7, ఆగస్టు 2023, సోమవారం

సంస్కృత భారతీ* *అష్టమ పాఠః* *8*

 *సంస్కృత భారతీ*      

   *అష్టమ పాఠః*

         *8*

*అవ్యయాని--తేషాం ప్రాముఖ్యం*

ఇవ = వలె, వత్ = వలె,  ఏవ = అదే, తు = కానీ, చ/అపి = మరియు, వా = లేదా, ఉచ్చైః = పైన,పైకి, నీచైః = క్రింద, క్రిందికి, తర్హి/ చేత్ = అయినచో, యర్హి = ఎలాఅయితే ,కిలా/ ఖలు = కదా, వై = కదా,అలం = చాలు,యది = ఒకవేళ!, యదా = ఎప్పుడైతే! తదా = అప్పుడు, యావత్ = ఎంతవరకు అయితే! తావత్ = అంతవరకు,పరం గొప్ప, పరం తు/కింతు = కానీ, వినా = లేకుండా !(ద్వితీయ లేదా తృతీయా విభక్తి పదం తర్వాత వినా..ప్రయోగించవలెను..ఉదాహరణ కు రామమ్ వినా లేదా రామేణ వినా) ఇత్యాదయః.

*సూచన*:-- లింగ,వచన,విభక్తులకు అతీతమైనది అవ్యయం. అవ్యయాలకు సంధి సూత్రములు మాత్రమే వర్తించును.

*ప్రయోగ విభాగః*

*౧* సః రామ ఇవ(రామః+ఇవ) అస్తి = అతను రాముని వలె ఉన్నాడు. 

*౨* సః రామ ఏవ (రామః+ ఏవ)= అతను రాముడే,

*౩* అజవత్ భోజనం ఆచరితవ్యం = మేకవలె భోజనం చేయవలెను.

*౪* అహమపి సంస్కృత అధ్యయనమేవ కరోమి , పరంతు కించిత్ న్యూనాతిరిక్త (న్యూనం = తక్కువ, అతిరిక్తం = ఎక్కువ; న్యూనాతిరిక్తం =  తక్కువ ఎక్కువ గా/ అటుఇటుగా/ ఎంతో కొంత) సంస్కృత జ్ఞానం తు అస్తి మహ్యం = నేను కూడా సంస్కృత అధ్యయనమే చేయుచున్నాను. కానీ కొంత ఎంతో కొంత సంస్కృత జ్ఞానం నాకు ఉన్నది.

*౫* యది సంస్కృత భాషాధ్యయనమిచ్ఛన్తి చేత్ అస్మిన్ సమూహేస్థిత సమస్త సందేశపఠనపాఠనం కరోతి చేత్ అలం భవతి =  ఒకవేళ సంస్కృత భాషాధ్యనం కోరుకుంటే ఈ సమూహం లో ఉండే అన్ని రకాల సందేశాలను చదువుట సరిపోతుంది.

*౬* యావత్ ధర్మః సాధ్యం భవతి తావత్ అనుసరణీయం = ఎంతవరకైతే  సాధ్యమవుతుందో అంతవరకూ అనుసరించవలెను.

*౭* అహం గోసేవాఖ్యం కర్మ కరోమి ఖలు(కిలా) = నేను గోసేవ అనే(ఆఖ్యం) పని చేయుచున్నాను కదా!

*౮* సంధ్యావందనం వినా కిమపి కర్మా న ఫలతి.= సంధ్యావందనం చేయకుండా (లేకుండా) ఏ కర్మ అయిననూ ఫలించదు.

**** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*

కామెంట్‌లు లేవు: