7, ఆగస్టు 2023, సోమవారం

వాస్తవం




 నానా చెత్తను చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కించి, వాస్తవం ఘటనలు చరిత్రలో లేకుండా ఎంతో జాగ్రత్త పడ్డ విషయం ఉప్పు పన్ను గోడ .........


1850నాటికి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మన దేశాన్ని పూర్తిగా ఆక్రమించుకొని మంచి పట్టు సాధించారు, వాళ్ళు చేసిన మొట్టమొదటి పని ప్రజలకు అత్యవసరమైన #ఉప్పు మీద  పన్ను 1000% పెంచడం.


ఇలాంటి అసహజ/ అన్యాయమైన పన్ను ఎగ్గొట్టాడానికి స్థానిక వ్యాపారులు గుజరాత్, ఒరిస్సా  తీరప్రాంతాల్లో ఉప్పు తయారు చేసి (గట్లు కట్టి సముద్రపు నీరు అందులోకి తరలిస్తే ఉచితంగా ఉప్పు తయారైయేది) గంగా నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ రవాణా చెయ్యడం ప్రారంభించారు. తద్వారా బ్రిటిష్ వాళ్ళు విధించిన సుంకం ఎగ్గొట్టేవారు. ఈ అక్రమ రవాణా వ్యవహారం తెలుసుకున్న బ్రిటిష్ వాళ్ళు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు

 , స్థానికులకు బుద్ధి చెప్పడానికి , తాము విధించిన అన్యాయమైన సుంకం రాబట్టుకోవడానికి బ్రిటిష్ వాళ్ళు 4000 వేల కిలోమీటర్ల మేర (పంజాబ్ నుంచి ఒరిస్సా వరకు) ఒక కంచె ఏర్పాటు చేయాలని నిర్ణయించుకొని 

ఇరవై అడుగుల ఎత్తు , పదిహేను అడుగుల వెడల్పు కంచె ఏర్పాటు చేసారు. 

కంచె ఎలాంటిది అంటే పెద్దపెద్ద చెట్లు, ముళ్ళ చెట్లతో ఎద్దుల బళ్ళు సంగతి పక్కన పెడితే మనుషులు కూడా దూరడానికి లేకుండా వుండేటట్టు కంచె, దాని పక్కనే కందకం కూడా తవ్వారు. ఈ కంచె నిర్మించిన ప్రాంతం దగ్గర ఇరవైనాలుగు గంటలు పదిహేను వేల మంది సైనికులు , అధికారులు గస్తీ తిరిగేవారు.


ఎవరైనా స్థానిక వ్యాపారస్తులు చెట్లు నరికి, కందకం పూడ్చి , తెగించి ఉప్పు అక్రమంగా రవాణా చేస్తే పట్టుకుని , నిర్బంధించి అధిక మొత్తంలో వారినుంచి జరిమానా వసూలు చెసేవారు


1900 ప్రాంతానికి ఉప్పు తయారీ, రవాణా , అమ్మకం మీద పూర్తి పట్టు బిగించారు బ్రిటిష్ వాళ్ళు. నెమ్మది నెమ్మదిగా కంచె నిర్వహణ పట్టించుకోవడం మానేశారు. కాలక్రమంలో రైతులు ఆ కంచెను తమ భూముల్లో కలుపుకుని వ్యవసాయం చేసుకోసాగారు. స్వాతంత్రం తరువాత మన ప్రభుత్వం కంచె వుండే ప్రాంతాల్లో రోడ్లు, కొన్ని ప్రాంతాల్లో రైల్వే లైన్లు నిర్మించింది. అలా ప్రసిద్ధి చెందిన భారతదేశపు 4000 కిలోమీటర్ల కంచె కాలగర్భంలో కలిసి పోయింది. ఇప్పుడు మచ్చుకు కూడా ఆ కంచె ఆనవాళ్లు మిగలలేదు. 

ఈ కంచె గురించి భారతదేశపు రికార్డ్స్ లో అతి తక్కువుగా రాయబడింది.ఇదెప్పుడో నూట పాతికేళ్ల ముందు జరిగిన విషయం.


ఇప్పుడు అసలు విషయం తెలుసుకుందాం. మీరు ఊహించగలరా ఏ బ్రిటిష్ ఆఫీసర్ ఉత్తర దక్షిణ ప్రాంతాలను వీడదీసి, నాలుగువేల కిలోమీటర్ల మేరే కంచె కట్టాలి అని ఐడియా ఇచ్చాడో?


ఇంకెవరో కాదు,

కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు 

A.O.Hume.


సుబ్రహ్మణ్యం వల్లూరి.

కామెంట్‌లు లేవు: