7, ఆగస్టు 2023, సోమవారం

ఎవరు వృద్ధులు

 *



ఏది ముసలితనం? ఎవరు వృద్ధులు.?* 🥰  *వార్ధక్యం వయసా నాస్తి* *మనసా నైవ తద్భవేత్‌* *సంతతోద్యమ శీలస్య* *నాస్తి వార్ధక్య పీడనమ్‌* ముసలితనం వయసులో లేదు, వయస్సుతో రాదు. మనస్సులోనూ ఉండకూడదు. ఎప్పుడూ పని చేసుకునేవానికి ముసలితనపు పీడ ఉండదని సుభాషితం. ముసలితనం రెండు రకాలుగా వస్తుంది. వయోభారంతో వచ్చేది శారీరకం, దుఃఖం వల్ల వచ్చేది భావజం. వయోభారం వల్ల వచ్చేది కూడా ఆపాదింపబడిన ముసలితనమే.  *70 ఏళ్లు వచ్చినా చురుగ్గానే ఉండేవారు మరికొందరు. శరీర బలం తగ్గి, అవయవాలు పటుత్వం కోల్పోయి, నరాల కండరాల పట్టు సడలినా.. బుద్ధిబలంతో నిత్యం విజయాలను సాధించేవారు ఉన్నారు.* _కొందరికి సోమరితనం వల్ల వృద్ధాప్యం వస్తుంది_ *మానసిక వృద్ధాప్యం అంటే.. ‘నాకు ముసలితనం వచ్చేసింది’ అనే భావన. అలాంటి వృద్ధాప్యాన్ని రానీయకూడదు.* ‘సంతతోద్యమ శీలస్య నాస్తి వార్ధక పీడనం’ అన్న మాటలను గుర్తుపెట్టుకుని ఏదో ఒక పని పెట్టుకోవాలి *భారతీయ సంప్రదాయంలో జ్ఞానవార్దక్యాన్ని అంగీకరించారుగానీ వయో వార్ధక్యాన్ని కాదు.* నిత్యవ్యాయామం,యోగాభ్యాసం, సద్గ్రంథ పఠనం,సతతక్రియాశీలత, మితాహారం, హితాహారం, ఇష్టదేవతా ఉపాసనం,మంచిమాటలు ఇవి ఉన్న చోట ముసలితనం ఉండదు. 🙏

కామెంట్‌లు లేవు: