు. ఈ కంచె నిర్మించిన ప్రాంతం దగ్గర ఇరవైనాలుగు గంటలు పదిహేను వేల మంది సైనికులు , అధికారులు గస్తీ తిరిగేవారు.


ఎవరైనా స్థానిక వ్యాపారస్తులు చెట్లు నరికి, కందకం పూడ్చి , తెగించి ఉప్పు అక్రమంగా రవాణా చేస్తే పట్టుకుని , నిర్బంధించి అధిక మొత్తంలో వారినుంచి జరిమానా వసూలు చెసేవారు


1900 ప్రాంతానికి ఉప్పు తయారీ, రవాణా , అమ్మకం మీద పూర్తి పట్టు బిగించారు బ్రిటిష్ వాళ్ళు. నెమ్మది నెమ్మదిగా కంచె నిర్వహణ పట్టించుకోవడం మానేశారు. కాలక్రమంలో రైతులు ఆ కంచెను తమ భూముల్లో కలుపుకుని వ్యవసాయం చేసుకోసాగారు. స్వాతంత్రం తరువాత మన ప్రభుత్వం కంచె వుండే ప్రాంతాల్లో రోడ్లు, కొన్ని ప్రాంతాల్లో రైల్వే లైన్లు నిర్మించింది. అలా ప్రసిద్ధి చెందిన భారతదేశపు 4000 కిలోమీటర్ల కంచె కాలగర్భంలో కలిసి పోయింది. ఇప్పుడు మచ్చుకు కూడా ఆ కంచె ఆనవాళ్లు మిగలలేదు. 

ఈ కంచె గురించి భారతదేశపు రికార్డ్స్ లో అతి తక్కువుగా రాయబడింది.ఇదెప్పుడో నూట పాతికేళ్ల ముందు జరిగిన విషయం.


ఇప్పుడు అసలు విషయం తెలుసుకుందాం. మీరు ఊహించగలరా ఏ బ్రిటిష్ ఆఫీసర్ ఉత్తర దక్షిణ ప్రాంతాలను వీడదీసి, నాలుగువేల కిలోమీటర్ల మేరే కంచె కట్టాలి అని ఐడియా ఇచ్చాడో?


ఇంకెవరో కాదు,

కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు 

A.O.Hume.


సుబ్రహ్మణ్యం వల్లూరి.

మాంగల్యం


 



మాంగల్యం.............!!

దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే మన హిందూ సోదరీమణుల నవీనత పరాకాష్టకి వెళ్లి మంగళసూత్రాన్ని త్యజించడం / లేదా పక్కనపెట్టడం పరిపాటిగా మారింది. అంతేకాక ఈ  సినిమాలు టీవీల పుణ్యమా అని అది ఒక ఆట వస్తువుగా మారిపోయింది. 

మన ఖర్మ కొద్దీ మన బంధు మిత్రగణాల నుండి వచ్చే వాట్సాప్ లు ఫేస్బుక్ లలో వచ్చే ఫోటోలు కూడా,  ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్టు, గాజులు లేకుండా ఉన్నవే. ఇది చాలా అరిష్టం.

క్షీరసాగరమధన సందర్భంలో మాంగళ్యవివరణ

“మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మ్రింగుమనే సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో.


పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవి గా ఉన్నడంటే అది ఆయన గొప్ప కాదట, అమ్మ పార్వతీ దేవి కంఠాన్న ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట.


“మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాంశతం”


ఓ సుభగా! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు, అంటే పుణ్యస్త్రీగా, ముత్తయిదువుగా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టముగా తెలుస్తున్నది.


పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి.


భారతావనిలో పిండారీలు, థగ్గులు వంటి కిరాత జాతులవారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొనిపోయేవారు. మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచిపెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం. అందుకే అప్పటినుండీ ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు.


ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన సౌందర్యలహరి పుస్తకములో కూడా మంగళ సూత్రానికి విశేష విశిష్టత కల్పించారు.


మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకంటే, ముత్యం చంద్రగ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్యదాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు.


పగడం కుజగ్రహనికి ప్రతీక. కుజగ్రహ దోషాల వలన అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పరదూషణ, కామవాంఛలు, దీర్ఘసౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతుదోషములు మొదలగునవి.


ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారంగావించి 28వ రోజున

కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతుసమయం. అంటే అర్ధం, ఆరోగ్యమైన స్త్రీకి 28వ రోజులకు ఋతుదర్శనమవాలి.


భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళసూత్రములో ముత్యం మించిన విలువైనది లేనేలేదు, దానికి తోడు జాతిపగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది.

అదేమిటంటే ముత్యం పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం. కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం సర్వ సాధారణమైపోయింది.


ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీకేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం వలదు.


కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభఫలితాలు సమకూర్చగలవు.


*పాశ్చాత్య అనుకరణ వెర్రిలో ఊగుతున్న మన ఆడ కూతుర్లను మందలించైనా తిరిగి మన ధర్మం వైపు తీసుకుని వద్దాం. దీని విశిష్టతని అర్ధం అయ్యే వరకు తెలియపరుద్దాం.*

అళసింగ పెరుమాళ్?

 పుస్తకాల్లో కనపడని పుణ్యాత్ములు 



మనదేశం , ధర్మం , సంస్కృతి మీద వెకిలి కామెంట్లు చేసే అమీర్ ఖాన్ , ప్రకాష్ రాజ్ , కమల్ హాసన్ లాంటి వాళ్ళు మనకు బాగా తెలుసు కానీ , దేశం , ధర్మం కోసం కుటుంబాలు , ఆస్తిపాస్తుల్ని వదిలేసుకొన్న అళసింగ పెరుమాళ్ గురించి మనకు తెలియదు. [ క్రింద ఫోటో చూడండి] 


ఎవరు ఈ అళసింగ పెరుమాళ్? 


1865 లో మైసూరు ప్రాంతానికి చెందిన చిక్కమంగళూరు లో వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి , మద్రాసులో చదువుకొన్న ఈయన స్వామీ వివేకానంద జీవితానికి , బోధనలకు విశేషంగా ప్రభావితం అయ్యారు. 1892 డిశెంబరు లో స్వామీజీ మద్రాసు వచ్చినప్పుడు , వారిని కలిసి త్వరలో అమెరికా లోని షికాగో మహానగరంలో '' విశ్వమత మహా సభ '' [ World Parliament of Religions ] జరగబోతున్నదని , మన సనాతన ధర్మం , భారతజాతి , నాగరికత , సంస్కృతి ఎంత గొప్పవో , మానవాళికి ఎంత మేలు చేస్తాయో చెప్పడానికి అది మంచి వేదిక అని చెప్పి , అమెరికా వెళ్లేందుకు కావాల్సిన డబ్బుకు తాను , తన స్నేహితులు కూడా విరాళాలు సేకరిస్తామని అన్నారు. అలాగే సేకరించి స్వామీజీకి పంపించారు. 


1893 మే 31 న ముంబాయి నుండి బయలుదేరి స్వామీ వివేకానంద అమెరికా చేరాక , జూలై 30 న షికాగోలో అడుగుపెట్టారు. అక్కడ ఆయన్ని పట్టించుకొనేవాళ్ళు ఎవ్వరూ లేరు. తనదగ్గరున్న డబ్బు తక్కువే కాబట్టి , రోజూ తిండి కొనుక్కొని తింటుంటే అది అయిపోతుందని తెలిసి రెండు , మూడు రోజులకు ఒకసారి మాత్రమే స్వామీజీ భోజనం చేసేవారట. అలా చేసినా వున్న డబ్బు అయిపోతోంది. అపుడు స్వామీజీ అళసింగ పెరుమాళ్ కు టెలిగ్రాం పంపారట. అమెరికాలో స్వామీజీ పడుతున్న కష్టం అర్థం అయ్యి పెరుమాళ్ చాలా బాధ పడ్డారు. అపుడు ఆయన మద్రాసులో కొన్ని రోజులు , చిక్కమంగళూరులో కొన్ని రోజులు ఇంటీంటికీ వెళ్ళి భిక్షాటన చేసి కొంత డబ్బు సేకరించారు. ఆరోజుల్లో వూళ్ళో బావి నుండి నీళ్ళు చేదుకొని ధనవంతుల ఇళ్ళకు ఇస్తే డబ్బులు ఇచ్చేవారు. అది కూడా చేసాడు పెరుమాళ్. అప్పటీకే అతనికి పెళ్ళి అయ్యివుంటుంది. భర్త ఉదయం నుండి మధ్యాహ్నం దాకా బావి నుండి నీళ్ళు తోడి , సాయంత్రం మళ్ళీ ఇంటింటికి వెళ్లి డబ్బులు భిక్షం అడగడాన్ని చూసి చాలా బాధ పడిన భార్య మంగమ్మ , తన పుట్టింటివారు ఇచ్చిన నగల్లో ఒక్క తాళిబొట్టును మాత్రమే వుంచుకొని తక్కినవన్నీ ఇచ్చేసి , '' మీరు వీటిని అమ్మి , ఆ డబ్బును స్వామీజీకి పంపండి '' అని భర్త తో అన్నదట. కళ్ళ నీళ్ళు తిరుగుతుండగా పెరుమాళ్ అలానే చేసి , డబ్బును స్వామీజీకి మనీ ఆర్డర్ ద్వారా పంపారట. 


1893 విశ్వమత మహాసభ లో ప్రసంగించి అంత వరకూ ప్రపంచ దేశాలకు , మేధావులకూ భారత్ అంటే అనాగరికమైనదని , పాములు పట్టుకొని ఆడించే జాతి అని వున్న నీచ అభిప్రాయాన్ని పటాపంచలు చేసి భారత్ ను విశ్వగురువు స్థానంలో నిలిపిన స్వామీ వివేకానందుల బ్రహ్మాండమైన విజయం వెనుక కర్ణాటకకు చెందిన ఇద్దరు పేద చిక్కమంగళూరు బ్రాహ్మణ దంపతుల త్యాగం కూడా వుందని ఎందరికి తెలుసు ? 


చరిత్ర గుర్తించని చరితార్థులు ఎందరో ! 

పుస్తకాల్లో కనపడని పుణ్యాత్ములు ఇంకెందరో !

మరుగున పడిపోయిన మహానుభావులు మరెందరో !

ఏకాదశపాఠః* *11*

 *సంస్కృత భారతీ*

    *ఏకాదశపాఠః*

            *11*

ప్రణిధిః = బాటసారి, మార్గం/సరణి = దారి, గ్రామం = ఊరు, గృహం = ఇల్లు, యానం/ వాహనం/ శకటం = వాహనము, పద్భ్యాం / పాదగమనం = కాలినడక, చలనం= కదులుట, భ్రమణం = తిరుగుట, గమనం = వెడలుట, ద్విచక్ర వాహనం/ ద్విచక్రికా = ద్విచక్ర వాహనం,ఇలాగే చతుశ్చక్రికా,బహుచక్రికా...లను కూడా అనువర్తించుకొనవచ్చు. యాంత్రిక శకటం/ యాంత్రిక వాహనం = మోటారు వాహనం, తైల యాంత్రిక శకటం = నూనె (పెట్రోలు వంటి) తో నడిచే మోటారు వాహనం, మృత్తికా తైలం = మట్టి నూనె (పెట్రోలు), జవం = శక్తి, వేగం = వేగము, విద్యుద్వాహనం = విద్యుత్ చేత నడిచే వాహనం, 

*నూతన గ్రామప్రవేశ సంభాషణం*

*ప్రణిధిః*:-- భోః అత్ర  రామాలయం కుత్రాస్తీతి వక్తుం శక్యతే వా?( అయ్యా, ఇక్కడ రామాలయం ఎక్కడ ఉన్నదో చెప్పగలరా?)

*సమాధానం*:-- సంతోషేన వక్తుం శక్నోమి భోః. అత్రతః పూర్వదిశే శతపదం గత్వా దక్షిణే వింశతి పదం గఛ్ఛన్తు భోః తత్ర అయమేవ ప్రశ్నం కమపి పృఛ్ఛన్తు,తే వదిష్యన్తి.(సంతోషంగా చెప్పగలనండీ. ఇక్కడి నుండి తూర్పు దిశలో వంద అడుగులు వెళ్ళి దక్షిణమునకు ఇరవై అడుగుల దూరం వెళ్ళి ఇదే ప్రశ్న ఎవరినైనా అడగండి,వారు చెప్పుదురు.)

*ప్ర*:-- ధన్యవాదాః.

స ప్రణిధిః తథా గత్వా  అర్చకం పృఛ్ఛతి...(ఆ బాటసారి ఆ విధంగా వెళ్ళి అర్చకుని అడుగుచున్నాడు.)

*ప్ర*:-- భోః భవతః నామం కిం??

*అర్చకః*:-- చతుస్సాగరపర్యన్తం గోబ్రాహ్మణేభ్యశ్శుభం భవతు కాశ్యపావత్సారనైధృవత్ర్యాఋషేయప్రవరాన్విత కాశ్యపసగోత్రః యజుశ్శాఖాధ్యాయీ ఆపస్తంబ సూత్రః శ్రీ రామశర్మాహంభో అభివాదయే ఇత్యుక్తవన్తః యతః స ప్రణిధిః అర్చకస్య గురురిత్యవగతం తమ్.  (అర్చకులు ప్రవరతో వారి పేరు శ్రీ రామ శర్మ అని పలికెను. ఎందుకంటే ఆ బాటసారి తన గురువని అర్ధం అయినది వారి కి).

*ప్ర*:-- హే శ్రీ రామ శర్మ వర్ధస్వ.(ఓ శ్రీ రామ శర్మా వర్థిల్లుము.) సర్వైః సకలైః కుశలైర్వా?? అహం ఏక వేదశాస్త్రసదస్యార్థం ఆగతవాన్. మహ్యం స్నాతుం తటాకం దర్శయ. తథాస్థాతుంనివాసం చ వ్యవస్థయ.(నేను ఒక వేదశాస్త్ర సదస్యమునకై వచ్చాను. నాకు స్నానం చేయుటకు చెరువు చూపుము. అలాగే ఉండుటకు నివాసం కూడా ఏర్పరచుము.)

*అ*:-- ఆమ్ భోః.అవశ్యం.(అలాగే ఆర్యా.తప్పకుండా.),

*ప్రణిధిః*:-- (స్నానాది నిత్య కృత్యానంతరమ్ = స్నానాది నిత్య కృత్యాలు ముగించిన తర్వాత) హే శ్రీ రామ! అహం సదస్యార్థం పద్భ్యాం గఛ్ఛామి( ఓ శ్రీ రామ! నేను సదస్యానికి నడచి వెళ్తాను)

*అ*:-- మాస్తు మహాశయ! సదస్యకేంద్రం బహుదూరమస్తి, భవతః శ్రమా భవేత్, అహం తైల యాంత్రికయానే నేష్యామి(వద్దు మహాశయా! సదస్యకేంద్రం చాలా దూరంలో ఉంది. మీకు శ్రమ కలుగుతుంది, నేను పెట్రోమోటర్ వాహనం పై తీసుకుని వెళ్ళెదను.

*ప్రణిధిః*:-- నావశ్యకం వత్సా! మహ్యం జవమస్తి(అవసరం లేదు బాలకా! నాకు శక్తి ఉంది).

 అంతే గురురనుజ్ఞయా శ్రీ రామః తస్య వాహనే నీతవాన్ సదస్యకేంద్రపర్యన్తమ్.(చివరకు గురువు ను ఒప్పందం తో శ్రీ రాముడు ఆతని వాహనం పై సదస్యకేంద్రానికి తీసుకుని వెళ్ళాడు.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

దశమ పాఠః* *10*

 *సంస్కృత భారతీ*

      *దశమ పాఠః*

              *10*

*భోజనాలయ సంభాషణం*

అన్నం/ఓదనం = అన్నము, పాయసం = పరమాన్నము, భక్ష్యం = పిండి వంటకం(నమిలి తినేది), భోజ్యం =సాధారణంగా తినగలిగినది, లేహ్యం/వ్యంజనం = పచ్చడి(నాకుతూతినగలిగేది), చోష్యం = పులుసు(పీల్చుతూ తినగలిగేది), ఘృతం/సర్పిః = నెయ్యి, శాకం = కూర, రసం = చారు, అపూపం = అప్పచ్చి,  తైలాపూపం/ తైలపక్వం  = నూనె లో వేచిన వంటకం, తక్రం = మజ్జిగ, దధి = పెరుగు, సూపం = పప్పు, పానీయం = త్రాగగలిగే పదార్థం, అల్పాహారం = స్వల్ప భోజనం(టిఫిన్), లవణం = ఉప్పు మధు = తేనె, శర్కరా = పంచదార, గుడం = బెల్లం, నవనీతం = వెన్న,ఖండ శర్కరా = పటికబెల్లం, తైలం= నూనె

****

పరివేషయ(తు) = వడ్డించుము, స్థాపయ(తు) = ఉంచుము, అలం = చాలు, వాంఛితం / ఈప్సితం = కావలెను. పరివేషయన్తు = వడ్డించండి, స్థాపయన్తు = ఉంచండి,

*ప్రయోగ విభాగః*

భోజనార్థం/ అశనార్థం భోజనశాలాయామ్ సర్వే ఆగఛ్ఛన్తు = భోజనం చేయుటకు భోజనశాల కు అందరూ దయచేయండి(రండి),

భోజన పత్రం జలేన ప్రక్షాలయన్తు = భోజనపత్రాలను నీటి తో కడుగండి. 

ప్రథమతః స్థాపిత భోజన పాత్రేషు ఘృతేన అభిఘారయన్తు = ముందుగా ఉంచిన భోజన పాత్రలపై నేతితో అభిఘారం చేయండి.

తతః అన్నం,పాయసం, భక్ష్యం,ఘృతం, వ్యంజనాదికాని పరివేషయన్తు = తర్వాత అన్న ము,పాయసము, భక్ష్యం, నెయ్యి, పచ్చళ్ళు మొదలైన వి వడ్డించండి.

అంతే పునరభిఘారం ఘృతేన కుర్వన్తు = చివరగా నేతితో మరలా అభిఘారం చేయండి.

అధునా సర్వైః గోవింద నామముక్త్వా పరిషేచనం కృత్వా భోజనారంభం కుర్వన్తు = ఇప్పుడు అందరూ గోవింద నామం జపిస్తూ పరిషేచనం చేసి భోజనం ప్రారంభించండి.

*ఏకభోక్తః*(ఒక భోజనం చేయువాడు):-- మహ్యం పాతుం తాపోదకం వాంఛితం(అవశ్యం) = నాకు త్రాగుటకు వేడినీరు కావాలి (అవసరం).

*అన్యః ఏక భోక్త*:-- ముద్గసూపం బహు(బృహత్) సమీచీనమస్తి = పెసరపప్పు చాలా బాగుంది.

*అన్యః ఏకభోక్త*:-- మమ చోష్యం పరివేషయన్తు భోః = నాకు పులుసు(సాంబారు) వడ్డించండి, తతః కించిత్ పరివేషణానంతరం(తర్వాత కొంత వడ్డించిన తర్వాత) = అలమలం మహాశయా అహం హస్తిర్నాస్మి , మనుష్య ఏవ( చాలు చాలు మహానుభావా నేను ఏనుగు ను కాదు మనిషినే)...... అంతే తాంబూలం స్వీకృత్య గఛ్ఛన్తు సర్వే = చివరకు తాంబూలం తీసుకుని వెళ్ళండి అందరూ.

*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

నిత్య పంచాంగం



ఆకెళ్ళ ఫౌండేషన్ వారి నిత్య పంచాంగం ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః


ఓం గోవిందాయ నమః


ఓం శ్రీ గురుభ్యోనమః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే। వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః | అంగుష్ఠతర్జనీ యోగముద్రా వ్యాజేనయోగినామ్ | శృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శక తిః case


ఓం శాంతిః శాంతిః ఆగష్టు 8, 2023 మంగళవారం (భౌమ్యవాసరే) శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం - వర్ష ఋతువు తో వణ మాసం - బహళ పక్షం తిథి:సప్తమి ఉ9.41 వరకు 14344 44344 ఆకెళ అధిక


WWW నక్షత్రం:అశ్విని ఉ7.22 వరకు యోగం:గండ రా11.02 వరం ఉ9.41 వరకు తదుపరి బాలువ 09.07 వరకు సూర్యరాశి: కర్కాటకం చంద్రరాశి : మేషం సూర్యోదయం: 5.44 సూర్యాస్తమయం: 6.28 రాహుకాలం: మ3.00 - 4.30 వర్జ్యం: సా4.47 - 6.22 యమగండ/కేతుకాలం:ఉ9.00 - 10.30 - అమృతకాలం: రా8.13 - 9,473


-143 సర్వే భవన్తు సుఖినః సర్వే సన్తు నిరామయాః సర్వే భద్రాణి పశ్యన్తు మా కశ్చిత్ దుఃఖభాగ్భవేత్|


Panchang


 

Siva Temple

Siva Temple in hyderabad 

Bharath

 Bharath before british

Photo



































 

07-08-2023* *రాశి ఫలితాలు*

 *07-08-2023*

  *రాశి ఫలితాలు*

*మేషం*

బంధువులతో  తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. దైవదర్శనాలు  చేసుకుంటారు. చేపట్టిన  పనులో ప్రతిష్టంభనలు  కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు   నిర్ణయాలు తీసుకోక పోవడం మంచిది.  మానసిక ఒత్తిడి పెరుగుతుంది. 

*వృషభం*

నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. దూర ప్రాంత మిత్రుల నుండి  విలువైన విషయాలు సేకరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూల  వాతావరణం ఉంటుంది.   సమాజంలో గౌరవ మర్యాదలుకు లోటు ఉండదు. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. 

*మిధునం*

స్థిరాస్తి కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో  విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులలో  అప్రయత్నంగా పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి.

*కర్కాటకం*

ధన పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. దూర ప్రయాణాలు లో శ్రమాధిక్యత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సోదరులతో ఊహించని  వివాదాలు కలుగుతాయి. ఉద్యోగమున  బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించలేక  అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. 

*సింహం*

దూర ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో  పూర్తికావు. వృత్తి వ్యాపారాలలో ఊహించని ఇబ్బందులు కలుగుతాయి.   ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా   సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

*కన్య*

పాత మిత్రుల ఆగమనం  ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన విద్య ఉద్యోగ   అవకాశాలు లభిస్తాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.  వృత్తి  ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

*తుల*

చేపట్టిన  వ్యవహారాలలో విజయం సాదిస్తారు. కుటుంబసభ్యులు సలహాలు కొన్ని విషయాల్లో కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు  సఫలమవుతాయి. స్ధిరాస్తి   సంభందిత   క్రయవిక్రయాలలో లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగమున  ఉన్నతి  కలుగుతుంది.

*వృశ్చికం*

ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. కుటుంబ పెద్దల  అనారోగ్య సమస్యలు  బాధిస్తాయి. ధన పరంగా తొందరపడి ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా సాగుతాయి. ఉద్యోగమున సమస్యలు కలుగుతాయి. 

*ధనస్సు*

ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. అకారణంగా బంధువులతో వివాదాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో స్వంత  ఆలోచనలు కలసిరావు.   కొందరి మాటల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపారాలలో భాగస్వాములతో మాటపట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు అధిక శ్రమతో కాని ఫలితం అందదు. 

*మకరం*

బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ముఖ్యమైన  వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గృహమున వివాహాది  శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వాహన  భూ లాభాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు.

*కుంభం*

చేపట్టిన పనుల్లో ప్రతిష్టంభన కలుగుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శ్రమతో కూడిన  దూరప్రయాణాలు చేయవలసి వస్తుంది.  కుటుంబ సభ్యులతో ఊహించని   విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.  వృత్తి, వ్యాపారాలు నిదానంగా  సాగుతాయి.

*మీనం*

దాయాదులతో స్ధిరాస్తి  వివాదాల పరిష్కారం అవుతాయి. శుభకార్యాల కొరకు ధనం ఖర్చు చేస్తారు. సంఘంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది. అనుకున్న పనులలో కార్యసిద్ధి  కలుగుతుంది.   ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు  పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు  అధిగమిస్తారు.

🕉️

పరమేశ్వరుని లీలామృతం*

 *అందుగలడు ఇందు లేడని సందేహము వలదు ఎందెందు వెతికినా అన్నింటా నువ్వే కదయ్యా శివయ్య*



*ఈ వీడియోను అందరూ చివరి వరకు చూడండి*


 *తమిళనాడులో పుదుచ్చేరి దగ్గర పల్లెటూరిలో శివాలయము నందు అన్నదాన కార్యక్రమం లో వంట గ్యాస్ అయిపోయినది*


*ఈ పల్లెటూరు నందు ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తుండగా ఆ పరమేశ్వరుడే ఈ కార్యక్రమం జరిపించాలి అని స్వామివారిని వేడుకొన్నారు ఒక్క ఊరు నందు సిలిండర్ తీసుకునే వద్దాం అని సిలిండర్ నుండి రెగ్యులేటర్ తీసివేసిన స్టవ్ అలాగే మండుతూ ప్రసాదం అవ్వేంత వరకు స్టవ్ యందు మంటలు వస్తునే ఉన్నది పరమేశ్వరుని లీలామృతం*

*ప్రసన్న కుమార్*


*🔱 హర హర మహాదేవ్ 🔱*

   *శివోహం*

 *అంతా శివమయం*


*🚩 ఛత్రపతి శివాజీ మహరాజ్ యువ సేన ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ 🚩*

పీఠాధిపతులు

 పీఠాధిపతులు.. వారిని... భక్తులను ఎందుకు తాకనివ్వరు.....


ఈమధ్య చాలా మందికి నన్ను ఈ ప్రశ్న అడిగారు...


అసలు ఈ పీఠాలు, మఠాలు గురించి మనకు పూర్తి అవగాహన ఉందా.. అక్కడ పీఠాలకు సంరక్షుకులుగా ఉండే ఈ పీఠాధిపతులకు ఉన్న నియమ నిబంధనలు ఏమిటో మనకు తెలుసా.. పూర్తిగా వివరాలు తెలియకుండా వారి మీద ఎగబడి పోయి వాళ్ళను ఇబ్బంది పెట్టడం భావ్యమా.. వారి నిబంధనలు చెబితే ఎక్కడలేని మానవహక్కులు గుర్తుకొస్తాయే.. వాళ్లకు వాళ్ళ నియమపాలన ఉండదా.. వాళ్లకు ఎలా ఉండాలో అనే హక్కు వారికి లేదా..


అంతవరకు ఎందుకు.. ఎందుకు కొరగాని తైతక్కలాడే సినిమా స్టార్ల దగ్గరకు మిమ్మల్ని రానిస్తారా..? వాళ్ళను ముట్టుకోలేదని మీలో ఎవరైనా గోల పెడతారా..? అక్కడొక రూలు ఇక్కడొక రూలా..? వారికి వీరికి అసలు సాపత్యమే లేదు కానీ జనాల మధ్యకు వచ్చారు కాబట్టి ఈ ప్రస్తావన వచ్చింది. అసలు ఈ పీఠ నిబంధనలు, పీఠాధిపతుల వ్యవహారాల గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నించి అప్పుడు ఆలోచన చేయండి.


"భారతీ విజయం" అన్న పుస్తకంలో దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధిపతి, జీవన్ముక్తులు అయిన శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ స్వామీ వారి దైనందిన దినచర్య గురించి వివరణ ఉంటుంది. ఉదయాన్నే స్వామీ వారు నాలుగు గంటలకు లేచి స్నాన సంధ్యాదులు ఆచరించి, జపతపాదులు ఆచరించి 8 గంటలకు అనుష్టానం చేసుకుని శ్రీ చంద్ర మౌళీశ్వరుని పూజ చేసుకుని గురువుల అధిష్టానాలు దర్శించుకుని వచ్చి విద్యార్థులకు పాఠం చెప్పి మఠ వ్యవహారాలూ సమీక్షించి 11 గంటలకు భక్తులకు దర్శనం అనుగ్రహించి వారి సమస్యలకు సలహాలు ఇచ్చి భక్తుల పాదపూజలు, భిక్ష స్వీకరించి తిరిగి 1 గంటకు మరల స్నానం చేసి మాధ్యాహ్నిక అనుష్టానం చేసుకుని భిక్ష స్వీకరించి సాయంత్రం 4:30 వరకు విద్వంశులతో శాస్త్రచర్చలు జరిపి అటుపై కార్యదర్శి తెచ్చిన ఉత్తరాలు పరిశీలించి వాటికి సమాధానాలు చెప్పి సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు తిరిగి భక్తులకు దర్శనం ఇచ్చి మరల స్నానం, అనుష్టానం అటుపై 8:30 నుండి 10 వరకు శ్రీ చంద్రమౌళీశ్వర పూజ, 11:30 వరకు శాస్త్రగ్రంథావలోకనం చేసి విశ్రమిస్తారు, మరల మరునాడు 4 గంటలకు లేవడం. అక్కడ నుండి తదుపరి దినచర్య మల్లి మాములె..


ఇంత ఒత్తిడి మామూలు వాళ్ళు తట్టుకోగలరా.. ఇంక పర్వదినాలలో మరింత ఒత్తిడి.


అటువంటి శక్తివంతమైన అనుష్టానాలు చేసుకునే స్వాములు విజయ యాత్రలు చేస్తుంటే మరింత ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వాటిని తట్టుకుని నిత్యం దైవనామస్మరణతో ఆత్మానుసంధానం చేస్తూ నడుస్తూ ఉంటారు. వారు నడిచే ధర్మస్వరూపాలు. అటువంటి శక్తిని కలిగి నడుస్తున్న వారిని తాకాలంటే మనకు అంత శక్తి ఉండాలి, లేదంటే మనకే కష్టం. అందునా వారి అనుష్టానం చేసుకునేటప్పుడు ఒక మడి, ఒక శౌచం, ఒక నియమం ఇలా ఎన్నో ఉంటాయి. మరి.. మనము ఎంత శౌచం పాటిస్తున్నాము..?


ఉదాహరణకు.. మనం బయట తిరిగేటప్పుడు ఎందరినో తాకుతూ తిరుగుతున్నాము ఎవరికి ఎటువంటి శౌచాలున్నాయో ఏమేమి ముట్లు ఉన్నాయో, మనకు తెలియదు, అటువంటి వాళ్ళం మనం వెళ్లి వారిని తాకడం వలన వారు తమ బస చేరుకున్నప్పుడు ప్రాయశ్చిత్తాలు చేసుకుని తిరిగి ఎన్నో అనుష్టానాలు చెయ్య వలసి వస్తుంది. వారిని అంత బాధ పెట్టడం మనకు భావ్యమా..? వారికి దూరంగానే సాష్టాంగ పడి వారి అనుగ్రహం పొందాలి. వారి పాదాలకు ప్రతినిధులుగా వారి పాదరక్షలు అక్కడ ఉంచితే వాటిని తాకి అనుగ్రహం పొందవచ్చు.


పీఠాధిపతులు నడిచే ధర్మ ప్రతినిధులు. ప్రతీ రోజూ జరిగే గొడవల్లో వారెందుకు పట్టించుకోరు అని మరికొందరు అజ్ఞానుల అపోహ...


వారు చేస్తున్న ధర్మానుష్టానం వల్లనైనా ధర్మం నేడు కొంతైనా నిలుస్తోంది. వారు ఎందరో మెరికల్లాంటి ధర్మ రక్షకులను తయారు చేస్తూ ఉంటారు. జగత్తులో ఎవరికైనా ధర్మ సంకటం కలిగితే వారు వారి అనుమానాలు తీరుస్తూ ఉంటారు. నిత్యం జరిగే విషయాలను సరిదిద్దే వారెందరినో వారు తయారు చేస్తూ ఉంటారు.


వారి తపః శక్తి, వాక్శక్తి భక్తులను అనుగ్రహించడానికి ధారపోస్తూ ఉంటారు. రోజువారీ గొడవల్లో పడి ఉంటే మరి ధర్మం పాటించే వారికి అనుమాన నివృత్తి ఎవరు చేస్తూ ఉంటారు, ఎవరు తపస్సు చేస్తూ శాస్త్రాలను పరిశీలిస్తూ, ధార్మిక కార్యక్రమాలు చేస్తూ, తరువాతి తరానికి వేదం, వేదాంగాలు, పురాణేతిహాసాలలో రహస్యాలను విప్పి చెప్పేవారు ఇతర ధార్మిక వ్యవహారాల సంగతి ఎవరు చూస్తారు..?


కాబట్టి వారు ధర్మ రక్షణ కు కావలసిన రచన చేస్తూ శిష్యుల ద్వారా కాగల కార్యాన్ని చేయిస్తూ ఉంటారు. వారు స్వయంగా జీవన్ముక్తులైనా కేవలం ధర్మాన్ని అందరికీ అందజెయ్యడానికి, మోక్షార్థులకు దారి చూపడానికి మన మధ్య నడయాడుతున్నారు. వారు స్వయంగా ఆ దైవ ప్రతినిధులు. వారికి ఇవ్వవలసిన గౌరవం ఇచ్చి వారు చూపిన దారిలో నడవడం మన కర్తవ్యం.


ముఖ్య గమనిక: ఇవన్నీ కూడా సరైన గురుపరంపర ఉండి కొన్ని వేల సంవత్సరాల నుండి నడుస్తున్న గొప్ప పీఠాల గురించి, ఆయా పీఠ అనుబంధ పీఠాల గురించి. అంతే తప్ప స్వయం ప్రకటిత దొంగ స్వాములు, సొంత పీట వేసుకుని వాళ్ళు పీటాధిపతులని ప్రచారాలు చేసుకుంటూ జనాలను కౌగలించుకుని ముద్దులు పెట్టె మోసగాళ్లకు సంబంధించి కాదని మనవి...


|| ఓం నమః శివాయ ||

భారతీయత

 👉 *నీతికథలు* 👈


*ఇదీ మన భారతీయత!*

        ➖➖➖


భగవంతుడిని షోడశోపచారాలతో పూజించిన తర్వాత, క్షమాపణ వేడు కోవడంలో ఆంతర్యం ఏమిటని నన్ను ఒకరు ప్రశ్నించారు. 


ఇందుకు సమాధానం నాకు హిందూ ఆచారాలలోనే లభించింది.


లండన్ లో వుంటున్న ఒక ప్రవాస భారతీయుడు తన తండ్రిని భారత దేశం నుంచి లండన్ సందర్శనకు పిలిపించుకున్నాడు. 


తండ్రిని వెంటబెట్టుకుని లండన్ లో వివిధ నగరాలను సందర్శించే సమయంలో, అతనికి పరిచయమున్న లండన్ మిత్రుడు వీరిద్దరినీ తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. 


మిత్రుడి ఇంటికి వెళుతున్నప్పుడే అక్కడి మర్యాదల గురించి చెబుతూ “భోజనం చేసిన పిమ్మట, ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పడం ఇక్కడి మర్యాద!” అని తండ్రికి కుమారుడు వివరించాడు. 


ఆ విధంగానే ఆతిథ్యం ఇచ్చిన మిత్రుడికి వారు ధన్యవాదాలు చెప్పారు. అందుకు “వెల్ కమ్ సర్, ఇటీజ్ మై ప్లెజర్” అని లండన్ మిత్రుడు తన పద్ధతిలో స్పందించాడు. 


కొంత కాలానికి ప్రవాస భారతీయుడు తన లండన్ మిత్రుడిని వెంటబెట్టు కుని భారతదేశాన్ని చూపించడానికి తీసుకువచ్చాడు. 


మిత్రుడికి విడిది, విందు, తమ వసతి గృహంలోనే ఏర్పాటు చేసాడు. 


పర్యటన అనంతరం మిత్రుని సాగనంపుతున్న సమయంలో, ప్రవాస భారతీయుడి తండ్రి చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ మిత్రుడికి ధన్యవాదాలు తెలిపారు. “మీరు మా ఇంటికి రావడం, మా ఆతిథ్యాన్ని స్వీక రించడం మాకు ఎంతో ఆనంద దాయకం! 'అతిథి దేవోభవ'అని మేము నమ్ముతాం, అంచేత మేం మీకు ఋణ పడివున్నాం. ఏమైనా పొరబాట్లు వుంటే మన్నించగలరు!” అని తండ్రి చెప్పిన మాటలకు లండన్ మిత్రుడు ఆశ్చర్యపోయాడు. 


పుచ్చుకున్న వాడు, ఇచ్చిన వాడికి థ్యాంక్స్ చెప్పడం పాశ్చాత్య నాగరికత! 


ఇచ్చిన వాడే పుచ్చుకున్న వాడికి ధన్యవాదాలు చెప్పడం భారతీయ సంస్కృతి! 


భగవంతునిపట్ల కూడా ఈవిధంగానే స్పందిస్తాము. 


షోడశోపచారాలతో పూజించి, మనకు చేతనైనంత భగవంతునికే సమర్పించి, చివరగా ఈ ఉపచారాలతో ఏమైనా లోపం వుంటే క్షమించమని వేడుకుంటాం. 


ఇది మన హిందూ ధర్మంలో ఒక అనిర్వచనీయమైన ఆచారం!


ఇదే మన భారతీయత.


 *మన ఆచారాలను సాంప్రదాయాలను మనం కాపాడుకుందాం* 


🙌సర్వేజనాః సుఖినోభవంతు 🙌

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -11🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹*🌹

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -11🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*ఆదుకున్న ఆవుదూడలు:*


అందము చిందే ఆవు రూపము ధరించాడు బ్రహ్మదేవుడు. సొగసులు మెరిపించే దూడ రూపము ధరించాడు శంకరుడు.


 లక్ష్మీదేవి సరేసరి! అచ్చు గొల్లభామగా మారిపోయినది. 


చంద్రగిరిని చోళరాజు పాలిస్తుండేవాడు. ఆ చోళరాజు చెంతకు ఆ యావునూ దూడనూ తోలుకొని గొల్లభామ రూపము ధరించిన లక్ష్మీదేవి వెడలినది. 


చోళరాజునకూ, ఆయన భార్యకూ వానిని చూపించినది. సర్వశుభ లక్షణాలతో విలసిల్లి పుష్టిగా ఉత్సహంగానున్న యావుదూడలను చూచి చూడడముతోనే వారికి అవి నచ్చినవి. గొల్లభామ వద్ద వాటిని కొన్నారు. 


భలే ‘మంచి బేరము’ అనుట తోడనే గొల్లభామ మెల్లమెల్లగా తన దారిన తాను వెడలిపోయినది.


 చోళరాజు భార్యకు ఒక క్రొత్త కోరిక చిగురించింది. భర్తతో అన్నది గదా! ‘‘నాథా మన ఆవులమందలో ననేకము లయిన ఆవులున్నవి. కాని ఈ ఆవుపాలే ప్రతిదినము పోయబడునట్లుగా మీరు చూడవలెను. చూడవలెనను మాట ఏల చేయవలెను’’ 


భర్త దాని కిష్టపడి పశువుల కాపరిని పిలచి ‘‘ఓయీ! నీవు ఈ గోవును కన్నులందు బెట్టుకొని కాపాడుచూ దీని పోషణ, రక్షణ మున్నగునవి చూచుచుండవలెను. 


జాగ్రత్తగా దీనిని పెంచడమే కాదు. ప్రతిదినము దీని పాలను జాగ్రత్తగా పితుకుతూ మాకిచ్చుచుండవలెను’’యనెను. 


సరేయని బుర్రనూపెను గోపాలుడు. తన మందకు నాటి నుండి దానిని జోడించి మేతకు తోలుకొనిపోవుట, తీసుకొని వచ్చుట చేయుచుండెను. అతడు ప్రతిదినము మందను శేషాచలమునకే తోలుకువెళ్ళుచుండెడివాడు. 


మిగిలిన పశువులు మేతను మేయుచుండగా, క్రొత్తగా వచ్చిన ఆవు మేత మేయుచుండెడిది కాదు. నిజమునకది పశువు కాదు కదా! మందతో పాటు వెళ్ళినప్పటికిన్నీ, 


రహస్యముగా ఆ యావుపోయి శ్రీమహావిష్ణువు తలదాచుకొనిన పుట్టను చేరుచుండెడిది. చేరి ఆ పుట్టలో క్షీరధారలను కురిపించి, అప్పుడు మాత్రము తిరిగివచ్చి మందలో కలిసిపోయేది. 


దూడ దానికెంతో సంతోషించెడిది. దినదినమూ ఆ యావుదూడలు కలసి వెడలెడివి. పుట్టలో పోయబడిన పాలను ఆవురావుమంటూ యాకలితోనున్న శ్రీమహావిష్ణువు త్రాగుచుండెను, 


ఈ విధముగా రోజూ జరుగుచుండెను. 


ఆ యావు పుట్టలో క్షీరధారలు తన పొదుగు నుండి అదుపులేకుండగా పోయుచునేయుండెను. కాని అందువలన చోళరాజుగారి బిడ్డకు పాలు కఱువగుచుండెను. 


ఇంటిలో పాలిచ్చిన గదా బిడ్డపోషణ. పాలు లభించని సంగతిని గ్రహించి చోళరాజు భార్య కోపాలు పెంచుకొని గోపాలుని పిలిపించింది.


 కమలదళాక్ష గోవిందా, కామిత ఫలదా గోవిందా; పాపవినాశక గోవిందా, పాహిమురారే గోవిందా; | 


 గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.||11|| 


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.🙏*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 4*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 4*


ఏడేళ్ళ వయసులో ఆంతరిక చైతన్యంలో లయించి పోవటం బహుజన్మల తపో ఫలం...


బాల్యంలోనే భక్తిబీజాలు నరేంద్రుడి హృదయంలో దృఢంగా నాటుకున్నాయి. శ్రీరాముడి దివ్య చరిత్ర  ఆకర్షించగా సీతారాముల విగ్రహాలను   ఒక చోట అమర్చి  ధ్యానించసాగాడు. చాలాసేపటి దాకా కనబడకపోవటంతో వెదుకనారంభించారు. అనేక చోట్ల వెదకిన తరువాత మేడమీద గది మూసి ఉండడం చూసి తలుపు గట్టిగా కొట్టిన జవాబు రాకపోయేసరికి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు.

నరేంద్రుడు నిశ్చలధ్యానమగ్నుడై కనిపించాడు. 


కాషాయాంబరాలు ధరించిన సాధువులు నరేంద్రుణ్ణి అమితంగా ఆకర్షించారు. చేతికి అందిన వస్తువులన్నీ వారికి ఇచ్చేసేవాడు.


ఎవరో వివాహం అనర్థాహేతువని నిరసిస్తూ సంసారయాతనలు దుర్భరాలని అనటం నరేంద్రుడు విని భయకంపితుడైనాడు. "వివాహమే యిన్ని బాధలకూ మూలమైతే, దేవుడెందుకు వివాహమాడాలి?" అని వితర్కించుకొని, సీతారాముల విగ్రహాలను ఆవలవేసి ఆ చోట శివుణ్ణి ప్రతిష్ఠించాడు.


సీతారాముల విగ్రహాన్ని విసిరివేసినప్పటికీ రామాయణం పట్లా, సీతా రాముల ఆదర్శాలపట్లా, ఆంజనేయస్వామి పట్ల ఉన్న గాఢాభిమానం మాత్రం చెక్కుచెదరలేదు.


దేవుళ్లందరిలో నరేంద్రునికి బాగా నచ్చిన దేవుడు పరమశివుడు. సర్వసంగ పరిత్యాగం చేసి మూర్తీభవించిన త్యాగమూర్తిగా ఆయన కొలువుదీరి ఉండడం అతడి మనస్సును అమితంగా ఆకట్టుకొంది. కొన్ని సమయాల్లో అతడు కూడా బట్టలన్నీ విప్పేసి కౌపీనధారియై తిరిగే వాడు. ఈ చర్య భువనేశ్వరి మనస్సులో తెలియరాని ఏదో దిగులు పుట్టించేది. 'ఇతడు కూడా తాత మాదిరే సన్న్యాసం పుచ్చుకొంటాడేమో!' అని ఆందోళనపడేది. 


"నరేన్, ఏమిటిది? ఇదేం వేషం?" అని అడిగేది. "నేను శివుణ్ణయిపోయాను, చూడు, నేను శివుణ్ణయిపోయాను. నేనే శివుణ్ణి" అనేవాడు నరేన్. అతడు తెలిసి చెప్పాడో, తెలియక చెప్పాడో! కాని అత్యున్నత మానసిక స్థితిలో ఉచ్చరించే మంత్రమైన 'శివోహం'ను (నేనే శివుణ్ణి) పసితనంలోనే ఉచ్చరించాడు నరేంద్రుడు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

సంస్కృత భారతీ* *అష్టమ పాఠః* *8*

 *సంస్కృత భారతీ*      

   *అష్టమ పాఠః*

         *8*

*అవ్యయాని--తేషాం ప్రాముఖ్యం*

ఇవ = వలె, వత్ = వలె,  ఏవ = అదే, తు = కానీ, చ/అపి = మరియు, వా = లేదా, ఉచ్చైః = పైన,పైకి, నీచైః = క్రింద, క్రిందికి, తర్హి/ చేత్ = అయినచో, యర్హి = ఎలాఅయితే ,కిలా/ ఖలు = కదా, వై = కదా,అలం = చాలు,యది = ఒకవేళ!, యదా = ఎప్పుడైతే! తదా = అప్పుడు, యావత్ = ఎంతవరకు అయితే! తావత్ = అంతవరకు,పరం గొప్ప, పరం తు/కింతు = కానీ, వినా = లేకుండా !(ద్వితీయ లేదా తృతీయా విభక్తి పదం తర్వాత వినా..ప్రయోగించవలెను..ఉదాహరణ కు రామమ్ వినా లేదా రామేణ వినా) ఇత్యాదయః.

*సూచన*:-- లింగ,వచన,విభక్తులకు అతీతమైనది అవ్యయం. అవ్యయాలకు సంధి సూత్రములు మాత్రమే వర్తించును.

*ప్రయోగ విభాగః*

*౧* సః రామ ఇవ(రామః+ఇవ) అస్తి = అతను రాముని వలె ఉన్నాడు. 

*౨* సః రామ ఏవ (రామః+ ఏవ)= అతను రాముడే,

*౩* అజవత్ భోజనం ఆచరితవ్యం = మేకవలె భోజనం చేయవలెను.

*౪* అహమపి సంస్కృత అధ్యయనమేవ కరోమి , పరంతు కించిత్ న్యూనాతిరిక్త (న్యూనం = తక్కువ, అతిరిక్తం = ఎక్కువ; న్యూనాతిరిక్తం =  తక్కువ ఎక్కువ గా/ అటుఇటుగా/ ఎంతో కొంత) సంస్కృత జ్ఞానం తు అస్తి మహ్యం = నేను కూడా సంస్కృత అధ్యయనమే చేయుచున్నాను. కానీ కొంత ఎంతో కొంత సంస్కృత జ్ఞానం నాకు ఉన్నది.

*౫* యది సంస్కృత భాషాధ్యయనమిచ్ఛన్తి చేత్ అస్మిన్ సమూహేస్థిత సమస్త సందేశపఠనపాఠనం కరోతి చేత్ అలం భవతి =  ఒకవేళ సంస్కృత భాషాధ్యనం కోరుకుంటే ఈ సమూహం లో ఉండే అన్ని రకాల సందేశాలను చదువుట సరిపోతుంది.

*౬* యావత్ ధర్మః సాధ్యం భవతి తావత్ అనుసరణీయం = ఎంతవరకైతే  సాధ్యమవుతుందో అంతవరకూ అనుసరించవలెను.

*౭* అహం గోసేవాఖ్యం కర్మ కరోమి ఖలు(కిలా) = నేను గోసేవ అనే(ఆఖ్యం) పని చేయుచున్నాను కదా!

*౮* సంధ్యావందనం వినా కిమపి కర్మా న ఫలతి.= సంధ్యావందనం చేయకుండా (లేకుండా) ఏ కర్మ అయిననూ ఫలించదు.

**** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

All Radio Stations


అద్భుతం...క్రింద ఇచ్చిన ISRO OCLC లింక్‌పై క్లిక్ చేయండి.....అప్పుడు మీకు ఆకుపచ్చ చుక్కలు కనిపిస్తాయి.. అవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న FM రేడియో స్టేషన్లు...

మీరు ఏదైనా చుక్క పై క్లిక్ చేసినప్పుడు FM రేడియో కనెక్ట్ అయి, ఆ ప్రాంతాల అన్ని విషయాలు విని ఆనందించవచ్చు..

*వినడానికి ఇయర్‌ ఫోన్ అవసరం లేదు* 

*సింప్లీ అమేజింగ్ & ఇది మన ఇస్రో ఘనత*




All radio stations  

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 



                             శ్లోకం:40/150 


ఉన్మాదో మదనః కామోః  

అశ్వత్థోఽర్థకరోయశః I  

వామదేవశ్చ వామశ్చ 

ప్రాగ్దక్షిణ ఉదఙ్ముఖః ॥ 40 ॥ 


* ఉన్మాదః = పిచ్చివానివలె ఉండువాడు, 

* మదనః = మన్మధ రూపుడు, 

* కామః = కోరిక రూపము తానే అయినవాడు, 

* అశ్వత్థః = రావి చెట్టు రూపంలో ఉండువాడు, 

* అర్థకరః = ప్రయోజనము సమకూర్చువాడు; 

               సమస్త వస్తువులను సమకూర్చువాడు, 

* యశః = కీర్తి రూపము తానే అయినవాడు, 

* వామదేవః = ఎడమ భాగమందు స్త్రీ రూపము గలవాడు (అర్ధనారీశ్వరుడు), 

* వామః = శ్రేష్ఠుడు, 

* ప్రాక్ దక్షిణ ఉదఙ్ముఖః = తూర్పు, దక్షిణ, ఉత్తర ముఖములు కలవాడు.


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

కవులపాట్లు

 జంట(కవుల)కోసం నాటి కవులపాట్లు!



*మనసువిప్పి కాస్సేపు…37


మన సాహితీలోకం చాలా విస్తృతమైంది.

వింతలు,విశేషాలకు లోటేలేదు.ముఖ్యం

గా మన కవులకు సంబంధించిన విషయా

లు ఎన్నోవున్నా వాటిలో రికార్డుకెక్కినవి ..

చాలా తక్కువ.మరుగున పడిన విషయా

లే ఎక్కువ..


మీకు తెలియందేమీ కాదుకానీ, మామూలు 

మనుషుల్లో మాదిరే కవుల్లోకూడా ఈర్ష్యా 

ద్వేషాలు,కుల,మతాల అంతరాలు,ప్రాంతీ

య విభేదాలు..తక్కువేం కాదు….పేరుకు

కవులైనా కూడా వాళ్ళూ మనుషులేగా.!

అదలా వుంచితే…సాహితీలోకంలో వెలుగు

లోకి రాకుండా, మరుగునపడిన కొన్ని ఆసక్తి

కరమైన విషయాలు,ను ఇలా…మనసు

విప్పి మీతో పంచుకుంటున్నాను.!!


*విశ్వనాథ..పింగళి..!!


విశ్వనాథ సత్యనారాయణ,పింగళి లక్ష్మీ….

కాంతం ఇరువురూ సహధ్యాయులు.మంచి

మిత్రులు..ఒకరంటే ఇంకొకరికి అభిమానమే.

అయితే ఎందుకోగానీ ఇద్దరి మధ్య కొంత ….

అంతరం వుండేది..


ఆరోజుల్లో జంట కవిత్వం రాయడం  ప్యాషన్

గా వుండేది..ఓరోజు విశ్వనాథవారు పింగళి లక్ష్మీకాంతం దగ్గరకెళ్ళి మనిద్దరం జంట కవి

త్వం చెబుదామన్నారట..పింగళిగారికెందుకో ఈ ప్రతిపాదన నచ్చలేదు.విశ్వనాథకు మాది

రిగానే ఆయన కూడా జగమెరిగినకవి,పండి

తుడు,విమర్శకుడు (సాహిత్య శిల్ప సమీక్ష) కూడా..జంటకవిత్వం రాద్దామన్న విశ్వనాథ

వారితో "  ఏ భాషలో అన్నారట పింగళివారు

ఎత్తిపొడుపుగా ..దానికి" తెలుగు,సంస్కృతం

లో అన్నారట విశ్వనాథ..దానికి పింగళివారు

వ్యంగ్యంగా ఓ నవ్వునవ్వారట.పింగళి వైఖరి 

విశ్వనాథవారికి తీవ్ర మనస్తాపం కలిగించింది.

ఇంతకూ పింగళివారి తిరస్కారానికి కారణం..

వైదికి..నియోగుల మధ్య గొడవే అయి వుండొ

చ్చుంటారు సాంధ్యశ్రీ.


పింగళితో జంటకవిత్వ ప్రతిపాదనకు ఫుల్

స్టాప్ పెట్టి  విశ్వనాథవారు కొడాలి ఆంజనే

యులు  గారితో కలిసి "సత్యాంజనేయులు"

పేరుతో జంట కవిత్వం రాశారు.అయితే..

ఈ జంటకవిత్వం కొన్నిరోజులు మాత్రమే

కొనసాగింది..రాసింది కూడా చాలా తక్కు

వే.అలాగే రాసిన ఆ కాస్తా,కూడా ప్రస్తుతం అలభ్యం.!


విశ్వనాథ సత్యనారాయణ,పింగళి  లక్ష్మీ కాంతం,కాటూరి,కొడాలి వేంకట సుబ్బా రావు,కొడాలి  ఆంజనేయులువేలూరి శివ

రామశాస్త్రి,గుర్రంజాషువా తదితర దిగ్గజ

కవులంతా తిరుపతి వేంకట కవుల శిష్య

రికం చేసినవారే..ఒకరంటే మరొకరికి అభి

మానం వున్న వారే..అలాగే ఈర్ష్యాద్వేషాలు 

కూడాను…!!


"కొడాలి"  బహు గొప్ప కవి…!!


"హంపీ క్షేత్రం" కావ్యం  రాసిన కొడాలి వేంకట

సుబ్బారావు గారు, విశ్వనాథవారు మంచి ..

స్నేహితులు..ఎప్పుడూ.."మా సుబ్బారావు"

అంటూ ఆప్యాయంగా పిలిచేవారు..వేంకట

సుబ్బారావు గారు పిన్నవయసులోనే కాలం

చేశారు.అప్పుడు విశ్వనాథ వారు చాలా బాధ

పడ్డారు.."మా సుబ్బారావు బతికుంటే తెలు

గు కవిత్వానికి పట్టుబట్టలు కట్టి అలంకరించే

వాడు..'అంటూ కంటనీరు పెట్టుకున్నారట..!!

"శిలలు ద్రవించి యేడ్చినవి .."అంటూ హంపీ

క్షేత్రంలోని పద్యాన్ని విశ్వనాథవారు పలుమా

ర్లు గుర్తుచేసుకునేవారట.కొడాలి చనిపోయి

న  కొన్ని సంవత్సరాల తర్వాత విశ్వనాథ వారి చొరవతో హంపీక్షేత్రం ఖండకావ్యాన్ని 

అచ్చేయించడానికి శ్రద్ధ తీసుకున్నది విశ్వ

నాథ వారే కావడం విశేషం.స్నేహితు లెవరై

నా …విశ్వనాథవారి వైఖరి ఇలానే వుండే

దట..!!


కొడాలి సుబ్బారావు సుప్రసిద్ధుడైన కవి.

హైస్కూల్ హెడ్  మాస్టరుగా, అనంతరం కళాశాలలో ఆంధ్రోపన్యాసకునిగా పనిచే

శారు. తన మేనమామ కామరాజుగడ్డ శివయోగా..నందరావు, సుబ్బారావు కలిసి జంటగా కవిత్వం రాసారు."హంపీ క్షేత్రం "

ఖండ కావ్యం రచయితలుగా ...'కొడాలి

సుబ్బారావు ,గారితో పాటు శివయోగా 

పేరు కూడా  కనిపిస్తుంది..!!


*పింగళి..కాటూరి..!!


కాగా పింగళి లక్ష్మీకాంతం‌‌, కాటూరి వేంకటేశ్వ

రరావు కలిసి "పౌలస్త్య హృదయం" అనే…

కావ్యం రాశారు..ఇందులో 39 పద్యాలుమాత్ర

మే వున్నాయి..1944లో ఈ పుస్తకం మచిలీ 

పట్నం లో అచ్చేశారు..అప్పట్లో ఈ పుస్తకం

ఖరీదు పావలా వుండేది..


మచ్చుకు..ఇందులోని ఓ నాలుగు పద్యాలు..

చూద్దాం..!!


1*నురుగుల్ గ్రక్కుచు నూర్పుసందడులు

   మిన్నుల్ ముట్ట 


   ఒక్కుమ్మడిన్ పరుగుల్ ద్రొక్కుచు    

   శీర్ణకేశముల నుద్బాహుండవై 


   వచ్చు తత్తరమున్ గాంచి ఉత్తలం

   పడెడు చిత్తంబు


  ఈ భయోద్వేగమే వారిచే నీకొనగూడె 

  అర్ణవ పతివాక్రుచ్చవయ్యా వెసన్"!


2*భృకుటి మాత్రముచే మూడు భువన

   ములకు


‌  విలయము ఘటించు  జగదక వీరుల

  మట


  నీకు మద్బాహువింశతి నాకు నీదు…


 వీచికాకోటియట కోట వెరపు ఇకేల?"!!


3*నాకున్నీకు భయంబటన్ననుడి ఎన్నండైన   

   విన్నామా నే


  డీ కంపమ్మునకున్ కతమ్ము కనరాదే

  సుంతయున్ భాస్కరుం


  డేకాకారత వెల్గు వాయువును మున్నెట్ట

  ట్టులే వీచు లే


  దే కల్పాంత పయోద గద్య కనరాదె తార

  కల్ రాలుటల్ "!!


 4*చంద్రహాసము నా చేయిజారలేదొ  ఔర్వ

  శిఖియు నీ జఠరమందారలేదు

  సద్యకార్ముకుడై రామచంద్రమూర్తి

  సింగినీ టాంకృతియు నింత సేయలేదు"!!


ఈ పద్యాలంటే విశ్వనాథవారికి ఎంతో ఇష్టం..


(దశాబ్దాలు దాటినా ధారణతో ఈ పద్యాలను

 అలవోకగా వల్లెవేసిన 'సాంధ్యశ్రీ ' గారికి కృత

 జ్ఞతలు..ఈ సందర్భాలకు ఆయనే ప్రత్యక్ష

 సాక్షీ  భూతులు)


ఇలా వుంటే దేవులపల్లి కృష్ణ శాస్త్రి,జాషువా,

పింగళి లక్ష్మికాంతం,కాటూరి వెంకటేశ్వరరావు

వేదుల సత్యనారాయణ ను ప్రశంసిస్తూ…. విశ్వనాథ సత్యనారాయణ గారు ఓ పద్యం

రాశారు..‌ఈ పద్యం ప్రతీ పాదంలో ఓ కవిని గురించి ప్రస్తావించారు.‌."ఈ కవులు ఎంత మృదు  మధురంగా కవిత్వం చెబుతారు. నాకెందుకయ్యా పలుకులో ఇంత పెళుసు

తనం,కాఠిన్యం ఇచ్చావంటూ"...స్వ నింద 

కూడా  చేసుకున్నారు విశ్వనాథ..!!


ఆపద్యం ఇది…!!


"ఒక్క  క్రైస్తవకవి ఉదిత మాధుర్య రసో

త్కటంబగు శబ్దమూది  పలుకు…


ఒక బ్రాహ్మ మత కవి యుల్లోకమగు 

కూర్పుటదుకుతో కూటస్థుడైనవాడు 


అలగౌతమీ కోకిలాక్షయౌ కవి పంచమ 

స్వరంబున‌ మాట మాటనాడు


అరయ ఇద్దరదృష్టవంతులౌ కవులు 

చిక్కగా సన్నగా పాడగలరు గీతి…


నిన్నెవరు మెచ్చుకొందురీ నేలయందు

పలుకు పెళుసైనయట్టి నిర్భాగ్య కవిని

కలిత లౌకిక సాంసారిక ప్రగాఢ దుఃఖ

దూషిత వాంఛా విధూత మతిని "!!


        *విశ్వనాథ సత్యనారాయణ.!!


చూశారుగా తన సాటి కవులను ప్రశంసిస్తూనే

తనలా "పలుకు పెళుసైనయట్టి నిర్భాగ్య కవినిఎవరు మెచ్చుకుంటారంటూ" వాపో

యాడు..అంతేకాదు..' కలిత లౌకిక సాంసారిక ప్రగాఢ దుఃఖదూషిత వాంఛా విధూతమతిని"

అంటూ తనను తాను  తక్కువచేసిచెప్పు

కున్నారు.!!


*జంటకవిత్వానికి  

పేరు కుదరలేదు..!!


దీపాల పిచ్చయ్య శాస్త్రి, జాషువా గారు … కలిసి జంటగా కవిత్వం రాద్దామనుకున్నారు , అయితే వీరి జంటకు పేరు సరిగ్గా కుదరలేదు.

ఇద్దరి పేర్లను కలిపి ఎటుతిప్పినా 'పిచ్చిజాషు

వా 'అనీ,లేక  జాషువా పిచ్చి’ అని గానీ జంట పేరు పెట్టుకోవాల్సి వస్తున్నందున,ఈ జంట

కవిత్వ ప్రయత్నాన్ని వారు విరమించుకున్నా

రట. అలా.. ఆ 'జంట'కు పేరు అచ్చిరాలేదు.


*చిలకా..గోరింక కవులు..!!


1965లో ప్రతాప వెంకట కొండయ్య  శాస్త్రి

గారితో  కలిసి కవి దస్తగిరి "ప్రతాపగిరి కవు

ల." పేరిట జంటకవిత్వం రాశారు..అలా..

రచించిన పద్యకావ్యం పేరు‌  "వర్తమానం".!!


ఈ కృతి రచనలో విశేషమేమంటే..ఒక కవి హిందూ,మరొకరు ముస్లిం, హిందూ ముస్లిం కవుల సఖ్యతకు ఈ కావ్య రచన పరాకాష్ట.

కాగా,ఈ జంట కవుల్లో ఒకరైన దస్తగిరి గారు రాయల సీమ ప్రాంత కవి కాగా,  కొండయ్య

శాస్త్రి గారు ఆంధ్రా ప్రాంత కవి.ఈ రకంగా… ప్రాంతీయ సరిహద్దుల్ని కూడా చెరిపేసింది 

ఈ 'వర్తమానం' కావ్యకవుల జంట..


ఈ జంట కవుల కలయికను చిలకా,గోరింక కలయికగా అభివర్ణించారు.కాండూరి నర

సింహా చార్యులు గారు.!!


*ఎ.రజాహుస్సేన్.!!

"ఒక పుష్పంబు

 శుభోదయం🙏


"ఒక పుష్పంబు భవత్పదద్వయముపై

 నొప్పంగ సద్భక్తి రం

 జకుడైపెట్టిన,పుణ్యమూర్తికి పునర్జన్మంబులేదన్న, బా

యక కాలత్రితయోపచారముల నిన్నర్చించుచున్ పెద్ద  నై

 ష్ఠికుడై యుండెడువాడు,నీవగుట తా

 చిత్రంబె? సర్వేశ్వరా!


సర్వేశ్వర శతకం-చిమ్మపూడి అమరేశ్వరుడు.


భావం: ఓసర్వేశ్వరా!నీపాదాలపై భక్తితో ఒకపువ్వుంచి

ప్రార్ధించినవాడికి పునర్జన్మమేలేదని పురాణాలుప్రవచిస్తున్నాయ్.అలాంటిది ముక్కాలములయందూ మూడుసంధ్యలా ,మహానిష్ఠతో నిన్నర్చించేవాడు నీలోసమైక్యమైతే యిక నాశ్చర్యపడవలసినదేమున్నది?అనిభావం.


          ఈశ్వరార్చనకు ఫలితం జన్మరాహిత్యమేనని,ఈశ్వరసాయుజ్యమేనని చెప్పే యీపద్యం.కాకతిరాజులకు

సమకాలికుడైన చిమ్మపూడి రచించుట విశేషం.🙏🙏