గద్దర్..!
ఓ పువ్వు రాలిపోయే
ఓ కొమ్మ రాలిపోయే
ఓ చెట్టు రాలిపోయే
ఎర్రని సింధూరమా...
అడవి తల్లడిల్లి
పల్లె ఏడిసినాది
ఊరు గొల్లుమంటూ
జనం కన్నీరాయే..
డప్పు మూగ బోయే
పాట ఆగి పోయే
ఆట లేక పోయే
మాట రాక పోయే..
స్వరం లేకపోయే
గజ్జె గొల్లుమనే
చేతి కర్ర జారే
ఎర్ర పువ్వు బాసే.
ఏడున్నావు లచ్చుమమ్మా కొడుకా!
నేల వదిలి పోయినావురా..
తుపాకీ తూట వంటిలోన
నేల కోయిల స్వరమేమో
పదునెక్కిన గానమై
ఊరూరా పాడుతుంటే...
నా ఊరు నా వాడ
ప్రతి ఊరు చివరన
మొదలయ్యే పోరాటం
చెట్టు చేమ చేసే యుద్ధం...
నీ పాట పిలిచేను
నీ ఆట కదిలించేను
యుద్దనౌక నడిచేను
విప్లవ శంఖం వినిపించే.
జాతికొక వైరము
మనిషికొక ద్వేషము
మనిషిని మనిషిగా
చూసే గడియ వరకు
ఆగదీ పాట పోరాటం.
జనం గుండె చప్పుడై
త్యాగాల గుర్తువై
తిరగబడ్డ ప్రాణమై
గానమే గళమై
కష్టంలో ధైర్యమై
వెన్నంటి ఉంటావు...
చిరకాలం నీవు గద్దర్..
ఎర్రని సూరీడా
నీకు వందనం
పొద్దువాలిన సూరీడా
నీకు వందనం.
🙏🙏🙏🙏🙏
అశోక్ చక్రవర్తి. నీలకంఠం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి