7, ఆగస్టు 2023, సోమవారం

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 



                             శ్లోకం:40/150 


ఉన్మాదో మదనః కామోః  

అశ్వత్థోఽర్థకరోయశః I  

వామదేవశ్చ వామశ్చ 

ప్రాగ్దక్షిణ ఉదఙ్ముఖః ॥ 40 ॥ 


* ఉన్మాదః = పిచ్చివానివలె ఉండువాడు, 

* మదనః = మన్మధ రూపుడు, 

* కామః = కోరిక రూపము తానే అయినవాడు, 

* అశ్వత్థః = రావి చెట్టు రూపంలో ఉండువాడు, 

* అర్థకరః = ప్రయోజనము సమకూర్చువాడు; 

               సమస్త వస్తువులను సమకూర్చువాడు, 

* యశః = కీర్తి రూపము తానే అయినవాడు, 

* వామదేవః = ఎడమ భాగమందు స్త్రీ రూపము గలవాడు (అర్ధనారీశ్వరుడు), 

* వామః = శ్రేష్ఠుడు, 

* ప్రాక్ దక్షిణ ఉదఙ్ముఖః = తూర్పు, దక్షిణ, ఉత్తర ముఖములు కలవాడు.


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

కామెంట్‌లు లేవు: